derivative contracts
-
ఒడిదుడుకుల వారం..
జీఎస్టీ బిల్లు ఆమోదంపై అంచనాలు ♦ డెరివేటివ్‌ల ముగింపు కారణంగా హెచ్చుతగ్గులు ♦ కీలక కంపెనీల క్యూ1 ఫలితాల ప్రభావం ♦ ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్ , హెచ్డీఎఫ్సీ, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, జీఎస్టీ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో జరిగే పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. జూలై నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారమే(ఈ నెల 28న) ముగియనున్నందున ఒడిదుడుకులు తప్పవని వారంటున్నారు. వీటితో పాటు వర్షపాతం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ... పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన బిల్లులు క్యూలో ఉన్నాయని, ఇవి ఆమోదం పొందితే మార్కెట్ మరింతగా పెరుగుతుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. అలా కాని పక్షంలో స్వల్పకాలానికి మార్కెట్ పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుందని వివరించారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే సెంటిమెంట్‌కు మరింత జోష్ వస్తుందని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్ పంకజ్ శర్మ పేర్కొన్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగే అవకాశముందని, ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ట్రేడ్‌బుల్స్ సీఓఓ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఈ నెల 26-27), బ్యాంక్ ఆఫ్ జపాన్ల(ఈ నెల 28-29) సమావేశాలు ఈ వారంలోనే జరగనున్నాయి. రేట్ల విషయమై ఈబ్యాంక్లు యథాతథ స్థితిని కొనసాగించవచ్చని అంచనాలున్నాయి. -
ఒడిదుడుకుల వారం!
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యం * ఎస్బీఐ, కోల్ ఇండియా దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు * రుతుపవన అంచనాలూ కీలకమే ! * విశ్లేషకుల అభిప్రాయం న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, రుతుపవనాల గమనం తదితర అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఒడిదుడుకులు తప్పవని వారంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ సరళి, ముడి చమురు ధరల, రూపాయి కదలికలు, రుతుపవనాల గమనంపై ప్రకటనలు. తదితర అంశాలూ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని నిపుణుల ఉవాచ. మరింత బలహీనంగా మార్కెట్.. అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్, రుతుపవనాల రాక, కంపెనీల గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘానియా చెప్పారు. మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ఎక్స్పైర్ అవుతాయని, ట్రేడర్ల పొజిషన్ల రోల్ ఓవర్ కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయని వివరించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మే నెల కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని, స్టాక్ సూచీలు మరింత బలహీనపడవచ్చని యస్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నటాషా శంకర్ అంచనా వేస్తున్నారు. వడ్డీరేట్లకు సంబంధించి భవిష్యత్ అంచనాల కారణంగా ప్రపంచ మార్కెట్లు గత వారంలో దాదాపు రెండు నెలల కనిష్టానికి పతనమయ్యాయని ట్రేడ్‌బుల్స్ సీఓఓ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందనే అంచనాల మధ్య విదేశీ నిధులు భారీగా తరలిపోతాయనే భయాలు నెలకొన్నాయని ఏంజెల్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ వైభవ్ అగర్వాల్ చెప్పారు కీలక కంపెనీల ఫలితాలు..., టాటా పవర్, బీపీసీఎల్ కంపెనీలు ఫలితాలను ఈ నెల 23న (సోమవారం) వెల్లడించనున్నాయి. టెక్ మహీంద్రా, సిప్లా, కోల్గేట్ పామోలివ్ (ఇండియా), లు ఈ నెల 24న(మంగళవారం), బజాజ్ ఆటో, గెయిల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీలు ఈ నెల 25(బుధవారం), ఎస్బీఐ, భెల్ ఈనెల 27న(శుక్రవారం), కోల్ ఇండియా ఈ నెల 28న(శనివారం)తమ ఫలితాలను వెల్లడిస్తాయి. ఇవే కాకుండా ఓఎన్జీసీ, ఐఓసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అశోక్ లేలాండ్, ఇండియా సిమెంట్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, అబాట్ ఇండియా, అబాట్ ఇండియా, జీఎస్కే ఫార్మా వంటి కంపెనీలు నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అంతా వరుణుడి దయ... వర్షాలు ఎలా కురుస్తాయనేది రానున్న వారాల్లో ఆర్థిక వ్యవస్థకే కాకుండా, స్టాక్ మార్కెట్‌కు కూడా కీలకమని నిపుణులంటున్నారు. రానున్న 4-6 వారాల్లో రుతుపవనాలపై అంచనాలేనని స్టాక్ మార్కెట్‌కు కీలకమని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్(ఈక్విటీస్) పంకజ్ శర్మ చెప్పారు. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 188 పాయింట్లు(0.73%) క్షీణించి, 25,302 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 65(0.83 శాతం) పాయింట్లు క్షీణించి 7,750 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు.. గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,064 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారని ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.1,795 కోట్లు ఈక్విటీ మార్కెట్లో నికరంగా ఇన్వెస్ట్ చేయగా, రూ.3,496 కోట్ల పెట్టుబడులను డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన గురువారం రోజు విదేశీ ఇన్వెస్టర్లు రూ.341 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బీజేపీ అస్సాంలో అధికారంలోకి రావడం, పశ్చిమ బెంగాల్, కేరళలో ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడడంతో సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుందని బీఎన్పీ పారిబా ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ శ్రేయాశ్ దేవాల్కర్ అంచనా వేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.29,558 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో రూ.14,706 కోట్ల పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.4,436 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
తీవ్ర హెచ్చుతగ్గులుంటాయ్..
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం * క్యూ4 ఫలితాలపై చూపు న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ తదితర బ్లూచిప్ కంపెనీల నుంచి వెలువడే క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని, అయితే డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా మన సూచీల కదలికల్ని శాసిస్తాయని వారన్నారు. అలాగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతుందని వారు వివరించారు. ఫెడ్ సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనున్నది. ఈ వారం యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, భారతి ఎయిర్టెల్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని ప్రకటించనున్నాయి. రిలయన్స్ ఫలితాల ఎఫెక్ట్... గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలకు స్పందించడం ద్వారా ఈ సోమవారంనాటి ట్రేడింగ్ ఆరంభమవుతుందని, తద్వారా తదుపరి సూచీల దిశ నిర్దేశితమవుతుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. 8 ఏళ్లలో రికార్డుస్థాయి క్వార్టర్లీ నికరలాభాన్ని రిలయన్స్ ప్రకటించింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ మార్జిన్ల జోరు దీనికి ప్రధాన కారణం. అయితే రానున్న త్రైమాసికాల్లో ఈ స్థాయి మార్జిన్లను కంపెనీ సాధించగలుగుతుందా, లేదా అనే అంచనాలతో రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయని విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. పార్లమెంటు సమావేశాలపై దృష్టి... సోమవారం నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశాల్ని కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ సమావేశాల్లో దివాలా బిల్లు, జీఎస్టీ బిల్లులు ఆమోదానికి నోచుకోవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. బోర్డ్ మీటింగ్స్ ఈ వారం.. 25-సోమవారం: ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్పాంజ్ ఐరన్, వెల్స్పన్ ఇండియా ఏబీబీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 26-మంగళవారం: యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, మారుతీ సుజుకీ, రేమండ్ 27-బుధవారం: భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, యస్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 28-గురువారం: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐడియా సెల్యులర్, ఏసీసీ, అంబుజా సిమెంట్, 29 -శుక్రవారం: ఐసీఐసీఐ బ్యాంక్, ఇండిగో, ఐడీఎఫ్సీ, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ -
151 షేర్ల లాట్ సైజుల్లో మార్పులు
- ఈ నెల 28 నుంచి అమల్లోకి - ఎన్ఎస్ఈ వెల్లడి ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) 151 షేర్లకు సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టుల లాట్సైజుల్లో మార్పులు, చేర్పులు చేసింది. వీటిల్లో పలు బ్లూ చిప్ కంపెనీలు ఉన్నాయి. ఈక్విటీ డెరివేటివ్‌ల కనీస మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని జూలైలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఈ మార్పులు, చేర్పులు చేసినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఈ మొత్తాన్ని పెంచడం వల్ల నష్టభయం అధికంగా ఉన్న డెరివేటివ్ కాంట్రాక్టుల నుంచి చిన్న ఇన్వెస్టర్లను రక్షించినట్లవుతుందని సెబీ భావిస్తోంది. నవంబర్‌లో ముగిసే కాంట్రాక్టులకు ఈ లాట్సైజుల మార్పులు, చేర్పులు వర్తిస్తాయని, ఈ లాట్లు ఆగస్టు 28 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్ఎస్ఈ పేర్కొంది. సెప్టెంబర్, అక్టోబర్ కాంట్రాక్టులు ప్రస్తుతమున్న లాట్సైజ్లతోనే కొనసాగుతాయని వివరించింది. ముఖ్యాంశాల్లో... నాలుగు షేర్ల మార్కెట్ లాట్ సైజ్‌ను ఎన్ఎస్ఈ తగ్గించింది. బాష్, ఐషర్ మోటార్స్, ఎంఆర్ఎఫ్, పేజ్ ఇండస్ట్రీస్.. (ఇవన్నీ ఐదంకెల (రూ.పదివేలకు మించి ఉన్న) షేర్లు) వీటి లాట్ సైజు ప్రస్తుతం 125గా ఉంది. ఆ సైజ్ నుంచి ఐషర్ మోటార్స్, బాష్ లాట్ సైజులను 25కు, ఎంఆర్ఎఫ్ 15కు, పేజ్ ఇండస్ట్రీస్ 50కు తగ్గించింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఇన్ఫ్రా, పీఎస్ఈ, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50, డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఎఫ్టీఎస్ఈ 100 తదితర ఎనిమిది సూచీల లాట్ సైజులను పెంచింది. -
కరెక్షన్ బాటలో మార్కెట్..!
మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం ఆర్థిక సంవత్సరాంతపు లాభాల స్వీకరణకు అవకాశం న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరాంతపు లాభాల స్వీకరణ, మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లో కరెక్షన్ కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనావేశారు. గత శుక్రవారం ఒకటిన్నర నెలల కనిష్టస్థాయిలో ముగిసిన స్టాక్ సూచీలు రానున్న ట్రేడింగ్ సెషన్లలో సైతం అమ్మకాల ఒత్తిడికి లోనుకావొచ్చని వారన్నారు. ఈ వారం దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గణాంకాలేవీ వెలువడ నందున, షేర్ల ధరలపై ఒత్తిడి ఏర్పడవచ్చని వారు అభిప్రాయపడ్డారు. డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ట్రెండ్, క్రూడ్ ధరల హెచ్చుతగ్గులు తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని వారన్నారు. మార్చి త్రైమాసికానికి కార్పొరేట్ల లాభాలు చెప్పుకోదగ్గ రీతిలో పెరగకపోవొచ్చన్న అంచనాలతో గత రెండు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఇన్వెస్టర్లను బలహీన సెంటిమెంట్ ఆవరించింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు క్షీణించి, ఒకటిన్నర నెలల కనిష్టస్థాయిలో ముగిసాయి. వచ్చే గురువారం మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు ముగియనున్నందున, ట్రేడర్లు వారి పొజిషన్లను ఆఫ్‌లోడ్ చేస్తారని, దాంతో మార్కెట్ బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరించారు. మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున లాభాల స్వీకరణ కొనసాగుతుందని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇక మార్కెట్లకు క్యూ4 ఆర్థిక ఫలితాలే ఉత్సాహాన్నివ్వాల్సివుంది. ఏప్రిల్ రెండోవారం నుంచి క్యూ4 ఫలితాల సీజన్ మొదలవుతుంది. అయితే ఆ ఫలితాలు మందకొడిగా వుంటాయన్న అంచనాలు కొనసాగుతున్నాయని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అన్నారు. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు తక్షణమే వుండకపోవొచ్చన్న సంకేతాలు గతవారపు ఫెడ్ కమిటీ సమావేశంలో వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. అందువల్ల ఇకనుంచి ఇన్వెస్టర్ల దృష్టి రూపాయి- డాలరు మారకం, ముడిచమురు ధరల వంటి అంశాలపైకి మళ్లుతుందని బొనంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్ స్వల్పహెచ్చుతగ్గులతో బుల్లిష్‌గానే ఉంటుందని అంచనావేశారు. -
వెలుగులో ఫార్మా, సిమెంట్ షేర్లు...
డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాన సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 68 పాయింట్ల స్వల్పనష్టంతో 21,033 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 6,268 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఫార్మా, సిమెంటు షేర్లు ర్యాలీ జరపగా, పవర్, మెటల్ షేర్లు నష్టపోయాయి. ఢిల్లీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఆమ్ఆద్మీ పార్టీ విద్యుత్ టారీఫ్‌లు సగానికి తగ్గిస్తామని చెప్పడంతో టాటా పవర్ షేరు 3 శాతం నష్టపోయింది. ఈ కంపెనీ అక్కడ విద్యుత్ పంపిణీ చేసే సంస్థల్లో ఒకటి. హిందుస్థాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ వ్యవహారంలో వేదాంతా గ్రూప్‌పై సీబీఐ ప్రాధమిక విచారణ చేపట్టిందన్న వార్తలతో సేసా స్టెరిలైట్ 2 శాతంపైగా తగ్గింది. బుధవారం మార్కెట్‌కు సెలవు అయినందున, డిసెంబర్ డెరివేటివ్ సిరీస్‌కు ఒక్కరోజే గడువు వుందని, దాంతో చాలావరకూ స్క్వేర్‌అఫ్, రోలోవర్ యాక్టివిటీ కొనసాగిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. క్రిస్మస్ సెలవుల కారణంగా సంస్థాగత ఇన్వెస్టర్ల కార్యకలాపాలు మందగించాయి. ప్రధాన సూచీలు క్షీణించినా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో వరుసగా మూడోరోజు కొనుగోళ్లు కొనసాగాయి. చిన్న షేర్ల ర్యాలీ ఫలితంగా బీఎస్ఈలో మొత్తం ట్రేడయిన షేర్లలో పెరిగినవే ఎక్కువ. 1,444 షేర్లు పెరగ్గా, 1,034 షేర్లు తగ్గాయి. డెరివేటివ్ విభాగంలో ట్రేడయ్యే మిడ్‌క్యాప్ షేర్లు సెంచురీ టెక్స్టైల్స్ 13 శాతం, అపోలో టైర్స్ 8 శాతం చొప్పున ఎగిసాయి. కూపర్‌టైర్స్ టేకోవర్ వ్యవహారంలో అమెరికా కోర్టు తీర్పు అపోలోటైర్స్‌కు అనుకూలంగా రావడంతో ఈ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపింది. -
స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులు
సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపురోజైన గురువారం మార్కెట్లో ట్రేడింగ్ మందకొడిగా జరిగింది. ఈ నెలలో ఇప్పటికే 9 శాతం మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ఫ్యూచర్ కాంట్రాక్టుల స్క్వేర్అప్ చేసుకోవడంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిమగ్నంకావడంతో రోజంతా స్వల్ప శ్రేణిలో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 19,826-19,997 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 37 పాయింట్ల లాభంతో 19,894 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5,865-5,918 పాయింట్ల మధ్య కదిలి, తుదకు 8 పాయింట్ల లాభంతో 5,882 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. బీహెచ్ఈఎల్ 5 శాతంపైగా ర్యాలీ జరపగా, సన్‌ఫార్మా 2.5 శాతం పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, గెయిల్‌లు 1 శాతం మేర నష్టాల్ని చవిచూసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 172 కోట్లు నికర పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 362 కోట్ల నికర అమ్మకాలు నిర్వహించాయి. నిఫ్టీ ఫ్యూచర్లో రోలోవర్స్ జోరు... కార్పొరేట్ ఫలితాల సీజన్ అయిన అక్టోబర్ నెలలో భారీ హెచ్చుతగ్గులను అంచనావేస్తున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులను పెద్దమొత్తంలో వచ్చేనెలకు రోలోవర్ చేసుకున్నారు. ఆగస్టు నెలలో మార్కెట్ నిలువునా పతనంకాగా, సెప్టెంబర్‌లో అనూహ్యమైన ర్యాలీ జరిపింది. అయితే అక్టోబర్ నెలలో హెచ్చుతగ్గుల తీవ్రత వుంటుందన్న అంచనాలతో షార్ట్, లాంగ్ పొజిషన్ల క్రియేషన్ అధికంగా జరిగింది. దాంతో అక్టోబర్ నిఫ్టీ కాంట్రాక్టులో ఈ ఒక్కరోజే 44 లక్షల షేర్ల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) యాడ్ అయ్యింది. దాంతో మొత్తం ఓఐ 1.80 కోట్ల షేర్లకు చేరింది. సెప్టెంబర్ సిరీస్ ప్రారంభమయ్యే ముందురోజైన ఆగస్టు 29న ఈ నెల కాాంట్రాక్టు ఓఐ 1.46 కోట్ల షేర్లవరకే వుంది. బీహెచ్ఈఎల్ కౌంటర్లో భారీ బిల్డప్... సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభానికి ముందు సేసా గోవా కౌంటర్లో జరిగిన తరహాలో అక్టోబర్ సిరీస్‌కు పీఎస్‌యూ షేరు బీహెచ్ఈఎల్ కౌంటర్లో భారీ బిల్డప్ క్రియేట్కావడంతో పాటు స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ డిస్కౌంట్‌తో ముగిసింది. గురువారం బీహెచ్ఈఎల్ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 53 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 3.02 కోట్లకు చేరింది. సెప్టెంబర్ సిరీస్ ప్రారంభసమయంలో ఈ కౌంటర్లో 2.34 కోట్ల షేర్ల బిల్డప్ మాత్రమే వుండేది. బీహెచ్ఈఎల్ వరుసగా రెండురోజులపాటు 15 శాతం ర్యాలీ జరిపింది. క్యాష్ మార్కెట్లో భారీ కొనుగోళ్లను సూచిస్తూ ట్రేడింగ్ పరిమాణం పెరిగింది. క్యాష్ మార్కెట్లో జరిపిన కొనుగోళ్లను మార్కెట్ హెచ్చుతగ్గుల సందర్భంగా పరిరక్షించుకునేందుకు ఫ్యూచర్ కాంట్రాక్టులను విక్రయించినట్లు (హెడ్జ్డ్ షార్ట్స్) బీహెచ్ఈఎల్ బిల్డప్ డేటా సూచిస్తున్నది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ధర రూ.5 డిస్కౌంట్‌తో ట్రేడయ్యింది.