golden bay resorts
-
గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద ఉద్రిక్తత
-
ఇంతకీ.. శశికళ క్యాంపు రిసార్టు బిల్లు ఎంత?
దాదాపు వంద మందికి పైగా ఎమ్మెల్యేలు, వాళ్లకు సహాయంగా (కాపలాగా) దాదాపు మరో 200 మందికి పైగా బౌన్సర్లు దాదాపు వారం రోజుల నుంచి విలాసవంతమైన బీచ్ రిసార్టులో ఉంటున్నారు. వాళ్లకు అక్కడ సకల మర్యాదలు జరుగుతున్నాయి. మరి వీళ్లందరూ అక్కడ ఉండేందుకు ఎంత బిల్లు అయ్యిందో ఎవరైనా అడిగారా, ఆ డబ్బులు ఎవరు పెట్టుకుంటున్నారో చూశారా? గోల్డెన్ బే రిసార్ట్‌లో సుమారు 60 గదులున్నాయి. వాటిలో మూడు రకాలు ఉంటాయి. ట్రాంక్విల్ రూంలు అయితే రోజుకు రూ. 5,500 చొప్పున, బే వ్యూ రూంలు అయితే రూ. 6,600 చొప్పున, పారడైజ్ సూట్లు అయితే రూ. 9,900 చొప్పున అద్దెలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి అన్ని రకాల గదులను రూ. 7వేల చొప్పున రోజుకు బుక్ చేసుకున్నారని అనుకున్నా కూడా.. దాదాపు ఆరు రోజులకే బిల్లు రూ. 25 లక్షల వరకు వెళ్తుంది. ఇది కాక ఇంకా ఆహారం, మంచినీళ్లు, స్నాక్స్, పండ్లు, మద్యం.. ఇతర ఖర్చులన్నీ వేరు. దాదాపు ప్రతిరోజూ రాత్రి పూట ఎమ్మెల్యేల వినోదం కోసం భారీ ఎత్తున పార్టీలు జరుగుతున్నాయని సమాచారం. సుమారు 200 మంది మాత్రమే రిసార్టులలో ఉన్నారని అనుకున్నా, వాళ్లకు తిండి, ఇతర పానీయాల ఖర్చు రోజుకు రూ. 2వేలు మాత్రమే వేసుకుంటే మరో రూ. 25 లక్షలు అవుతుంది. బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం జరిగిన తర్వాత అటునుంచి అటే వాళ్లందరినీ రిసార్టుకు తీసుకెళ్లిపోయారు. దాంతో వాళ్లు అసలు కనీసం దుస్తులు కూడా తెచ్చుకోలేదు. దాంతో ప్రతి ఒక్కరికీ ఇన్నిరోజులకు సరిపడా కొత్త దుస్తులు కొని తెచ్చారు. దానికోసం రోజుకు వెయ్యిరూపాయలు వేసుకున్నా, ఆరు రోజులకు కలిపి రూ. 12 లక్షలు అవుతుంది. వీటితో పాటు ఎమ్మెల్యేలు ఏవైనా అదనపు సదుపాయాలు, సేవలు కోరుకుంటే వాటిని కూడా కల్పించాల్సిందే కాబట్టి వాటి ఖర్చు కూడా లెక్క వేసుకోవాలి. ఇలా చూసుకుంటే దాదాపు ఈ వారం రోజులకు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతోందని తెలుస్తోంది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన వీకే శశికళకు తనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించే అధికారం లేదని ఓ పన్నీర్ సెల్వం ఇప్పటికే చెప్పడమే కాదు, బ్యాంకులకు లేఖలు కూడా రాసేసి, అన్నాడీఎంకే పార్టీ నిధులన్నింటినీ స్తంభింపజేశారు. మరి అలాంటప్పుడు ఈ రిసార్టుల బిల్లులు ఎవరు భరిస్తున్నారో, దానికి డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయనేది కూడా అనుమానించాల్సిన విషయమేనని అంటున్నారు. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. శశికళ జాతకంపై నేడే తీర్పు నేనెవరికి మద్దతివ్వాలి? శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు సరైన సమయంలో కీలక నిర్ణయం శశికళకు కారాగారమా? అధికారమా? వారంలోగా బలపరీక్ష! ప్రజాక్షేత్రంలోకి శశికళ మారువేషంలో బయటపడ్డా చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ -
పన్నీర్ ఎన్ని ఎత్తులు వేసినా.. వృథా ప్రయాసే!
చెన్నై: సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్న అన్నాడీఎంకే శాసనసభాపక్షనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ.. ఎమ్మెల్యేలను రిసార్టులో బంధించలేదని పోలీసులు తేల్చడం పన్నీర్ సెల్వం వర్గానికి కాస్త మింగుడు పడని విషయమే. తమను ఎవరూ నిర్బంధించలేదని ఎమ్మెల్యేలు చెప్పినట్లు మద్రాస్ హైకోర్టుకు పోలీసులు నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అమ్మ వీరవిధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం సీఎం కుర్చీ కోసం ఎన్ని జిత్తులు వేసినా, ఎలాంటి కుట్రలకు పాల్పడ్డా అవన్నీ వృథా ప్రయాసే అవుతాయని చెప్పారు. తమిళనాడు సీఎం శశికళ అవుతారని తమ పార్టీ నేతలకు నూటికి నూరుపాళ్లు నమ్మకం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసత్వాన్ని చిన్నమ్మ శశికళ అందిపుచ్చుకుంటారని ధీమా వ్యక్తంచేశారు. బలమైన నాయకురాలిగా, మంచి పాలనాదక్షురాలుగా శశికళ పేరు తెచ్చుకుంటారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు శశికళకే ఉందని, ఆమెనే సీఎం పీఠాన్ని అధిష్టిస్తారని అన్నారు. జయలలితకు సన్నిహితురాలిగా ఉంటూ పరిపాలనను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి కనుక ఆమెపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మహాబలిపురం సమీపంలోని కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టులో ఉన్న 119 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. తమను ఎవరూ బంధించలేదని, స్వచ్ఛందంగా అక్కడ ఉంటున్నట్లు నేటి ఉదయం వారు పోలీసులకు వెల్లడించారు. దీంతో పన్నీర్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదివారం శశికళ మరోసారి రిసార్టుకు వెళ్లడం.. తనకు మద్ధతివ్వాలంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో పన్నీర్ క్యాంపులో చేరేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడంలేదని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాడు కథనాలు చదవండి... తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? ఢిల్లీని ఢీ కొడతా జయలలిత చనిపోయినపుడే తెలిసింది -
శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు!
తమిళ రాజకీయాలు ఒక్కసారిగా సరికొత్త మలుపు తిరిగాయి. నిన్న మొన్నటి వరకు మహాబలిపురం సమీపంలోని కూవత్తూర్‌లోని గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలను నిర్బంధించారని, ఒక్కొక్కరికి నలుగురు గూండాలను కాపలాగా పెట్టారని చెప్పగా.. అవన్నీ తప్పేనని చెన్నై పోలీసులు తేల్చేశారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రిసార్టులో మొత్తం ఎమ్మెల్యేలను నిర్బంధించి, కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వడం లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు స్పందించి, వారి విషయంలో వాస్తవాలు ఏంటన్నది చెప్పాలని పోలీసులను ఆదేశించింది. దాంతో డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు రిసార్టు వద్దకు వెళ్లి, అక్కడున్న ఎమ్మెల్యేలందరితో మాట్లాడారు. అక్కడ మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తామంతా స్వచ్ఛందంగానే అక్కడ ఉన్నట్లుగా వాళ్లు తమకు చెప్పారని నివేదికలో పేర్కొన్నారు. దాంతో ఒక్కసారిగా పన్నీర్ సెల్వం శిబిరం ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. అసెంబ్లీలో బల నిరూపణ వచ్చేవరకు ఇక సెల్వం క్యాంపునకు ఎలాంటి అవకాశాలు లేనట్లేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇంతకుముందు రిసార్టులలో 92 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని పోలీసుల వైపు నుంచి సమాచారం రాగా, ఇప్పుడు 119 మంది ఉన్నారని, వాళ్లలో ఎవరూ తమను నిర్బంధించినట్లు చెప్పలేదని అధికారికంగా కోర్టుకు చెప్పడంతో.. మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. తమిళనాడు కథనాలు చదవండి... శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
శశికళకు 119 మంది ఎమ్మెల్యేల మద్దతు!
-
గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వెళ్లిన పోలీసులను అక్కడివాళ్లు అడ్డుకోవడంతో కువత్తూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహాబలిపురం సమీపంలోని ద్వీపంలో ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తీసుకు రావాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లోపల ఉన్నవారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, శశికళ వర్గీయులతో పాటు కువత్తూర్కు చెందిన స్థానికులు కూడా పోలీసుల చర్యలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడకు వెళ్లిన మీడియా వర్గాల మీద కూడా లోపల ఉన్నవారు రాళ్లతో దాడి చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. డీఆర్వో కూడా అక్కడకు తమ సిబ్బందితో చేరుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి అధికారులను గ్రామస్తులు బయటకు పంపేశారు. మరోవైపు లోపల ఉన్న ఎమ్మెల్యేలను మరో మార్గం గుండా బయటకు తీసుకొచ్చి, వారిని బెంగళూరు లేదా హైదరాబద్ తరలించేందుకు శశికళ వర్గం వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. వాళ్లు బయటకు వస్తే పన్నీర్ సెల్వం టీమ్‌లో చేరుతారన్నది శశి వర్గం ఆందోళనగా కనిపిస్తోంది. ఇదంతా రాజ్యాంగ సంక్షోభమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సంబంధిత వార్తలు చదవండి గవర్నర్ నిర్ణయం లేటు..ఎవరికి చేటు? ఎవరికి సీటు? పోయెస్ గార్డెన్ వెలవెల పన్నీర్‌కే 95 శాతం మద్దతు! ఎత్తుకు పైఎత్తు నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం