competetive exams
-
TSPSC: పరీక్షలన్నీ రీ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో పేపర్ల లీక్, పరీక్షల వాయిదాలు నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్ చేసే యోచనలో రాష్ట్రం ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రకటిచింన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇక నుంచి నియామకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ త్వరలో కొత్త పరీక్ష తేదీలను విడుదల చేయనుంది. -
కాంపిటేటివ్ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు గుడ్‌న్యూస్!
దేశవ్యాప్తంగా అన్ని పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధుల కోసం IIT-IIM ALUMNI సహకారంతో 'కాల్కస్ ఇండియా' యాప్‌ను రూపొందించిన కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వారు, ఆ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా "వన్ పాస్.. ఆల్ఎగ్జాంస్" అనే పరిమిత కాలపు అఫర్ ద్వారా 'calcusindia' అనే కూపన్ ను ప్రకటించారు. ఈ కూపన్ ను తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ టి హరీష్ రావు గారు ఈ రోజు విడుదల చేశారు. ఈ ఆఫర్ వినియోగించుకోదలచిన వారు పేమెంట్ చేసేటప్పుడు 'calcusindia' అనే కూపన్ ను అప్లై చేయటం ద్వారా ఈ 99 రూపాయల ఆఫర్ ను పొందగలుగుతారు. ఈ ప్రీమియం ప్యాకేజీ ఆఫర్ తీసుకోవటం ద్వారా విద్యార్ధులు యాప్ లో ఉన్న పాఠశాల స్థాయి నుంచి సీవిల్ ఎంట్రన్స్ వరకు మొత్తం 1354 కాటగిరీల నుంచి 46000కు పైగా టెస్టులను 6 నెలల పాటు పూర్తి ఉచితంగా సాధన చేయవచ్చు. నాణ్యమైన విద్యను పేద, మద్య తరగతివర్గాల వారికి కూడా అందుబాటులో ఉండేలా ఈ ఆఫర్ ప్రకటించిన సంస్థ ఫౌండర్ వాణీకుమారిని మంత్రి హరీష్ రావు అభినందించారు. అందరికీ విద్య.. అందుబాటు ధరలో పలురకాల కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్ధులకు అన్ని రకాల పరీక్షలను అతితక్కువ ధరలో ఒకేచోట ప్రాక్టీస్ చేసుకునే సదుపాయం కల్పించాలనే సదుద్దేశ్యంతో ఈ విధమైన ఆఫర్ ప్రకటించిన భారత దేశపు ఏకైక సంస్థ కాల్కస్ఇండియా. గూగుల్ ప్లే స్టోర్ నుంచి "కాల్కస్ ఇండియా" యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్న వారు కొన్ని ఉచిత పరీక్షలను ప్రాక్టీస్ చేసి నచ్చిన వారు ప్రీమియం ప్యాకేజీకి సభ్యత్వం చేసుకోవచ్చును. మరిన్ని వివరాలకు calcusindia.com పోర్టల్ ను సందర్శించవచ్చు. -
నిరుద్యోగులకు ‘పరీక్ష’!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఏళ్లుగా చేస్తున్న తపస్సుకు ఆటంకం ఎదురవుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు నిర్వహిస్తున్న అర్హత పరీక్షలన్నీ ఒకేసారి వచ్చిపడటంతో ఆశావహుల్లో అయోమయం తలెత్తుతోంది. వేరువేరు సమయాల్లో నోటిఫికేషన్లు రావడం.. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో వెలువడిన నోటిఫికేషన్లన్నింటికీ దరఖాస్తు చేసిన నిరుద్యోగి.. ఇప్పుడు ఒకేసారి పరీక్షలకు తలపడాల్సి వస్తోంది. ఉద్యోగ ఖాళీల అర్హత పరీక్షలు కొన్ని వరుసగా రాగా.. మరికొన్ని ఒకే రోజు జరగనుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ ఏ పరీక్షకు సన్నద్ధం కావాలి, ఎలా సిద్ధమవ్వాలి, అసలు పరీక్ష ఎలా రాయాలనే ప్రశ్న గందరగోళానికి గురిచేస్తోంది. నెల రోజులు ‘కేంద్రం’పరీక్షలు రాష్ట్రంలో 2 నెలల పాటు వరుసగా ఉద్యోగ అర్హత పరీక్షలు జరగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ పరీక్షలు కాస్త వెనువెంటనే ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు. ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు)లో గ్రూప్ ‘డీ’కేటగిరీలో 62,907 ఖాళీలకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1.45 కోట్ల మంది దరఖాస్తు చేశారు. దీంతో రోజుకు సగటున 45 వేల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాబ ట్టి దాదాపు 45 రోజుల పాటు పరీక్షలు జరగనున్నా యి. ఇదే సమయంలో ఐబీపీఎస్ (బ్యాంకిం గ్) పరీక్షలూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 29, వచ్చే నెల 7వ తేదీన ఐబీపీఎస్ పీవో పరీక్షలకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైంది. దీనికి తోడు యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) పరీక్షలు కూడా సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 10 వరకు వేర్వేరు తేదీల్లో ఉన్నాయి. ఉరుకులు.. పరుగులే.. ఇలా నెల రోజులు వరుసగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ని ఖాళీల భర్తీ పరీక్షలుండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలూ ఇవే తేదీల్లో ఉండటంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల ఖాళీలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు పీజీటీ, టీజీటీ అర్హత పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 30న కానిస్టేబుల్ పరీక్ష, వచ్చే నెల 7న గ్రూప్–4తో పాటు ఏఏఓ, ఎఎస్‌ఓ, డీపీఏ, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ పరీక్షలున్నాయి. కాబట్టి గురుకుల పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్పీఎస్సీ పరీక్షలు రాయాలంటే ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. దీంతో పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. గురుకుల పరీక్ష తేదీల్లో మార్పులు? గురుకుల పరీక్షల తేదీలు మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తేదీల మార్పు కోసం శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నియామకాల బోర్డు కార్యాలయం ఎదుట పలువురు అభ్యర్థు లు ధర్నా నిర్వహించారు. అనంతరం బోర్డు చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి కూడా వినతులు పెరుగుతుండటంతో సీఎస్ ఎస్కే జోషి స్పందించారు. పరీక్షల తేదీలను పునః సమీక్షించుకోవాలని, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని బోర్డుకు సూచించారు. దీంతో శనివారం సాయంత్రం గురుకుల బోర్డు సభ్యులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించా రు. పరీక్షల తేదీల్లో మార్పులపై త్వరలో స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ
అనంతపురం కల్చరల్ : లయన్స్ క్లబ్ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి స్థానిక లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో ఆర్ఆర్బీ, గ్రూప్-3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు లయన్స్‌క్లబ్ మహిళా విభాగం నిర్వాహకురాలు విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు 40 రోజుల పాటు జరిగే ఉచిత శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభం
సత్యనారాయణపురం : స్థానిక చిత్తరంజన్ శాఖ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు హాజయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభించారు. ఈ తరగతులను ప్రారంభించిన గ్రంథాలయాధికారిణి కె.పద్మావతి మాట్లాడుతూ కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆదేశాల మేరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలి రోజు అధ్యాపకులు చంద్రశేఖర్‌రావు, మాధవి ఇంగ్లిష్, అర్థశాస్త్రం పాఠాలు బోధించారు. సుమారు 40 మంది విద్యార్థులు హాజరయ్యారు.