Discrimination on Dalits
-
సామాజిక సంబంధాలు బలపడేలా జగనన్న కాలనీలు
మాకు గతంలో వేరుగా కాలనీలు ఉండేవి. అప్పుడు అవమానంగా భావించేవాళ్లం. కానీ ఇక్కడ అలా కాదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల ఆధారంగా నెంబర్ల ప్రకారం డ్రా తీశారు. అందులో మాకు ఏ ప్లాటు వస్తే అదే కేటాయించారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా అందరికీ కలిపి ఇళ్లు ఇచ్చారు. దీనివల్ల మాకు సంతోషంగా ఉంది. ఎస్సీలమనే పేరుతో దూరంగా పెట్టే విధానం తొలగించడం సంతోషం.. :::జగనన్న కాలనీలోని ఓ మహిళా లబ్ధిదారు దేశంలో దాదాపుగా పల్లెటూళ్లలో దళితులుండే కాలనీలన్నీ ఊరికి ఓ చివరలో ఉంటాయి. అయితే వివిధ స్కీమ్‌ల పేరిట.. ఎస్సీల కోసం ఊరి బయటే ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంటాయి ప్రభుత్వాలు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అలా కాదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం.. సామాజిక సంబంధాల్లో మార్పునకు మార్గాన్ని ఏర్పరుస్తోంది. ఇటీవల కాకినాడ సామర్లకోటలో స్వయంగా సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన జగనన్న కాలనీలను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ పరిశీలించి ఒక కథనం ఇచ్చింది. సామర్లకోట కాలనీలో 2020లో ఇళ్ల పట్టాలు కేటాయించగా, ప్రస్తుతం సుమారు 60 శాతం మంది తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. దాదాపుగా 90 కుటుంబాలు అక్కడే నివాసం కూడా ఉంటున్నాయి కూడా. అయితే.. ఇళ్ల కేటాయింపులో కులాల ప్రస్తావన లేకుండా అన్ని కులాల వారికి ఒకే చోట కేటాయించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, కమ్మ కులస్థులు కూడా పక్క పక్కనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని నివాసాలు కూడా ఉంటున్నారు. తనకు పెళ్లయిన 17 ఏళ్లకు సొంత ఇంటి కల తీరిందని, ఇన్నాళ్లుగా ఎస్సీ కాలనీల్లోనే అద్దె ఇళ్లల్లో ఉండేవారమని ఆయన బీబీసీకి తెలిపారు. ప్రభుత్వం స్థలం ఇచ్చినప్పటికీ ఇంటి నిర్మాణం కోసం తాము సొంతంగా రూ. 13 లక్షల వరకూ వెచ్చించామని సమర్పణ రాజు అన్నారు. జగనన్న కాలనీలు మాత్రం వేరు.. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఇళ్ల పంపిణీలో కులాల ప్రస్తావన లేకుండా చాలాకాలంగానే అమలు చేస్తున్నారు. వాంబే, రాజీవ్ గృహకల్ప వంటి పథకాల్లో సైతం అన్ని కులాల వారికీ కలిపి ఇళ్లను కేటాయించారు. కానీ, గ్రామాల్లో పరిస్థితుల దృష్ట్యా.. అలాంటి పనులు చేయట్లేదు. కానీ, జగనన్న కాలనీలు మాత్రం వేరు పరిస్థితులకు వేదికైంది. కులాల బేధాలు లేకుండా అందరూ కలిసి ఉండేలా కాలనీ ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తోందని పలువురు అంటున్నారు. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత.. ఇన్నాళ్లకు మాకు ఓ ఇల్లు వచ్చింది. కులాల గురించి పట్టించుకోలేదు. ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకుంటే అన్ని కులాల వారితో సమానంగా మాకు కూడా స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం. మా ఎదురుగా కమ్మవారున్నారు. మా పక్కన తూర్పు కాపులున్నారు. అంతా కలిసే ఉంటున్నాం" అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి జగనన్నకాలనీకి చెందిన గుండుగోలు అరుణ అంటున్నారు. గతంలో ఎస్సీలు, ఇతర కులాల మధ్య కుల పరమైన విబేధాలు వివాదాలుగా మారిన చోట్ల కూడా ఇప్పుడు అందరికీ కలిపి కాలనీలు నిర్మాణం జరుగుతున్నాయి. జగనన్న ప్రభుత్వ ఉద్దేశం.. నిరుపేదలకు ఇళ్లు అందించడం. ఆ ఒక్క అర్హతతోనే లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి కూడా. ఎస్సీలు, ఇతర కులాలన్నీ కలిపి ఒకే కాలనీలో నివాసం ఉండడం వల్ల కులపరమైన వ్యత్యాసాలు కొంత వరకూ తగ్గుతాయనే అభిప్రాయం మేధావుల తరఫు నుంచి కూడా వ్యక్తం అవుతోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Cow Urine: గోమూత్రంతో నీళ్ల ట్యాంక్ శుభ్రం!
బెంగళూరు: దేశంలో కుల, మత, వర్గ వైషమ్యాలకు.. రాజకీయాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఫలితం.. విద్వేషాన్ని ఎక్కించుకుని మూర్ఖంగా వ్యవహరించే స్థితికి ప్రజలు చేరుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో విస్తుపోయే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ దళిత మహిళ నీరు తాగిందనే కోపంతో.. నీటి ట్యాంకర్‌ను శుభ్రం చేశారు గ్రామస్తులు. అదీ గోమూత్రంతో కావడం గమనార్హం. ఛామరాజనగర్ జిల్లా హోగ్గోటరా గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. నవంబర్ 18వ తేదీన గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. అయితే.. ఆ వేడుకకు హాజరైన ఓ మహిళ.. తిన్న తర్వాత దాహం తీర్చుకునేందుకు అక్కడే ఉన్న ఓ ట్యాంకర్ నల్లా ద్వారా నీరు తాగింది. ఇది గమనించిన కొందరు పెద్దలు.. సదరు మహిళ ఎస్సీకి చెందింది కావడంతో రచ్చ చేశారు. వేడుకలో తాగేందుకు ఎవరూ అంగీకరించలేదని.. అందుకే దాహం తీర్చుకునేందుకు ట్యాంక్ నీళ్లు తాగానని ఆమె చెప్పింది. అయితే ఆ పెద్దలు ఆమెను మందలించి.. ట్యాంకర్ నుంచి నీటిని ఖాళీ చేయించారు. ఆపై కొందరి సలహాతో ‘పవిత్ర’మైన గోమూత్రంతో ట్యాంకర్‌ను శుభ్రం చేయించారట. ఈ ఘటన స్థానిక తహసీల్దార్ దృష్టికి వెళ్లగా.. ట్యాంకర్ శుభ్రం చేసిన మాట వాస్తవమేనని, అయితే అది గోమూత్రంతో అవునా? కాదా? అనే విషయంపై స్పష్టత లేదని మీడియాకు తెలిపారు. ఇక బాధితురాలి గురించి తమ దగ్గర సమాచారం లేదన్న ఆయన.. ఆమె గురించి తెలిస్తే విచారించి, కేసు నమోదు చేస్తామని అన్నారు. అంతేకాదు గ్రామంలో చాలా వాటర్ ట్యాంకర్లు ఉన్నాయని, అందులో నీరు ఎవరైనా తాగొచ్చని ఆయన చెప్తున్నారు. ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ నివేదిక కోరడంతో.. పూర్తి స్థాయి నివేదికకు సిద్ధమైనట్లు సదరు తహసీల్దార్ వెల్లడించారు. -
అనంతపురం జిల్లాలో దళితులపై వివక్ష
-
దళితులపై కేసీఆర్ వివక్ష
మర్పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. గురువారం సాయంత్రం ఆయన మర్పల్లి మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మార్పీఎస్ జెం డాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో దళితుడిని ముఖ్య మంత్రి చేస్తానని హామీ ఇచ్చి అనంతరం విస్మరించారని దుయ్యబట్టారు. దళిత జాతికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నిర్వీర్యం చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకొనేందుకు దళితులు సంఘటితంగా ఉండాలని ఆయన సూచించారు. అట్రాసిటిచట్టం నిర్వీర్యం కాకుండా ఉండేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఎమ్మార్పీఎస్ కృషి చేస్తోందని వివరించారు. అట్రాసిటి చట్టాన్ని కాపాడుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేసేవరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈక్రమంలో ఆగస్టు 15న ఎస్సీ, ఎస్టీలతో కలిసి ఢిల్లీలో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు దళితులు ముందుకు రావాలని మందకృష్ణ సూచించారు. ఇటీవల కత్తి మహేష్ నోరు జారి రాముడిని నిందిస్తే 6 నెలల పాటు నగర బహిష్కరణ చేయడం దళితుల పట్ల ప్రభుత్వం చూపుతున్న తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. పరిపూర్ణానంద 2017న సాయిబాబాను దూశించినా ఏడాది తర్వాత నగర బహిష్కరణ చేయడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. 23 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే వికలాంగులకు రూ. 1,500 పింఛన్, వితంతువులకు రూ. 1,000 పింఛన్ ప్రభుత్వాలు అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. అంతకు ముందు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలు వేశారు. అనంతరం స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డప్పు మోహన్, జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, మండల కన్వీనర్ మధుకర్, ఆయా పార్టీల నాయకులు మధుకర్, రాములు, ఆకాష్, ప్రభాకర్, నారాయణ, వికాస్, రాచన్న, విజయ్, కుమార్, నవీన్, మైపాల్, రవీందర్ తదితరులు ఉన్నారు -
హెచ్‌సీయూలో మళ్లీ వివక్ష
-
హెచ్‌సీయూలో మళ్లీ వివక్ష
సాక్షి, హైదరాబాద్: జనవరి 17, 2016.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) చరిత్రలో ఓ బ్లాక్‌డే. విశ్వవిద్యాలయాల్లో వివక్ష తీవ్రతను పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల మరణం ఎలుగెత్తి చాటిన రోజది. రోహిత్ ఆత్మహత్యకు దాదాపు రెండేళ్లు నిండ బోతున్నాయి. ఇప్పుడు మరోమారు వివక్షకు నిరసనగా హెచ్‌సీయూలో వెలివాడ వెలిసింది. అణచివేతను ధిక్కరిస్తూ అగ్గిరాజుకుంది. 75 శాతం హాజరు లేదన్న కారణంగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో 264 ఓట్ల మెజారిటీతో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆదివాసీ విద్యార్థి లునావత్ నరేశ్ గెలుపుని ప్రకటించకపోవడం యూనివర్సిటీలో ఆందోళనలకు దారితీ సింది. హాజరుపట్టీలో ప్రజెంట్‌ని ఆబ్సెంట్గా తారుమారు చేసి నరేశ్ గెలుపుని ఓడించాలన్న ఆత్రుతలో వర్సిటీ తప్పులపై తప్పులు చేస్తూ పోయింది. వీసీ అప్పారావు ఏబీవీపీతో కుమ్మౖక్కై వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందిన నరేశ్‌ని అడ్డుకోవడానికి గ్రీవెన్స్ సెల్‌ని పావుగా వాడుకున్నారని ఆరోపిస్తూ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆందోళనకు దిగింది. రెండు రోజులుగా నిరాహార దీక్ష.. నిజానికి విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేయడానికి సరిపడా.. అంటే 75 శాతం హాజరుతోనే లునావత్ నరేష్ పోటీకి అర్హత సాధించారు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఏబీవీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకుని, తారుమారు చేసిన హాజరుపట్టీని చూపించి నరేష్ ఎన్నిక చెల్లదని, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం ప్రకటించడంతో విద్యార్థులు తిరగబడ్డారు. ఎన్నికలు జరిగిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్లో ప్రెజెంట్‌ని ఆబ్సెంట్గా> మార్చారని, 75 శాతం హాజరున్నదంటూ డిపార్ట్మెంట్ స్వయంగా ముద్రవేసి ఇచ్చిన సర్టిఫికెట్‌ని బుట్టదాఖలు చేసి గ్రీవెన్స్ సెల్, వీసీ అప్పారావు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. హాజరుపట్టీని తారుమారు చేశారనడానికి స్పష్టమైన ఆధారాలతో ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకపోవడంతో రెండు రోజులుగా వెలివాడలో నిరాహార దీక్షకు ఉపక్రమించింది. వర్సిటీ నుంచి స్పందన లేకపోవడంతో ఆల్ స్టూడెంట్ యూనియన్స్‌తో సమావేశమై గురువారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సిద్ధమవుతోంది. గిరిజనుడిని కనుకనే వివక్ష.. మొత్తం ప్యానల్లో నేనొక్కడినే గిరిజనుడిని. అందుకే ఈ వివక్ష. అటెండెన్స్ రిజిస్టర్లో నేను ప్రెజెంట్ అయిన చోట ఆబ్సెంట్ అని దిద్దారు. కొన్ని చోట్ల డేట్స్ లేకుండా అటెండెన్స్ వేశారు. యాజమాన్యం నా పట్ల కక్షపూరితంగా వ్యవహరించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ముందు 75 శాతం హాజరు ఉన్నట్టుగా డిపార్ట్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చి ఆ తర్వాత 64 శాతం ఉందని ఒకసారి, 71 శాతం ఉందని మరోసారి రిపోర్ట్ ఇచ్చింది. దీన్నిబట్టే నిజాన్ని అబద్ధంగా మార్చేందుకు ఎలాంటి ప్రయత్నం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. యాజమాన్యానికి అనుకూలంగా ఉంటే ఎన్నేళ్లైనా డీన్‌గా ఉండొచ్చు. నిజానికి ప్రతి నాలుగేళ్లకీ డీన్స్ మారతారు. మెడికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రారంభించినప్పటి నుంచి సుదీర్ఘకాలంగా గీతా వేముగంటి డీన్‌గా కొనసాగుతున్నారు. రోహిత్ సహా ఐదుగురు విద్యార్థుల రస్టికేషన్కి సూత్రధారి గీతా వేముగంటి. ఇప్పుడు నా విషయంలో తప్పుడు రిపోర్టు ఇచ్చింది కూడా ఆమే. – వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన లునావత్ నరేష్ కుట్రపూరితంగా అటెండెన్స్‌లో గోల్మాల్ ఏబీవీపీని కాపాడాలనే కుట్రలో భాగమే ఇదంతా. వీసీ అప్పారావు, గ్రీవెన్స్ సెల్ కుమ్మక్కై ఆడుతున్న నాటకం ఇదీ. రీఎలక్షన్స్‌కి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి మేం అనేక ఆందోళనలు చేశాం. కానీ యాజమాన్యంలో స్పందన లేదు. వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు హాజరు శాతాన్ని నిర్థారించేందుకు కమిటీ వేస్తున్నామన్నారు. ఏబీవీపీతో కుమ్మక్కై అటెండెన్స్‌లో గోల్మాల్ చేసి సమస్యను తాత్సారం చేస్తున్నారు. అందుకే నిరవధిక నిరాహార దీక్షను చేపట్టబోతున్నాం. -సుందర్ రాథోడ్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆరోపణలు నిజం చేసేందుకు కుట్ర.. లునావత్ నరేష్ ఏబీవీపీ అభ్యర్థి అపూర్వ్‌పై గెలిచాడు. అయితే అతని ఎన్నిక చెల్లదని ఫిర్యాదు చేసింది ఏబీవీపీ అధ్యక్షుడు. ఏ ఆధారంలేని ఆరోపణలను నిజం చేసేందుకు వీసీతో కలసి గ్రీవెన్స్ సెల్ కుట్ర పన్నింది. జూలై 16న క్లాసులు మొదలైతే.. ఆగస్టు 8 నుంచి అటెండెన్స్ రిజిస్టర్ ప్రారంభించారు. అంతకుముందు హాజరైనా పరిగణనలోనికి తీసుకోలేదు.– ప్రశాంత్, సామాజిక న్యాయ ఐక్యపోరాట కమిటీ నాయకుడు -
దళితులపై కాంగ్రెస్ వివక్ష
చేవెళ్ల రూరల్: కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ దళితుల పట్ల వివక్షత చూపిస్తోందని. తనను పదవి నుంచి నెల కాలంలో రెండు సార్లు తొలగించటాన్ని బట్టే ఇది తెలుస్తోందని తాజామాజీ డీసీసీ అధ్యక్షుడు పి. వెంకటస్వామి అన్నారు. ‘జిల్లా డీసీసీ అధ్యక్షుడి మార్పు, క్యామ మల్లేశ్ నియమాకం’ అని మీడియాలో వార్తలు రావటం చూసిన ఆయన చేవెళ్లలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోన్నాల లక్ష్మయ్య దళితులపట్ల చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. తనకు ఎందుకు పదవిని కట్టబెట్టారు.... ఎందుకు తొలగిస్తున్నారో కనీసం సమాచారం ఇవ్వకుండా వారికిఇష్టం వచ్చిన వారికి పదవిని కట్టబెట్టటం ఎంతవరకు సమంజసం అన్నారు. ఒక దళితునిగా తనకు దక్కిన ఈ అవకాశాన్ని పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే తనను తప్పించి క్యామ మల్లేశ్‌ని తిరిగి నియమించటం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దళితుడినని, డబ్బులు లేవనే తనను ఇలా తొలగించి డబ్బులు ముట్ట జెప్పిన మల్లేశ్‌కు డీసీసీ పదవీని ఇచ్చినట్లు ఆరోపించారు. ఇది దళితులకు పార్టీ చేస్తున్న అన్యాయమేనన్నారు. పార్టీకోసం గత 30ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. నాటినుంచి కేంద్ర కాంగ్రెస్‌పార్టీ దళితులకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చిందని, ఈనాడు సోనియా గాంధీకూడా దళితులకు న్యాయం చేస్తుంటే రాష్ట్ర నాయకులు దీనిని దిగజారుస్తున్నారన్నారు. తనకు అన్యాయం చేసిన పీపీసీ అధ్యక్షుడు దళితుల వద్దకు ఎలా వెళ్తాడని ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని, పార్టీ మారకూడదని బుజ్జగించి డీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చిన పొన్నల లక్ష్మయ్యే ఇప్పుడు తనను ఆ పదవి నుంచి ఎందుకు తప్పిస్తున్నారో చెప్పాలన్నారు. ఏప్రిల్ 17న డీసీసీ పదవిని ఇచ్చి ఆగస్టు 22న తనన మార్చి మళ్లీ క్యామ మల్లేశ్‌కు ఇచ్చినట్లు వార్తలు వస్తే వెంటనే అప్పుడు నాయకులు కలుగ జేసుకొని మేథోమథన సదస్సు ఉందని దానిని అప్పటివరకు నిలిపి వేశారు. మళ్లీ నెల రోజులు గడిచిన వెంటనే మళ్లీ అధ్యక్షుడి మార్పు చేయటం సిగ్గు చేటు అన్నారు. దీన్ని గురిం చి మాజీ హోం మంత్రి సబితారెడ్డికి ఫొన్‌చేసి అడిగితే టీపీసీసీతో మాట్లాడుతానని చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీలో రౌడీలు, గుండాలు, డబ్బులు ఉన్నవారిదే రాజ కీయం నడుస్తోందన్నారు. తాను ప్రజల మనిషిగా ఉం టానని, రాజకీయ పార్టీలకు దూరంగా ఉం డాలని నిర్ణయించుకుంటున్న ట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు.