death certificates
-
ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు..
సాక్షి, హైదరాబాద్: బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిధ్దమైంది. మొత్తం నలుగురు బల్దియా ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. హెల్త్ విభాగం సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. స్టాటిస్టికల్ విభాగంలో ఏఎస్ఏ, డీఎస్ఓ లను సొంత డిపార్ట్ మెంట్లకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ ఆపరేటర్ల నియామకంలో అవకతవకలపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేయాలన్నారు. ఇలాంటివి పునరాృతం కాకుండా చూడాలని కమిషనర్, మిగతా అధికారులకు ఆదేశాలు పంపారు. ఏం జరిగిందంటే..? ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్‌తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. చదవండి: రసవత్తరంగా రాజకీయం.. కవిత లేఖకి ఈడీ రిప్లై! -
ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారాయన. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారాయన. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటు దారులను అరికట్టేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్‌తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. -
భలే అడ్వొకేట్లు.. వంశ వృక్షాన్నే డూప్లికేట్ చేశారు!
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: న్యాయవాద వృత్తిలో ఉన్న తల్లీ కుమారుడు సునాయసంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కారు. బతికున్న యజమానులను చనిపోయినట్లుగా సర్టిఫికెట్లు సృష్టించి.. నకిలీ వారసులను తెరపైకి తీసుకొచ్చి.. వారి ద్వారా రూ.75లక్షల విలువచేసే ఆస్తి కాజేయబోయారు. బాధితుడి ఫిర్యాదుతో బండారం బయటపడిపోయింది. కీలక సూత్రధారులైన తల్లీ కుమారుడు, వీరికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆదివారం తన చాంబర్లో టూటౌన్ సీఐ శివరాముడుతో కలిసి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నివాసముంటున్న అనంతపురం వాసి శ్రీరాములునాయక్‌కు స్థానిక ఆదర్శ నగర్ కాలనీలో 333, 339 సర్వేనంబర్లలోని 5.14 సెంట్ల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. రూ.75లక్షలు విలువ చేసే ఈ ఆస్తిని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో ధర్మవరం న్యాయవాది కట్టా శ్రీదేవి, ఆమె కుమారుడు కట్టా గణేష్‌లు ఆ ఆస్తి డాక్యుమెంట్లు సేకరించారు. యజమాని ఇక్కడ లేనందున ఎలాగైనా ఆస్తిని కొట్టేయాలని కుట్ర పన్నారు. శ్రీరాములు నాయక్, ఆయన భార్య ఇద్దరూ చనిపోయినట్లుగా తమ ల్యాప్‌టాప్‌లోనే నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేశారు. కట్టా శ్రీదేవి తనకు అత్యంత నమ్మకస్తురాలైన పనిమనిషి ముత్యాలమ్మ, అనిల్‌కుమార్, బండిమాల లోకేశ్వర, సాంబశివ, డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాసప్రసాద్, గుర్రం గణేష్‌ల సహకారం తీసుకున్నారు. అనిల్‌కుమార్‌ను శ్రీరాములునాయక్ కొడుకుగా చిత్రీకరిస్తూ ఆధార్‌కార్డులో మార్పులు చేశారు. నకిలీ వంశ వృక్షం తయారు చేయించారు. వీటి ద్వారా గత సెప్టెంబర్ 23న ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శ్రీరాములునాయక్ ఆస్తిని అనిల్‌కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత అనిల్‌కుమార్ నుంచి పనిమనిషి ముత్యాలమ్మకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించారు. మోసం బయటపడిందిలా.. శ్రీరాములు నాయక్ తన ఆస్తిని అమ్మే ఏర్పాట్లను ఈ నెలలో ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ’ అనిల్‌కుమార్ నుంచి ముత్యాలమ్మకు వెళ్లినట్లు బయటపడింది. దీంతో శ్రీరాములునాయక్ ఎవరో తన ఆస్తిని కాజేశారని ఎస్పీ ఫక్కీరప్పకు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ కేసును టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. దర్యాప్తులో తల్లీ కొడుకులైన అడ్వొకేట్లు కట్టా శ్రీదేవి, కట్టా గణేష్‌ల పన్నాగం బయట పడింది. దీంతో తల్లీకుమారుడితో పాటు ధర్మవరం మండలం దర్శినమలకు చెందిన బేతరాసి అనిల్‌కుమార్, అనంతపురం రామ్‌నగర్‌కు చెందిన జింక శ్రీనివాస ప్రసాద్, చెన్నేకొత్త పల్లి మండలం బసంపల్లికి చెందిన పుట్టపర్తి సాంబశివ, బండిమాల లోకేశ్వర్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, డెత్ సర్టిఫికెట్, లీగల్ హైర్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. -
ఎప్పటికప్పుడు జనన, మరణాల ధ్రువీకరణ
సాక్షి, అమరావతి: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. గడిచిన 53 మాసాల్లో 34.87 లక్షల బర్త్ సర్టిఫికెట్లు, 19.86 లక్షల డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. పుట్టిన తర్వాత చట్టబద్ధమైన గుర్తింపు కోసం జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఇందులో శిశువు జన్మించిన తేదీ, సమయం, ప్రాంతం, లింగం తదితర వివరాలుంటాయి. అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడానికి మృతి చెందిన వారికి మరణ ధ్రువీకరణ పత్రం కూడా తప్పనిసరి. అందుకే రాష్ట్రంలో జనన మరణ ధ్రువీకరణ విధిగా చేయాలని ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలో సైతం జనన మరణాల ధ్రువీకరణకు సంబంధించిన పర్యవేక్షణ ఉంటోంది. అందుకే కరోనా లాంటి విపత్తుల సమయంలోనూ రికార్డు స్థాయిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రజలు తీసుకున్నారు. కేవలం 2020లోనే 7,14,017 మంది జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోగా, 2021 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ 4,39,402 మంది పుట్టినట్టు జనన ధ్రువీకరణ పత్రాలను బట్టి తేలింది. పుట్టిన 7 రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్, మృతి చెందిన మూడు రోజుల్లో డెత్ సర్టిఫికెట్ జారీ అవుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో శిశు ఆధార్ ప్రాజెక్టు అమలు కావాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ రోజుల్లో ప్రతీ ప్రభుత్వ పథకానికి, అవసరానికి ఆధారం తప్పనిసరిగా మారింది. అందుకే చిన్నారికి 1 రోజు వయస్సు ఉన్నా కూడా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యుఐడీఏఐ తెలిపింది. ఇందు కోసం శిశువు జనన ధ్రువీకరణ పత్రం అవసరం. అందుకే అటు బర్త్ సర్టిఫికెట్, ఇటు ఆధార్ వెనువెంటనే వచ్చేలా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశారు. చిన్నారుల నుంచి ఎలాంటి ఫింగర్ ఫ్రింట్ తీసుకోకుండా మొదట ఆధార్ జారీ చేస్తారు. ఆ తర్వాత పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆ బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అలాగే నెలవారీ హెచ్ఎంఐఎస్ (హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం), ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ ఛైల్డ్ హెల్త్) పోర్టల్‌కు అనుసంధానించే వారి పేర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు ఆదేశించారు. జీవనశైలి జబ్బుల వివరాలు కూడా హెచ్ఎంఐఎస్ పోర్టల్‌కు అనుసంధానించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో.. గత ఏడాది అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకూ అత్యధికంగా కర్నూలు జిల్లాలో 90,450 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 72,775 మందికి జారీచేసి రెండో స్థానంలో నిలిచింది. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. 2020లో ఆ జిల్లాలో 55,656 పత్రాలు జారీచేశారు. 48,965 డెత్ సర్టిఫికెట్లు జారీచేసి గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 20,509 మాత్రమే డెత్ సర్టిఫికెట్లు జారీచేశారు. 2021 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ 30 వరకూ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 50,116 బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా, ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 48,742 డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇవి పక్కాగా నమోదు అయినవి మాత్రమే అని, కొన్ని నమోదు కావాల్సినవి కూడా ఉంటాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. -
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు: నిర్ధారిత మరణాలకే ధ్రువపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్ధారణ పరీక్షల్లో కరోనాగా తేలి, మరణానికి అదే కారణమైనపుడు మాత్రమే కోవిడ్–19 మరణ ధ్రువపత్రాలు జారీచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. కోవిడ్ మరణ ధ్రువపత్రాలు జారీ చేయడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించాయి. కోవిడ్ మృతుల మరణానికి గల కారణాలతో వైద్య ధువ్రపత్రాలు కుటుంబసభ్యులు, బంధువులకు జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. జూన్ 30న కోవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యంపై పదిరోజుల కిందట సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా మార్గదర్శకాల్లో ఓ విధానాన్ని కేంద్రం పొందుపరిచింది. అఫిడవిట్లో పేర్కొన్న ప్రధానాంశాలు: ► ఆర్టీపీసీఆర్ పరీక్ష, మాలిక్యులర్ టెస్ట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా కోవిడ్–19 నిర్ధారణ కావడం లేదా కోవిడ్ సోకినట్లు ఆసుపత్రిలో వైద్యులు ధ్రువీకరిస్తేనే... కోవిడ్–19 కేసుగాపరిగణిస్తారు. ► కరోనా ఉన్నప్పటికీ విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాద మృతి తదితర వాటిని కోవిడ్–19 మరణంగా గుర్తించరు. ► ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం కరోనాతో మృతి చెందిన వారిలో 95 శాతం మంది సోకిన 25 రోజుల్లోపే మరణించారు. అయినప్పటికీ కరోనా సోకిన తర్వాత 30 రోజుల్లో మృతి చెందిన వారిని కూడా కోవిడ్–19 మృతులుగా గుర్తించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ► మార్గదర్శకాల పరిధి, ఎంసీసీడీలోకి రాకుండా కోవిడ్–19తో మృతి చెందిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాస్థాయిలో రాష్ట్రాలు/ కేంద్ర పాలితప్రాంతాలు కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా స్థాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారి లేదా వైద్య కళాశాల మెడిసిన్ హెడ్, విషయ నిపుణుడు ఉండాలి. ► జిల్లా స్థాయి కమిటీ ముందు మృతుడి కుటుంబసభ్యుడు/ బంధువులు వినతి పత్రం ఇవ్వాలి. ► ఫిర్యాదు వినతి మేరకు వాస్తవాలన్నీ పరిశీలించి కమిటీ తగిన ధ్రువపత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ► ఆయా ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరించాలి. -
అప్పటికి మూడో వేవ్ ముగుస్తుంది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మార్గదర్శకాలు రూపొందించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కరోనా మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని మేము గతంలోనే ఆదేశించాం. ఆ తర్వాత గడువును పొడిగించాం కూడా. మీరు మార్గదర్శకాలు రూపొందించే సమయానికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది’’ అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఈ కేసుని విచారిస్తూ మార్గదర్శకాలను ఈ నెల 11లోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నష్టపరిహారం అసలైన వారికి చేరాలంటే కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్ జారీకి కూడా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కొందరు అడ్వకేట్లు గతంలోనే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన సుప్రీం కోర్టు ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనకు రెండు సార్లు గడువు పొడిగించింది. ఇక మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి మార్గదర్శకాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఈ అంశం ఉందని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
బతికుండగానే చంపేస్తున్నారు..
రామచంద్రపురం రూరల్:ఆమె బతికుంది. పింఛను సొమ్ము అందుకుంటోంది. కానీ ఆమె చనిపోయినట్టుగా మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది.అతడు బతికున్నాడు. భార్యను విడిచిపెట్టి వేరే ఊరిలో ఉంటున్నాడు. అయితే అతను చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు.ఇలా రామచంద్రపురం మండలంలో పలు గ్రామాల్లో బతికుండగానే చనిపోయినట్టుగా కొందరు పంచాయతీ కార్యదర్శులు డెత్ సర్టిఫికెట్లు జారీ చేయడం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామానికి చెందిన వనుం సుబ్బాయమ్మకు ప్రస్తుతం 66 ఏళ్లు. ఆమె ప్రభుత్వం అందిస్తున్న పింఛను తీసుకుంటోంది. గత ఏడాది మార్చిలో ఆమె చనిపోయినట్టుగా పంచాయతీ కార్యదర్శి బి.నారాయణాచార్యులు డెత్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. విశేషమేంటంటే సుబ్బాయమ్మది తాళ్లపొలం గ్రామమైతే పక్క గ్రామమైన ఉట్రుమిల్లికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఈ డెత్ సర్టిఫికెట్ మంజూరు చేశారు. ఆధార్ కార్డు నంబరు, ఇంటి నంబరు, భర్త పేరు, అన్నీ ఒక్కటే కానీ, కేవలం గ్రామం పేరు మాత్రమే మార్చి ఈ డెత్ సర్టిఫికెట్ మంజూరు చేయడం గమనార్హం. అయితే దీని మంజూరు వెనుక గల కారణాలు తెలియరాలేదు. ఇక్కడ కూడా.. తాళ్లపొలం గ్రామానికే చెందిన మరో మహిళను ఆమె భర్త విడిచిపెట్టి వేరే గ్రామంలో ఉంటున్నాడు. అయితే ఆమె రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉట్రుమిల్లి అడ్రస్‌కు మార్పించి, ఆమె భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ మంజూరు చేశారని చెబుతున్నారు. ఈ అక్రమ డెత్ సర్టిఫికెట్ల మంజూరు వెనుక కారణాలను ఉన్నతాధికారులు బయటపెట్టాలని పలువురు కోరుతున్నారు. -
కాసులిస్తేనే ధ్రువీకరణ!
కరీంనగర్ హెల్త్: పుట్టినా పైసలే.. చచ్చినా పైసలే అన్నట్లు ఉంది వ్యవహారం. ఏ సర్టిఫికెట్ కావాల న్నా చేతులు తడపాల్సిన దుస్థితి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ఉంది. రికార్డులు భద్రపరిచే గది సిబ్బంది కాసుల కక్కుర్తికి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణపత్రాలు పొందాలంటే డబ్బులు ఇవ్వందే అందడం లేదు. అవసరమే ఆసరా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మంథని శ్రీరా ములు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కుమారుడు శంకర్‌దాసు దుబయ్‌లో ఉంటున్నాడు. మరణించిన తర్వాత గడువులోపు ధ్రువీకరణపత్రం తీసుకోవాలనే అవగాహన లేకపోవడంతో అతను దుబయ్ వెళ్లిపోయాడు. తన తల్లికి ప్రభుత్వం నుంచి వితంతువు పింఛన్ దరఖాస్తు కోసం తన తండ్రి మరణ ధ్రువీకరణపత్రం అవసరం ఏర్పడింది. దీని కోసం దరఖాస్తు చేసుకోగా మున్సిపాలిటీలో రికార్డు కాలేదని ఆస్పత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో మృతుడి భార్య దరఖాస్తు చేసుకోగా రికార్డులు ఇప్పుడు దొరకవని.. పరిశీలించి రాయాలంటే డబ్బులు ఖర్చు అవుతుందని అనధికార అసిస్టెంట్ ద్వారా డిమాండ్ చేశాడు. ఇలా రెండు వారాల తర్వాత ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి జోక్యంతో మరణ ధ్రువీకరణపత్రం జారీ అయ్యింది. అవగాహన లోపం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి నుంచి జనన, మరణ ద్రువీకరణపత్రం పొందాలంటే కాసులు ఇవ్వాల్సిందే. ఈ ధ్రువీకరణపత్రం పొందడానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణపత్రం సకాలంలో పొందాలనే అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారుల అమాయకత్వం, అవసరాన్ని ఆసరాగా చేసుకొని సర్టిఫికెట్లు జారీ చేసే ప్రభుత్వ ప్రధానాస్పత్రి రికార్డులు భద్రపరిచే గది అధికారి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సర్టిఫికెట్ జారీ చేయడానికి రెండు నుంచి రూ.5వేలు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు తెలుపుతున్నారు. డిమాండ్ చేసిన డబ్బులు ముట్టచెప్పకపోతే వారాల తరబడి రికార్డులు లేవంటూ తిప్పుకుంటున్నారని బాధితులు పేర్కొంటున్నారు. తప్పుల తడకగా రికార్డులు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు రెండు నెలల్లోపు సంబంధిత మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల నుంచి పొందాల్సి ఉంటుంది. రెండు నెలల గడువు దాటితే ఆర్డీవో నుంచి పొందాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ప్రభుత్వాస్పత్రి వైద్యుడి ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికెట్ కోసం ఆస్పత్రిలోని రికార్డులు ఉండే గది అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ సర్టిఫికెట్ జారీ చేయడానికి రికార్టుల గది సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రికార్డులు లేవని, వెతికిన దొరకడం లేదని, రికార్డుల్లో తప్పులు ఉన్నాయంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తప్పులు ! ధ్రువీకరణపత్రాల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో రికార్డు గది సిబ్బంది వివరాలు తప్పులతడుకగా నమోదు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు, లేదా తల్లిపేరు, లేదా మరణించిన వారి పేర్లు, పుట్టిన, మరణించిన తేదీలు ఇలా ఏదో ఒకటి రికార్డుల్లో తప్పులు రాసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలకు ఇక్కడి నుంచి రికార్డుల సమాచారం ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. రికార్డులలో తప్పులు ఉండడంతో వాటిని సరిచేసుకునేందుకు ప్రభుత్వాస్పత్రి రికార్డుల గది అసిస్టెంట్‌ను సంప్రదించాల్సి వస్తుంది. వాటిని సరిచేసి సర్టిఫికెట్ జారీ చేయాలంటే మరికొన్ని డబ్బులు ఇవ్వాలని ప్రజలను డిమాండ్ చేస్తే అందినకాడికి దండుకుంటున్నారు. అనధికార సిబ్బందితో పనులు జనన, మరణ ధ్రువీకరణపత్రాలు భద్రపరిచే రికార్డు గదిలో ప్రైవేట్ వ్యక్తుల చెలామణి చేస్తూ.. రికార్డులు రాస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. రికార్డుగదిలో ఒకరు మాత్రమే సిబ్బంది ఉన్నారు. పని ఒత్తిడి అవుతుందనే సాకుతో అనధికారికంగా మరొకరిని అసిస్టెంట్‌గా ఏర్పాటు చేసుకొని అతని ద్వారా డబ్బులు వసూలు చేయిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. -
బతికున్న వాళ్లను చనిపోయినట్లుగా..
బంజారాహిల్స్: గుర్రపు పందేలకు బానిసైన ఓ యువకుడు... బతికున్న వాళ్లను చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ కటకటాల పాలయ్యాడు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పోరంకి గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీ బాలవంశీకృష్ణ (31) మణికొండ పుప్పాలగూడ సమీపంలోని వినాయనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. జల్సాలకు, గుర్రపు పందేలకు బానిసై అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు ప్రణాళికలు రూపొందించాడు. కార్లు అద్దెకు తీసుకొని రెండు నెలలు గడిచిన తర్వాత సంబంధిత కారు యజమాని చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి దానిని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టసాగాడు. కొనుగోలుదారులకు ఆ కారు యజమాని చనిపోయాడని తనకే విక్రయించాడంటూ నమ్మించేవాడు. ఇప్పటి వరకు ఎనిమిది మంది దగ్గర ఇలా కార్లు అద్దెకు తీసుకొని ఆ యజమానులు చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి ఓఎల్ఎక్స్లోనే వాటిని అమ్మకానికి పెట్టాడు. ఇలా రూ.30 లక్షలు వసూలు చేశాడు. గత నెల గుర్రపు పందేల్లో రూ.25 లక్షల వరకు నష్టపోయాడు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన శ్రీలత అనే మహిళకు ఇలాగే ఓ కారును విక్రయించాడు. ఆ కారు యజమాని సురేష్ జాదవ్ చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించడంతో ఆమె రుణసౌకర్యం కోసం బ్యాంకుకు వెళ్లి ప్రశ్నించింది. అసలు విషయం అక్కడ బయటపడింది. దీంతో నిందితుడిని విచారించగా ఇప్పటి వరకు చేసిన మోసాలన్నీ ఒప్పుకున్నాడు. నెట్లోకి వెళ్లి చనిపోయిన వారి డేటా తీసుకొనేవాడు. అందులో వారిపేర్లు చెరిపేసి తాను అద్దెకు తీసుకున్న కారు యజమాని పేరును రాసి చనిపోయినట్లుగా చిత్రీకరించేవాడని పోలీసులు తెలిపారు. కార్ల పేరుతో ఎనిమిది మందిని మోసం చేశారని తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐ బచ్చు శ్రీనును డీసీపీ అభినందించారు. -
ఉండీ..లేనట్టే
బోట్‌క్లబ్ (కాకినాడ) :లక్ష్యం మంచిదే అయినా అమలులో చిత్తశుద్ధి లోపించి ఈ-పంచాయతీ పథకం అటకెక్కింది. గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల సర్టిఫికెట్ల జారీని పారదర్శకంగా చేయాలనే సంకల్పంతో లక్షల రూపాయల వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ పథకం కంప్యూటర్లు మూలనపడ్డాయి. పంచాయతీల్లో జనన, మరణ ధృవపత్రాలు సకాలంలో అందించాలని ఆరు నెలల క్రితం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అన్ని పంచాయతీలకూ కంప్యూటర్లు, స్కానర్లు అందించిన అధికారులు కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదు. ఫలితంగా కంప్యూటర్ ఆపరేటర్లు చేసే పనిలేక గోళ్లు గిల్లుకుంటున్నారు. పంచాయతీల ద్వారా ధృవపత్రాలు జారీకి కావల్సిన సాఫ్ట్వేర్ ఇంతవరకూ రూపొందించకపోవడం పథకంపై యంత్రాంగానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష వెచ్చించి కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, జిరాక్స్, యూపీఎస్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఇవన్నీ ఉన్నా బ్రాడ్‌బ్రాండ్ లేకపోవడంతో కంప్యూటర్లకు పని లేక మూలనపడ్డాయి. బాడ్ బ్రాండ్ ఇక్కట్లు... సాంకేతిక పరిజ్ఙానం ద్వారా ప్రజలకు మేలైన పాలన అందించాలనే ఉద్దేశంతో గత జూన్‌లో ఈ- పంచాయతీని ప్రారంభించారు. జిల్లాలో వెయ్యికి పైగా పంచాయతీలుండగా వాటిని క్లస్టర్లుగా మార్చి, 729 పంచాయతీలుగా విభజించారు. ప్రాథమికంగా 549 పంచాయతీల్లో ఈ-పంచాయతీని అమలు చేశారు. వీటిలో 363 పంచాయతీలకు బీఎస్ఎన్ఎల్ నెట్ కనెక్షన్ అందచేశారు. మిగిలిన వాటికి ఆ కనెక్షన్ ఇవ్వకపోవడంతో కంప్యూటర్లు మూలన పడ్డాయి. వీటి నిర్వహణ కార్వే అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించగా గత జూన్ నుంచి నెలకు రూ.7000 చొప్పున వేతనంతో ఆపరేటర్లను నియమించారు. అప్పటి నుంచి వారు వేతనాలు పొందుతున్నారే తప్ప చేసే పనిలేక ఖాళీగా ఉంటున్నారు. ఈ-పంచాయితీకు ఇంటర్నెట్ బ్రాడ్ బ్రాండ్ సౌకర్యం అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకున్నా క్షేత్రస్థాయిలో ఇబ్బందులతో ఇవ్వలేకపోతోంది. కొన్ని చోట్ల లైన్లు లేకపోవడంతో ఇంటర్నెట్ సౌకర్యం ఇవ్వలేకపోతున్నామని, ఇందులో తమ తప్పేమీ లేదని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. సామర్లకోట మండలం చంద్రంపాలెం, ఉండూరు పంచాయితీలకు కంప్యూటర్లు సమకూర్చినా.. నెట్ సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. ఆ ప్రాంతాలకు లైన్లు వేయడానికి రైల్వే ట్రాక్ అడ్డురావడంతో బీఎస్ఎన్ఎల్ చేతులెత్తేసింది. ధృవీకరణ పత్రాల సాఫ్ట్వేర్ ఏదీ? ఈ-పంచాయతీల నిర్వహణకు పంచాయతీరాజ్‌శాఖ ఇనిస్టిట్యూట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సమకూర్చింది. పంచాయతీల్లో నిర్వహణ, జమా ఖర్చులు, బిల్లుల వంటివి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ద్వారా ఏ పంచాయతీలకు ఏ పనికి ఎంత బిల్లు చెల్లించాలో ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది. ఈ-పంచాయతీల ద్వారా జనన, మరణ పత్రాలు, ఆస్తి విలువలు, ఆస్తిపన్ను, ఇంటి పన్ను వసూలు వంటి వివరాలన్నీ నమోదు చేయాలి. నాలుగు నెలలు దాటినా ఈ తరహా సేవలు జిల్లాలో ఎక్కడా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
పింఛిన్ ఇయ్యిండ్రి.. బాంచెన్
* 30 ఏళ్ల కిందటి సర్టిఫికెట్లు ఎట్లా దేవాలి * వితంతు, ఒంటరి మహిళల ఆవేదన * అభాగ్యులను ఆదుకోవాలని ఆందోళన వెల్దుర్తి: ‘ఏండ్ల కిందట సచ్చిపోయినోళ్ల కాయిదాలు దెమ్మంటె యాడదెచ్చేది..? అవి లేకుంటె పింఛన్ కట్ జేస్తమని రాస్కపోనొచ్చిన సారు గట్టిగ బెదిరియ్యవట్టె. ఇగ మాకు పింఛిని రాకుంటె మా గతేమైతదో.. దండం బెడతాం బాంచెన్ పింఛిన్ ఇయ్యుండ్రి’’ అంటూ మండల పరిధిలోని మాసాయిపేటని పలువురు వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విధి వక్రీకరించి భర్తలను కోల్పోయిన తమను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, భర్తలను కోల్పోయిన తాము వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, తమకు పెన్షన్ రావాలంటే తప్పకుండా మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకురాల్సిందేనని ఈఓపీఆర్డీ జైపాల్‌రెడ్డి హెచ్చరించారన్నారు. 30 ఏళ్ల క్రితం చనిపోయిన వారి సర్టిఫికెట్లు ఎలా తెచ్చేదని ప్రశ్నించారు. మరికొంత మంది మహిళలు మాట్లాడుతూ.. తమ భర్తలు 20 ఏళ్ల క్రితమే తమను వదిలిపెట్టి వెళ్లిపోయారని, వారి వివరాలు ఎలా తేవాలంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ రమాదేవి గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. పలువురు మహిళలు కంటతడి పెడుతూ తమ గోడును తహశీల్దార్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన తహశీల్దార్ ఈఓపీఆర్డీకి ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఆగ్రహించిన తహసీల్దార్ ఈఓపీఆర్డీపై మెదక్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ దామోదర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడుతూ.. వితంతు మహిళలకు స్థానిక పంచాయతీ కార్యదర్శి నుంచి సర్టిఫికెట్ అవసరమని, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ఈఓపీఆర్డీ విధులకు గైర్హాజరు కావడంతో తహశీల్దార్ రమాదేవి ఇంటింటి సర్వే చేపట్టారు. స్థానిక ఎంపీటీసీ సిద్దిరాములుగౌడ్, ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఈఓపీఆర్డీపై అసహనం వ్యక్తం చేశారు. -
జననమరణ ధ్రువీకరణ పత్రాల తొలి ప్రతి ఉచితం
న్యూఢిల్లీ: తన పరిధిలో నివసించే పౌరులకు తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) తొలి ప్రతిని ఉచితంగా అందజేయనుంది. ఈ ప్రతి నేరుగా లబ్ధిదారుల ఆవాసాలకు రానుంది. ఈ పథకాన్ని శుక్రవారం ఈడీఎంసీ ఘనంగా ప్రారంభించింది. ఈడీఎంసీ పరిధిలోని ఆస్పత్రిలో జరిగే జనన, మరణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సంబంధిత పౌరుడికి దీనిని పోస్టుద్వారా పంపుతామని ఈడీఎంసీ ప్రజాసంబంధాల అధికారి యోగేంద్రసింగ్ మాన్ తెలిపారు. పత్పర్గంజ్లోని ఈడీఎంసీ కార్యాలయం వద్ద ఈ పథకాన్ని మేయర్ మీనాక్షి శుక్రవారం ప్రారంభించారు. ఇందుకోసం పౌరులు ఈడీఎంసీ పరిధిలోని వివిధ జోన్లలోగల సిటిజన్ సర్వీస్ బ్యూరో (సీఎస్బీ)లో లాంఛనాలను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందువల్ల సీఎస్బీలకు కొంతమేర పనిభారం తగ్గుతుంది. ఈ విషయమై ఈడీఎంసీ స్థాయీసమితి అధ్యక్షుడు బీబీ త్యాగి తాము పెట్టిన నూతన విధానం వల్ల తమ కార్పొరేషన్‌పై పౌరులకు విశ్వాసం మరింత పెరుగుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ పథకం అమలు వల్ల తమ కార్పొరేషన్‌పై ఏడాదికి అదనంగా రూ. 37,20,000 మేర భారంపడుతుందన్నారు. ఇదే విషయమై ప్రతిపక్ష నాయకుడు రాంనారాయణ్దూబే మాట్లాడుతూ ఈడీఎంసీ పరిధిలో మొత్తం 120 సంస్థలు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాయన్నారు. -
ఉచితంగానే సర్టిఫికెట్ల జారీ
న్యూఢిల్లీ: ఇక నుంచి ఉచితంగానే జననమరణ ధ్రువపత్రాలు జారీ చేస్తామని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎమ్సీ) ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు చేశామని ఎన్డీఎమ్సీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఆస్పత్రిలో శిశువు పుట్టడం లేదా ఎవరైనా మరణించినా అక్కడే ధ్రువపత్రం నకలును ముద్రించుకునేందుకు కూడా యాజమాన్యాలకు అవకాశం ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ ధ్రువపత్రాలపై సంతకాలు చేసేందుకు ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయం కేటాయించే అధికారులను ఆస్పత్రులు నియమించగానే వాటికి అనుమతులు మంజూరు చేస్తామని శ్రీవాత్సవ వివరించారు. ఈ విషయాలను వివరించేందుకు ఎన్డీఎమ్సీ జననాలు, మరణాల విభాగం ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఎన్డీఎమ్సీ పరిధిలోని అన్ని ఆస్పత్రుల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. వీరిలో ఎయిమ్స్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి, కళావతి సరణ్ ఆస్పత్రి, లేడీ హార్డింగ్ ఆస్పత్రి, సఫ్దర్‌జంగ్, శాంతి ఆవేదన, పాలికా మెటర్నిటీ, జేపీఎన్ఏ ట్రామా సెంటర్, నార్తర్న్ రైల్వే ఆస్పత్రి, చరక్ పాలికా ఆస్పత్రుల డాక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిశువు తల్లి, మృతుడి కుటుంబ సభ్యులకు జననమరణ ధ్రువీకరణ పత్రాలను ఉచితంగానే అందజేయాలని సుప్రీంకోర్టు, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించడంతో ఎన్డీఎమ్సీ ఈ నిర్ణయం తీసుకుంది. -
జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు ఇక ఉచితం
న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. జనన , మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరలో ఉచితంగా పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ఢిల్లీ ప్రభుత్వం స్థానిక లోహియా ఆస్పత్రిలో శుక్రవారం ప్రారంభించింది. ఈ ఆస్పత్రిలో ప్రసవమైన ఓ మహిళకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. శ్రీవాస్తవ ఈ సందర్భంగా జనన ధ్రువీకరణ పత్రాన్ని ఉచితంగా అందజేశారు. ఈ ఆస్పత్రిలో మొత్తం ఐదుగురికి ఆయన ఈ పత్రాలను అందజేశారు. ఈ ఆస్పత్రిలో ప్రతి నెలా సగటున 1,500 మరణాలు, జననాలు సంభవిస్తుంటాయన్నారు. కనీసం 500 పడకలు కలిగిన నగరంలోని మిగతా ఆస్పత్రులకు ఈ వెసులుబాటును త్వరలో విస్తరిస్తామన్నారు. జీటీబీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, భీమ్‌రాం అంబేద్కర్ తదితర ఆస్పత్రుల్లో 500 పడకలున్నాయి. మృతుడి సమీప బంధువుకి మరణ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారన్నారు. ప్రస్తుతం నగరంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు నమోదు చేస్తున్నాయి. దీంతోపాటు ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు కూడా వీటిని నమోదు చేస్తోంది. అయితే ఇక ఆస్పత్రుల్లోనూ ఈ వసతి కల్పించనుండడంతో కార్పొరేషన్లు లేదా కంటోన్మెంట్ బోర్డులకు పనిభారం కొంతమేర తగ్గడం ఖాయం.