dynamic
-
‘కార్బన్ పాజిటివ్’ పొలం!
లిస్సిమోల్ జె. వడక్కూట్.. దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిన డైనమిక్ వ్యవసాయ అధికారిణి. కేరళ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో సహాయ సంచాలకురాలిగా గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కొచ్చిన్ నగరానికి సమీపంలో అలువి అనే చోట వందేళ్లకు ముందే ఏర్పాటైన ప్రభుత్వ వరి విత్తనోత్పత్తి క్షేత్రం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం లిస్సిమోల్ ఈ క్షేత్రం బాధ్యతలు తీసుకునేటప్పటికి దేశంలో ఎవరికీ దీని గురించి తెలీదు. అయితే, ఆమె అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ క్షేత్రానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. దేశంలోనే తొలి ‘కార్బన్ న్యూట్రల్’ వరి క్షేత్రంగా అలువి సీడ్ ఫామ్‌కు గుర్తింపు దక్కింది. 5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. వరి (ఇక్కడ పండించే వరి రకాల్లో అత్యధికం దేశీ రకాలే)తో పాటు అనేక ఇతర పంటలను సాగుచేస్తూ.. ఒక ఆదర్శ సమీకృత వ్యవసాయ క్షేత్రంగా లిస్సిమోల్ ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. ‘కార్బన్ న్యూట్రల్’ అంటే?నీటిని నిల్వ గట్టి వరి పంటను సాగు చేస్తే కర్బన ఉద్గారాలు భారీగానే వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉద్గారాలతో పాటు... నీటిని నిల్వగట్టడం వల్ల మిథేన్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంటుంది. అటువంటి పొలం నుంచి విడుదలయ్యే ఉద్గారాలను అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించటం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించటం మాత్రమే కాకుండా.. అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరించే స్థాయికి ఈ ఫామ్‌ను అభివృద్ధి చేయటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. 2022 డిసెంబర్లో అలువ ఫామ్‌ను ప్రభుత్వం కార్బన్ న్యూట్రల్ ఫామ్‌గా ప్రకటించింది.170 టన్నుల కర్బనం మిగులు!కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘కాలేజ్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్’ (ఇలాంటి కాలేజీ ఒకటి దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాటేమో గానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు) ప్రయోగాలు చేసి ఉద్గారాలను శాస్త్రీయంగా లెక్కగట్టింది. తురుత్ ద్వీప ప్రాంతంలో గల ఈ ఫామ్ 43 టన్నుల కర్బనాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తుండగా, 213 టన్నుల కర్బనాన్ని వాతావరణం నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరిస్తోందని ఈ ప్రయోగాల్లో తేలింది. అంటే.. ఈ క్షేత్రం 170 టన్నుల కార్బన్ క్రెడిట్లను సంపాయించిందన్న మాట. ఇది నిజానికి ‘కార్బన్ పాజిటివ్’ క్షేత్రం!కేరళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 13 విత్తనోత్పత్తి క్షేత్రాలు నడుస్తున్నాయి. వీటన్నిటినీ కార్బన్ న్యూట్రల్ ఫామ్స్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం చేరుకోవటంలో లిస్సిమోల్ విజయం సాధించారు. అంతేకాదు, రాష్ట్రంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి కార్బన్ న్యూట్రల్ ప్రదర్శనా క్షేత్రాలను నిర్మించే ప్రయత్నమూ జరుగుతోంది.ఇదీ సమీకృత సేంద్రియ సేద్యం5.32 హెక్టార్ల ఈ క్షేత్రంలో 3 హెక్టార్లలో వరితో పాటు.. ఒక హెక్టారులో చిరుధాన్యాలు, చియా గింజలు, కొబ్బరి, అరటి, దుంప పంటలు, జాపత్రి, కూరగాయలు, ΄్యాషన్ ఫ్రూట్ తదితర పంటలను సాగు చేస్తున్నారు. 2012 నాటికే ఎన్‌పిఓపి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది. 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాసర్గోడ్ కల్లన్ రకం దేశీ ఆవులు 9, మలబార్ మేకలు 16, కుట్టనాడన్ బాతులు వంద, నాటు కోళ్లు, గిన్నె కోళ్లు కలిపి 50తో పాటు బ్యాచ్‌కి 5 వేల గిఫ్ట్ తిలాపియా చేపలను సైతం ఈ సమీకృత క్షేత్రంలో పెంచుతున్నారు. దేశీ వరి రకాలు (జపాన్ వైలెట్, రక్తశాలి, గోల్డెన్ నవార, వెల్లతొండి, వదక్కన్ వెల్లారి కైమ, జైవ, మనురత్న..), అధికోత్పత్తినిచ్చే వరి వంగడాల విత్తనోత్పత్తిని చేపట్టడంతో పాటు లైవ్ రైస్ మ్యూజియంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. పంచగవ్య, జీవామృతం వంటి ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్ ద్రావణాలతో పాటు చీడపీడలను అరికట్టే కషాయాలను తయారు చేసుకొని పంటలకు వాడటమే కాకుండా రైతులకు విక్రయిస్తున్నారు. వామ్, వర్మీ కం΄ోస్టు, వర్మీవాష్‌ను తయారు చేస్తున్నారు. రెడువీద్ వంటి మిత్రపురుగులను సైతం పెంచుతున్నారు. తేనెటీగల పెంపకం కూడా ఉంది. పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ క్షేత్రం నిజంగా విలక్షణమైనదే. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వరి పొలంలో అనేక సమస్యల పరిష్కారానికి బాతులను ఉపయోగించటం. కలుపు నివారణ, చీడపీడల నియంత్రణతో పాటు భూసారం పెంపొందించడానికి కూడా బాతులు ఉపయోగపడుతున్నాయని లెస్సిమోల్ తెలిపారు. ఇక్కడ అనుసరించే ప్రతి పనినీ శాస్త్రీయంగా రికార్డు చేసి, అధ్యయనం చేసి గణాంకాలను రూపొందించారు. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని అన్ని హంగులతో సక్రమంగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ క్షేత్రం కళ్లకు కడుతున్నదనటంలో అతిశయోక్తి లేదు! దేశం నేర్చుకోదగ్గ పాఠాలు2012 నుంచి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఈ క్షేత్రంలో అనుసరిస్తూ పదేళ్లలో ఈ మైలురాయిని దాటాం. హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించే విధంగా వ్యవసాయ పనులను సమూలంగా మార్చాం. ఇలా చేయాల్సిన అవసరం ఏమిటో రైతులు, స్థానిక ప్రజలకు అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాం. దేశం యావత్తూ నేర్చుకోదగిన పర్యావరణ హిత సేద్య పాఠాలకు మా క్షేత్రం కేంద్ర బిందువైంది. – లిస్సిమోల్ జె. వడక్కూట్, సహాయ సంచాలకురాలు, స్టేట్ సీడ్ ఫామ్ అలువి, ఎర్నాకులం జిల్లా పంచాయత్, కేరళ -
సంతూర్ మమ్మీలా 'కాజల్ అగర్వాల్'.. ఫోటోలు వైరల్
-
ప్రజల్లోకి సీఎం వైఎస్ జగన్ డైనమిక్ ఎంట్రీ
-
Birthday Special: యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
శామ్కో నుంచి డైనమిక్ అస్సెట్ ఫండ్
ముంబై: శామ్కో అస్సెట్ మేనేజ్మెంట్ ‘డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్’ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. స్థిరత్వం, వృద్ధి అవకాశాలు, మార్కెట్ల కరెక్షన్లలో రక్షణ ప్రయోజనాలతో ఈ పథకం ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లలో మరీ ప్రతికూల పరిస్థితులు కనిపించిన సందర్భాల్లో పెట్టుబడులను పూర్తిగా డెట్‌లోకి మార్చడం ఈ పథకం విధానంలో భాగంగా ఉంటుంది. పెట్టుబడులు అన్నింటినీ డెట్‌కు మార్చే తొలి డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. అలాగే, ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా మారినప్పుడు అవసరమైతే నూరు శాతం పెట్టుబడులను అందులోకి మళ్లించగలదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డెట్, ఈక్విటీల మధ్య పెట్టుబడులను మారుస్తూ, రిస్క్ తగ్గించి, మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. డిసెంబర్ 7 నుంచి 21వ తేదీ వరకు ఈ నూతన పథకం (ఎన్ఎఫ్వో) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
‘ఉమ్మడి’ అనుబంధాల కలబోత
ప్రాంతాలు వేరయ్యే వేళ.. ఇరు ప్రాంతాల ఉద్యోగుల ఆత్మీయ కలయిక పంచాయతీరాజ్ కార్యాలయంలో గెట్ టుగెదర్ పంజగుట్ట, న్యూస్‌లైన్ : వారంతా 25 సంవత్సరాలుగా కలిసి పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయి ఉద్యమాలు చేశారు. విడిపోవాలని కొందరు.. కలిసుండాలని మరికొందరు విడివిడిగా ఆందోళనలు చేశారు. తెలంగాణ ఉద్యోగులు సకల జనుల సమ్మె చేస్తే.. సీమాంధ్ర ఉద్యోగులు 60 రోజుల పాటు విధులు బహిష్కరించారు. ఉద్యమం సమయంలో పోటాపోటీ నినాదాలు... తోపులాటలు... ఘర్షణ వాతావరణం... తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు... ఉద్యమానికే ఆ కార్యాలయం కేంద్ర బిందువుగా మారింది. సీన్ కట్ చేస్తే... రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో శుక్రవారం ఇరు ప్రాంతాల వారు గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ములా కలిసుందామంటూ అందరూ కలిసి సమైక్య రాష్ట్రంలో ఆఖరి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఎర్రమంజిల్‌లోని పంచాయతీ రాజ్ కార్యాలయం వేదికయింది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగులు, మిత్రులతో కలిసి సహపంక్తి బోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్రాంతాలకతీతంగా అందరూ పాల్గొని ఎంతో ఆనందంగా గడిపారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘కేవలం రాష్ట్రాలు మాత్రమే విడిపోయాయి. మన బందాలు ఎన్నటికీ విడిపోవు’ అంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. విడిపోయినా కలిసి ఉందామనే.. ఉద్యమ సమయంలో ఉద్యమానికే మా కార్యాలయాలు కేంద్ర బిందువుగా నిలిచాయి. రాబోయే రోజుల్లో ఇరుగు, పొరుగు రాష్ట్రాలుగా ఒకరి అవసరం మరొకరికి ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములా కలిసి ఉందామనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. - అబు శ్రీనివాస్, ఇండియా ఇంజనీర్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ రాష్ట్రాలు వేరైనా ఒక్కటేనని చాటిచెప్పాలి 1947లో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. కాని ఇప్పటికీ మన పిల్లలకు పాకిస్థాన్ ప్రమాదకర దేశమని చెబుతుంటాం. అలాంటి వాతావరణం కలగకుండా తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఒక్కటేనని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాలి. ఉద్యోగులు ఒకరికి మరొకరు సహాయ సహకారాలు అందిస్తూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలి. - సీవీఎస్ రామ్మూర్తి, ఇంజనీర్ ఇన్ చీఫ్, పంచాయతీరాజ్ -
సిల్క్ రూట్లో సాహసి
సాక్షి, సిటీబ్యూరో: మూడు దేశాలు... పదిహేనువేల కిలోమీటర్లు... యాభై ఐదు రోజుల సుదీర్ఘమైన ప్రయాణం. ఆ దేశాల భాషతో పెద్దగా పరిచయం లేదు. తెలిసిన బంధువులు, స్నేహితులు లేరు. జ్ఞానీ లోక సంచారి అన్నట్లు... అరవై రెండేళ్ల వయస్సులో ఒంటరిగా సాహసోపేతమైన యాత్ర పూర్తి చేశారు పరవస్తు లోకేశ్వర్. ‘సలామ్ హైదరాబాద్’ నవల, చత్తీస్‌గఢ్ స్కూటర్ యాత్ర ద్వారా సుపరిచితులైన పరవస్తు లోకేశ్వర్ తన 62 ఏళ్ల వయస్సులో ఉజ్బెకిస్తాన్, కిరిగిస్తాన్, చైనా దేశాల ను కలిపి 15 వేల కిలోమీటర్ల సిల్క్రోడ్డుపై సాహస యాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఆ పర్యటన అనుభవాలపై ఆయన రాసిన ‘సిల్క్ రూట్లో సాహసయాత్ర’ పుస్తకం మంగళవారం ఆవిష్కరించనున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి 55 రోజుల పాటు సాగిన పర్యటన విశేషాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ సంగతులు ఆయన మాటల్లోనే... రాహుల్ స్ఫూర్తి... ఎంతోమంది యాత్రికులు ప్రపంచదేశాల్లో పర్యటించారు. వారి అనుభవాలను గ్రంధస్తం చేశారు. ఆ అనుభవాలే నాగరికతా పరిణామాన్ని, వికాసాన్ని అధ్యయనం చేసేందుకు, అర్థం చేసుకొనేందుకు దోహదం చేశాయి. చిన్నప్పటి నుంచి రాహుల్ సాంకత్యాయన్ అంటే ఎంతో ఇష్టం. ఆయనలాగా పర్యటించాలని కోరిక. తిరగడం వల్లనే జ్ఞానం లభిస్తుందని నా విశ్వాసం. గతంలో 3 వేల కిలోమీటర్ల చత్తీస్‌గఢ్ యాత్రను 15 రోజుల్లో పూర్తి చేశా. బస్తర్‌లో పర్యటించా. అలాగే ప్రపంచానికి వైభవోపేతమైన నాగరికతను పరిచయం చేసిన మధ్య ఆసియా దేశాల్లో పర్యటించాలనే కోరిక కలిగింది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో చైనా నుంచి రోమ్కు సిల్క్‌తో పాటు, పింగాణి, పేపర్, మందుగుండు వంటి వస్తువులను ఎగుమతి చేసిన రోడ్డు మార్గానికి సిల్క్‌రూట్ అనే పేరు స్థిరపడింది. ఆ రూట్లో ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, చైనాల్లో పర్యటించా. గతేడాది సెప్టెంబర్ 1న ఢిల్లీ నుంచి బయలుదేరి 2న తాష్కెంట్ చేరుకున్నా. అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గంలో 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించిన అనంతరం భుకారా, సమర్ఖండ్ మీదుగా కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ వెళ్లా. అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకొని 25 రోజులు బస చేశా. మధ్య ఆసియాలోని స్విట్జర్లాండ్‌గా పేరు గడించిన కిర్గిస్తాన్ ఎంతో అందమైన దేశం. లాంగ్‌మార్చ్ జ్ఞాపకాలు... కిర్గిస్తాన్ నుంచి చైనాకు రోడ్డు మార్గం ద్వారా రావచ్చు. కానీ సరిహద్దులో చైనా సైన్యం నన్ను అడ్డుకుంది. నన్ను గూఢచారిగా అనుమానించి అనుమతి నిరాకరించారు. దాంతో విమానంలో బీజింగ్ చేరుకున్నా. భారత్‌లాగే 4 వేల ఏళ్లకు పైగా గొప్ప చరిత్ర ఉన్న చైనాపై అధ్యయనం ఎంతో సంతృప్తినిచ్చింది. ఎనాన్లోని మావో జెడాంగ్, ఆయన సహచరుల స్థావరాలు, వారు వినియోగించిన వస్తువులు, టేబుళ్లు, కుర్చీలు,పుస్తకాలు, వంటపాత్రలు, విప్లవకారుల నిరాడంబరమైన జీవిత విధానాన్ని ప్రతింబింబించే అనేక అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. లాంగ్‌మార్చ్ విశేషాలను చెప్పే రెవల్యూషనరీ మ్యూజియంను సందర్శించా. ప్రాచీన బౌద్ధమత క్షేత్రాలు, మైనార్టీ తెగలు నివసించే కుచె, ఉరిమించి, షియాన్, కోటాన్, యార్ఖండ్, లీషాన్ వంటి ప్రాంతాలు పర్యటించాను. -
దీర్ఘకాలానికి... ‘డైనమిక్’ ఫండ్స్
ఈ ఏడాది జూన్‌లో ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌లో రూ.50,000 పెట్టుబడులు పెట్టాను. ఆర్బీఐ చర్యల తర్వాత ఈ ఫండ్ ఎన్ఏవీ బాగా తగ్గిపోయింది. తక్కువ ఎన్ఏవీ వద్ద మరో 50,000 పెట్టుబడులు పెట్టమంటారా? ఏడాది పాటు నా పెట్టుబడులను కొనసాగించాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. - నందిని, హైదరాబాద్ గత రెండు వారాల్లో భారత ఫైనాన్షియల్ మార్కెట్లలో ఊహించని సంఘటనలు జరిగాయి. డెట్ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నిధులు ఉపసంహరించుకున్నారు. ఆర్బీఐ హఠాత్తుగా వడ్డీరేట్లను పెంచింది. దీంతో డెట్ఫండ్స్కు నష్టాలొచ్చాయి. మామూలుగానైతే డెట్‌ఫండ్స్ సురక్షితమైనవని చెప్పుకోవచ్చు. కానీ ఎవరూ అంచనా వేయలేని పరిస్థితుల కారణంగా తాజాగా డెట్‌ఫండ్స్ నష్టాలపాలయ్యాయి. పెంచిన వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గిస్తుంది. అయితే ఎప్పుడనేదే ఎవరూ అంచనా వేయలేరు. వడ్డీరేట్లు ఎప్పుడు తగ్గితే అప్పుడు డెట్ఫండ్స్కు లాభాలొస్తాయి. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్ మంచి పనితీరు కనబరుస్తున్న ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్. గత మూడేళ్లుగా ఈ ఫండ్ వార్షిక రాబడి 9.88 శాతంగా ఉంది. ఈ కేటగిరీ ఫండ్స్ సగటు రాబడి 7.82 శాతమే. ఈ ఫండ్‌లో మీ పెట్టుబడులను కొనసాగించండి. షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్స్ ఆకర్షణీయమైన రాబడులనిస్తున్నాయి. మీకు డబ్బులు అవసరం లేకపోతే 1-2 సంవత్సరాలు ఈ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు కొనసాగించవచ్చు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లిక్విడిటీ మీకు సమస్య కాకపోతే డైనమిక్ బాండ్ ఫండ్స్‌కు బదులుగా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ)ను పరిశీలించవచ్చు. ఫండ్ మెచ్యూరిటీ కాలం ఎంత ఉందో అంతే కాలానికి మెచ్యూరయ్యే రుణ పత్రాల్లో ఎఫ్ఎంపీలు పెట్టుబడులు పెడతాయి. డైనమిక్ ఫండ్స్ దీర్ఘకాలానికి మంచి రాబడులనిస్తాయి. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమాప్లస్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆదే స్కీమ్ డెరైక్ట్ ఆప్షన్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్‌లో 10సంవత్సరాల నుంచి పెట్టుబడులు పెడుతూ ఉన్నాను. ఒకేసారి రెగ్యులర్ స్కీమ్నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారమంటారా? లేదా 3-4 దఫాల్లో మారమంటారా? అధిక ఎన్ఏవీ లేదా తక్కువ ఎన్ఏవీ వద్ద మారితే ఏమైనా తేడా ఉంటుందా? - ఫణీంద్ర, అనంతపురం ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్‌కు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది. మంచి పనితీరు కనబరుస్తున్న ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్ పనితీరు బాగా ఉండదు. కానీ, మార్కెట్లు పతనమవుతున్నప్పుడు మరీ అంత అధ్వానంగా కూడా ఏమీ ఉండదు. గత పదేళ్లలో ఈ ఫండ్ వార్షిక రాబడి 23 శాతంగా ఉంది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ కేటగిరీ ఫండ్స్‌ల్లో ఉన్న 19 ఫండ్స్‌ల్లో ఇది ఐదవ ఉత్తమ ఫండ్. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్ నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారాలనుకుంటే, 3-4 దఫాలుగా కాకుండా ఒకేసారి మారడం మంచిది. ఒకేసారి మారుతున్నందున ఎన్ఏవీ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. పెట్టుబడిపై రాబడులను ఏడాది వరకూ అయితే పూర్తిగానూ, ఏడాది దాటితే వార్షికంగానూ పేర్కొంటారు. రెండింటికీ తేడా ఏమిటి? - గోపీనాథ్, మహబూబ్ నగర్ ఈ రెండింటికి తేడాను ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. రూ. 1,000 ని ఐదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టామనుకోండి. ఇప్పుడు దాని విలువ రూ. 1,300 అయిందనుకుందాం. అప్పుడు పూర్తి లాభం రూ.300గా పరిగణిస్తాం. ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడి 30 శాతం చొప్పున వృద్ధి చెందింది. ఇక మన పెట్టుబడి ప్రతీ ఏడాది ఎంత రాబడిని సాధించిందో వార్షిక రాబడి వెల్లడిస్తుంది. అంటే ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడిపై ప్రతీ ఏడాది సగటున వచ్చిన రాబడి అని అర్థం. ప్రతి ఏడాది వచ్చిన లాభాన్ని అసలు మొత్తంతో కలిపి మరలా పెట్టుబడి పెట్టడం. పై ఉదాహరణలో పెట్టుబడిపై వచ్చిన వార్షిక లాభం 5.38 శాతం. అంటే రూ. 1,000 పెట్టుబడిపై ఏడాది కాలానికి వచ్చిన లాభం రూ.53.8. దీనిని అసలు(రూ.1,000)తో కలిపి పెట్టుబడిగా (రూ.1053.80)గా పెట్టుబడి పెట్టాలి. రెండో ఏడాది దీని విలువ రూ.1,150.50 అవుతుంది. ఇదీ పూర్తి రాబడికి, వార్షిక రాబడికి ఉన్న తేడా. సాధారణంగా వాల్యూ రీసెర్చ్‌లో ఏడాదిలోపు పెట్టుబడులపై రాబడులను పూర్తి రాబడులుగానూ, ఏడాది దాటిన తర్వాత వచ్చే రాబడులను వార్షిక రాబడులుగానూ పరిగణిస్తాం.