cm sidda ramaiah
-
సభలో మోదీ మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో శుక్రవారం ప్రధాని మోదీ, సీఎం సిద్ధరామయ్య పాల్గొన్న ఒక కార్యక్రమంలో సభికులంతా ఒక్కసారిగా మోదీ మోదీ అని నినాదాలు చేశారు. దీంతో సిద్ధరామయ్య వైపు తిరిగిన మోదీ ‘ముఖ్యమంత్రీ జీ అయిసా హోతా రెహతా’ హే(ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి)అని సర్ది చెప్పారు. దీనికి సిద్ధరామయ్య కాస్త అసౌకర్యంగా నవ్వారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. దేశంలో ప్రధాని మోదీని, ఆయన విధానాలను గట్టిగా విమర్శించే నేతల్లో సిద్ధరామయ్య ఒకరు కావడం గమనార్హం. బోయింగ్ గ్లోబల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ క్యాంపస్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బెంగళూరు విచ్చేశారు. అనంతరం అక్కడ సభనుద్దేశించి ప్రధాని మాట్లాడుతుండగా సభలో ఒక్కసారిగా మోదీ మోదీ నినాదాలు మార్మోగాయి. #WATCH | "Mukhyamantri ji aisa hota rehta hai," says PM Narendra Modi to Karnataka CM Siddaramaiah as people chant 'Modi-Modi' during the inauguration event of the new Boeing India Engineering & Technology Center campus in Bengaluru. pic.twitter.com/hrzWIUAyIJ — ANI (@ANI) January 19, 2024 ఇదీచదవండి.. బాల్యాన్ని గుర్తుచేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగం -
కర్ణాటక కాంగ్రెస్ తొలి జాబితా ఆలస్యం
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల కారణంగా అభ్యర్ధుల తొలి జాబితా ఆలస్యం కానుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం 180 మంది అభ్యర్ధులతో తొలి జాబితా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ రెండు సార్లు సమావేశమైనప్పటికీ అభ్యర్ధుల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదనీ, శనివారం మరోసారి సమావేశం కానున్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. పార్టీ సీనియర్ నేతలంతా ఎవరికి వారు తమ సొంత జాబితా తయారు చేసుకుని రావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన జేడీ(ఎస్), బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటంపై కొందరు నేతలు అభ్యంతరం చెబుతున్నట్లు సమాచారం. సీఎం సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర, కొందరు సీనియర్ మంత్రుల కుటుంబీకులకు టికెట్లు ఇవ్వటంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలి
మైసూరు: కన్నడ భాష, నేల, నీటి విషయాల్లో పార్టీలకు అతీతంగా పోరడడానికి తాము ఎల్లపుడూ సిద్ధంగానే ఉన్నామని నదీ జలాల పంపిణీ వివాదంలో తమపై విమర్శలు చేసేటపుడు సీఎం సిద్దరామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. నీటి వివాదాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చోద్యం చూస్తుండిపోయామంటూ సీఎం సిద్దరామయ్య తమపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలన్నారు. కావేని నదీ జలాల పంపిణీ విషయంలో సీఎం సిద్దరామయ్య కోరిన ప్రతీసారీ రాష్ట్రం తరపున ఉద్యమాల్లో పాల్గొన్నామన్నారు. తాజాగా జరుగుతున్న మహదాయి నదీ జలాల పంపిణీ వివాదంపై కూడా పార్టీలకు అతీతంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం సిద్దరామయ్య కోరితే మహదాయిపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించడానికి అపాయింట్మెంట్ ఇప్పిస్తామన్నారు. తమపై విమర్శలు చేసే సమయంలో సీఎం సిద్దరామయ్య స్థితప్రగ్ఞతో వ్యవహరించాలని ఇప్పటికైనా ఇటువంటి దిగజారుడు విమర్శలు, ఆరోపణలు మానేసి నదీ జలాల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.తమపై విమర్శలు చేసే ముందు తాము కృష్ణ నది జలాలపై కేంద్రప్రభుత్వంతో చర్చించి రాష్ట్రానికి అనుకూలంగా పథకాలు సాధించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇక గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో హాసన్ రైల్వేస్టేషన్ గురించి చర్చించడానికి మాత్రమే సమావేశమయ్యామని సమావేశంలో రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీరంగపట్టణం, మళవళ్లి, శ్రీరంగంలలో ఉన్న ఆదిరంగ, మధ్య రంగ, అంత్యరంగ దేవాలయాల్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
మళ్లీ చిక్కుల్లో సిద్ధు ..
ఒంటెత్తు పోకడలపై సహచరుల ఆగ్రహం మొన్న వాచీ వివాదం... నేడు ఏసీబీ శాఖ ఏర్పాటుపై అధిష్టానం గరం గరం వివరణ కోరిన వైనం బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్యది ప్రత్యేక స్థానం. ఆయన ముక్కుసూటి మనస్తత్వమే ఆయనను వివాదాల్లోకి లాగుతోంది. జేడీఎస్‌లో కుటుంబ పెత్తనాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చేసిన సిద్ధుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సిద్దు ఒంటెత్తు పోకడలు సహచరులకు మింగుడుపడటం లేదు. తొలిసారిగా రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరెప్షన్ బ్యూరో) శాఖను ఏర్పాటు చేసి అధిష్టానం ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. దీనిపై అధిష్టానం వివరణ కూడా కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి కేసుల దర్యాప్తు కోసం లోకాయుక్త ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా గుర్తింపు ఉంది. అయినా కూడా సిద్ధు అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం అధిష్టానానికి ఆగ్రహం కల్గిస్తోంది. ఏసీబీని ఏర్పాటు చేయడం ఆ శాఖకు ఐపీఎస్ అధికారులను కూడా నియమించడం తెల్సిందే. అయితే ఈ శాఖను నిర్వీర్యం చేయడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని విపక్షాలతో పాటు న్యాయనిపుణులు కూడా పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏసీబీ విషయమై కాంగ్రెస్ పార్టీ వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట మాత్రమైనా చర్చించలేదని ఆ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏసీబీ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయని, ఇదే విషయాన్ని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా సిద్ధరామయ్య బడ్జెట్ రూపకల్పన సమయంలో కూడా పార్టీ సీనియర్ నేతలను సంప్రదించలేదని వారు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.ఎం కృష్ణ ‘బడ్జెట్ రూపకల్పనకు ముందు సీఎం సిద్ధు నన్ను సంప్రదించలేదు. ఇది సరికాదు. అడిగి ఉంటే సలహాలు ఇచ్చేవాడిని’ అని బహిరంగంగా ఆక్రోశించిన విషయం ఇక్కడ గమనార్హం. ఇలా అన్ని విషయాల్లోనూ సిద్ధరామయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన నేతలు వాపోయారు. దీంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ విషయమై సీఎం సిద్ధును వివరణ కోరినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. అసలే వాచ్ వివాదం విషయంలో హైకమాండ్ ఆగ్రహానికి గురైన సిద్దుకు ఏసీబీ ఏర్పాటుతో తనకు తానుగా చిక్కుల్లో పడినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
కేంద్రంతో ఘర్షణ మంచిది కాదు
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రహ్లాద్ జోషి సూచన సాక్షి, బెంగళూరు : కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగడం సరికాదని, కేంద్రంతో సౌహార్దయుతమైన వాతావరణాన్ని నిర్మించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి సూచించారు. కొంతమంది రాష్ట్రమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రతిరోజు విమర్శించడాన్నే పనిగా పెట్టుకున్నారని, ఇది సరైన పరిణామం కాదని అన్నారు. శుక్రవారమిక్కడి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీపై అత్యంత ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇందుకు గాను ఎన్నికల కమిషన్ చీవాట్లు పెట్టినా... ఇప్పటికీ అదే మనస్థితిలో సిద్ధరామయ్య ఉండడం బాధాకరమని అన్నారు. గతంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రులుగా ఉన్న జె.హెచ్.పటేల్, ఎస్.ఎం.కృష్ణలు కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించారని, ఈ విషయాన్ని సిద్ధరామయ్య గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అత్యవసర అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు గాను తక్షణమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి, నాయకుల అభిప్రాయాలను తీసుకొని తేదీని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న కరువు పరిహార చర్యలకు సంబంధించి ఈ సమావేశాల్లో ముఖ్యంగా చర్చించాలని సిద్ధరామయ్యను కోరారు. -
‘ఆపరేషన్ కమల’
సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో రోజుకో వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిని తమ పార్టీలోకి చేర్చుకు నేందుకు గాను బీజేపీ నేతలు ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర శాఖకు చెందిన ఓ ప్రముఖ నేత కాంగ్రెస్ కార్పొరేటర్‌తో జరిపిన వ్యాఖ్యలంటూ శుక్రవారం బయటపడ్డ ఆడియోటేపుతో పాటు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలపై గుప్పించిన విమర్శలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కొనుగోలు చేయాలన్న బీజేపీ వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ ప్రతివ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లందరినీ నగరం నుంచి వేరే ప్రాంతానికి తరలించి, తమ కార్పొరేటర్లు ‘చే’జారి పోకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఇందుకు గాను బీజేపీ చూపిస్తున్న ఆశలకు తలొగ్గకుండా జాగ్రత్తగా ఉండాలంటూ పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే కార్పొరేటర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరినీ మేయర్ ఎన్నిక వరకు ఏదైనా పర్యాటక ప్రదేశానికి తరలించి రిసార్ట్ రాజకీయాన్ని ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, నగరానికి చెందిన ఓ మంత్రికి అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీపై విమర్శలు ఇక శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు రామలింగారెడ్డి,కృష్ణబేరేగౌడ, దినేష్ గుండూరావ్లు బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం బీజేపీ నేతలు కాంగ్రెస్ కార్పొరేటర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. గతంలో బీబీఎంపీలో అధికారంలో ఉన్న బీజేపీ అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడిందని, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటే గానీ వాటన్నింటిని కప్పిపుచ్చుకోలేమనే భావనతోనే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతోందని మంత్రులు విమర్శించారు. కాంగ్రెస్, జేడీఎస్‌ల మైత్రి ప్రజాస్వామ్యయుతమైనదేనని, ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని పేర్కొన్నారు. ఇక బీబీఎంపీ ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఎమ్మెల్సీ ఉగ్రప్ప పేరును న్యాయసమ్మతంగానే చేర్చామని, బీజేపీ నేతలు కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా ఈ తరహా వైఖరిని మార్చుకోవాలని సూచించారు. -
వేటు తప్పదా?
♦ బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ♦ ముఖ్యమంత్రికి పొంచి ఉన్న పదవీ గండం! ♦ ఇన్చార్జ్ మంత్రులతో సీఎం మంతనాలు సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పెద్ద తలనొప్పిగా తయారైంది. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీ గండం ఎదురుకానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య వైఖరిపై పార్టీలోని అనేక మంది సీనియర్ నేతల్లో తీవ్ర అసహనం నెలకొన్న విషయం తెలిసిందే. అనేక సందర్భాల్లో ఈ అసమ్మతి భగ్గుమంది కూడా! అయితే ఇప్పటి వరకు సిద్ధరామయ్యపై పరోక్ష విమర్శలకే పరిమితమైన అసంతృప్త వర్గం ఇప్పుడిక సిద్ధరామయ్యను ఆ పదవి నుంచే తప్పించే దిశగా ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే అందుకు సీఎం పనితీరే ముఖ్య కారణమని, కింది స్థాయి కార్యకర్తలను, పార్టీకోసం శ్రమించే వారిని కలుపుకొని పోవడంలో సిద్ధరామయ్య చూపిన నిర్లక్ష్యమే బీబీఎంపీ పట్టం నుంచి కాంగ్రెస్ పార్టీని దూరం చేశాయని హైకమాండ్‌కు నివేదిక అందించే దిశగా అసంతృప్త వర్గమంతా సన్నద్ధమవుతోంది. బీబీఎంపీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన సిద్ధరామయ్య స్వయంగా తానే ‘సిటీరౌండ్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు ఎన్నికల వేళ సిద్ధరామయ్య నగరమంతటా విస్తృత ప్రచారాన్ని సైతం నిర్వహించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, నగరానికి చెందిన మంత్రులు రామలింగారెడ్డి, దినేష్ గుండూరావ్, కృష్ణబేరేగౌడ, రోషన్‌బేగ్, కె.జె.జార్జ్‌లను బీబీఎంపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా కూడా నియమించారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా ఏర్పాటు చేశారు. ఇంత చేసినా బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణ బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం, టికెట్ల పంపకాల సమయంలో ఆ పార్టీలో చెలరేగిన అసమ్మతి వెరసి కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇన్చార్జ్ మంత్రులతో సమావేశమైన సీఎం! బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన అనంతరం బీబీఎంపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులు, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశమైనట్లు సమాచారం. మేనిఫెస్టో, విజన్ డాక్యుమెంట్ల పేరిట నగర వాసులపై హామీల వర్షం కురిపించినా నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతునివ్వలేదనే విషయాన్ని ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో దాదాపు 105 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌తో పాటు పార్టీ కూడా అంచనా వేసింది. అయితే ఆశించిన ఫలితం రాకపోవడానికి అనేక ప్రాంతాల్లో స్థానిక నేతల సహాయనిరాకరణే ప్రధాన కారణమని ఇన్చార్జ్ మంత్రులు సీఎం సిద్ధరామయ్యకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం సాధించకలేకపోతే కఠిన చర్యలు తప్పవని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే ఇన్చార్జ్ మంత్రులను హెచ్చరించిన నేపథ్యంలో, రానున్న మంత్రివర్గ విస్తరణలో ఈ మంత్రులకు కూడా పదవీగండం తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
అరాచకశక్తుల పట్ల అప్రమత్తత అవసరం
సీఎం సిద్దరామయ్య బెంగళూరు(బనశంకరి) : సమాజాన్ని చీల్చే అరాచకశక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మనవిచేశారు. రంజాన్ సందర్బంగా శనివారం ఉదయం చామరాజపేటెలోని ఈద్గా మైదానానికి వెళ్లి ముస్లింలతో కలిసి ప్రత్యేక పార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో నివసిస్తున్న అందరూ భారతీయులేనని మొదట దేశం అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అని అన్నారు. రంజాన్ ఉపవాసం మంచి ఉద్దేశం కలిగి ఉందని చెడ్డవారిని దూర ం చేసి అందరికీ మంచి చేయడం రంజాన్ సందేశమని తెలిపారు. హిందూ, ముస్లిం ఒకే తల్లి పిల్లలని అందరూ సోదర భావంతో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత తీసుకురావాలనే కారణంతో తమ ప్రభుత్వం అన్నభాగ్య పథకం అమలు చేసిందన్నారు. ఆకలిలేని కర్ణాటక తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్హర్షద్, నేత జీఏ బావా తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి ఉందని చూపిస్తే... రాసిచ్చేస్తా
- కుమారస్వామి ఆరోపణలపై మండిపడ్డ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : కెంగేరి ప్రాంతంలో తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి నిరూపించగలిగితే ఆయనకే రాసిచ్చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. కెంగేరి ప్రాంతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మైసూరులో ఆదివారం చేసిన ఆరోపణలపై సిద్ధరామయ్య పైవిధంగా స్పందించారు. సోమవారం బెంగళూరులోని విధానసౌధలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి ముందు సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి ఎంతమాత్రం తగదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇకమీదటైనా కాస్తంత బాధ్యతగా వ్యవహరించాలని కుమారస్వామికి సూచించారు. ఇక ఇదే సందర్భంలో సిం గిల్ డిజిట్ లాటరీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి అప్పగించిందని, అయినా ఇప్పటికీ ఈ వ్యవహారంపై కుమారస్వామి రాద్ధాం తం చేయడంలో ఏమాత్రం అర్థం లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. సీబీఐ విచారణ అనంతరం నిజానిజాలు వెల్లడవుతాయని, అప్పటి వరకు వేచి చూడాలని కుమారస్వామికి సూచించారు. -
వడ్డీలో రాయితీ
రాష్ర్టంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకే... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు అందజేసే రుణాలకు వడ్డీలో రాయితీని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమిళనాడులో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న రుణాలకు వడ్డీలో 4శాతం రాయితీని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. అదే విధంగా కర్ణాటకలోనూ అమలు చేయడంపై ఉన్న సాధకబాధకాలపై అధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు రూ.5కోట్ల వరకు రుణాలకు వడ్డీ రాయితీ అందజేస్తున్నామని, ఇదే విధంగా ఒబిసి వర్గానికి చెందిన వ్యాపార వేత్తలకు సైతం రుణాలను అందజేయాలని డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు గాను ఆయా ప్రాంతాల్లోని సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు ప్రధానితో అఖిలపక్షం భేటీ....... రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నిర్మించతలపెట్టిన మేకెదాటు జలాశయ నిర్మాణం, మాతృభాషా మాధ్యమంలో విద్యాబోధన తదితర అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు గాను నేడు(గురువారం) అఖిల పక్ష సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మేకెదాటు జలాశయ నిర్మాణం విషయంలో తమిళనాడు రాజకీయాలకు పాల్పడుతూ, జలాశయ నిర్మాణానికి అడ్డుపడుతోందని సిద్ధరామయ్య విమర్శించారు. అయితే తమిళనాడు ప్రభుత్వ వైఖరికి తామెంత మాత్రం భయపడబోమని తెలిపారు. న్యాయం కర్ణాటక వైపే ఉందని, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి సైతం వివరిస్తామని సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
సమ న్యాయం
బెంగళూరు : షెడ్యూలు కులాలు, తరగతుల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించిన మేరకే నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపినట్లు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చేసిన ఆరోపణలు సత్యదూరమని కొట్టిపారేశారు. పశుసంవర్ధకశాఖకు నూతనంగా కేటాయించిన సంచార పశు చికిత్స వాహనాలను క్యాంపు కార్యాలయంలో సీఎం మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని చట్టం చేసిన రాష్ట్రాల్లో కర్ణాటక రెండోదన్నారు. ఈ చట్టం వచ్చే ఆర్థిక ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. 2013-14 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం గత ప్రభుత్వం రూ.8,600 కోట్లు కేటాయించిందన్నారు. అయితే నూతన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.15,300 కోట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ నిధులు 80 శాతం ఎక్కువని వివరించారు. కాగా, ఈ మొత్తం నిధుల్లో ఎస్సీలకు 17.95 శాతం, ఎస్టీలకు 7.5 శాతం కేటాయిస్తామన్నారు. పశువైద్యుల నియామకం : మంత్రి జయచంద్ర లోక్‌సభ ఎన్నికల తర్వాత పశువైద్యుల నియామక ప్రక్రియను చేపడతామని కార్యక్రమంలో పాల్గొన్న పశుసంవర్ధకశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. శాఖలో 911 పోస్టులు ఖాళీ ఉన్నాయని, వీటిలో 250 స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దశల వారిగా మిగిలిన వాటిని భర్తీ చేస్తామని చెప్పారు. దాదాపు 200 పశు చికిత్స సంచార వాహనాలను పశుసంవర్ధక శాఖకు అందించనున్నట్లు పేర్కొన్నారు. తొలి విడతగా 35 వాహనాలను అందించినట్లు తెలిపారు. -
మళ్లీ విస్త‘రణం’
నేడు మంత్రి వర్గ విస్తరణ డీకే, రోషన్‌కు చోటు.. రమేశ్ కుమార్‌కూ ఛాన్స్! లోక్ సభ ఎన్నికల తర్వాత మిగిలినవీ భర్తీ అప్పుడే మొదలైన అసమ్మతి సీనియర్లలో అసంత ృప్తి బహిరంగంగానే విమర్శలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని బుధవారం స్వల్పంగా విస్తరించనున్నారు. మాజీ మంత్రులు డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లకు చోటు కల్పించనున్నారు. మిగిలిన మూడు ఖాళీలను లోక్‌సభ ఎన్నికలకు ముందు భర్తీ చేయాలని అధిష్టానం సీఎంకు సూచించినట్లు సమాచారం. ఆరు నెలల కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ‘కళంకితులు’ అనే నెపంతో ముఖ్యమంత్రి వీరికి చోటు కల్పించ లేదు. శివ కుమార్‌పై అక్రమ మైనింగ్ ఆరోపణలుండగా, రోషన్ బేగ్ కోట్ల రూపాయలు స్టాంపు పేపర్ల కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఆరోపణల వల్లే ఆయన ఎస్ఎం. కృష్ణ మంత్రి వర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిద్దరికీ పదవులు దక్కకుండా చేయడానికి వారి ప్రత్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి సైతం వీరి పట్ల విముఖతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఎట్టకేలకు అధిష్టానం మనసును మార్చడంలో వీరిద్దరూ సఫలీకృతులయ్యారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వీరిద్దరు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. గవర్నర్‌తో సీఎం భేటీ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజ్ భవన్లో గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్‌ను మధ్యాహ్నం కలుసుకున్నారు. విస్తరణ గురించి ఆయనకు సమాచారం ఇచ్చారు. అంతకు ముందు విలేకరులు సీఎంను మంత్రి వర్గ విస్తరణ గురించి అడిగినప్పుడు స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ‘దీనిపై రేపు చెబుతా, ఇప్పుడేం మాట్లాడను’ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. రమేశ్ కుమార్‌కూ ఛాన్స్! మంత్రి వర్గంలో కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్‌కు కూడా అవకాశం లభించే అవకాశాలున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుత స్పీకర్ కాగోడు తిమ్మప్పను మంత్రి వర్గంలోకి తీసుకుని, రమేశ్ కుమార్‌కు ఆ పదవిని కట్టబెట్టవచ్చని తెలుస్తోంది. శివకుమార్‌కు పితృవియోగం డీకే. శివ కుమార్ తండ్రి కెంపే గౌడ (85) మంగళవారం ఉదయం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. నెల రోజులుగా ఆయన వివిధ అవయవాల వైఫ్యల్యంతో బాధ పడుతున్నారు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలను నిర్వహించారు. అప్పుడే అసమ్మతి మంత్రి విస్తరణ జరిగే అవకాశాలున్నాయని తెలియడంతో కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది సీనియర్లు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి తనకు అవకాశం కల్పించాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు. బెంగళూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరు సార్లు తాను శాసన సభకు ఎనికయ్యానని, మంత్రి పదవినిస్తే ఎలాంటి సదుపాయాలు పొందకనే ప్రజా సేవ చేస్తానని తెలిపారు. తనకు సంఘ సంస్థలు, వ్యాపారాలు లేవంటూ, కేవలం రాజకీయాల్లో మాత్రమే ఉన్నానని చెప్పారు. రాణి బెన్నూరు శాసన సభ్యుడు కేబీ. కోళివాడ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభించని అనేక జిల్లాలను విస్మరించి, కేవలం ఇద్దరిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.