హొస్పేట, న్యూస్‌లైన్ : మైనింగ్ స్తంబించడంతో సుమారు 80 వేల మంది కార్మికులు వీధి పాలయ్యారని, తాము సక్రమ మైనింగ్‌కు తిరిగి అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఆయన శుక్రవారం హొస్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై హనుమంతప్ప తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. అక్రమ మైనింగ్ వల్లే ప్రస్తుతం జిల్లాలో మైనింగ్ స్తంభించిపోయిందన్నారు.
గుజరాత్‌లో గోద్రా హత్యాకాండ జరిగినప్పుడు నరేంద్ర మోడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారని, అలాంటి వారు ప్రధాని అయితే దేశం సురక్షితంగా ఉండబోదన్నారు. విభిన్న సంస్కృతులు, పలు రకాల భాషలతో కూడిన భారతదేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై హనుమంతప్ప సున్నిత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, హైకోర్టు న్యాయమూర్తిగా కూడా సేవలందించారని అలాంటి వ్యక్తి పార్లమెంట్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రాదని, శ్రీరాములు కూడా ఎంపీ కాలేరని జోష్యం పలికారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి సీఎం ఇబ్రహీం మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై హనుమంతప్పను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్, లోక్‌సభ అభ్యర్థి హనుమంతప్ప, ఎమ్మెల్యేలు అనిల్ లాడ్, తుకారాం, ప్రముఖులు కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్ప, మాజీ ఎమ్మెల్యేలు గవియప్ప, రతన్‌సింగ్, గుజ్జల జయలక్ష్మి, నందిహళ్లి హాలప్ప, ఎన్‌ఎం నబీ, సిరాజ్ షేక్, మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ఎల్ స్వామి, అబ్దుల్ వహాబ్, దీపక్ కుమార్ సింగ్, జేఎస్ ఆంజనేయులు, కల్లుకంబ పంపాపతి, ఎన్.ప్రతాప్‌రెడ్డి, నిరంజన్ నాయుడు, గుజ్జల నాగరాజు, ఎంఎంజే హర్షవర్ధన్, బీకాం మాబుసాబ్, కేఎం హాలప్ప, అయ్యాళి తిమ్మప్ప, డీ.వెంకటరమణ, బావి బెట్టప్ప, అన్నదానరెడ్డి, దొడ్డరామణ్ణ, నగరసభ అధ్యక్షురాలు కణ్ణి ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు గౌసియాబాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సిరాజ్‌షేక్‌కు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు.
సక్రమ మైనింగ్‌కు అవకాశం కల్పిస్తాం
Published Sat, Apr 12 2014 3:01 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement