తిరుమలలో పోటెత్తిన భక్తులు
సాక్షి,తిరుమల:
తిరుమల కేత్రం శనివారం భక్తులతో నిండింది. వరుస సెలవులతో భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా భక్తులతో నిండిన క్యూలు విస్తరించాయి. ప్రయాణం,గదులు, తలనీలాలు, శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం.. ఇలా అన్ని చోట్లా భక్తులు క్యూలైన్లలో నిరీక్షించారు. శనివారం కావటంతో అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు భక్తులు వేలాదిగా నడిచివచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు 55,129 మంది శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 31 కంపార్ట్మెంట్లలో నిండి, వెలుపల కిలోమీటరు వరకు సర్వదర్శనం భక్తులు క్యూ కట్టారు. వీరికి 15 గంటలు, కాలిబాట భక్తులకు 10 గంటల సమయం తర్వాత స్వామి దర్శనం లభించనుంది. గదులు ఖాళీ లేవు. అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ ఒక్క గది కూడా ఖాళీ లేదు.