diaper
-
డైపర్‌ను మాస్కుగా వాడిన సన్నీలియోన్
ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే సమయంలో మాస్క్ తప్పనిసరి. మరి ప్రతి ఒక్కరి దగ్గరా మాస్కులు ఉన్నాయా అంటే నిశ్శబ్ధమే రాజ్యమేలుతుంది. అత్యవసర పని పడినప్పుడు ముఖానికి ఏం కట్టుకుని వెళతారు? మాస్కు ఉంటే సరి, లేకపోతే కర్చీఫ్, దుపట్టా, స్కార్ఫ్ ఇలా మిగతా దారులను చూసుకుంటాం. కానీ వీటితోపాటు మరో వస్తువు కూడా ఎమర్జెన్సీ మాస్క్‌గా ఉపయోగపడుతుందంటోంది బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీలియోన్. మొదట్లో తన పిల్లలకు మాస్కు కట్టడానికి ఎంతో బాధపడిన ఈ భామ ఇప్పుడు వాటితోనే ఎన్నో ప్రయోగాలు చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. (తిరుగులేని సన్నీలియోన్, మళ్లీ..) ఎలాంటి కష్టం లేకుండా కూచున్న చోటే కొంగొత్త మాస్కులను మాస్కు సిద్ధం చేసుకోవచ్చని సెలవిస్తోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైపర్లను ముఖానికి ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇలా అత్యవసర పరిస్థితుల్లో డైపర్‌ను ఎమర్జెన్సీ ఫేస్‌మాస్క్‌గా వాడుకోండని సలహా ఇచ్చింది. ముఖానికి ఓసారి స్కార్ఫ్ కట్టుకోగా, మరోసారి బాక్సింగ్ గ్లవ్స్‌ను ధరించింది. చిన్నపిల్లల ఆటబొమ్మలను కూడా వదిలిపెట్టకుండా సింహం బొమ్మను ముఖానికి కట్టుకున్న ఫొటోను సైతం షేర్ చేసింది. సన్నీ క్రేజీ ఆలోచనలకు అభిమానులు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. (కరోనా: మాస్క్ పెట్టుకోలేదని లేదని కేసు) View this post on Instagram When you have just 30 secs to make an emergency Face mask 😷 during evacuation!! Just here to bring a little sunshine and humor to the stressful lockdown we all are facing !!!! Keep safe and be smart !!! Love you all !!! . #LockedUpWithSunny #SunnyLeone @lockedupwithsunny A post shared by Sunny Leone (@sunnyleone) on Apr 16, 2020 at 2:44am PDT -
ఒక్క ఫోటో.. ఎంత పని చేసింది
జైపూర్: సోషల్ మీడియాలో ఫేక్ కథనాల నిర్మూలనపై చర్చ విస్తృతంగా సాగుతున్న వేళ.. రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఒళ్లో అందమైన చంటి బిడ్డను పట్టుకున్న ఓ బిచ్చగత్తె ఫోటో రెండు వారాల నుంచి వైరల్ అయ్యింది. దీంతో ఆమె పిల్లలను ఎత్తుకుపోయే మహిళ అన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే ఎట్టకేలకు ఓ ఎన్నారై మహిళ చొరవతో అదంతా ఉత్తదేనని తేలింది. వివరాల్లోకి వెళ్తే... జోధ్‌పూర్‌లోని శనీశ్వరుడి గుడి వెలుపల ఓ మహిళ బిక్షమెత్తుకుంటోంది. ఆమె పక్కింట్లో ఉండే మహిళ చెత్త ఎరుకుని జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు సదరు మహిళ తన బిడ్డను గుడి వద్ద ఉన్న మహిళకు అప్పగించి బయటకు వెళ్లింది. ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. బిడ్డ అందంగా ఉండటం.. పైగా డైపర్ వేసి ఉండటంతో సదరు బిక్షగత్తెను పిల్లలను అపహరించే బాపతంటూ సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున్న జరిగింది. ఇదిలా ఉండగా రోహిణి షా అనే మహిళ జోధ్‌పూర్ పోలీసులకు ఆ కథనాన్ని ట్యాగ్ చేయటంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. చివరకు ఆ మహిళను, బిడ్డ తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలించి త్వరగా తేల్చేసిన పోలీసులను జోధ్‌పూర్ డీసీపీ అమన్ సింగ్ అభిందనందించారు. ఆలస్యం అయ్యి ఉంటే ఆ మహిళ పరిస్థితి ఏమైయ్యేదోనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. thanks for the concern of all, the child,his mother and the baby sitter(in the snap) have been traced within hours of we being informed this afternoon. The mother & other lady are friends,one being a beggar and other a rag picker. pic.twitter.com/1hA7acvC1j — DCPJODHPUREAST (@DCP_JODHPUREAST) 30 July 2018 -
సానిటరీ ప్యాడ్స్‌పై పతంజలి దృష్టి
న్యూఢిల్లీ : రాందేవ్ బాబా ఆధ్వర్యంలోని పతంజలి ప్రొడక్ట్స్ రోజురోజుకు తన ఉత్పత్తుల సంఖ్యను పెంచుకుంటూపోతోంది. ఇప్పటికే వివిధ రకాల మార్కెట్లపై దృష్టి సారించిన పతంజలి గ్రూప్ తాజాగా ఆరోగ్యకరమైన న్యాప్కిన్లు, డైపర్ల తయారీపై ఆసక్తి కనబరుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి ఈ రంగంలో రూ. 16వేల కోట్ల మార్కెట్ సాధిస్తామని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే గుప్తా తెలిపారు. 2006లో మొదటిసారి హెర్బల్ ఉత్పత్తులతో ప్రస్థానం ప్రారంభించిన పతంజలి గ్రూప్.. ఆ తర్వాత న్యూడిల్స్, కాస్మోటిక్స్, పిల్లలు వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా పతంజలి స్థానం సంపాదించుకుంది. ఫోర్బ్స్ జాబితాలో గత సంవత్సరం 45వ స్థానంలో ఉన్న పతంజలి గ్రూప్ ఈ ఏడాది 19వ స్థానంలో నిలిచింది. -
కేంద్రమంత్రికి మహా కక్కుర్తి విజ్ఞప్తి!
ప్రభుత్వ మంత్రిత్వశాఖలన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాంగ శాఖ, రైల్వేశాఖలు నెటిజన్ల విజ్ఞప్తులపై చురుగ్గా స్పందిస్తూ.. వారికి వేగంగా సేవలు అందిస్తున్నాయి. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ విదేశాల్లోని భారతీయులకు ఏ కష్టం వచ్చినా.. ట్విట్టర్లో ఒక చిన్న మాట చెప్తే చాలు.. వారి సమస్యలను తీరుస్తూ.. సూపర్ మామ్ గా పేరుతెచ్చుకుంటున్నారు. అటు సురేశ్ ప్రభు కూడా రైల్వేశాఖలోని సమస్యలను ట్విట్టర్ వేదికగా పరిష్కరిస్తున్నారు. కానీ రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు ఓ ఇటీవల ఓ ప్రయాణికుడు ఓ వింత మెసేజ్ పెట్టాడు. ‘నేను చిన్నపాపతో ప్రయాణిస్తున్నా. ఒక డైపర్ కావాలి. దయచేసి సాయం చేయండి’ అంటూ ప్రభాకర్ ఎస్ ఝా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. రైల్వేశాఖకు, రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లకు మంట పుట్టించింది. ట్విట్టర్లో అందుతున్న రైల్వేసేవలను జోక్‌గా మార్చడం సరికాదని, ఇలాంటి విజ్ఞప్తులు చేసి మూర్ఖుడిగా మిగలొద్దని ఓ నెటిజన్ సూచించగా.. ఇలాంటి మూర్ఖులకు టికెట్ ధర కంటే రెట్టింపు రేటుకు డైపర్ అందించి కుక్క కాటుకు చెప్పుదెబ్బ తరహాలో జవాబు చెప్పాలని మనో నెటిజన్ సూచించాడు. -
30% వృద్ధిపై నోబెల్ హైజీన్ దృష్టి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టర్నోవరులో సుమారు 30 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు డైపర్ల తయారీ సంస్థ నోబెల్ హైజీన్ ఎండీ కమల్ కుమార్ జొహారీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవరు సుమారు రూ. 150 కోట్ల మేర నమోదైందని పేర్కొన్నారు. పెద్దల డైపర్ల విభాగంలో తమకు దాదాపు దాదాపు 65 శాతం, పిల్లల డైపర్ల విభాగంలో 5-6 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు. బుధవారమిక్కడ ‘టెడ్డీ’ పేరిట ప్యాంట్ తరహా డైపర్లను ఆవిష్కరించిన సందర్భంగా జొహారీ ఈ విషయాలు వివరించారు. పిల్లల డైపర్లు ధరలు సుమారు రూ. 9 నుంచి, పెద్దలవి రూ. 40 నుంచి ఉన్నాయని చెప్పారు. డైపర్ల తయారీలో ఉపయోగించే ముడివస్తువుల దిగుమతులపై సుంకాలు ఏకంగా 25 శాతం మేర ఉండగా, పూర్తి స్థాయి ఉత్పత్తులపై 15 శాతమే ఉండటం వంటి అంశాలు దేశీయంగా వీటి తయారీకి ప్రతికూలంగా మారాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి, దేశీ సంస్థలకు తోడ్పాటునివ్వాలని జొహారీ కోరారు. -
డైపర్లేసుకునే పిల్లాడిలా మాట్లాడొద్దు: బీజేపీ
ఆరునెలల్లో ప్రజలు ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీని 5.6 అంగుళాలకు తగ్గిస్తారన్న రాహుల్ డైపర్ల స్థాయి నుంచి ఎదగాలంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ‘రాజకీయాల్లో రాహుల్ పిల్లాడేం కాదు. ఆయన ప్రవర్తన మాత్రం డైపర్లు ధరించే శిశువులను గుర్తు చేస్తోంది’ అని అని బీజేపీ నేత సిద్ధార్థ్నాథ్ సింగ్ వ్యంగ్యంగా అన్నారు. -
పాపం పసిపాప
తిరుపతి క్రైం : ‘‘అత్తా.. ఊపిరి ఆడటంలేదు. పొగ.. మంటలు... ఎక్కడున్నావ్ అత్తా.. ప్లీజ్ కాపాడత్తా.. పాణం పోయేట్టుంది.. ప్లీజ్ తలుపు తీ అత్తా’’ అంటూ ఆ చిన్నారి చేసిన రోదనలు, ఆర్తనాదాలు ఎవరికీ వినపడలేదు. సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడంతో ఇంట్లో కూర్చుని టీవీలో వచ్చే పోగో బొమ్మలు చూస్తూ కేరింతలు కొడుతున్న ఆరేళ్ల పసిపాపను షార్ట్ సర్క్యూట్ రూపంలో మృత్యువు కబళించింది. ఒల్లంతా కాలిపోయి ఊపిరి ఆడని స్థితిలో గంటపాటు మృత్యువుతో పోరాడిన ఆ చిట్టి తల్లి చివరకు కన్నుమూసింది. ‘‘నిన్ను బాగా చదివించి డాక్టర్‌ను చేస్తానని మీ అమ్మకు మాట ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను.. మీ అమ్మకు ఏం సమాధానం చెప్పేది.. లేమ్మా లాస్యా.. అత్తను వచ్చాను.. ఒక్కసారి చూడు తల్లి..’’ అంటూ లాస్య మృతదేహంపై పడి అత్త బోరున విలపించడం అందరినీ కంట తడిపెట్టించింది. అసలు ఏమి జరిగిందంటే... వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మునక్కాయలపల్లెకు చెందిన సుబ్బరాయుడు, వరలక్ష్మమ్మలకు లాస్య(6) ఒక్కతే కుమార్తె. అక్కడ మంచి పాఠశాలలు లేకపోవడంతో తిరుపతిలోని మేనత్త సుజాత దగ్గరకు ఏడాది క్రితం చిన్నారిని పంపించారు. బాగా చదివించాలని కోరారు. సుజాత లాస్యను స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. అల్లారుముద్దుగా చూసుకుంటోంది. శుక్రవారం నుంచి స్కూల్‌కు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. దీంతో లాస్య ఇంట్లోనే ఉంది. ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు సుజాత బయలుదేరింది. తనతోపాటు లాస్యను కూడా రమ్మని చెప్పింది. తాను టీవీ చూస్తానని చెప్పడంతో టీవీ ఆన్‌చేసి, లాస్యను లోపల పెట్టి బయట తాళం వేసుకుని సుజాత ప్రసూతి ఆసుపత్రికి వెళ్లింది. ఇంతలో ఇంట్లో షార్టు సర్క్యూట్ కావడంతో లాస్య ఉన్న గదిలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. మంటలు వ్యాపించాయి. దీంతో పాప దాదాపు గంటపాటు పొగ, మంటలకు ఉక్కిరిబిక్కిరై అరుపులు కేకలతో అల్లాడింది. చిన్నగది కావడం, తలుపులు వేసి ఉండటంతో లాస్య ఆర్తనాదాలు బయటికి వినిపించలేదు. సిలెండర్ లీకేజీ అనుకుని.. సుజాత ఇంటిలో నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు దగ్గరకు వెళ్లలేదు. ఇంట్లో సిలిండర్ లీకేజీతో మంటలు వ్యాపిస్తున్నాయని దగ్గరకు వెళితే ప్రమాదమని వారు భయపడ్డారు. పాప ఇంట్లో ఉన్న సంగతి వారికి తెలీదు. దాదాపు గంట తర్వాత పక్కనే ఉన్న బారులో నుంచి కొందరు వచ్చి ఇంటి తలుపులు పగుల కొట్టారు. అప్పటికే ఊపిరాడక స్పృహతప్పి పడిపోయిన లాస్యను వారు గమనించలేదు. ఇంట్లో కాలిపోయిన వస్తువులను మాత్రమే చూశారు. స్థానికులు ఈ విషయాన్ని సుజాతకు ఫోన్ ద్వారా తెలిపారు. ఆమె హుటాహుటిన ఇంటికి వచ్చింది. అప్పటికే తలుపులు తెరిచి ఉండటంతో బిడ్డ బ్రతికే ఉంటుందనుకుంది. ఇంటి వెలుపల పాప కనిపించకపోవడంతో లాస్య లోపల ఉందంటూ ఆర్తనాదాలు చేసింది. స్థానికులు లోపల పరిశీలించి స్పృహతప్పి పడివున్న లాస్యను బయటకు తీసుకువచ్చారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే తుది శ్వాస విడిచింది. అయినా మమకారం తీరని ఆమె అత్త ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే లాస్య చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. బడి ఉన్నా... 5 నిమిషాలు ముందు గుర్తించినా... శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడం వల్ల లాస్యను ఒక్కదాన్నే ఇంట్లో ఉంచాల్సి వచ్చిందని, బడి ఉన్నట్టయితే బిడ్డ బతికేదని సుజాత కన్నీరుమున్నీరుగా విలపించింది. తలుపులు పగులకొట్టిన వెంటనే బిడ్డను గుర్తించినా... ఐదు నిమిషాల ముందు తెలిసినా పాప ప్రాణం నిలిచేదని స్థానికులు, వైద్యులు తెలిపారు. దీనిపై వెస్టు సీఐ అంజుయాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెడికల్ కళాశాలకు తరలించారు.