Cesarean deliveries
-
సెకండ్ టైమ్ కూడా సిజేరియన్ అయితే.. ఏదైనా సమస్యా..!?
ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. సెకండ్ టైమ్. తొలికాన్పు సిజేరియన్. అయితే కుట్లు సరిగా మానలేదు. ఇప్పుడూ సిజేరియన్ అయితే అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. కుట్లు త్వరగా మానేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. ప్రణిత, శ్రీరాంపూర్సిజేరియన్లో కరిగిపోయే కుట్లు వేస్తారు. లేదంటే ఎన్సేషన్ గ్లూతో క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇవి మానడానికి ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. కానీ శరీరతత్వాన్ని బట్టి మనిషికి మనిషికి తేడా ఉంటుంది. బరువు ఎక్కువున్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో కుట్లు మానడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. సాధారణంగా .. స్కిన్ వూండ్ని క్లోజ్‌చేసి డ్రెస్సింగ్ చేస్తారు. ఈ డ్రెస్సింగ్ వల్ల గాయం నుంచి ఏదైనా లీకేజ్ వచ్చినా.. అబ్సార్బ్ అయిపోతుంది.గాయం మానడానికి కావల్సిన కండిషన్‌ను క్రియేట్ చేస్తుంది. గాయానికి మనం వేసుకున్న దుస్తులు తగలకుండా చేస్తుంది. అయితే కుట్లు సరిగా మానకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే కుట్ల దగ్గర క్రిములు పెరిగి.. చీము పడుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ అయితే కుట్లలో పెయిన్ వస్తుంది. ఎర్రగా మారి వాపూ ఉంటుంది. నీరు, బ్లడ్ వంటి ద్రవాలు లీక్ అవుతుంటాయి. దుర్వాసన వేస్తుంది. హై టెంపరేచర్‌తో జ్వరం వస్తుంది.ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళితే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆసుపత్రిలో చేసిన డ్రెస్సింగ్ డ్రైగానే ఉంటే మూడు రోజుల తర్వాత ఆ డ్రెస్సింగ్‌ని తీసేసి.. ఇంట్లోనే మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రెసింగ్ తడిగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో డ్రెసింగ్ చేసుకునే ముందు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని .. తడి లేకుండా తుడుచుకోవాలి.గ్లోవ్ హ్యాండ్‌తోనే డ్రెస్సింగ్‌ని తీసేసి.. మళ్లీ ఫ్రెష్‌గా డ్రెసింగ్ చేసుకోవాలి. కరిగిపోయే కుట్లయితే సాధారణంగా 7–10 రోజుల్లో కరిగిపోతాయి. విప్పే కుట్లయితే 14 రోజుల తర్వాత డాక్టర్ తీసేస్తారు. అప్పటి వరకు కుట్లకు మీరు వేసుకున్న దుస్తులు తగలకుండా కుట్ల దగ్గర కట్టు ఉండటం మంచిది. స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి. కుట్లు విప్పాకే పూర్తిగా షవర్ బాత్ చేయడం మంచిది. కుట్ల మీద స్ట్రాంగ్ సోప్‌ని వాడకూడదు. అలాగే జెల్స్, లోషన్స్ రాసుకోవద్దు.టాల్కం పౌడర్ కూడా వేయొద్దు. ఆపరేషన్ అయిన రెండు వారాలకు కుట్లు పూర్తిగా మానిపోతాయి. అప్పటి నుంచి నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి.. నడుము నొప్పి రాకుండా! ఒకవేళ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ చెక్ చేసి.. కుట్ల దగ్గర స్వాబ్ టెస్ట్ చేసి.. ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది.. దానికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలో చూసి.. ట్రీట్మెంట్ ఇస్తారు.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & అబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
Janhavi Nilekani: నార్మల్ డెలివరీలు ‘నార్మల్’ కావాలి
గర్భవతుల విషయంలో సాధారణ ప్రసవం అనే మాట ఈ రోజుల్లో ఆశ్చర్యంగా మారింది. దేశమంతటా సిజేరియన్ ప్రసవాలు పెరిగాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా తన నివేదికల్లో చూపింది. అయితే, ప్రభుత్వ– ప్రైవేట్ ఆసుపత్రులలో నార్మల్, సిజేరియన్ ప్రసవాల సంఖ్యలో తేడా మాత్రం ఉంది. ఈ విషయాన్ని తన సొంత అనుభవంతో గమనించిన ఫిలాంత్రపిస్ట్ డాక్టర్ జాన్హవి నిలేకని మెటర్నల్ హెల్త్‌కేర్ వైపు దృష్టి సారించింది. బెంగళూరులో మురికివాడల్లోని నగర గర్భిణుల్లో సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఆస్ట్రికా మిడ్వైఫరీ పేరుతో ప్రసవాల సెంటర్‌నూ ప్రారంభించింది. సాధారణ ప్రసవం ఆవశ్యకతవైపు వేసిన ఆమె అడుగుల గురించి ఆమె మాటల్లోనే.. ‘‘చదువుకుంటున్నప్పుడే స్వదేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉండేవి. అమ్మ మరాఠీ, నాన్న కోంకణి. పుణేలో పుట్టి, బెంగుళూరులో పెరిగాను. గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లాను. నా భర్త యేల్ జార్ఖండ్‌కు చెందినవాడు. ఆ విధంగా నేను ఒకే ఒక ప్రాంతానికి చెందినదానిని అని చెప్పలేను. 2012లో పెళ్లయ్యింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కర్ణాటక లో రీసెర్చ్ చేస్తున్నాను. ఆ సమయంలో నార్మల్ డెలివరీ కోసం నగరాల్లోని చాలా ఆసుపత్రుల వారిని కలిశాను. కానీ, నార్మల్ డెలివరీకి వారెలాంటి హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసింది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో గర్భిణులకు సరైన సమయంలో మందులు, డాక్టర్లు, నర్సుల సేవ అందడం లేదనీ, దీనివల్ల తల్లీ బిడ్డలిద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆ సమయంలోనే తెలుసుకున్నాను. ప్రయివేటు ఆసుపత్రులు సిజేరియన్ ప్రసవాన్ని వ్యాపారంలా మార్చేశాయి. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం జమ్మూ, కాశ్మీర్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని 80 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. సి–సెక్షన్ ఆ మహిళకు, బిడ్డకు మంచిది కాదు. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నప్పటికీ సర్జరీ చేయడం తప్పు. కానీ, వైద్యులు సాధారణ ప్రసవానికి చాలా సమస్యలు చెప్పారు. ఆ విషయంలో నాకు ఎన్నో సందేహాలు తలెత్తాయి. చివరకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. దేశమంతటా.. మొదట వాయుకాలుష్యంపై పరిశోధనలు చేస్తూ వచ్చాను. కానీ, బిడ్డ పుట్టాక మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేయాలనుకున్నాను. 2019లో ఆస్ట్రికా ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీని ద్వారా భారతదేశం అంతటా ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, జీఎన్ఎమ్లకు శిక్షణ ఇచ్చాను. దీంతో వారు సురక్షితమైన ప్రసవం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. అనవసరమైన సిజేరియన్ ప్రసవాల నుంచి వారిని రక్షించగలుగుతున్నారు. ప్రసవ సమయంలో అగౌరవం ప్రతి గర్భిణి గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ పొందాలి. కానీ, ఒక గర్భిణికి నొప్పులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలోని లేబర్‌రూమ్‌లో సిబ్బంది ఆమె మీద చెడు మాటలతో విపరీతంగా అరుస్తారు. చెప్పుతో కొట్టడం కూడా చూశాను. ఇది నాకు చాలా పాపం అనిపించింది. ఇలా జరగకూడదు, దీన్ని ఆపాలి అనుకున్నాను. 2021 వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ వచ్చాను. అది కూడా సరిపోదని ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రుల్లో అడుగుపెట్టాను. ధనికులైనా, పేదవారైనా ప్రతి స్త్రీకీ మంచి చికిత్స పొందే హక్కు ఉంది. ఇది గుర్తించే, బెంగళూరులోనే ఒక పేరున్న ఆసుపత్రిలో నా ఏడు పడకల కేంద్రాన్ని ప్రారంభించాను. గర్భిణిని కూతురిలా చూసుకునే మంత్రసాని ఉండాలని నమ్ముతాను. విదేశాల నుంచి సర్టిఫైడ్ మంత్రసానులను, వైద్యులను ఈ సెంటర్లో నియమించాను. ఎందుకంటే, ఇక్కడ చేరడానికి డాక్టర్లు ఎవరూ రెడీగా లేరు. దీంతో బయటివారిని సంప్రదించాల్సి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఆరోగ్య కార్యకర్తలు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ పనిచేయడానికి నాకు చాలా టైమ్ పట్టింది. అంతేకాదు, హాస్పిటల్లో ప్లేస్ కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకంటే సి–సెక్షన్ లకే ప్రాధాన్యమిస్తుంటారు. ఇక నార్మల్ డెలివరీ అంటేనే మహిళలు, వారి కుటుంబసభ్యులు కూడా భయపడుతున్నారు. వారి దృష్టిలో సిజేరియన్ డెలివరీ సురక్షితమైంది. కౌన్సెలింగ్‌తో నార్మల్... నా సంస్థ కర్ణాటక వాణివిలాస్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఓ రోజు హాస్పిటల్ బోర్డ్ మెంబర్ డ్రైవర్ భార్య మా సెంటర్‌కి వచ్చింది. ఆమె నార్మల్ డెలివరీకి భయపడింది. మా మంత్రసాని ఆమె మనసులోని భయాన్ని కౌన్సెలింగ్ ద్వారా తొలగించింది. ఫలితంగా ఆమెకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన సాధారణ ప్రసవం జరిగింది. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. అంటే, వారికి మానసిక, శారీరక బలాన్ని అందిస్తాం. వారికి సహాయం చేయడానికి మా బృందం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండేళ్లలో 200 మంది గర్భవతులలో కేవలం ఇద్దరికి మాత్రమే సిజేరియన్ అవసరం పడింది. అది కూడా వారికి ప్రసవంలో సమస్య ఉండటం వల్ల. మిగతా అందరికీ సాధారణ ప్రసవాలు జరిగాయి. ఆస్ట్రికా మిడ్వైఫరీ సెంటర్లో ముప్పైమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచంలో ఉన్న నర్సులు, మంత్రసానుల కోసం ఆస్ట్రికా స్పియర్ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా సిబ్బంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది సర్టిఫికెట్లు పొందారు. యూరప్ నుంచి కూడా అధ్యాపకులు ఉన్నారు. మా మెటర్నిటీ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి కోర్సులను కూడా అందిస్తుంది. ప్రసూతి మరణాలకు ప్రధాన కారణాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అని వివరిస్తారు జాన్హవి. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. – డాక్టర్ జాహ్నవి నిలేకని -
అమ్మకు మానని గాయం!
బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వం పొందడం మహిళ అదృష్టంగా భావిస్తోంది. ప్రసవం ఆమెకు పునర్జన్మతో సమానం. ఒకప్పుడు అత్యధిక ప్రసవాలు సాధారణ పద్ధతిలోనే జరిగేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పలు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి సిజేరియన్లను మార్గంగా చూడటం.. తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలని కొందరు కుటుంబీకులు ఆపరేషన్లకు సరే అనడం.. మరి కొందరు శుభఘడియలు అంటూ కడుపు కోతకు ఒత్తిడి తేవడం.. ఇలా కారణాలు ఏవైనా అమ్మ కడుపుపై మానని గాయం ఏర్పడుతోంది. సిజేరియన్లతో భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నా పరిస్థితి మారడం లేదు. సాక్షి, నంద్యాల: దనార్జనే లక్ష్యంగా పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణులకు ఇష్టానుసారంగా సిజేరియన్లు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవాలకు అవకాశం ఇవ్వకుండా సిజేరియన్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం వంటి అత్యవసర సమయాల్లో చేయాల్సిన ఆపరేషన్లను కాసుల కోసం అమ్మకు కడుపు కోత పెడుతున్నారు. సిజేరియన్లతో ప్రసవాలు జరగడంతో చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గర్భం దాలిస్తే సిజేరియన్ తప్పనిసరి అన్నట్లు పరిస్థితి మార్చేశారు. గర్భం దాల్చిన రెండో నెల నుంచే అవసరం లేకపోయినా స్కానింగ్‌లు, టెస్టులు, మందులు, టానిక్‌ల పేరుతో రూ.వేలకు వేలు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 79 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వీటిలో శస్త్రచికిత్సలు చేసే హాస్పిటళ్లు సుమారు 35 వరకు ఉన్నాయి. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ (సీహె చ్‌సీ)లు 11, డోన్, బనగానపల్లెలో ఏరియా ఆస్పత్రి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు సుమారు 2 వేలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా ప్రసవాల్లో సిజేరియన్లు గరిష్టంగా 15 శాతం మించకూడదు. కాన్పు కష్టమైన సమయాల్లో, తల్లీబిడ్డల్లో ఎవరికై నా ప్రాణహాని ఉండే సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలి. రక్తహీనత, అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉన్నప్పుడే ఆపరేషన్‌కు మొగ్గు చూపాలి. అయితే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, కొందరు కుటుంబీకులు మూఢనమ్మకాలు వెరిసి సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 50 శాతానికి పైగా కడుపు కోత ఉంటున్నాయి. విస్తుగొల్పుతున్న గణాంకాలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 10,086 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,034, ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో దాదాపు 45 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. ఇందులోనూ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు జరిగితే వీటిలో 50 శాతం అంటే 3 వేలకు పైగా ప్రసవాలు సిజేరియన్ ద్వారా చేయడం విస్తుపోయే వాస్తవం. గర్భం దాల్చినప్పుటి నుంచి సాధారణ ప్రసవం కావాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే సరికే ఏదో కారణంతో భయపెట్టి సిజేరియన్ చేయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు వేలల్లో ఖర్చు..! సాధారణ ప్రసవం జరిగితే ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 వేలకు మించి బిల్లు కాదు. అదే సిజేరియన్ అయితే పేషంట్ పరిస్థితిని బట్టి, ఆస్పత్రిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు. సిజేరియన్‌కు కనిష్టంగా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ. 80 వేల వరకు కూడా బిల్లులు వేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని ఐదు ప్రముఖ ఆస్పత్రుల్లో, ఆళ్లగడ్డలోని రెండు ఆస్పత్రుల్లో సిజేరియన్లు యథేచ్ఛగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రులోని వైద్య సిబ్బంది సాధారణ ప్రసవాలు చేసేందుకు చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో అవగాహన ఉన్న పలువురు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్యాపిలి, పాములపాడు, చాగలమర్రి, అహోబిలం.. తదితర మండలాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయి. ముహూర్తాలు చూసుకుని మరీ.. ఇటీవల కాలంలో ముహూర్తం, శుభ ఘడియలు చూసుకుని మరీ ప్రసవాలు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారంతా ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఫలానా రోజు, తేదీ, గంటలు, నిమిషాలను కూడా పాటిస్తూ పిల్లల్ని కనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొందరైతే బిడ్డ ఎన్ని సెకండ్లకు బయటకు రావాలో కూడా నిర్ణయించేస్తున్నారు. మరికొందరు గర్భిణులు పురిటి నొప్పులు భరించలేక సిజేరియన్ల వైపు వెళ్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వివరాలు నెల ప్రభుత్వ ప్రైవేటు ఏప్రిల్ 762 1,121 మే 814 1,051 జూన్ 800 1,064 జులై 798 1,057 ఆగస్ట్ 860 1,108 సెప్టెంబర్ 716 651 (21 తేదీ వరకు) పరీక్షలు చేయించుకోవాలి గర్భందాల్చినప్పటి నుంచి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ప్రతి నెల బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. సాధారణ ప్రసవమైతే రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. సిజేరియన్ అయితే కనీసం మూడు నెలల విశ్రాంతి అవసరం. జీవనశైలిలో వచ్చే మార్పుల వల్లే ఆపరేషన్లు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ అనూష గింజుపల్లి, గైనకాలజిస్ట్ అవగాహన కల్పిస్తున్నాం సిజేరియన్ల శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చేస్తున్నాం. కేవలం హై రిస్క్ ఉన్న వారిని మాత్రమే సిజేరియన్లకు రెఫర్ చేస్తున్నారు. బిడ్డ పుట్టిన సమయమే శుభ ఘడియలు. ప్రత్యేక తేదీలు, ప్రముఖల జన్మదిన రోజులు అంటూ డాక్టర్లపై ఒత్తిడి చేయకూడదు. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి (చదవండి: గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..) -
సహజ ప్రసవాలకు ‘సీ–సేఫ్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సహజ ప్రసవాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇదే క్రమంలో ‘సీ–సేఫ్’ అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. అయితే, రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 45 శాతం సిజేరియన్లు ఉంటున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా, ప్రభుత్వాస్పత్రుల్లో 32 శాతం మేర ఈ తరహా కాన్పులు ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో కోత కాన్పుల నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కాగా, సీ–సేఫ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ పూర్తి సహజ ప్రసవాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ (ఎన్‌పీఎం)’ కోర్సును గత ఏడాది ప్రారంభించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా గుంటూరు, తిరుపతిలలో 18 నెలల శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు అందించాల్సిన సేవలు, హైరిస్క్ లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి పలు రకాల అంశాలపై నర్సులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డ్‌లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సరి్టఫికెట్లు జారీ చేస్తున్నారు. త్వరలో వీరిని రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. అనవసర కోతల నియంత్రణ యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, యునిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వైద్య శాఖ సీ–సేఫ్‌ను నిర్వహించనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అనవసర కోత కాన్పులను సాధ్యమైనంత వరకూ నియంత్రించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో సిజేరియన్లను ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించాలి అనే దానిపై ప్రోటోకాల్స్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మన ఆస్పత్రుల్లో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలను అంతగా వినియోగించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఎంపిక చేసిన ఆరు ఆస్పత్రుల్లో గైనిక్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాక్యూమ్, ఇతర పరికరాలను ఉపయోగించి సాధారణ ప్రసవాల్ని చేసేలా అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలో నైపుణ్యాలు పెంచనున్నారు. సిజేరియన్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సురక్షితంగా సర్జరీల నిర్వహణపై మరింత అవగాహన పెంచనున్నారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, అనకాపల్లి, ఆదోని ఆస్పత్రులను సీ–సేఫ్ కోసం ఎంపిక చేసినట్టు యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ప్రోటోకాల్స్ రూపకల్పన త్వరలో పూర్తి అవుతుందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. అదే విధంగా అనవసర సిజేరియన్ కాన్పుల నియంత్రణపై దృష్టి సారించాం. ఈ క్రమంలోనే సీ–సేఫ్‌కు ప్రణాళిక రచించాం. మరొక వైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
కడుపు కోత తగ్గించేలా!
రాష్ట్రలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తున్న సిజేరియన్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రచించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతంలోపే ఉండాలి. కానీ.. మన రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన మొత్తం ప్రసవాల్లో 2021–22లో 43.82 శాతం, 2022–2023 (ఏప్రిల్ నుంచి డిసెంబర్)లో 47.39 శాతంగా నమోదైంది. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) సమాచారం ప్రకారం.. 2021–22 సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన మొత్తం ప్రసవాల్లో 50.81 శాతం సిజేరియన్లుగా నమోదయ్యాయి. 2022–23లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ పరిశీలిస్తే 55.83 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాల నియంత్రణకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో ప్రసూతి సేవలందిస్తున్న నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిర్వహించిన సిజేరియన్ ప్రసవాలపై ఆడిట్ నిర్వహించింది. 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే 2022–23 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రంలో ప్రసూతి సేవలు అందిస్తున్న 198 ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలపై వైద్య శాఖ అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఏకంగా 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే చేసినట్టు తేలింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14, పల్నాడులో 9, అనకాపల్లిలో 7, గుంటూరులో 8 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. 45 ఆస్పత్రుల్లో 81నుంచి 90 శాతం, 38 ఆస్పత్రుల్లో 71నుంచి 80%, 41 ఆస్పత్రుల్లో 70 శాతానికిపైగా సిజేరియన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా అత్యధికంగా సిజేరియన్లు నిర్వహించిన ఆస్పత్రులను పరిశీలిస్తే.. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 714 ప్రసవాలకు గాను.. 712 సిజేరియన్లు చేశారు. కర్నూలు జిల్లాలోని మరో ఆస్పత్రిలో 322 కాన్పులకు గాను 321, అన్నమయ్య జిల్లాలో 290 ప్రసవాలకు గాను 290 సిజేరియన్లు చేశారు. కుటుంబ సభ్యుల నుంచీ ఒత్తిడి! సిజేరియన్ చేయాలని గర్భిణుల కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే.. రెండో కాన్పు కూడా అలా చేయక తప్పడం లేదంటున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించకూడదని.. సంబంధిత కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులైతే సిజేరియన్లు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కారణాలివీ.. ► సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం. సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో అన్ని గంటలపాటు ప్రైవేట్ వైద్యులు ఓపికతో ఎదురుచూసే పరిస్థితులు లేకపోవడం. ► చిన్నపాటి నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీషియా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ► యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ► సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా సిజేరియన్ ప్రసవంతో సంభవించే సమస్యలపై గర్భిణి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
కాసుల యావ.. కోతల హవా: ఎడాపెడా ‘ప్రైవేటు’ సిజేరియన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైద్యుల కాసుల కక్కుర్తి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా అధిక ఫీజుపై ఆశతో ఎడాపెడా ‘కోత’లు పెడుతున్నారు. దీనికితోడు మంచి ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే కొందరు భార్యాభర్తల ఆలోచన.. తమ బిడ్డ పురిటి నొప్పులు భరించ లేదనే కొందరు తల్లిదండ్రుల ఆందోళన.. సిజేరియన్లు పెరిగిపోయేందుకు దోహదపడుతోంది. సాధారణ ప్రసవాల్లో తక్కువ రక్తస్రావంతో పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం పెద్దగా ఉండదు. కేవలం వారం రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. అదే సిజేరియన్లతో అధిక రక్తస్రావం సమస్యతో పాటు వారం నుంచి పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించి సిజేరియన్లు నివారించేందుకు ప్రయత్నించాల్సిన వైద్యులు, ఆ పని చేయకుండా వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. వీధి చివర్లో ఉన్న నర్సింగ్ హోమ్‌లో సాధారణ ప్రసవానికి రూ.35 వేల నుంచి 40 వేలలోపే ఖర్చు అవుతుంది. అదే సిజేరియన్ అయితే రూ.80 వేల నుంచి రూ.లక్షకు పైగా ఖర్చు అవుతోంది. ఇక కార్పొరేట్ ఆస్పత్రి అయితే ఆ స్థాయిలోనే సాధారణ, సిజేరియన్ డెలివరీ ఫీజులు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ప్రసూతి కేంద్రాలను తనిఖీ చేసి...కడుపు కోతలకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో చిన్నాచితకా నర్సింగ్‌హోమ్‌లు మొదలు కార్పొరేట్ ఆస్పత్రుల దాకా ఇష్టారాజ్యంగా మారిపోయిందనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లు ఒకింత ఎక్కువగానే ఉండటం గమనార్హం. గణాంకాలే నిదర్శనం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–నవంబర్ మధ్య మొత్తం (ఇళ్లలో, అంబులెన్సుల్లో జరిగినవి మినహాయించి) 16,321 ప్రసవాలు జరగ్గా ఇందులో సిజేరియన్లు 6,287 ఉన్నాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల విషయానికొస్తే.. మొత్తం 10,990 ప్రసవాలు జరిగితే అందులో 8 వేలకు పైగా సిజేరియన్లే కావడం గమనార్హం. అంతకుముందు 2021–22లో 19,183 ప్రసవాలు జరిగితే అందులో సిజేరియన్లు 13,895 ఉండటం ప్రైవేటు ఆస్పత్రుల తీరుకు అద్దంపడుతోంది. తల్లుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేయడంతో పాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా క్షేత్రస్థాయిలో సిజేరియన్ల సంఖ్య తగ్గక పోగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలి కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఉమ్మనీరు తాగి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. కానీ చాలామంది వైద్యులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. కొందరు తల్లిదండ్రులు కూడా వివిధ కారణాలతో సిజేరియన్ కోరుకుంటున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సహజ ప్రసవాల ద్వారా జన్మించిన శిశువుకు వెంటనే ముర్రుపాలు అందుతాయి. అదే సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డ మూడు నాలుగు రోజుల పాటు పోతపాల పైనే ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా రోగనిరోధకశక్తిని కోల్పోతుంది. కొన్నిసార్లు వారాల తరబడి ఇంక్యుబేటర్, ఫొటోథెరపీ యూనిట్లలో ఉంచాల్సి వస్తుంది. – డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్టు -
ఎమర్జెన్సీలోనూ నార్మలే..! కడుపు కోతలకు చెక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో సాధారణ కాన్పులపై దృష్టి సారించిన వైద్యారోగ్యశాఖ అధికారులు అత్యవసర సమయాల్లోనూ నార్మల్ డెలివరీ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తల్లికో, బిడ్డకో ప్రాణహాని ఉంటే తప్ప సిజేరియన్ డెలివరీ చేయకూడదు. కానీ సిజేరియన్ డెలివరీతో ఎదురుకానున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవడం, ముహూర్తాలు చూసుకుని ప్రసవాలు చేయడం వంటి కారణంగా చాలా మటుకు సిజేరియన్ డెలివరీకే మొగ్గు చూపుతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గర్భిణులకు మొదటి వైద్య పరీక్షల నుంచి వారిలో సాధారణ ప్రసవాల ఆవశ్యకతపై ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది వారిలో అవగాహన పెంచుతున్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో ఇచ్చే తల్లిపాలు బిడ్డకు జీవితాంతం రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందన్న విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యలు చాలా మట్టుకు ఫలితాలిస్తోంది. వారంపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనూ వైద్యారోగ్యశాఖ ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. డెలివరీ తేదీలు దగ్గరలో ఉన్న గర్భిణులను ముందస్తుగా ప్రభుత్వాస్పత్రులకు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సర్కారు దవాఖానాలో గైనకాలజీ, మత్తు డాక్టర్లు లేనందున పూర్తిగా నార్మల్ డెలివరీలే జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీ కావడం సంతోషంగా ఉంది నాలుగు రోజుల క్రితం నొప్పులు రావడంతో మా కుటుంబ సభ్యులు సిద్దిపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. ఒక రోజు అనంతరం నార్మల్ డెలివరీతో బాబు పుట్టాడు. సంతోషంగా ఉంది. నార్మల్ డెలివరీ గురించి రెండు నెలల క్రితం ఆస్పత్రికి వచ్చిన అప్పటి నుండే వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడంతో రూ.30వేల నుంచి రూ.40 వేలు ఆదా అయ్యింది. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చారు. – పద్మ, బాలింత, నర్మెట నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలో.. గర్భిణితో వ్యాయామం చేయిస్తున్న ఈ దృశ్యం నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలోనిది. నార్మల్ డెలివరీ అయ్యేలా గర్భిణులకు ఇలా వ్యాయామంతోపాటు, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో గర్భిణులకు సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. పడవలో వాగు దాటించారు పడవలో తీసుకొస్తున్న ఈ గర్భిణి పేరు మోర్రం పార్వతి. ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామం. గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ట్రాక్టర్లో పాత్రపురం తీసుకొచ్చి అక్కడి నుంచి పడవలో వాగు దాటించారు. అక్కడి నుంచి 108 వాహనంలో వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి అత్యవసర సమయంలోనూ వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెకు నార్మల్ డెలివరీ చేయగలిగారు. పార్వతికి పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ముందుజాగ్రత్త చర్యగా.. భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బీమారం గ్రామానికి చెందిన శ్రావణి అనే గర్భిణిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది మంచిర్యాలలోని మాతాశిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల క్రితం వైద్యులు ఆమెకు నార్మల్ డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడటంతో నార్మల్ డెలివరీ అయిందని శ్రావణి తెలిపింది. చదవండి: నూతన జోనల్ విధానం ఆధారంగా గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు -
సిజేరియన్లకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించి, సహజ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్య ప్రమాణాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో 15 శాతానికి మించి సిజేరియన్లు ఉండకూడదు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 33%, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50.78% సిజేరియన్లు ఉంటున్నాయి. ఈ దృష్ట్యా సిజేరియన్ ప్రసవాలకు అడ్డుకట్ట వేయడం, మాతృ, శిశు మరణాలు తగ్గించడం వంటి కార్యకలాపాలపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరి (ఎన్‌పీఎం)’ కోర్సును ప్రారంభిస్తోంది. 60 మంది ఎంపిక మిడ్వైఫరీ శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 60 మందిని స్టాఫ్ నర్సులను ఎంపిక చేశారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా గుంటూరు, తిరుపతిల్లో వీరికి శిక్షణ ఇస్తారు. 18 నెలల శిక్షణా కాలంలో ఏడాదిపాటు థియరీ, ఆరు నెలలు ప్రాక్టికల్స్ ఉంటాయి. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు సేవలు, హైరిస్క్‌లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. అనంతరం వీరందరినీ అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమిస్తారు. తొలి బ్యాచ్‌కు ఈ నెల 17 నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు. నర్సులకు శిక్షణ ఇవ్వడం కోసం హైదరాబాద్ ఫెర్నాండేజ్ ఫౌండేషన్‌లో ఆరుగురికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కార్యక్రమానికి యూనిసెఫ్ కూడా తోడ్పడుతోంది. ముఖ్య ఉద్దేశం వైద్యులకు ప్రత్యామ్నాయంగా మాతా, శిశు సంరక్షణ, ప్రసూతి సేవలు అందించడంలో నర్సులను స్పెషలిస్ట్‌లుగా మార్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండి సహజ ప్రసవానికి ఆస్కారం ఉన్న సమయంలో నర్సులు సేవలు అందిస్తారు. హైరిస్క్ గర్భిణులపై గైనకాలజిస్ట్లు దృష్టి సారిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమలులో ఉంటుంది. 2 వేల మందికి శిక్షణ నర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో 1,500 నుంచి 2 వేల మంది నర్సులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.దశల వారీగా అందరికీ శిక్షణ ఇస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ -
సిజేరియన్ డెలివరీలపై ఆడిట్
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కోతల ప్రసవాలు (సిజేరియన్ డెలివరీలు) ఎక్కువవుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేశాయి. మొత్తం ప్రసవాల్లో 10 నుంచి 15 శాతానికి మించి ఈ తరహా ప్రసవాలు జరగకూడదని, అలాంటిది 70 – 80 శాతం జరుగుతున్నాయని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎక్కువ సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రత్యేక ఆడిట్ జరగాలని ఆదేశించాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. భారతదేశంలో దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎక్కువ సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నట్టు తేలింది. ఈ ప్రసవాలకు విధిగా ఆడిట్ నిర్వహించాలని, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ప్రతి డాక్టరూ లెక్క చెప్పాల్సి ఉంటుంది. దీనిపై త్వరలోనే ఏపీ సర్కారు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు శ్రుతిమించి పోయాయని సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అభిప్రాయ పడింది. రమారమి 70 శాతం సిజేరియన్ ప్రసవాలు ప్రైవేటులో నమోదవుతున్నాయి. త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్లోనూ ఈ తరహా ప్రసవాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిజేరియన్ ప్రసవాలతో రిస్కే – సిజేరియన్ ప్రసవాలతో ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే అని ప్రముఖ వైద్య విజ్ఞాన సంస్థల నిపుణులు చెబుతున్నారు. లాన్సెట్ లాంటి ప్రముఖ సైన్స్ పబ్లికేషన్ సంస్థలూ ఇదే అభిప్రాయాన్ని చెప్పాయి. – అవసరం లేకపోయినా సిజేరియన్ చేసిన మహిళలకు రెండో కాన్పులో ఇబ్బందులు వస్తున్నాయి. సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన బిడ్డ కంటే సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డకు శ్వాస కోశ ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువ. – అనస్థీషియా (మత్తుమందు) ఇవ్వడం ద్వారా తల్లీ బిడ్డలు ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. తల్లులకూ, చిన్నారులకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్ ద్వారా రక్తస్రావం (బ్లీడింగ్) జరిగి ఎనీమియాకు గురవుతున్నారు. ప్రసవాలకు ఆడిట్ ముఖ్యం – రాష్ట్ర ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలను తగ్గించేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ఆధారంగా వీటిని తయారు చేశారు. అవి ఇలా ఉన్నాయి. –అన్ని సౌకర్యాలతో ఉన్న ఆస్పత్రుల్లో సిజేరియన్ రేట్లను హేతుబద్దీకరించడం. – ప్రతి ఆస్పత్రిలో సిజేరియన్ ప్రసవానికి గల కారణాలను రాబట్టడం. – సిజేరియన్‌కు అవసరమైన క్లినికల్ ఆధారాలను ప్రతి ఒక్కరూ చూపించాలి. – ఆస్పత్రి యాజమాన్యం లేదా డాక్టరు విధిగా ప్రభుత్వానికి సిజేరియన్ ప్రసవం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో చెప్పాలి. – ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ చేసిన వైద్యులు తమ విభాగాధికారికి నివేదిక ఇవ్వడం. – ఆడిట్ నిర్వహణ చూస్తున్న వైద్యులు విధిగా నిబంధనలు పాటించాలి. – ప్రతి 15 రోజులకోసారి ప్రసూతి వైద్యులు, డీఎన్బీ వైద్యులతో ఆడిట్‌పై సమీక్ష నిర్వహించాలి. నెలకోసారి సిజేరియన్ ప్రసవాల నివేదిక (ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన) విడుదల చేసి, సమీక్షించాలి. -
కాన్పుల్లో ఎమ్మిగనూరు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రసవాలు సగటున ఎక్కువగా జరుగుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మొదటి స్థానంలో ఉన్నట్లు వైద్య విధాన పరిషత్ గణాంకాల్లో తేలింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కాన్పుల గణాంకాలు సేకరించారు. ఇక ఏరియా ఆస్పత్రుల్లో కాన్పుల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, జిల్లా ఆస్పత్రుల్లో విజయనగరం అగ్రస్థానంలో నిలిచాయి. జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు... 34 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు సగటున 50కి మించి ప్రసవాలు జరుగుతున్నాయి. సగటున వందకు మించి ప్రసవాలు జరుగుతున్నవి 8 ఆస్పత్రులున్నాయి. ఏరియా ఆస్పత్రుల్లో సగటున నెలకు వంద ప్రసవాలు జరిగే ఆస్పత్రులు 19 ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మొత్తం 1,67,128 ప్రసవాలు జరగ్గా 58,960 సిజేరియన్లు ఉన్నాయి. 35.27 శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా 47 శాతం సిజేరియన్ ప్రసవాలు నమోదయ్యాయి. సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సగటుకు మించి ప్రసవాలు జరుగుతున్న ఆస్పత్రులను హైలోడ్ డెలివరీ ఆస్పత్రులుగా గుర్తించి వసతులు మరింత మెరుగు పరచనున్నారు. ప్రసూతి వార్డులను యుద్ధప్రాతిపదికన ఉన్నతీకరిస్తున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉండేలా చర్యలు చేపట్టారు. అత్యాధునిక ప్రసూతి వార్డులు ‘నాడు – నేడు’ పనుల ద్వారా ప్రధానంగా సీహెచ్‌సీల్లో అత్యాధునిక ప్రసూతి వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ముగ్గురు వైద్యుల బృందం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక వసతులు భారీగా పెరగనున్నాయి. –డాక్టర్ యు.రామకృష్ణారావు, కమిషనర్, వైద్యవిధానపరిషత్ -
ఇష్టారాజ్యంగా సిజేరియన్లు
కంకిపాడుకు చెందిన విజయలక్ష్మి అక్టోబర్ 29న ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో చేరింది. బిడ్డ అడ్డం తిరిగిందని, ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు చేసేది లేక ఓకే అన్నారు. అర గంటలోనే సిజేరియన్ ప్రసవం పూర్తయింది. మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచి రూ.48 వేల బిల్లు వేసి ఇంటికి పంపారు. సాక్షి, అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల్లో సుఖప్రసవం గగనమైంది. సుఖప్రసవానికి అవకాశం ఉన్నా ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు డబ్బు కోసం సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు తగ్గిపోతుండగా, ప్రైవేటులో మాత్రం ఏటా పెరుగుతుండటం ఆందోళన పెంచుతోంది. సిజేరియన్ ప్రసవం వల్ల తల్లీబిడ్డకు ఇబ్బందులుంటాయని తెలిసినా కొంతమంది వైద్యులు సిజేరియన్ వైపే మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి.. తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నవారికి, అధిక రక్తపోటు ఉన్నవారికి, హెచ్ఐవీ సోకిన గర్భిణులకు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవం చేయాల్సి ఉంది. కానీ ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు ప్రసవానికి వెళ్లినా సిజేరియన్లు చేస్తున్నారు. విజయవాడలాంటి నగరాల్లో ఇదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు 62.16 శాతం సిజేరియన్ ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో తగ్గిన సిజేరియన్లు రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య సగటున 44.91 శాతంగా ఉంది. ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరగ్గా ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 40 శాతానికి తగ్గకుండా ఉండే సిజేరియన్ ప్రసవాల సంఖ్య ఇప్పుడు 30.27 శాతానికి దిగొచ్చింది. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఏటా పెరుగుతూ ఇప్పుడా సంఖ్య 61.04 శాతానికి చేరి కలవరపెడుతోంది. అంటే.. ప్రసవానికి వచ్చిన ప్రతి వంద మందిలో 61 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక్కో సిజేరియన్‌కు కనిష్టంగా రూ.30 వేలు, గరిష్టంగా రూ.60 వేల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. సిజేరియన్లతో వచ్చే సమస్యలివే.. మొత్తం ప్రసవాల్లో గర్భిణులకు ఉన్న వివిధ రకాల అనారోగ్య సమస్యల వల్ల 15 శాతం సిజేరియన్ ప్రసవాలు అవసరమవుతాయని, అంతకుమించి జరిగితే తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. దక్షిణాది దేశాల్లో ఈ సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని తాజాగా వెల్లడించింది. - సిజేరియన్ వల్ల తల్లికి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. - అనస్థీషియా (మత్తు మందు) రియాక్షన్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్‌లోనూ అనేక రకాలు ఇబ్బందులు తలెత్తుతాయి. - రెండో ప్రెగ్నెన్సీ సమయంలో తల్లీబిడ్డకు ఇబ్బందులు తలెత్తుతాయి. - గాయం మానడానికి ఎక్కువ రోజులు సమయం పడుతుంది. - ఎక్కువగా రక్తస్రావం జరిగి కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. 20 శాతం లోపే ఉండాలి వాస్తవానికి 20 శాతం లోపే సిజేరియన్లు ఉండాలి. తల్లికీ, బిడ్డకూ రిస్క్ జరిగితే పేషెంట్లు, వారి బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చాలామంది ప్రసూతి వైద్యులు సిజేరియన్‌కు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్లు తక్కువ. వైద్యులతో పాటు పేషెంట్ కుటుంబీకులు కూడా వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుంటే సిజేరియన్లు తగ్గించవచ్చు. – డా.దుర్గాప్రసాద్, కమిషనర్, వైద్యవిధాన పరిషత్ -
అమ్మపై కత్తి కాసుల కక్కుర్తి
సాక్షి, హైదరాబాద్: అమ్మకు కడుపుకోత తప్పడం లేదు. ప్రసవాల సందర్భంగా గర్భిణులకు సిజేరియన్ చేయడం మామూలు విషయంగా మారింది. అవసరమున్నా లేకున్నా అనేకమంది డాక్టర్లు ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సిజేరియన్ ఆపరేషన్లు చేసి ఆస్పత్రులు వేలకువేలు గుంజుతున్నాయి. కార్పొ రేట్ ఆసుపత్రుల్లో ఏకంగా లక్షలకు లక్షలు లాగుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 60 శాతం సిజేరియన్ ద్వారానే జరుగుతున్నట్లు తేలింది. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 44 శాతం, ప్రైవేటు ఆసుపత్రుల్లో 56 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగినట్లు నిర్ధారించింది. సాధారణ పద్ధతిలో ప్రసవాలు చేయడానికి అవకాశమున్నా కడుపుకోత మిగుల్చుతున్నారు. నిర్మల్‌లో అధికం.. కొమురంభీం అత్యల్పం నిర్మల్ జిల్లాలో ఈ ఏడాది జరిగిన 7,337 ప్రసవాల్లో 6,040 (82%) సిజేరియన్ ద్వారానే జరిగినట్లు తేలింది. హైదరాబాద్‌లో ఈ ఏడాది జరిగిన 72, 449 ప్రసవాల్లో 38,758 సిజేరియన్ ద్వారానే జరిగాయి. అత్యల్పంగా కొమురంభీం జిల్లాలో 22% సిజేరియన్లు జరిగాయి. అక్కడ జరిగిన 3,342 ప్రసవాల్లో 730 మాత్రమే సిజేరియన్లు జరిగాయి. ఈ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. కాసులే పరమావధి... సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయడం సర్వసాధారణమైంది. సాధారణ ప్రసవమా? సిజేరియన్ చేయాలా అన్నది గర్భిణీని ముందునుంచీ పరీక్షించే డాక్టర్‌కు అర్థమైపోతుంది. అత్యంత రిస్క్ కేసుల్లో మాత్రమే సిజేరియన్ అవసరమవుతుంది. నెలల ముందే దీనిపై స్పష్టత వస్తుంది. సాధారణ ప్రసవం అయితే రెండ్రోజుల్లో ఇంటికి పంపించేయవచ్చు. సిజేరియన్ అయితే వారం వరకు ఆసుపత్రిలో ఉంచుకోవచ్చు. సాధారణ ప్రసవానికి ప్రైవే టు ఆసుపత్రుల్లో రూ.25 వేలతో ముగించేయవచ్చు. సిజేరియన్ అయితే ఆసుపత్రి స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో రూ. 5 లక్షలు వసూలు చేస్తుండటం తెలిసిందే. కొందరు డాక్టర్లు సెంటిమెంట్‌ను కూడా క్యాష్ చేసుకుంటున్నారు. ముహూర్తం ప్రకారం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారు. సిజేరియన్ వల్ల తల్లికి మున్ముందు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ. 12 వేల చొప్పున అందజేస్తుంది. ఆడబిడ్డ పుడితో మరో వెయ్యి అదనం. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం మొత్తం ప్రసవాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 57% జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగినా, ఇటీవల గర్భిణులకు ప్రోత్సాహకపు సొమ్మును అధికారులు పెండింగ్‌లో పెట్టడంతో మహిళల్లో నిరాశ నెలకొంది. దాదాపు ఆరు నెలల నుంచి ప్రోత్సాహకాలు నిలిచిపోయాయని చెబుతున్నారు. అధికారులు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నారు. -
అమ్మకు ఎంత కష్టం
అమ్మతనం కమ్మదనం పొందడానికి ఆ తల్లీ నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. కాన్పు పునర్జన్మతో సమానం అని తెలిసినా అందుకు సిద్ధపడుతుంది. బిడ్డను చేతికివ్వగానే ఆమె మేను పులకురిస్తుంది. కానీ ఆ అమ్మకు ‘కడుపుకోత’లతో అనేక వ్యాధుల పలకరిస్తున్నాయి. వైద్యో నారయణ హరీ! అంటారు, కానీ ప్రైవేటు వైద్యుల పట్టనితత్వమో, పైసల వ్యామోహమో సహజ కాన్పుకు నోచుకోలేక అమ్మకు ఈ దుస్థితి వచ్చింది. సాక్షి, పాలమూరు: అనవసర శస్త్రచికిత్సలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి వాటిని మూసివేయడానికి కూడా వెనుకాడం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసే సాధారణ ప్రసవాలు, సిజేరియన్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేయాలని ఇటీవల సమీక్షలో కలెక్టర్ ప్రైవేట్ వైద్యులకు చెప్పిన మాటలివి.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నవమాసాలు బిడ్డను ఆనందంతో మోసినా ప్రసవ సమయంలో కడుపుకోత మిగుల్చుతున్నారు. పురుడు అంటేనే పునర్జన్మ అంటారు. అలాంటిది కాన్పు అంటేనే కోతగా మారింది. శస్త్రచికిత్స కాన్పులతో చిన్నారులకు జన్మనిస్తున్న తల్లులు బిడ్డలను చూసుకొని తాత్కాలికంగా మురిసిపోతున్నారు. అనంతరం వారు వివిధ రకాల రుగ్మతలకు గురవుతున్నారు. కొంతమేర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సాధారణ కాన్పులు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం దాదాపు 80 శాతానికిపైగా సిజేరియన్లే జరుగుతున్నాయి. పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడంతో వారు సాధారణ ప్రసవం చేయడానికి సాహసించడం లేదు. దీంతో గర్భిణులకు సాంకేతిక కారణాలు చెప్పి మాయ చేస్తున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు, సిజేరియన్లు చేస్తూ దండిగా డబ్బులు దండుకుంటున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 947 కాన్పులు అయ్యాయి. ఇందులో సాధారణ 307, సిజేరియన్లు 640 కాగా.. ఆడ శిశువులు 488, మగ శిశువులు 479 మంది పుట్టారు. అవసరం లేకున్నా.. విదేశాల్లో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో తప్ప ప్రసవం సిజేరియన్ ద్వారా చేయరు. స్థానికంగా మాత్రం ఆ పరిస్థితి లేదు. జిల్లాలో సిజేరియన్ కాన్పులతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అవసరం ఉ న్నా.. లేకపోయినా శస్త్రచికిత్స నిర్వహిస్తుండటంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పేదలకైతే మరీ నరకం. ఆస్తులు తనఖా పెట్టుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని ప్రైవేట్ లో మాత్రమే అధికంగా సిజేరియన్ కాన్పులు నిర్వ హిస్తున్నారు. ఒక్కో కాన్పునకు కనీసంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇలా జిల్లాలో ప్రైవేట్‌లో అయిన 648 ప్రసవాలకు ఒక్క కేసుకు రూ.30 వేలు లెక్కించినా రూ.1.94 కోట్ల సొత్తు ప్రైవేట్ ఆస్పత్రులు వెనకేసుకున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి ఖర్చు ఉండదు. పైగా వారే రూ.12 వేలు చెల్లించడంతోపాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనే.. వైద్య వర్గాల సమాచారం మేరకు నాలుగు సందర్భాల్లోనే సిజేరియన్‌కు వెళ్లాల్సి వస్తోంది. సుఖ ప్రసవానికి కడుపులో బిడ్డ ఉన్న విధానం ప్రతికూలంగా ఉన్నప్పుడు.. బిడ్డ బయటకు రావడానికి మాయ, కణతులు అడ్డుగా ఉండటం వంటి బలమైన కారణాలు ఉంటేనే సిజేరియన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణాలు లేకపోయినా గర్భిణులు, వారి బంధువులను భయభ్రాంతులకు గురిచేసి కోతలకు వెళ్తున్నారు. అవగాహన లేని ప్రజలు వైద్యులు సూచనల మేరకు సిజేరియన్లకు మొగ్గు చూపుతున్నారు. కోతలతో దీర్ఘకాలిక నష్టాలు కడుపు కోత కారణంగా శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది. మునుపటిలా శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంలోనూ నొప్పులు వేధిస్తుంటాయి. హెర్నియా వంటి దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. రెండోకాన్పు తప్పకుండా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. సిజేరియన్ జరిగే సమయంలో గర్భాశయం పక్కన భాగాలపై గాయాలవడంతోపాటు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. మత్తు మందుతో ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. రక్తస్రావంతో అదనపు రక్తాన్ని అందించాల్సిన పరిస్థితులు వస్తాయి. ూ రెండో కాన్పు సమయంలో తొమ్మిదో నెలలో గర్భసంచికి గతంలో వేసిన కుట్లు విడిపోయే ప్రమాదం ఉంది. గర్భసంచికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. తద్వారా భవిష్యత్‌లో అప్పుడప్పుడు తీవ్ర కడుపునొప్పి సమస్యలు ఎదురవుతాయి. కాన్పు సమయంలో రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. దీన్ని వైద్య పరిభాషలో ఎంబోలిజం అంటారు. చర్యలు తీసుకుంటాం గతంతో పోలిస్తే ప్రస్తుతం సిజేరియన్లు తగ్గాయి. వాటిని మరింత తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ సేవలు మెరుగయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చ ర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవరైనా మాకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి ఆస్పత్రులపై కేసులు నమోదు చేస్తాం. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు త్వరలో సమావేశం ఏర్పాటు చేసి నార్మల్ ప్రసవాలపై నిబంధనలు వివరిస్తాం. – డాక్టర్ రజిని, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిణి, మహబూబ్‌నగర్ సాధారణ కాన్పుతో ఆరోగ్యం సాధారణ కాన్పుతో మహిళకు ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవవు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా శస్త్రచికిత్స ప్రసవం చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ కాన్పు అయ్యాక కొన్ని దుష్పరిణామాలు భవిష్యత్‌లో ఏర్పడవచ్చు. సిజేరియన్తో శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. గతంలో శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంలోనూ నొప్పులు వేధిస్తాయి. లీటరు రక్తం వరకు వృథాగా వెళ్తుంది. – రాధ, గైనిక్ హెచ్ఓడీ జనరల్ ఆస్పత్రి, మహబూబ్‌నగర్ -
పెరిగిపోతున్న సిజేరియన్లు..
లండన్: సిజేరియన్తో తల్లీబిడ్డ దుష్పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు హెచ్చరించినా.. పరిస్థితుల్లో మాత్రం ఏ మార్పు లేదు. ఇతర దేశాలతో పాటు, మన దేశంలోనూ ప్రసవాల కోసం సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో 2005–06లో సిజేరియన్ల సంఖ్య 9శాతం ఉండగా, 2015–16లో ఇది 18.5 శాతానికి చేరినట్లు ప్రతిష్టాత్మక మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. బెల్జియంలోని ఘెంట్ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య 2000–15 మధ్య ఏడాదికి 3.7శాతం చొప్పున పెరిగిందని, 2000లో సిజేరియన్ ద్వారా 1.6 కోట్ల మంది శిశువులు జన్మించగా..2015 నాటికి ఈ సంఖ్య 2.97 కోట్లకు పెరిగినట్టు తేలింది. కాన్పు కష్టమైనప్పుడే సిజేరియన్... నొప్పులు మొదలైన తర్వాత సహజంగా కాన్పు జరగడం కష్టమై, తల్లీబిడ్డకు హానిజరిగే సంకేతాలున్నప్పుడు మాత్రమే సిజేరియన్‌ను ఆశ్రయించాలని పరిశోధకులు సూచించారు. గర్భంలో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణికి బ్లీడింగ్ అవుతున్నప్పుడు, బీపీ సంబంధిత వ్యాధులున్నప్పుడు మాత్రమే ప్రసవానికి ఆపరేషన్ నిర్వహించాలని చెప్పారు. వైద్య పరంగా ఇలాంటి క్లిష్ట సందర్భాలు కేవలం 10 నుంచి 15 శాతం మందికే ఎదురవుతాయని పరిశోధకుడు అగాఖాన్ తెలిపారు. కానీ, చాలామంది మహిళలు పురిటినొప్పులు భరించలేక భయంతో సిజేరియన్‌ను ఎంపిక చేసుకుంటున్నారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. చాలా దేశాల్లో అవసరం లేకున్నా సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 15 దేశాల్లో సిజేరియన్ చేయించుకుంటున్న వారి సంఖ్య 40 శాతానికి పైగా ఉండటం గమనార్హం. 169 దేశాలపై అధ్యయనం... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి 169 దేశాల సమాచారాన్ని తీసుకుని పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. దక్షిణాసియాలో 2000 నుంచి ఏడాదికి 6.1శాతం చొప్పున సిజేరియన్ల ఆపరేషన్ల శాతం పెరుగుతూ 2015కు 18.1 శాతానికి చేరింది. ఆఫ్రికాలో మాత్రం సిజేరియన్లను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. బ్రెజిల్, చైనాల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్లో చదువుకున్న వాళ్లలో 54.4శాతం మంది సిజేరియన్‌ను ఎంపిక చేసుకుంటుండగా.. చదువుకోని 19.4 శాతం మంది మాత్రమే దీన్ని ఎంపిక చేసుకోవడం గమనార్హం. అమెరికా, బ్రెజిల్, బంగ్లాదేశ్‌ల్లో 25 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. పాలకులు చట్టాలు తేవాలి: తల్లీబిడ్డా ఆరోగ్యం దృష్ట్యా క్లిష్ట సమయాల్లో మాత్రమే సిజేరియన్ ఆపరేషన్ చేసేలా వైద్యులు చొరవ తీసుకోవాలని, పాలకులు కూడా దీనిపై దృష్టి సారించి ప్రత్యేక చట్టాలు తేవాలని పరిశోధకు డు సాండల్ అభిప్రాయపడ్డారు. అవసరంలేకున్నా ఆపరేషన్ చేయించుకోవడం దుష్పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. -
కాన్పుల్లో కోతలకే మొగ్గు !
సాక్షి, జగిత్యాల: నేషనల్ హెల్త్‌మిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన సర్వే వివరాలు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సైతం సీరియస్ అయ్యారు. కలెక్టర్ సైతం వైద్యాధికారులతో సమావేశమై.. జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ప్రతీ నెల రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య తగ్గింది. కేసీఆర్ కిట్‌తో.. కేసీఆర్ కిట్ అమలుతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య ఘననీయంగా పెరిగింది. అయితే ప్రభుత్వ వైద్యులు సైతం సాధారణ ప్రసవాల కోసం చూడకుండా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఈ సంవత్సరంలోనే 65 శాతం సిజేరియన్లు జరిగినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. మొదటి కాన్పు సిజేరియన్ చేస్తే..రెండో కాన్పు సైతం సాధారణం ఇబ్బందవుతుందని, సిజేరియన్ చేయాలంటున్నారు వైద్యులు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగినప్పటికీ.. ఇక్కడికి వస్తున్న వారిలో ఎక్కువ శాతం రెండో కాన్పుకోసమేనని వైద్యులు పేర్కొంటున్నారు. పలు సమస్యలు సిజేరియన్ చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రోజులు కదలకుండా ఉండడంతోపాటు నొప్పి తీవ్రంగా ఉంటుంది. పుట్టిన పాపకు పాలు పట్టడంలో జాప్యమవుతుంది. సాధారణ ప్రసవంతో పొట్టపై ఎలాంటి కోతలు ఉండవు. బాలింత మరుసటి రోజే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డకు సైతం ఇబ్బంది లేకుండా పట్టవచ్చు. వైద్యుల కొరతే కారణమా? జిల్లాలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. జగిత్యాల ప్రధాన ఆస్పత్రిలో ముగ్గురే గైనకాలజిస్ట్లు ఉన్నారు. మెట్పల్లిలో ఇద్దరు, కోరుట్ల, రాయికల్, ధర్మపురిలో ఒక్కొక్కరి చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యులు ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం పరిశీలించి సాధారణ ప్రసవం చేసే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతోనే సిజేరియన్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అత్యధికంగా నెలకు 400 వరకు ప్రసవాలు జరిగే జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో ఇబ్బందికరంగా మారింది. దీంతో పాటు ఇటీవల రాయికల్ ఆస్పత్రిలో ఒకేరోజు 24 సిజేరియన్లు చేశారు. నిబంధనల ప్రకారం ఒక్క గైనకాలజిస్ట్ ఉన్నప్పుడు ఒకే రోజు అన్ని చేయడం ప్రమాదకరం. సమస్య లేకపోవడంతో ఇబ్బంది తలెత్తలేదు. ముహూర్తాలపై నమ్మకంతో.. చాలా మంది ముహూర్తాలపై నమ్మకంతో కోరుకున్న సమయంలో పిల్లలు పుట్టాలనే ఉద్దేశంతో టైం చూసుకుని మరీ సిజేరియన్లు చేయిస్తున్నారు. పురోహితులను సంప్రదించి తేదీ, సమయం తెలుసుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నారని తెలుస్తున్నాయి. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచుతాం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ఎక్కువగా మొదటి కాన్పు సిజేరియన్ అయిన వారే ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో తప్పకుండా రెండో కాన్పుకు సైతం సిజేరియన్ చేయాల్సి వస్తుంది. మొదటిసారి వచ్చిన వారికి సాధారణ కాన్పు అయ్యేలా వైద్యులు చూస్తున్నారు. అయినా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూస్తాం. – జైపాల్‌రెడ్డి, డెప్యూటీ డీఎంహెచ్‌వో -
మానవ పరిణామాన్ని ప్రభావితం
చేస్తున్న సిజేరియన్ జననాలు లండన్: ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళల్లో సహజ ప్రసవం అయిన వారిసంఖ్య చాలా తక్కువ. మెజారిటీ సందర్భాల్లో వైద్యులు సిజేరియన్‌కే ప్రాధాన్యత ఇస్తుంటారనేది తెలిసిన విషయమే. అరుుతే ఇలా సిజేరియన్ కాన్పులు చేయడం వల్ల మానవ పరిణామ క్రమంపై తీవ్ర ప్రభావం పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం తల్లులవుతున్న అనేకమంది మహిళల్లో ప్రసవ వాహిక పరిమాణం కుంచించుకు పోవడంతో వారికి సిజేరియన్ ద్వారా ప్రసవం చేయడం తప్పనిసరిగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రసవ వాహిక పరిమాణం బిడ్డ బయటికి వచ్చేందుకు సరిపోదని తేల్చిన కేసుల సంఖ్య 1960లో వెయ్యికి 30 ఉండగా ప్రస్తుతం అవి 36కి పెరిగారుు. అయితే పురిటి నొప్పుల్లో తల్లీ బిడ్డ మరణించిన కేసులను పరిశీలిస్తే దీనికి సంబంధించిన జన్యువులు తల్లి నుంచి బిడ్డకు బదిలీ కాలేదని నిర్ధారణ అరుుంది. ఎటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు లేని కాలంలో తక్కువగా ఉన్న ఈ కేసుల సంఖ్య ప్రస్తుతం పెరిగి పోవడానికి కారణం మానవ పరిణామ క్రమంలో వచ్చిన మార్పేనని, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాకు చెందిన డాక్టర్ ఫిలిప్ మిట్టరోయికర్ అన్నారు. వందేళ్ల క్రితం పెల్విస్ చాలా ఇరుకుగా ఉండే మహిళలు ప్రసవ సమయంలో బతికే అవకాశం చాలా తక్కువగా ఉండేది, వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో వీరు సురక్షితంగా బయటపడటంతోపాటు తమ జన్యుక్రమాన్ని తమ కుమార్తెలకు అందజేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇటువంటి కేసుల సంఖ్య పెరుగుతోందని డాక్టర్ ఫిలిప్ పేర్కొన్నారు. చింపాంజీల వంటి జంతువులతో పోల్చితే మానవుల్లో పెల్విన్ పరిమాణం ఎందుకు సరిపోయేంతగా ఉండదనేది దీర్ఘకాలిక ప్రశ్నగా మిగిలిపోరుుందన్నారు.