సినిమా భిక్షతింటూ వేడుకలకు హాజరుకారా?
వందేళ్ల సినిమా వేడుకలకు అందరిని ఆహ్వానించామని దక్షిణ భారత సిని వాణిజ్యమండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ తెలిపారు. సినిమా భిక్షతింటూ వేడుకలకు హాజరుకాకపోతే అది వారి అవివేకమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా ప్రకటించినట్టుగానే వేడుకలు జరుగుతాయని తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం హాజరవుతారని నమ్ముతున్నట్టు చెప్పారు. మీడియాలో వచ్చే ఊహాగానాలు నమ్మవద్దని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రజలు సీమాంధ్ర, తెలంగాణ అంటూ ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే మనం పండగ చేసుకోవడం తగదంటూ మోహన్‌బాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వేడుకలను వాయిదా వేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ దక్షిణ భారత పరిశ్రమ చెన్నైలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ 21న ప్రారంభమయ్యే ఈ వేడుకలు 24 వరకూ జరుగుతాయి.