fellowships
-
మనసున్న మారాజు..
శిఖరం చేరడమే విజయం అనుకుంటే...అది చేరే ప్రస్థానంలో కష్టాలు పడుతున్న వారికి చేయూత ఇచ్చి, వెన్నుతట్టి, దారి చూపడం ఘన విజయం. ‘ఏకలవ్య’ మూమెంట్ ద్వారా రాజు కేంద్రె ఆ పనే చేస్తున్నాడు... విదర్భ(మహారాష్ట్ర)లోని సంచార తెగల్లో చదువు అనేది అరుదైన విషయం. అయితే రాజు కేంద్రె తల్లిదండ్రులు మాత్రం చదువుకు బాగా విలువ ఇచ్చారు. తమకు అక్షరం ముక్క రాకపోయినా పిల్లలను మాత్రం అవకాశం ఉన్నంత వరకు చదివించాలనుకున్నారు. రాజు చదువు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. హైస్కూలు వరకు పెద్దగా తెలియలేదుగానీ, కాలేజిలో చేరిన తరువాత రకరకాల దూరాలు పరిచయం అయ్యాయి. ఇంగ్లీష్‌కు తనకు మధ్య ఉండే దూరం, కమ్యూనికెషన్స్ స్కిల్క్కు తనకు మధ్య ఉండే దూరం, ఇంకా రకరకాల ఆర్థిక, సామాజిక దూరాలు! పుణె యూనివర్శిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే దూరం తనకు అడ్డుగా నిలిచించి. బుల్దాన జిల్లాలోని తన ఊరు నుంచి అక్కడికి 400 కిలోమీటర్ల దూరం. పుణె వెళ్లి చదువుకోవాలంటే, చదువు సంగతి సరే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. దీంతో యశ్వంత్‌రావు చవాన్ మహారాష్ట్ర ఒపెన్ యూనివర్శిటీలో చదుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(తుల్జాపూర్)లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. మేల్ఘాట్లోని ‘కొర్కు’లాంటి గ్రాస్‌రూట్ కమ్యూనిటీలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారి పనితీరు, నైపుణ్యాలను దగ్గరి నుంచి చూశాడు. ‘వీరికి చదువు వస్తే ఎన్ని గొప్ప విజయాలు సాధించేవారో కదా’ అనుకున్నాడు. అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం ‘ఏకలవ్య ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థకు ఉద్యమస్ఫూర్తితో శ్రీకారం చుట్టాడు రాజు. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, టెక్నాలజికల్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ వరకు ఎన్నో నేర్పిస్తుంది ఏకలవ్య. దీంతో పాటు చదువుల ప్రస్థానంలో తన కష్టాల నుంచి ప్రతిష్ఠాత్మకమైన చీవ్‌నింగ్ స్కాలర్షిప్(యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం) గెలుచుకోవడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాడు రాజు. అట్టడుగు వర్గాల తొలితరం విద్యార్థులకు కొండంత అండగా ఉన్న ‘ఏకలవ్య’కు ఎంటర్‌ప్రెన్యూర్స్, సోషల్ వర్కర్స్, డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖలు సహకారం అందిస్తున్నారు. ‘ఏకలవ్య’ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 300 మంది విద్యార్థులు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు సహాయం చేసింది. చదువు విలువ గురించి పేదకుటుంబాల దగ్గరకి వెళ్లి ప్రచారం చేస్తుంది ఏకలవ్య, 2030 నాటికి వెయ్యిమంది వరకు గ్రాస్రూట్స్ లీడర్స్‌ను తయారుచేయాలనేది ‘ఏకలవ్య’ లక్ష్యంగా పెట్టుకుంది. ‘అట్టడుగు వర్గాల గురించి అంకితభావంతో పనిచేస్తున్న రాజు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నాడు’ అని ప్రశంసపూర్వకంగా అంటున్నారు స్కూల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(టిస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ సుధీర్ పటోజు. -
యూనివర్సిటీల్లో కేసీఆర్ ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ చేసే విద్యార్థులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేరు మీద ఫెలోషిప్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఏ ఇతర ఆర్థికసాయం పొందని విద్యార్థులకు దీన్ని అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ‘కేసీఆర్ డాక్టోరల్ ఫెలోషిప్’ పేరుతో దీన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అన్ని యూనివర్సిటీలు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాయి. ఈ ఫెలోషిప్ అమలుకు ఏటా రూ. 5 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎంఫిల్ తర్వాత పీహెచ్డీ చేసేవారికి గతంలో ‘రాజీవ్ గాంధీ ఫెలోషిప్’ఇచ్చేవాళ్లు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల నుంచి ఆయా సామాజికవర్గాల పీహెచ్డీ స్కాలర్స్ ఈ ఫెలోఫిప్‌లను అందుకుంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల కొన్ని వర్గాల విద్యార్థులు ఏ విధమైన స్కాలర్‌షిప్‌లనూ పొందలేకపోతున్నారు. ఇలాంటివాళ్లు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేలమంది వరకూ ఉంటారు. గత కొన్నాళ్లుగా పీహెచ్‌డీకి కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చుకోవడం వారికి కష్టంగా మారింది. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పీహెచ్‌డీకి అవసరమైన రసాయనాలు, ప్రయోగ పరికరాలు, ఇతర గ్రంథాలరేట్లు విపరీతంగా పెరిగాయి. సొంత ఖర్చులతో వీటిని సమకూర్చుకోవడంలో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్కాలర్షిప్ అందిస్తే బాగుంటుందని యూనివర్సిటీలు ప్రతిపాదించాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కార్యరూపం దాల్చేవీలుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక తోడ్పాటు అవసరం రాష్ట్రంలో చాలామంది పీహెచ్డీ విద్యార్థులు ఏ రకమైన ఫెలోషిప్ అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేసీఆర్ ఫెలోషిప్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇది అమలులోకి వస్తే కీలకమైన పీహెచ్‌డీల్లో మంచి పురోగతి ఉంటుంది. ఫెలోషిఫ్ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని మేం భావిస్తున్నాం. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాం. –ప్రొ.రవీందర్, వీసీ, ఉస్మానియా వర్సిటీ -
శాస్త్ర సాంకేతిక పరిశోధకులకు ఫెలోషిప్ పెంపు
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ (పీఎంఆర్ఎఫ్) కింద కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధకులకు ఇస్తున్న ఫెలోషిప్ మొత్తాన్ని భారీగా పెంచడంతోపాటు దీనికి జాతీయ సమన్వయకర్త బాధ్యతలను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది. ఫెలోషిప్‌పై విద్యార్థులకు అవగాహన కలిగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయా యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2019 ఫెలోషిప్ ఎంపికలకు వర్తిస్తాయని వివరించింది. పరిశోధనాసక్తిని తెలియచేసేలా ప్రాజెక్ట్ అభ్యర్థి.. పరిశోధన చేయదలుచుకున్న అంశానికి సంబంధించి ప్రాజెక్టును రూపొందించుకొని సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ శాస్త్ర, సాంకేతిక అంశాలకు చెందినదై, జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించి ఉండాలి. ప్రాజెక్ట్ అభ్యర్థికి పరిశోధనపై గల ఆసక్తి, పరిశీలన సామర్థ్యాలకు దర్పణం పట్టేలా ఉండాలి. అంతేకాకుండా సెలెక్షన్ కమిటీ ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ఈ ప్రాజెక్టుతోపాటు ఇద్దరు నిపుణుల పేర్లను రిఫర్ చేయాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆయా అభ్యర్థులు ఎంచుకొనే సబ్జెక్టులకు ఒక్కోదానికి ఒక్కో విద్యా సంస్థను నోడల్ ఇన్స్టిట్యూట్గా కేంద్ర మానవ వనవరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది. ఆ సంస్థలు ఆయా పరిశోధనాంశాలను పర్యవేక్షిస్తాయి. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు ఈ పీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు సంబంధిత నోడల్ ఇన్స్టిట్యూట్లకు చేరతాయి. ఆయా నోడల్ ఇన్స్టిట్యూట్లు నియమించే నిపుణుల కమిటీలు ఇంటర్వ్యూలు చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాలను రూపొందిస్తాయి. ఇంటర్వ్యూలను అవసరమైతే వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కూడా నిర్వహించనున్నారు. జాబితాల్లోని వారిని మరింత వడపోసేందుకు జాతీయ సమన్వయ కమిటీ (ఎన్సీసీ) రాతపరీక్షలు, చర్చాగోష్టులు తదితర మార్గాల ద్వారా ఫెలోషిప్‌కు అర్హులను ఎంపిక చేస్తుంది. అనంతరం వారికి విద్యా సంస్థలను కేటాయించనున్నారు. ఎంపిక మార్గదర్శకాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్లు) రూపొందించనున్నాయి. అనుకున్న మేర పరిశోధన సాగితేనే మరుసటి ఏడాదికి రెన్యువల్ ఆశించిన మేర అభ్యర్థి పరిశోధన సాగిస్తేనే మరుసటి ఏడాదికి ఫెలోషిప్ రెన్యువల్ అవుతుంది. పరిశోధకుడు వారంలో ఒకరోజు తమకు సమీపంలోని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన చేయాలి. జాతీయ సమన్వయ కమిటీ (ఎన్సీసీ) పీఎంఆర్ఎఫ్ను అమలుచేసే వ్యవస్థగా ఉంటుంది. పరిశోధనలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులుచేర్పులు చేసే అధికారం ఎన్సీసీకి ఉంటుంది. ఎంతమందిని పరిశోధనలకు అనుమతించాలన్న నిర్ణయమూ ఎన్సీసీ పరిధిలోనే ఉంటుంది. ఫెలోషిప్ ఇలా.. పీఎంఆర్ఎఫ్ కింద మొదటి రెండేళ్లు 70 వేల చొప్పున, మూడో ఏడాది రూ.75 వేలు, చివరి రెండేళ్లు రూ 80 వేల చొప్పున ఇవ్వనున్నారు. దీంతోపాటు రీసెర్చ్ గ్రాంట్ కింద ఏటా రూ.2 లక్షల చొప్పున ఐదేళ్లకు రూ.10 లక్షలు అందిస్తారు. ఈ పరిశోధనల కాలపరిమితి ఇంటిగ్రేటెడ్ కోర్సుల విద్యార్థులకు నాలుగేళ్లు, బీటెక్ విద్యార్థులకు ఐదేళ్లు ఉంటుంది. ఎంటెక్, ఎంఎస్, ఎంఈ కోర్సులు పూర్తిచేసినవారికి కూడా నాలుగేళ్ల కాలపరిమితి వర్తిస్తుంది. -
మరాఠాలకు ‘మహా’ వరాలు
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న మరాఠాలను శాంతింపజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. మరాఠా యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉండనుంది. ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్ అందించనుంది. మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరాఠా యువతకు బ్యాంకులు రుణాలకు సంబంధించి అన్నాభూ సాథే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పథకం కింద బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు. వార్షికాదాయం రూ.8 లక్షలు దాటని మరాఠా సామాజికవర్గం పిల్లలు వృత్తివిద్యా కోర్సుల్లో చేరితే ఫీజులో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి పాటిల్ తెలిపారు. ఈ జాబితాలో 608 వృత్తివిద్యా కోర్సుల్ని చేర్చినట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్ కోసం మరాఠాలు గత 11 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠాలను మోసం చేయాలనుకోవట్లేదు దుందుడుకుగా లోపభూయిష్టమైన రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చి తమ ప్రభుత్వం మరాఠాలను మోసం చేయాలనుకోవడం లేదని ఆర్థికమంత్రి సుధీర్ తెలిపారు. దీనివల్ల ఆయా చట్టాలను కోర్టులు కొట్టేసే అవకాశం ఉందన్నారు. మరాఠాల రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేయలేని విధంగా అన్ని జాగ్రత్తలతో పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. -
టాప్ బీటెక్ విద్యార్థులకు ఫెలోషిప్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2018 లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విద్యార్థులకు ఒక శుభవార్త అందించారు. దేశవ్యాప్తంగా డాక్టరేట్ చేయాలనుకునే టాప్ బీటెక్ విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి ఫెలోషిప్ పథకం కింద వెయ్యివందికి ఈ ఫెలోషిప్‌ను అందిస్తామన్నారు.తద్వారా ముఖ్యమైన ఐఐటీలో, ఐఐఎస్సీలలో పీహెచ్డీ చదివేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి విద్యా బడ్జెట్ కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రూ .85,010 కోట్లను కేటాయించారు. ఇందులో రూ .35,010 కోట్లు ఉన్నత విద్యకు, పాఠశాల విద్య కోసం రూ .50,000 కోట్లు నిధులు సమకూర్చనున్నారు. దీంతోపాటు 24 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు జైట్లీ వెల్లడించారు. అలాగే ఎస్టీల విద్యార్థుల క కోసం ప్రత్యేకంగా ఏకలవ్య స్కూళ్లను స్టార్ట్ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రత్యేక పథకాన్ని మొదలుపెట్టనున్నారు. రైజ్ స్కీమ్ కింద సుమారు లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. టీచర్లలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు విద్యా రంగాన్ని డిజిటల్‌గా మారుస్తామని.. బ్లాక్ బోర్డును డిజిటల్ బోర్డుగా మారుస్తామని జైట్లీ పేర్కొన్నారు. -
హమాలీల అమ్మాయిలకు స్కాలర్షిప్లు
గ్రూప్-1కు రూ. 50 వేలు, సివిల్స్‌కు ప్రిపేరయితే రూ. లక్ష సెక్యూరిటీ గార్డుల వేతనం రూ. 13 వేలుగా నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మార్కెట్ యార్డుల్లో పనిచేసే హమాలీల అమ్మాయిల కోసం స్కాలర్షిప్లను ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీల కార్యదర్శులతో బుధవారం మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దాంతోపాటు సెక్యూరిటీ గార్డులు, హమాలీ, దడువాయి కార్మికులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ హమాలీల ఆడపిల్లలకు ఇంటర్‌కు రూ. 2 వేలు, డిగ్రీకి రూ. 3 వేలు, పీజీకి రూ. 5 వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గ్రూప్-1 మెయిన్స్ కోచింగ్ తీసుకునే వారికి రూ. 50 వేల సహకారం, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంటే రూ. లక్ష ఇవ్వనున్నట్టు తెలిపారు. మార్కెట్ యార్డుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుల వేతనాన్ని రూ. 6,700 నుంచి రూ. 13 వేలు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. సెక్యూరిటీ గార్డులు, హమాలీ, దడువాయి, మహిళా కూలీలకు ఆరు నెలలకోసారి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని కార్యదర్శులకు సూచించారు. వారందరికీ ఈ నెల నుంచే రూ. 2 లక్షల బీమా వర్తించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. దీనిని వచ్చే ఏడాది నుంచి రూ.5 లక్షలు చేసేలా కార్మికశాఖతో మాట్లాడనున్నట్టు చెప్పారు. హమాలీల యూనిఫాం కోసం 3 వేలు ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. జీరో వ్యాపారాన్ని నిరోధించండి: మార్కెట్ యార్డుల్లో జీరో వ్యాపారం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. రైతులకు తక్‌పట్టీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటే రైతుకు, మార్కెట్ కమిటీకీ ఆదాయం పెరుగుతుందన్నారు. మార్కెట్ కార్యదర్శులు ప్రతినెలా చెక్ పోస్టులు, రైసు మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన మార్కెట్ ఫీజుల లక్ష్యాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. తమ వేతనాలు పెంచాలంటూ సమావేశం సందర్భంగా మార్కెట్ యార్డుల్లో పనిచేసేవారు మంత్రిని కోరారు. స్పందించిన హరీశ్ మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. -
ఉస్మానియా మెడపై న్యాక్ కత్తి
రూ.150 కోట్ల్లు ఆగిపోయే ప్రమాదం సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మెడపై న్యాక్ గుర్తింపు కత్తి వేలాడుతోంది.‘ఏ’ గ్రేడ్ గుర్తింపుతో దేశంలోనే ఓ వెలుగు వెలుగుతున్న ఉస్మా నియాపై చీకట్లు కమ్ముకోనున్నాయి. పరిశోధనలకు ఏటా యూజీసీ నుంచి మంజూరవుతున్న ఫెలోషిప్‌లు, ఇత ర అభివృద్ధి పనుల కోసం ఇస్తున్న నిధులు నిలిచిపోనున్నాయి. ఇన్నోవేటివ్ యూనివర్సిటీల పథకంలో భాగంగా ఇప్పటి వరకు వర్సిటీకి మంజూరైన రూ.150 కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదముంది. అసలేం జరిగిందంటే...: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన వర్సిటీలకు న్యాక్ గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపు ఉన్న వర్సిటీలకు ఫెలోషిప్‌లు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఏటా యూజీసీ అదనంగా నిధు లు మంజూరు చేస్తుంది. 2018తో వందేళ్లు పూర్తి చేసుకోనున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 2001లో తొలిసారిగా న్యాక్ గుర్తింపు లభిం చింది. 2008లో రెండోసారి లభించిన ఈ గుర్తింపు 2013 ఫిబ్రవరితో ముగిసింది. గుర్తింపు రెన్యూవల్ కోసం 2014 జూన్ ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా వర్సిటీ అధికారులు దీన్ని పట్టించుకోలేదు. వీసీ, ఇతర అధికారుల నిర్లక్ష్యం వల్ల న్యాక్ గుర్తింపును కోల్పోవాల్సి రావడంతో పాటు ఇప్పటి వరకు యూజీసీ నుంచి విద్యార్థులకు అందుతున్న వివిధ రకాల ఫెలోషిప్‌లు, అభివృద్ధి నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర మంత్రి దృష్టికి గుర్తింపు రగడ..: ఉస్మానియా నాక్ గుర్తింపు విషయంలో పాలక మండలి, ఉస్మానియా టీచర్స్ అసోసియేషన్(ఔటా) మధ్య నెలకొన్న వివాదం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి వెళ్లింది. త్వరలో తానే స్వయంగా వర్సిటీని సందర్శించి, న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది. -
ప్రవేశాలు, ఉద్యోగాలు
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్-ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ ట్రేడ్లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: డ్రాఫ్ట్స్‌మెన్ - సివిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ప్లంబింగ్. అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత. ప్లంబింగ్కు ఎనిమిదో తరగతి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 10 వెబ్సైట్: ఠీఠీఠీ.ఝ్చఠఠ.్చఛి.జీ ఎంజీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఎంజీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సెన్సైస్, నవీ ముంబై కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సులు: ఎమ్డీ/ఎమ్మెస్ విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, ఎఫ్ఎమ్టీ, ఇమ్యునో హెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యుజన్, కమ్యూనిటీ మెడిసిన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 27 వెబ్సైట్: www.mgmuhs.com ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ(రెండేళ్లు) అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/సీమ్యాట్/గ్జాట్/జీమ్యాట్ స్కోరు ఉండాలి. ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ(ఐదేళ్లు) అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు. జాతీయ స్థాయి అర్హత పరీక్షలైన ఎస్ఏటీ/యూజీఏటీ/జిందాల్ అడ్మిషన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. వెబ్సైట్ : www.jgbs.edu.in ఉద్యోగాలు ఆర్జీయూకేటీ, హైదరాబాద్ ఐఐఐటీ క్యాంపస్‌లలో పోస్టుల భర్తీకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ స్టూడెంట్ కౌన్సెలర్ (మృదంగం, వోకల్, కూచిపూడి డ్యాన్స్) స్టాఫ్ నర్స్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ సైకాలజిస్ట్ కమ్ కౌన్సెలర్ అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. నియామక క్యాంపస్‌లు: ఐఐఐటీ-నూజివీడు, రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీ (ఇడుపులపాయ), బాసర (ఆదిలాబాద్) ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 25 వెబ్సైట్: www.rgukt.in ఫెలోషిప్స్ ఎన్ఐఎన్లో సీనియర్ రీసెర్చ్ ఫెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్), హైదరాబాద్ సీనియర్ రీసెర్చ్‌ఫెలో కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. అర్హతలు: బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ. రీసెర్చ్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. ఇంటర్వ్యూ తేది: జూన్ 25 వెబ్సైట్: ninindia.org