Defence Department
-
సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ . భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపై దాడి చేయలేదని తెలిపిన కేంద్ర మంత్రి.. ఏ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు. అదే ఒకవేళ ఏ దేశమైన భారత్‌కు సవాల్ విసిరితే.. తాము ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రక్షణమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ‘ఢిఫెన్స్ సమ్మిట్’లో గురువారం రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో భారత రక్షణ రంగంలో చోటుచేసుకున్న మార్పులను, అభివృద్ధి వంటి అంశాలపై సైతం చర్చించారు. భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్‌పై దాడికి దిగితే తమ బలగాలు ధీటుగా బదులిస్తాయని హెచ్చరించారు. తాము ఏ దేశంపైనా దాడి చేయలేదని.. ఎవరి భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. కానీ, ఎవరైనా తమపై కన్నెత్తి చూస్తే, తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే తగిన సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని చెప్పారు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రక్షణ రంగానికి తాము ప్రాధాన్యత పెంచామని కేంద్రమంత్రి తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను (స్వయంశక్తి) ప్రోత్సహించామని, స్వదేశీ ఉత్పత్తితోపాటు రక్షణ పరికారల ఎగుమతి, సైనిక ఆధునికీకరణపై దృష్టి సారించామని చెప్పారు.దీని వల్ల భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైందని పేర్కొన్నారు. చదవండి: విమానంలో సీట్ కుషనింగ్ మాయం! - ఏం జరిగిందంటే.. -
16.8 కోట్ల మంది డేటా చోరీ!
గచ్చిబౌలి: వందలు.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది. రక్షణ శాఖ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షలాది మంది ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల డేటా అంగడి సరుకుగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల వివరాలూ కేటుగాళ్లకు చేరాయి. పాన్, ఫోన్ నంబర్లు, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల వివరాలు క్రిమినల్స్ పరమయ్యాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో డేటా చోరీకి పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సైబర్‌క్రైం పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని దొంగిలించి విక్రయిస్తున్న కేటుగాళ్ల ఆటకట్టించారు. ఢిల్లీ శివార్లలోని నోయిడా కేంద్రంగా ఈ దందా సాగిస్తున్న ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. రక్షణ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, నీట్ విద్యార్థులు, డీమ్యాట్ ఖాతాదారులు, ఐటీ సంస్థల ఉద్యోగులు, వాట్సాప్, ఫేస్బుక్ వినియోగదారులు, టెలికం, ఫార్మా కంపెనీలు, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల డేటా సహా మొత్తం 140 కేటగిరీలకు చెందిన సమాచారాన్ని నిందితులు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రక్షణ శాఖకు చెందిన (డిఫెన్స్ ఫోర్స్ ఢిల్లీ ఎన్సీఆర్ డేటాబేస్)కు చెందిన 2.55 లక్షల మంది డేటా సైతం చోరీకి గురికావడంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా చోరీలో జస్ట్ డయల్ అనే సెర్చ్ ఇంజన్ పాత్ర ఉందని, ఈ కేసులో ఆ సంస్థ వారినీ విచారిస్తామని ఆయన పేర్కొన్నారు. నిందితులు వీరే... యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో అనే కంపెనీల (కాల్‌సెంటర్లు) ద్వారా నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఏ1 కుమార్ నితీష్ భూషణ్‌తోపాటు టెలికాలర్ కుమారి పూజ, డేటా ఎంట్రీ ఆపరేటర్ సుశీల్ తోమర్, క్రెడిట్ కార్డుల డేటా విక్రయించే అతుల్ సింగ్, ఎంఎస్ గ్రో కంపెనీలో సేకరించిన డేటాను విక్రయించే ముస్కాన్ హసన్, గ్లోబల్ డేటాఆర్ట్స్‌లో జస్ట్ డయల్ ద్వారా డేటాను విక్రయించే సందీప్ పాల్, బల్క్ మెసేజ్‌లు పంపే జియా ఉర్ రెహమాన్లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 సెల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 సీపీయూలు, 140 కేటగిరీలలో డేటా చోరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా కార్యాలయాల్లో ప్రజల పాన్, మొబైల్, టెలికం, ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ, పెట్రోలియం కంపెనీలు, బ్యాంకుల డేటా, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల డేటాను పోలీసులు కనుగోన్నారు. నిందితులు ఇప్పటివరకు సుమారు 100 మంది సైబర్ క్రిమినల్స్‌కు డేటాను విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అలాగే 50 వేల మంది పౌరులకు చెందిన సమాచారాన్ని కేవలం రూ. 2 వేలకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డేటా చోరీపై సైబర్‌క్రైం పోలీసులకు అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. భారీగా డేటా చోరీ... నిందితులు చోరీ చేసిన డేటాలో 1.47 కోట్ల కార్ల యజమానుల, డొమైన్ వాయిస్ డేటాబేస్ 3.47 కోట్లు, మొబైల్ నంబర్ల డేటాబేస్ 3 కోట్లు, స్టూడెంట్ డేటాబేస్ 2 కోట్లు, వాట్సాప్ యూజర్లు 1.2 కోట్ల మంది డేటా చోరీ గురైంది. అలాగే జాబ్ సీకర్స్ డేటాబేస్ 40 లక్షలు, సీబీఎస్ఈ 12వ తరగతికి చెందిన 12 లక్షల మంది విదార్థులు, సివిల్ ఇంజనీర్ల వివరాలు 2.3 లక్షలు, డెబిట్ కార్డుల సమాచారం 8.1 లక్షలు, సీనియర్ సిటిజన్స్ 10.6 లక్షలు, వెబ్సైట్ ఓనర్స్ 17.4 లక్షలు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ డేటా చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. గుర్తించిన అంశాలు... ► పలు ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా, జస్ట్ డయల్ వంటి సంస్థలు ప్రజల అనుమతి లేకుండానే డేటాను సేకరిస్తున్నాయి. ► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో సేవలందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, వ్యక్తుల ద్వారా డేటా చోరీకి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ► గోప్యంగా ఉంచాల్సిన డేటా భద్రంగా ఉందోలేదో సర్వీసు ప్రొవైడర్లు తనిఖీ చేయట్లేదని తేలింది. ► జస్ట్ డయల్ లాంటి సంస్థల్లో డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. పోలీసుల సూచనలు... ► మీ డేటాను ప్రైవేటు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. ► క్రెడిట్ కార్డులు, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు, సంస్థలకు చెప్పొద్దు. ► మొబైల్, కంప్యూటర్, యాప్‌లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేసు దర్యాప్తు సిట్‌కు బదిలీ దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ముడిపడి ఉన్నందున డేటా చోరీ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందుకోసం డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ నేతృత్వంలో ‘సిట్’ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ టీమ్‌లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ రితిరాజ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర అధికారులు ఉంటారని తెలిపారు. క్రెడిట్ కార్డుదారుల డేటా చోరీ ముఠా అరెస్ట్ గచ్చిబౌలి: బ్యాంకుల్లో డేటా చోరీ చేసే ముఠాను సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. క్రెడిట్ కార్డుల వెరిఫికేషన్ చేస్తున్న థర్డ్ పార్టీకి చెందిన సిబ్బంది డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1,780 మంది కస్టమర్ల డేటాతోపాటు ఎస్బీఐకి చెందిన 140 మంది కస్టమర్ల డేటా చోరీకి గురైందన్నారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ప్రధాన నిందితుడు కఫిన్ అహ్మద్, మహ్మద్ సమాల్, మహ్మద్ అసీఫ్, చిరాగ్, విరేంద్ర సింగ్, ప్రదీప్ వాలియా, ఆకాశ్‌నిర్వాన్, విరాట్ పురి, అతీత్ దాస్‌లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 సెల్పోన్లు, ల్యాప్‌టాప్, క్రెడిట్ కార్డుల డేటా స్వాధీనం చేసుకున్నారు. -
కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికల తేదీ ప్రకటించిన రక్షణశాఖ
-
ఇండో పసిఫిక్ భద్రతపై ఆస్ట్రేలియాతో కలిసి అడుగులు
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ సముద్ర భద్రత, సవాళ్లపై ఆస్ట్రేలియాతో కలిసి అడుగులు వేస్తున్నామని తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ హరికుమార్ వెల్లడించారు. సీఎన్‌ఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో మూడు రోజులు అధికారికంగా పర్యటించారు. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ మార్క్ హమ్మండ్, ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ డేవిడ్ జాన్సన్‌తోపాటు రక్షణ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, పరస్పర సహకారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. సాగర జలాల్లో ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన చర్యలపై ఆస్ట్రేలియా అధికారులతో సమీక్షించారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని గురువారం విశాఖపట్నం చేరుకున్న రియర్ అడ్మిరల్ హరికుమార్ సముద్ర పర్యావరణం, హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ తీరంలో ఆధిపత్యం, ఇతర అంశాలపై కేంద్రీకృత ప్రయత్నాలను పెంచాల్సిన అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని తూర్పు నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి. -
బడ్జెట్ 2021: రక్షణ రంగం కేటాయింపులు..
న్యూఢిల్లీ : ఇటీవలి కాలంలో చైనా సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాల కొనుగోలు, ఆధునీకరణ అవసరాల దృష్ట్యా భారీ రక్షణ బడ్జెట్‌పై ఊహాగానాలు కొనసాగాయి. కానీ గత ఏడాది (రూ.4.71 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే స్వల్పంగా 1.4 శాతం పెరుగుదలతో రూ.4.78 లక్షల కోట్లకే పరిమితమైంది. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.63 శాతం. అయితే మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకోవడంతో పాటు, భారత్–పాకిస్తాన్, భారత్–చైనా సరిహద్దులను రక్షిస్తున్న సాయుధ బలగాలకు కూడా ఎక్కువ కేటాయింపులే లభించాయి. మరోవైపు తూర్పు లడాఖ్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. మిలటరీ అవసరాల కొనుగోలు కోసం గత బడ్జెట్ మూలధన వ్యయం కింద రూ.20,776 కోట్లు అదనంగానే సాయుధ బలగాలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రతులను పరిశీలిస్తే మాత్రం 2020–21 బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.1,13,734 కోట్లు కేటాయించగా సవరించిన మూలధన వ్యయం రూ.1,34,510 కోట్లుగా నమోదయ్యింది. చైనాతో గొడవ నేపథ్యంలో భారత సైన్యం గత కొన్ని నెలల్లో పలు దేశాల నుంచి ఆయుధాలు, మందుగుండు కొనుగోలు చేసింది. రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం రూ.1,35,060 కోట్లుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో కొత్త ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ నౌకలు ఇతర మిలటరీ సామగ్రి కొనుగోలు ఖర్చును కూడా కలిపారు. గత ఏడాది మూలధన వ్యయం రూ.1,13,734 కోట్లతో పోల్చుకుంటే ఇది 18.75 శాతం ఎక్కువ. మొత్తం బడ్జెట్లో రూ.1.15 లక్షల కోట్లు పెన్షన్లకు కేటాయించారు. గత ఏడాది (రూ.1.33 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే ఇది తక్కువ కావడం గమనార్హం. కాగా 2020–21లో సుమారు రూ.18 వేల కోట్ల పెన్షన్ బకాయిలు చెల్లించడమే ఇందుకు కారణమని అధికారులు వివరణ ఇచ్చారు. పెన్షన్‌ను మినహాయిస్తే జీతాల చెల్లింపులు, ఆస్తుల నిర్వహణ వంటి రెవెన్యూ ఖర్చు రూ.2.12 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఆర్మీకి మూలధన వ్యయం కింద రూ.36,481 కోట్లు, నౌకా దళానికి రూ.33,253 కోట్లు, వైమానిక దళానికి రూ.53,214 కోట్లు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద ఖర్చు చేసిన దానికంటే రూ.1,841 కోట్లు తక్కువ) కేటాయించారు. గత ఏడాది ఆర్మీకి రూ.33,213 కోట్లు, నౌకాదళానికి రూ.37,542 కోట్లు కేటాయించారు. వైమానిక దళ గత ఏడాది మూలధన వ్యయం రూ.43,281.91 కోట్లు కాగా సవరించిన అంచనా రూ.55,055 కోట్లుగా నమోదయ్యింది. సాయుధ బలగాలకు అదనంగా నిధులు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాయుధ బలగాలకు కేటాయింపు పెంచారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆర్థికమంత్రి రూ.1,03,802.52 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయింపు రూ.92,848.91 కోట్లతో పోల్చుకుంటే ఇది 7.1 శాతం ఎక్కువ. రాజ్‌నాథ్ కృతజ్ఞతలు రక్షణ బడ్జెట్ పెంచిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కృతజ్ఞతలు తెలి పారు. మూలధన వ్యయంలో దాదాపు 19% పెరుగుదల గత 15 ఏళ్లలో అత్యధికమని పేర్కొన్నారు. కొత్తగా 100 సైనిక్ స్కూళ్లు తెరిచే ప్రతిపాదనపై రాజ్‌నాథ్ ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. సంతృప్తికర బడ్జెట్ కరోనా విపత్తు నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే రక్షణ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయి. మూలధన వ్యయం రూ.22 వేల కోట్లు పెరగడం ఆహ్వానించతగ్గ పరిణామం. సైన్యం ఆధునీకరణ కసరత్తును కొనసాగించేందుకు ఇది ఉపకరిస్తుంది. – డాక్టర్ లక్ష్మణ్ బెహెరా, ప్రముఖ రక్షణ నిపుణుడు -
ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్ కారణంగానే..?
సాక్షి, సిటీబ్యూరో: ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లని వారికంటే కనీసం ఒక్కసారైనా వారి సహాయం పొందిన వారికే డిపార్ట్‌మెంట్‌పై సద్భావన ఉంటోంది. అయితే 70 శాతం సాధారణ ప్రజలు జీవితంలో ఒక్కసారి కూడా పోలీసులను ఆశ్రయించట్లేదు. – జాతీయ స్థాయిలో జరిగిన అనేక సర్వేలు వెల్లడించిన విషయమిది. ఈ సర్వేలకు తోడు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో పోలీసు పాత్రల్ని చిత్రీకరిస్తున్న తీరు వారిపై మరింత ప్రతికూల భావన కలిగేందుకు కారణమవుతోంది. ఇప్పటి వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వంటి భద్రతాదళాల నేపథ్యంలో సాగే చిత్రాలు ఇష్టం వచ్చినట్లు నిర్మితమయ్యేవి. అందులో అధికారులు, సిబ్బంది తీరుతెన్నుల్ని అవగాహన రాహిత్యంతో చిత్రీకరించడం, పూర్తి నెగిటివ్ రోల్లో నడిపించడం జరిగేవి. ఈ విధానాలకు చెక్ పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏక్తా కపూర్ నిర్మించిన ఓ వివాదాస్పద వెబ్ సిరీస్ కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసు విభాగం విషయంలోనూ ఇలాంటి విధానపరమైన చర్యలు అవసరమని అధికారులు కోరుతున్నారు. ఇవీ కేంద్రం ఉత్తర్వులు... భద్రతా బలగాల నేపథ్యంలో వస్తున్న అనేక చిత్రాలు, వాటి వల్ల తలెత్తిన వివాదాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వంటి బలగాలపై, ఆయా అధికారుల పాత్రల నేపథ్యంలో సాగే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు ఇష్టం వచ్చినట్లు తెరకెక్కించడానికి ఆస్కారం లేదు. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత కచ్చితంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రదర్శించాల్సి ఉంటుంది. వాటిని వీక్షించి, అందులో ఉన్న అంశాలను పరిశీలించే ఈ విభాగం అభ్యంతరకమైన వాటిని తొలగించాలని స్పష్టం చేస్తుంది. అలాంటివి ఏమీ లేకపోతే చిత్రం విడుదలకు అనుమతిస్తూ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేస్తుంది. దీన్ని సమర్పిస్తేనే సెన్సార్ బోర్డు చిత్రం/వెబ్‌సిరీస్/డాక్యుమెంటరీ విడుదలకు అనుమతి ఇస్తుంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ కేంద్ర సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. పోలీసుల పాత్రలు మరీ దారుణం... రాష్ట్రంలో విడుదలయ్యే తెలుగు/హిందీ చిత్రాల్లో దాదాపు ప్రతి దాంట్లోనూ పోలీసుల పాత్రలు ఉంటాయి. కానిస్టేబుల్ నుంచి డీఐజీ, డీజీపీ వరకు వివిధ హోదాల్లో ఈ పాత్రలు సాగుతూ ఉంటాయి. వీటిలో దాదాపు 90 శాతం నెగెటివ్ షేడ్స్‌లోనే నడుస్తుంటాయి. ఆయా పాత్రలతో లంచాలు, బెదిరింపులు, కబ్జాలు, హత్యలు సహా అనేక వ్యవహారాలు చేయిస్తూ ఈ క్యారెక్టర్లను తెరకెక్కిస్తూ ఉంటారు. వీటికి తోడు వారి డైలాగ్స్, వారిని ఉద్దేశించి ఎదుటి వారు చెప్పే మాటలు పోలీసులు అంటే నరరూప రాక్షసులన్న భావన కలిగిస్తూ సాగుతాయి. మరోపక్క పోలీసు యూనిఫామ్‌కు ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఒక్కో హోదాలో ఉండే అధికారి ఒక్కో తరహా స్టార్స్, బ్యాడ్జ్‌లు, టోపీలు ధరిస్తూ ఉంటాయి. సినిమాల్లోని పాత్రలు చెప్పే హోదా ఒకటి ఉంటే.. వారి యూనిఫాంపై కనిపించే స్టార్స్ తదితరాలు మరో హోదాకు సంబంధించినవి ఉంటాయి. అత్యంత క్రమశిక్షణ కలిగిన పోలీసు విభాగాన్ని ప్రతిబింబించే ఆయా నటీనటులు దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీటిని వీక్షించే ప్రజలు పాటు కొన్ని సందర్భాల్లో కొందరు పోలీసులు చేసే తప్పుల్నీ అందరికీ ఆపాదిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పోలీసులపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడటానికి కొంత వరకు దోహదపడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక మారిన పరిస్థితులు... రాష్ట్ర పోలీసు విభాగంలో ఇప్పుడు ఒకప్పటి పరిస్థితులు లేవు. ప్రధానంగా 2014 తర్వాత విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీసు విభాగానికి కీలక ప్రాధాన్యం ఇచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్న అధికారులు ప్రతి స్థాయిలోనూ సాంతికేతికత, జవాబుదారీతనం పెంచుతూ పోయారు. ప్రత్యేక యాప్‌లు, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే విధానాలను ప్రవేశపెట్టారు. అధికారులతో పాటు పోలీసుస్టేషన్లకూ ర్యాకింగ్స్ ఇస్తున్నారు. ఫలితంగా పోలీసుల ప్రవర్తన, బాధితుల్ని రిసీవ్ చేసుకునే విధానం సహా అనేక అంశాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రజల్లో పెరిగిన అవగాహన, చైతన్యం సైతం దీనికి ప్రధాన కారణంగా మారింది. ఆరోపణలు వచ్చిన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ‘సినిమా పోలీసు’ల్లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించట్లేదు. నానాటికీ ఈ పాత్రలు దిగజారుతున్నాయి. ఇది చాలదన్నట్లు కొన్ని సినిమాల్లో ఆయా పోలీసుస్టేషన్ల పేర్లు, వాహనాలపై కమిషనరేట్ల లోగోలు సైతం కనిపించేలా చిత్రీకరిస్తున్నారు. ఇవన్నీ మారాలంటే రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రం మాదిరిగా ‘పోలీసు–సినిమా’లపై ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులకు నివేదిస్తాం పోలీసు విభాగాన్ని కించ పరుస్తూ వచ్చిన చిత్రాలు, సినిమా పేర్లపై ఇప్పటికే సెన్సార్ బోర్డును ఆశ్రయిస్తున్నాం. ‘మెంటల్ పోలీస్’, ‘పోలీసోడు’ టైటిల్స్‌పై లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపాం. ‘గబ్బర్‌సింగ్’ చిత్రంలో యూనిఫాంను అవమానించడాన్నీ తప్పుపట్టాం. పోలీసు విభాగంలో తప్పులు చేసే వారి శాతం 5 కంటే తక్కువే ఉంటుంది. వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని అహర్నిశలు శ్రమిస్తూ, అంకిత భావంతో పని చేసే 95 మందిని అవమానించడం సరికాదు. పోలీసు యూనిఫాంకు ఒక కోడ్ ఉంటుంది. అనేక సినిమాల్లో దీని ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఇప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ తీసుకున్న చర్యల్ని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. పోలీసు విభాగానికి సంబంధించీ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చేలా ప్రభుత్వాని కోరమని వారి దృష్టికి తీసుకువెళ్తాం. – గోపిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం -
చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు
న్యూఢిల్లీ: చైనా ఆర్మీలోని వివిధ ఇతర విభాగాల నుంచి నిధులు, వనరులను భారీ స్థాయిలో నౌకాదళానికి మళ్లించారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ గురువారం చెప్పారు. ఈ విషయాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సైనిక అభివృద్ధిపై చైనా రక్షణ శాఖ బుధవారమే ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. తన మిలటరీ అభివృద్ధిని ఇండియా, అమెరికా, రష్యాల అభివృద్ధితో చైనా ఈ శ్వేతపత్రంలో పోల్చింది. అందులోని వివరాలను పరిశీలించిన మీదట కరమ్‌వీర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిక్కీ నిర్వహించిన ‘నౌకల నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం’ అనే కార్యక్రమంలో కరమ్‌వీర్ సింగ్ ప్రసంగించేందుకు వచ్చి, అక్కడి విలేకరులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘చైనా తన శ్వేత పత్రంలోనే కాదు. గతంలోనూ ఈ వివరాలు చెప్పింది. ఆర్మీలోని ఇతర విభాగాల నుంచి నిధులను, వనరులను నౌకాదళానికి వారు మళ్లించారు. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఇలా చేశారు. మనం దీనిని జాగ్రత్తగా గమనిస్తూ, మనకున్న బడ్జెట్, పరిమితుల్లోనే ఎలా స్పందించగలమో ఆలోచించాలి’ అని అన్నారు. అనంతరం వేదికపై కరమ్‌వీర్ ప్రసంగిస్తూ 2024 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యానికి, నౌకా నిర్మాణ రంగం ఎంతగానో చేయూతనివ్వగలదని పేర్కొన్నారు. -
‘రక్షణ’కు 3.18 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో 2019– 20 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖకు రూ. 3.18 లక్షల కోట్లు కేటాయించారు. 1962 చైనా యుద్ధం తర్వాత అతి తక్కువగా దేశ జీడీపీలో దాదాపు 1.6 శాతం మేర రక్షణ శాఖకు కేటాయింపులు చేశారని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేటాయింపుల్లో పెట్టుబడి మూలధన వ్యయం కోసం రూ. 1,08,248 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ పరికరాలు, కొనుగోలు చేయను న్నారు. అలాగే రెవెన్యూ వ్యయాన్ని రూ. 2,10,682 కోట్లుగా ఖరారు చేశారు. ఈ నిధులను వేతనాలు, సైనిక వ్యవస్థల నిర్వహణ నిమిత్తం వినియోగిస్తారు. అలాగే ఈసారి రూ. 2.95 లక్షల కోట్లు బడ్జెట్ అంచనాలను చూపించగా.. 7.93 శాతం వృద్ధితో రూ. 3,18,931 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కార్యాలయం తెలిపింది. అలాగే మన దేశంలో తయారు కాని రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునేందుకు కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ. 1,12,079 కోట్ల పెన్షన్ నిధులను విడిగా కేటాయించారు. ఈ పెన్షన్ నిధులను, మొత్తం శాఖ బడ్జెట్‌ను కలిపి చూస్తే రక్షణ శాఖ బడ్జెట్ రూ. 4.31 లక్షల కోట్లు అవుతుంది. అయితే బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయించిన నిధుల తో రక్షణ నిపుణులు నిరాశ వ్యక్తం చేశారు. హోం శాఖకు 1.19 లక్షల కోట్లు మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణకు పెద్దపీట హోం మంత్రిత్వ శాఖకు మొత్తంగా రూ. 1,19,025 కోట్లను ఈ బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 5,858 కోట్లు ఎక్కువ. మౌలిక వసతులను మెరుగుపర్చడం, పోలీసు వ్యవస్థను ఆధునీకరించడం, సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన రక్షణ కల్పించడంపై కేంద్రం ఎక్కువగా దృష్టిపెట్టింది. 2018–19 బడ్జెట్‌కు సంబంధించి సవరించిన అంచనా (రూ. 1,13,167 కోట్లు) కంటే 5.17 శాతం ఎక్కువగా ఈ సారి హోం శాఖకు నిధులు అందనున్నాయి. దేశ రాజధానిలో చట్టాన్ని అమలు చేసే ఢిల్లీ పోలీసు విభాగానికి రూ. 7,496.91 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇండో–పాక్, ఇండో–చైనా సహా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ. 2,129 కోట్లను ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. నక్సల్, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనటంతోపాటు అవసరమైనప్పుడు ఇతర విధులను కూడా నిర్వర్తించే సీఆర్పీఎఫ్కు తాజా బడ్జెట్లో రూ. 23,963.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇండో–పాక్, ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కాపలాకాసే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు రూ. 19,650.74 కోట్ల నిధులను కేంద్రం అందించనుంది. మొత్తంగా అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఎన్ఎస్జీ, అస్సాం రైఫిల్స్) కలిపి మొత్తంగా రూ. 71,713.9 కోట్లను కేంద్రం కేటాయించింది. 2018–19 బడ్జెట్లో ఈ మొత్తం రూ. 67,779.75 కోట్లు మాత్రమే. దేశం లోపల నిఘా కోసం పనిచేసే నిఘా విభాగం (ఐబీ)కి ప్రస్తుత బడ్జెట్లో రూ. 2,384.1 కోట్లు ఇచ్చారు. ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబీకులకు రక్షణ కల్పించే ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ)కు రూ. 535.45 కోట్లను కేటాయించారు. మౌలిక వసతులకు 4 వేల కోట్లు బ్యారక్‌లు, నివాస గృహాల నిర్మాణం, ఆధునిక వాహనాలు, ఆయుధాల కొనుగోలు తదితరాల వంటి మౌలిక వసతుల కోసం రూ. 4,757 కోట్లను కేంద్రం ఈ బడ్జెట్లో కేటాయించింది. పోలీసు దళాల ఆధునీకరణకు రూ. 3,462 కోట్లు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి రూ. 825 కోట్లు, జమ్మూ కశ్మీర్లో వలసదారులు, ఇంకా వలస వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చిన వారికి పునరావాసం కోసం రూ. 842 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ కోసం రూ. 953 కోట్లను బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. -
ఇదీ రఫేల్‌పై కాగ్ నివేదిక
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఏడాదిన్నరకు పైగా కాలంపాటు కాగ్ రఫేల్ ఒప్పందాన్ని పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. విమానాల ధర, విక్రేతల ప్రతిపాదనల పరిశీలనతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జెట్ యుద్ధ విమానాల ధరలను కూడా కాగ్ పరిశీలించారు. రక్షణ శాఖ ఐదేళ్లుగా జరిపిన లావాదేవీలపై కాగ్ నివేదిక వచ్చింది. ముసాయిదా నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. అయితే, ఎన్నికలకు ముందు ఈ నివేదిక ఖరారు కాకపోవచ్చు. రఫేల్ ఒప్పందంలోని ధర, సరఫరా, పూచీకత్తు తదితర పలు అంశాలను కాగ్ నివేదిక చర్చించింది. అందులోని ముఖ్యాంశాలు: ధర: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో పేర్కొన్న ధర అంతకు ముందు ఒప్పందంలోని సమీకృత ధర(మొత్తం ధర) కంటే 2.86 శాతం తక్కువ. 2007లో (యూపీఏ హయాం) కుదుర్చుకున్న ఒప్పందంలోని 36 విమానాల కొనుగోలు ధర కంటే 2016 నాటి ఎన్డీఏ ఒప్పందంలోని ధర 9 శాతం తక్కువంటూ రక్షణ శాఖ చేసిన వాదనను కాగ్ తోసిపుచ్చింది. ఒప్పందంలో మొత్తం 14 ఐటెమ్‌లతో కూడిన ఆరు వేర్వేరు ప్యాకేజీలు ఉన్నాయి. వీటిలో ఏడు ఐటెమ్‌ల ధర సమీకృత ధర కంటే చాలా ఎక్కువగా ఉంది. బేసిక్ విమానం సహా మూడు ఐటెమ్‌లను సమీకృత ధరకే కొన్నారు. 4 ఐటెమ్‌లను సమీకృత ధరకంటే తక్కువకు కొన్నారు. సరఫరా: పాత ఒప్పందంతో పోలిస్తే కొత్త ఒప్పందంలో పేర్కొన్న గడువు ప్రకారం యుద్ద విమానం ఒక నెల ముందే సరఫరా అవుతుంది. 2007 ఒప్పందం ప్రకారం నిర్దేశిత ప్రమాణాల మేరకు యుద్ధ విమానాలను ఒప్పందం నాటి నుంచి 72 నెలల్లోపు సరఫరా చేయాల్సి ఉండగా. 2016 ఒప్పందంలో ఈ గడువు 71 నెలలుగా పేర్కొన్నారు. 2007 ఒప్పందం ప్రకారం ఒప్పందపు నెల నుంచి 50 నెలల్లోగా 18 విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగతా 18 విమానాలను హెచ్ఏఎల్లో తయారు చేయాలి. వీటిని 49–72 నెలల్లోపు అందజేయాల్సి ఉంటుంది. 2016 ఒప్పందం ప్రకారం మొదటి విడత విమానాలను(18) ఒప్పందపు నెల నుంచి 36–53 నెలల మధ్య సరఫరా చేయాలి. మిగతా వాటిని 67 నెలల్లో అందజేయాల్సి ఉంటుంది. గ్యారెంటీ: న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ ఒప్పందానికి సంబంధించి సార్వభౌమత్వ హామీ(ప్రభుత్వమే హామీ ఉండటం) ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రిత్వశాఖ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఆ ప్రభుత్వం కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్ ను మాత్రమే ఇచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఒప్పందానికి సంబంధించిన చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా తెరవాలని రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన విజ్ఞప్తికి ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించలేదు. 2007నాటి ఒప్పందంలో విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ‘పనితీరు, ఆర్థిక హామీ(పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్) ఇచ్చింది. మొత్తం కాంట్రాక్టు విలువలో 25 శాతం మేరకు ఈ హామీ ఇచ్చింది. 2007నాటి ఒప్పందంలో అమ్మకందారు(డసో)ఈ హామీ విలువను బిడ్‌లో చేర్చారు. అయితే, 2016 ఒప్పందంలో ఇలాంటి హామీలు ఏమీ లేవు. దీనివల్ల డసో సంస్థకు బోలెడు ఆదా అయింది. -
రక్షణ కొనుగోళ్లలో ‘సెల్ఫ్‌గోల్’
రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను చేరుస్తూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా సెల్ఫ్‌గోల్ వేసుకుంది. రాఫెల్ ఒప్పందం కుంభకోణమే కాదు. బీజేపీ ప్రభుత్వం అతి జాగ్రత్తతో, పిరికితనంతో ఆయుధాల కొనుగోలు వ్యవహారాల్లో వ్యవహరిస్తోందనడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పం దంలో భారీ కుంభకోణం ఉందనడానికి తగినంత సాక్ష్యాధరాలు లభ్యమౌతున్నాయిగాని ‘కుంభ కోణం’ అనే మాట స్థానంలో ‘మూర్ఖత్వం’ అనే పదం వాడాలి. ‘మూర్ఖత్వం’ అనే మాట మరీ ఎక్కువవుతుందనుకుంటే మరో పదం వాడవచ్చు. ఎందుకంటే దాదాపు వేయి కోట్ల డాలర్ల ఈ కొను గోలు ఒప్పందంలో విమానాల ధర నిర్ణయంపై అడిగిన ఏ ప్రశ్నకూ జవాబు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ ఒప్పందం రెండు ప్రజాతంత్ర ప్రభుత్వాల మధ్య జరిగింది. కాని, ఒప్పందంలోని వివరాలను వెల్లడించకూడదనే (రహస్యంగా ఉంచాలనే) నిబంధన ఉందని చెప్పడం అడ్డగోలు వాదన. పార్లమెంటు నిశిత పరిశీలన తర్వాతే ఇంతటి భారీ కొనుగోలు ఒప్పందానికి ఆమోదముద్ర లభిస్తుంది. అందుకే సర్కారు వివరణ హాస్యాస్పదంగా ఉంది. నేటి అంతర్జాతీయ ఆయు ధాల విపణిలో ఆయుధాలు, వాటి రకాలు, ఉపకర ణాలకు సంబంధించి రహస్యా లేవీ ఉండవు. రాఫెల్ విమానాలతో ప్రయోగించే మిటియోర్ క్షిపణులు కూడా కొనే ఆలోచన మీకుంటే, వాటి గురించి స్మార్ట్‌ఫోన్ ఉండి, రక్షణ వ్యవహరాల నిపుణుడిగా భావించే ఏ కుర్రాడైనా ఉపన్యాసం దంచగలడు. ఈ విషయంలో రహ స్యంగా ఉంచాల్సింది సున్నితమైన ఎలక్ట్రానిక్స్, వ్యూహాలు మాత్రమే. మిటియోర్ క్షిపణి, పైలట్ ధరించే 360 డిగ్రీల ఇజ్రాయెలీ హెల్మెట్ అంచనా ధరల గురించి కూడా నేడు సులు వుగా దొరికే ఆయుధాల వివరాలు తెలిపే పుస్తకాలు, పత్రికల్లో బహిరంగంగానే చర్చిస్తున్నారు. కాబట్టి రాఫెల్ ఒప్పందంపై బహిరంగంగా చర్చించడంలో తప్పేమీ లేదు. దాచ డానికి కారణాలు కూడా లేవు. రక్షణ ఒప్పందంపై మమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరి కైనా ఎంత ధైర్యం? బోఫోర్స్ శతఘ్నిల ఒప్పందం జరిగిన కాలం నాటి కాంగ్రెస్ పార్టీ అనుకుంటు న్నారా మమ్మల్ని? అనే అహంకారపూరిత ధోరణితో కేంద్ర సర్కారు మాట్లా డుతోంది. అయితే, ఇప్పుడు బీజేపీకి విషయం అర్థమౌతోంది. బోఫోర్స్ కుంభ కోణం తర్వాత, భారీ ఆయుధాల కొనుగోలు ఒప్పందం చేసుకునే ఏ ప్రభు త్వమైనా తనను దొంగ అని పిలుస్తారనే అంచనాతో ఉండక తప్పదు. ఇలాంటి సమస్యపై మూడు రకాలుగా వ్యవహరిం చవచ్చు. మొదటిది, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పద్ధతి. అంటే, ఏమీ కొనకుండా ఉండడమే గాక, అన్ని అంతర్జాతీయ ప్రైవేటు ఆయుధాల కంపెనీలను నిషేధించడం. ఆయన హయాంలో ప్రభుత్వాల మధ్యే ఆయుధాల కొనుగోళ్లు జరిగాయి. ఆయుధాల ధరల విషయంలో పారదర్శకత పాటిం చని రష్యా ప్రభుత్వం నుంచి ఆయుధాలు కొన్నారు. అలాగే, అమెరికా నుంచి ప్రాణాతకం కాని ఆయు ధాలను కొనుగోలు చేశారు. రెండో పద్ధతి, పార దర్శక విధానంతో ధైర్యంగా కొనుగోలు చేయడం. చివరికి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం. ఇక మూడోది, రాజు లాగా ఆయుధాలు కొనడం. అంటే, భద్రతపై కేబినెట్ కమిటీ పరిశీలన వంటి అన్ని రకాల ‘విసుగు పుట్టించే’ ప్రక్రియలకు స్వస్తి పలకడం. ఇందులో భాగంగా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు మీడి యాలో భారీ ప్రచారం వచ్చేలా చూసుకోవడమేగాక ఇలాంటి రక్షణ ఒప్పందాలపై అడిగే ప్రశ్నలకు సమా ధానం చెప్పడానికి మొండిగా నిరాకరించడం. ఈ పద్ధతిలో మోదీ ప్రభుత్వం అహంకారపూరితమైన మూర్ఖత్వంతో పదే పదే రాఫెల్ ఒప్పందంపై వ్యక్త మైన అనుమానాలు తీర్చడానికి నిరాకరిస్తూ పెద్ద తప్పు చేసింది. అనవసరంగా తనకు తాను గొయ్యి తవ్వుకుంది. లోతుగా గొయ్యి తవ్వుకుంటున్న ప్రభుత్వం! ఈ వ్యవహారంలో ప్రభుత్వం రోజు రోజుకూ తాను ఇరుక్కుపోయే ప్రమాదమున్న లోతైన గొయ్యి తవ్వు కుంటూనే ఉంది. మొదట అనుకున్న ఒప్పందం ప్రకారం 126 రాఫెల్ విమానాల్లో 108 విమానాలను ప్రభుత్వరంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) తయారు చేయాలి. అయితే, హెచ్ఏ ఎల్ వద్ద ఈ విమానాల ఉత్పత్తికి తగినంత మౌలిక సౌకర్యాలు లేని కారణంగా 126 విమానాలు కొనా లన్న నిర్ణయం మార్చుకున్నామని ప్రభుత్వం వివ రణ ఇచ్చింది. అత్యంత ఆధునిక విదేశీ యుద్ధ విమానాలకు ప్రపంచంలోని ఏ కంపెనీలోనూ తక్షణ ఉత్పత్తి–అమర్చే (అసెంబ్లీలైన్) సౌకర్యాలుండవు. ఏ కంపెనీ రూపొందించిన యుద్ధ విమానాలనైనా లైసె న్స్‌పై ఉత్పత్తి చేయడానికి అన్ని విధాలా మెరుగైన కంపెనీ హెచ్ఏఎల్ అని హేతుబద్ధంగా ఆలోచించే ఎవరైనా అంగీకరిస్తారు. ఈ సంస్థ తనకు ఎదురులేని గత కొన్ని దశాబ్దాల కాలంలో చేసిన పని ఇదే. అంత సమర్ధంగా చేయకపోయినా ఆయుధాలు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ కంపెనీని ఎవరూ చులకనచేసి మాట్లాడరు. వాజ్‌పేయి పాలనాకాలంలో మిరాజ్– 2000 రకం విమానాలన్నింటినీ ఇండియాలోనే రూపొందించాలని భారత వైమానికిదళం(ఐఏఎఫ్) ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో తెహెల్కా వ్యవ హారంతో భయపడిన రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ అందుకు అంగీకరించలేదు. ఒకే కంపెనీ చేతిలో పెడితే అనుమానాలొస్తాయని భయపడ్డారు. ఒకేసారి 126 రాఫెల్ విమానాల భారీ కొనుగోలుకు అవస రమైన నిధులు సమకూర్చడం కష్టమనే వాస్తవాన్ని చెప్పడానికి ప్రభుత్వం ఏదో కారణం వల్ల సిద్ధంగా లేదు. నిజంగా ఇన్ని విమానాలు కొనాలంటే ఆర్మీ, నేవీ దళాల బడ్జెట్లకు కోత పెట్టాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతానికి రెండు స్క్వాడ్రన్ల విమా నాలు(36) చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, రాఫెల్ విమానాల తయారీకి వేరే ఇతర కంపెనీకి అవకాశం ఇవ్వడం కోసం హెచ్ఏఎల్ను వదిలేశారని నిందించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాని, కొనుగోలు చేసే విమానాల సంఖ్య తగ్గిం చుకున్నారనీ, కలిసి ఉత్పత్తి చేసే అవకాశం పోగొ ట్టుకున్నారని మాత్రం విమర్శిస్తున్నారు. ఈ వ్యవహా రంలో వాస్తవాలు వెల్లడించి అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఉండగా ప్రభుత్వం అనవసరంగా అర్థం లేని వాదనలు వివరణలతో వివాదంలో చిక్కు కుంటోంది. యుద్ధ విమానాలు వైమానిక దళానికి తక్షణమే అత్యవసరమైనందునే రాఫెల్ విమానాల కొనుగోలు చేయాల్సివస్తోందనేది కేంద్ర సర్కారు చెప్పే మరో కారణం. తగినన్ని యుద్ధ విమానాలు లేవనేది 15 ఏళ్లుగా తెలిసిన విషయమే. 2001లోనే మొదటిసారి విమానాల అవసరం గుర్తించి, కొనుగో లుకు ప్రతిపాదించారు. రెండు దశాబ్దాల క్రితమే అవ సరమైన యుద్ధవిమానాలను కొనలేకపోవడం అగ్ర రాజ్యంగా అవరించాలనే కలలుగనే దేశం బలహీన తకు అద్దంపడుతోంది. ఈ 36 రాఫెల్ విమానాలు సైతం యుద్ధరంగంలో వినియోగించడానికి 2022 వరకూ పూర్తిగా సిద్ధం కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా వంటి అసమర్ధ ప్రభుత్వం గానీ, ప్రభుత్వ వ్యవస్థగానీ (ఏ పార్టీ అధికారంలో ఉన్నాగాని) తన జాతీయ భద్రత బాధ్యతను మరో అగ్రరాజ్యానికి అప్పగించడం లేదా కశ్మర్ను పాకిస్తాన్‌కు, అరుణా చల్ప్రదేశ్ను చైనాకు ఇచ్చేయడం మంచిది? అలా చేయగా మిగిలే సొమ్మును దేశ ప్రజల విద్య, ఆరో గ్యానికి ఖర్చు చేయవచ్చు! జాతీయ భద్రతపై హామీతోనే అధికారం 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీని అధికారంలోకి తీసు కొచ్చిన ప్రధాన వాగ్దాల్లో ఒకటి జాతీయ భద్ర తపై ఇచ్చిన హామీ. జాతీయ భద్రత విషయంలో నిర్ణ యాత్మకంగా, కఠినంగా వ్యవహరిస్తామని ఎన్డీఏ వాగ్దానం చేసింది. సైనిక దళాలకు కొత్త ఆయుధాలు కొనుగోలు చేసే ధైర్యం చేయలేని యూపీఏ సర్కారు వాటిని బలహీనపరిచిందని మోదీ ఆరోపించారు. ఆయన సరిగానే మాట్లాడారు కాబట్టి అప్పుడు ప్రజలు ఆయన మాటలు నమ్మారు. అందుకే, లోపాలు సరిదిద్దుకోవడానికి కొద్ది నెలలే ఉన్నందున ‘మీరేం చేశారు?’ అని ప్రధానిని అడగడంలో తప్పేమీ లేదు. రక్షణ ఆయుధాలకు సంబంధించి కొన్ని ఇండియాలోనే తయారు చేస్తున్నట్టు ప్రచారం చేయడం, కొన్ని వైమానిక ప్రదర్శనలు జరపడం మాత్రం ఈ ప్రశ్నకు జవాబు కాజాలదు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా తక్కువ అనేది వాస్తవం. ఆ విషయం చెప్పడానికి కూడా ప్రభుత్వం వెనుకాడుతోంది. ఈ విషయంలో యూపీఏ ఎన్నడూ గొప్పలు చెప్పుకోలేదు. కాని, దాని కంటే మెరుగైన రీతిలో పనిచేస్తానని చెప్పిన బీజేపీ అందులో విఫలమైంది. వచ్చే ఏడాది రాఫెల్ విమనాలు భారత గగన తలంలో ఎగిరే మాట వాస్తవమే కావచ్చు. కానీ, ఈ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల భవిష్యత్తులో జరిగే ఆయుధాల కొనుగోళ్లపై దాని నీడ పడుతుంది. ఆయుధాలు దేశంలోనే ఉత్ప త్తిచేయాలనే లక్ష్యం ఘోరంగా దెబ్బతింది. కొన్ని దశాబ్దాల కాలంలో అతి పెద్దదిగా భావించే రక్షణ కొనుగోలు ఒప్పందంలో దేశంలోని అత్యంత వివా దాస్పదమైన కార్పొరేట్ సంస్థను లబ్ధిదారుగా చేయడం ద్వారా ప్రభుత్వం తప్పటడుగు వేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటు రంగంలోని ఏ కంపెనీ కూడా సైన్యానికి అవసరమైన ప్రధాన ఆయుధాలను తయారు చేసి ఇవ్వలేదు. రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను తీసుకుంటూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. ఎవరూ సాధించలేరు కూడా. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేసి పడేసింది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘రక్షణ’కు అమెరికా సాంకేతికత
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన, క్లిష్టమైన సాంకేతికతను అమెరికా భారత్‌కు సమకూర్చే చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలో గురువారం ఫలప్రదంగా జరిగిన ఇరు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల(2+2) మంత్రుల తొలి సమావేశం ఇందుకు వేదికైంది. కామ్కాసా(కమ్యూనికేషన్స్, కంపాటిబిలిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్)గా పిలిచే ఈ ఒప్పందంపై చాన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు, రష్యా నుంచి భారత్ కొనుగోలుచేయనున్న ఎస్–400 క్షిపణులు, హెచ్–1బీ వీసా, సీమాంతర ఉగ్రవాదం, ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి, ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న యత్నాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. భారత్ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మైకేల్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్‌లు చర్చల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది రెండు దేశాల త్రివిధ దళాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. రష్యాతో సంబంధాలను అర్థం చేసుకుంటాం.. ఇంధన అవసరాల కోసం ఇరాన్‌పై ఆధారపడుతున్న సంగతిని భారత్ అమెరికా దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయంలో సాయం చేస్తామని అమెరికా భారత్‌కు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి క్షిపణుల కొనుగోలు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భారత్–రష్యాల చారిత్రక సంబంధాలను అర్థం చేసుకుంటామని అమెరికా పేర్కొన్నట్లు వెల్లడించాయి. అమెరికాతో వ్యూహాత్మక సహకారంపై రష్యాతో సంబంధాలు ఎలాంటి ప్రభావం చూపవని భారత్ అమెరికాకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. చర్చలు ముగిసిన అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో సుష్మా స్వరాజ్ తొలి 2+2 భేటీ అజెండాపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నియంత్రించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపునకు భారత్ మద్దతిస్తుందని తెలిపారు. కామ్కాసా ఇరు దేశాల సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పోంపియో పేర్కొన్నారు. భారత రక్షణ సామర్థ్యం, సన్నద్ధతను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. కామ్కాసా అంటే.. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి భారత్‌కు అత్యాధునిక మిలిటరీ కమ్యూనికేషన్ పరికరాలు అందుతాయి. ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కీలక సమాచారాన్ని సంకేత భాషలో పంచుకునేందుకు వీలు కలుగుతుంది. సత్వరమే అమల్లోకి వచ్చే ఈ ఒప్పం దం పదేళ్లపాటు అమల్లో ఉంటుంది. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అమరుస్తారు. సి–17, సి–130జే, పి–81 విమానాలతో పాటు, అపాచె, చింకూర్ హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇరు దేశాల సైనికుల మధ్య సమాచార మార్పిడి మరింత విస్తృతం అవుతుంది. ఉదాహరణకు భారత్ వైపు చైనా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు రావడాన్ని అమెరికా యుద్ధ విమానాలు గుర్తిస్తే భారత్‌కు ఆ సమాచారం క్షణాల్లోనే చేరిపోతుంది. శత్రు దేశాల యుద్ధ విమానాల ఉనికిని పసిగట్టే సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయొచ్చు. -
గూగుల్‌కు షాక్; రాజీనామాలతో ఉద్యోగుల నిరసన
న్యూయార్క్ : మంచి జీతం, అనువైన పనివేళలు, ఆకర్షణీయమైన వసతులు... మొత్తంగా చెప్పాలంటే ఇంట్లో ఉండే పనిచేస్తున్నామనే భావన. ఇంత మంచి వసతులతో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉంటుంది. కానీ గూగుల్ ఉద్యోగులు మాత్రం ఈ సాహసం చేశారు. కారణం విలువలకు వ్యతిరేకంగా పనిచేయడం ఇష్టం లేక. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి.. కంపెనీ కొత్తగా చేపట్టిన ఒక ప్రాజెక్టు కంపెనీ విలువలకు వ్యతిరేకంగా ఉందని భావించిన ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, తమ నిరసన వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ విభాగం డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ‘ప్రాజెక్ట్ మావేన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో డ్రోన్లు ఆకాశంలో విహరిస్తూ భూఉపరితలం ఫొటోలను తీయడమే కాక, ఆటోమెటిక్‌గా ఆ ఫొటోల్లో ఉన్న మనుషులను, వస్తువులను వేరు చేసి చూపించనున్నాయి. ఇందుకు అవసరమైన ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్‌ను అందించేందుకు మూడు నెలల క్రితం అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ, గూగుల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కంపెనీలో పనిచేసే చాలామంది ఉద్యోగులకు నచ్చలేదు. యంత్రాలకు మానవుని కంటే ఎక్కువ శక్తి ఇవ్వడం విలువలకు విరుద్ధం. అంతేకాక సైన్యానికి సంబంధించిన పనుల్లో పాలుపంచుకోవడం వల్ల కంపెనీ మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుందని భావించి చాలామంది ఉద్యోగులు కంపెనీ సీయివో సుందర్ పిచాయ్‌కు తమ రాజీనామాలు అందచేసి, నిరసనను తెలుపుతున్నారని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. వీరితో పాటు కంపెనీలోని మరో 4వేల మంది ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాక తక్షణం ఈ ప్రాజెక్టును వెనక్కు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇక మీదట భవిష్యత్తులోనూ సైన్యానికి సంబంధించి ఎటువంటి ప్రాజెక్టులను చేపట్టవద్దనే నిబంధనను కూడా తీసుకురావాలని తెలిపారు. అయితే ఈ చర్యలేవి ఫలించలేదు, కంపెనీ ఉన్నాతాధికారులు తమ వైఖరిని మార్చుకోలేదు. పైగా ఈ నిరసనల మధ్యనే గూగుల్ పెంటగాన్ కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత డిఫెన్స్ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. -
రక్షణకు రూ.2.95 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా రక్షణ రంగానికి కేంద్రం బడ్జెట్లో నిధులివ్వలేదు. 2018–19 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ. 2,95,511 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులు రూ. 2.74 లక్షల కోట్ల కంటే 7.81 శాతం ఈ ఏడాది ఎక్కువ. మొత్తం బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు 12.10 శాతం.. జీడీపీలో 1.58 శాతంగా రక్షణ రంగ కేటాయింపులు ఉన్నాయి. ఇక రక్షణ రంగం కేటాయింపుల మొత్తంలో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధ నౌకలు, ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుకు రూ. 99,947 కోట్లు కేటాయించారు. రక్షణ బడ్జెట్లో సిబ్బంది జీతాలు, నిర్వహణ, ఇతరత్రా ఖర్చులకు సంబంధించి రెవెన్యూ వ్యయం రూ. 1,95,947 కోట్లుగా ఉంది. కాగా, రక్షణ రంగ సిబ్బంది పెన్షన్ కోసం ప్రత్యేకంగా రూ. 1,08,853 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కేటాయింపు రూ. 85,740 కోట్లు కంటే 26.60 శాతం అధికం. కేటాయింపులు సరిపోవు చైనా, పాకిస్తాన్ల సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో రక్షణ రంగాన్ని ఆధునీకరించడానికి ఈ కేటాయింపులు సరిపోవు అని నిపుణులు పేర్కొంటున్నారు. అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్ లేదని డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఇన్స్టిట్యూట్కు చెందిన డా. లక్ష్మణ్ బెహరా చెప్పారు. ద్రవ్యోల్బణం, పరికరాల రేట్లు పెరుగుదలతో పోలిస్తే కేటాయింపులు స్వల్పమని మాజీ సైనికాధికారి ఎస్కే చటర్జీ చెప్పారు. రెండు ఇండస్ట్రియల్ కారిడార్లు రక్షణ రంగానికి సంబంధించి దేశీయ పరిశ్రమల ప్రోత్సాహకానికి రెండు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్ఎంఈ విభాగాల్లో దేశీయంగా ఆయుధ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ–2018ని తీసుకువస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. దేశీయ రక్షణ పరికరాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రక్షణ పరికరాల పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడుల కోసం సరళీకరణ విధానాలు అవలంభిస్తున్నామని, ప్రైవేట్ రంగం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో మూలధనం కేటాయింపు రూ. 3,00,441 కోట్లు అని జైట్లీ తెలిపారు. మూలధనం ఖాతాలోని మొత్తం ఖర్చులో ఇది 33.1 శాతం అని పేర్కొన్నారు. అరుణాచల్ ‘సేలా’ కనుమల్లో సొరంగం చైనా సరిహద్దుకు సమీపంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని సేలా కనుమల్లో సొరంగం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 13,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో సొరంగం పూర్తయితే... దేశ రక్షణ పరంగా వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌కు వేగంగా బలగాల్ని తరలించేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు. బడ్జెట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ప్రతికూల వాతావరణంలోను ప్రయాణించేలా లడఖ్ ప్రాంతంలో రోహతంగ్ సొరంగం పూర్తిచేశాం. అలాగే 14 కిలోమీటర్ల జోజిలా సొరంగం కోసం పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సేలా కనుమల్లో సొరంగం నిర్మాణానికి ప్రతిపాదన చేస్తున్నాం’అని వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశలోని తవాంగ్, పశ్చిమ కామెంగ్ జిల్లాల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో సేలా కనుమ ఉంది. -
మోహన్‌నాథ్ గోస్వామికి అశోకచక్ర
శ్రీనగర్: ఉగ్రవాదులపై పోరులో అసువులుబాసిన అమర జవాను, భారత ఆర్మీ ప్రత్యేక దళాల కమాండో లాన్స్ నాయక్ మోహన్‌నాథ్ గోస్వామికి కేంద్రం అత్యున్నత శౌర్య పురస్కారం అశోకచక్రను ప్రకటించింది. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తోటి జవాన్లను కాపాడే క్రమంలో గోస్వామి నేలకొరిగారు. దేశం గర్వించేలా చేసిన గోస్వామి మరణంలోనూ జీవించే ఉన్నాడని, అతని ఆత్మత్యాగం.. పరాక్రమానికి గుర్తింపుగా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని అశోక చక్రను ప్రకటించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఎన్కౌంటర్లో గోస్వామి ఉగ్రవాదుల బుల్లెట్లు శరీరాన్ని చీల్చుకుపోయినా వెరవకుండా.. ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాకుండా తన సహచరులను రక్షించాడు. మిగతా ముఖ్యమైన శౌర్యపతకాల విజేతలు కీర్తి చక్ర: సుబేదార్ మహేంద్ర సింగ్ (9 పారా స్పెషల్ ఫోర్స్), సిపాయి జగదీశ్‌చంద్(546 డీఎస్సీ ప్లాటూన్-మరణానంతరం), శౌర్య చక్ర: (కల్నల్ సంతోశ్ (మరణానంతరం), మేజర్ అనురాగ్ కుమార్, నాయక్ సతీశ్ కుమార్ (మరణానంతరం), సిపాయి ధర్మరామ్ (మరణానంతరం), మరో నలుగురికి. 26 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి మెడల్స్ శారద చిట్‌ఫండ్ స్కాం, షీనా బోరా హత్య కేసులను విచారించిన అధికారులు సహా 26 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పురస్కారం, పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి. శారదా స్కామ్‌పై సిట్ బృంద సారథి రాజీవ్‌సింగ్‌ను విశిష్ట సేవా పతకం వరించింది. షీనా హత్య కేసును దర్యాప్తు చేసిన లతా మనోజ్‌కుమార్‌కు ప్రతిభా పురస్కారం దక్కింది. -
భారత మీడియా అభాసుపాలు
‘మసూద్ అరెస్టు’పై దిగ్విజయ్ న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్లో అరెస్టయ్యాడంటూ కథనాలు ప్రచురించి భారత మీడియా అభాసుపాలయిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. అరెస్టును నిర్ధారించుకోకుండా, అధికారవర్గాల నుంచి ఎటువంటి వివరణ తీసుకోకుండా వార్తలు వెలువరించేశారన్నారు. అసలు మసూద్‌ను అరెస్టు చేయలేదని.. జైషే ఉగ్రవాదులు ముగ్గురిని ఏదో వేరే కేసులో పాక్ అధికారులు అరెస్టు చేశారని రక్షణశాఖ వర్గాలు చెప్పాయన్నారు. కానీ భారత మీడియా మాత్రం.. మసూద్‌ను పాక్ అరెస్టు చేసిందని మన విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు లీక్ చేశారంటూ కథనాలు ఇచ్చాయన్నారు. అసలు పాక్ సంస్థలు కావాలనే అలాంటి ప్రచారం చేసి ఉంటాయని... దానికి మన మీడియా మోసపోయి, అభాసుపాలయిందని వ్యాఖ్యానించారు. మీడియా విశ్వసనీయత కంటే సంచలనం సృష్టించేందుకే ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ బిల్లుకు ఓకే
ఆమోదించిన రాజ్యసభ.. వారిపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలపై దాడులకు, ఇతర అమానుష నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ(అకృత్యాల నిరోధం) సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. లోక్‌సభలో ఆగస్టులో గట్టెక్కిన ఈ బిల్లును రాజ్యసభ సోమవారం ఎలాంటి చర్చా లేకుండానే కొన్ని నిమిషాల్లోపే ఏకగ్రీవంగా ఆమోదించింది. 1989 నాటి చట్టంలో మార్పుల కోసం ఈ సవరణ బిల్లు తెచ్చారు. బిల్లు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, వారి భూములను అక్రమించడం, ఆ వర్గాల మహిళలను దేవదాసీలుగా మార్చడం , లైంగికంగా వేధించడం వంటి వాటికి పాల్పడితే క ఠిన శిక్షలు వేయాలని ప్రతిపాదించారు. ఇలాంటి నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, బాధితులకు పునరావాసం కల్పించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆ వర్గాలకు చెందని ప్రభుత్వాధికారులకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష వేయాలని ప్రతిపాదించారు. ద్రవ్య, జలమార్గాల బిల్లులకు ఆమోదం రక్షణశాఖకు పెన్షన్లు, స్వచ్ఛ భారత్ పథకానికి నిధులు సహా వివిధ కార్యక్రమాల కోసం ప్రభుత్వం అదనంగా రూ. 56,256.32 కోట్లను ఖర్చు చేసేందుకు ఉద్దేశించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. 101 జలమార్గాల అభివృద్ధికి ఉద్దేశించిన జాతీయ జలమార్గాల బిల్లు-2015ను లోక్‌సభ ఆమోదించింది. భగవద్గీతను జాతీయ పుస్తకంగా ప్రకటించాలని బీజేపీ సభ్యులు లోక్‌సభలో గట్టిగా డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ప్రభుత్వం తెలిపిన వివరాలు లోక్‌సభ స్థానాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసే ప్రణాళిక ఉంది. విద్యుత్ సరఫరాలేని 18,452 గ్రామాల్లో ఇప్పటివరకు 3,286 గ్రామాల్లో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం ఎంపిక చేయాల్సిన జాబితాలో భారత్ నుంచి 46 ప్రదేశాలు పోటీపడుతున్నాయి. -
సీఐసీగా ఆర్కే మాథుర్ నియామకం
న్యూఢిల్లీ: మాజీ రక్షణ శాఖ కమిషనర్ ఆర్కే మాథుర్ ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా నియమితులయ్యారు. ప్రస్తుతం కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ శర్మ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో మాథుర్‌ను కేంద్రం నియమించింది. మాథూర్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. త్రిపుర కేడర్‌కు చెందిన 62 ఏళ్ల మాథూర్ 2013 మే 28 నుంచి రెండేళ్ల పాటు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. -
అమెరికాతో కీలక ‘రక్షణ’ బంధం
‘గ్యాస్ టర్బైన్ టెక్నాలజీ’ ఇచ్చేందుకు యూఎస్ సుముఖత ♦ ద్వైపాక్షిక చర్చల్లో కీలకమలుపు: పారికర్ ♦ అన్ని రంగాల్లో భారత్‌కు సాయం: కార్టర్ వాషింగ్టన్: రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశ రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్‌తో జరిపిన భేటీలో.. కీలక అంశాలపై అవగాహన కుదిరింది. సెన్సిటివ్ జెట్ ఇంజన్ రూపకల్పనలో భారత్‌కు ‘గ్యాస్ టర్బైన్ ఇంజన్’ సాంకేతికతను బదిలీ చేసేందుకు వీలుగా అమెరికా తన విధానపరమైన నిర్ణయాల్లో మార్పు చేసుకుంది. భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలకమైన ప్రతిష్ఠాత్మక ‘రక్షణ సాంకేతికత, వ్యాపార సంబంధం’(డీటీటీఐ)కి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం రెండు దేశాల సంబంధాలకు మైలురాయిగా నిలుస్తుందని కార్టర్ తెలిపారు. రక్షణ రంగంలో సాంకేతిక సహకారం పెంపొందించుకోవటంతోపాటు వ్యాపార అవకాశాల గుర్తింపునకు కూడా ఇది దోహద పడుతుంది. భేటీ తర్వాత పారికర్, కార్టర్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రెండు దేశాలు రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు పారికర్ తెలిపారు. ప్రపంచ భద్రతకు భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యమే కీలకం కానుందన్నారు. రెండు దేశాల రక్షణ శాఖల మధ్య మరింత సహకారానికి బీజం పడిందన్నారు. కాగా, భారత్‌కు అన్ని రంగాల్లో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్టర్ తెలిపారు. అంతకుముందు.. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ కార్యక్రమంలో పారికర్.. అమెరికా రక్షణ రంగ పరిశ్రమలతో సమావేశమయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకోసం భారత్ నిబంధనల మార్పుకు చేస్తున్న ప్రయత్నాన్ని రక్షణ రంగ పరిశ్రమ ప్రముఖులు హర్షించారు. భారత్‌తో సంయుక్తంగా ఏహెచ్-64 అపాచి హెలికాప్టర్ల తయారీకి సిద్ధమని ఇటీవలే బోయింగ్ సంస్థ ప్రకటించింది. భారత్‌లో ఫైటర్ జెట్ల తయారీ కేంద్రానికి అమెరికా కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో.. ఇందుకోసం సదరు కంపెనీలకు ముందస్తు అనుమతి ఇచ్చేందుకు పెంటగాన్ సానుకూలంగా స్పందించింది. -
ఉద్యోగ సమాచారం
బీహెచ్ఈఎల్లో ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్).. వికలాంగులకు రిజర్వ చేసిన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 34 (ట్రైనీ ఇంజనీర్-24, ట్రైనీ ఎగ్జిక్యూటివ్-10). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 26. పూర్తి వివరాలకు http://careers.bhel.in/bhel చూడొచ్చు. రక్షణ శాఖలో గ్రూప్-సీ పోస్టులు రక్షణ శాఖలోని సికింద్రాబాద్ కమాండెంట్, 60 కోయ్ ఏఎస్సీ (ఎస్యూపీ) టైప్ ‘జి’.. గ్రూప్-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు.. 17 (చౌకిదార్-4, లేబర్-13). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ (అక్టోబర్ 31-నవంబర్ 6 సంచికలోని 16వ పేజీ) చూడొచ్చు. ఈఎస్ఐ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్లు హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్ఐ మోడల్ హాస్పిటల్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. ఇందులో 2 పోస్టులు వికలాంగులకు రిజర్వ చేసిన బ్యాక్లాగ్ ఖాళీలు. మిగిలిన 6 పోస్టులకు జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. పూర్తి వివరాలకు http://esic.nic.in చూడొచ్చు. తమిళనాడులో డ్రాటింగ్ ఆఫీసర్లు తమిళనాడులోని రహదారుల విభాగం.. జూనియర్ డ్రాటింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 188. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసినవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 18. పూర్తి వివరాలకు www.tnhighways.gov.in చూడొచ్చు. బీడీ శర్మ మెడికల్ ఇన్స్టిట్యూట్లో హౌజ్ సర్జన్లు రోహ్తక్(హర్యానా)లోని పండిట్ బీడీ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్.. సీనియర్/ జూనియర్ హౌజ్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 87. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 8. పూర్తి వివరాలకు http://uhsr.ac.in చూడొచ్చు. మారిటైం వర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఇండియన్ మారిటైం వర్సిటీ.. డెరైక్ట్ రిక్రూట్మెంట్ /డిప్యుటేషన్/ప్రమోషన్ ప్రాతిపదికన అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13 (అసిస్టెంట్ రిజిస్ట్రార్-7, ఫైనాన్స అసిస్టెంట్ రిజిస్ట్రార్-6). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 18. పూర్తి వివరాలకు www.imu.edu.in చూడొచ్చు. ఐసీఎంఆర్‌లో వివిధ పోస్టులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ (ఐసీఎంఆర్).. వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు 6 (రీసెర్చ సైంటిస్ట్-1, రీసెర్చ అసోసియేట్-2, టెక్నికల్ అసిస్టెంట్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-2). మొదటి రెండు పోస్టులకు నవంబర్ 16న, తర్వాతి రెండు పోస్టులకు 17న ఇంటర్వ్యూలు జరుగు తాయి. పూర్తి వివరాలకు www.icmr.nic.in/icmrnews/MPD_Ad. pdf చూడొచ్చు. ‘ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్’లో అసిస్టెంట్లు నోయిడాలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 17. పూర్తి వివరాలకు http://iwai.nic.in చూడొచ్చు.