democracy system
-
సుప్రీం ప్రమాణాలతో సుదృఢ ప్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం తన సుదీర్ఘ ప్రస్థానంలో ఉన్నత ప్రమాణాలను నెలకొలి్పందంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తద్వారా దేశ ప్రజాస్వామ్య యాత్రను మరింతగా బలోపేతం చేసిందన్నారు. సుప్రీంకోర్టులో తొలి విచారణ జరిగి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయసూత్రాల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతోందని కితాబిచ్చారు. వ్యక్తిగత హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి కీలకాంశాలపై సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పులు ఇతర దేశాలకు కూడా కరదీపికలని అభిప్రాయపడ్డారు. దేశ సామాజిక, రాజకీయ ప్రస్థానాన్ని అవి మేలిమలుపు తిప్పాయన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు సాధికార న్యాయవ్యవస్థ అత్యంత కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘శరవేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా చట్టాలను కూడా హౠ ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. ఈ నూతన చట్టాలు భవిష్యత్ భారతాన్ని మరింతగా బలోపేతం చేస్తాయి. సులభ, సత్వర న్యాయం దేశ పౌరులందరి హక్కు. అందుకే ఈ–కోర్టు మిషన్ ప్రాజెక్టు–3కి నిధులు పెంచాం. కోర్టుల్లో మౌలిక సదుపాయాల పెంపుకు నిబద్ధతతో పని చేస్తున్నాం’’ అని చెప్పారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ఇతోధికంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యంతోనే తాజాగా జన్ విశ్వాస్ బిల్లును తీసుకొచి్చనట్టు చెప్పారు. మున్ముందు న్యాయవ్యవస్థపై అనవసర భారాన్ని అది తగ్గిస్తుందని వివరించారు. అలాగే వివాదాలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపేందుకు ఉద్దేశించిన మధ్యవర్తిత్వ చట్టం కూడా కోర్టు పనిభారాన్ని బాగా తగ్గించగలదని ఆశాభావం వెలిబుచ్చారు. వాయిదా సంస్కృతికి తెర పడాలి: సీజేఐ కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కాలం చెల్లిన విధానాలు, కేసుల వాయిదా సంస్కృతి వంటి సమస్యలు న్యాయ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. వీటిని నిర్మాణాత్మక రీతిలో పరిష్కరించడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అందుకే వీటిపై అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. సమర్థంగా సకాలం న్యాయం అందించాలంటే కోర్టుల్లో వాయిదా సంస్కృతి నుంచి వృత్తిపరమైన సంస్కృతికి మారాలని ఉద్బోధించారు. కేసుల పరిష్కారంలో అంతులేని జాప్యానికి కారణమవుతున్న సుదీర్ఘ వాదనలకు చెక్ పెట్టాల్సి ఉందన్నారు. ‘‘న్యాయ వృత్తి ఒకప్పుడు ఉన్నత వర్గాల పురుషులకే పరిమితమైందిగా ఉండేది. కానీ పరిస్థితులు మారుతున్నాయి. జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం 36 శాతానికి పెరగడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో ఎంపికైన వారిలో 50 శాతానికి పైగా మహిళలే కావడం హర్షణీయం. న్యాయ వృత్తిలోకి కొత్తవారిని ప్రోత్సహించడంలో లింగ భేదం, నేపథ్యాలతో నిమిత్తం లేకుండా సమానావకాశాలు కలి్పంచాలి. అలాగే జడ్జిల్లోనూ, లాయర్లలోనూ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ప్రాతినిధ్యం ఎంతగానో పెరగాల్సి ఉంది’’ అన్నారు. ‘‘కోర్టులకు సుదీర్ఘ సెలవులపైనా చర్చ జరగాల్సి ఉంది. ఇందుకోసం న్యాయవాదులు, న్యాయమూర్తులకు ‘ఫ్లెక్సీ టైం’ వంటి ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలనూ ఆలోచించాలి. కోర్టుల లోపల, వెలుపల రాజ్యాంగ నిర్దేశిత నిబద్ధతతో నడుచుకుంటున్నామా, లేదా అని అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సర్వోన్నత న్యాయస్థాన వజ్రోత్సవ వేడుకలు ఇందుకు సరైన సందర్భం’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. ఈ–కోర్టుల పురోగతిని వివరించారు. దేశ న్యాయ వ్యవస్థను సమర్థంగా, పర్యావరణహితంగా సాంకేతికతతో కూడిందిగా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. ప్రజల కోర్టు: సీజేఐ సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం లాంఛనంగా ఏర్పాటైన ధర్మాసనానికి సీజేఐ జస్డిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యం వహించారు. 75 ఏళ్ల క్రితం 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టు తొలి విచారణ జరిగిన తీరు, అప్పుడు పాటించిన స్వతంత్ర విలువలు నేటికీ అనుసరణీయమేనన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి గీటురాళ్లని అభిప్రాయపడ్డారు. వారు సామాజిక, రాజకీయ ఒత్తిళ్లకు మానవ సహజమైన మొగ్గుదలలకు అతీతంగా తీర్పులు వెలువరించాలని పేర్కొన్నారు. ఈ దిశగా జడ్జిల సామర్థ్యాలను మరింతగా పెంచే ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని గుర్తు చేశారు. ‘‘సుప్రీంకోర్టు తొలి విచారణ పార్లమెంటులోని ప్రిన్సెస్ చాంబర్లో సాదాసీదాగా జరిగింది. నాటినుంచి సుదీర్ఘ ప్రస్థానంలో కోర్టు పనితీరు నానాటికీ మెరుగవుతూనే వస్తోంది. ప్రజల కోర్టుగా రూపుదిద్దుకుంటోంది. ప్రజల నుంచి ఏటా ఏకంగా లక్షకు పైగా అందుతున్న లెటర్ పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానంపై వారి విశ్వాసానికి అద్దం పడుతున్నాయి’’ అన్నారు. -
నిశీధిలో ఓ దీపం!
‘మన ప్రజాస్వామ్యం మేడిపండు– మన దరిద్రం రాచ పుండు’ అన్నాడొక కవి... ఇప్పుడు కాదు, మూడు నాలుగు దశాబ్దాల కిందట! కాలం గడిచేకొద్దీ మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని మనం గట్టిగా నమ్ముతున్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని చెప్పుకోవడానికి కూడా గర్వపడుతుంటాము. ప్రజాస్వామ్య వ్యవస్థలపై రేటింగ్స్ ప్రకటించే కొన్ని అంతర్జాతీయ సంస్థలు మాత్రం క్రమం తప్పకుండా మన ఆత్మవిశ్వాసం మీద దెబ్బలు కొడుతున్నాయి. ఐరోపా సంస్థ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్లు ప్రకటించే డెమోక్రసీ ఇండెక్స్ తాజా నివేదికలో భారత్‌కు 53వ స్థానం దక్కింది. అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌస్ అనే సంస్థ 23 దేశాలను మాత్రమే స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలుగా గుర్తించింది. అందులో మనకు స్థానం దొరకలేదు. పాక్షిక స్వేచ్ఛ కలిగిన 52 దేశాల జాబితాలో మాత్రం చోటు దక్కింది. పౌరులందరి హక్కులకూ గట్టి రక్షణ లభించడం, సమస్త భౌతిక బౌద్ధిక వనరులన్నీ సమానంగా అందుబాటులో ఉండడం వంటి అంశాల ఆధారంగా ప్రజాస్వామ్య వ్యవస్థల పరిణతిని లెక్కిస్తారు. ఈ లెక్కలతో కొలుచుకుంటే చాలు. మనకు ఏ అంతర్జాతీయ సంస్థల రేటింగ్స్‌తో అవసరం లేదు. మన ప్రజాస్వామ్యం మేడిపండుగా మారిందని చెప్పడానికి మన దైనందిన జీవితానుభవాలు చాలు. ఎందుకిలా జరుగు తున్నది? పరిణతితో వికసించవలసిన ప్రజాస్వామ్యం పరిమిత ప్రజాస్వామ్యంగా ఎందుకు ముడుచుకొని పోతున్నది? ప్రపం చంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం మనకు ఉన్నప్పటికీ, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్‌తో కూడిన అధికార విభజన అమలులో ఉన్న ప్పటికీ ఎందుకు పురోగమించలేకపోతున్నామనేది చర్చనీయాం శంగా మారింది. రాజకీయ పార్టీల్లో ఏర్పడుతున్న సైద్ధాంతిక శూన్యత కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారుడుకు ఒక ప్రధాన కారణంగా రాజనీతి శాస్త్ర నిపుణులు పరిగణిస్తున్నారు. ఏరకమైన సామా జిక పరివర్తనను తాము కోరుకుంటున్నామో ఒక స్పష్టమైన అవగాహన, ఆ స్థితికి చేరుకోవడానికి అవసరమైన కార్యాచరణ కలిగి ఉండడమే రాజకీయ పార్టీ సిద్ధాంతంగా, దాని తాత్విక భూమికగా పరిగణించవచ్చును. ఆదిలో అన్ని రాజకీయ పార్టీ లకూ తమదైన ఒక తాత్వికత ఉండేది. సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థగా, లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకున్నది. మొదట్లో ఈ దిశగా కొన్ని అడుగులు వేసిన ఆ పార్టీ క్రమంగా దారితప్పిన వైనం మన కళ్లముందున్నది. అధికారం నిలుపు కోవడానికి ఆ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలను ఆశ్రయిం చింది. ఆ బ్యాంకులో ప్రవేశం దొరకని వర్గాలను దూరం చేసు కున్నది. ఫలితంగా అధికారానికి దూరమైంది. ఉత్తరాదిలో దాని పతనానికి ఇదే ప్రధాన కారణం. ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఆరెస్సెస్ భావజాలమేనన్నది బహిరంగ రహస్యం. మతం సెంటిమెంట్‌తో ఓట్లు తెచ్చుకోవాలి గనుక ఆరెస్సెస్ ఎజెండాలోని హిందూత్వ జెండాను మాత్రం వెలిసిపోకుండా బీజేపీ కాపాడుకుంటున్నది. కానీ ఆర్థిక రంగంలోని చాలా అంశాల్లో ‘నాగపూర్’ భావజాలానికి భిన్నమైన వైఖరినే బీజేపీ తీసుకుంటున్నది. రాజకీయ అవసరాల కోసం పొత్తులు – ఎత్తుల్లో కూడా బీజేపీ చాలా స్వేచ్ఛను తీసుకుంటున్నది. ఈ రెండు జాతీయ పార్టీలే కాదు, దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు వాటి సైద్ధాంతిక నిబద్ధత నుంచి పక్కకు తప్పుకు న్నాయి. రామ్మనోహర్ లోహియా సోషలిస్టు వారసత్వంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ– ములాయంసింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్‌వాదీ పార్టీ. కానీ, ఈనాటికీ ఆ పార్టీ దళిత వర్గాల ప్రజల దరికి చేరలేకపోయింది. సోషలిస్టు – వామపక్ష భావజాల ప్రభా వంతో ఎన్టీరామారావు తన తెలుగుదేశం పార్టీ విధానాలను తయారు చేసుకున్నారు. ఆయన దగ్గర్నుంచి పార్టీని దొంగి లించిన ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పార్టీని పూర్తిగా తలకిందు లుగా నిలబెట్టారు. పేదవర్గాల సంక్షేమ ప్రణాళికను తిరగరాసి, సంపన్న వర్గాలకు కమీషన్ ఏజెంట్‌గా పనిచేసే పార్టీగా తయారుచేశారు. ఈ పార్టీలన్నీ ఓట్ల కోసం ఉపయోగితా వాదాన్ని (utilitarianism) ఆశ్రయించాయి. ఎన్నికల ప్రణాళి కల్ని చెక్‌బుక్ మేనిఫెస్టోలుగా మార్చివేశాయి. సైద్ధాంతిక నిబద్ధత లేని రాజకీయాలకు సహజంగానే ప్రజా స్వామ్యం పట్ల నిబద్ధత ఉండదు. ప్రజల పట్ల బాధ్యత ఉండదు. ఫలితంగా రాజకీయ రంగం నుంచి ప్రజా సేవకులు అదృశ్యమై వ్యాపారులు ప్రవేశించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని భారత రాజ్యవ్యవస్థ తూచా తప్ప కుండా స్వీకరించి ఉన్నట్లయితే దేశ పరిస్థితి భిన్నంగా ఉండేది. అన్నార్తులు, అభాగ్యులు, దిక్కుమొక్కు లేని జనమంతా ఒక్కో సాధికారిక బాణమయ్యేవారు. శతకోటి నరనారీ నిపుణ జన సందోహంతో మన దేశం అగ్రరాజ్య హోదాను సవాల్ చేయగలిగి ఉండేది. అంబేడ్కర్ అందిం చిన అమూల్య అవకాశాన్ని ఈ దేశం జారవిడిచింది. రాజ్యాం గాన్ని అమలుచేయడంలో మూడు ప్రభుత్వ ఎస్టేట్లూ పాక్షి కంగా విఫలమయ్యాయి. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే మీడియా పరిస్థితి ‘కర్ర ఉన్నవాడిదే బర్రె’ అన్న చందంగా తయారైంది. ఫలితంగా ప్రపంచ డెమోక్రసీ ఇండెక్స్‌ల దగ్గర నుంచి హంగర్ ఇండెక్స్‌ల దాకా భారత్ పరిస్థితి అవమానకరంగా దిగజారి పోయింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తూ రాజ్యాంగ ‘ప్రవేశిక’ (preamble)లో రాజ్యాంగ లక్ష్యాలను స్థూలంగా ప్రవచించారు. పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమకూర్చడానికి, ఆలోచనా భావ ప్రకటనా విశ్వాస ఆరాధనా స్వేచ్ఛను సమకూర్చడానికి, అవకాశాల్లో హోదాల్లో సమానత్వం సాధించడానికి, వ్యక్తుల గౌరవ మర్యాదలకు హామీపడుతూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందింపజేయడానికి, దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా ప్రకటిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నామని ఈ ‘ప్రవేశిక’లో పేర్కొన్నారు. దేశ లౌకికత్వం మీద ఈనాటికీ నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. సామ్యవాదానికి విడాకులు ఇచ్చేశాము. ప్రజాస్వామ్యంపై అంతర్జాతీయ ర్యాంకుల్ని చూస్తూనే ఉన్నాము. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందరికీ లభించడం లేదన్నది నిర్వివాదమైన అంశం. ఈ డెబ్బయ్యేళ్లలో దేశంలో ఆర్థిక – రాజకీయ – సామాజిక అసమానతలు మరింత పెరిగి పోవడమే ఇందుకు నిదర్శనం. మొన్న పదో తేదీనాడు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని పాటించారు. మన దేశంలో కూడా వేలాది కార్యక్రమాలు జరిగాయి. విజయవాడలో జరిగిన అటువంటి ఒక సభకు తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె. చంద్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘జై భీమ్’ సినిమా కారణంగా జస్టిస్ చంద్రూ ఇప్పుడు దేశ ప్రజలందరికీ సుపరి చితులయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అఖండ విజయం సాధిం చిన చిత్రమిది. జస్టిస్ చంద్రూ నిజజీవిత కథలో ఒక చిన్నభాగం ఈ చిత్రం ఇతివృత్తం. చదువుకునే రోజుల్లోనూ, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే రోజుల్లోనూ పౌరహక్కుల రక్షణ కోసం గళం విప్పిన నేపథ్యం ఆయనది. సీపీఎం, దాని అనుబంధ ప్రజా సంఘాలతో కలిసి కష్టజీవుల పక్షాన ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిరుపేదలనూ, నీడలేని వారినీ భారత రాజ్యాంగ నీడలో నిలబెట్టడానికి ఒక న్యాయవాదిగా ఆయన అవిరళమైన కృషి చేశారు. భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రయోజనాలను ఈ దేశ ప్రజలు గరిష్ఠంగా వినియోగించుకోగలిగితే వారిని ‘ఎంపవర్’ చేయవచ్చుననే ఆలోచన ఆయనకు ఉన్నట్టు ఈ సినిమా ద్వారా అర్థమవుతున్నది. సినిమాకు ‘జై భీమ్’ అనే టైటిల్ పెట్టడంలో చంద్రూ పాత్ర ఉన్నదో లేదో తెలియదు కానీ, ఆ టైటిల్ వెనుక అంతరార్థం మాత్రం అదే. జై భీమ్ అనేది ఇప్పుడొక జనన్ని నాదం. ఒక రణన్నినాదం. తరతరాల వంచనకూ, మోసానికీ, దోపిడీకీ గురైన ప్రజానీకం చేసిన పలవరింతే జై భీమ్. జై భీమ్ ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని నిస్సహాయ ప్రజలకు కవచంగా ఉపయోగించినవాడు జస్టిస్ చంద్రూ. ఆయన వాదించిన అనే కానేక కేసుల్లో ఒకటి మాత్రమే ‘జై భీమ్’ సినిమా. భారత రాజ్యాంగ రచన చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ స్మరణే – జై భీమ్. ఇప్పుడు దేశంలోని రాజకీయ పార్టీల్లో ఆవరించిన సైద్ధాం తిక శూన్యతకు ప్రత్యామ్నాయం జనసాధికారత సిద్ధాంతం. సైద్ధాంతిక నిశీధిలో ఒక దీపం సాధికారత. ఈ సాధికారత సాధన కోసం తన జీవితకాలాన్ని జస్టిస్ చంద్రూ వెచ్చించారు. రాజ్యాంగం సక్రమంగా అమలయ్యేట్టు చూసినట్లయితే అది బలహీనవర్గాల అభ్యున్నతికి ఒక సంజీ వనిలా తోడ్పడుతుందని ‘జై భీమ్’ సినిమా ఇచ్చిన సందేశం. జస్టిస్ చంద్రూ జీవిత పాఠం కూడా! ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రారంభమైన బలహీనవర్గాలు – మహిళల ఎంపవర్మెంట్ కార్యక్రమాలు కూడా ఇప్పుడిప్పుడే దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తు న్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం రకరకాల వ్యూహాలతో ఈ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. మచ్చుకు ఒక ఉదాహరణ చూద్దాం. రాజధాని ప్రాంతంలో దళితులు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నిర్ణయించింది. దీన్ని అడ్డు కోవడానికి తెలుగుదేశం పార్టీ శతవిధాలా పోరాడింది. పేదలకు అక్కడ ఇళ్లు కేటాయించినట్లయితే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ (సామాజిక అసమతుల్యత) ఏర్పడుతుందని వాదించింది. రాజధానిలో సంపన్నులే తప్ప పేదలు నివసించకూడదట. ఇటు వంటి అహంభావ వైఖరి దాని వర్గస్వభావాన్ని బయట పెట్టింది. ఈ పేదవర్గాల వ్యతిరేక పార్టీ చేపట్టిన కృత్రిమ రైతు ఉద్యమంలో మన కామ్రేడ్స్‌కు తెలంగాణ, తేభాగ, పున్నప్ర– వాయిలార్ రైతు ఉద్యమాలు కనిపించడం ఆశ్చర్యకరం. వారికి లాల్ సలామ్! డబ్బున్నవారి పిల్లలతో సమానంగా నాణ్యమైన ఉచిత విద్యను, అంతర్జాతీయ పోటీల్లో నిలబడగల నైపుణ్య విద్యను అందరికీ అందజేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక బృహత్తర యజ్ఞాన్ని తలపెట్టి ప్రారంభించింది. ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం అందరికీ ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేవడం కోసం క్యూబా తరహా వైద్య విప్లవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ‘అమ్మ ఒడి’ ఒక అద్భుతం. ఈ పథకం వల్ల పిల్లలను ఒక బాధ్యతగా బడికి పంపించడం మాత్రమే కాదు, పిల్లల చదువుసంధ్యలను వారి భవిష్యత్తును నిర్ణయించే సాధికార శక్తిగా అమ్మ అవతరించింది. ఇటువంటి పథకాలను చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ల తరహా తాయిలాలతో పోల్చేవారి అజ్ఞానాన్ని క్షమిద్దాం. రాజ్యాంగ విహితమైన ఈ తరహా కార్యక్రమాలను దేశమంతటా చేపట్టిననాడు ‘బిలియన్ ఎంపవర్డ్ మిసైళ్ల’తో ఈ దేశం గర్జిస్తుంది. గర్విస్తుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చిదంబర రహస్య: హ్యాకర్స్ ఆఫ్ డెమాక్రసీ!
మందిరంలో నిద్రిస్తున్న రాజకుమారి మగత నిద్రతోనే తన శయ్యపైనుంచి లేచి ఎవరో ఆదేశించినట్టుగా ఎటో వెళ్లి పోతుంది. ఇటువంటి జానపద కథల్లో మాయగాళ్లు మంత్ర శక్తితో తాము లక్ష్యంగా ఎంచుకున్న వారి ఆలోచనల్ని స్వాధీనం లోకి తీసుకుని రిమోట్ కంట్రోల్‌తో నిర్దేశిస్తుంటారు. కొన్ని సైన్స్ ఫిక్షన్ కథలుంటాయి. ఈ కథల్లో శాస్త్రవేత్తలు మరమనుషుల్ని తయారుచేస్తారు. యజమాని ఆదేశాల ప్రకారం ఆ మరమనిషి అద్భుతాలు చేస్తుంది. హఠాత్తుగా మరమనిషిలో మార్పు వస్తుంది. యజమాని ఆదేశాలకు విరుద్ధంగా పని చేయడం ప్రారంభిస్తుంది. ఒక అదృశ్య హస్తమేదో ఆ మర మనిషి ప్రోగ్రామింగ్‌లో ఏవో మార్పులు చేస్తుంది. ఫలితంగా నిర్దేశిత లక్ష్యం నుంచి మరమనిషి తప్పుకుంటుంది. కంప్యూటర్లూ వాటి హార్డ్‌వేర్–సాఫ్ట్వేర్ల తాలూకు నెట్ వర్క్‌లు ఇప్పుడు సమస్త మానవాళి ఆలనాపాలనా చూస్తు న్నాయి. ఈ నెట్‌వర్క్‌లన్నీ వాటి నిర్దేశిత లక్ష్యాలతో పని చేస్తున్నాయి. నెట్‌వర్క్‌ల భద్రతా కుడ్యాలను కూడా ఛేదించే చోరులు చాలామంది తయారయ్యారు. వీళ్లను హ్యాకర్లు అని పిలుస్తున్నాం. ఈ హ్యాకర్లు కంప్యూటర్ల నెట్వర్కుల్లోకి అక్ర మంగా చొరబడుతారు. అత్యంత రహస్యమైన సమాచారాన్ని తస్కరిస్తారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల మీద దాడులు జరిపి జనం సొమ్మును తేరగా కొట్టేస్తుంటారు. ఇటువంటి సైబర్ దాడుల ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టం మన జాతీయ స్థూల ఉత్పత్తితో దాదాపు సమానం. డిజిటలైజేషన్ పెరుగుతున్నకొద్దీ ఈ హ్యాకింగ్ దొంగల బెడద కూడా పెరుగు తుందట. మనుషుల్లో అక్కడక్కడా మంచివాళ్లు ఉన్నట్టే హ్యాకర్లలో కూడా కొందరు మంచివాళ్లు ఉంటారు. కంప్యూటర్ వ్యవస్థలను నియంత్రించి నిర్దేశిత లక్ష్యాల నుంచి దారి తప్పించే హ్యాకర్ల వంటి వాళ్లు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కూడా ఉన్నారు. కాకపోతే వారికి ప్రత్యేకంగా మనం ఏ పేరూ పెట్టుకోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థల హ్యాకింగ్‌లో ఆరితేరిన వ్యక్తి మన తెలుగువాడేనని ఘంటాపథంగా చెప్పు కోవచ్చు. కంప్యూటర్ను కనిపెట్టిన వ్యక్తి కూడా తానే కనుక, హ్యాకింగ్ పద్ధతుల్లో కూడా ఆయనకు అరివీర భయంకరమైన తెలివితేటలు ఉన్నాయని అంటారు. రాజకీయాల్లో విశ్రాంతి లేకుండా గడిపే ఆయన, వీలు చిక్కినప్పుడల్లా ఐఐటీ, ఐఐఎమ్, ఎయిమ్స్, ఎమ్ఐటీ, స్టాన్ఫోర్డ్ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. వారికి కొన్ని మెళకువలను కూడా నేర్పుతుంటారు. ఈరోజు కూడా బొంబాయి ఐఐటీ విద్యార్థులతో మాట్లాడారు. సైబరాబాద్ నిర్మించింది తానేనని మరోసారి వారికి గుర్తుచేశారు. కొన్ని సైబర్ టెక్నిక్స్‌ను కూడా వారికి నేర్పించే ఉంటారు. భారతీయులమైన మనం, మనల్ని పరిపాలించుకోవడం కోసం ఒక రాజ్యాంగాన్ని, దానిని అనుసరించి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఈ వ్యవస్థల మధ్య అప్పుడప్పుడూ అపార్థాలూ, అభిప్రాయభేదాలూ కలిగినా మౌలికంగా అవన్నీ సైద్ధాంతికమైనవే కనుక మన ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో మన సైబరాబాద్ నిర్మాత సుమారు పాతికేళ్ల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థల్లోకి తన ట్రోజన్ హార్స్‌లను జొప్పించడం ప్రారంభించారు. ఈ అనైతిక చర్యల వల్ల ఆయనకు వ్యక్తిగతంగా చాలాసార్లు లాభం కలిగింది. పద్దెని మిది అవినీతి కేసుల్లో దశాబ్దాల తరబడి ‘స్టే’లతో గడిపే అవకాశం చిక్కింది. చిన్నాచితక కేసుల్లో దర్యాప్తునకు కూడా సిద్ధంగా ఉండే సీబీఐ ఈయనపై దర్యాప్తు చేయడానికి తమవద్ద సిబ్బంది లేదనే చిత్రమైన సాకును చెప్పింది. అప్పటితరం వారికి అందరికీ తెలుసు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిం చినప్పుడు పార్టీ జెండాను ఆయనే స్వయంగా డిజైన్ చేసు కున్నారు. పార్టీ ఎన్నికల గుర్తును తానే ఎంపిక చేసుకున్నారు. వాటి గురించి ఆయన తన్మయత్వంతో మీడియా ముందు వివరించారు కూడా. అవన్నీ ప్రజలకు గుర్తే. అయినా కూడా ఆ గుర్తుతోనూ, ఆ జెండాతోనూ, ఆ పార్టీతోనూ ఎన్టీ రామారావుకు సంబంధం లేదని తీర్పు వచ్చేలా ఈయన ఆ కేసును నడప గలిగాడు. వ్యవస్థల హ్యాకింగ్‌లో మెజారిటీ మీడియా అండ దండలు ఈయనకు పుష్కలంగా లభించాయి. ఈ కార్య క్రమంలో ఇద్దరూ (పార్టీ–పచ్చమీడియా) భాగస్వాములుగా వ్యవహరించారు. వ్యవస్థల్లోని అనేక కీలక స్థానాల్లోకి చేరుకున్న ఆయన ట్రోజన్ హార్స్‌లు తనను ఆపదల నుంచి బయటపడే యడంతోపాటు, ఆయన ప్రత్యర్థులను బాధించడంలోనూ ప్రముఖపాత్రను పోషించాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్రపూరిత కేసులను బనాయించారు. ఈ కేసులను, సీబీఐ విచారణ తీరుతెన్నులను పరిశీలించిన అనేకమంది ప్రముఖులు, న్యాయ నిపుణులూ విస్మయాన్ని ప్రకటించారు. సీబీఐ వాదన నిలబడేది కాదని బహిరంగంగానే మాట్లాడారు. అయినా సరే, పదేళ్ల కిందట తామే అల్లిన కథను ఒక వాస్తవమని భ్రమింప జేస్తూ డెమాక్రసీ హ్యాకర్లు ప్రచారంలో పెడుతూనే ఉన్నారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉరఫ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి. జానపద కథల్లోని రాజకుమారి మంత్రశక్తి ఫలితంగా మగత నిద్రలోనే నడుస్తూ వెళ్లినట్టుగా ఈయన పార్క్‌హయత్ హోటల్‌కు వెళ్లడం, తెలుగుదేశం అధినేత ఆంతరంగికులతో సమావేశం అవ్వడం, కెమెరాలకు చిక్కడం ఒక తాజా ఘటన. నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయిన తర్వాత అప్పటికి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 26 కోవిడ్ పాజిటివ్ కేసులను బూచిగా చూపి, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలన్న నిబం ధనను విస్మరించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసిన సంఘటన ప్రజాస్వామ్య ప్రియులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ ప్రత్యర్థి తరహాలో ముఖ్యమంత్రిపై అభ్యంతరకరమైన రీతిలో కేంద్రానికి ఉత్తరం రాయడం ప్రజాస్వామిక చరిత్రలో నభూతో న భవిష్యతి! ప్రస్తుతం దాదాపుగా రోజుకు మూడువేల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వ హణకు తయారవ్వడం ఒక విడ్డూరం. కాకపోతే హ్యాకింగ్ ఆఫ్ డెమాక్రసీ మహిమ. ఓటుకు నోట్లు కేసు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఎప్పటికీ గుర్తుంటుంది. రేవంత్‌రెడ్డి గుర్తే. సెబాస్టియన్ గుర్తే. స్టీఫెన్సన్ గుర్తే. 50 లక్షల సూట్‌కేసు బాగా గుర్తు. ‘మావాళ్లు బ్రీఫ్డ్ మీ బ్రదర్’ అన్న ఆ కంఠస్వరం బ్లాక్‌బస్టర్ ఆఫ్ ద టూ థౌజండ్ ఫిఫ్టీన్. ‘దొరికిన దొంగవు నువ్వు చంద్రబాబూ... నిన్ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిక కూడా బాగా పాపులర్. ఈ కేసుకు సంబంధించిన ఆడియోలు అందరూ విన్నారు. వీడియోలు అందరూ చూశారు. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. అయితే, నిందితుల జాబితాలో ఆదిపురుషుని పేరు లేదు. నా మీద ఎన్నో ఆరో పణలు చేశారు. ఒక్కటీ నిరూపించలేకపోయారు అని ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. అలా నిరూపించలేకపోవడం వెనుక ఇంత చిదంబర రహస్యం ఉంది. సుప్రసిద్ధ అమెరికన్ మేధావి నోమ్ చోమ్స్కీ వందో పుస్తకం ‘రెక్వియమ్ ఫర్ ది అమెరికన్ డ్రీమ్’ ఆయనకు దాదాపు తొంభయ్యేళ్ల వయసులో ఈమధ్యనే అచ్చయింది. నయా ఉదారవాద ప్రజాస్వామ్యాలు క్రమంగా ఎలా ధనస్వామ్య వ్యవస్థలుగా రూపాంతరం చెందుతున్నాయో పది సూత్రాలతో ఆయన వివరించారు. ప్రధానంగా అమెరికన్ రాజకీయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ విశ్లేషణ చేసినప్పటికీ భారత రాజకీయ పరిణామాలు అందులో ముఖ్యంగా చంద్ర బాబు రాజకీయ ప్రయాణం స్పష్టంగా కనిపిస్తున్నది. ఉదార వాద విధానాల ఫలితంగా సంపద కేంద్రీకృతం కావడం క్రమంగా కేంద్రీకృత అధికారానికి దారితీస్తుంది. ఎన్నికల వ్యయం భారీగా పెరుగుతుంది. ఫలితంగా రాజకీయ పార్టీలు కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో మనుగడ సాగిస్తాయి. కనుక ఇవి అమలుచేసే విధానాల ఫలితంగా సంపద మరింత కేంద్రీ కృతమవుతుంది. కేంద్రీకృత సంపదకు, అధికారానికి విస్తృత ప్రజాస్వామ్యం, పౌరహక్కులు వంటి మాటలు నచ్చవు. ప్రజాస్వామ్యాన్ని పరిమితం చేయాలని అవి కోరుకుం టాయంటాడు చోమ్స్కీ. ఎన్టీఆర్‌పై కుట్రచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పరిపాలన కార్పొరేట్ సంస్థల ప్రాపకం కోసం పాకులాడే విధంగానే ఉండేది. ఆయన హయాంలోనే ఎన్నికల వ్యయం ఆకాశాన్ని అంటింది. సామాన్య ప్రజలు ఎన్నికల పోటీకి దూరం కావాల్సి వచ్చింది. చోమ్స్కీ చెప్పిన పది సూత్రాల్లో ఆరోది నియంత్రణ సంస్థ లను ఆక్రమించడం (రూల్ రెగ్యులేటర్స్). అంటే ఆర్థిక రంగాన్ని నియంత్రించే సంస్థను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆక్రమిం చుకోవడం, ప్రైవేట్ రవాణా రంగాన్ని నియంత్రించే సంస్థను ప్రైవేట్ రవాణా కంపెనీలు స్వాధీనం చేసుకోవడం, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్, ప్రైవేట్ విద్యుత్ సంస్థల అజమాయిషీలో ఉండటం అన్నమాట. ఫలితం ఎలా ఉంటుందో ఊహించు కోవచ్చు. ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను హ్యాక్ చేసి ట్రోజన్ మాల్వేర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆశించే ప్రయో జనం అక్షరాల అటువంటిదే. అందువల్లనే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖకు విస్తారమైన మద్దతు లభించింది. ఆ లేఖపై చర్యలను చేపట్టడం ద్వారా వ్యవస్థల ప్రక్షాళనకు పూనుకోవాలని మేధావులు కోరుకుంటున్నారు. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
పాలిటిక్స్‌పై విజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ‘పెళ్లి చూపులు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నాడు. యువత ఫాలోయింగ్ అందులోనూ అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడే హీరోల లిస్ట్‌లో అతడు మొదటి స్థానంలో ఉంటాడు. తన డ్రెస్సింగ్, మాట్లాడే విధానం, ఆటిట్యూడ్‌కి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫైటర్’ చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే విజయ్‌కు జంటగా నటిస్తున్నారు. చదవండి: యూరప్ వీధుల్లో ‘అర్జున్‌రెడ్డి’ తాజాగా ఈ హీరో.. ప్రజాస్వామ్యం, ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్, అనుపమ చోప్రాలతో జరిగిన చిట్‌చాట్‌లో రాబోయే రోజుల్లో ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా? అని విజయ్ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయ్.. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ విధానంపై విముఖత వ్యక్తం చేశారు. డబ్బులు, మందు కోసం ఓటును అమ్ముకునే వారికి ఓటు హక్కు తీసేయాలని అన్నారు. తన ఓటు విలువేంటో తెలియని వాళ్లకు ఓటు హక్కు ఎందుకని విజయ్ అభిప్రాయపడ్డాడు. అలాగే బాగా డబ్బున్న ధనవంతులకు కూడా ఓటు హక్కు వద్దని, చదువుకుని ఓటు హక్కు విలువ తెలిసిన మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని పేర్కొన్నాడు. కాగా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో నెటిజన్లు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. కొంతమంది విజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు అతడి మాటలను తప్పుబడుతున్నారు. చదవండి: అనుష్క–విజయ్– ఓ సినిమా? Did he just say that he prefers Dictatorship more than democracy and not everyone should be allowed to vote? Deverakonda is a classic example of how apolitical folks slowly move towards RW Authoritarianism in the end. pic.twitter.com/JsNmZ0f1GS — Advaid അദ്വൈത് (@Advaidism) October 9, 2020 -
ప్రజాస్వామ్య సూచీలో భారత్ @ 51
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో భారత్ 51వ స్థానంలో నిలిచింది. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2018తో పోలిస్తే 2019లో భారత్ పది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది. 2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు మాత్రమే కేటాయించింది. దేశంలో పౌరహక్కులు హరించుకుపోతుండటంతో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉండటమే దీనికి ప్రాథమిక కారణమని వ్యాఖ్యానించింది. ఈ ర్యాంకింగ్‌లో నార్వే, ఐస్‌ల్యాండ్, స్వీడన్ మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఉత్తరకొరియా అట్టడుగున 167వ స్థానంలో ఉంది. ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు.. అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ఈఐయూ రూపొందించింది. ఈ అంశాల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు), బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ.. 8 లేదా అంతకంటే తక్కువ), మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ), నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు). ఇందులో 8 కంటే తక్కువ 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది. కాగా, ఈ సూచీలో చైనా 2.26 పాయింట్లతో 153వ ర్యాంకుతో దాదాపు అట్టడుగున ఉంది. 2019లో చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతిబంధకాలు, పౌరులపై పెరిగిన నిఘాతోపాటు జిన్జియాంగ్ ప్రావిన్సులో మైనారిటీలపై తీవ్ర వివక్ష ఇందుకు కారణాలని పేర్కొంది. ఇంకా బ్రెజిల్ 52(6.86 పాయింట్లు), రష్యా 134(3.11), పొరుగుదేశాలైన పాక్ 108(4.25), శ్రీలంక 69 (6.27), బంగ్లాదేశ్ 80(5.88)వ ర్యాంకుల్లో ఉన్నాయి. -
ఇంటర్నెట్తో ప్రజాస్వామ్యానికి విఘాతం!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఇంటర్నెట్ ప్రమాదకారిగా పరిణమించిందని, ఇది ఊహించనంత విఘాతాన్ని కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వినియోగదారులు పెరిగే కొద్దీ దేశం ముందుకు వెళుతోందని కేంద్రం తరఫున వాదలను వినిపించిన రజత్ నాయర్ తెలిపారు. ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టుల వల్ల మేలుతో పాటు అంతకు మించిన కీడు జరుగుతోందని తెలిపారు. ద్వేష భావాలు, నిరాధార వార్తలు, వ్యక్తిత్వ హననం, దేశ వ్యతిరేక కామెంట్లు, పోస్టులు పెరుగుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం నిబంధనలను ఖరారుచేసి నోటిఫై చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. మూడు నెలల్లో నిబంధనలతో కూడిన సమాచార ముసాయిదాను 2020 జనవరి నాటికల్లా సిద్ధం చేస్తామని ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ అదనపు కార్యదర్శి పేర్కొన్నారు. త్వరలో మార్గదర్శకాలు తయారుచేస్తామన్నారు. -
అత్యంత ప్రమాదంలో ప్రజాస్వామ్యం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉందని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వం అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ‘పార్టీ ఫిరాయింపులు– రాజ్యాంగ వ్యతిరేక పాలన’అనే అంశంపై శనివారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజాగాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఉందని, అందుకే అంతా మనవాళ్లే ఉంటే ఏ సంక్షోభం వచ్చినా ఎదుర్కోవచ్చని ఫిరా యింపులను ప్రొత్సహిస్తున్నారన్నారు. ‘నీకన్నా బలమైన నాయకుడు వస్తే, నీ పార్టీ వారిని కూడా ఇలానే కొనుగోలు చేస్తారు. అప్పుడు నీవు ఒంటరిగా నిలబడతావన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని కేసీఆర్‌కు హితవు పలికారు. ఒత్తిడికి గురి చేసి పార్టీలో చేర్చుకుంటున్నారు... భట్టి విక్రమార్క మాట్లాడుతూ అధికారాన్ని ఉపయోగించి, ఒత్తిడికి గురి చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాల్సిన డబ్బును ఎమ్మెల్యేలను, ఓటర్లను కొనుగోలు చేసేందుకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ నియంత వైఖరికి వ్యతిరేకంగా, ఫిరాయింపుల చట్టం పటిష్టతకు దేశవ్యాప్త ఉద్యమం తీసుకువస్తామని తెలిపారు. భారత రాజ్యాంగంపై చేయిపెట్టి ప్రమాణస్వీకారం చేసి అదే రాజ్యాంగాన్ని భస్మం చేసేలా వ్యవహరిస్తున్నారని గద్దర్ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు మన్నారం నాగరాజు, వివిధ పార్టీల, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆ దేశాల్లో ఓటు వేయకుంటే కఠిన చర్యలు
సాక్షి, చిట్యాల (నకిరేకల్) : మన ప్రజాస్వామ్య భారత దేశంలో ఓటు వజ్రాయుధం. ఓటు వేయటం ద్వారా మన భవిష్యత్‌ను మనమే నిర్ణయించుకోవచ్చు. కానీ మన దేశంలోని ఓటర్లు మాత్రం ఎన్నికల్లో ఆరవై శాతానికి మించి ఓటును వేయటం లేదు. దీంతో కొన్ని సార్లు చిత్తశుద్ధితో పనిచేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఎన్నిక కాకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడుతుండడమే కాకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఓటు వేయటం తప్పని సరి. ఒక వేళ ఓటు వేయకపోతే వారిపై కఠిన చర్యలు, శిక్షలను విధిస్తాయి. ఓటు తప్పనిసరి చేసిన దేశాలు ఆస్ట్రేలియా, అమెరికా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బెల్జియం, గ్రీస్, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పిన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, టర్కీ, స్విర్జర్లాండ్, బ్రెజిల్, బొలీలియో వంటి దేశాలలో ఓటు వేయటం తప్పని సరి. ఈ దేశాలలోని అర్హులైన పౌరులు ఓటు వేయకపోతే వారిపై పలు రకాల చర్యలు, శిక్షలను, జరిమానాలను విధిస్తారు. బెల్జియంలో.. బెల్జియం దేశంలో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోకపోతే రెండు నుంచి నాలుగు వేల యూరోలు (భారత కరెన్సీలో రూ.3 లక్షలకుపైగా) జరిమానా, రెండోసారి ఓటు హక్కును వినియోగించుకోకపోతే పది వేల యూరోలు (భారత కరెన్సీలో 8 లక్షలకు పైగా) జరిమానా విధిస్తారు. వరుసగా నాలుగు సార్లు ఓటు హక్కును వినియోగించుకోకపోతే పది సంవత్సరాల పాటు వారి ఓటు హక్కును తొలగిస్తారు. అంతేకాకుండా వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, సదుపాయాలు, పథకాలను తొలగిస్తారు.భారీగా జరిమానా విధిస్తుంది. సింగపూర్‌లో.. వేగంగా ఆభివృద్ధి చెందిన దేశాలలో సింగ్‌పూర్ ఒకటి. ఈ దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పని సరి. ఈ దేశంలో ఒక్కసారి ఓటు హక్కును వినియోగించుకోకపోయినా వారి పేరు ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. మరలా ఓటు హక్కును పునరుద్ధరించాలంటే ఓటు వేయకపోవడానికి సరైన కారణం చూపాల్సి ఉంటుంది. గ్రీస్‌లో.. గ్రీస్ దేశంలో ఓటు హక్కును వినియోగించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఓటు హక్కును వినియోగించుకోని వారి పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సదుపాయాలను కోల్పోవాల్సి వస్తుంది. అమెరికాలో.. అమెరికా వంటి దేశంలో పోలింగ్ రోజు ఎలాంటి హడావుడి ఉండదు. అంతేకాకుండా పోలింగ్ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆఫీసులకు, పాఠశాలలకు సెలవులు ఉండవు. అయినా 75 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుంది. ఇక్కడ కూడా ఓటు వేయకపోతే వారికి కొన్ని పథకాలను తొలగిస్తారు. ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఆస్ట్రేలియాలో.. ఆస్ట్రేలియా ఎన్నికల్లో తొంబై ఆరు శాతానికిపైగా పోలింగ్ నమోదవుతుంది. ఈ దేశంలో ఎన్నికలు మొదలయ్యే కొన్ని నెలల ముందు నుంచే అక్కడి అధికారులు ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఇక్కడే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. లేనట్లయితే ఓటు వేయని వారిని గుర్తించి వారికి అక్కడి ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. -
నిరసనను అణచేది నియంతలే!
పాలకపక్షాలు తప్పుడు హామీలిచ్చినపుడు, ఇచ్చిన హామీలు మరచినపుడు, మాయమాటలతో పబ్బం గడుపుకోజూసినపుడు... చేతనతో పౌరులు అది పసిగడుతున్నారు, ప్రశ్నించి నిలదీస్తున్నారు. ఓట్ల వేటలో.. పౌరుల్లో తప్పుడు భావనలు కల్పించి లబ్ది పొందేందుకు చేసే రాజకీయ సంకుచిత యత్నాల్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు. అధికారంలో ఉన్నవారికి ఇది కంటగింపుగా మారుతోంది. పౌరుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమిచ్చుకోలేని ఇరకాటపు పరిస్థితుల్లో... ‘ఈ నిరసనలకు, నిలదీతకు ఆస్కారమే లేకుంటే బావుండుకదా!’ అనుకోవడం సహజం. అధికార వ్యవస్థను అరచేత పట్టుకొని నిరసన గొంతు నొక్కే అణచివేతకు పాల్పడుతున్నారు. ఇది దారుణం. ‘‘నీ వాదనను నేను తిరస్కరించవచ్చు గాక! కానీ, అది వినిపించే నీ హక్కును... నా ప్రాణాలు పణంగా పెట్టయినా కాపాడుతా’’ – వాల్తేర్ (ఫ్రాన్స్ రచయిత, తాత్వికుడు) దేశంలో సాగుతున్న ఓ ప్రమాదకర అణచివేత పరి స్థితికి సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్య అద్దం పట్టింది. ‘భిన్నాభిప్రాయం, నిరసనని వ్యక్తం చేయడం ప్రజా స్వామ్యంలో భాగం. అణచివేత సరికాదు. ఈ హక్కు ప్రజాస్వామ్యానికే సేఫ్టీ వాల్వ్లాంటిది, కాదని మీరు దాన్ని అణగదొక్కితే, ఏదో రోజు ప్రజాస్వామ్యం ఫ్రెషర్ కుక్కర్‌లా పేలిపోతుంది’ అని ప్రభుత్వ నిర్వాకంపై న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హింసకు కుట్ర పన్నారంటూ దేశ వ్యాప్తంగా పేరెన్నికగన్న అయిదు గురు పౌరహక్కుల నేతల్ని ఏకపక్షంగా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. వారందరినీ గృహనిర్బంధానికే పరిమితం చేయాలని ఆదేశిస్తూ, వచ్చే బుధవారం లోపు ఈ కేసులో ప్రతివా దన తెలుపాలని ప్రభుత్వాల్ని నిర్దేశించింది. హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేసిన ఇది దుందుడుకు చర్య అని సుప్రీంకోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు, పుణె కోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం, ఇతర ప్రజా సంఘాలు తప్పుబట్టాయి. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కొంత కాలంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల్ని చెప్ప కనే చెబుతున్నాయి. కక్ష సాధిస్తారనే భయం లేకుండా పౌరులు తమ అభిప్రాయాల్ని, నిరసన చట్టపరిధిలో స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగడం వల్లనే ప్రజాస్వామ్య పాలనకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే మన దేశంలో ఆ హక్కును ప్రభుత్వాలు కాలరాయడం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఈ తీర్పు వెలువడు తున్న సమయానికి, ఇక్కడ తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజా స్వామ్య నిరసనను సర్కారు కర్క శంగా అణచి వేసింది. ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ సభలో దూరంగా నిలబడి, ప్లకార్డులు చూపుతూ తమకు న్యాయం చేయండని గొంతెత్తిన పలువురు ముస్లీం యువకుల్ని పోలీసులు నిర్బంధించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియనీకుండా గోప్యంగా ఉంచి, మీడియా ఎండగట్టడంతో 24 గంటలకు అరెస్టు చూపించారు. విచిత్రంగా వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నిరసనకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రభు త్వాన్ని నిలదీస్తారనుకుంటే చాలు సభలు, సమా వేశాలకూ అనుమతి లభించదు. ముందస్తు అరె స్టులు, నిర్బంధకాండ. తర్వాత కక్షసాధింపులు ఇవన్నీ మామూలే! హక్కుల చేతనను అంగీకరించరా? సామాజిక మాధ్యమాల్లో చెడు పరివ్యాప్తం చేయొ ద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఒక పిలుపునిచ్చారు. తన నియోజకవర్గ (వారణాసి) పార్టీ కార్యకర్తలను ద్దేశించి ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ప్రేరణ ఏమై ఉంటుంది? నిజమే! అడ్డూ అదుపూ లేకుండా సామా జిక మాధ్యమాలు వేదికగా ఇటీవల ఏదేదో ప్రచారం లోకి వస్తోంది. దృవీకరణ లేకున్నా, విశ్వసనీయత కొరవడినా... సదరు సమాచారం రేపుతున్న దుమా రం ఇంతంత కాదు. ముఖ్యంగా మత, కుల, ప్రాంతీయ, సామాజిక వర్గ భావనలను రెచ్చగొట్టి పలు విపరిణామాలకు ఇది కారణమవుతున్న సంద ర్భాలెన్నో! వీటిని తప్పక నియంత్రించాల్సిందే! ‘ఫేస్బుక్’ ‘వాట్సాప్’ వంటి వేదికల్ని నిర్వహించే సంస్థలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపు తోంది. చెడు, తప్పుడు సమాచారం సృష్టిస్తున్న మూలాల్ని పట్టుకునే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. అదే సమయంలో ఈ మాధ్యమాల వల్ల పౌరు లకు చాలా విషయాలు తెలిసి వస్తున్నాయి. తమ హక్కుల గురించిన స్పృహ, ప్రభుత్వాల బాధ్య తకు సంబంధించిన చైతన్యం పౌరుల్లో పెరుగు తోంది. పాలకపక్షాలు తప్పుడు హామీలిచ్చినపుడు, ఇచ్చిన హామీలు మరచినపుడు, మాయమాటలతో పబ్బం గడుపుకోజూసినపుడు... చేతనతో పౌరులది పసిగడు తున్నారు, ప్రశ్నించి నిలదీస్తున్నారు. ఓట్ల వేటలో.. పౌరుల్లో తప్పుడు భావనలు కల్పించి లబ్ది పొందేం దుకు చేసే రాజకీయ సంకుచిత యత్నాల్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు. అధికారంలో ఉన్నవారికి ఇది కంటకింపుగా మారుతోంది. పౌరుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమిచ్చుకోలేని ఇరకాటపు పరిస్థితుల్లో...‘ఈ నిరసనలకు, నిలదీతకు ఆస్కారమే లేకుంటే బావుండుకదా!’ అనుకోవడం సహజం. అధికార వ్యవస్థను అరచేత పట్టుకొని నిరసన గొంతు నొక్కే అణచివేతకు పాల్పడుతున్నారు. తమ ఈ తప్పుడు పంథాను హేతుబద్దం చేసుకోవడానికి, నియంతృత్వపు పోకడల్ని కప్పిపుచ్చడానికి దేశభక్తి, జాతీయత వంటి భావనల ముసుగు తొడుగు తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారనో, ప్రత్యర్థి రాజకీయ పక్షాల ప్రోద్బలంతో సాగుతున్న కుట్ర అనో ప్రజా నిరసన గళాన్ని చిన్నబుచ్చే యత్నం చేస్తున్నారు. ఎవరిది టెర్రర్ చర్య? పాలకుల నిర్లక్ష్యం వల్ల కడుపు కాలిందనో, కొంప కూలిందనో, బతుకు చెడిందనో, భవిష్యత్తు అంధ కారమౌతోందనో... ఆక్రందనలు చేసే వారిని అనున యించకపోగా తీవ్రవాదులని ముద్ర వేస్తున్నారు. ఉగ్రవాదులని, దేశద్రోహులని, జాతి వ్యతిరేకులనీ, అర్బన్‌నక్సల్స్ అనీ... ఇలా కొత్త కొత్త పదజాలం వాడుతూ ప్రభుత్వాలు నిష్కర్షగా అణచివేతకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల్ని వ్యతిరేకిం చేవారు ‘టెర్రరిస్టులే’ అంటూ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి రాధాకృష్ణన్ గత నెల్లో చెన్నైలో చేసిన ప్రకటన ఇటువంటిదే! తమిళనాడు తూటుకుడిలో వాయుకాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలపుతున్న పౌరులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి 13 మందిని పొట్టనపెట్టుకోవడం కన్నా టెర్రరిస్టు చర్య ఏముంటుంది? పైగా, ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ సాగిన స్టెరిలైట్ వ్యతిరేకపోరా టంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న కార్య కర్తలు, న్యాయవాదులు, వార్తా కథనాలిచ్చిన జర్నలి స్టుల్ని కూడా ప్రభుత్వం నిర్బంధించింది. ముంబయి –అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణను వ్యతి రేకిస్తున్న రైతులపై మహారాష్ట్ర ప్రభుత్వం దమన కాండ కొనసాగిస్తూనే ఉంది. అటవీచట్టాల సాక్షిగా తమ హక్కుల పరిరక్షణ కోసం ఒడిశాలోని నియమ్ గిరి గిరిజన తెగలు అక్కడి వేదాంత–బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యయుత మైన వారి పోరాట పటిమ, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తినిస్తే, స్వయంగా కేంద్ర హోమ్‌మంత్రి, ‘నియ మ్గిరి సురక్షా సమితి’కి మావో యిస్టులతో సంబం ధాలు అంటగట్టారు. సర్దార్ సరో వర్ వంటి బారీ ప్రాజెక్టులు పర్యావరణానికి, స్థానిక గిరిజనుల మను గడకు ప్రమాదకరమని నర్మదా బచావో ఆందో ళన్(ఎన్బీయే) చేసిన పోరుపై సుదీర్ఘ కాలం సాగిన ప్రభుత్వ నిర్బంధ కాండ తెలిసిందే! తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పంథా! విభజనతో రెండుగా ఏర్పడ్డ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లోనూ పౌర నిరసను çసర్కార్లు సహించే పరిస్థితుల్లేవు. అడుగడుగున అణచివేస్తు న్నారు. ముస్లీమ్ యువకుల్ని చెరబట్టి ముప్పతిప్పలు పెడుతున్న కర్నూలు తాజా ఘటన ఏపీ ప్రభుత్వ దాష్టీకాలకు మచ్చుతునక. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రోడ్డెక్కినప్పుడు తమకు చాకిరీ తప్పించమని ఆశా వర్కర్లు గొంతెత్తినప్పుడు, సమస్యలు పరిష్కరించమని ఉపాధ్యాయ సంఘాలు శాంతి ర్యాలీ జరిపినప్పుడు, సీపీఎస్ రద్దు కోరి ఉద్యోగులు ఉద్యమించినప్పుడు... పోలీసులను మోహరించి ఏపీ సర్కారు ఈ నిరనలన్నింటినీ నిర్భీతిగా ఉక్కుపాదంతో అణచివేసింది. తెలంగాణలోనూ పరిస్థితి ఏమీ గొప్పగా లేదు. నిరసనలు తెలుపుకొనే వేదికగా ఇందిరాపార్కు వద్ద నున్న ధర్నాచౌక్‌ను ఎత్తేయించారు. సర్కారు ఏర్పడ్డ తొలినాళ్లలోనే, ‘ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక’ ఏర్పాటుకు జరిగిన యత్నాన్ని భగ్నం చేసి నాయ కులు, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ ఇళ్లలోనే నిర్బంధించి ప్రభుత్వం దమనకాండకు తలపడింది. మల్లన్నసా గర్‌ను వ్యతిరేకించి నిరసన తెలిపిన వారికీ అదే గతి పట్టించింది. విద్యార్థి ఉద్యమాల్నీ ఎక్కడికక్కడ అణ చివేస్తోంది. మౌనం పంపే తప్పుడు సంకేతాలు కర్ణాటకకు చెందిన హేతువాది, రచయిత కె.ఎస్. భగవాన్ తనను చంపదలచుకున్నవారికి ఓ సవాల్ విసిరారు. ఒక తేదీ ఖరారు చేస్తే తాను బెంగళూరు లోని విధానసౌధ ముందుకు వస్తానని, ముఖ్య మంత్రి, పోలీసుల సమక్షంలో తనను చంపి హీరో లుగా కీర్తి పొందొచ్చన్నారు. సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్యకేసు దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం భగవాన్ కూడా హంతకులు లక్ష్యంచేసు కున్న ‘బుద్దిజీవుల’ జాబితాలో ఉన్నారు. నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సరే, ఎమ్మెమ్ కల్బుర్గి లను హతమార్చినవారే పథకం ప్రకారం గౌరీ లంకేష్నూ హత్య చేశారని వెల్లడవడం తెలిసిందే! సహనంతో నిరసనల్ని అనుమతించే ప్రజాస్వామ్య వాతావరణ మైనా, అసహనంతో సాగించే నియంతృత్వపు అణచి వేతయినా.... అధికారంలో శీర్షస్థానంలోని వారిచ్చే సంకేతాల్ని బట్టే ఉంటుంది. బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లోకి మారిన సీనియర్ సంపాదకుడు, రాజకీయవేత్త చందన్ మిత్రా చేసిన వ్యాఖ్యలు ఇక్కడ సందర్బోచితమనిపి స్తుంది. పథకం ప్రకారం సాగిన బుద్దిజీవుల హత్య లైనా, దేశంలో పలుచోట్ల ఉన్మాదపు అల్లరిమూకలు జరిపిన కొట్టిచంపడాలయినా మన సమాజంలో బలపడుతున్న ఛాందసవాదానికి, మితిమీరిన అస హనానికి పరాకాష్ట! సదరు హంత కులకు వత్తాసుగా కొన్ని హిందూ మత సంస్థలవారు, పాలకపక్ష ఎంపీలు, కేంద్ర మంత్రులు చేసిన వాఖ్యల్ని ఆయా ప్రభుత్వాలు ఉపేక్షించాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీటిని గట్టిగా నియంత్రించి ఉండాల్సిందని రెండుసార్లు రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహించిన చందన్ మిత్ర మరో సీనియర్ జర్నలిస్టు బర్కాదత్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చేసిన ఈ వ్యాఖ్యలు సగటు పౌరుల్లోనూ ఆలోచనలు రేపు తాయి. నిరసనను కర్కశంగా అణచి వేయడం అప్రజాస్వామికమన్న సుప్రీం వ్యాఖ్యలు పాలకులకు కర్తవ్య బోధ చేస్తాయి. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
చీకటి మాటున దాగిన వేకువ
సమకాలీనం తామెక్కి వచ్చిన మెట్లను ఒకటొకటిగా కూల్చే బాపతు పాలకపక్షాలు నిరసన దారులన్ని టినీ మూసేస్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలంటే.. మీకిక మాట్లాడుకునే వేదికలే దొరకవు పొమ్మంటాయి. నిరసన తెలిపితే, తప్పదు నిర్బంధమంటాయి. ధర్నాచౌక్‌లు కనుమరుగవుతాయి. పాలకపక్షాలు ఏదీ, ఎక్కడ ప్రత్యామ్నాయం? అని విర్రవీగినప్పుడే చడీచప్పుడు లేకుండా బలమైన ప్రత్యామ్నాయం ఆవిర్భవించిన సందర్భాలు కోకొల్లలు. అన్ని దారులు మూసుకుపోయినట్టున్నా, ఏదో దారి తెరచుకోవడమే ప్రజాస్వామ్య లక్షణం! ‘ఒక దుర్బల ఊరపిచ్చుకను గరుత్మంతునితో పోరాడించు, ఓ నిరుపేద కార్మికుని శరీరంలో కనలే రక్తానికి నిరసన నిప్పురవ్వ జోడించు.... విప్లవం దానంతట అదే వస్తుంది’ అంటాడు మహాకవి ఇక్బాల్. ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమార హమారా...’’ అని ప్రపం చానికి ఎలుగెత్తి చాటిన ఆయన, దేశం ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే తీవ్రంగా కలత చెందివుండేవాడే! ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడకు అవసరమైన వాతావరణం దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పలుచనవుతోంది. పలు వ్యవస్థల్ని పాలకులు పనిగట్టుకొని పలుచన చేస్తున్నారు. ఏకస్వామ్య పాలనా వ్యవస్థల్ని నిరాఘాటంగా నడపాలనే దూరదృష్టితో ప్రజాస్వామ్య వాతావరణాన్నే కకావికలు చేస్తున్నారు. ఆలోచించే మెదళ్లని, నిలదీసే స్వరాల్ని, ప్రశ్నించే గొంతుకల్ని కర్కశంగా నలిపేస్తున్నారు. విప్లవాలు, పోరా టాల సంగతలా ఉంచితే, ఈ సర్కార్ల నీడలో ఆరోగ్యవంతమైన చర్చ, అవసరానికి పనికొచ్చే ఓ ఆలోచన కూడా చేయలేని సమాజం మెలమెల్లగ బలోపేతమౌతోంది ఇప్పుడు. వేర్వేరు కారణాలతో పౌరసమాజం స్వరం మెత్తబడుతున్న క్రమంలోనే ఓ బలహీనమైన సమాజం రూపుదిద్దుకునే పరిస్థితుల్ని ఎగదోస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఒకటి రెండు చోట్ల మినహా, పాలకపక్షాల దాష్టీకాలకు విపక్ష రాజకీయ పార్టీలు నిలబడలేకపోతున్నాయి. ప్రచార ఆర్భాటాలే తప్ప ఆర్థిక విధానాల్లో మార్పుల్లేని ప్రత్యామ్నాయాలు కూడా ప్రజా విశ్వాసం పొందలేకపోతున్నాయి. అందుకే అనిశ్చితి. అన్ని చోట్లా పూర్తిస్థాయి వ్యతిరేకత అని చెప్పలేకపోయినా, లోలోపల ఓ అసం తృప్తి, ఆవేదన, అలసట మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అప్రజా స్వామికంగా పావులు కదుపుతూనే, ‘మమ్మల్ని కాదంటే, ప్రత్యామ్నాయం ఏముందో చూపండి?’ అనేంతగా పాలకపక్షాల ధీమా ఎల్లలు దాటుతోంది! ప్రత్యర్థుల్ని చిత్తు చేసే ఎత్తులు–పైఎత్తుల రాజకీయ జిత్తుల్లో... ప్రభుత్వాలు, పాలనా వ్యవస్థలు, వాటి అంగాంగాల నుంచి వెలువడే సమాచారాన్ని సగటు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏది నిజమో తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితులు పౌరుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. పాలకులు ఏక పక్షంగా తమ అనుకూల సమాచారాన్ని వారిపై రుద్దుతున్నారు. తమకు గిట్టని, ఇరుకున పెట్టే సమాచారాన్ని అధికార బలంతో అడ్డుకుంటున్నారు. ప్రత్యక్షంగా–పరోక్షంగా ఒత్తిళ్లు, అణచివేతలు పెంచి సగటు జీవి స్వతం త్రంగా ఆలోచించలేని, స్వేచ్ఛగా భావాలు వ్యక్తం చేయలేని దుర్భర వాతా వరణం కల్పిస్తున్నారు. ఇదిలాగే బలపడి, రేపు ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అన్నది కార్యరూపం దాలిస్తే.... సమాఖ్య వ్యవస్థ అయినప్పటికీ రాష్ట్రాల్లో పరిస్థితులెలా ఉంటాయోనని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతు న్నారు. అవి ఎడారిలో ఒయాసిస్సులు! ఈ గాంధీ జయంతి రోజున నగరంలో ఓ మేధోచర్చ (మంథన్ సంవాద్) జరిగింది. వివిధ రకాల ఆలోచనా ధారలకు ప్రాతినిధ్యం వహించే ఏడుగురు ముఖ్యులు ప్రసంగాలు చేశారు. 2,500 మంది కూర్చునే వ్యవస్థ కలిగిన ‘శిల్పకళావేదిక’, నిర్వాహకులు ఒక్క వాహనమైనా ఏర్పాటు చేయకుండానే స్వచ్ఛందంగా వచ్చిన సభికులతో నిండిపోయింది. అన్ని వయసుల, వర్గాల, ప్రాంతాల వారూ హాజరయ్యారు. లభించిన పరిమిత సమయంలో కూడా మంచి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ (న్యాయ), కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా (రాజకీయం), జేఎన్‌యూ ప్రొఫెసర్ సుచేతా మహాజన్ (చరిత్ర), పాటల రచయిత, దర్శకుడు వరుణ్ గ్రోవర్ (కళలు), తక్షశిల సంస్థకు చెందిన నితిన్ పాయ్ (విద్య), ఎన్సీపీఆర్ఐ నిఖిల్‌డే (సామాజిక), సీనియర్ జర్నలిస్టు రవీశ్‌కుమార్(జర్నలిజం)లు చేసిన చక్కటి ప్రసంగాలకు అద్భుతమైన స్పందన లభించింది. అంతకు మునుపు నగరంలో ‘హైదరాబాద్ కలెక్టివ్’ ‘కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్’ ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్’ ‘ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్’ తదితర సంస్థలు కూడా పేరున్న వక్తల్ని, మేధావుల్ని రప్పించి పలు చర్చా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశాయి. సగటు పౌరుల్లో ఆరోగ్యవంతమైన చర్చను, అర్థవంతమైన ఆలోచనల్ని రేకెత్తించే ఇటువంటి వేదికల అవసరం ఇంకెంతో ఉంది. వాస్తవాలకు రాజకీయ రంగులు పులమకుండా, సమాజం పట్ల తమ బాధ్యతగా భావించి ఉన్నది ఉన్నట్టు చెప్పే, అదీ ప్రభావవంతంగా మాట్లాడే వారితో చర్చా కార్యక్రమాలు ఒక్క తెలుగునాటనే కాకుండా దేశవ్యాప్తంగా జరగాల్సి ఉంది. హైదరాబాద్ స్థాయి దాటి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి .... ఇలా చిన్న నగరాలు, పట్టణాలకూ ఈ సంస్కృతి విస్తరించాలి. తెలుగులో ప్రసంగాలు చేసే విశ్వసనీయత కలిగిన మేధావుల్ని చొరవ తీసుకొని ఒక వేదిక మీదకు తేగలగాలి. ప్రజల ఆలోచనా పరిధిని విస్తరింపజేసి, తద్వారా సరైన నిర్ణ యాల వైపు వారిని నడిపే ఈ చైతన్యం మరింత కింది స్థాయికి విస్తరించాల్సిన అవసరాన్ని విశాల జనహితం కోరేవారు కాంక్షిస్తున్నారు. రాజకీయేతర ప్రత్యామ్నాయాలే దన్ను! ప్రజాస్వామ్యం అంటే, అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల నడుమ పాలకుల య«థేచ్ఛ, విచ్చలవిడితనం కాదు. ఒకసారి ఎన్నికలు జరిగిపోతే, మళ్లీ ఎన్నికలు జరిగే అయిదేళ్ల వరకు పౌరులు ఏమీ చేయజాలని అశక్తతా కాదు! మరేంటి? ప్రజల స్వీయ నిర్ణయాధికారం. ప్రజాభిప్రాయానికి విలువ ఉండాలి. ప్రజలకు బలమైన అభిప్రాయాలుండాలి. అవి ఏర్పరచుకోవడానికి అవసరమైన వాస్తవిక సమాచారం అందాలి. పాలకులు కొన్ని మోసపు టెత్తుగడలతో పన్నే ఉచ్చుల్లో సామాన్యులకు అర్థం కాని మార్మికతను విప్పి చెప్పేలా మేధావివర్గం పూనిక వహించాలి. అందుకొక ఆరోగ్యవంతమైన చర్చ, ఉపయుక్త ఆలోచనా పరంపర సాగాలి. వివిధ వేదికల నుంచి అవి వ్యక్తం కావాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో దానికి తగినంత చోటిచ్చే భూమిక లభించాలి. రాజకీయ వ్యవస్థ, పాలకులు సదరు వాతావరణాన్ని కొనసాగనివ్వాలి. ‘మంథన్’ అందులో భాగమే! ఇవి మరిన్ని ఏర్పడి వాస్తవ సమాచారాన్ని జనబాహుళ్యంలోకి జొప్పిస్తే ప్రజల విచక్షణ పెరిగి, నిర్ణయా ధికారం వినియోగంలోకి వస్తుంది. పౌరులు జాగృతమై ప్రభుత్వాల నియం తృత్వ ధోరణుల్ని నిలువరించగలుగుతారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రభు త్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను అమలుపరుస్తూ మొండి వైఖరి వహిం చినా కూడా, ప్రజల ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గిన పరిస్థితులకు ఇలాంటి పౌరసమాజపు ఒత్తిళ్లే కారణం. తాజా ఉదాహరణ పెట్రోల్–డీజిల్ ధరల వ్యవహారమే! అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 120 డాలర్లున్న పుడు ఇక్కడ లీటరు పెట్రోలు గరిష్టంగా 80 రూపాయలుంటే, ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ధర 50 డాలర్లకు పడిపోయినా... లీటరు పెట్రోలు ధర సగటున 75 రూపాయలుంటోంది! ఎంత మంది సర్కారు ఆర్థికవేత్తలు ఎన్ని లెక్కలు చెప్పినా అది పొసగటం లేదు. స్వయంగా కేంద్ర ఇంధనశాఖ మంత్రి ‘ఏం చేయలేం, ధర తగ్గించడం అసాధ్యం’ అన్న తర్వాత కూడా ప్రజాభి ప్రాయాన్ని మన్నించి కేంద్రం దిగిరావాల్సి వచ్చింది. రాత్రికి రాత్రి తాను ధరలు తగ్గించడమే కాకుండా, రాష్ట్రాలను కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించుకొమ్మని ప్రతిపాదించాల్సి వచ్చింది. పౌరసమాజం మరింత చేత నతో, వ్యవస్థీకృతంగా ఉంటే ఎన్నెన్నో సాధించుకోవచ్చని ఈ పరిణామం చెబుతోంది. ఆశ చావొద్దు, భ్రమ బతుకొద్దు! సమకాలీన వ్యవస్థలో రాజకీయాలు చాలా ఖరీదయిపోయాయి. ప్రజా స్వామ్యం గురించి ఎంత గొప్పలు చెప్పుకున్నా సామాన్యులు రాజకీయాల్లో మనలేని రోజులొచ్చాయి. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలువడం, చిన్న చిన్న రాజకీయ పార్టీలు నడపడం కనాకష్టమైపోయింది. డబ్బు ప్రమేయం ఎన్నికల్లో బాగా పెరిగింది. సిద్ధాంత రాజకీయాలు కాస్త వెనక్కి వెళ్లి, స్వార్థ రాజకీయాలు పెరిగాక అధికారమే పరమావధిగా అడు గులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలపరమైన భావావేశాల్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొనే పద్ధ్దతులు బలపడ్డాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక పలువురు ప్రజాప్రతినిధులు తమను ప్రజలు గెలిపించిన విపక్ష పార్టీల్లో ఉండలేకపోతున్నారు. పాలకపక్షం కనుసైగ చేస్తే చాలు అందులో చేరిపోతున్నారు. అధికారంతో అంటకాగుతున్నారు. ఉభ యులూ కలిసి ప్రజాతీర్పును వంచిస్తున్నారు. ఐదేళ్ల వరకు ప్రజల్ని పరిహాసం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి విపక్ష పార్టీ జవసత్వాలు లేకుండా నామ మాత్రమైపోతే ఇక తమకు తిరుగే ఉండదన్నది పాలకపక్షాల ధీమా! అను చితమైన ఈ ధీమా ఒట్టి భ్రమ కావాలి. అంతటి శక్తి ఆలోచన బాట పట్టిన జన బలానికుంటుందని మన ప్రజాస్వామ్యం పలుమార్లు నిరూపించింది. ఏదీ! ఎక్కడ ప్రత్యామ్నాయం? అని పాలకపక్షాలు అహంతో ప్రశ్నించిన ప్పుడు కూడా చడీచప్పుడు లేకుండానే బలమైన ప్రత్యామ్నాయం అప్పటి కప్పుడు ఆవిర్భవించిన సందర్భాలు కోకొల్లలు. ఎమర్జెన్సీ కాలంలో తనకు ఎదురే లేదనుకున్న నాటి ప్రధాని ఇందిరా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ రూపంలో ఓ ప్రత్యామ్నాయం అంత తొందర్లో పుట్టుకొస్తుందని ఊహించలేక పోయారు. 1982–83లో తెలుగు నాట సినీ నటుడు ఎన్టీరామారావు ఓ ప్రభంజనంలా దూసుకు రావడం కూడా, అప్పటికే కాంగ్రెస్ చేష్టలతో విసిగి వేసారిన ప్రజలు నిర్ణయించిన ప్రత్యామ్నాయ శక్తి మాత్రమే! ఒక రూపంలో అంతమైనా, మరేదో రూపంలో ప్రత్యామ్నాయం ఆవిర్భవించడమే ప్రజాస్వామ్యపు అందం! అందుకే, ప్రజ లెప్పుడూ నిరాశకు గురికాకుండా జాగరూకత వహిస్తూ ఆశావహ దృక్ప థంతో ఉండాలి. ఎంత పొడవైనదైనా చీకటి సొరంగం తర్వాత వెలుగు ఖాయం! ఈ లోపున, జరుగుతున్న పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమ నిస్తూ... తగు విధంగా చర్చించి, ఆలోచించి పౌరులు తమవైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉమ్మడి చొరవే ఉద్యమ స్ఫూర్తి! బలమైన రాజకీయ వ్యవస్థలకు ఒకప్పుడు భూమికనిచ్చిన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నిర్వీర్యమై ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వాటినలా చేశారు, చేస్తూనే ఉంటారు. మనిషి విచిత్ర స్వభావాన్ని ఎత్తిచూపుతూ చలం అన్నట్టు, మనిషి ఎవర్నయినా క్షమిస్తాడు తనకు సహాయపడ్డవాణ్ణి తప్ప! తామెక్కి వచ్చిన నిచ్చెన మెట్లను ఒకటొకటిగా నరికే స్వభావమున్న పాలక పక్షాలు ఇతరులు నిరసన తెలిపే దారులన్నీ మూసేస్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయవేదికలంటారా? మీకిక మాట్లాడుకునే వేదికలే దొరకవు పొమ్మం టాయి. నిరసన తెలిపితే, తప్పదు నిర్బంధమంటాయి. ధర్నాచౌక్‌లు కూడా కనుమరుగవుతాయి. అన్ని దారులు మూసుకుపోయినట్టు కనిపించినా, ఎక్కడో ఓ దిక్కున దారి తెరచుకోవడమే ప్రజాస్వామ్య లక్షణమని చరిత్ర, ప్రకృతి చెబుతోంది! కవులు, రచయితలు, మేధావులు, ఇతర ప్రజాస్వామ్య వాదులు ఏకమవ్వాలి. పౌరుల్ని అప్రమత్తంగా ఉంచి ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలి. ఆరోగ్యకరమైన చర్చను, అవసరాలు తీర్చే ఆలోచనల పరిధిని మరింత విస్తరించాలి. రేపు బాగుండాలంటే, నేడంటూ ఉండాలి! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
21వ శతాబ్దంలో 19వ శతాబ్దం రూల్సా?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అతి పెద్దది. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా పార్లమెంట్ సమావేశాలు మాత్రం ఎన్నడూ సవ్యంగా నడవవు. నిన్నటి వర్షాకాల సమావేశాలు కళంకిత మంత్రులను ఉపేక్షించడంపై తుడిచిపెట్టుకుపోగా, నేటి శీతాకాల సమావేశాలు దేశంలో పెరుగుతున్న అసహనం, రగులుతున్న నేషనల్ హెరాల్డ్ వ్యవహారంతో తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఫలితంగా వస్తుసేవల పన్ను లాంటి ముఖ్యమైన పలు బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఎందుకు పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా కొనసాగడం లేదు? దీనికి పరిష్కారం లేదా? అన్న అనుమానాలు వస్తాయి. అమెరికా, బ్రిటన్ దేశాల పార్లమెంటరీ వ్యవస్థలను అనుసరించి 19వ శతాబ్దంలో మనం ఏర్పాటు చేసుకున్న పార్లమెంటరీ ద్విసభ విధానం, అనుసరిస్తున్న నియమ నిబంధనలే ప్రస్తుత పరిస్థితికి కారణం. అమెరికా, బ్రిటన్ దేశాలే ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంటరీ వ్యవస్థలో మార్పులు తెచ్చినప్పుడు మన వ్యవస్థలో కూడా మార్పుల కోసం ఎందుకు ప్రయత్నించకూడదు? దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్నే ఏర్పాటు చేసుకున్నప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రం ఎందుకు మార్పులు తీసుకురాకూడదు! నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్ల మెజారిటీతో అధికారంలోకి రావడం దాదాపు గత మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారని చెప్పవచ్చు. అయినా మోదీ ప్రభుత్వంలో విధానపర నిర్ణయాలు సక్రమంగా జరగడం లేదు. మోదీ గొప్పగా చెప్పుకుంటూ వస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు. కారణం, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అవడం, పాలకపక్ష పార్టీ మైనారిటీలో కొనసాగడం. రాజ్యసభలో ఆర్థిక బిల్లులను తప్పించి ఇతర విధానపరమైన బిల్లులను ప్రస్తుతం ప్రతిపక్షమే శాశిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో ప్రజా ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఎక్కడ? పార్టీలకు అతీతంగా సభ్యులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా 1985లో తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా అడ్డు పడుతోంది. విప్ల పేరిట పార్టీ నాయకత్వం తమ సభ్యులను నియంత్రిస్తుంది. ఇలాంటి సమయాల్లో పార్టీ నాయకత్వం మాటే చెల్లుతుంది తప్ప ప్రజాప్రతినిధుల మాట చెల్లదు. అణ్వస్త్రాల ప్రయోగం, ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టడం లాంటి అంశాలకు మాత్రమే పార్లమెంట్ నిబంధనలు కచ్చితంగా ఉన్నాయి గానీ చర్చనీయాంశాల ఎజెండా, తీసుకరావాల్సిన తీర్మానాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేకపోవడం శోచనీయం. పార్లమెంట్ సభ్యుల అవగాహనతో వీటిని నిర్ణయించాల్సి ఉంటుందని పార్లమెంట్ నిబంధనలు తెలియజేస్తున్నాయి. ప్రజా ప్రయోజనం కాకుండా పార్టీల స్వప్రయోజనాలే ముఖ్యమైన నేటి వ్యవస్థలో రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదరడం అసాధ్యమే! అమెరికా సెనేట్ వ్యవస్థను పాక్షికంగా అనుసరించి రాజ్యసభ స్వరూపాన్ని ఏర్పాటు చేసుకున్న మనం సంస్కరణల దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? అమెరికా సెనేట్ వ్యవస్థలో 1913లోనే సంస్కరణలు తీసుకొచ్చి ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేశారు. 1911, 1949లలోబ్రిటన్ ప్రభువుల సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ సభకు ఎలాంటి బిల్లునైనా ఏడాది పాటు ఆపవచ్చు గానీ తిరస్కరించే అధికారం లేదు. ఆ తరహా మార్పులతో మన రాజ్యసభను ఎందుకు తీర్చిదిద్దకూడదు! నేటి 21వ శతాబ్దంలో కూడా 19వ శతాబ్దం నాటి నియమ నిబంధనలనే పాటించడం ఏ మేరకు సబబు! -
ప్రజాస్వామ్య స్వాప్నికుడు కొఠారి
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ప్రభుత్వాలదే బాధ్యతనే వాదనను రజనీ కొఠారి తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బలమైనశక్తి ప్రజల భాగస్వామ్యమేనని విశ్వసించారు. మన ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల భాగస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నదని అభిప్రాయపడ్డారు. రోజు రోజుకీ ప్రభుత్వాలు కార్పొరేట్ రంగంవైపు పరుగులు తీస్తూ నూతన పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవం పోస్తున్నాయని స్పష్టం చేశారు. అందుకే అన్నిరకాల దోపిడీ పీడనల నుంచి విమోచన కలిగించే ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ‘‘కిందిస్థాయిలో ప్రజలు చైతన్యవంతులు కావడం ఎంతో అవసరం. ఇది వాంఛనీయం కూడా. ఆకలికి, అవమానాలకు వ్యతిరేకంగా నిలబడేది నిజమైన ప్రజాబలమే. అంతేకానీ, పార్టీల వ్యవస్థ, ఎన్నికలు, ఇతర సంప్రదాయ పద్ధతులు ఏవీ నిజమైన ప్రత్యామ్నాయాలు కావు. రోజూ ప్రజల్లో పెరుగు తున్న అశాంతికి, అసంతృప్తికి సరైన వేదిక లభిస్తే అది ఎన్నో మార్పులకు శ్రీకారం కాగలుగుతుంది.’’ ఈ మాటలన్నది ఎవరో కాదు ప్రముఖ రాజనీతి వేత్త, విద్యావేత్త, పరిశోధకులు, మానవ హక్కుల ఉద్యమ నాయకులు రజనీ కొఠారి. ఈ కొద్ది మాటలతోనే రాజనీతికి నిజమైన భాష్యం చెప్పిన ఆయన జనవరి 19న మన నుంచి శాశ్వతంగా నిష్ర్కమించారు. సత్యాన్వేషణే ఊపిరిగా సాగిన ఆయన జీవితం రాజనీతి శాస్త్రంలో కొత్త ఒరవడిని సృష్టిం చింది, ఎన్నో వినూత్న కోణాలను స్పృశించింది. రాజకీయాలు సామాజిక ప్రగతికి, ప్రజాస్వామ్య మనుగడకు దోహదపడాల్సిన ఆవశ్యకతను ఆయన పరిశోధనలు, రచనలు అడుగడుగునా నొక్కి చెప్పాయి. కొఠారి 1928లో మహారాష్ట్రలోని ఒక జైన వ్యాపారి కుటుంబంలో పుట్టిన ప్పటికీ, సంప్రదాయ వృత్తిని కాదని అధ్యాపకునిగా జీవనాన్ని ప్రారంభిం చారు. తదుపరి బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తూ సత్యశోధనకు ఉపక్రమించారు. 1961లో ‘ఎకనమిక్ వీక్లీ’లో (నేటి ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ) వరుసగా ఆరు వ్యాసాలు రాశారు. ‘భారత రాజకీయాలు, రూపం, సారం’ అనే శీర్షికతో సాగిన ఈ వ్యాసాలు ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ విద్యావేత్త రమేష్ థాపర్ నిర్వహణలోని ‘సెమినార్’లో కూడా ఆయన రాశారు. ఆ రచనలతో ప్రభావితులైన ప్రొఫెసర్ శ్యాంచరణ్ దూబే తాను నడుపుతున్న ‘నేషనల్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్’లో అసిస్టెంట్ డెరైక్ట ర్గా పనిచేయాలని ఆహ్వానించారు. కానీ స్వతంత్రంగా ఆలోచించే తత్వం ఉన్న రజనీ కొఠారి 1963లో తానే స్వయంగా ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవల పింగ్ సొసైటీస్’ (సీఎస్డీఎస్) అనే సంస్థను స్థాపించారు. ఇటీవలే ఈ సంస్థ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ప్రముఖ మేధావులు ఆశీష్ నంది, డీఎల్ సేథ్, రామాశ్రయ్ రాయ్, బషీరుద్దీన్ అహ్మద్‌ల వంటివారు సీఎస్‌డీఎస్‌లో కొఠారితో కలసి పనిచేశారు. రచనలకే పరిమితం గాక ఆయన పలు సామా జిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం ఆయన కార్యాచరణకు అంతఃసూత్రం. అందుకే ఆయన తన రచనా వ్యాసంగమంతటా, మొదటి రచన నుంచి చివరి వరకు ప్రజాస్వామ్యం మీదనే దృష్టిని కేంద్రీకరించాడు. భారతదేశంలో రాజకీయాలు 1961లో ఆయన రాసిన ఆరు వ్యాసాల సంపూర్ణ రూపమే ‘పాలిటిక్స్ ఇన్ ఇండియా’ (1970). అది అంతవరకు రాజనీతి శాస్త్రంలో కొనసాగుతున్న సాంప్రదాయక చింతనకు ముగింపు పలికింది. కులవ్యవస్థను అర్థం చేసుకో కుండా భారత రాజకీయాలను చర్చించలేమని ఆయన అందులో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ధృక్పథం దిగుమతి చేసుకునే విలాస వస్తువు కాదని, మన దేశ పరిస్థితులకు దాన్ని అన్వయించుకోవాలని, మన సామాజిక పరిస్థితులకు తగిన ప్రజాస్వామ్య విధానాలను కొత్తగా మనం రూపొందిం చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ వలస పాలనలోని మంచి, చెడులను తులనాత్మకంగా చర్చించారు. పాశ్చాత్య చదువుల వలన ఆవిర్భ వించిన మధ్యతరగతి వర్గం రాజకీయ మార్పులకు సారథి అయిందని భావించారు. హిందూ పునరుజ్జీవనానికి బ్రిటిష్ పాలన కూడా దోహదపడిందని, అందువల్లనే హిందూ భావజాలం నుంచి వచ్చిన నాయకులే మొదటి ఐదు దశాబ్దాల జాతీయోద్యమాన్ని నడిపారని ఆయన పేర్కొన్నారు. ఆధునికత వైపు దృష్టి, సంస్థాగత నిర్మాణ వ్యూహాలు, రాజకీయ పార్టీల వ్యవస్థ, ఐక్య కూటముల ఏర్పాటు, సామాజిక నిర్మాణాలు వంటి స్వాతంత్య్రానంతర పరిణామాలను కూడా ఆయన ఈ రచనలో వివరించారు. భారత రాజకీ యాల్లో కులం పాత్రను సంక్షిప్తంగా స్పృశించారు. దేశాభివృద్ధిలో రాజకీయా ర్థిక విధానం పాత్ర, అంతర్జాతీయ పరిస్థితులను వివరిస్తూ భవిష్యత్ పథానికి మార్గనిర్దేశనం చేశారు. ‘‘భారత చారిత్రక పరిణామక్రమంలో ప్రజాస్వామ్య రాజకీయాలు క్రియాశీల పాత్ర పోషించాయి, భవిష్యత్తులో ఇది కొనసా గాలి’’ అని ఉద్బోధించారు. భారత రాజకీయాల్లో కులం కొఠారి వెలువరించిన రెండో పుస్తకం ‘కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ (1973) నూతన ఆలోచనలకు తెరలేపింది. 1970 దశకం వచ్చే సరికి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర రాజకీయశక్తుల ఆవిర్భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ అంశంపై సీఎస్డీఎస్తో క్షేత్రస్థాయి అధ్యయనాలను చేయించి మరీ ఆయన ఈ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకానికి రాసిన ఉపోద్ఘాతంలో ఆయన కులం, రాజకీయాలు ఒకే సమయంలో పరస్పర విరుద్ధంగానూ, కలగలిసి సాగుతున్నాయని విశ్లేషించారు. ‘‘ఆధునికతకు, సాంప్రదాయానికీ, మొత్తంగా సమాజానికి, రాజకీయాలకూ మధ్య వైరుధ్యం సాగుతున్నది’’ అని ప్రకటించారు. మహారాష్ట్రలో మహర్ల రాజకీయ ప్రస్థానం, గుజరాత్లో క్షత్రియుల సంఘటన, తమిళనాడులో నాడార్ల రాజకీయ అరంగేట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ, రెడ్డి కులాల ఆధిపత్యం, రాజస్థాన్‌లోని కుల సమీకరణాలు, బిహార్‌లో కులసామాజిక వర్గాల ఐక్య సంఘటన, ఇలా వివిధ రాష్ట్రాల్లో కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ సంస్థల గురించి, నూతనంగా ముందుకు దూసుకు వస్తున్న నాయకుల గురించి అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఆయన అధ్యయనం జరిపించారు. ఒకరకంగా చెప్పాలంటే, రాజకీయాలు కులాలకు అతీతంగా ఉన్నాయనే భావనలోనే మేధావులుండేవారు. అయితే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల ఆవిర్భావం అనేది కేవలం రాజకీయ కారణాల వల్ల సంభవిస్తున్న పరిణామం మాత్రమే కాదని ఆయన గుర్తించారు. రాజకీయాల్లో తమకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదనే భావన ఆయా కులాలకు ఏర్పడటం కూడా అందుకు కారణమని ఆయన తేల్చి చెప్పారు. ఆ తరువాతి పరిణామాలు అదే విషయాన్ని రుజువు చేసి చూపాయి. 1970 దశకం చివరిలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పరచిన జనతా పార్టీ వివిధ రాజకీయ పార్టీల కలయిక మాత్రమే కాదు. వివిధ కులాల సమ్మేళ నంతో కూడిన రాజకీయ వేదిక కూడా. బిహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర కొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణేతర పార్టీలు ఉనికిలోకి వచ్చిన విషయం మనకు తెలుసు. నేడు రాజకీయాల్లో కులం పాత్రను అధ్యయనం చేయాలను కునే వారెవరైనా మొదట ‘కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’తో ప్రారంభించా ల్సిందే. భారత రాజకీయాలను ఆయన ఏదో ఒక సిద్ధాంతం వెలుగులో అధ్య యనం చేయలేదు. అందువల్లనే చాలా నిజాయితీగా అధ్యయనం చేయగలి గారు. ‘‘నేనిక్కడ ఒక విషయం ఒప్పుకోవాలి. నేను సాంప్రదాయక జాతీయ వాదినీ కాదు, అట్లా అని పాశ్చాత్య రాజకీయ భావజాలానికి లోబడీ లేను. నేను ఎటువంటి రాజకీయ సిద్ధాంతాలను తలకి ఎత్తుకోలేదు. అందువల్లనే స్వతంత్రంగా ఆలోచిస్తూ, అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం సులభ మైంది’’ అని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై పునరాలోచన కొఠారీ ‘రీథింకింగ్ డెమొక్రసీ’ మనకొక ప్రజాస్వామ్య పెన్నిధిని అందించిం ది. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎదురవుతున్న సవా ళ్లను, అనుసరించాల్సిన మార్గాలను ఇందులో కొఠారి సూచించారు. ఆయన రాత కోతలకు పరిమితమైన మేధావి కాదు. తాను నమ్మిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆచరణ ద్వారా కూడా బలోపేతం చేయాలని చూసిన వారు. తీవ్ర నిర్బంధం అమలు జరిగిన ఎమర్జెన్సీ రోజుల్లోనే ఆయన ఢిల్లీలో ‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’ను (పీయూసీఎల్) స్థాపించి, 1984 వరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఎమర్జెన్సీలో జరిగిన పలు అరాచకాలను బయట పెట్టి దేశవ్యాప్త ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాన్ని సాగించారు. మన రాష్ట్ర పౌరహక్కుల ఉద్యమానికి ఆద్యులైన కన్నబీరన్ కూడా పీయూసీఎల్‌లో జాతీయస్థాయి బాధ్యతలు నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ప్రభుత్వాలది మాత్రమే బాధ్యత అనే వాదనను కొఠారి తిరస్కరించారు. ప్రజల భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బలమైన శక్తి అని భావించారు. ‘‘ప్రజాస్వామ్యం కింది స్థాయి ప్రజల ద్వారా మాత్రమే మనుగడ సాగించగలదు. ఇది కేవలం గొప్ప నాయకుల ద్వారా సాధ్యం కాదు. శక్తివంతులైన, బాధ్యతాయుతమైన పౌరుల చైతన్యమే దీనికి పునాది’’. దేశంలో అమలులో ఉన్న ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంపై రజనీ కొఠారికి సదభిప్రాయం లేదు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల భాగస్వా మ్యాన్ని దెబ్బతీస్తున్నదని ఆయన అభిప్రాయం. ప్రజాస్వామ్యానికి ఎదురవు తున్న మరొక సవాలును కూడా ఆయన మనముందుంచారు. రోజు రోజుకీ ప్రభుత్వాలు కార్పొరేట్ రంగంవైపు పరుగులు తీస్తూ కొత్త పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవం పోస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఆయన ‘రీథింకింగ్ డెమొక్రసీ‘లో అన్ని రకాల దోపిడీ పీడనల నుంచి విమోచన కలిగించే ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213) - మల్లెపల్లి లక్ష్మయ్య -
విద్వేషంపై కొరడా!
సంపాదకీయం: మాటనేది ఒక వ్యక్తి సంస్కారాన్ని, పరిపక్వతను పట్టి ఇస్తుంది. వ్యక్తులుగా తాత్కాలిక ఆవేశానికో, ఆగ్రహానికో లోనై మాట్లాడే మాటలు అలాంటివారికే అంతిమంగా నష్టం కలిగిస్తాయి. కానీ, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు వివేకం మరిచి విద్వేషం కలిగించే మాటలు మాట్లాడితే అది మొత్తం సమాజాన్నే ఇబ్బందుల్లోకి నెడుతుంది. అమాయకుల ప్రాణాలకు ముప్పుతెస్తుంది. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా నాయకులు చేసే ప్రసంగాలవల్ల అల్లర్లు, ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది. ఎన్నికలు వస్తున్నా యంటే అందరూ భయపడేది ఇలాంటి ప్రసంగాల గురించే. సాధారణ పరిస్థితుల్లో సవ్యంగా ఉన్నట్టు కనబడేవారు ఎన్నికల సమయంలో పరిధులు మరచి ప్రవర్తిస్తుంటారు. ఎవరినైనా ఏమైనా అనే హక్కు తమ సొంతమని భావిస్తుంటారు. అందుకు దీటుగా సమాధానమివ్వడం కోసం ప్రత్యర్థులు కూడా తమ నోటికి పనిచెబుతారు. ఈ ధోరణులను అరికట్టడానికి ఏంచేయాలో సూచించమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లా కమిషన్‌ను బుధవారం కోరింది. అంతేకాదు... నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు వారి ఆధ్వర్యంలో ఉండే సంస్థల, పార్టీల గుర్తింపును రద్దుచేయాలా అనే అంశాన్ని కూడా పరిశీలించి చెప్పాలని ఆదేశించింది. ఇలాంటి ప్రసంగాలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయని ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ సూచన చేసింది. అంతేకాదు... ఆ బాపతు నాయకులపై వెనువెంటనే చట్టప్రకారం చ ర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ నాయకులైనా, సంఘాలకు నాయకత్వంవహిస్తున్నవారైనా, మత సంస్థలకు చెందినవారైనా ఈ తరహా ప్రసంగాలు చేసినప్పుడు చర్యకు వెనకాడవద్దని కోరింది. మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించింది. ఏ పౌరుడైనా తన భావాలను ప్రచారం చేసుకునే హక్కును ఇచ్చింది. అయితే, దీనికి తగిన హద్దులనూ నిర్ణయించింది. ఆ కట్టుదాటినప్పుడు ఏంచేయాలో సీఆర్పీసీలోని వివిధ సెక్షన్లు చెబుతున్నాయి. వివిధ కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టేలా ఉండే మాటలు మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ఉన్నప్పుడు చర్యలు తీసుకోవచ్చునని అంటున్నాయి. అయితే, ఏది హద్దుమీరిన మాటో, ఎలాంటి రచన విద్వేషపూరితమైనదవుతుందో సీఆర్పీసీ కూడా స్పష్టంగా చెప్పలేదు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లేదా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని భావించినప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి బాధ్యులుగా భావించినవారిపై కేసులు పెడుతుంటారు. అయితే, నిజంగా ఉద్రేకాలను రెచ్చగొట్టే, విద్వేషాన్ని నూరిపోసే రచనలు, ప్రసంగాలు ఇలాంటి సెక్షన్ల కారణంగా ఆగుతున్నాయా? లేదనే చెప్పాలి. ఆ వంకన భిన్నాభిప్రాయాలనూ, విమర్శలనూ అణచివేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఏది రెచ్చగొట్టే ప్రసంగం... ఏది రెచ్చగొట్టే రచన అనేది న్యాయస్థానాల విచక్షణే నిర్ణయిస్తున్నది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా చేసిన సూచనలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దేశంలో ఎన్నికల వేడి పెరిగాక నాయకుల పరస్పర దూషణల పర్వం పెరిగింది. ఏ ఛానెల్ పెడితే ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని హడలెత్తిపోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారే స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈమధ్య బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఉద్దేశించి ‘నపుంసకుడు’ అనే పదాన్ని వినియోగించి అల్లరిపడ్డారు. ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ పదిరోజులక్రితం దాఖలైన పిటిషన్‌పై ఆదేశాలివ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఇప్పుడు లా కమిషన్‌కిచ్చిన ఆదేశాల ఉద్దేశం వేరు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం లక్షణాన్ని చెప్పి, ఎలాంటి అంశాలు దాని పరిధిలోకి వస్తాయో నిర్ణయించడంవల్ల, దానికి అనుగుణంగా చట్టం రూపొం దించడంవల్ల భవిష్యత్తులో ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. స్వప్రయోజనాలను ఆశించి, రాజకీయ లబ్ధిపొందడానికి చిత్తంవచ్చినట్టు మాట్లాడే... రెచ్చగొట్టే నాయకులను ఇప్పుడున్న సీఆర్పీసీ నిబంధనలు ఏమీ చేయలేకపోతున్నాయి. ప్రజాసమూహాలను మతం పేరుతో, కులంపేరుతో విడగొట్టి, విద్వేషాలను నూరిపోసేవారు సురక్షితంగా,దర్జాగా ఉంటుంటే ఆ మారణహోమాల్లో సామాన్యులే సమిధలవుతున్నారు. పార్టీ కావొచ్చు...మతంపేరిట వెలసిన మరేదైనా సంస్థ కావొచ్చు...బాహాటంగా ప్రజలమధ్య చిచ్చుపెడుతున్నా పోలీసులు నిస్సహాయులుగా మిగులుతున్నారు. అధికారంలో ఉన్నవారు తమ ప్రయోజనాలను ఆశించి ఇలాంటివారిని చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. భిన్న జాతులు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న మన దేశంలో ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తే ఏమవుతుందో దేశ విభజన కాలంనాటినుంచి నిన్నమొన్నటి ముజఫర్‌నగర్ అల్లర్ల వరకూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం అలాంటి వ్యక్తులపైనా, నాయకులపైనా చర్యలు తీసుకోవడంతోపాటు పార్టీలనూ, సంస్థలనూ నిషేధించే అవకాశం ఉంటుంది. పైగా విద్వేషపూరిత ప్రసంగంమంటే ఏమిటో చెప్పాలనడంవల్ల చట్టానికి స్పష్టత ఉంటుంది. అది దోషులను నేరుగా తాకుతుంది. అలాంటపుడు చర్యలు తీసుకోవడం, నేరాన్ని నిరూపించడం సులభమవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా నిర్దిష్టమైన, స్పష్టమైన చట్టం రూపొంది... స్వార్ధ రాజకీయనేతలను అదుపు చేయగలిగితే అంతకన్నా కావల్సిందేముంది?