Ghanpur village
-
ఘణపురంలో మావోయిస్టుల కరపత్రాలు
సాక్షి, ములుగు: జిల్లాలోని వాజేడు మండలం ఘణపురం గ్రామ శివారులో గురువారం మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. ఈ నెల 21 నుంచి నవంబర్ 8 వరకు మావోయిస్టుల 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మావోలు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కరపత్రాలు సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో వెలిశాయి. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
నిజామాబాద్ : పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ.3 వేలు లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఘన్పూర్ గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న ముత్తన్న.. అక్కాపూర్ గ్రామానికి చెందిన బేజి ఎల్లయ్య భూమికి చెందిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ.3వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఎల్లయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం అతన్ని విచారిస్తున్నారు.