colapse
-
Garisenda Tower: వాలుతున్న వెయ్యేళ్ల టవర్
ఇటలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పీసా నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత లీనింగ్ టవరే. నాలుగు డిగ్రీల కోణంలో ఒకవైపు వాలిపోయి అందరికీ ఆకట్టుకుంటూ కని్పస్తుందా కట్టడం. అయితే ఇటలీలోనే మరో లీనింగ్ టవర్ కూడా ఉంది. అది కూడా కాస్త అటూ ఇటుగా పీసా టవర్ అంత ఎత్తు ఉంటుంది. అలాంటి టవర్ కాస్తా ఇప్పుడు ఏ క్షణమైనా కుప్పకూలేలా కని్పస్తూ గుబులు రేపుతోంది....! ఇటలీలోని బొలోగ్నా నగరంలో గారిసెండా టవర్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పీసా టవర్ మాదిరిగానే ఇది కూడా నానాటికీ ఓ పక్కకు వాలిపోతుండటమే ఇందుకు కారణం. అలా ఈ టవర్ ఇప్పటిదాకా 4 డిగ్రీల కోణంలో పక్కకు ఒరిగింది. దీనికి తోడు దాని పునాదులు కొంతకాలంగా బాగా బలహీనపడుతూ వస్తున్నట్టు అధికారులు తేల్చారు. దాంతో నగర కౌన్సిల్ హుటాహుటిన సమావేశమై దీని గురించి కూలంకషంగా చర్చించింది. టవర్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదముందని ధ్రువీకరించింది. అదే జరిగితే శిథిలాల ధాటికి పరిసర చుట్టుపక్కల అతి సమీపంలో ఉన్న పలు నివాస, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా టవర్ చుట్టూ యుద్ధ ప్రాతిపదికన 5 మీటర్ల ఎత్తున బారియర్ నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్ లోపు దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు టవర్ చుట్టూ మెటల్ రాక్ ఫాల్ వలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అది కూలినా పరిసర నిర్మాణాలకు ఎలాంటి నష్టమూ లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి టవర్, దాని గ్రౌండ్ ఫ్లోర్లోని ప్లాజాలోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సందర్శనపై నిషేధం మరికొన్నేళ్ల దాకా (టవర్ కూలని పక్షంలో) కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. బారియర్ నిర్మాణ వ్యయం 37 లక్షల పౌండ్లు(దాదాపు రూ.39.10 కోట్లు)గా అంచనా వేశారు. దీనికోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుండటం విశేషం! ‘‘నగరవాసులతో పాటు బొలోగ్నా నగరాన్ని, దాని ప్రఖ్యాత పర్యాటక చిహా్నలను కాపాడాలని తపిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రియులందరూ ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలి’’ అంటూ నగర కౌన్సిల్ పిలుపునిచి్చంది. నిలబెట్టేందుకు తీవ్ర యత్నాలు గారిసెండా టవర్ కూలిపోకుండా కాపాడేందుకు ఇటలీ శాయశక్తులా ప్రయతి్నస్తోంది. పీసా టవర్ కూడా క్రమంగా మరింత పక్కకు వాలి త్వరలో కూలిపోవడం ఖాయమని కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం ఏళ్ల తరబడి నానా ప్రయత్నాలూ చేసి దాని ఒంపును కొంతమేర సరిచేసింది. ప్రస్తుతానికి అది కుప్పకూలే ముప్పు లేదని తేలి్చంది. అలా పీసా టవర్ను కాస్త సురక్షితంగా మార్చిన అనుభవాన్నంతా గారిసెండా విషయంలో రంగరిస్తున్నారు. ఇందుకోసం సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తొలి దశలో దీన్ని వీలైనంత సురక్షితంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. సంబంధిత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెట్టింపు ఎత్తైన జంట టవర్ గారిసెండా నిజానికి బొలోగ్నా నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన జంట టవర్లలో ఒకటి మాత్రమే! పైగా చిన్నది. ఎందుకంటే, దీని పక్కనే ఉన్న అసినెల్లీ టవర్ దీనికంటే దాదాపు రెట్టింపు పొడవైంది! అంటే దాదాపు 90 మీటర్లన్నమాట. ప్రఖ్యాత పీసా టవర్ ఎత్తు 56 మీటర్లే. అంటే, ఇది పీసాను తలదన్నేంత ఎత్తుందన్నమాట! అసినెల్లీ టవర్ నిర్మాణం గారిసెండా తర్వాత పదేళ్లకే, అంటే 1,119లో జరిగింది. ఇది కూడా కాస్త పక్కకు ఒరిగే ఉండటం విశేషం. అయితే ఆ ఒంపు మరీ పీసా, గారిసెండా అంతగా లేదు గనుక ప్రస్తుతానికి దీనికి వచి్చన ముప్పేమీ లేనట్టే! దాదాపు వెయ్యేళ్ల నాటిది! ► గారిసెండా టవర్ ఇప్పటిది కాదు. మధ్య యుగానికి చెందినది. ►దీన్ని దాదాపు వెయ్యేళ్ల క్రితం, అంటే క్రీస్తుశకం 1,109 సంవత్సరంలో నిర్మించారు. ►టవర్ ప్రస్తుత ఎత్తు 47 మీటర్లు (154 అడుగులు). ►నిర్మించినప్పుడు ఇది చాలా ఎత్తుండేది. ►200 ఏళ్లకే టవర్ ఒక పక్కకు ఒరగడం మొదలైంది. ►దాంతో 14వ శతాబ్దంలో దాని ఎత్తును బాగా తగ్గించారు. ►డాంటే 1321 సంవత్సరంలో ముగించిన అజరామర పద్య కావ్యం ‘ది డివైన్ కామెడీ’లో కూడా గారిసెండా టవర్ ప్రస్తావన ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సర్కారు బడుల్లో సౌకర్యాలు కరువు!
విజయనగరం మున్సిపాలిటీ/రూరల్ : నియోజక వర్గంలోని 127 పాఠశాలల్లో అధికారిక లెక్కల ప్రకారం 35 పాఠశాలలకు తాగునీటి సదుపా యం లేదు. మరుగుదొడ్లుకు నీటి సదుపాయం లేని పాఠశాలలు 49 ఉండగా అవి నిరుపయోగంగా మారాయి. 50 పాఠశాలలకు ఆటస్థలం లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. విద్యాభివద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పాలకులు గొప్పలు చెబుతున్నా ఆచరణలో కానరావడంలేదు. ప్రధానంగా తాగు నీరు, మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవు. కొన్ని పాఠశాలలకు ప్రహరీలు లేవు. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా తమకు ఇబ్బందులు తప్పవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మూడు ఉన్నత పాఠశాలలు ఉండగా కస్పా ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కలపి 1300 మంది విద్యార్థులున్నారు. రెండు గదులు పాడయ్యాయి. వంటగది లేదు. 400 మంది విద్యార్థులున్న కంటోన్మెంట్ ఉన్నత పాఠశాలలో మరుగు సౌకర్యం లేదు. మూడు తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. 568 మంది విద్యార్థులు గల బీపీఎం స్కూల్లో 12 గదులు పూర్తిగా పాడయ్యాయి. వంటగది లేదు. అధ్వానంగా ప్రాథమిక పాఠశాలలు గంజిపేట పాఠశాలలో చికెన్షెడ్, వాటర్, ప్రహరీ లేవు. బీసీ కాలనీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేదు. వీటీ అగ్రహారంలో చికె న్ షెడ్ లేదు. బొండాడ వీధి, ఎస్బీటీ మార్కెట్ పాఠశాలల్లో మరుగుదొడ్లు పాడయ్యాయి. çకుప్పిలివీధి పాఠశాలలో రెండు గదులు, పుత్సల వీధిలో మూడు తరగతి గదులు పాడయ్యాయి. కొత్తగ్రహారంలో మరుగుదొడ్లు, నీటి సదుపాయం, ప్రహరీ లేవు. కాళ్ల నాయకుడు మందిరం వద్ద పాఠశాలలో ఐదు గదులు పావడగా, టాయిలెట్స్ లేవు. అయ్యకోనేరకు గట్టుపై గల పాఠశాలకు కిచెన్షెడ్ లేదు. సిటీ బస్టాండ్ వద్ద పాఠశాలలో రెండు తరగతి గదులు పాడయ్యాయి. ఐదు టాయిలెట్స్ పని చే యడంలేదు. బుంగవీధిలో రెండు తరగతి గదులు పాడయ్యాయి. ప్రహరీ, మరుగుదొడ్లు లేవు.వన్ప్లస్ వన్ కాలనీ పాఠశాలకు ప్రహరీ, మరుగుదొడ్లు లేవు. ఆబాద్వీధి పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. నాలుగు తరగతి గదులు పాడయ్యాయి. ఉర్ధూపాఠశాలలో పురాతన గదులు శిథిలావస్థకు చేరాయి. ప్రహరీ కూలిపోయింది. కస్పా ప్రాథమిక పాఠశాలలో మూడు తరగతి గదులు పాడయ్యాయి. కిచెన్షెడ్ లేదు. కొత్తపేట గొల్లవీధిలోని రెండు పాఠశాలల్లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేవు. సాకేటి వీధి పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. చిక్కాలవీది పాఠశాలలో కిచెన్షెడ్, బాత్రూంలు, తరగతి గదులు శిథిలమయ్యాయి. కుమ్మరవీధి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. రెండు తరగతి గదులు పాడయ్యాయి. నీటి సౌకర్యం లేదు. లంకాపట్నం పాఠశాలలో ఐదు మరుగుదొడ్లు మూలకు చేరాయి. తాగు నీటి సౌకర్యం లేదు. పూల్బాగ్ కాలనీ రెండు తరగతి గదులు పాడయ్యాయి. నందిగుడ్డి పాఠశాలలో వంటగది, మరుగుదొడ్లు లేవు. వైఎస్సార్నగర్ పాఠశాలలో తాగు నీరు, వంటగది, ప్రహరీ లేవు. నందివీది పాఠశాలలో వంటగది లేదు. రెండు తరగతి గదులు పాడయ్యాయి. ఎస్సీ కాలనీ పాఠశాలకు ప్రహరీ లేదు. జొన్నగుడ్డి పాఠశాలలో నాలుగు తరగతి గదులు పాడయ్యాయి. ప్రహరీ లేదు. గాడిఖానా ము న్సిపల్ పాఠశాలకు భవనం, వంట గది లేదు. రా జీవ్నగర్ కాలనీ పాఠశాలకు వంటగది, ప్రహరీ లేవు. లంకవీధి పాఠశాలకు వంటగది లేదు. మఠం వీధి పాఠశాలలో వంటగది, ప్రహరీ లేవు. -
కూలిన ఇండోర్స్టేడియం
రాత్రి పూట సంఘటన జరగడంతో తప్పిన ప్రమాదం నెల్లూరు(బృందావనం) : నెల్లూరులోని బారాషహీద్దర్గా ప్రాంగణానికి సమీపం లో ఉన్న జన్నత్ ఇండోర్ స్టేడి యం సోమవా రం రాత్రి కూలిపోయింది. రెవెన్యూ అధికారులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూడున్నర దశాబ్దాల క్రితం కలెక్టర్గా పనిచేసిన జన్నత్హుస్సేన్ పేరుతో ఈ స్టేడియంను నిర్మించారు. వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులతోపాటు, నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బ్యాడ్మింటన్ ఆడేందుకు నిత్యం ఇక్కడకు వస్తారు. సోమవారం రాత్రి స్టేడియం ఒక్కపెట్టున కూలిపోయింది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై నెల్లూరు ఆర్ఐ నాజర్ మాట్లాడుతూ ఎవరికీ ప్రమాదం జరగలేదని, ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.