frading
-
చనిపోయిన వ్యక్తి పేరిట బీమా
పదేళ్ల క్రితమే మృతిచెందిన పాలసీదారు ఏడాది క్రితం కొత్త పాలసీ కట్టిన సోదరుడు మూడు నెలల క్రితం మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రం క్లెయిం చేసి బీమా కంపెనీని బురిడీ కొట్టించేందుకు యత్నం కంపెనీ ప్రతినిధి విచారణతో వెలుగులోకి చొప్పదండి : డబ్బు కోసం మనిషిని ఎంతటి కక్కుర్తికైనా ఒడిగడతాడనడానికి ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణ. అక్రమంగా బీమా సొమ్ము పొందేందుకు ఓ వ్యక్తి పదేళ్ల క్రితమే చనిపోయిన తన అన్న పేరిట పాలసీ తీసుకుని బీమా సంస్థను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. చొప్పదండి గ్రామ పంచాయతీ పరిధిలోని తొగిరిమామిడికుంట ప్రాంతానికి చెందిన ఇరుగురాల శంకరయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పుడు ఆయన వయస్సు 30 ఏళ్లు. ఇతడి సోదరుడు మల్లేశం డబ్బు కోసం శంకరయ్య పేరిట ఏడాది క్రితం ఓ ప్రయివేటు కంపెనీ బీమా పాలసీ తీసుకున్నాడు. రూ.5 లక్షల పాలసీ కోసం రూ.15 వేల ప్రీమియం చెల్లించాడు. గత మే నెలలో శంకరయ్య మృతి చెందినట్లు గ్రామ పంచాయతీ నుంచి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శికి పూర్తి వివరాలు తెలియకపోవడంతో ఓ వ్యక్తి సాయంతో కార్యాలయ సిబ్బంది సహకారంతో పదేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి మూడు నెలల క్రితమే మరణిచినట్లు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. విచారణతో వెలుగులోకి.. బీమా కంపెనీలకు క్లెయిమ్‌లు చేసిన సమయంలో సదరు కంపెనీకి చెందిన అధికారి ఒకరు పాలసీదారు మృతిపై విచారణ జరుపుతారు. పాలసీ తీసుకున్న కంపెనీ ప్రతినిధి శుక్రవారం చొప్పదండికి వచ్చి మృతుడి వివరాలు ఆరా తీశారు. మృతుడి ఇంటి పరిసరాలలోని వారు శంకరయ్య పదేళ్ల క్రితమే చనిపోయినట్లు చెప్పడంతో విచారణ జరుపుతున్న ప్రతినిధికి అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి వెంకట రాజశేఖర్‌ను మరణ ధ్రువీకరణ పత్రం జారీ గురించి ఆరా తీశాడు. ఆయన కార్యాలయంలోని ఫైళ్లు పరిశీలించగా పదేళ్ల క్రితమే చనిపోయినట్లు తేలింది. మల్లేశం తప్పుడు దరఖాస్తుతో తమ వద్ద మరణ ధ్రువీకరణ పత్రం పొందాడని, బీమా సంస్థను బురిడీ కొట్టించేందుకు ఎత్తులు వేశాడని గుర్తించారు. శంకరయ్య మృతిపై జారీ చేసిన ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తున్నట్లు బీమా కంపెనీ ప్రతినిధికి లేఖ ఇవ్వడంతో ఆయన వెళ్లిపోయాడు. బీమా పాలసీ క్లెయిం కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రం పొందడంలో సహకరించిన వారి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారంపై కేసులు నమోదు కాకుండా అప్పుడే మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. సర్టిఫికెటర్ రద్దు చేశాం – వెంకట రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి తొగిరిమామిడి కుంటకు చెందిన మల్లేశం సెల్ఫ్ డిక్లరేషన్‌తో శంకరయ్య మరణ ధ్రువీకరణ పత్రం పొందాడు. బీమా కంపెనీ ప్రతినిధి సంప్రదించడంతో పూర్తి స్థాయి విచారణ చేసి ఇటీవల జారీ చేసిన ధ్రువీకరణను రద్దు చేశాం. డెత్ సర్టిఫికెట్ జారీ వెనుక ఎవరెవరి హస్తం ఉందో విచారణ జరపాల్సి ఉంది. తప్పుడు డెత్ సర్టిఫికెట్ జారీపై విచారణ మెట్పల్లి: తప్పుడు డెత్ సర్టిఫికెట్ జారీ చేసి సస్పెండ్ అయిన మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ భూమానందంను మున్సిపల్ కార్యాలయంలో సిరిసిల్ల కమిషనర్, విచారణాధికారి సుమన్‌రావు శుక్రవారం విచారణ చేశారు. బాస రాజేందర్ అనే పేరు మీద పట్టణానికి చెందిన నందగిరి దామోదర్ ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షలు, రూ.10 లక్షల పాలసీలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లుగా మున్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలో భూమానందం ఎలాంటి పరిశీలన జరుపకుండా డెత్ సర్టిఫికెట్ జారీ చేశాడు. ఈ సర్టిఫికెట్తో దామోదర్ ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకున్నాడు. ‘సాక్షి’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతో ఎల్ఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు కేసు నమోదు చేసి ఇప్పటి వరకు దామోదర్‌తోపాటు ఇద్దరు ఏజెంట్లు, భూమానందంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఉన్నతాధికారులు భూమానందంను సస్పెండ్ చేసి సుమన్‌రావును విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు ఆయన మెట్‌పల్లికి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో డెత్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించి భూమానందం నుంచి వివరాలు సేకరించారు. -
దోపిడీ డొంక కదిలేనా..?
రెండేళ్లుగా గుర్తించని ఆడిటర్లు తిమ్మాపూర్: తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా మారింది పోరండ్ల సహకార బ్యాంకులో దోపిడీ వ్యవహారం. ఏడాదిలో చేసిన దోపిడీ లక్షల్లో బయటపడగా అంతకు ముందు కూడా డబ్బుల దుర్వినియోగం జరిగినట్లు చర్చ సంఘ పరిధిలో జోరుగా సాగుతోంది. ఇద్దరు ఉద్యోగులు చేసిన అంకెలగారడీని గతంలో సీనియర్ ఆడిటర్లు సైతం గుర్తించలేదని తెలుస్తోంది. ఒక సంవత్సరమే కాకుండా అంతకుముందు కూడా అవినీతి జరిగిందా అనే విషయాన్ని అప్పటి సీనియర్ ఆడిటర్లు మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకు ఖాతా పుస్తకాలను ఒక గదిలో పెట్టుకుని తాళం వేసినట్లు సమాచారం. సుమారు 2500 మంది సేవింగ్స్ ఖాతాదారులు ఉండగా వారికి సంబంధించిన రికార్డులన్నీ ముగ్గురు ఆడిటర్ల పరిధిలోనే ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఇద్దరు ఉద్యోగులు చేసిన అవినీతి తంతు కేవలం ఆ ఒక్క సంవత్సరానికే పరిమితం కాలేదని సదరు ఆడిటర్ నిర్ధారణకు వచ్చారు. ఈ ఏడాది ఖాతా పుస్తకాలనే కాకుండా గతం పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆడిటర్ గుర్తించారు. ఇదే విషయాన్ని 2013 నుంచి 2015 వరకు బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలను ఆడిట్ చేసిన ఆడిటర్లకు తెలిపారు. ఆయా సంవత్సరాల్లో ఆడిట్ చేసిన సీనియర్ ఆడిటర్లు మరోసారి ఆడిట్‌ని చేపట్టారు. అందులోనూ అంకెలగారడీ జరిగినట్లు గుర్తించినా, ఎంత మేరకు జరిగిందనేది బయటకు పడలేదని స్థానికంగా గుసగుస మొదలైంది. ముగ్గురూ ఆడిటర్లు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత ఎవరి నివేదికను వారు పాలకవర్గానికి అప్పగిస్తే ఎంత స్వాహా చేశారనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
బ్యాంకులో లెక్కతేలని దోపిడీ
అంకెలగారడీతో మాయం చేశారు ఏసీఈవో, అకౌంటెంట్ నిర్వాకం తిమ్మాపూర్ : జిల్లాలో పేరున్న సంఘాలలో పోరండ్ల సహకార పరపతి సంఘం ఒకటి. సంఘం పరిధిలో బ్యాంకు సైతం కొనసాగుతోంది. లావాదేవీలతోపాటు డిపాజిట్లు, పంట రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, భూమి తనఖా, లాంగ్ టర్మ్ రుణాలను సంఘం పరిధిలోని బ్యాంకు ద్వారా కొనసాగుతున్నాయి. ఏడాది క్రితం వరకు పరిస్థితి బాగానే ఉన్నా ఉద్యోగుల వ్యవహారం సంఘానికే మచ్చతెచ్చేలా తయారైంది. 2015–2016 సంవత్సరంలో అంకెల గారడీ చేసి లక్షల రూపాయలు మాయం చేశారని తేలింది. అసిస్టెంట్ సీఈవో గంగారెడ్డి, అకౌంటెంట్ ఆగయ్య తమ తెలివితేటలతో లక్షల రూపాయలను కాజేయగా వీరి దోపిడీ ఇటీవల జరిగిన ఆడిట్లో బయటపడింది. ఇద్దరు కలిసి నలభై లక్షలను మాయం చేశారని ప్రాథమికంగా తెలిసింది. ఇందులో ఆగయ్య రూ.10లక్షలు, గంగారెడ్డి రూ.30లక్షలు తమ స్వంతానికి వినియోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన ఆడిటర్లు, సంఘ పాలకవర్గం రికవరీ మొదలుపెట్టారు. ఇరవై రోజుల్లో ఇద్దరి నుంచి రూ.40లక్షల వరకు రికవరీ చేసినట్లు పాలకవర్గం తెలిపింది. ఇప్పటికీ బ్యాంకు లావాదేవీల పుస్తకాలు ఆడిటర్ వద్దనే ఉండడం.. ఆమె ఆడిట్ నివేదికను ఇవ్వకపోవడంతో లెక్కల వ్యవహారం ఇంకా తేలలేదు అంకెల గారడీ... పోరండ్ల సొసైటీ పరిధిలోని బ్యాంకులో అంకెల గారడీతో ఏసీఈవో, అకౌంటెంట్ ఏకంగా రూ.40 లక్షలకుపైగా మాయం చేశారనేది స్పష్టమైంది. బ్యాంకు పొదుపు ఖాతాలలో లావాదేవీలు లేనివాటిని ఎంచుకున్నారు. సుమారు డెబ్బై మందికి చెందిన ఖాతాలలో ఉన్న మొత్తానికి పక్కన అంకెలను చేర్చి లక్షలున్నట్లు చూపిస్తూ, ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను విత్ డ్రా చేస్తున్నట్లు రాసుకున్నారు. సంతకాన్ని పరిశీలించే అధికారి ఏసీఈవో కాగా, డబ్బులు ఇచ్చేది అకౌంటెంట్ కావడంతో ఇద్దరూ తమ స్వాహా పర్వాన్ని కొనసాగించారు. వడ్డీ మాటేంటీ..? ఉద్యోగులు కాజేసిన రూ.40లక్షల బ్యాంకు డబ్బులకు లావాదేవీల రూపంలో వడ్డీ జమయ్యేది. ఏడాది కాలంలో రూ.40లక్షలు వాడుకున్న ఉద్యోగుల నుంచి అంతే మొత్తాన్ని రికవరీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత మొత్తానికి వడ్డీని ఎందుకు వసూలు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలుతోపాటు వడ్డీని కలిపి మొత్తం రికవరీ అయ్యేలా చూడాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం... – దేవేందర్ రెడ్డి, సంఘం చైర్మన్ ఉద్యోగులు అవకతవకలకు పాల్పడినట్లు ఇరవై రోజుల క్రితమే మా దష్టికి వచ్చింది. ఇప్పటి వరకు రూ.40లక్షలు రికవరీ చేశాము. ఇంకా ఆడిటర్ పూర్తి నివేదిక ఇవ్వలేదు. వడ్డీతో కలిపి అసలు రికవరీ చేసి సోమవారం పాలకవర్గ సమావేశంలో ఇద్దరిపై చర్యలు తీసుకుంటాం. సభ్యులు ఆందోళన చెందవద్దు.