City Services
-
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్లలో సీటు బెల్టులు వాడుతుంటారు. కానీ, తొలిసారి నగరంలో సీట్ బెల్టులుండే సిటీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. విదేశాల్లో బస్సుల్లో కూడా సీటు బెల్టులు తప్పని సరి. వాస్తవానికి మన దగ్గర కూడా బస్సుల్లోనూ సీటు బెల్టులుండాలనే నిబంధ న ఉన్నా అది అమలుకావటం లేదు. తొలిసా రి ఆర్టీసీ సిటీ సర్విసుల్లో ఆ తరహా సీట్లను అందుబాటులోకి తెస్తోంది. నగరంలో మరో నెలన్నరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఇవి కనిపించనున్నాయి. ఆ బస్సులు ఎలా ఉండనున్నాయో అధికారులు పరిశీలించేందుకు వీలుగా నమూనా బస్సును సోమవారం బస్‌భవన్‌కు తీసుకురాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ మార్గాల్లో తిరిగేందుకు వీలుగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిప్పాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పుష్పక్ పేరుతో 40 ఎలక్ట్రిక్ బస్సులు విమానాశ్రయం మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అవన్నీ లాభాల్లో ఉండటం, రద్దీకి చాలినన్ని లేకపోవటంతో అదనంగా మరిన్ని బస్సులు తిప్పాలని నిర్ణయించారు. దానితోపాటు ఐటీ కారిడార్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులో లేని రూట్లలో కొన్ని తిప్పనున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ మార్గంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే ఆధునిక వసతులు అదనంగా ఉన్న ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతిని అందించనున్నాయి. 500 బస్సులకు ఆర్డర్ 500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించిన ఆరీ్టసీ, ఇప్పటికే ఆర్డర్ ఇచి్చన విషయం తెలిసిందే. సిటీ బస్సులుగా తిప్పే సర్విసులకు సంబంధించి తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 శంషాబాద్ విమానాశ్రయానికి, 30 ఐటీ కారిడార్‌లో తిరుగుతాయి. ఇందులో 25 బస్సులు నెలనెలన్నరలో రోడ్డెక్కుతాయని అధికారులు అంటున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్దతిలో వీటిని ఆర్టీసీ అద్దెకు తీసుకుంటోంది. ఇవి కాకుండా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా సమకూర్చుకోవాలనేది ఆర్టీసీ ఆలోచన. వాటికి ఇంకా టెండర్లు పిలవలేదు. ఆకుపచ్చ, తెలుపు రంగుతో.. ఆకుపచ్చ, తెలుపు రంగుతో ఈ బస్సులుంటాయి. రంగుల మేళవింపుపై ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సు ముందువైపు ఆర్టీసీ లోగో లేకపోవటాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రయాణికులకు కనిపించేలా లోగో ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని సీట్లకే బెల్టులుండటంతో, అన్ని సీట్లకు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఓఓ రవీందర్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు వేణుగోపాలరావు, ఆనంద్, యతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 12 మీటర్ల పొడవు.. ఇప్పుడు కొత్తగా సమకూరే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఒక్కో బస్సులో 35 సీట్లుంటాయి.ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో మూడు సీసీ టీవీ కెమెరాలు అమర్చి ఉంటాయి. అవి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్‌తో ఉంటాయి. రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు వెనక భాగం కనిపించేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. ప్రయాణికులకు సూచనలు అందజేసేందుకు వీలుగా బస్సులో నాలుగు ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులుంటాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జి అయితే 225 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్ చార్జింగ్కు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. -
పల్లె వెలుగులు .. పట్నం బాట
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు పల్లెవెలుగులుగా గ్రామీణ ప్రాంతాలకు తిరిగిన బస్సులు కొన్ని సిటీ సర్వీసులుగా మారనున్నాయి. ఈ మేరకు పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం చాలా ఊళ్లకు పల్లెవెలుగు బస్సులు తిరగటం లేదు. తక్కువ ఆక్యుపెన్సీ రేషియో ఉండటం, రోడ్లు బాగాలేకపోవటం తదితర కారణాలతో కొన్ని ఊళ్లకు బస్సులను ఆపేసిన విషయం తెలిసిందే. మరోవైపు అద్దె బస్సుల సంఖ్య కూడా పెరగటంతో కొన్ని పల్లెవెలుగు బస్సులు వృథాగా ఉన్నాయి. అయితే వాటిని సిటీ బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మియాపూర్‌లోని బస్‌బాడీ వర్క్‌షాపులో పల్లెవెలుగు బస్సులను సిటీ బస్సులుగా మారుస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 350 బస్సులను ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు. నగరంలో కొరత రానుండటంతో.. హైదరాబాద్‌లో తిరుగుతున్న సిటీబస్సుల్లో చాలావరకు పాతబడిపోయాయి. మరోవైపు ఇప్పట్లో కొత్త బస్సులు కొనే వీలు లేకుండా పోయింది. ఉన్న బస్సులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్క్రాప్ (తుక్కు)పాలసీ ప్రకారం 15 ఏళ్లు పూర్తయిన బస్సుల్ని తిప్పేందుకు వీలులేదు. ఈ కారణంగా వచ్చే మార్చి నాటికి నగరంలో దాదాపు 600 బస్సులను తొలగించాల్సి ఉంది. మరోవైపు రెండేళ్ల క్రితం సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వ ఆదేశం మేరకు దాదాపు 800 బస్సులను తగ్గించారు. వాటిల్లో ఎక్కువ శాతం బస్సులను ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా (కార్గో) బస్సులుగా మార్చేశారు. ఇలా కొన్ని కార్గో సర్వీసులుగా మారిపోవడం, 600 బస్సుల గడువు తీరిపోనుండటంతో నగరంలో బస్సులకు తీవ్రమైన కొరత ఏర్పడనుంది. దీంతో పల్లెవెలుగు బస్సులను సిటీ సర్వీసులుగా మార్చి నగర ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. అద్దెబస్సుల రాకతో మిగులు సమ్మె సమయంలో ఆర్టీసీ కొత్తగా 1,300 అద్దె బస్సులను తీసుకుంది. వీటిల్లో ఎక్కువ బస్సులను పల్లెవెలుగు సర్వీసులుగానే చేర్చుకుంది. దీంతో చాలా డిపోల్లో సొంత పల్లెవెలుగు బస్సులు మిగిలిపోయాయి. వాటిని అప్పట్లో కార్గోకు బదిలీ చేయాలని భావించారు. కానీ కార్గో విభాగం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో అన్ని బస్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని తర్వాత తేల్చారు. దీంతో మిగిలిపోయిన బస్సులన్నీ డిపోల్లో వృథాగా ఉన్నాయి. అలాగే వేరే ఇతర కారణాలతో నిలిపివేసిన బస్సులు కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సిటీ బస్సులుగా మారుస్తున్నారు. సీట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయటంతో పాటు, నిర్మాణంలో తేడా ఉన్న వాటిని పూర్తిస్థాయిలో సరిచేసి రంగులేసి కొత్త బస్సుల తరహాలో సిద్ధం చేస్తున్నారు. పూర్తయిన వాటిని డిపోలకు అప్పగిస్తున్నారు. -
పుష్కరాలకు సిటీ సర్వీసులు
పెనమలూరు : ఆర్టీసీ అధికారుల నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు కష్టాలు మిగిల్చింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా యాత్రికుల సౌకర్యార్థం ఘాట్లకు ఉచితంగా బస్సులను నడపాలని నిర్ణయించారు. కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన శాటిలైట్ స్టేషన్‌కు బస్సులను పెద్దసంఖ్యలో తరలించారు. ఉదయాన్నే వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు సిటీ బస్సులు గ్రామాల్లోకి రాక పోవటంతో బస్సులు వస్తాయో రావో తెలియక గందరగోళానికి గురయ్యారు. బందరు రోడ్డుపై సిటీ బస్సులు కొన్ని సర్వీసులే తిరగటంతో చాలా సమయం ప్రజలు బస్టాపుల వద్ద సిటీ బస్సుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. గ్రామాలకు రావాల్సిన సిటీ బస్సులు తిరిగి వెంటనే తిప్పాలని ప్రజలు కోరుతున్నారు. పెనమలూరు గ్రామం వరకైనా సిటీ బస్సులు ఎక్కువగా తిప్పాలని ప్రజలు తెలిపారు. ఖాళీగా తిరిగిన బస్సులు పుష్కరాలకు తొలిరోజు యాత్రికులు తక్కువగా హాజరయ్యారు. ఉచిత బస్సులు యాత్రికులు లేక ఖాళీగా తిరిగాయి. కొన్ని బస్సులను శాటిలైట్ బస్‌స్టేçÙన్లోనే ఉంచారు. గ్రామాలకు వెళ్లాల్సిన సిటీ బస్సులు ఇలా నిరుపయోగంగా శాటిలైట్ బస్‌స్టేçÙన్లో ఉంచటం వలన అందరికి ఇబ్బందులు తలెత్తాయి. యాత్రికులు లేని సర్వీసులు ఉయ్యూరు : పుష్కరాల తొలి రోజు యాత్రికుల రద్దీ కనిపించలేదు. ఉయ్యూరు ఆర్టీసీ డిపో నుంచి తోట్లవల్లూరు మండలంలోని తోట్లవల్లూరు, ఐలూరు పుష్కర ఘాట్లకు ప్రత్యేకంగా ఉచిత సర్వీసులను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సర్వీసులు నడిపారు. ఏ సర్వీసులోనూ పట్టుమని పది మంది కూడా కనిపించలేదు. వరలక్ష్మీ శుక్రవారం కావటం, ఆయా ఘాట్లలో నీరు లేకపోవడంతో యాత్రికులు ఆసక్తి కనబర్చలేదు. -
రైట్.. రైట్
ఒంగోలు: నగరంలో సిటీ సర్వీసులు తిప్పేందుకు ఆర్టీసీ ఎట్టకేలకు నడుం బిగించింది. నెల్లూరు నుంచి మూడు సర్వీసులు, నిలిపేసిన రెండు సూపర్ లగ్జరీ సర్వీసులను ఆధునికీకరించి ఈనెల 26న సిటీ సర్వీసులుగా నడపాలని తొలుత నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం నగరంలో పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్, ఆర్అండ్బీ, రవాణా శాఖ అధికారులతో కలిసి ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా రూట్‌సర్వే నిర్వహించారు. సర్వే వివరాలు పరిశీలించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు పలు మార్పులు సూచించారు. సిటీ సర్వీసులను ఈనెల 26వ తేదీ కాకుండా అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం ప్రారంభించేందుకు మంత్రి ఆమోదం తెలిపారు. ఆర్ఎం ఏమంటున్నారంటే... ఈ సర్వేపై ఆర్టీసీ ఆర్ఎం వీ.నాగశివుడు తన చాంబరులో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆదేశాలమేరకు 5 మార్గాల్లో సిటీ సర్వీసులను అక్టోబరు 3వ తేదీ సాయంత్రం నుంచి నడపనున్నామన్నారు. త్వరలోనే జేఎన్ఎన్యుఆర్ఎం బస్సులు వస్తే మరిన్ని సర్వీసులను సిటీ బస్సులుగా తిప్పుతామన్నారు. ముందస్తుగా నగర ప్రజలకు సిటీ సర్వీసులను అలవాటు చేసేందుకు 5 మార్గాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. సిటీ సర్వీసులకు సంబంధించి మొదటి రెండు కిలోమీటర్ల వరకు ఒక స్టేజీగా పరిగణిస్తారు. ఇందుకు కనీస చార్జీ రూ.6 ఉంటుంది. అక్కడ నుంచి స్టేజీకి రూపాయి చొప్పున పెరుగుతుంది. సిటీ సర్వీసు చార్జీకి, పల్లెవెలుగు చార్జీకి వ్యత్యాసం ఉన్నమాట నిజమేనని ఆర్ఎం అన్నారు. ప్రస్తుతం ఉన్న స్టూడెంట్ పాసులు ఈ సిటీ సర్వీసుల్లో ప్రయాణించడానికి చెల్లవన్నారు. సిటీ సర్వీసులకు సంబంధించి ప్రత్యేక పాసులు త్వరలోనే వస్తాయని చెప్పారు. స్టూడెంట్స్ సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు.