ganesh immersion
-
గణేష్ ఉత్సవాల్లోనూ టీడీపీ బరితెగింపు
నరసరావుపేట: అధికారమే హద్దుగా టీడీపీ బరితెగిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. చివరికి వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహ ఊరేగింపు అడ్డుకున్నారు. నిమజ్జనానికి వెళ్లే దారికి అడ్డంగా ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డుపెట్టారు. కాదని వస్తే సహించేది లేదంటూ కర్రలు, రాళ్లు, రాడ్లు పట్టుకుని దాడులకు సిద్ధపడ్డారు. ఆఖరుకు నిమజ్జనోత్సవం సందర్భంగా నిర్వహించే అన్నదాన సంతర్పణకు కూడా భక్తులను వెళ్లనీయలేదు. ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథశిరి గ్రామంలో చోటుచేసుకుంది. వినాయక చవితి పురస్కరించుకుని గ్రామా లో వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతుదారులు ఎప్పటిలాగానే వినాయకుడి విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకున్నారు. తొమ్మిది రోజులపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తరువాత నిమజ్జనానికి ఇరువర్గాలు ఒకేరోజు అంటే అదివారం అనుమతి కావాలంటూ పోలీసులను కోరారు. పోలీసులు ముందుగా టీడీపీ వారికి అనుమతి ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం డీజే సౌండ్స్, బాణసంచా, తీన్మార్ డుప్పులతో గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనం చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ వారిని సోమవారం నిమ జ్జనం చేసుకునేందుకు అనుమతించారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ వర్గీయులు తమ ఇళ్లపై రాళ్లు రువ్వి గులాంలో కారం కలిపి చల్లారని, వైఎస్సార్ సీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇంతలో పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.వినాయకుడి నిమజ్జనానికి తరలిస్తుండగా..సోమవారం ఉదయాన్నే వైఎస్సార్ సీపీ వర్గీయులు వినాయకుడిని నిమజ్జనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. టీడీపీ వాళ్లు చేసుకున్న విధంగానే డీజే సౌండ్స్, బాణసంచా, తీన్మార్ డప్పులను సిద్ధం చేసుకున్నారు. వినాయడిని మండపంలో నుంచి ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టరుపై ఎక్కించి ప్రధాన వీధిలోనుంచి ఉరేగింపుగా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అంతే ఉరేగింపునకు వెళ్లకుండా ప్రధాన రహదారికి అడ్డంగా ట్రాక్టరు ట్రక్కులను టీడీపీ వర్గీయులు అడ్డు పెట్టారు. గొడవకు ముందుగానే సిద్ధపడ్డ టీడీపీ వారు తమ పలుకుబడితో అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథబాబు, సీఐ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసు బలగాలను మోహరింపజేశారు. టీడీపీ వర్గీయులు కూడా గ్రామోత్సవాన్ని అడ్డుకునేందుకు దారికి అడ్డంగా ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డంపెట్టి అవతలివైపు కర్రలు, రాడ్లతో కాపుకాశారు. ఉరేగింపు నిర్వహించాల్సిందేనని వైఎస్సార్ సీపీ వర్గయులు కూడా భీష్మించుకూర్చున్నారు. గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కూడా వెళ్లకుండా టీడీపీ వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూడా టీడీపీకే వంత పలకడంతో చేసేది లేక వైఎస్సార్ సీపీ మద్దతుదారులు మేము మా ప్రభుత్వం వచ్చేంతవరకు ఐదేళ్లు పూజలు నిర్వహించుకుని అప్పుడే నిమజ్జనం చేసుకుంటామంటూ నిమజ్జనోత్సవాన్ని విరమించుకుని వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వాహనంపై నుంచి దించి యథావిధిగా మండపంలో ఉంచారు.మీరు వేరే దారిన వెళ్లకుంటే కేసులు: లక్ష్మీపతి, అడిషనల్ ఎస్పీగ్రామంలో గొడవలు వద్దు. మీకు డీజే పెట్టుకునేందుకు, బాణసంచాతో ఉరేగింపు చేసుకునేందుకు అనుమతి లేదు. వేరే దారిన ప్రశాంతంగా వెళ్లి నిమజ్జనం చేసుకోవాలి. లేకుంటే వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు తప్పవు. భిన్నంగా చేస్తే నిర్వహక కమిటీ పాటు సపోర్టు చేసిన అందరిపై కేసులు నమోదు చేస్తాం. కేసులుంటే వీసాలు కూడా రావు, బ్యాంకుల్లో రుణాలు కూడా ఇవ్వరు. మీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చట్టాన్నే మార్చేంత వ్యక్తులేం కాదుగా, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మేం ఇంతమందిమి రావాలా... పంతాలు, పట్టింపులు వద్దు, మేము చెప్పినట్లుగా వినండి. వాళ్లు వద్దన్న దారినే మీరు ఎందుకు వెళ్లాలి, డీజే సౌండ్స్ లేకపోతే వినాయకుడు ఒప్పుకోడా, మర్యాదగా నేను చెప్పినట్లు వేరే దారిని వెళ్లి నిమజ్జనం చేసుకోవాలి. ఈసారికి ఇలా పోనివ్వండి, వచ్చే ఏడాది ఇరువర్గాలను కూర్చోబెట్టి ఎలా చేయాలో ఆలోచిద్దాంలే అని అడిషనల్ ఎస్పీ అన్నారు. దీంతో వైఎస్సార్సీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం నిమజ్జనానికి వెళ్లకుండా వెనుదిరిగారు. -
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..రేపు నగరంలో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్
గణేష్ ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం మంగళవారం (సెప్టెంబర్ 17) జరగనుంది. ఈ ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గణేష్ నిమజ్జనంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలపై మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు విధించినట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణం సౌకర్యార్థం ప్రజలు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లను విస్తృతంగా వాడుకోవాలని చెప్పారు.ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించామని, రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్ గణేష్ తరలింపుకు ఏర్పాట్లు. సాయంత్రం 4గంటల్లోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుంచి వెల్లడించారు. ఇక శోభాయాత్ర మొదలైన రెండు గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేస్తామని తెలిపారు. నిమజ్జనాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ కోరారు.ఇదీ చదవండి : రేపే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా -
టీడీపీ బరితెగింపు.
-
తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండుగలా గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
వినాయక నిమజ్జనాలకు కర్నూల్ ముస్తాబు
-
ఆ రెండు రోజులు వైన్స్ బంద్ : పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్,సాక్షి : నగరంలో గణనాథుల నిమజ్జనాల సందర్భంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు వైన్,కల్లు,బార్ షాపులు మూసివేస్తున్నట్లు తెలిపారు.గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులను మూసివేయాలని సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది.తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 కింద నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రజల శాంతి, ప్రశాంతతను కాపాడటం లక్ష్యంగా పోలీసు విభాగం స్టార్ హోటళ్లు రిజిస్టర్డ్ క్లబ్‌లలో ఉన్న బార్లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా బార్లు సైతం మూసివేయాలని సీవీ ఆనంద్ నిర్వాహకులకు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నగరంలోని అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల అదనపు ఇన్స్పెక్టర్లకు అధికారం ఇచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్ -
Karnataka: గణపతి నిమజ్జనంలో ఉద్రిక్తత
మాండ్య: కర్ణాటకలోని మాండ్యలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనల్లో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘర్షణలు మైసూరు రోడ్డులోని దర్గా సమీపంలో చోటుచేసుకున్నాయి. ఈ ఉదంతంలో పోలీసులు 46 మందిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జి చేశారు. నాగమంగళ పట్టణంలో గణేష్ విగ్రహ నిమజ్జనం కోసం బద్రికొప్పలు గ్రామానికి చెందిన కొందరు యువకులు ఊరేగింపు నిర్వహిస్తుండగా, రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.రాళ్లదాడిలో కొందరు గాయపడ్డారని, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు ఈ ప్రాంతంలో సీఆర్పీసీ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లుకు పాల్పడిన 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని మాండ్యా కంటే ముందు గుజరాత్‌లోని సూరత్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. అల్లరి మూకలు గణపతి మండపంపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఉదంతంలో 28 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: గణేష్ లడ్డూ చోరీ VIDEO | Tensions gripped Nagamangala town in Karnataka's Mandya district earlier today (Wednesday) following clashes between two groups during Ganpati Visarjan. Stones were allegedly thrown on the procession, which led to the clashes. Section 144 has been imposed in the area.… pic.twitter.com/mlx8b4DzgQ— Press Trust of India (@PTI_News) September 11, 2024 -
సూరత్‌లో బాలుడి వీరగాథ.. సముద్రంలో గల్లంతై..
సూరత్: వినాయక నిమజ్జనాల సందర్బంగా గుజరాత్‌లోని సూరత్‌లో అద్భుతం జరిగింది. నిమజ్జనం సమయంలో సముద్రంలోకి కొట్టుకుపోయిన టీనేజి బాలుడు 24 గంటలపాటు జీవన్మరణ పోరాటం చేసి చివరికి సురక్షితంగా ఒడ్డుకు చేరాడు. ప్రతి ఏటా జరిగినట్లే ఈ యేడు కూడా వినాయాక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడు అనంతరం గంగాదేవి ఒడిలో ఒదిగిపోయాడు. అయితే ఉత్సవాల సందర్బంగా సూరత్ లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరి భక్తుల్లాగే నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు డుమాస్ బీచ్‌కు తన బామ్మ, సోదరుడు సోదరితో కలిసి వెళ్ళాడు. అందరిలాగే ఆ సంబరాల్లో ఉన్న లఖన్‌ను సముద్రంలోని అలలు లోపలి లాక్కెళ్లిపోయాయి. లఖన్ దేవీపూజక్ సముద్రంలోకి కొట్టుకుపోయిన తర్వాత అతని అమ్మమ్మ అక్కడి వారిని సాయమడగటంతో కొంతమంది యువకులు సహాయం చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగడంతో గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలుడు గల్లంతై 24 గంటలు దాటడంతో ఆ కుటుంబం తీవ్ర దుఖంలో మునిగిపోయింది. కానీ ఆ గణనాధుని చల్లని దయ వలన బాలుడు నడిసంద్రంలో నిమజ్జనం చేసిన ఒక గణేశుడి ప్రతిమ కింద ఉండే చెక్కబల్లను పట్టుకుని రాత్రంతా నీటిపై తేలియాడుతూ అలాగే ఉన్నాడు. ఆ మరునాడు అటుగా వచ్చిన జాలరులు పడవ కనిపించడంతో చేతిని పైకి ఊపుతూ వారికి సైగ చేశాడు లఖన్. అది గమనించిన మత్స్యకారుడు రసిక్ తండేల్ బాలుడిని రక్షించి పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు బాలుడిని ఆసుపత్రికి తరలించి కుటుంబానికి కబురు పంపించారు. అప్పటికే బాలుడిపై ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు లఖన్ మళ్ళీ మృత్యుంజయుడై వారి కళ్లెదుట ప్రత్యక్షమవడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇది కూడా చదవండి: ఆసుపత్రి డీన్‌తో టాయ్‌లెట్ శుభ్రం చేయించిన ఎంపీ -
గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన పోలీస్ డాన్స్
హైదరాబాద్: భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ వెంబడి గణేశుడి నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. కొద్దిసేపు భారీగా వర్షం కురిసినా కూడా నిమజ్జనాలు కొనసాగాయి. ఇదిలా ఉండగా ఈ సంబరాల్లో ఒక పోలీస్ అధికారి డాన్స్‌తో దుమ్ము రేపారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా విగ్నేశ్వరుడు తొమ్మిది రోజులపాటు మన మధ్య కొలువుతీరి ఘనంగా పూజలు అందుకున్నాడు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా గణనాథుడు గంగమ్మ ఒడిలో చేరుతున్న వేళ ట్యాంక్ బండ్ చేరుకున్న భక్తులంతా సంబరాల్లో మునిగితేలారు. మిలాద్-ఉన్-నబీ, గణేష్ నిమజ్జనం ఇకేరోజు రావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 40000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. నిమజ్జనాలకు తరలివచ్చిన భక్తుల్లో పిల్ల, పెద్ద, యువత తేడా లేకుండా తీన్మార్ దరువుకు ధూందాం డాన్సులేశారు. ఇదే సంబరాల్లో ఓ పోలీసాయన కూడా తన్మయత్వంతో చిందులేశారు. ప్రొఫెషనల్ డాన్సర్లా ఈయన వేసిన స్టెప్పులకు చుట్టూ ఉన్నవారు కూడా నివ్వెరపోయి చూస్తుండిపోయారు. ఇంకేముంది మిగతా పోలీసులు కూడా కాసేపు సంబరాల్లో పాలుపంచుకుంటూ సరదాగా డాన్సులు చేశారు. ఈ వీడియో టీవీలో కనిపించిన కొద్దిసేపటికే మొబైల్ ఫోన్లలో చేరి వైరలయ్యింది. #Hyderabad police dance during Ganesh Shoba Yatra pic.twitter.com/rcWNY8wwbL — Naveena (@TheNaveena) September 28, 2023 ఇది కూడా చదవండి: నిమజ్జన వేళ.. స్టెప్పులేసిన సీపీ రంగనాథ్ -
హైదరాబాద్ లో వినాయక నిమజ్జన శోభాయాత్ర
-
గణపతిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తాం?అసలు కారణమిదే!
అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడ్ని నవరాత్రుల అనంతరం నిమజ్జనం చేయడం ఆచారంగా వస్తుంది. సాధారణంగా హిందూ పండగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా గణనాథుడికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు. మండపాలు వేసి అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు పూజలు చేసి తర్వాత గంగమ్మ ఒడికి సాగనంపుతారు. హిందూ దేవుళ్లలో ఎవరికి పూజలు చేసినా ఆ ప్రతిమలను ఇంట్లోనే పెట్టుకుంటాం. కానీ ఒక్క వినాయకుడిని మాత్రమే నిమజ్జనం ఎందుకు చేస్తాం?దీని వెనకున్న కారణం ఏంటన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన ఘనులకే ఘనుడు. రుతుధర్మాన్ననుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. యేటా వర్షరుతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుందీ పండుగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళం వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. మట్టితోనే ఎందుకు? గణేశుని మట్టితో చేయడం వెనుక కూడా విశేషముంది. ఈ కాలంలో జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. మట్టితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి అంటితే మంచిది. ఒండ్రుమట్టిలో నానడం శరీరానికి మంచిదని ప్రకృతి చికిత్స వైద్యులు చెబుతుంటారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. షోడశోపచార పూజల్లో వాడే పత్రిని మనం తాకడం వల్ల కూడా వాటిలోని ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. తొమ్మిది రోజులు విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో గాలి ఔషధ గుణాల్ని పంచుతుంది. ఎంతో మేలు చేస్తుంది. వినాయకుడిని దగ్గరలో ఉన్న చెరువు, నది లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్లుగా ఈ కాలంలో నదులు, చెరువులు నిండుగా కళకళలాడుతుంటాయి. మట్టి విగ్రహాల్ని, పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. కానీ ఈమధ్యకాలంలో గణపతికి రసాయనిక రంగులు వేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో నివసించే జీవులకు హానికారకమవుతుంది.అందుకే మట్టి గణపతులనే పూజించాలని చెబుతారు. నిమజ్జనమెందుకు? అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల(భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలసిపోవాల్సిందే.అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే!ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేస్తారు. శాస్త్రీయ కారణాలు.. వినాయక నిమజ్జనం వేనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. వినాయక చవితి నాటికి.. జోరుగా వానలు కురిసి.. వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతుంటాయి. వరదలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటి సమయంలో మట్టితో చేసిన గణపయ్య విగ్రహాలను నీళ్లల్లో నిమజ్జనం చేయడం వల్ల.. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అలానే వానాకాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా.. ఆయన పూజకు వాడిన ఆకులను కూడా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు పరిశుభ్రంగా మారుతుందని చెబుతున్నారు. మట్టి గణపతి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న రహస్యం. -
75 అడుగుల భారీ కండువా
ఖైరతాబాద్: మహాగణపతికి భారీ కండువా, జంధ్యం, గరిక మాలతో పాటు దేవతామూర్తులకు సమర్పించే పట్టు వస్త్రాలకు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు శనివారం పూజలు నిర్వహించారు. శ్రీ దశమహా విద్యా గణపతిగా కొలువుదీరిన మహాగణపతికి సోమవారం వినాయక చవితి రోజున ఉదయం 7 గంటలకు 75 అడుగుల కండువా, జంధ్యం, గరికమాలను సమర్పిస్తున్నట్లు అధ్యక్షుడు కడారి శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు గుర్రం కొండయ్య తెలిపారు. మహాగణపతికి ఇరువైపులా కొలువుదీరిన వీరభద్ర స్వామి, నరసింహస్వామి, సరస్వతిదేవి, వారాహి దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. -
భాగ్యనగరం నలుమూలలా గణనాథుల సందడి
-
నాలుగోరోజూ కుమ్మేసిన జడివాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి, సిటీబ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో వరుసగా నాలుగోరోజైన శుక్రవారం నగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం నిండా మునిగింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన జడివానకు రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనానికి స్వల్పంగా అంతరాయం కలిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నగరానికి ఆనుకొని ఉన్న జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు వరద నీరు పోటెత్తుతుండడంతో..జలమండలి అధికారులు రెండు జలాశయాలకు రెండు గేట్ల చొప్పున తెరచి మూసీలోకి వరదనీటిని వదిలిపెట్టారు. సాయంత్రం 6 గంటల వరకు ఉ స్మాన్సాగర్లోకి 500 క్యూసెక్కుల వరద నీరు చేరగా..442 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టారు. హిమాయత్‌సాగర్‌లోకి 600 క్యూసెక్కుల వరద చేరగా.. 678 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదిలారు. దీంతో మూసీలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో బాపూఘాట్–ప్రతాపసింగారం(44 కి.మీ)మార్గంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, బల్దియా యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది. పోలీసు విభాగం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా రాగల 24 గంటల్లో అల్పపీడన ప్రభావంతో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు నగరంలో నమోదైన వర్షపాతం వివరాలివీ.. (సెంటీమీటర్లలో) రాజేంద్రనగర్ 8.75, శివరాంపల్లి 6.6, గోల్కొండ 5.1, చాంద్రాయణగుట్ట 2.58, కిషన్‌భాగ్ 2.4, అత్తాపూర్ 2.33, జూపార్క్2.1 చదవండి: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ -
గణేష్ శోభాయాత్రలో టెన్షన్: ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వంత శర్మ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. అసోం సీఎం ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం బిశ్వంత శర్మ ప్రసంగిస్తుండగా.. టీఆర్ఎస్ నేత నందు బిలాల్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సీఎం తన ప్రసంగంలో టీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభా వేదిక మీదకు ఎక్కిన బిలాల్ మైక్ లాక్కున్నాడు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే బిలాల్‌ను పోలీసులు అక్కడి నుంచి తరిలించారు. దీంతో, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి తరలివచ్చారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలకు సంస్కారం లేదు. అసోం సీఎంను అడ్డుకోవడం సిగ్గుచేటు. ఇది పిరికిపంద చర్య. ఇది పెద్ద సాహసోపేత చర్య కాదు. పోలీసుల కనుసన్నాల్లోనే ఇదంతా జరిగిందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. -
తలసాని అనుచరులతో ఉత్సవ సమితి సభ్యుల వాగ్వాదం
-
ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఎడిసన్ లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం
-
‘క్లీన్’ సాగర్
-
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవతి సందర్భంగా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షించారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా అధికారులు ట్యాంక్ బండ్‌పై ట్రయల్ నిర్వహించారు. ఈ క్రమంలో నేడు ఖాళీ డ్రమ్ పెట్టి ఎక్స్పరిమెంట్ చేశారు.. అలానే థర్మకోల్ పెట్టి మరోకటి చేశారు. (చదవండి: ‘ట్యాంక్‌బండ్ ఎలా ఉందండి.. సిటీ పారిస్ నగరంలా కనిపిస్తోంది’) ఇది కొత్త ప్రోగ్రాం అన్నారు సీపీ అంజనీ కుమార్. నిమజ్జనం కోసం 3 ఏళ్ల క్రితం ఆటోమేటిక్‌గా రిలీజ్ చేసే యంత్రాలు ఉపయోగించారని తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ , పీవీఆర్ మార్గ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. -
గణేశ్ ఉత్సవాలపై ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలి: హైకోర్టు
-
వినాయకనిమజ్జన విషాదం: విద్యుత్‌షాక్‌కు అయిదుగురి మృతి
దొడ్డబళ్లాపుర(కర్ణాటక): వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి అయిదుగురు దుర్మరణం చెందారు. దొడ్డబళ్లాపుర తాలూకా మధురె కనకవాడి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్తులు గణేశుని విగ్రహం నిమజ్జనం చేయడానికి సమీపంలోని కాలువ వద్దకు వెళ్లారు. వినాయక నిమజ్జనం తరువాత తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌కు తెగిపడి ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైరు తగిలింది. దాంతో విద్యుత్ షాక్‌కు అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురుకి కాలిన తీవ్ర గాయాలయ్యాయి. చాలా మంది ట్రాక్టర్‌పై నుంచి కిందకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ** -
ముగిసిన నిమజ్జనోత్సవాలు
సాక్షి, ముంబై: అబ్బురపరిచే సెట్టింగులు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలతో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువై.. పదకొండు రోజులపాటు భక్తుల నుంచి నీరాజనాలందుకున్న గణనాథుడికి బుధవారం వీడ్కొలు పలికారు. గణపతి బొప్పా మోర్యా పుడ్చా వర్షీ లౌకర్యా.. అంటూ నిమజ్జన ఘాట్లకు తరలించారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన నిమజ్జనోత్సవాలు గురువారం సాయంత్రం వరకు కొనసాగాయి. భారీ వాహనాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేసి, అందులో గణనాథుడిని ఉంచి వీధులగుండా ఊరేగించారు. వాహనాలకు ముందు కోలాటం వంటి సంప్రదాయ నత్యాలేకుండా బ్రేక్‌డ్యాన్సులు, షేక్డ్యాన్సులు చేస్తూ ఊరేగింపులను ముందుకు తీసుకెళ్లారు. పిల్లలు, పెద్దలు, మహిళలు ఈ ఊరేగింపులో పెద్దఎత్తున పాల్గొన్నారు. ఠాణే, పుణేతోపాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా సాగాయని పోలీసువర్గాలు వెల్లడించాయి. 19 గంటలపాటు ఊరేగిన ‘రాజా’ వీలైనంత తక్కువ సమయంలో విగ్రహాలను నిమజ్జన ఘాట్లకు తరలించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసినా అవి ఎక్కడా అమలు కాలేదు. చిన్న చిన్న మండపాల్లో కొలువైన గణనాథులను కూడా కనీసం ఏడుగంటలపాటు ఊరేగించారు. ఇక ప్రముఖ మండపాల గణనాథులను తరలించేందుకు పదిగంటలకుమించే సమయం పట్టింది. ఇక ముంబై నగరవాసుల నుంచి విశేష పూజలందుకున్న లాల్బాగ్ చా రాజా ఊరేగింపు 19 గంటలపాటు సాగింది. బుధవారం ప్రారంభమైన ఈ ‘రాజా’ ఊరేగింపు గురువారం ఉదయం 7.30 నిమజ్జనంతో ముగిసింది. శివారు పట్టణాలైన నవీముంబై, ఠాణేల్లో కూడా ఊరేగింపులు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. అయితే పుణేలో మాత్రం వర్షం కారణంగా కాస్త ముందుగానే ఉత్సవాలు ముగిశాయి. చెమటోడ్చిన పోలీసులు... ఉత్సవాలు శాంతియుతంగా ముగియడంలో పోలీసులు కీలకపాత్ర పోషించారు. మండపాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించిన రోజునుంచి నిమజ్జనం వరకు పోలీసుల కంటిమీద కునుకే కరువైంది. ఊరేగింపులు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులకు హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సార్పీఎఫ్, కార్పొరేషన్ సిబ్బంది మద్దతుగా నిలిచారు. ఇక ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ విభాగం ముందుగా చేసుకున్న ఏర్పాట్లకారణంగా నగరవాసులు కొంత ఇబ్బందిపడినా ట్రాఫిక్ పోలీసులకు సహకరించారు. ఆకట్టుకున్న కత్రిమ జలాశయాలు.. విగ్రహాల నిమజ్జనం కారణంగా తాగునీటి జలాశయాలు కలుషితం కాకుండా ఉండేందుగాను ఏర్పాటు చేసిన కత్రిమ జలాశయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటిని ఏర్పాటు చేయడంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. గత రెండుమూడు సంవత్సరాలుగా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్, బహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్లు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని చె ప్పారు. పదిమంది మతి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిమజ్జనోత్సవాల్లో పదిమంది మరణించారు. అందిన వివరాల మేరకు... నాసిక్‌లోని చాంద్‌వడ్ సమీపంలోగల వేల్గావ్ జలాశయంలో ఇద్దరు నీటమునిగి మతి చెందగా పాల్ఖేడ్ జలాశయంలో మరొకరు మరణించారు. ఔరంగాబాద్ సమీపంలోని నారెగావ్ గ్రామం చెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మతిచెందారు. బీడ్ జిల్లా కేంద్రంలో జరిగిన ఉత్సవాల్లో 12 ఏళ్ల బాలుడు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. షిర్డీ సమీపంలోని గోదావరి తీరంలో విలాస్ కదం(24) నదిలో మునిగిమరణించగా జల్గావ్, చంద్రాపూర్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ముగ్గురు నీటమునిగి మతిచెందారు. కొల్హాపూర్‌లో ఉద్రిక్తత... అర్ధరాత్రి దాటాక కూడా డీజే సౌండ్ సిస్టమ్‌ను కొనసాగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొల్హాపూర్‌లో పోలీసులకు, భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీనిని అదనుగా చేసుకొన్న కొందరు ఆకతాయిలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది పోలీసులు, వివిధ మండళ్లకు చెందిన ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు. పింప్రిలో.. పింప్రి, న్యూస్‌లైన్: జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పింప్రివాసులు బుధవారం వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాత్రి రెండు గంటల వరకు సాగిన ఈ వేడుకలలో సుమారు 113 మండళ్లు పాల్గొన్నాయి. పింప్రిలోని షగున్ చౌక్ వద్ద పింప్రి-చించ్వడ్ కార్పొరేషన్, పుణే పోలీసులు స్వాగత మండపాలను ఏర్పాటు చేసి గణేశ్ మండళ్లకు పుష్పహారాలు, శ్రీఫలాలను అందించారు. నిమజ్జన వేడుకల్లో మహిళలు డోలు వాయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా రాత్రి 10 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పింప్రి-చించ్వడ్లో 20 నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేశారు. 70 మంది కార్పొరేషన్ అధికారులు, 180 మంది సిబ్బంది నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుణేలో... పుణేలో నిమజ్జన వేడుకలు 24 గంటలపాటు కొనసాగాయి. స్థానికంగా ప్రసిద్ధిగాంచిన దగుడు సేఠ్ హల్వాయి గణపతిని ఈ ఏడాది సూర్యోదయానికి ముందుగానే నిమజ్జనం చేయడం విశేషం. పుణే నగర మేయర్ చంచలా కోద్రే, మాజీ మేయర్ వైశాలీ బన్కర్, ఎన్సీపీకి చెందిన అంకుష్ కాకడే, మాజీ ఉప మేయర్ దీపక్ మానేకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ నత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ముందుగా కస్బాగణపతిని నిమజ్జనం చేశారు. జర్మనీ, ఇటలీ, డెన్మార్క్‌కు చెందిన విదేశీయులు తమ దేశ ప్లకార్డులతో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. బోరివలిలో.. బోరివలి, న్యూస్‌లైన్: బోరివలి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిమజ్జన ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన నిమజ్జన ఉత్సవాలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. కొన్ని మండళ్లు ఊరేగింపులో ఎడ్ల బండ్లను కూడా ఉపయోగించాయి. యువత సంగీత నత్యాలు చేస్తూ లంబోదరుడిని సాగనంపారు. శ్రీ బాలాజీ సేవా సంస్థ భక్తులకు తాగు నీటిని అందించింది. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వై.నరసింహులు, కార్యదర్శి హనుమంతు జోగై, కోశాధికారి శ్రీను మేకల తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతులు
న్యూస్‌లైన్, నెట్వర్క్ : గణేశ్ నిమజ్జనం సందర్భంగా బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో అపశ్రుతులు చోటుచేసుకోవడంతో 8మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామ పరిధిలోని లక్ష్మీనగర్ తండాకు చెందిన జాదవ్ గణేశ్(35) విగ్రహ నిమజ్జనం కోసం ప్రాణహిత-చెవెళ్ల హైలెవెల్ కెనాల్లో దిగి గల్లంతయ్యాడు. మంచిర్యాల మేదరివాడకు చెందిన పెంటం వేణుమాధవ్(25) గణేశ్ శోభాయూత్రలో స్నేహితులు, స్థానికులతో గొడవపడి మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడే హమాలీవాడ పరిధిలో గణేశ్ శోభాయాత్రకు కరెంట్ తీగను కర్రతో తప్పిస్తుండగా షాక్ తగిలి చింతకింది రాజు(19) మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోని బ్రాహ్మణ అగ్రహారానికి చెందిన దిట్టకవి రాము (23) గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు గోదావరి రేవులోకి దిగి గల్లంతయ్యాడు. వరంగల్జిల్లా నర్సంపేటలోని వల్లభ్‌నగర్‌కు చెందిన గుగ్గిళ్ల ఉమాశంకర్(13) నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవ శాత్తు దామెర చెరువులో పడి మృతిచెందాడు. శాయంపేట మండలంలోని గంగిరేణిగూడేనికి చెందిన వల్లాల తిరుపతి(40) తన స్నేహితుడు భాస్కర్ విద్యుత్‌షాక్‌కు గురవడంతో కాపాడబోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, దేవరుప్పుల మండలం మున్‌పాడ్‌కు చెందిన వర్రె మధు, గణేష్ విగ్రహం వద్ద వేలం పాట విషయమై భార్యతో గొడవపడి చేయిచేసుకోవడంతో ఆమె మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడింది. నర్సంపేటలో ఫొటోగ్రాఫర్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్‌షాక్‌తో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. -
నిమజ్జనోత్సాహం, మహాగణపతి నిమజ్జనం
గోనాగ చతుర్ముఖ వినాయక స్వామి గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. భాగ్యనగరి ఉత్సాహంతో ఊగిపోతోంది. నగరం ‘బోలో గణేష్ మహరాజ్‌కీ’ నినాదాలతో మార్మోగి పోతోంది. శోభాయమానంగా సాగే మహాయాత్ర, నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గణనాథులకు ఘనంగా వీడ్కోలు చెప్పడానికి ఉత్సవ నిర్వాహకులు సంసిద్ధమయ్యారు. పోలీసులు నగరవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిసారి ఖైరతాబాద్ మహాగణపతి ఒంటరిగా నిమజ్జనానికి తరలివెళ్లనున్నాడు. ప్రతిఏటా గణపతికి ఇరువైపులా ఏర్పాటు చేసిన విగ్రహాల్ని కూడా నిమజ్జనానికి తరలించడం ఆనవాయితి. అయితే ఈ ఏడాది మహాగణపతికి ఇరువైపులా ఉన్న రెండు విగ్రహాల్ని యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్ ప్రాంగణానికి తరలించనున్నారు. 10 రోజులే.. ప్రతి ఏటా 11 రోజులుపాటు భక్తుల కోరికల్ని తీర్చే ఖైరతాబాద్ గణపయ్య ఈ ఏడాది 10 రోజులకే పరిమితమయ్యాడు. ప్రతి ఏటా అనంత చతుర్దశి రోజున నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది 10 రోజులకే అనంత చతుర్దశి రావడం, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటి 10వ రోజే నిమజ్జనం నిర్వహి ంచాలని పిలుపునివ్వడంతో బుధవారమే నిమజ్జనం చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. లోటస్ టెంపుల్‌కు ఎందుకు .. ఖైరతాబాద్‌లో ఈ ఏడాది గోనాగ చతుర్ముఖ వినాయక స్వామితో పాటు కుడివైపు శ్రీరామపట్టాభిషేకం, ఎడమ వైపు భువనేశ్వరీ మాత విగ్రహాల్ని ఏర్పాటు చేశారు.యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న లోటస్ టెంపుల్ ప్రాంగణంలో మణిద్వీపం మ్యూజియానికి ఈ రెండు విగ్రహాల్ని ఇవ్వాలని ‘లోటస్’ ప్రతినిధి బాలరాజు.. గణేశ్ ఉత్సవ కమిటీని కోరారు. శిల్పి రాజేంద్రన్‌తో పాటు, కమిటీ ప్రతినిధులు ఇందుకు సరేననడంతో ఈ నెల 19న వీటిని యాదగిరి గుట్టకు తరలించనున్నారు.ఆపరేషన్ ‘చతుర్ముఖ’కు భారీ క్రేన్: గంగ ఒడికి గణపయ్యను చేర్చడంలో కీలకఘట్టమైన ఆపరేషన్ ‘చతుర్ముఖ’ బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభం కానుంది. భారీ క్రేన్ సహాయంతో మహాగణపతి విగ్రహాన్ని వాహనంపై పెట్టనున్నారు. అందుకు వినియోగించే క్రేన్ ప్రత్యేకతల్ని పరిశీలిస్తే... క్రేన్ పొడవు: 60 అడుగులు; వెడల్పు: 14 అడుగులు; టైర్లు: 12 (ఒక్కో టైరు టన్ను బరువు) ; మొత్తం బరువు: 120 టన్నులు; 150 టన్నుల బరువును 160 అడుగుల ఎత్తుకు లేపగలిగే సామర్థ్యం దీని సొంతం.; జర్మన్ టెక్నాలజీతో తయారైన ఈ క్రేన్ కూకట్పల్లి రవి క్రేన్స్‌కు సంబంధించినది. ఖరీదు రూ.12 కోట్లు. ఇన్ సెట్ లో నాగార్జునే రథసారథిటయిల్ రన్ సక్సెస్... మహాగణపతిని నిమజ్జనానికి తరలించే మార్గంలో ఎస్టీసీ కంపెనీకి చెందిన భారీవాహనం(ఏపీ 16 టీడీ 4059)తో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ట్రయిల్ రన్ నిర్వహించారు. ట్రయిల్ రన్ అనంతరం వెల్డింగ్ పనుల్ని పూర్తి చేశారు. ఈ వాహనాన్నే నాలుగేళ్లుగా మహాగణపతి నిమజ్జనం కోసం వినియోగిస్తున్నారు. వాహనం ప్రత్యేకతలివే... పొడవు: 60 అడుగులు; వెడల్పు: 11 అడుగులు; చక్రాలు: 26; బరువు: 18; టన్నులు; 100 టన్నులు బరువు లాగే సామర్థ్యం. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద జనసందోహం సాగర్‌తీరంలో ఏకదంతుడికి హారతినిస్తూ.. ట్యాంక్‌బండ్: నిమజ్జనానికి తరలుతున్న గణనాథుడు