datsun redi-Go
-
కారు కొనాలనుకునే వారికి తీపికబురు
ప్రముఖ కారు తయారీ కంపెనీలు మారుతి సుజుకి, మహీంద్రా ఈ ఫిబ్రవరి నెలలో కార్లపై భారీ తగ్గింపును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్సాన్, డాట్సన్ కంపెనీలు కూడా ఇప్పుడు తమ కార్లపై రూ.95 వేల వరకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. డాట్సన్ తన వాహన శ్రేణిలో మూడు కార్లపై ఆఫర్లు ప్రకటిస్తే, నిస్సాన్ కిక్స్‌పై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు అన్ని ఫిబ్రవరి 2021నెలలో బుకింగ్ చేసుకున్న వాటికీ మాత్రమే వర్తిస్తుంది. ఆ కార్ల వివరాలు ఇలా ఉన్నాయి. నిస్సాన్ కిక్స్: ఈ కారు ధర రూ.9.49 లక్షల నుంచి రూ.14.64 లక్షల వరకు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో కంపెనీ రూ.25వేల నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.50 వేలు, రూ. 20 వేలు లాయల్టీ బెనిఫిట్లతో పాటు మొత్తం రూ.95 వేల డిస్కౌంట్ కస్టమర్లకు అందిస్తోంది. డాట్సన్ రెడి-గో: ఈ కారు ధర రూ.2.86 లక్షల నుంచి రూ.4.82 లక్షల వరకు ఉంటుంది. ఈ నెలలో కంపెనీ రూ.15 వేల నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.15 వేల, రూ.4 వేల లాయల్టీ బెనిఫిట్లతో కలుపుకొని మొత్తం రూ.34 వేల వరకు డిస్కౌంట్ కస్టమర్లకు అందిస్తోంది. డాట్సన్ గో: ఈ కారు ధర రూ.4.02 లక్షల నుంచి రూ.6.51 లక్షల వరకు ఉంటుంది. ఈ డిస్కౌంట్లు డాట్సన్ గో యొక్క అన్ని వేరియంట్లలో వర్తిస్తాయి. ఈ కారుపై రూ.20వేల నగదు తగ్గింపు, రూ.20వేల ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కలుపుకొని మొత్తం రూ.40 వేల డిస్కౌంట్ అందిస్తుంది. డాట్సన్ గో ప్లస్: ఈ కారు ధర రూ.4.25 లక్షల నుంచి రూ.6.99 లక్షల వరకు ఉంటుంది. ఈ నెలలో కంపెనీ రూ.20వేల నగదు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.20వేలతో మొత్తం రూ.40 వేల వరకు మొత్తం డిస్కౌంట్ కస్టమర్లకు అందిస్తోంది. చదవండి: అమెజాన్ ఇండియాను బహిష్కరించాలి -
మరింత స్టయిలిష్‌గా ‘డాట్సన్ రెడిగో’
న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. డాట్సన్ ఇండియా ‘స్టయిలిష్ రెడి–గో లిమిటెడ్ వెర్షన్ 2018’ను విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఈ లిమిటెడ్ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది. స్టయిలిష్ డిజైన్, పోల్చలేని పనితీరు, ఇంధన సామర్థ్యం, సౌకర్యం ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకతలుగా కంపెనీ తెలియజేసింది. సరికొత్త బాడీ గ్రాఫిక్స్, రియర్ పార్కింగ్ అసిస్ట్ సెన్సార్ సహా ఎన్నో ప్రత్యేక సదుపాయాలు ఇందులో ఉన్నట్టు పేర్కొంది. 0.8 లీటర్ల ఎంటీ వెర్షన్ ధర రూ.3.58 లక్షలు. 1.0 లీటర్ ఎంటీ వెర్షన్ ధర రూ.3.85 లక్షలు. వైట్, సిల్వర్, రెడ్ రంగుల్లో దేశవ్యాప్తంగా నిస్సాన్, డాట్సన్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. -
1 లీటర్ ఇంజిన్‌తో మార్కెట్లోకి ‘డాట్సన్ రెడి–గో’
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్’ తాజాగా 1 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో ‘డాట్సన్ రెడి–గో’లో కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.3.57 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. రెండు వేరియంట్లలో లభ్యంకానున్న ఈ కొత్త వెర్షన్ లీటరుకు 22.5 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన రెడి–గో కొత్త వెర్షన్లో ఇంటెలిజెంట్ స్పార్క్ ఆటోమేటెడ్ టెక్నాలజీతో రూపొందిన 1 లీటర్ ఇంజిన్‌ను అమర్చామని కంపెనీ పేర్కొంది. నిస్సాన్ గతేడాది డాట్సన్ బ్రాండ్ కింద 800 సీసీతో రెడి–గోను తీసుకొచ్చింది. -
లీటర్ ఇంజిన్‌తో రెడీ-గో..ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ : జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ కొత్తగా ఒక లీటరు ఇంజిన్‌తో డాట్సన్ రెడీ-గో కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.3.57 లక్షలుగా నిస్సాన్ తెలిపింది. ఈ కొత్త వాహనం లీటరుకు 22.5 కిలోమీటర్లు వరకు ప్రయాణించే ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ కారు టాప్-వేరియంట్ మోడల్ ధర రూ.3.72 లక్షలుగా ఉంది. గతేడాది విజయవంతంగా లాంచ్ చేసిన రెడీ-గోలో ప్రస్తుతం తీసుకొచ్చిన 1.0 లీటర్ ఇంజిన్ వేరియంట్ అత్యంత శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించనున్నట్టు నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా చెప్పారు. ఈ కొత్త మోడల్ అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుందని, కస్టమర్లకు స్టయిల్‌గా, అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఫైవ్ స్పీడు మాన్యువల్ ట్రాన్సమిషన్ ఇది కలిగిఉంది. గతేడాదే 800సీసీ రెడీ-గోను నిస్సాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత ఈ మోడల్‌ను లిమిటెడ్ ఎడిషన్‌లో స్పోర్ట్స్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. 2014లో భారత్‌లో ఎంట్రీ లెవల్ డాట్సన్ గో లాంచ్ చేయడంతో నిస్సాన్, డాట్సన్ బ్రాండును గ్లోబల్‌గా రీలాంచ్ చేసింది. గో, గో ప్లస్ కార్ల తర్వాత డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ మూడో కారుగా రెడీ-గోను తీసుకొచ్చింది. చిన్న కార్ల మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ-గోను డాట్సన్ తీసుకొచ్చింది. డాట్సన్ బ్రాండులో ఇప్పటివరకు 90,000 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. -
నిస్సాన్ డాట్సన్ రెడి-గో వచ్చేసింది
♦ ధర రూ.2.38-3.34 లక్షల రేంజ్లో ♦ 25.17 కి.మీ. మైలేజీ న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్‌లో కొత్త చిన్న కారు మోడల్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. డాట్సన్ రెడి-గో పేరుతో అందిస్తున్న ఈ పెట్రోల్ కారు ధరలు 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్లో నిర్ణయించామని నిస్సాన్ ఇండియా కంపెనీ తెలిపింది. డాట్సన్ రెడి గో కారును ఐదు వేరియంట్లు-డి, ఏ, టీ, టి(ఓ), ఎస్‌ల్లో అందిస్తున్నామని నిస్సాన్ ఇండియా ఎండీ, అరుణ్ మల్హోత్ర చెప్పారు. చిన్న కారు అంటే భారత్‌లో ఉన్న అంచనాలను ఈ డాట్సన్ గో మార్చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం నుంచే విక్రయాలు ప్రారంభించామని తెలిపారు. ధరల పోరు షురూ! రెడీ గో రాకతో ఎంట్రీ-లెవల్ సెగ్మంట్లో ధరల యుద్ధానికి తెర లేవనున్నదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ కారు మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, రెనో క్విడ్ కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులంటున్నారు. ఈ కార్ల ధరలు రూ.2.5 లక్షల నుంచి రూ4.42 లక్షల రేంజ్లో ఉన్నాయి. మూడో డాట్సన్ కారు: డాట్సన్ బ్రాండ్ కింద కంపెనీ అందిస్తోన్న మూడో కారు ఇది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫాం మీద ఈ కారును నిస్సాన్‌కంపెనీ తయారు చేస్తోంది. 800 సీసీ ఇంజిన్, ఐదు గేర్లు ఉన్న ఈ కారు 25.17 కి.మీ. మైలేజీని ఇస్తుందని, వంద కిమీ, వేగాన్ని 15.9 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని అరుణ్ పేర్కొన్నారు.