ఫోక్స్‌వ్యాగన్ కార్లలో ఉద్గారాల గుట్టు రట్టు..
లాస్ ఏంజెలిస్: కాలుష్య ఉద్గారాల విషయంలో వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ .. అమెరికా, యూరప్ నియంత్రణ సంస్థల కన్నుగప్పిన తీరును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఉద్గార పరీక్షలు జరిపేటప్పుడు కాలుష్యకారక వాయువుల విడుదలను నియంత్రించేలా ఫోక్స్‌వ్యాగన్ కార్లలో కంప్యూటర్ కోడ్‌ను ఉపయోగించినట్లు కనుగొన్నారు. టెస్ట్ పూర్తయిపోయినట్లు కంప్యూటర్ ధృవీకరించుకున్నాక.. నియంత్రణ వ్యవస్థ డీయాక్టివేట్ అయ్యేది. అటు తర్వాత నుంచి పరిమిత స్థాయికి 40 రెట్లు అధికంగా నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు కారు నుంచి విడుదలయ్యేవి.