crda act
-
Andhra Pradesh: వికేంద్రీకరణే మా విధానం
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. నూటికి నూరుపాళ్లు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, అడ్డంకులన్నీ అధిగమించి వికేంద్రీకరణ చేసి తీరుతామని ఆయన తేల్చిచెప్పారు. హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదేనని పార్లమెంట్లో కేంద్రం చెప్పిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన ఉద్ఘాటించారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలని.. రాజధాని ఫలాలు అందరూ అనుభవించాలని చెప్పారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని.. మూడు రాజధానులపై గురువారం హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరంలేదని.. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకెళ్తామని బొత్స స్పష్టంచేశారు. పరిపాలన వికేంద్రీకరణపై తాము అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆ కమిటీ సూచనలు పట్టించుకోలేదేం? పునర్విభజన చట్టం ప్రకారం ఓ కమిటీ వేశారని.. కానీ, గత ప్రభుత్వం ఆ కమిటీ సూచనలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని.. అలాగే, నారాయణ కమిటీ నిర్ణయాన్ని ఎందుకు అనుసరించారని మంత్రి బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే కదా హిమాచల్ ప్రదేశ్‌లో రెండు, మూడు రాజధానులు పెడుతున్నారని ఆయన చెప్పారు. సమయం, ఖర్చు, నిధులు అనే మూడు అంశాలపై రాజధాని నిర్మాణం ముడిపడి ఉందని, వీటిపై చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని.. వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లు తెస్తాం ఇక న్యాయస్థానం చెప్పినట్లుగా.. సీఆర్డీఏ చట్టంలో ఉన్నట్లుగా.. ల్యాండ్ పూలింగ్‌లో రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను అభివృద్ధిచేసి ఇస్తామని అసెంబ్లీలోనే చెప్పామని, దానికి తామేమీ వ్యతిరేకం కాదని బొత్స స్పష్టంచేశారు. కాకపోతే అది మూడు నెలలకు అవుతుందా? ఆరు నెలలకు అవుతుందా? అనే దానిపై సాధ్యాసాధ్యాలను ఆలోచించుకుని అఫిడవిట్ దాఖలు చేస్తామని ఆయన వివరించారు. న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించి అడ్డంకులన్నీ తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా బిల్లు తీసుకొస్తామని బొత్స చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు. ప్రస్తుతం సీఆర్డీఏ చట్టం అమల్లో ఉందని, అలాగే.. అమరావతి భూములను చంద్రబాబు హయాంలోనే హడ్కోకు తనఖా పెట్టారని.. ఇప్పుడేమీ కొత్తగా జరిగింది కాదని ఆయన గుర్తుచేశారు. ఇక రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇస్తామన్నవి అనీ7ఏ్న ఇస్తున్నాం కదా? మధ్యలో ఎవరికి క్షమాపణ చెప్పాలని పచ్చమీడియా ప్రశ్నకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామో లేదో మీరు చూస్తారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. -
చంద్రబాబు రైతుల భూములు లాక్కున్నారు.. సాక్ష్యాలు ఇవిగో: ఎమ్మెల్యే ఆర్కే
-
పది రోజుల్లో కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు చెల్లుబాటు కానివిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై పది రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అప్పటివరకు కార్యాలయాల తరలింపుపై యథాతథస్థితి (స్టేటస్కో) కొనసాగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 14వతేదీకి వాయిదా వేసింది. రాజధాని తరలింపునకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలను ప్రస్తుత వ్యాజ్యాలకు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం ప్రత్యేకంగా విచారించింది. అది విధానపరమైన నిర్ణయం.. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తూ ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం కోసం రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేదీ జోక్యం చేసుకుంటూ ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో పది రోజుల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని, కార్యాలయాలు ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమని వివరించారు. -
3 రాజధానులకు మార్గం సుగమం
సాక్షి, అమరావతి: చరిత్రాత్మక బిల్లులను శాసనసభ మంగళవారం ఆమోదించింది. ‘పరిపాలన వికేంద్రీకరణ – ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’, ‘సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’లను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమైంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఈ బిల్లులను ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకారం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది. గత సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను శాసనసభ ఆమోదించి మండలికి పంపింది. ఈ బిల్లులను శాసనమండలిలో అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ విఫలయత్నాలు చేసింది. ఆ బిల్లులను పరిశీలించేందుకు సెలక్ట్ కమిటీకి నివేదించాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో మండలి నియమావళిని ఉల్లంఘించింది. నిబంధనల ప్రకారం శాసనమండలి చైర్మన్‌కు ముందస్తు నోటీసు ఇవ్వలేదు. నియమావళిలో నిర్దేశించిన ప్రక్రియను పాటించలేదు. కాబట్టి ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి నివేదించడం సాధ్యం కాదని ప్రభుత్వంతోపాటు రాజ్యాంగ నిపుణులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆ రెండు బిల్లులను శాసనసభలో రెండోసారి ప్రవేశపెట్టి ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఆమోదం ► ‘పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ‘సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’ను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ► ఏపీ పంచాయతీ రాజ్ చట్టం –1994 సవరణ బిల్లుకు ఆమోదం. ఏజెన్సీ పంచాయతీల్లో 100 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేసేలా చట్ట సవరణకు ఈ బిల్లు తెచ్చారు. ప్రలోభాలు, అక్రమాలకు స్థానం లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా తెచ్చిన మార్పులు కూడా బిల్లులో ఉన్నాయి. ► ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం –2005 సవరణ బిల్లుకు ఆమోదం ► జీఎస్టీ 38వ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న చట్ట సవరణ నిర్ణయం మేరకు రాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం. ► ఏపీ ఆబ్కారీ చట్టం–1968 సవరణ బిల్లుకు ఆమోదం. ► అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ మద్య నిషేధ చట్టం–1995 సవరణ బిల్లుకు ఆమోదం. ► పురపాలక కార్పొరేషన్ల చట్టం– 1955, ఏపీ పురపాలికల చట్టం–1965 సవరణ బిల్లుకు ఆమోదం. ► ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం. విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణతోపాటు ప్రమాణాలు పాటించేలా కమిషన్ పర్యవేక్షిస్తుంది. ► తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–జూన్ వరకు బడ్జెట్ కేటాయింపులకు వీలుగా ఆర్డినెన్స్ తెచ్చారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ► రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో నియామకాల్లో మార్పులు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది. -
బిల్లులపై మండలిలో రగడ
సాక్షి, అమరావతి: తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లును, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. వీటిని ప్రవేశపెట్టే విషయమై ఉదయం సభ ప్రారంభం నుండి సాయంత్రం వరకు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగించారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకునే ఉద్దేశంతో రూల్–71 కింద నోటీసు ఇచ్చి, దానిపై చర్చకు టీడీపీ పట్టుబట్టగా, బిల్లులు ప్రవేశపెట్టాలని అధికార పక్షం పదేపదే విజ్ఞప్తి చేసింది. దీనిపై నిర్ణయం తీసుకునే విషయంలో గందరగోళం నెలకొనడంతో మండలి చైర్మన్ షరీఫ్ పలుమార్లు సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి సభ ప్రారంభమైన అనంతరం చైర్మన్ అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో మొదట రూల్–71పై చర్చించి ఆ తర్వాత బిల్లులు ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వ బిల్లులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని.. సందర్భం లేకుండా రూల్–71ను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని.. రూల్–71 అంశంపై చర్చించిన అనంతరం బిల్లుల విషయమై ఆలోచిద్దామని అనడంతో మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఏ అంశంపై అయినా జీఓ విడుదలైన తర్వాత దానికి సంబంధించిన విధానం చర్చకు వస్తుందని తెలిపారు. కానీ, రూల్–71పై చైర్మన్ ఇచ్చిన రూలింగ్ సరికాదని.. దానికంటే ముందు తమ బిల్లులనే తీసుకోవాలని కోరారు. అలాగే, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత దానిపై ప్రతిపక్షం డివిజన్ కోరినా ఆమోదించినా, తిరస్కరించినా వారిష్టమని, అయితే ముందు బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని కోరారు. సాయంత్రం రూల్–71పై నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలంగా 27మంది, వ్యతిరేకంగా 11మంది ఓటేశారు. తటస్థంగా తొమ్మిది మంది నిలిచారు. బిల్లులను అడ్డుకోవడం సరికాదు : కంతేటి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకోవడం సరికాదని, విలువైన సూచనలు చేసి సహకరించాలని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు సూచించారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి వారికి తగినంత మంది సభ్యులు లేకపోయినా ప్రతిపక్ష సభ్యులు సహకరించి బిల్లులపై మండలిలో చర్చకు సహకరించిన విషయాన్ని గుర్తుచేశారు. మండలిని రద్దుచేసుకునే పరిస్థితిని తీసుకురావద్దని హితవు పలికారు. బిల్లులను అడ్డుకోవడం సరికాదు : పీడీఎఫ్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతున్నా వాటిని అడ్డుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీలో అమోదం పొందిన బిల్లులు శాసనమండలికి వస్తే వాటిని అనుమతించకుండా చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపి గంటల తరబడి సభను స్తంభింపజేయడం ఏమిటని ప్రశ్నించారు. 13 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. బిల్లులపైనే మొదట చర్చ : బీజేపీ బీజేపీ సభ్యుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రూల్–71 అంశంపై చర్చించేలా చూడాలని కోరారు. మరోవైపు.. తాము ప్రతిపాదించిన అంశంపైనే చర్చ జరగాలని టీడీపీ.. బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి బొత్స మరోసారి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు చెప్పినట్లు చేస్తే ఎలాగని చైర్మన్‌ను ప్రశ్నించారు. చైర్మన్ పదవి గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని కోరారు. మళ్లీ గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశమైన తర్వాత ఇరుపక్షాల మధ్య సమోధ్య కుదిర్చేందుకు చైర్మన్ షరీఫ్ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ప్రభుత్వం కోరిన విధంగా ముందు రెండు బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రూల్–71 ప్రకారం చర్చ ప్రారంభించి మొత్తం మూడు అంశాలను కలిపి చర్చించేందుకు చైర్మన్ అనుమతించారు. అనంతరం.. మంత్రులు బుగ్గన, బొత్స రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. చర్చ అయినా ప్రారంభించండి లేదా బిల్లులను పాస్ చేయాలని చైర్మన్‌ను కోరారు. ఈ పరిస్థితుల్లో యనమల మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సవరణలు ప్రతిపాదిస్తామని, సెలక్ట్ కమిటీకి పంపాలన్నారు. రూల్–71 అంశం, రెండు బిల్లులను విడివిడిగా చర్చించాలని కోరారు. అంతకుముందు సభలో ఇలా.. అంతకుముందు.. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ, అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో ఆమోదం కోసం పంపారని ప్రకటించారు. తర్వాత టీడీపీ సభ్యులు రూల్–71 ప్రకారం నోటీసు ఇచ్చారని పరిగనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ తదితర మంత్రులతో పాటు వైఎస్సార్సీపీ సభ్యులు కోరారు. అసెంబ్లీలో ఆమోదం పొంది సభకు వచ్చిన బిల్లుకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని.. నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయన్నారు. అదే రూల్–71 నోటీసుపై ఏడు రోజుల్లో ఎప్పుడైనా చర్చకు చేపట్టవచ్చన్నారు. చెడు సంప్రదాయాలకు నాంది పలకొద్దు రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ సభ్యులు కోరుతున్నట్లు రూల్–71 ప్రకారం ముందు చర్చకు అనుమతిచ్చి సభలో చెడు సంప్రదాయానికి నాంది పలకొద్దంటూ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అవంతి శ్రీనివాసరావు, ఆళ్ల నాని, కె.నారాయణస్వామి, కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, మేకపాటి గౌతంరెడ్డి, పుష్పశ్రీ వాణి, తానేటి వనిత, మేకతోటి సుచరితతో పాటు వైఎస్సార్సీపీ సభ్యులు చైర్మన్‌ను కోరారు. అయినప్పటికీ చైర్మన్ స్పందించకపోవడంతో అధికార పార్టీకి చెందిన సభ్యులు పలుమార్లు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్సీపీ సభ్యులు జంగా కృష్ణమూర్తి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, షేక్ మహ్మద్ ఇక్బాల్, గంగుల ప్రభాకర్‌రెడ్డిలు పొడియం వైపు వెళ్లి బిల్లులపై మొదట చర్చించాలని పట్టుబట్టారు. ఇలా.. అధికార, విపక్ష సభ్యులు ఎవరికి వారు తమ వాదనకే కట్టుబడడంతో చైర్మన్ షరీఫ్ పలుమార్లు సభను వాయిదా వేశారు. చివరికి చైర్మన్ రూల్–71 కింద చర్చకు చైర్మన్ అనుమతిచ్చారు. చర్చలో టీడీపీ సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సభలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో గందరగోళం నెలకొంది. మరోవైపు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై బుధవారం శాసన మండలిలో చర్చ చేపట్టనున్నారు. టీడీపీకి ఐదుగురు ఎమ్మెల్సీల షాక్ తెలుగుదేశం పార్టీకి ఐదుగురు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మూడు రాజధానులపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి మద్దతివ్వకుండా వారు ఝలక్ ఇచ్చారు. పోతుల సునీత, చదిపిరాల శివనాథరెడ్డి శాసన మండలిలో 71 రూలుపై జరిగిన చర్చకు నిర్వహించిన ఓటింగ్‌లో పార్టీకి నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. శత్రుచర్ల విజయరామరాజు, శమంతకమణిలు మండలికి గైర్హాజరై పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకంగా టీడీపీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఓటింగ్‌లో రూల్–71కి అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11మంది ఓటు వేయగా 9 మంది తటస్థంగా ఉన్నారు. -
సీఆర్డీఏ చట్టంపై ప్రత్తిపాటి పుల్లారావు
-
సీఆర్డీఏ చట్టం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలివే..
* గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాలు.. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ ప్రభుత్వం విడిగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలో చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉండేవి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటికంటే ఇప్పుడు మరిన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. (పాత జాతీయ రహదారి నుంచి ప్రకాశం బ్యారేజీ టు మంగళగిరి వై-జంక్షన్ వరకూ ఉన్న గుంటూరు రెవెన్యూ గ్రామాలు) తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్. మంగళగిరి మండలం: కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, నౌలూరు, దాని పరిధిలోని హామ్లెట్స్, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు: తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాం తం కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. భట్టిప్రోలు మండలం: శివంగులపాలెం, భట్టిప్రోలు (గ్రామ నెం.16 అద్దేపల్లి), వెల్లటూరు గ్రామాలు ఉన్నాయి. హాపొన్నూరు మండలం: మునిపల్లె, మామిళ్లపల్లె, తొండమూడి, ఉప్పరపాలెం, చింతలపూడి, వెల్లలూరు, ఆరమండ, దండమూడి, పచ్చల తాడిపర్రు, మన్నవ, దొప్పలపూడి, జడవల్లి, నిడుబ్రోలు, జూపూడి, బ్రాహ్మణ కోడూరు, వడ్డిముక్కల గ్రామాలున్నాయి. ప్రత్తిపాడు మండలం: కొండపాడు, యనమదల, ఏదులపాలెం, నడింపాలెం, ప్రత్తిపాడు, మల్లయ్యపాలెం, గొట్టిపాడు, కొండజాగర్లమూడి, గణికెపూడి గ్రామాలున్నాయి. పెదనందిపాడు మండలం: గొరిజెవోలు, గుంటెపాలెం గ్రామాలున్నాయి. యడ్లపాడు మండలం: మర్రిపాలెం, ఉన్నవ, కొండవీడు, సొలస, వంకాయలపాడు, మైదవోలు, యడ్లపాడు, విశ్వనాథుని కండ్రిగ, జాలాది, తిమ్మాపురం, కరుచోల గ్రామాలు. నాదెండ్ల మండలం: నాదెండ్ల గ్రామం ఉంది. ఫిరంగిపురం మండలం: హవుసు, గణేశ, రేపూడి, ఫిరంగిపురం, అమీనాబాద్, నుదురుపాడు, వేమవరం, బేతపూడి, తల్లూరు, యర్రగుంట్లపాడు, సిరంగిపాలెం, తక్కెళ్లపాడు గ్రామాలున్నాయి. ముప్పాళ్ల మండలం: మాదాల గ్రామం. సత్తెనపల్లి మండలం: పెదమక్కెన, కొమెరపూడి, లక్కరాజు, గార్లపాడు, నందిగామ, కంటిపూడి, భీమవరం, కంకణాలపల్లి, గుడిపూడి, పణిదెం, అబ్బూరు, పాకాలపాడు, రెంటపాళ్ల, గోరంట్ల, కట్టమూరు, భట్లూరు, వడ్డవల్లి గ్రామాలున్నాయి. పెదకూరపాడు మండలం: మొత్తం మండల ప్రాంతమంతా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. అచ్చంపేట మండలం: కష్టాల అగ్రహారం, కోనూరు, ఓర్వకల్లు, అంబడిపూడి, వేల్పూరు, చిగురుపాడు, మిట్టపాలెం, పెదపాలెం, చామర్రు (అచ్చంపేట, నీలేశ్వరపాలెం పంచాయితీలు కలుపుకుని), తాళ్లచెర్వు, చింతపల్లె, కోగంటివారి పాలెం గ్రామాలున్నాయి. కోసూరు మండలం: అనంతవరం, అగ్రహా రం, క్రోసూరు, విప్పర్ల, ఊటుకూరు, బయ్యవరం, పారుపల్లి, పీసపాడు, అందుకూరు, బాలెమర్రు, ఉయ్యందన గ్రామాలున్నాయి. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొం డూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి. నందిగామ మండల పరిధిలో: కంచర్ల, ఐతవరం, సత్యవరం, రాఘవాపురం, అంబరుపేట, కేతవీరునిపాడు, చందాపురం, మునగచర్ల, కురుగంటివాని కండ్రిగ, లచ్చపాలెం, అడవిరావులపాడు, లింగాలపాడు, తక్కెళ్లపాడు, పల్లగిరి, మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, తొర్రగుడిపాడు, కొణతం ఆత్మకూరు, దాములూరు, సోమవరం, రుద్రవరం, గొల్లమూడి గ్రామాలున్నాయి. చందర్లపాడు మండలం: చింతలపాడు, విభరీతపాడు, ఏటూరు, కోనాయపాలెం, బ్రహ్మబొట్లపాలెం, మేడిపాలెం, గుడిమెట్ల, గుడిమెట్లపాలెం, బొబ్బెళ్లపాడు, మునగాలపల్లె, ముప్పా ల, తుర్లపాడు, తోటరావులపాడు, పట్టెంపాడు, చందర్లపాడు, ఉస్తెపల్లె, కాసరబాద, పొక్కునూరు, కొడవటికల్లు, పున్నవల్లె, వేలాడి, పొప్పూరు గ్రామాలున్నాయి. మైలవరం మండలం: తొలుకోడు, కీర్తిరాయణగూడెం, వెదురుబీడెం, కనిమెర్ల, పర్వతపురం, తుమ్మలగుంట, గన్నవరం, చంద్రాల, మైలవరం, వెల్వదం, గణపవరం, పొందుగుల, జనగాలపల్లె, చంద్రగూడెం, సబ్జపాడు గ్రామాలున్నాయి. అగిరిపల్లె మండలం: మండలం మొత్తంతో పాటు పట్టణ పరిధిలో ఉన్న ప్రాంతం కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. బాపులపాడు మండలం: మల్లవల్లి, రేమల్లె, సింగన్నగూడెం, వెలేరు, బాపులపాడు, సెరి నరసన్నపాలెం, రంగన్నగూడెం, శోభనాద్రిపురం, కొదురుపాడు, బండారుగూడెం, అంపాపురం, వీరవల్లె, వెంకటరాజుగూడెం, తిప్పనగుంట, కొనుమోలు, ఆరుగొలను, వెంకటాపురం, చిరివాడ, కొయ్యూరు, బొమ్ములూరు, బొమ్ములూరు కండ్రిగ, దంతగుంట్ల, కాకులపాడు, రామన్నగూడెం, ఓగిరాల, కురిపిరాల గ్రామాలున్నాయి. నూజివీడు మండలం: హనుమంతుని గూ డెం, వెంకాయపాలెం, అన్నవరం, ముక్కొల్లుపాడు, నూజివీడు, సంకొల్లు, ఎనమడాల, బాతులవారిగూడెం, రావిచెర్ల, బూరవంచ, రామన్నగూడెం, మొర్సపూడి, దేవరగుంట, జంగంగూడెం, తుక్కులూరు, వేంపాడు, గొల్లపల్లె, పొలసనపల్లె, మీర్జాపురం, పోతురెడ్డిపల్లె, పల్లెర్లమూడి, మోక్షనరసన్న పాలెం, సీతారాంపురం, మర్రిబందం గ్రామాలున్నాయి. పమిడిముక్కల మండలం: మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా. మొవ్వ మండలం: పెదశనగలూరు, భాట్ల పెనుమర్రు, అయ్యంకి, పెదపూడి, యద్దనపూడి, కూచిపూడి, బార్లపూడి, మొవ్వ, గుడపాడు, వేములమాడ గ్రామాలున్నాయి. చల్లపల్లి మండలం: చల్లపల్లి, వెలివోలు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, పురిటిగడ్డ, లక్ష్మీపురం, చిడెపూడి, నడకుదురు, పాగోలు గ్రామాలున్నాయి. ఘంటశాల మండలం: శ్రీకాకుళం, తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకల్లెపల్లె, వేములపల్లె, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం గ్రామాలున్నాయి. పామర్రు మండలం: రాపర్ల, పామర్రు, పసుమర్రు, రెమ్మనపూడి, కొండిపర్రు, ఐనంపూడి, బల్లిపర్రు, జెమి గొల్వెపల్లి, కొమరవోలు, పెదమద్దాలి, అడ్డాడ, కురుమద్దాలి, కనుమూరు, ఉరుటూరు, జుజ్జవరం, జామిదగ్గుమల్లి. పెదపారుపూడి మండలం: మండలం మొత్తం ప్రాంతంతో పాటు పట్టణ ప్రాంతం. గుడివాడ మండలం: గుడివాడ రూరల్, చౌటుపల్లి, చిన ఎరుకపాడు, బొమ్ములూరు, గంగాధరపురం, పెద ఎరుకపాడు, మందపాడు, బల్లిపాడు, బేతవోలు, నాగవరప్పాడు, వలివర్తిపాడు, చిలకంపూడి, దొండపాడు, లింగవరం, మెరకగూడెం, సీపూడి, తాటివర్రు, అల్లిదొడ్డి, రమణపూడి, చిరిచింతల, సేరిదింటకొర్రు, సిద్దాంతం, సేరివేల్పూరు గ్రామాలు. గుడ్లవల్లేరు మండలం: సేరికాల్వపూడి, పెంజెండ్ర, చిత్రం, అంగలూరు, గుడ్లవల్లేరు, వేముగుంట గ్రామాలున్నాయి. నందివాడ మండలం: చేదుర్తిపాడు, జనార్ధనపురం, నూతులపాడు, శ్రీనివాసపురం, నందివాడ, పుట్టగుంట, వొద్దులమెరక, చినలింగాల, పెదలింగాల, అరిపిరాల, రామాపురం, తుమ్మలపల్లె గ్రామాలున్నాయి. తోట్లవల్లూరు మండలం: మొత్తం మండలంతో పాటు పట్టణ ప్రాంతం కూడా. మోపిదేవి మండలం: కప్తనపాలెం, కోకిలగడ్డ, బొబ్బర్లంక, మోపిదేవి, మోపిదేవిలంక, నాగాయతిప్ప, అన్నవరం, వెంకటాపురం, పెదప్రోలు గ్రామాలున్నాయి. -
అమల్లోకి సీఆర్డీఏ
* ఏపీ రాజధాని పరిధి 7,068 చ.కిలోమీటర్లు * సీఆర్డీఏ చట్టం గెజిట్ నోటిఫికేషన్ జారీ * సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలను నోటిఫై చేసిన ప్రభుత్వం * రాజధాని నగర ప్రాంత పరిధి 122 చదరపు కిలోమీటర్లుగా చట్టంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ చట్టాన్ని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ చట్టం మంగళవారం (డిసెంబర్ 30వ తేదీ) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం.. చట్టంలో పేర్కొన్న అంశాలన్నిటిపై అధికారాలన్నీ సీఆర్డీఏకు దక్కుతాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధి, ఆ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలు తదితర వివరాలతో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీఏ షెడ్యూల్లో పేర్కొన్నట్లు మొత్తం రాజధాని పరిధి 7,068 చదరపు కిలోమీటర్ల మేరకు ఉంటుందని, రాజధాని నగర పరిధి 122 చదరపు కిలోమీటర్లలో ఉంటుందని వివరించారు. రాజధాని ప్రాంత ప్రజల సంక్షేమం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజా సంస్థలను, పట్టణాభివృద్ధి నిపుణులను సంప్రదించి రాజ ధాని ప్రాంతాన్ని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రద్దయిన వీజీటీఎం ఉడా... సీఆర్డీఏ చట్టంపై నోటిఫికేషన్ జారీతో ఆ చట్టం మంగళవారం అమలులోకి రావటంతో.. అదే రోజు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం ఉడా) రద్దయినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. సీఎం చైర్మన్‌గా సీఆర్డీఏ కమిటీ ప్రభుత్వం సీఆర్డీఏకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. సీఆర్డీఏకు ఏపీ ముఖ్యమంత్రి చైర్మన్‌గానూ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గానూ ఉంటారు. ఆర్థికమంత్రి, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యుత్, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సీఆర్డీఏ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారని పేర్కొన్నారు. ముగ్గురు సభ్యులతో కార్యనిర్వాహక కమిటీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే పలు కార్యక్రమాల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్‌గా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మెంబర్ కన్వీనర్‌గా సీఆర్డీఏ కమిషనర్ ఉంటారని పేర్కొన్నారు. కమిటీకి మరి కొంత మంది సభ్యు లు అవసరముందని భావిస్తే మరికొన్ని ప్రభు త్వ విభాగాల ఉన్నతాధికారులను నామినేట్ చేసుకోవచ్చని కూడా స్పష్టంచేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం ఇకపై రాజధాని ప్రాంతానికి భూమిని సమీకరించుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలుంటాయని జీఓలో పేర్కొన్నారు. సీఆర్డీఏ కమిషనర్‌గా శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ)కి కమిషనర్‌గా ఎన్.శ్రీకాంత్‌ను నియమిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవలే ఆయనను సీఆర్డీఏ ప్రత్యేక కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే సీఆర్డీఏ చట్టం-2014పై మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన దరిమిలా శ్రీకాంత్‌ను కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.