The electrical system
-
చినుకు పడితే చీకటే!
వర్షంతో 118 చోట్ల విద్యుత్ అంతరాయం ఆదివారం రాత్రంతా జాగారం సోమవారం మధ్యాహ్నానికి పునరుద్ధరణ తరచూ ఇదే సమస్య పునరావృతం సిటీబ్యూరో: ‘విశ్వ’ నగరం వైపు అడుగులేద్దామంటూ ఓ వైపు సీఎం పిలుపునిస్తుంటారు. ఆ దిశగా నడవాలంటూ ఎప్పటికప్పుడు అధికారులకు కర్తవ్య బోధ చేస్తుంటారు. వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎంతో ముఖ్యావసరమైన విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో... ఎప్పుడు ఉండదో తెలీదు. చిన్న ఈదురు గాలికే నగరం గజగజ వణికిపోతోంది. ఎండ ముదిరినా... గాలి వీచినా... వర్షం కురిసినా... గ్రేటర్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలుతోంది. ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. మెరుగైన సరఫరా కోసమంటూ అధికారులు చేస్తున్న నెలవారీ సమీక్షలు... ముందస్తు హడావుడి చిన్న ఈదురుగాలిముందు బలాదూర్ అవుతున్నాయి. విద్యుత్ అధికారుల అలసత్వంతో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా నగరంలోని 118 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల అర్థరాత్రి తర్వాత పునరుద్ధరిస్తే... మరికొన్ని చోట్ల సోమవారం మధ్యాహ్నానికి సరఫరా చేశారు. విద్యుత్ లేకపోవడంతో జనం అవస్థలు వర్ణించనలవి కాదు. దోమలతో వేగలేక...విద్యుత్ సరఫరా లేక ఆదివారం రాత్రంతా జనం జాగారం చేయాల్సి వచ్చింది. లోపాన్ని గుర్తించే పరిజ్ఞానమేదీ? ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 కేవీ సబ్స్టేషన్లు పది ఉండగా... 33/11కేవీ సబ్స్టేషన్లు 300పైగా ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు రెండు వేల ఫీడర్లు ఉన్నాయి. సుమారు 90 వేల కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు, 300 కిలోమీటర్ల పరిధిలో యూజీ కేబుళ్లు ఉన్నాయి. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఫీడర్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు... అటు నుంచి గృహాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థలో తలెత్తుతున్న లోపాలను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆర్-ఏపీ డీఆర్పీ పథకం కింద ‘జియోగ్రాఫికల్ ఇన్పర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు రెండేళ్ల క్రితం గ్రీన్ ల్యాండ్ డివిజన్‌ను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే పూర్తి చేసింది. ఇప్పటి వరకూ ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రాలేదు. మూగబోతున్న కాల్‌సెంటర్లు విద్యుత్ ప్రమాదాలు, కోతలు, ఇతర సమస్యలపై వినియోగదాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డిస్కం 1219 సర్వీసు నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా ప్రతి సర్కిల్‌కు ప్రత్యేకంగా ఫ్యూజ్ ఆఫ్ కాల్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వాటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు. ఇదిలా ఉంటే... ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ఎస్ఈ నుంచి కింది స్థాయి లైన్‌మేన్ వరకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. ఒక్కో ఫోన్‌కు ప్రతి నెలా రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు బిల్లు చెల్లిస్తుంది. సంబంధిత అధికారులు, ఉద్యోగులు సొంత అవసరాలకు ఫోన్‌ను ఉపయోగించుకుంటూ... అత్యవసర పరిస్థితుల్లో స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి వర్షానికి గ్రేటర్‌లోని 118 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శివార్లన్నీ అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. ఆ సమయంలో వేలాది మంది 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. అది మూగబోవడంతో స్థానిక లైన్మెన్లకు, ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ సిబ్బందికి ఫోన్ చేస్తే... ఒక్కరూ ఫోన్ ఎత్త లేదు. -
మరో 3 రోజుల్లో విశాఖకు 80% విద్యుత్తు
-
మరో 3 రోజుల్లో విశాఖకు 80% విద్యుత్తు
ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ సీతమ్మధార(విశాఖపట్నం)/విజయనగరం: హుదూద్ తుపాను ధాటికి దారుణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను అతి త్వరలో సాధారణ స్థితికి తెచ్చేందుకు విద్యుత్‌శాఖ యుద్ధప్రాతిపదికన కృషి చేస్తున్నట్టు ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ వెల్లడించారు. మరో మూడు రోజుల్లో విశాఖ నగర ప్రజలకు 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖపట్నం, విజయనగరంలలో విలేకరులతో మాట్లాడారు. మొత్తంమీద విద్యుత్ శాఖకు రూ.1,200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. 74 విద్యుత్ టవర్లు తుపాను ధాటికి కుప్పకూలిపోయాయన్నారు. 440 కేవీ టవర్స్ 34, 220 కేవీ టవర్స్ 20, 132 కేవీ టవర్స్ మరో 20 ధ్వంసమయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 25వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయన్నారు. వీటిలో విజయనగరం జిల్లాలో 8 వేలు, విశాఖ జిల్లాలో 15 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 2వేలు స్తంభాలు కూలిపోయాయన్నారు. కాగా ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. విశాఖ నగరానికి సంబంధించి ఏడులక్షల మంది వినియోగదారులకుగానూ.. ఇప్పటి వరకు రెండులక్షల 70 వేల మందికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు చెప్పారు. సహాయక చర్యల్లో కష్టించి పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక ఇన్సెంటివ్లతోపాటు పదోన్నతుల్లో ప్రాధాన్యమిస్తామని తెలిపారు. -
మరో 3 రోజులు చీకటే!
4 రోజులుగా చీకట్లో మగ్గుతున్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాకు మరో వారం! విశాఖ నగరానికి పాక్షిక సరఫరా.. నేడు మరికొంత విద్యుత్ కూలిపోయిన భారీ టవర్లు, స్తంభాల తొలగింపులో సమస్యలు ఎస్పీడీసీఎల్, తమిళనాడు, ఒడిశాల నుంచి వేలాది నిపుణుల తరలింపు హైదరాబాద్ : హుదూద్ తుపాను ధాటికి విలవిల్లాడిన ఉత్తరాంధ్ర అంధకారంలో మగ్గిపోతోంది. తుపాను వచ్చి నాలుగు రోజులైనా ఇప్పటికీ విద్యుత్ వ్యవస్థ కొంచెం కూడా కోలుకోలేదు. పెద్ద పెద్ద టవర్లు కూడా కూలిపోవడం, సబ్స్టేషన్లు పూర్తిగా దెబ్బ తినడం, వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, కిలోమీటర్ల కొద్దీ లైన్లు దెబ్బ తినడంతో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ అగ్ని పరీక్షగా మారింది. దీంతో ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 22 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు మరో మూడు రోజులు చీకట్లు తప్పేలా కనిపించడంలేదు. పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాకు మరో వారం పట్టవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు గాజువాక సబ్ స్టేషన్లో కొంత మేరకు మరమ్మతులు పూర్తిచేసి, విశాఖ నగరానికి పాక్షికంగా పునరుద్ధరించగలిగారు.బుధవారం రాత్రికి విశాఖలోని గాజువాక, గోపాలపట్నం, ఎన్ఏడీ, విశాఖ కలెక్టరేట్, కేజీహెచ్, సర్క్యూట్ హౌస్, వైజాగ్ సెంట్రల్, విక్టోరియా ఆస్పత్రి, ఓల్డ్ పోస్టాఫీస్ ప్రాంతాలకు ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేశారు. గురువారం సాయంత్రానికి నగరంలో 50 శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా జరిగే అవకాశం వుంది. చత్తీస్గడ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈఆర్ఎస్ (ఎమర్జెన్సీ రెస్టోర్ సిస్టం) పరికరాలను అమర్చి శనివారం రాత్రికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. నగర ప్రజల తాగు నీటి అవసరాలు, వైద్య సేవలకు ఇది ఉపయోగపడుతోంది. రైల్వే లైన్లకు కూడా కొంతవరకూ విద్యుత్ అందుతోంది. తాజా సమాచారం ప్రకారం కేవలం 70 వేల వినియోగదారులకు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోంది. వాస్తవ వినియోగంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా 12 శాతం, నగర పరిధిలో 12 శాతం మేర సరఫరా చేస్తున్నారు. సింహాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంటు ఇప్పటికీ పనిచేయడంలేదు. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా లైన్లు తెగి వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. తొలగించడమే కష్టం విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు 5 వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు పని చేస్తున్నప్పటికీ, పనులు కొలిక్కి రావడంలేదు.విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 450 భారీ విద్యుత్ టవర్లు కుప్పకూలాయి. దాదాపు 20 వేల స్తంభాలు విరిగిపోయాయి. వీటన్నింటినీ తొలగిస్తే తప్ప కొత్త వాటిని వేయడం కష్టమని గుర్తించారు. ఆ తర్వాత సబ్ స్టేషన్లను పునరుద్ధరించినా, అవి రీఛార్జ్ అవడానికి 24 గంటలు పడుతుంది. ఇలా మరో వారం పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు అంధకారం తప్పకపోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి 2 వేల మంది సిబ్బందిని రప్పించారు. వీళ్ళంతా తీగలు వేయడానికి, స్తంభాలు అమర్చడానికి, టవర్లు బాగు చేయడానికే ఉపయోగపడుతున్నారు. అయితే టెలిఫోన్, ఇతర కేబుల్స్ కూడా కలిసిపోవడంతో వాటిని వేరు చేయడం కష్టంగా ఉంది. తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) వినతి మేరకు ఎస్పీడీసీఎల్ నుంచి 2 వేల మందిని, ఒడిశా నుంచి 1,000 మందిని, తమిళనాడు నుంచి 1,500 మందిని రప్పిస్తున్నారు. జిల్లాల పరిస్థితి మరీ ఘోరం! విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పెందుర్తి, గరివిడి లైన్ల ద్వారా విద్యుత్ సరఫరాకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ మార్గంలో 8 ప్రధాన టవర్లు కూలిపోయాయి. దీంతోపాటు మూడు జిల్లాల్లో 132 కేవీ సబ్స్టేషన్లు 25, 33/11 కేవీ సబ్స్టేషన్లు 287, 11 కేవీ సబ్స్టేషన్లు 1,411, మరో 10,500 ఫీడర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని దారికి తెస్తే తప్ప ఈ మూడు జిల్లాల్లో పరిస్థితి మెరుగవదు.వీటన్నింటినీ బాగు చేయడానికి 4 నుంచి 7 రోజులు పడుతుందని అధికారులు అంటున్నారు. జనరేటర్ అద్దె గంటకు రూ.3 వేలు జనరేటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1,000 వసూలు చేసే జనరేటర్ల వారు ఇప్పుడు విశాఖలో గంటకు రూ.3 వేలు డిమాండ్ చేస్తున్నారు. నీటి కోసం జనం పాట్లు ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలకు నీరు సరఫరా కావడంలేదు. తాగడానికి, కాలకృత్యాలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా నీటి వ్యాపారులు రేట్లు పెంచేశారు. మామూలుగా రూ. 20కి లభించే 20 లీటర్ల వాటర్ క్యాన్‌కు ఇప్పుడు రూ. 70 నుంచి రూ.100 దాకా వసూలు చేస్తున్నారు. ఇంత డబ్బు చెల్లించి నీళ్లు కొనుక్కోలేని సాధారణ ప్రజలు కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు పంపే ట్యాంకర్ల కోసం రోడ్లపై బిందెలు, గిన్నెలతో నిరీక్షిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌వాసులు గంటకు రూ.3 వేలు చెల్లించి జనరేటర్లతో నీటి ఏర్పాట్లు చేసుకున్నారు. మురికివాడల్లో నివసించే వారు సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి నీటి ట్యాంకర్లు వచ్చినప్పటికీ, స్థానిక అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అవి జనానికి పెద్దగా ఉపయోగపడట్లేదు. 48 గంటల్లో పునరుద్ధరణ: అజయ్‌జైన్ విశాఖపట్నం: విశాఖ మహానగరానికి మరో 48 గంటల్లో 70 శాతం వరకు విద్యుత్ పునరుద్ధరించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. సీతమ్మధార తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం విలేకరుల తో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గాజువాక, గోపాలపట్నం సబ్స్టేషన్లు పునరుద్ధరించినట్టు చెప్పారు. పెందుర్తి, గరివిడి పునరుద్ధరించి మరో 48 గంటల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రం నుంచి 10 నుంచి 20 మెగావాట్ల ఉత్పత్తిని తీసుకుని శ్రీకాకుళం, పార్వతీపురం పరిసర ప్రాంతాలకు అందిస్తున్నామన్నారు. నక్కవానిపాలెం సబ్‌స్టేషన్ పునరుద్ధరించి సీతమ్మధార ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. బుధవారం రాత్రికి 40 సబ్స్టేషన్లు పున రుద్ధరించి 50 నుంచి 70 వేలమంది వినియోగదారులకు విద్యుత్ అందిస్తామన్నారు. -
మరో 48 గంటలు చీకట్లే!
ఉత్తరాంధ్రలో కుప్పకూలిన విద్యుత్ సరఫరా వ్యవస్థ కూలిన టవర్లు.. విరిగిన స్తంభాలు.. తెగిన తీగలు రోడ్లపై చెట్లతో గ్రామాలకు సామాగ్రి సరఫరాలో సమస్యలు విశాఖ నగరానికి మాత్రం పాక్షిక విద్యుత్ నేడు పరిస్థితి మెరుగుపడే అవకాశం హైదరాబాద్: ఉత్తరాంధ్రలో మరో 48 గంటలు చీకట్లు తప్పవని అధికారులు అంటున్నారు. హుదూద్ తుపాన్‌తో విద్యుత్ వ్యవస్థ కకావికలమైందని తెలిపారు. 60 ఏళ్ళుగా సమకూర్చిన అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ‘దీని నుంచి కోలుకోవడానికి ఎన్ని గంటలు కాదు... ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేం’ అని ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ ‘సాక్షి’తో అన్నారు. తాజా పరిస్థితుల్లో దశలవారీగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అతి కష్టం మీద మంగళవారం విశాఖ నగరానికి పాక్షికంగా విద్యుత్ ఇవ్వగలిగారు. గాజువాక 220 కేవీ సబ్‌స్టేషన్‌ను కొంతవరకు పునరుద్ధరించారు. దీనిద్వారా పరిసర ప్రాంతాలకు అతి తక్కువ విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. దీనికీ క్షణానికో సాంకేతిక అవాంతరం ఎదురవుతోంది. బుధవారం పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక విజయగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యుత్ సరఫరాపై అధికారులు ఇతమిద్దంగా హామీ ఇవ్వలేకపోతున్నారు. పెద్ద ఎత్తున సబ్స్టేషన్లు కుప్పకూలాయి. స్తంభాలు విరిగిపోయాయి. తీగలు తెగిపోయాయి. ఈ పరిస్థితుల్లో రెండురోజుల వరకు దీనిపై స్పష్టత ఇవ్వలేమని, జిల్లా కేంద్రాలకు మాత్రం సరఫరా సాధ్యం కావచ్చునని అంటున్నారు. సింహాద్రి గాడిలో పడాల్సిందే.. విశాఖను గాడిలో పెట్టేందుకు సోమవారం నుంచే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ మంగళవారం సాయంత్రం వరకు ఈ ప్రయత్నాలు ఫలించలేదు. మాంచ్‌ఖండ్ నుంచి లైన్ క్లియర్ కాలేదు. అన్నీ బ్రేక్ డౌన్లే ఉన్నాయి. వేమగిరి ప్లాంట్ అనుసంధానం కుదరలేదు. మార్గంలో అనేక టవర్లు కూలిపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విద్యుత్ తీసుకునే అవకాశం లేకుండాపోయింది. విశాఖలో ప్రధాన ఆసుపత్రి కింగ్జార్జ్కు అతి కష్టం మీద కొన్ని గంటలు విద్యుత్ సరఫరా చేశారు. వేమగిరి ప్లాంట్ నుంచి గాజువాక 220 కేవీ సబ్‌స్టేషన్‌కు లింక్ చేసినా, ఇది విశాఖ అవసరాలు తీర్చే స్థాయిలో లేదు. జాతీయ థర్మల్ పవర్ స్టేషన్‌కు చెందిన సింహాద్రి యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడం పెద్ద అడ్డంకిగా మారింది. విపరీతమైన గాలికి ఊహించని విధంగా సింహాద్రి యూనిట్లలో నష్టం జరిగింది. యూనిట్ల రక్షణకు అమర్చిన రేకులు, గ్లాసులు పగిలిపోయాయి. దీంతో టర్బైన్లలోకి నీళ్లు వచ్చాయి. యథాతథ స్థితికి మరో 5 రోజులైనా పడుతుందని అధికారులు తెలిపారు. అప్పర్ సీలేరులోనూ ఇదే పరిస్థితి. మంగళవారం రాత్రి వరకు ఒక్క యూనిట్ ఉత్పత్తి జరలేదు. ముమ్మరంగా మరమ్మతులు: అజయ్ జైన్ విశాఖ నగరంలో బుధవారం విద్యుత్ సరఫరా మెరుగయ్యే అవకాశం ఉందని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటికే గాజువాక 220 కేవీని పునరుద్ధరించామని, మిగతా సబ్ స్టేషన్లను బాగు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా, మంగళవారం రాత్రి విశాఖ శివార్లలో విద్యుత్‌ను పునరుద్దరించారు. కొత్త గాజువాక/గోపాలపట్నం సబ్ స్టేషన్ల నుంచి పద్మనాభపురం, నరవ, మింది గ్రామాల్లో వున్న జీవీఎంసీ నీటి సరఫరా విభాగానికి విద్యుత్ సరఫరా చేశారు.