కోటి రూపాయలతో అమ్మవారి అలంకారం
పాలకొల్లు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆదివారం సరస్వతీ, ధనలక్ష్మీ అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు. కోటీ పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలతో ధనలక్ష్మీ అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహాకులు భద్రతా ఏర్పాట్లను భారీగా పెంచారు.