Comrade
-
Maddikayala Omkar: సామాజిక న్యాయ యోధుడు
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపకులు, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1924లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం, ఏపూర్‌లో మద్దికాయల రామయ్య, అనంతలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ‘ఆంధ్ర మహా సభ’లో వలంటీర్‌గా చేరి... ఆ తరువాత భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారు. నిజాం సైన్యాలపై, యూనియన్ సైన్యాలపై ఆయన తుపాకీ చేతపట్టి అలుపెరుగని పోరాటం చేశారు. ఆ నాటి నిజాం పాలన ఓంకార్ తలకు వెలకట్టింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టి, 1964లో ఏర్పడ్డ మార్క్సిస్ట్ పార్టీలో ముఖ్య నాయకునిగా పేరుగాంచారు. 1972 నుండి 1994 వరకు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజలు ఐదుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన సభ్యునిగా చట్టసభకు పంపినారు. ప్రజలు ‘అసెంబ్లీ టైగర్’గా ఆయన్ని అభివర్ణించారు. నక్సలైట్లు, భూస్వాములు ఆయనపై అనేకసార్లు హత్యా ప్రయత్నం చేయగా ప్రాణాపాయం నుండి బయట పడిన ఓంకార్‌ను అన్ని వర్గాల ప్రజలు ‘మృత్యుం జయుడు’గా పిలిచారు. 1964 మార్క్సిస్ట్ కార్యక్రమాన్ని నిబద్ధతతో నడపడానికి 1984లో ఎమ్సీపీఐ (యూ)ను ఏర్పాటు చేసి దేశమంతా విస్తరణకు పూనుకున్నారు. వర్గ వ్యవస్థలో భాగం గానే భారతదేశంలో కుల వ్యవస్థ ఉందని ఆయన భావించారు. అగ్రవర్ణ ఆధిపత్యంలో వివక్షకులోనై ఉన్న అణగారిన ప్రజలను సాంఘిక వ్యత్యాసాల నుండి బయట పడేయడానికి ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యపరచి ఆధిపత్య వర్గాల చెంతన ఉన్న దోపిడీ, పెట్టుబడిదారీ వర్గాలపై తిరుగు బాటు చేయించినప్పుడే శ్రామిక వర్గ రాజ్యస్ధాపన సులువు అవుతుందని ఆయన చెప్పారు. ఆర్థిక, రాజకీయ రంగాలపై అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగదంటూ... ‘జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకం కావాలి, వారే రాజ్యాధికారం చేపట్టాలంటూ 1999 లో 14 కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో ‘మహాజన ఫ్రంట్’ ఏర్పాటు చేశారు. జనాభాలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణలలోని పేదలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సమానత్వాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే ‘వర్గ వ్యవస్థలోనే కుల వ్యవస్థ’ ఉన్నదని ఓంకార్ స్పష్టం చేశారు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులపై అంచనా ఉన్న ఓంకార్ ఆశయాలకు అనుగుణ్యంగానే ఎమ్సీపీఐ (యూ) కార్యక్రమం ముందుకు సాగుతుంది. ‘ఓట్లు మావే సీట్లు మావే’, ‘ఓట్లు మావి అధికారం మీదంటే’ ఇక చెల్లదంటూ ఏర్పడిన ఆనాటి ‘మహాజన ఫ్రంట్’లో అయినా, 2018లో ‘సామాజిక న్యాయం, బహుజనులకే రాజ్యాధికారం’ అంటూ ఏర్పడిన ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్)లో అయినా ఎమ్సీపీఐ (యూ) భాగస్వామి అయిందంటే... ఓంకార్ ఆశయ సాధన కోసమే. 2008 అక్టోబర్ 17న అమరులైన కామ్రేడ్ ఓంకార్‌కు... నేటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ బహుజన రాజ్యస్థాపనకై పాటుపడడమే ఘనమైన నివాళి. (క్లిక్ చేయండి: ఆయన జీవితమే ఒక సందేశం) – వనం సుధాకర్ ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (అక్టోబర్ 17న ఓంకార్ వర్ధంతి సందర్భంగా) -
కమ్యూనిస్ట్ ఉద్యమ మార్గదర్శి
కమ్యూనిస్టు విప్లవ లక్ష్యం కోసం, దేశంలో ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడానికి వీలులేని సమసమాజ స్థాపన కోసం తన సర్వస్వాన్నీ అర్పించారు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ). 1917 జూన్ 1వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి గ్రామంలో జన్మించిన డీవీ సొంతూరు ఉమ్మడి నల్లగొండ జిల్లా బండమీది చందుపట్ల. ఆయనది భూస్వా ముల కుటుంబం. 1939లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించిన డీవీ పూర్తిస్థాయి కార్యకర్తగా నల్లగొండ జిల్లాలో ఉద్యమ నిర్మాణం ప్రారంభించారు. తెలంగాణ ప్రజల సాయుధపోరాటం (1946–51) అన్ని దశల్లోనూ కీలక పాత్ర నిర్వహించారు. ఆనాడు భూస్వాముల నికృష్టమైన, క్రూరమైన దోపిడీ, దౌర్జన్యాలనుండి ప్రజలను రక్షించడానికి ఆయన ఎంతగానో పోరాడారు. భూమి సమస్యను విప్లవోద్యమంతో ముడిపెట్టి ఉన్నతస్థాయి పోరాటాలకు ప్రజలను సమా యత్తం చేయటానికి డీవీ అనుసరించిన విధానాలు, ఎత్తుగడలు కీలకమై నవి. వాస్తవానికి తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించాలనే ధోరణిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ 1949లోనే ఒక డాక్యుమెంట్‌ను రచించారు. ప్రజలు నేడు ఫ్యూడల్ భూస్వాముల, బడా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల దోపిడీలు అనే మూడు బరువులను మోస్తున్నారనీ; ఈ దోపిడీలను సమూలంగా రద్దుచేసి ఒక నూతన ప్రజాతంత్ర వ్యవస్థను స్థాపించుకున్నప్పుడే దేశంలోని అన్ని రంగాల ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఆయన ఉద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు, దేశప్రజల విముక్తి కోసం విప్లవ పంథాను రూపొందించారు. భారత పాలక వర్గాలు తమపై కుట్ర కేసు (హైదరాబాదు కుట్ర కేసుగా అది ప్రసిద్ధిగాంచింది) బనాయించినపుడు కోర్టులో తమ విప్లవ కార్యక్రమాన్నీ, లక్ష్యాలనూ బహిరంగంగా డీవీ ప్రకటించారు. (క్లిక్: తరతరాలనూ రగిలించే కవి) భారత విప్లవోద్యమంలో పొడచూపిన అనేక పెడధోరణులను ఎండగట్టారు. విప్లవ కర్తవ్య నిర్వహణలో కమ్యూనిస్టు విప్లవ యోధుడు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి (టీఎన్)తో భుజం భుజం కలిపి నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. 1975 ఏప్రిల్‌లో టీఎన్తో కలిసి యూసీసీఆర్ఐ (ఎంఎల్)ను స్థాపించి పనిచేశారు. చివరికి 1984 జూలై 12వ తేదీన అమరులయ్యారు. కమ్యూనిస్టు విప్లవ లక్ష్యంకోసం ఆయన మార్గంలో కర్తవ్యోన్ముఖులు కావడమే ఆ విప్లవ మూర్తికి మనమందించే నిజమైన నివాళులు. – సి. భాస్కర్, యూసీసీఆర్ఐ (ఎంఎల్) (జూలై 12న దేవులపల్లి వెంకటేశ్వరరావు వర్ధంతి) -
మారోజు వీరన్న అమరత్వం
పీడిత జన సామాజిక విప్లవకారుడు, మలిదశ తెలంగాణా పోరాట ఆద్యుడు, కుల వర్గ జమిలి పోరాటాల నిర్మాత మారోజు వీరన్న భౌతికంగా దూరమై 19 సంవత్సరాలు అవుతున్నది. 1999, మే 16న∙కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్‌లోని మామిడితోటలో అర్థరాత్రి రాజకీయ హత్య గావించిన పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిం చారు. దళిత బహుజన ఆవేశాన్ని చల్లారుస్తూ.. అప్రకటిత ఎమర్జెన్సీ పాలనా సాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పల్లె పల్లెన శ్మశాన శాంతిని నెలకొల్పింది. ఎర్ర పోరాటానికి నీలి మెరుపులు అద్దిన వీరన్న అస్తిత్వ పోరాటాలకు దిక్సూచిగా నిలిచాడు. 19 ఏళ్లుగా వీరన్న భౌతికంగా లేకున్నా ప్రతి అస్తిత్వ పోరాటంలో సజీవంగా ఉన్నాడు. భారత విప్లవ పోరాట పంథాను కుల నిర్మూలన ఫలకంపై నిర్మించడంలో విఫలం అయ్యి ప్రజ లకు దూరమవుతున్నారనే వీరన్న ఆయన అనుయాయుల విమర్శతోనే నేటి కమ్యూనిస్టులు అంబేడ్కర్‌ను ఎత్తిపడుతున్నారా అనేది చర్చనీ యాంశం. వీరన్న కుల వర్గ జమిలి పోరాట సూత్రాన్ని అన్వయించుకొని నేడు లాల్–నీల్ ఐక్యత పోరాటంగా ముందుకు సాగుతున్న పార్టీలు సైతం ఎన్నికలను ఎదుర్కోవడం కోసం ఎత్తుగడనా? లేక సైద్ధాంతికంగానే పంథాను మార్చుకున్నాయా అనేది నేడు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అంశం. శ్రామిక వర్గ దృక్పథం లేని కుల పోరాటాలు, కుల నిర్మూలన లక్ష్యం లేని వర్గ పోరాటాలు విముక్తి సాధించలేవు. కనుక వీరన్న చూపిన రాజకీయ సైద్ధాంతిక వెలుగులో పురోగమించడమే ఆయన స్మృతిలో నిజమైన నివాళి. సమానత్వ సమాజ మార్గానికి పునాది రవళి. (మే 16న మారోజు వీరన్న 19వ వర్థంతి) దుబ్బ రంజిత్, యం. ఏ. పీ.హెచ్.డి, అర్థశాస్త్ర పరిశోధక విద్యార్థి, పీ.డీ.ఎస్.యు. అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ మొబైల్ : 99120 67322 -
ఇదేమిటి కామ్రేడ్!
విషయం, సమయం, సందర్భం అనేవి ఏవీ చూసుకోకుండా ఒకేవిధంగా మాట్లాడే వారిని చూసి ‘‘పెళ్లికీ, తద్దినానికీ ఒకటే మంత్రమా’’ అంటూ పక్కనున్న వారు విసుక్కోవడం అప్పుడప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తుంటుంది. ఒక వామపక్షనేత మాటలు, ప్రకటనలు వింటుంటే ఒక్కోసారి ఇదే సామెత స్ఫురణకు వస్తుందని ఆ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటుంటారు. సర్కార్‌పై ఘాటైన విమర్శలు చేసినా, ముఖ్యమైన సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖలు, వినతులు సమర్పించినా, విలేకరుల సమావేశాల్లో మాట్లాడినా తప్పనిసరిగా ఆయన ఒక డిమాండ్‌తో ముగిస్తూ ఉంటారు. సమస్య ఎంత జఠిలమైనదైనా, అంతగా ప్రాధాన్యత లేనిదైనా ఆయన అదే డిమాండ్‌ను చేయడం పరిపాటిగా మారిందని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. తీవ్రమైన ఈ సమస్యపై సీఎం వెంటనే స్పందించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ వర్గాల సమస్యలను పరిష్కరించాలనీ, ఆర్టీసి కార్మికుల సమ్మెను విరమింపజేయాలి అంటూ దీనికోసం వెంటనే అఖిలపక్షసమావేశాన్ని ఏర్పాటుచేయాలనీ డిమాండ్ చేసేస్తుంటారు. ఆయన ప్రస్తావించే చిన్నా, పెద్దా సమస్యలన్నింటిపై ప్రభుత్వం ఆల్‌పార్టీ మీటింగ్ జరపడం సాధ్యమేనా అని మిగతా పార్టీల నాయకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తుంటారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఆయా సమస్యలపై వినతిపత్రాలను సమర్పించేందుకు రాజకీయపక్షాల నాయకులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, అందువల్ల కనీసం అఖిలపక్షభేటీలను నిర్వహిస్తేనైనా ఆయా సమస్యలను స్వయంగా ప్రస్తావించవచ్చునని తరచుగా ఆ కమ్యూనిస్టునేత ఈ డిమాండ్ చేస్తూ ఉండవచ్చునని మరోనేత ముక్తాయింపునివ్వడం విశేషం. -
విప్లవ జీవితానికి ఒరవడి
ప్రతిఘటనా పోరాట సేనాని, భారత విప్లవోద్యమ అగ్రనాయ కులు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి మూడు దశాబ్దాల క్రితం 1984 నవంబర్ 9వ తేదీన అమరులయ్యారు. మరణించే నాటికి ఆయన రహస్యజీవితంలో ఉంటూ సీపీఐ (ఎంఎల్) పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణించి మూడు దశాబ్దాలు దాటినా ఆయన చూపిన పోరాట మార్గం అనుసరణీయం, ఆచరణీయం. సీపీ కర్నూలు జిల్లా వెలుగోడులో 1917 జూలై 1న జన్మించారు. విద్యార్థి దశలోనే జాతీయోద్యమ పోరాటంలో పాల్గొన్నారు. మద్రాసు లోని గిండి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి సంఘ కార్యక్ర మాల్లో చురుకుగా పాల్గొన్న సీపీ కళాశాలలో బహిష్కరణకు గురై, ప్రజా ఉద్యమాలకు అంకితమయ్యారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేయడానికి వెళ్తూ అరెస్టయి జైలుకి వెళ్లాడు. తెలంగాణ పోరాట విరమణను తీవ్రంగా వ్యతిరేకించాడు. 1952లో మద్రాసు అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లాలో జరిగిన అనేక భూస్వామ్య వ్యతిరేక పోరాటా లకు నాయకత్వం వహించారు. 1964లో సీపీఐ నుంచి సీపీఎం విడిపోయే సందర్భంలో రాజకీయ పోరాటంలో చురుకైన పాత్ర నిర్వహించి చైనా మద్ద తుదారుడుగా ముద్రపడి, దేశ రక్షణ చట్టం కింద 1964లో అరెస్టయి రెండేళ్లు జైలు జీవితం గడిపారు. జైల్లో ఉన్న సమ యంలో మాణికొండ సుబ్బారావుతో కలిసి ‘ప్రపంచ కమ్యూ నిస్టు ఉద్యమం దాని పరిణామం’ అనే గ్రంథా న్ని రాశారు. చైనాలో జరుగుతున్న రాజకీయ పోరాటాన్ని ‘చైనా, రష్యా వాదనలు’ అనే పేరు తో అక్షరరూపం ఇచ్చారు. అదే సమయంలో సీపీఎంతో వచ్చిన విభేదాలతో దేవులపల్లి వెంక టేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంక య్యలతో కలిసి బరద్వాన్, పాలకొల్లు ప్లీనం లలో సీపీఎం సిద్ధాంతాలను ఎండగట్టారు. సీపీఎం నుంచి తెగతెంపులు చేసుకొని, విప్లవ పంథాను ఆచరణలో పెట్టేందుకు 1968 నవం బర్లో ములుగు అడవిలో ఉద్యమానికి పునాది వేసారు. అడ విలో ప్రజలను సమీకరించి సాయుధ దళాలను నిర్మాణం చేసి విప్లవోద్యమంలో ఒక కీలక భూమికను పోషించారు. శ్రీకాకుళ ఉద్యమంతో తిరిగి సజీవ సంబంధాలు ఏర్పరచుకోవడంతో పాటు అఖిల భారత స్థాయిలో ఉద్యమాన్ని విస్తరింపజేయ డానికి సత్యనారాయణ సింగ్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించారు. 1975లో కామ్రేడ్ సీపీ, సీపీఐ (ఎంఎల్) కేంద్రకమిటీ సభ్యుడయ్యాడు. 1979లో కామ్రేడ్ సత్యనారాయణసింగ్ స్థానంలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీ అయ్యాడు. 1980 ప్రత్యేక మహాసభలో కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. కామ్రేడ్ సీపీ 1975కి పూర్వం, 1975లో కేంద్ర కమిటీకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు రూపొందించడంలో ప్రముఖ భూమిక పోషించారు. తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుం డా విప్లవ పార్టీకి ప్రాథమికంగా, సాపేక్షికంగా సరైన కార్యక్రమాన్ని, పంథాను రూపొందిం చడంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. సీపీ తన జీవిత కాలమంతా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని తీసుకొని, అప్పటికే పట్టణాలకు బహిరంగ కార్యక్రమాలకు, ఎన్నికలకు పరిమితమైపోయి ఆదివాసీలను, దళితులను నిర్ల క్ష్యం చేస్తున్న రివిజనిస్టు రాజకీయాలను కేవలం వ్యతిరేకం చడం మాత్రమే కాకుండా ఆచరణలో వాటిని నిరూపించడానికి వరంగల్, ఖమ్మం ఆదివాసీలు నివసించే అడవిని కార్యరం గంగా ఎంచుకున్నారు. సాయుధ పోరాటం ద్వారానే విప్లవం సిద్ధిస్తుందని భావించి విప్లవ సైన్యానికి బీజరూపమైన సాయుధ దళాల నిర్మాణానికి ఆ అడవిని కేంద్రం చేసుకున్నాడు. అడవి, అడవిలోని ఆదివాసీలను సమీకరించడం ద్వారా పట్ట ణాలు, గ్రామాల మీద ప్రభావం కలిగించవచ్చునని భావిం చాడు. వరంగల్, కరీంనగర్, ఖమ్మంతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా ఆదివాసీలను సమీకరించి వారి హక్కుల కోసం నిలకడగలిగిన ఉద్యమాన్ని నిర్మించారు. ఆ విధంగానే ఎమర్జెన్సీకి ముందుగానే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో దళితులను, పేదలను సమీకరించే కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూని వర్సిటీ విద్యార్థులను విప్లవోద్యమం వైపు ఆకర్షించి రాష్ర్టవ్యాప్త విద్యార్థి ఉద్యమానికి మార్గం చూపారు. 1978 తర్వాత కరీం నగర్ జిల్లాలో సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతంలో దొరలకు వ్యతి రేకంగా సాగిన రైతాంగ పోరాటానికి ప్రత్య క్షంగా, పరోక్షంగా నాయకత్వం వహించారు. తెలంగాణలో వందల, వేలమంది విప్లవ కార్యకర్తలను, లక్షలాది మంది ప్రజలను పోరాట బాట పట్టించిన ఘనత చండ్రపుల్లారెడ్డిదే. ఆయన నాటిన విప్లవ భావాలు ఈ నాడు సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో అడుగ డుగునా ప్రతిఫలిస్తున్నాయి. భారత కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించిన కొద్ది మంది మార్కిస్టు లెనినిస్టు సిద్ధాంత కర్తల్లో చండ్ర పుల్లారెడ్డి ప్రముఖులు. భారత విప్లవోద్యమంలో ఆచ రణ, సిద్ధాంతం రెండింటినీ జోడించి విప్లవోద్యమాన్ని నిర్మిం చిన చండ్ర పుల్లారెడ్డి చిరస్మరణీయుడు. (నేడు చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి) చిట్టిపాటి వెంకటేశ్వర్లు సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు