CGM
-
బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం లక్ష్యం రూ.1,000 కోట్లు
అల్లిపురం (విశాఖ దక్షిణ): బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం ప్రస్తుతం రూ.700 కోట్లు ఉందని, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10% అధికమని ఏపీ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఎం.శేషాచలం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1000 కోట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. డాబాగార్డెన్స్‌లో గల సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మనిర్బర్ భారత్ కింద స్వదేశీ 4జీ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ను ఆదేశించిందని, ఇప్పటికే పాన్ ఇండియాలో టీసీఎస్, ఐటీఐ కంపెనీలకు లక్ష సైట్లు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని, ఏడాదిలో ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది జూలైలో పంజాబ్‌లో బీటా లాంచ్ పూర్తయిందని, దీని ద్వారా 4జీ పరికరాలు 5జీకి అప్‌గ్రేడ్ అయినట్టు తెలిపారు. ఏపీ సర్కిల్లో 4300 సైట్లలో 4జీ పరికరాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విశాఖ సర్కిల్లో 463 సైట్లు 4జీగా ఇప్పటికే సేవలందిస్తున్నాయన్నారు. అంత్యోదయ మిషన్ కింద మారుమూల గ్రామాలకూ కనెక్టివిటీ అందిస్తున్నామని, డిసెంబర్ నాటికి ఆ పనులు పూర్తవుతాయని, వాటికి సోలార్ పవర్‌తో కనెక్షన్ ఇస్తామన్నారు. ఏపీలో 4జీ సేవలు 3800 గ్రామాల్లో అందుబాటులోకొస్తాయని వెల్లడించారు. 2026 నాటికి సంస్థ లాభాల బాటలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని, ప్రభుత్వ శాఖలన్నీ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు వాడేలా మార్కెటింగ్ విభాగాన్ని పటిష్టం చేస్తామని శేషాచలం వివరించారు. సమావేశంలో విశాఖ జిల్లా జనరల్ మేనేజర్ పి.పాల్ విలియమ్స్, జి.ఆడం, మొబైల్స్ విభాగం హెడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్పాదక రంగంలో అగ్రగామిగా భారత్
సాక్షి, హైదరాబాద్: ఉత్పాదక రంగంలో భారత్ అగ్రగామి కానుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) అమిత్ జింగ్రాన్ చెప్పారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్లలో సూదుల నుంచి విమానాల వరకు, హైడెల్ పవర్ నుంచి సోలార్ పవర్ వరకు, సైకిళ్ల నుంచి లగ్జరీ కార్ల వరకు తయారు చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు. రైల్వేలు, రోడ్డు, మౌలిక సదుపాయాలు, మెట్రో పట్టాలు మొదలైన వాటిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించిందని తెలిపారు. భారత్ అభివృద్ధిలో ఎస్బీఐ కీలక ప్రాత పోషిస్తోందని పేర్కొన్నారు. -
రూ.123 కోట్లతో బీఎస్ఎన్ఎల్ 4జీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కిల్లో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో రూ.123 కోట్ల వ్యయంతో బీఎస్ఎన్ఎల్ 4జీ విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) సుందరం వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల, ఖమ్మంలోని వైరాలో 4జీ టెస్టింగ్ చేపట్టామన్నారు. తెలంగాణ సర్కిల్లో ఆగస్టులో విస్తరణ పనులు ప్రారంభించి డిసెంబర్‌లోగా 4జీ సేవలు అందిస్తామని, హైదరాబాద్‌లో వచ్చే ఏడాది మార్చి నాటికి 4జీ సేవలను విస్తరిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్ దూర్ సంచార్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2జీ, 3జీ నెట్వర్క్ కలిగిన ప్రాంతాల్లో 4జీ సేవలు విస్తరిస్తున్నామని, ఇప్పటికే 2జీ నెట్వర్క్ కలిగిన టవర్స్‌ను అభివృద్ధి చేస్తామని, కొత్తగా 409 4జీ టవర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెట్రో రైలు కారిడార్‌లో 64 టవర్స్ ఏర్పాటు చేసి 3జీ సేవలు విస్తరిస్తున్నామని, ఇప్పటికే 26 స్టేషన్లల్లో 2జీ టవర్స్ ఏర్పాటు చేశామని, మిగిలి స్టేషన్లలో సైతం టవర్స్ ఏర్పాటు చేసి 3జీ సేవలు అందిస్తామన్నారు. రూ.1,199కి ఫ్యామిలీ ప్లాన్ ఆఫర్ బీఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ బీబీజీ కాంబో యూఎల్డీ 1199ను ప్రవేశపెట్టినట్లు సీజీఎం సుందరం చెప్పారు. రూ.1199తో నెలకు అన్లిమిటెడ్ బ్రాడ్‌బాండ్ 10 ఎంబీపీఎస్ స్పీడ్ 30 జీబీ వరకు, రెంట్ ఫ్రీ ల్యాండ్‌లైన్ 24 గంటలు అన్లిమిటెడ్ ఉచిత కాలింగ్, మూడు మొబైల్ కనెక్షన్లకు అన్లిమిటెడ్ ఉచిత లోకల్, ఎస్టీడీ ఎనీ నెట్వర్క్, రోజుకు 1జీబీ డాటా వర్తిస్తుందన్నారు. బ్రాడ్‌బాండ్ ప్రమోషన్ ఆఫర్‌గా బీబీ 99, బీబీ 199, బీబీ 299, బీబీ 491 ప్లాన్లను తీసుకొచ్చామని, అన్లిమిటెడ్ బ్రాడ్‌బాండ్, 20 ఎంబీపీఎస్ స్పీడ్, 24 గంటలు ఉచితం కాలింగ్ ఎనీ నెట్‌వర్క్‌కు వర్తిస్తోందన్నారు. ప్లాన్‌ను బట్టి 1.5 జీబీ నుంచి 20 జీబీ డాటా వస్తుందన్నారు. ఫైబర్ కాంబో 777 ఆఫర్ కింద అన్లిమిటెడ్ బ్రాడ్‌బాండ్, 50 ఎంబీపీస్ స్పీడ్ 500 జీబీ వరకు, 1277 ఆఫర్ కింద 100 ఎంబీపీఎస్ స్పీడ్ 750 జీబీ వరకు డాటా, అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితమన్నారు. బీబీ 299 కింద అన్లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్, 30 ఎంబీపీఎస్ 100 జీబీ వరకూ.. 399 ప్లాన్ కింద అన్లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్, 30 ఎంబీపీఎస్ 200 జీబీ వరకు వర్తిస్తుందన్నారు. అనంత–105, అనంతప్లస్–328, పోస్ట్‌పెయిడ్‌లో ఎంఎంసీ–399 ప్లాన్లు.. ఎస్టీవీలో ఈద్ ముబారక్–786, ఎస్టీవీ–148, డాటా సునామీ–98, ఎస్టీవీ–118, ఎస్టీవీ–44 ప్లాన్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. టాపప్‌లో అన్ని ఆదివారాల్లో రూ.160కి çఫుల్ టాక్‌టైమ్, టాపప్ రూ.310కి అన్ని రోజుల్లో ఫుల్ టాక్‌టైమ్ వర్తిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో టెలికం హైదరాబాద్ పీజీఎం రాంచంద్రం పాల్గొన్నారు. -
మనకూ ‘టైమ్’ వచ్చింది..!
భారత ప్రామాణిక సమయం (ఇండియన్ స్టాండర్డ్ టైమ్–ఐఎస్టీ)కి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థుల సైబర్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడంతో పాటు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశీయంగా అధికారయుతమైన ప్రామాణిక సమయాన్ని ఖరారు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకసారి ఇది చట్టబద్ధమైతే మనదైన సొంత సమయాన్ని దేశవ్యాప్తంగా అన్నిరకాల సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దేశానికి అధికారిక ‘టైమ్‌కీపర్’గా వ్యవహరిస్తున్న నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (ఎన్పీఎల్) నుంచే మొబైల్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లంతా నిర్ధారిత సమయాన్ని తీసుకోవాలి. మొబైల్ టైమ్లన్నీ అమెరికావే.. ప్రస్తుతం భారత్‌లోని కోట్లాది సెల్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లలో అమెరికాకు చెందిన నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ఇస్తున్న టైమ్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఫోన్లతో పాటు, ఐఫోన్లు అమెరికాలోని నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్ సర్వర్ల నుంచే ఈ సమయాన్ని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మనవాళ్లు అత్యధికశాతం, మైక్రోసాఫ్ట్, ఐఫోన్ సాఫ్ట్వేర్లనే వాడుతుండడంతో ఈ ఫోన్లలో ఈ సమయాన్నే ఉపయోగిస్తున్నారు. ‘ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారన్న దాని ప్రాతిపదికన ఒక సెకన్ నుంచి కొన్ని సెకన్ల వరకు ఈ సమయాల్లో తేడాలుంటాయి. అమెరికాకు చెందిన సర్వర్ల నుంచి, ఆ దేశ సొంత టెక్నాలజీతో రూపొందించిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్( జీపీఎస్) నుంచే ఎక్కువ మటుకు ఈ టైమ్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది’ అని ఎన్పీఎల్ డైరెక్టర్ దినేశ్ కె ఆస్వల్ తెలిపారు. తాము ఒక దేశం, ఒక సమయం అనే నినాదంతో ముందుకెళుతున్నందున, ఐఎస్టీ అనే ఒకే ప్రామాణిక, ఆధారిత సమయం ఉండాలన్నారు. మున్ముందు దేశ రక్షణ, భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఏటీఎం, ఆన్లైన్ లావాదేవీల విషయంలో కొన్ని సెకన్లు కూడా కీలకంగా మారతాయని ఎన్పీఎల్ సైంటిస్ట్ అశిష్ అగర్వాల్ వెల్లడించారు. ఐఎస్టీని గుర్తించని లీగల్ మెట్రోలజీ..! భారత లీగల్ మెట్రోలజీ యాక్ట్, 2009 దేశ ప్రామాణిక సమయంగా ఐఎస్టీని గుర్తించడం లేదు. ఈ చట్టానికి అనుగుణంగానే మనదేశంలో ప్రామాణిక బరువులు, కొలతలు అమలవుతున్నాయి. వీటి అధారంగానే వాణిజ్య, వ్యాపారాలు క్రమబద్దీకరిస్తున్నారు. చట్టబద్ధంగా ఒకే సమయాన్ని పాటించే ‘ ఏక విధానం’ ఆవశ్యకతను భారతీయ రైల్వే తత్కాల్ టికెటింగ్ వ్యవస్థ ఎత్తి చూపుతోంది. ఐఎస్టీ సమయాన్ని రైల్వేశాఖ అనుసరిస్తుంటే, ఓ వినియోగదారుడు తన ఫోన్లో మరో నెట్వర్క్ సమయాన్ని ఉపయోగిస్తున్న పక్షంలో రెండింటి మధ్య టైమ్‌లో వ్యత్యాసాల కారణంగా అతడు లాగిన్ అయ్యేప్పటికి టికెట్లన్నీ అమ్ముడైపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐస్రో), భారత వాయుసేన, విమానాశ్రయాలు, వివిధ బ్యాంకులు ఎన్పీఎల్ రూపొందించిన ఐఎస్టీనే ఉపయోగిస్తున్నాయి. అయితే లీగల్ మెట్రోలజీ చట్టాన్ని సవరించి అందులో ఐఎస్టీని చేర్చడానికి ముందే ఆ ప్రామాణిక సమయాన్ని పాటించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. టైమ్ తీరుతెన్నులు ఇలా ! ఢిల్లీలోని ఎన్పీఎల్ వద్ద కచ్చితమైన సమయ నిర్ధారణకు అయిదు క్లాక్ జనరేషన్ మాడ్యూల్ (సీజియమ్) గడియారాలు, ఓ హైడ్రోజన్ మాస్టర్క్లాక్ ఉన్నాయి. సంప్రదాయ గడియారాలు క్వాడ్జ్ క్రిస్టల్ కంపనాలపై పనిచేస్తుండగా, అందుకు భిన్నంగా ఆటమిక్ గడియారం సీజియం అణు శక్తిని ఉపయోగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 400కుపైగా సీజియమ్ గడియారాలున్నాయి. అందులో ఐదు భారత్‌లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ సంస్థ వివిధదేశాల్లోని ఈ గడియారాలను సమన్వయం చేసి, ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకన్ ఒకే విధంగా మొదలయ్యేలా చూస్తుంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా హరితహారం
సీజీఎం వెంకటేశ్వర్రావు గోదావరిఖని : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం రెండవ దశలో భాగంగా సింగరేణి సంస్థ రామగుండం ఏరియా–1 ఆధ్వర్యంలో ముస్త్యాల వెళ్లే రహదారి పక్కన మంగళవారం పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్జీ–1 సీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు విడుతలుగా మొక్కలను నాటామని, మంగళవారం 3 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 4,97,300 మొక్కలను ఆర్జీ–1 ఏరియాలో నాటామన్నారు. పర్యావరణ అధికారి అంబటి శ్రీనివాస్ పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పర్సనల్ డీజీఎం బి.హనుమంతరావు, మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్ నాగేశ్వర్రావు, సివిల్ డీజీఎం సూర్యనారాయణ, డీజీఎం సాయిరాం, పర్సనల్ మేనేజ ర్ ఎం.శ్రీనివాస్, సీఎంఓఏఐ ప్రధాన కార్యదర్శి రమేశ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెప్యూటీ మేనేజర్ కర్ణానాయక్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు సారంగపాణి, ఆరెళ్లి పోచం, యాదగిరి సత్తయ్య, ఖయ్యూం, సుందిళ్ల సర్పంచ్ రుద్రబట్ల సునీతరఘు, ముస్త్యాల సర్పంచ్ సుంకరి మాధవి, సింగరేణి పాఠశాల, గాంధీ జూనియర్ కళాశాల, సెయింట్ పాల్స్ స్కూల్ విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, రోవర్స్, పోలీస్ శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు. -
కేంద్ర రుణాల్లో రాష్ట్రం కోత!
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్నట్టు ఉంది రాష్ర్ట ప్రభుత్వ వ్యవహారం... రైతులకు వ్యవసాయ రుణాల కింద రూ.38 వేల కోట్లు ఇస్తామంటూ కేంద్రం ప్రకటిస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏడు వేల కోట్లు తక్కువగా రూ.30,995 వేల కోట్లతో వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేసింది. పైగా ఇది గతేడాది కంటే రూ.3,771 కోట్లు ఎక్కువంటూ గొప్పలకు పోయింది. కేంద్ర అధికారుల చీవాట్ల తో చివరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ. 30,995 కోట్లు కేటాయిస్తూ మంగళవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సమావేశం లో నిర్ణయించారు. దానిని ప్రభుత్వం కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన వ్యవసాయ రుణలక్ష్యాల్లో తెలంగాణకు రూ.38 వేల కోట్లుగా పేర్కొంది. ఇది రాష్ర్టం నిర్దేశించుకున్న వ్యవసాయ రుణప్రణాళికకు రూ.7వేల కోట్లు తక్కువ. దీనిపై కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. నాబార్డు సూచనలు తుంగలో తొక్కిన కలెక్టర్లు... ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయ పంట, టర్మ్, అనుబంధ రంగాల రుణాలు ఏ మేరకు ఉండాలనే దానిపై నాబార్డు కొన్ని ప్రతిపాదనలు తయారుచేస్తుంది. ఆ ప్రకారం ఈ ఏడాది కూడా జిల్లాల వారీగా ప్రతిపాదనలు తయారుచేసి కలెక్టర్లకు పంపింది. నాబార్డు ఇచ్చిన ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ సమావేశాలు నిర్వహించింది. బ్యాంకర్లు, వ్యవసాయఅధికారులతో కూడిన కమిటీ ఆయా జిల్లాలకు ఎంత రుణం అవసరమో నివేదిక తయారుచేసి ఎస్ఎల్బీసీకి పం పించింది. విచిత్రమేంటంటే నాబార్డు రూ. 35,179 కోట్లు అవసరమని అంచనా వేస్తూ ప్రతి పాదనలు పంపిస్తే రూ. 30,995 కోట్లు మాత్రమే అవసరమని కలెక్టర్లు నివేదికలు పంపించారు. దీనిపై నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో దీనిపై వాడీవేడి చర్చ జరి గినట్లు తెలిసింది. నాబార్డు అధికారులు చెప్పేవరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. నాబార్డు విమర్శల నేపథ్యంలో తాజాగా ప్రకటించిన వ్యవసాయ రుణప్రణాళికను సవరించే యోచనలో సర్కారు ఉంది. మళ్లీ జిల్లాల నుంచి సవరింపుతో రుణ ప్రణాళిక నివేదిక తెప్పించుకొని రూ. 38 వేల కోట్లతో రుణప్రణాళికను తయారు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.