Garment Factory
-
11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత
బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు తమ వేతనాలు పెంచాలని నిరసన తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా గత రెండు వారాలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గార్మెంట్ ఇండస్ట్రీలోని దాదాపు 40లక్షల మంది కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రోడెక్కారు. దాంతో అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. ఫలితంగా నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల వల్ల ముగ్గురు కార్మికులు మరణించినట్లు సమాచారం. అక్కడి పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. నిరసనకు పాల్పడిన 11,000 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వివిధ సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు. దాంతో దేశంలోని 150 ఫ్యాక్టరీలు నిరవధికంగా మూసివేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. కార్మికుల సమస్యలు ఇవే.. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో గార్మెంట్ పరిశ్రమ పాత్ర కీలకం. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో 84% వాటాను కలిగి ఉంది. కరోనా సమయంలో దుస్తుల డిమాండ్ మందగించింది. దానివల్ల దేశంలో 2020లో దాదాపు 17% వస్త్ర ఎగుమతులు తగ్గాయి. ముడిచమురు ధరలు పెరగడంతో బంగ్లాదేశ్ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లతో పాటు ప్రధానంగా అక్కడి కార్మికులకు అరకొర జీతాలిచ్చి సరిపెడుతున్నారు. నెలకు కనీస వేతనం కింద రూ.9458(12,500 టాకాలు) చెల్లిస్తున్నారు. అయితే దాన్ని రూ.17400(23,000 టాకాలు)కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి పనిప్రదేశాల్లో సరైన వెంటిలేషన్ లేకపోవడంతో పరిశ్రమల్లోని విషపూరిత వాయువులను పీల్చి చాలామంది కార్మికులు వివిధ వ్యాధుల బారినపడుతున్నట్లు కార్మికసంఘాలు తెలిపాయి. అక్కడి కార్మికుల్లో మహిళలు ఎక్కువగా పనిచేస్తుంటారు. కానీ వారికి సరైన మౌలికవసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒక పరిశ్రమలో మహిళలు లైంగికహింసకు గురవుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే.. బంగ్లాదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పద్దెనిమిది గ్లోబల్ కంపెనీలు అక్కడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రధానికి లేఖ రాశాయి. వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కొత్త కనీస వేతనం నిర్ణయించాలని కోరాయి. హెచ్ అండ్ ఎం, లెవీస్, గ్యాప్, పూమా.. వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు అక్కడ పరిశ్రమలు నెలకొల్పాయి. -
వస్త్ర పరిశ్రమలో అగ్ని ప్రమాదం
-
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
ముంబయి: ముంబయి శివారులోని థానే జిల్లా భీవాండిలోని ఓ వస్త్ర పరిశ్రమలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయిదు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు వేగంగా పై అంతస్థులకు పాకాయి. దుస్తులు వేగంగా మంటలకు ఆహుతై మొత్తం నాలుగు ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ అలుముకుంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నియంత్రించిన బీఎంసీ అధికారులు, పోలీసులు .. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఉదయం షిఫ్ట్‌లో పని చేస్తున్న 80 మంది ఫ్యాక్టరీ పైకప్పు మీదకు చేరుకుని తమనకు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీతో పాటు నివాస కాంప్లెక్స్ అయినందున కార్మికులే కాకుండా మరో 70 మందికి పైగా మంటల్లో చిక్కుకుపోయారు. అయితే చిక్కుకున్నవారు 150మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. భీవాండి అగ్ని ప్రమాదంపై తెలంగాణ జిల్లాల చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. భీవాండి పరిసర ప్రాంతాల్లోని వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల చేనేత కార్మికులే పని చేస్తుంటారు. కాగా ఈ ఫ్యాక్టరీకి ఒకే ద్వారం వున్నందున లోపలి కార్మికులను బయటకు తరలించే అవకాశం లేదు. కేవలం నిచ్చెనల ద్వారా లేదంటే హెలికాప్టర్ల ద్వారా కార్మికులను సురక్షితంగా కిందకు దించే అవకాశం వుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సక్రమ మైనింగ్‌కు అవకాశం కల్పిస్తాం
హొస్పేట, న్యూస్‌లైన్ : మైనింగ్ స్తంబించడంతో సుమారు 80 వేల మంది కార్మికులు వీధి పాలయ్యారని, తాము సక్రమ మైనింగ్‌కు తిరిగి అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఆయన శుక్రవారం హొస్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై హనుమంతప్ప తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. అక్రమ మైనింగ్ వల్లే ప్రస్తుతం జిల్లాలో మైనింగ్ స్తంభించిపోయిందన్నారు. గుజరాత్లో గోద్రా హత్యాకాండ జరిగినప్పుడు నరేంద్ర మోడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అలాంటి వారు ప్రధాని అయితే దేశం సురక్షితంగా ఉండబోదన్నారు. విభిన్న సంస్కృతులు, పలు రకాల భాషలతో కూడిన భారతదేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై హనుమంతప్ప సున్నిత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, హైకోర్టు న్యాయమూర్తిగా కూడా సేవలందించారని అలాంటి వ్యక్తి పార్లమెంట్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రాదని, శ్రీరాములు కూడా ఎంపీ కాలేరని జోష్యం పలికారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి సీఎం ఇబ్రహీం మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై హనుమంతప్పను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్, లోక్‌సభ అభ్యర్థి హనుమంతప్ప, ఎమ్మెల్యేలు అనిల్ లాడ్, తుకారాం, ప్రముఖులు కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్ప, మాజీ ఎమ్మెల్యేలు గవియప్ప, రతన్‌సింగ్, గుజ్జల జయలక్ష్మి, నందిహళ్లి హాలప్ప, ఎన్ఎం నబీ, సిరాజ్ షేక్, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ఎల్ స్వామి, అబ్దుల్ వహాబ్, దీపక్ కుమార్ సింగ్, జేఎస్ ఆంజనేయులు, కల్లుకంబ పంపాపతి, ఎన్.ప్రతాప్‌రెడ్డి, నిరంజన్ నాయుడు, గుజ్జల నాగరాజు, ఎంఎంజే హర్షవర్ధన్, బీకాం మాబుసాబ్, కేఎం హాలప్ప, అయ్యాళి తిమ్మప్ప, డీ.వెంకటరమణ, బావి బెట్టప్ప, అన్నదానరెడ్డి, దొడ్డరామణ్ణ, నగరసభ అధ్యక్షురాలు కణ్ణి ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు గౌసియాబాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సిరాజ్షేక్కు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. -
నిర్వాసితులను ఆదుకుంటాం
సీఎం సిద్ధరామయ్య రైల్వే కోచ్ పరిశ్రమ నిర్మాణ పనులకు సిద్ధు శంకుస్థాపన ప్రతి ఏటా 500 బోగీల ఉత్పత్తి లక్ష్యం ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు నాలుగేళ్లలో ఉత్పత్తి ప్రారంభం కోలారు, న్యూస్‌లైన్ : రైల్వే కోచ్ తయారీ పరిశ్రమకు భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీనిచ్చారు. శ్రీనివాసపురం తాలూకా యదరూరు వద్ద 1,118 ఎకరాల విస్తీర్ణంలో రూ.1460 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమకు ఆయన బుధవారం శంకుస్థాపన చేసి, ప్రసంగించారు. పరిశ్రమ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన స్థలంలో ఇప్టికే 568 ఎకరాలను రైల్వే శాఖకు అందించినట్లు వివరించారు. మిగిలిన భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా 500 బోగీల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ఫ్యాక్టరీలో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల వల్ల భవిష్యత్తులో కోలారు జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. ముళబాగిలులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిచ్చిందని, దీనికి 12వేల ఎకరాల స్థలం అవసరమవుతుందని తెలిపారు. తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. శిఢ్లఘట్టలో 100 ఎకరాలలో జౌళి పార్కు, చింతామణిలో 50 ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తదితరాలను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. రైల్వే బోగీలకు డిమాండ్ హుబ్లీ రైల్వే జోనల్ మేనేజర్ పీకే సక్సేనా మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే బోగీలకు డిమాండ్ అధికంగా ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలో బోగీల ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న తరహా మంత్రి కేహెచ్. మునియప్ప, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్ బేగ్, వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి యూటీ. ఖాదర్, ఎమ్మెల్యేలు రమేష్‌కుమార్, కొత్తూరు మంజునాథ్, నారాయణ స్వామి, వై రామక్క, ఎమ్మెల్సీలు నజీర్ అహ్మద్, వైఎ. నారాయణస్వామి, జడ్పీ. అధ్యక్షుడు తూపల్లి నారాయణస్వామి, తాలూకా పంచాయతీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, రైల్వే సలహా మండలి సభ్యుడు స్వామి నాథన్, కలెక్టర్ డీకే. రవి తదితరులు పాల్గొన్నారు. -
బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం
ఢాకా : బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గజీపూర్లోని ఓ వస్త్ర పరిశ్రమలో మంటలు చెలరేగడంతో పదిమంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. ప్యాక్టరీ మూసి ఉన్నా.. అందులో కార్మికులు ఓవర్‌టైమ్ డ్యూటీ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కార్మికులు మంటల్లో కాలి బూడిద కావడంతో గుర్తించడం కష్టంగా మారింది. కాగా ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లోనే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీ కూలి 1100మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
సంక్షోభంలో టెక్స్టైల్
సాక్షి, బెంగళూరు: సమైక్యాంధ్ర నినాదంతో రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సమ్మె ఇక్కడి టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బెంగళూరు చుట్టు పక్కల ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి సీడబ్ల్యుసీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమ్మె ప్రభావం కర్ణాటకలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న టెక్స్టైల్ రంగంపై కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాల్లోని కదిరి, పులివెందుల, అనంతపురం జిల్లా కేంద్రం, హిందూపురం తదితర ప్రాంతాలకు చెందిన వస్త్ర వ్యాపారులు బెంగళూరులో హోల్‌సేల్ ధరలకు వస్త్రాలు కొనుగోలు చేసి అక్కడి వారాంతపు సంతల్లో, చిన్నచిన్న దుకాణాల్లో రీటైల్‌గా అమ్ముతుంటారు. ఇక కదిరిలోని వస్త్ర వ్యాపారులైతే వారానికి ఒకసారి బెంగళూరుకు వచ్చి ఇక్కడి గాంధీనగర్, కమర్షియల్ స్ట్రీట్ తదితర చోట్ల దుస్తులను కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. అయితే సమ్మె కారణంగా కదిరి, పులివెందుల, హిందూపురం, అనంతపురం జిల్లాకేంద్రం ప్రాంతాల్లోని దుకాణాలు వుూతపడటం వల్ల బెంగళూరులోని హోల్‌సేల్ మార్కెట్లో దుస్తులు కొనుగోలు బాగా తగ్గిపోయింది. దీంతో బెంగళూరులోని హోల్‌సేల్ వస్త్ర వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వ్యాపార వాటాలో కోత పడింది. ఇక సమ్మె ప్రభావం మొదట్లో ఇక్కడి గార్మెంట్ ఫ్యాక్టరీలపై అంతగా పడకున్నా ఇప్పుడిప్పుడే ఆ తీవ్రత పెరుగుతోంది. ఇక్కడి గార్మెంట్ ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లలో రాయలసీమ జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల వాటా ఎక్కువగా ఉంది. అయితే సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు స్తంభించడంతో ఇక్కడి గార్మెంట్ యూనిట్లకు ఆర్డర్ల సంఖ్య బాగా తగ్గుతోంది. రవాణా వ్యవస్థ స్తంభించడమూ కారణమే... సమ్మె ప్రభావం టెక్స్టైల్ రంగంపై పడటానికి రవాణా వ్యవస్థ స్తంభించడం కూడా ఒక కారణమనే వాదన వినిపిస్తోంది. చిరు వ్యాపారులు తాము కొనుగోలు చేసిన దుస్తుల రవాణాకు సాధారణంగా కేఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులనే వాడుతుంటారు. అయితే రెండు నెలలుగా ఇక్కడి కేఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లడం లేదు. కొనుగోలు చేసిన వస్త్రాల రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటం కూడా టెక్స్టైల్ రంగంపై ప్రభావం చూపడానికి మరో కారణం. ఈ విషయంపై హోల్‌సేల్ వస్త్రవ్యాపారి సయ్యద్ ఖురేషి సాక్షితో మాట్లాడుతూ.... ‘సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న సమ్మె వల్ల ఇక్కడి నుంచి ఏపీఎస్, కేఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రవైపు వెళ్లడం లేదు. చిరు వస్త్రవ్యాపారులకు ప్రైవేటు వాహనాల్లో రవాణా చేసే స్తోమత ఉండదు. అందువల్ల కూడా వారు ఇక్కడ దుస్తులను కొలుగోలు చేయడం నిలిపివేశారు’ అని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బస్సులు న డపక పోవడంతో ఈ రెండు నెలల్లో కేఎస్ ఆర్టీసీ రోజుకు సగటున రూ.40 లక్షల ఆదాయం కోల్పోవడంతో మొత్తం రూ.24 కోట్ల ఆయానికి గండి పడింది. ఇక బెంగళూరు నుంచి ఏపీకి బస్సులను నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ కూడా రూ.6 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.