సీపీఎల్ చాంపియన్ ఇన్సోల్
జింఖానా, న్యూస్‌లైన్: కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) మూడో విడత టోర్నీలో ఇన్సోల్ జట్టు విజేతగా నిలిచింది. సాషా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఇన్సోల్ 5 వికెట్ల తేడాతో డాక్టర్ రెడ్డీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన డాక్టర్ రెడ్డీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. బ్రిజేష్ పటేల్ 45, రాజేష్ 24, మన్‌ప్రీత్ 21 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచారు.
ఇన్సోల్ బౌలర్లు శ్రీకాంత్, ఉదయ్ చెరో మూడు వికెట్లు, రచనేష్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఇన్సోల్ 5 వికె ట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దినేష్ (48 నాటౌట్), శ్రీకాంత్ (31) మెరుగ్గా ఆడారు. రెడ్డీస్ జట్టు బౌలర్ బ్రిజేష్ ఒక వికెట్ తీసుకున్నాడు. బ్రిజేష్ (డాక్టర్ రెడ్డీస్) మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకోగా.. బెస్ట్ బౌలర్‌గా రావిష్ (నిసూమ్ టెక్నాలజీస్), బ్యాట్స్‌మ న్గా రియాజ్ అలీ (వెర్నాక్యులస్) నిలిచారు.