స్పానిష్ రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు
ట్రిపోలీ: లిబియా రాజధాని ట్రిపోలీలోని స్పానిష్ రాయబార కార్యాలయం వద్ద మంగళవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు... కానీ కార్యాలయంలోని సామాగ్రి ధ్వంసమైందని భద్రతాధికారులు వెల్లడించారు. రాయబార కార్యాలయాన్ని నెల క్రితమే ఖాళీ చేశామని తెలిపారు. గత వారం ట్రిపోలీలోని మొరాకో రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో రాయబార కార్యాలయం గోడ ధ్వంసమైంది. అలాగే ఈ బాంబు పేలుడుకు కొన్ని గంటల ముందు ట్రిపోలిలోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయంపై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు భద్రత సిబ్బంది మాతి చెందగా... ఒకరు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే.