econmic survey
-
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తక్కువే!: ఆర్థిక శాఖ
జీడీపీ జోరుకు పగ్గాల్లేవ్ పటిష్ట వృద్ధిని సాధించనున్న దేశాలలో భారత్ ఆర్థిక శాఖ తాజా సమీక్ష న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దుష్ప్రభావాల తదుపరి పటిష్ట వృద్ధిని అందుకోనున్న కొద్దిపాటి ప్రపంచ దేశాలలో భారత్‌కూడా ఒకటని ఆర్థిక శాఖ తాజాగా పేర్కొంది. ఇటీవల పలు దేశాలలో తలెత్తుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం దేశీయంగా తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. ఇందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వేగవంత వ్యాక్సినేషన్ సహకరించనున్నట్లు తాజా ఆర్థిక సమీక్షలో తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కోవిడ్–19 దెబ్బకు పలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుదేలైన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 8.4 శాతం అప్ Economy Of India ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో రియల్ జీడీపీ 8.4 శాతం ఎగసింది. కరోనా మహమ్మారికి ముందు అంటే 2019–20 ఏడాది ఇదే కాలంలో వృద్ధితో పోలిస్తే ఇది రెట్టింపని నెలవారీ సమీక్షలో ఆర్థిక శాఖ వివరించింది. కోవిడ్–19 నేపథ్యంలోనూ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు ఆర్థిక పురోభివృద్ధిని సాధించిన దేశాలలో భారత్ ఒకటని వెల్లడించింది. గతేడాది(2020–21) క్యూ3, క్యూ4లతోపాటు.. ఈ ఏడాది క్యూ1, క్యూ2లను ప్రస్తావించింది. సర్వీసుల విభాగంలో నమోదైన రికవరీ, తయారీ, వ్యవసాయ రంగాలు సాధించిన నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్న అంశాన్ని రికవరీ ప్రతిఫలిస్తున్నట్లు వివరించింది. భారీ వ్యాక్సినేషన్, సమర్థవంత ఆర్థిక నిర్వహణ, స్థూల, సూక్ష్మ ఆర్ధిక పరిస్థితులను ఉత్తేజితం చేయడం వంటి మద్దతిచ్చినట్లు తెలియజేసింది. మరింత స్పీడ్ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ మరింత పటిష్టపడనున్నట్లు తాజా సమీక్షలో ఆర్థిక శాఖ అంచనా వేసింది. క్యూ2లో ఇందుకు పలు సంకేతాలు(హెచ్ఎఫ్ఐలు) వ్యక్తమైనట్లు పేర్కొంది. సమీక్షలో ఆర్థిక శాఖ ఇంకా ఇలా వివరించింది.. ‘కొత్తగా తలెత్తిన ఒమిక్రాన్ వేరియంట్ గ్లోబల్ రికవరీకి తాజా సవాళ్లను విసురుతోంది. అయితే ప్రాథమిక దృష్టాంతాల ప్రకారం దేశీయంగా అంతంతమాత్ర ప్రభావాన్నే చూపగలదని అంచనా. వేగవంత వ్యాక్సినేషన్ ఇందుకు కారణంకానుంది. కోవిడ్–19వల్ల గతేడాది తగిలిన దెబ్బనుంచి దేశం వేగవంతంగా పుంజుకుంటోంది. క్యూ2లో ఇది ప్రదర్శితమైంది. ఈ ఏడాదికి జీడీపీ 9.5 శాతం ఎగిసే వీలున్నట్లు తాజా సమీక్షలో మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) అభిప్రాయపడింది. మహమ్మారికి ముందు ఏడాది అంటే 2019–20తో పోలిస్తే ఇది 1.6 శాతం అధిక వృద్ధికి సమానం. గతేడాది నమోదైన క్షీణత నుంచి బయటపడి పటిష్ట రికవరీ సాధిస్తున్న అతికొద్ది ప్రపంచ దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తోంది. ఇందుకు వ్యవసాయం దన్నునిస్తోంది. పుంజుకున్న ఆహార ధాన్యాల దిగుబడి, ఖరీప్, రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు, గ్రామీణ ప్రాంత ఆదాయాలు మెరుగుపడటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. చదవండి: సింగపూర్ నుంచి వచ్చేవారికి తప్పిన ‘ రిస్క్’ ! కేంద్రం కొత్త ఆదేశాలు -
పోటీ పరీక్షలకు ప్రత్యేకం
♦ తెలుగులో తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ♦ అందుబాటులోకి తెచ్చిన ప్రణాళిక విభాగం ♦ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా రాష్ట్ర ఆర్థిక సామాజిక సర్వేను ప్రణాళిక విభాగం తెలుగులో ప్రచురించింది. ‘బంగారు తెలంగాణ దిశగా తొలి అడుగులు-తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం-2015’ పేరుతో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది. సీఎం కేసీఆర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార, ప్రజా సంబంధాల కమిషనర్ బీపీ ఆచార్య శుక్రవారం ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాల వారీగా సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. వ్యవసాయ రంగం, సంక్షే మం, సామాజిక అభివృద్ధి, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, నూతన పారిశ్రామిక విధానం, విశ్వనగరంగా హైదరాబాద్, గణాంకాల్లో తెలంగాణ.. తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పుస్తకంలో సమగ్రంగా విశ్లేషించారు. అభ్యర్థులు పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వీలుగా.. జిల్లా కేంద్రాల్లో ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయాల్లో, హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కార్యాలయంలో కాపీలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు పబ్లిషర్స్‌కు ఇవ్వకుండా ప్రభుత్వమే దీని కాపీరైట్స్ తీసుకుంది. పుస్తకం ధర రూ.250గా నిర్ణయించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ నుంచి ఈ పుస్తకం ప్రతిని పీడీఎఫ్ ఫార్మాట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.