Chamundeshwari
-
చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్, రాహుల్ ద్రావిడ్ (ఫొటోలు)
-
Mysuru Dasara 2022: పండుగలు ఐక్యతకు ప్రతీకలు
మైసూరు: మైసూరు ఉత్సవాలు దేశ ఘన సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దసరా వంటి పండుగలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పారు. ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను సోమవారం ఆమె ప్రారంభించారు. చాముండి కొండపై మైసూరు రాచవంశీకుల ఆరాధ్యదైవం చాముండేశ్వరి విగ్రహంపై పూలు చల్లుతూ వేద మంత్రోచ్ఛరణల మధ్య ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో విశేష పూజలు చేశారు. ఇటీవలి కాలంలో మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్మునే. మైసూరు పట్టుచీరలో రాష్ట్రపతి ఈ సందర్భంగా రాష్ట్రపతి మైసూరులో తయారైన తెలుపు రంగు బంగారు జరీ గీతల అంచుతో కూడిన పట్టుచీరను ధరించారు. ఆమె కోసం దీన్ని ప్రత్యేకంగా నేయించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక బుడకట్టు గిరిజన కళాకారుల నృత్యాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. విద్యుత్‌కాంతులతో మైసూరు కరోనా నేపథ్యంలో మైసూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు రెండేళ్లు సాదాసీదాగా జరిగాయి. ఈ నేపథ్యంలో జానపద కళా రూపాలతో కర్ణాటక సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈసారి 9 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు ప్యాలెస్, వీధులు, భవనాలు, కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించింది. మైసూరులోని ప్రముఖ్య రాజప్రాసాదాలైన అంబా విలాస్ ప్యాలెస్, జగన్మోహన్ ప్యాలెస్ వంటి 8 చోట్ల 290 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. -
రెండు చోట్లా సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సీఎం సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గంతోపాటు బాగల్కోట్ జిల్లాలోని బాదామీ స్థానంలో సిద్దరామయ్యతో పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. బాదామీ స్థానానికి ఇప్పటికే తమ అభ్యర్థిగా దేవరాజ్ పాటిల్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. సిద్దరామయ్యకు రెండో సీటు కేటాయించాలా వద్దా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో దేవరాజ్‌కు ఇప్పటివరకు బీ–ఫామ్ ఇవ్వలేదు. బాదామీ నుంచీ సిద్దరామయ్య పోటీకి అధిష్టానం పచ్చజెండా ఊపడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారని సీఎం కార్యాలయం వెల్లడించింది. చాముండేశ్వరి స్థానానికి సిద్దు ఇప్పటికే నామినేషన్ వేయడం విదితమే. కర్ణాటకలో పెద్ద నోట్ల వరద న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నగదు కొరత పట్టిపీడిస్తుంటే.. కర్ణాటకలో మాత్రం నోట్ల వరద పారుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంలు క్యాష్ లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక ఇందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆ రాష్ట్రంలో పలు చోట్ల సోదాలు చేపట్టగా రూ.4.13 కోట్ల నగదు పట్టుబడింది. ఇందులో 97 శాతం రూ.2000, రూ.500 నోట్లే ఉన్నాయి. ఈ మేరకు ఐటీ అధికారులు వెల్లడించారు. ‘ఇటీవల కర్ణాటకలో చేపట్టిన సోదాల్లో రూ.4.13 కోట్ల నగదు, రూ.1.32 కోట్ల విలువైన 4.52 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ నగదు మొత్తంలో రూ.2000, రూ.500 నోట్లే రూ.4.03 కోట్లు ఉన్నాయి’ అని ఐటీశాఖ తెలిపింది. మార్చి 27న కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన సోదాల్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. -
రెండో సీటూ కావాలి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరి స్థానం నుంచే పోటీ చేస్తారా? లేక ఉత్తర కర్ణాటకలోని బాదామీ నుంచి కూడా పోటీ చేయనున్నారా? ఈ విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని భావించినా సీనియర్ నాయకులు ఖర్గే, మొయిలీల ఒత్తిడితో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను చాముండేశ్వరి స్థానానికే పరిమితం చేసింది. బాదామీలో దేవరాజ్ పాటిల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై తన అసంతృప్తిని ఇప్పటివరకు సిద్దరామయ్య బహిరంగంగా వెల్లడించలేదు కానీ.. బాదామీ నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని వివిధ వేదికలపై వ్యక్తపరిచారు. బాదామీ నియోజకవర్గ నేతలు తనను పోటీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు. అధిష్టానంతో చర్చలు రాహుల్ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ మొదట్నుంచీ రెండో స్థానంలో పోటీని తోసిపుచ్చింది. అయినా, బీసీల చాంపియన్‌గా పేరున్న సిద్దరామయ్యను నిరాశకు గురిచేస్తే ఫలితాలు వేరోలా ఉంటాయనే అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అందుకే పాటిల్‌కు ఇంతవరకు బీ–ఫామ్ ఇవ్వలేదు. అటు, సీఎం రెండో సీటు కోసం అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏడుసార్లు చాముండేశ్వరి నుంచి పోటీ చేసిన సీఎం ఐదుసార్లు గెలిచారు. ఈ సారి చాముండేశ్వరి నుంచి గెలవటం సులభం కాదనే అభిప్రాయంలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. -
సిద్ధారామయ్య ఓడిపోతారా..?
సాక్షి, బెంగుళూరు : సొంత పట్టణం మైసూరులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఐదు రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా సిద్ధారామయ్య 2018 ఎన్నికల్లో తాను పోటీ చేయనున్న చాముండేశ్వరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో రామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. అధికారంలోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసిందని ప్రజలు సిద్ధారామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ తప్పని రామయ్య వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాల్సింది ప్రభుత్వమేనని వారంతా మండిపడ్డారు. ఈ ఘటనపై మాట్లాడిన కొందరు కాంగ్రెస్ నేతలు చాముండేశ్వరి నుంచి సిద్ధారామయ్య పోటీ చేయడం రిస్కేనని అభిప్రాయపడ్డారు. తనయుడిని సులువుగా గెలిపించుకునేందుకు సిద్ధా ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సిద్ధారామయ్య గత ఎన్నికల్లో పోటీ చేసిన వరుణ నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు డా. యతీంద్ర బరిలోకి దిగుతున్నారు. 1983 నుంచి 2008ల మధ్య చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి సిద్ధారామయ్య ఐదు సార్లు(స్వతంత్ర అభ్యర్థిగా, జనతా పార్టీ తరఫున, జనతా దళ్ తరఫున, జేడీఎస్ తరఫున, కాంగ్రెస్ తరఫున) గెలుపొందారు. నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణ అనంతరం వ్యూహాత్మంగా ఆలోచించి రెండు సార్లు కాంగ్రెస్ తరుఫున వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మళ్లీ చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో, ఒకప్పటి తన శిష్యుడు సిద్ధారామయ్య ఓటమికి హెచ్డీ దేవెగౌడ వ్యూహాలు రచిస్తున్నారు. కాగా, ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి అంతగా పట్టు లేదు. దీంతో రామయ్యపై పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీఎస్‌లు ఏకమై ముఖ్యమంత్రిని ఓడించాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇవే తనకు ఆఖరి ఎన్నికలని, ఈసారి కూడా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను సిద్ధారామయ్య కోరుతున్నారు. -
అక్కడి నుంచే ఆఖరి పోటీ: ముఖ్యమంత్రి
బెంగళూరు: వచ్చే శాసనసభ ఎన్నికలే తన చివరి ఎన్నికలని, తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిన నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శనివారం మైసూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. తనను చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నియోజకవర్గం ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని, అదే విధంగా వరుణ నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని అక్కడి వారు కోరుతున్నారని, ఈ రెండు నియోజకవర్గాలు తనకు ఎంతో ఇష్టమని సిద్ధరామయ్య అన్నారు. రాజకీయంగా తనకు పునర్ జన్మనిచ్చిన చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో చివరిసారి అక్కడి నుంచి పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్టానం పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటానన్నారు. ఎన్నికల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలని, గెలుపోటములు వారి చేతుల్లో ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామిలను ప్రజలు నమ్మరని, వారి కుట్రలు ఫలించవని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. నివేదిక వచ్చాకే చర్యలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాకే చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో ముంగారు వర్షాల ఛాయలే లేవని, దీంతో జలాశయాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సిద్ధు చెప్పారు. ఇక ఇక దక్షిణ కన్నడ జిల్లా ప్రశాంతంగా ఉందని, మీడియా, రాజకీయ పార్టీలు సంయమనంతో ఉండాలని, లేని పోనివి ప్రచారం చేయరాదన్నారు. బీజేపీ నాయకులే హిందువులు కాదని, తాను కూడా హిందువేనని వ్యాఖ్యానించారు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి
విజయవాడ, న్యూస్‌లైన్ : కృష్ణలంకలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె చనిపోయిన తీరును బట్టి హత్యకు గురైందా? లేక ఆత్మహత్య చేసుకుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పండుగ రోజు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కృష్ణలంక భూపేష్గుప్తా నగర్‌కు చెందిన అప్పికట్ల చాముండేశ్వరి(19) పటమటలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి రాంబాబు లారీ డ్రైవర్. గురువారం మహాశివరాత్రి కావడంతో ఆమె తల్లి అనూరాధ, అన్న లోకేష్ బంధువులతో కలిసి ఉదయం కృష్ణానదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. శుక్రవారం పరీక్ష ఉందని చెప్పి చాముండేశ్వరి వారి వెంట వెళ్లలేదు. లోకేష్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉంది. ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం వస్తుండటంతో తాళం పగులగొట్టి లోనికి వెళ్లాడు. చాముండేశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. కిందకు దింపి, అప్పటికే చనిపోయినట్లు గుర్తించాడు. కుటుంబసభ్యులతో కలిసి ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు. ఏసీపీ కె.లావణ్యలక్ష్మి, కృష్ణలంక సీఐ షేక్ అహ్మద్ అలీ, ఎస్సై జి.శ్రీనివాస్ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. హత్యా ? ఆత్మహత్యా..? చాముండేశ్వరి మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె రెండు చేతులు కట్టేసి ఉన్నాయి. చున్నీ పక్కనే ఉన్న మంచానికి కట్టి ఉంది. కాళ్లు నేలకు ఆని ఉన్నాయి. ఉరి బిగించి ఉండటంతో ఎవరైనా లైంగికదాడికి పాల్పడి హత్య చేసి, ఉరివేసి, ఇంటికి తాళం వేచివెళ్లారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకుంటానన్న భయంతో ముందుగానే చేతులను కట్టేసుకుని ప్రాణం తీసుకుందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి తాళం వేసుకుని లోపలకు వెళ్లి గడియ పెట్టుకుని ఆత్మహత్య చేసుకుందన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. మృతురాలి సెల్‌ఫోన్ కాల్‌డేటాను సేకరిస్తున్నారు. మధ్య గదిలో పుస్తకాలు శుక్రవారం పరీక్ష ఉందని చెప్పిన చాముండేశ్వరి మధ్య గదిలో చదవటానికి పుస్తకాలు పెట్టుకుంది. పక్కన ఉన్న మరో గదిలో చనిపోయింది. తమకు ఎవరితో వివాదాలు లేవని మృతురాలి తల్లి అనురాధ కన్నీటిపర్యంత మవుతూ పోలీసులకు చెప్పింది.