Citi Open ATP tennis tournament
-
ఔబోపన్న జంట ఓటమి
వాషింగ్టన్: సిటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 3-6, 4-6తో టాప్ సీడ్ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ ప్రత్యర్థి జంట సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
సెమీస్‌లో బోపన్న జంట
వాషింగ్టన్: సిటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న-మెర్జియాలతో తలపడాల్సిన మార్డీ ఫిష్ (అమెరికా)-గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) జోడీ బరిలోకి దిగకుండా ‘వాకోవర్’ ఇచ్చింది. బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా), ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)-స్కాట్ లిప్స్కీ (అమెరికా) జోడీల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీస్‌లో బోపన్న ద్వయం ఆడుతుంది.