Free Education Scheme
-
Zambia: నిరుపేద దేశం...సమున్నత లక్ష్యం!
జాంబియా. ఆఫ్రికా ఖండ దక్షిణ భాగంలో ఉండే అత్యంత నిరుపేద దేశం. మూడేళ్ల క్రితం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే... బాల బాలికలందరికీ ఉచిత విద్య. అందులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి దాకా విద్యా వ్యయమంతటినీ ప్రభుత్వమే భరిస్తుంది. జాంబియా వంటి దేశానికి ఇది ఒకరకంగా తలకు మించిన భారమే. మిగతా రంగాల మాదిరిగానే జాంబియాలో విద్యా రంగాన్ని కూడా మౌలిక సదుపాయాల తీవ్ర లేమి పట్టి పీడిస్తోంది. మరోవైపు కాసులకు కటకట. అయినా ఉచిత విద్యా పథకం అమలు విషయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పదో తరగతి స్థాయిని దాటినా సజావుగా చదువను, రాయను రాని దుస్థితి నుంచి తమ కాబోయే పౌరులను బయట పడేసి తీరాలని కృతనిశ్చయంతో ఉంది. ఆ లక్ష్యసాధన కోసం గత మూడేళ్లలో విద్యా రంగంపై ఏకంగా 100 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది!సమయం ఇంకా ఉదయం ఏడు గంటలే. పైగా చలికాలపు ఈదురుగాలులు ఈడ్చి కొడుతున్నాయి. అయినా సరే, ఆ విద్యార్థులంతా అప్పటికే స్కూలుకు చేరుకున్నారు. తమ క్లాసురూముల వైపు పరుగులు తీస్తున్నారు. అవును మరి. ఏమాత్రం ఆలస్యమైనా బెంచీలపై కూర్చోవడానికి చోటు దొరకదు. రోజంతా చల్లటి చలిలో కింద కూర్చోవాల్సిందే! జాంబియా రాజధాని లుసాకాకు 60 కి.మీ దూరంలోని చన్యన్యా ప్రభుత్వ ప్రైమరీ, సెకండరీ స్కూల్లో మూడేళ్లుగా రోజూ ఇదే దృశ్యం. ఉచిత విద్యా పథకం మొదలై నాటినుంచీ దేశంలో స్కూళ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడిపోతున్నాయి. గరిష్టంగా 40 మంది ఉండాల్సిన క్లాసురూముల్లో కనీసం 90 నుంచి 100 మందికి పైగా కని్పస్తున్నారు. 30 మంది మాత్రమే పట్టే ఒక క్లాస్‌రూములోనైతే ఏకంగా 75 మంది బాలలు, 85 మంది బాలికలు కిక్కిరిసిపోయారు! ఈ మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏకంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు కొత్తగా బడిబాట పట్టారు మరి! మంచి సమస్యే! ఇంతమందికి విద్యార్థులకు తగిన స్థాయిలో దేవుడెరుగు, కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడం జాంబియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 2019లో ఒక్కో క్లాసులో 40 మంది పిల్లల కంటే ఉండేవారు కాదని, ఇప్పుడు మాత్రం కనీసం 100కు పైగానే ఉంటున్నారని క్లియోపాత్రా జులు అనే టీచర్ వాపోయారు. వీళ్లు చాలరన్నట్టు దాదాపు రోజూ కొత్త విద్యార్థులు జాయినవుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వమిచ్చే ఒక్కో పుస్తకాల సెట్టు కోసం కనీసం ఆరేడు మంది పిల్లలు కొట్టుకునే పరిస్థితి! అయితే ఇవన్నీ ‘మంచి సమస్య’లేనంటారు దేశ విద్యా మంత్రి డగ్లస్ స్యకలిమా. ‘‘క్లాసురూముల్లో ఇరుక్కుని కూర్చునైనా సరే, ఈ బాలలంతా మూడేళ్లుగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. వారంతా మరో దిక్కు లేక నిస్సహాయంగా వీధులపాలైన రోజులతో పోలిస్తే ఇదెంతో మెరుగు కదా’’ అన్నది ఆయన పాయింటు. ‘‘మౌలిక సదుపాయాలు కూడా త్వరలో మెరుగవుతాయి. ఎందుకంటే విద్యా రంగంపై చేసే పెట్టుబడి నిజానికి అత్యుత్తమ పెట్టుబడి’’ అని వివరించారు. ఆయన వాదన నిజమేనని 18 ఏళ్ల మరియానా చిర్వా వంటి ఎందరో విద్యార్థుల అనుభవం చెబుతోంది. ‘‘2016లో నాలుగో తరగతిలో ఉండగా స్కూలు మానేశాను. ఉచిత విద్యా పథకం పుణ్యాన మూడేళ్లుగా మళ్లీ చదువుకోగలుగుతున్నా. మా అమ్మానాన్నా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటారు. ఉచిత పథకం లేకుంటే స్కూలు ఫీజు కట్టడం అసాధ్యం మాకు’’ అని చెప్పుకొచి్చందామె. 2026 నాటికి కనీసం 55 వేల మంది కొత్త టీచర్ల నియామకం చేపట్టాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 37 వేల మంది నియామకం జరిగిపోయింది. తమకిచ్చిన ప్రభుత్వ నివాసాల్లో అత్యంత దుర్భరమైన పరిస్థితులున్నాయని టీచర్లు వాపోతున్న నేపథ్యంలో ఆ సమస్యపైనా దృష్టి సారించారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన కనీసం మరో 170 స్కూళ్లు నిర్మించనున్నారు. 2020లో రుణ ఊబిలో చిక్కి దివాళా తీసిన దేశానికి ఇది నిజంగా గొప్ప ఘనతేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ కూడా ప్రశంసిస్తోంది. చదువు అందని ద్రాక్షే ఆఫ్రికాలో జాంబియా వంటి సబ్ సహారా ప్రాంత దేశాల్లో అందరికీ విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే. అక్కడి దేశాల్లో సగటున ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఏకంగా 9 మందికి నాలుగు ముక్కలు తప్పుల్లేకుండా చదవడం, అర్థం చేసుకోవడం ఇప్పటికీ తలకు మించిన వ్యవహారమేనని ఐరాస బాల సంస్థ యునిసెఫ్ అధ్యయనం చెబుతోంది. అయితే కొంతకాలంగా ఆ దేశాలన్నీ జాంబియా బాటలోనే నాణ్యమైన విద్యపై దృష్టి సారిస్తుండటం హర్షణీయమంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రీ–మెట్రిక్ ఉపకార వేతనం 9, 10 తరగతులకే: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రీ మెట్రిక్ ఉపకార వేతన పథకాన్ని ఇకపై 9, 10వ తరగతి విద్యార్థులకే వర్తింపజేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. గతంలో ఒకటి నుంచి పదో తరగతి దాకా మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద స్కాలర్షిప్ వచ్చేది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్బంధ ఉచిత విద్య అమలవుతున్నందున వారికి ఉపకార వేతన ప్రయోజనాల అవసరం ఉండదని చెప్పుకొచ్చింది. ఇకపై స్కాలర్‌షిప్‌ల కోసం 9, 10 తరగతి విద్యార్థుల దరఖాస్తులనే పరిశీలించాలని రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులకు సూచించింది. దీనిపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘దశాబ్దాలుగా లబ్ధి పొందుతున్న పేద విద్యార్థులను ఆర్థికంగా మరింత కుంగదీసేలా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తంచేశారు. -
అలా అంటుంటే చాలా బాధపడ్డాను: అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొంతమంది రాజకీయ నాయకులు ఉచిత విద్యావిధానం విషయంలో చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డానన్నారు. తాను ప్రతి ఒక్క భారతీయుడు చదువుకునేలా... ఉచితంగా మంచి విద్యనభ్యసించాలని ఆకాంక్షించానన్నారు. కానీ భారత్‌లో ఉన్న రాజకీయ నాయకులు వీటిని ఉచిత రేవడి లేదా ఉచిత స్కీంల ఎర వంటివిగా అభివర్ణించారని చెప్పారు. డెన్మార్క్ వంటి దేశాలు ఉచిత విద్యా విధానంతో ధనిక దేశాలుగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఈ మేరకు కేజ్రీవాల్ 2017లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ...."డెన్మార్క్ తమ దేశంలోని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉండనట్లయితే వారి నెలవారి ఖర్చుల నిమిత్తం దాదాపు రూ. 82 వేలు అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే వారి తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ విధానంతో విద్యార్థులకు మంచి విద్యను పొందే అవకాశాన్ని మాత్రం ఇస్తున్నాయి అని" అన్నారు. తాను కూడా ఆ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకువచ్చానన్నారు. ప్రతి భారతీయుడు ధనవంతుడు కావాలంటే ప్రతి ఒక్క చిన్నారికి ఉచితంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని అన్నారు. వాస్తవానికి కేజ్రీవాల్ మోదీ పేరు ప్రస్తావించకుండానే ఆయన్ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీది ఉచితంగా ఇస్తానని చెప్పకూడదని, రాజకీయ సంస్కృతిలో ఈ ఉచిత రేవడిలు ఒక ఎత్తుగడ వంటివని విమర్శించిన సంగతి తెలిసిందే. (చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే?) -
నవోదయ స్కూళ్లలో 5వేల సీట్ల పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీట్లను కేంద్రం మరో 5 వేలు పెంచింది. తాజా పెంపుతో నవోదయ విద్యాలయాల్లో అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య 46,600 నుంచి 51వేలకు పెరిగింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. నవోదయ పాఠశాలల్లో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం గురుకుల తరహా ఉచిత విద్యనందిస్తోంది. దేశంలో ఆరో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహించే విద్యా సంస్థలు నవోదయ విద్యాలయాలే. 2001లో దేశ వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాజరుకాగా 2019లో ప్రవేశ పరీక్షకు నమోదు చేయించుకున్న విద్యార్థుల సంఖ్య 31 లక్షలకు చేరుకుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోనూ నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవడేకర్ తెలిపారు. -
జర్నలిస్టుల పిల్లలకు ‘ప్రైవేటు’లో ఉచిత విద్య
మెదక్ మున్సిపాలిటీ : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యనభ్యసించే అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్లూజే హెచ్143) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ధర్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి వారి పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యనందించాలన్నారు. ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సురేందర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, స్టిఫెన్, శ్రీనివాస్, ఆంజనేయులు, రహమత్, దుర్గెష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉచితంగా కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ విద్య
పశ్చిమగోదావరి, నిడమర్రు: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో పైసా ఖర్చులేకుండా చదివేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ద్వారా శనివారం నుంచి 2018–19 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2018 మార్చి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ గ్రేడ్ పాయిట్స్ సాధించిన విద్యార్థులు ఇంటర్ విద్యను కార్పొరేట్ కళాశాలల్లో చదివేందుకు ఈ ‘కార్పొరేట్ కాలేజీ’ స్కీమ్‌లో అవకాశం ఉందన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ రెండేళ్ల చదువుకు, వసతికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వ విద్యార్థులు మాత్రమే ♦ ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, పురపాలక, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, నవోదయ విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఉంటుంది. ♦ వీరు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే 10వ తరగతి విద్యనభ్యసించి ఉండాలి. ♦ 2018 మార్చిలో టెన్త్ ఫలితాల్లో కనీసం జీపీఏ 7 పాయిట్స్ సాధించి ఉండాలి. ♦ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.2 లక్షలు మించి ఉండరాదు. మిగిలిన వర్గాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.లక్షకు మించి ఉండకూడదు. ♦ పదో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీట్ల కేటాయింపు ఇలా.. జిల్లావ్యాప్తంగా 255 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 50 శాతం సంక్షేమ వసతి గృహాల్లో ఉండి పదో తరగతి చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు. మరో 25 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు, గురుకుల పాఠశాలల్లో నివాసం ఉండి చదివినవారికి 20 శాతం, బెస్ట్ ఎవైలబుల్ పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరణ http://jnanabhumi.ap.gov.in వెబ్సైట్లో కార్పొరేట్ అప్లికేషన్స్ అనే కాలం క్లిక్ చేసి అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో ఈ నెల12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ♦ ఎంపిక చేసిన కళాశాలల్లో ప్రాధాన్యతాక్రమంలో నాలుగు కళాశాలల వరకూ విద్యార్థి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు. ♦ మెరిట్ ప్రాతిపాదికన ఎంపికైన విద్యార్థులకు ఆన్లైన్లో నమోదు చేసిన సెల్‌ఫోన్ నంబర్లకు సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్) పంపుతారు. ♦ వేల మంది దరఖాస్తుదారుల్లో నుంచి ప్రతిభావంతులైన వారిని రిజర్వేషన్ కోటా మేరకు కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలతో కలసి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. విద్యార్థులు కోరుకున్న కళాశాలలో చదివే అవకాశం కల్పిస్తారు. ♦ ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీన ధ్రువీకరణ పత్రం అందిస్తారు. ♦ ఈ నెల 21వ తేదీలోపు కేటాయించిన కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు తప్పకుండా చేరాలని అధికారులు తెలిపారు. లేని పక్షంలో వెయింటింగ్ లిస్టులో ఉన్నవారికి ఇస్తామన్నారు. ఏడాదికి రూ.35 వేలు ♦ ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఏడాదికి రూ.35 వేల చొప్పున విద్య, వసతి, భోజనం, ఇతర అన్ని ఖర్చులకు కళాశాలలకు నేరుగా ఆ నగదును అందజేస్తారు. ఇంటర్ రెండేళ్లకు కలిపి రూ.70 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. విద్యార్థికి ప్యాకెట్ మనీగా రూ.3 వేలు మంజూరు చేస్తారు. దరఖాస్తుతోపాటు జతపరచవల్సినవి ♦ మీసేవ ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు(గతంలో విద్యార్థి ప్రీ మెట్రిక్ ఉపకార వేతనం పొందేందుకు మీసేవ నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ ఉంటే సరిపోతుంది. కొత్తగా తీసుకోవల్సిన అవసరంలేదు) ♦ విద్యార్థి ఫొటో సైజ్ పొడవు 4.5, వెడల్పు 3.5 సెంటీమీర్లు ఉండాలి ♦ వికలాంగ విద్యార్థి అయితే సంబంధిత అధికారిచే జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రం ♦ మొబైల్ నంబర్, ఈ–మెయిల్ తప్పు లేకుండా నమోదు చేసుకోవాలి ♦ విద్యార్థి కుటుంబానికి రేషన్ కార్డు ఉంటే జతపరచాలి -
సివిల్స్ టాపర్ తొలివేతనం ఎవరికో తెలుసా?
మంగళూరు : సివిల్స్ ఆలిండియా టాపర్ గా నిలిచి దేశవ్యాప్తంగా సుపరిచితురాలైన కేఆర్ నందిని తన తొలి వేతనాన్ని ఉచిత విద్యకు విరాళంగా ఇస్తున్నారు.. ఐఏఎస్ టాపర్ గా నిలిచిన వెంటనే నందిని, విద్యకే తొలి ప్రాధాన్యమివ్వనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తొలి వేతనాన్ని ఆల్వా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉచిత విద్యా పథకానికి ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించారు. తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఆల్వా ఫౌండేషన్ ను సందర్శించిన ఆమె, ఈ ప్రకటన చేసినట్టు ఆ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఫౌండేషన్ చైర్మన్ ఎం మోహన్ ఆల్వాను కలిసిన నందిని, చదువుకోవాలనుకునే విద్యార్థులకు తాను సహాయం చేయడం కొనసాగిస్తానని చెప్పారు. ఆల్వా ఉచిత ఎడ్యుకేషన్ స్కీమ్ కింద లబ్దిపొందిన విద్యార్థుల్లో నందిని కూడా ఒకరు కావడం విశేషం. నందిని సాధించిన ఘనతకు మోహన్ ఆల్వా ఆమెకు లక్ష రూపాయలను బహుమతిగా అందించారు. కన్నడ సాహిత్యంతో తనకున్న సంబంధం, తన లక్ష్యాలను సాధించడానికి చాలా సహకరించాయని నందిని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన నందిని, తన నేపథ్యానికి భిన్నంగా కన్నడ సాహిత్యాన్ని ఐఏఎస్ పరీక్షల్లో ఆప్షనల్ గా ఎంచుకున్నారు. నందిని తండ్రి కేవీ రమేశ్, తల్లి విమలమ్మ కూడా ఈ ఫౌండేషన్ సందర్శనలో కూతురితో పాటు పాల్గొన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నదే లక్ష్యంగా నాలుగో ప్రయత్నంలో ఆమె ఈ ఘనతను సాధించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని కెంబోడి ప్రాంతానికి చెందిన వారు కేఆర్ నందిని. -
ఉచిత విద్య’ను అమలు చేయాలి
⇒ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు అల్పాహారం ఇవ్వాలి ⇒మండలానికో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయూలి ⇒జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ ⇒మానుకోటలో ప్రారంభమైన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలు మహబూబాబాద్ : కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయూలని జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లోని ఘనపురపు అంజయ్య గార్డెన్లో శనివారం జిల్లా మహాసభలు నిర్వహించారు. సభకు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ అసమానతలు, నిర్లక్ష్యం, వివక్ష, దోపిడీ తదితర కారణాలతో ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని గుర్తు చేశారు. కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా సకల జనులు ఐక్యమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విద్యారంగంలోనూ ప్రైవేటు సంస్థలు పెరిగిపోవడంతో ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని తమ పిల్లల చదువు కోసమే ఖర్చు చేయూల్సి వస్తోందన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా తరగతుల ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయూలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనం కూడా అందించాలన్నారు. మండలానికో రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయూలన్నారు. రైతులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. మరణం సమస్యకు పరిష్కారం కాదన్నారు. అనంతరం ‘తెలంగాణ అభివృద్ధి - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయూలని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, డీఈఓ చంద్రమోహన్, డిప్యూటీ డీఈఓ రవీందర్‌రెడ్డి, ఎంఈఓ లింగయ్య, జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, ఎంపీపీ గోనె ఉమారాణి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర నాయకురాలు దుర్గాభవాని, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఘనపురపు అంజయ్య, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సదానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, సంఘం మండల అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి వెంకటరమణ, నాయకులు యాకుబ్, బాలు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సంజీవ, నిరంజన్, శ్యామలరావు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయూలి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయూలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా మహాసభలో ‘తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ పాఠ్య పుస్తకాల్లో అనేక మార్పులు చేయూల్సి ఉందన్నారు. భూస్వామ్య, రాచరిక విధానాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిందేనన్నారు. విద్యతోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, సంపూర్ణ అక్ష్యరాస్యత సాధించినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. సమైక్య పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడిందన్నారు. సమాజంలో విద్యావంతులు మౌనంగా ఉంటే ఆ సమాజం నష్టపోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని రేషనలైజేషన్ పేరిట పాఠశాలలను మూసివేయడం సబబు కాదన్నారు. నవతెలంగాణ నిర్మాణం కోసం ప్రొఫెసర్ కోదండరాం మరో ఉద్యమాన్ని నడపాలని, అందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.