Gopi Chand
-
మీ మద్దతు.. మీరే నా బలం: గోపిచంద్ ఎమోషనల్ పోస్ట్
గతేడాది రామబాణం మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం ఆయన విశ్వం చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనువైట్ల డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియో బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.అయితే గోపిచంద్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ కెరీర్లో సహకరించిన నటీనటులు, డైరెక్టర్స్, నిర్మాతలకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. అభిమానుల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని.. మీరే నా బలం అంటూ పోస్టులో రాసుకొచ్చారు. మీడియా మిత్రుల సపోర్ట్ మరువలేదని గుర్తు చేసుకున్నారు. మీ మద్దతు నాకు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ.. విశ్వం సినిమాతో మళ్లీ కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. కాగా.. 2001 తొలివలపు మూవీతో గోపించంద్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జయం మూవీతో విలన్‌గా మెప్పించి.. హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 🙏❤️ pic.twitter.com/9XQhJYx7wV— Gopichand (@YoursGopichand) August 3, 2024 -
విజయవాడ వ్యక్తి సరికొత్త రికార్డు.. అంతరిక్షంలోకి గోపీచంద్
సాక్షి, ఢిల్లీ: విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. ఎన్ఎస్-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్ తోటకూర ఒకరు. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా గోపీచంద్ వెళ్లనున్నారు. విజయవాడలో జన్మించిన గోపీచంద్ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్‌గా పని చేశారు. బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా పైలట్‌గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్‌కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా, ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్‌పోర్టే ఉంది. ఆరుగురు వ్యక్తులు వీరే.. అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ సహా ముగ్గురు పర్యటకులు రోదసీయాత్ర చేశారు. తర్వాత చేపట్టబోయే ఎన్ఎస్-25 మిషన్‌కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఎన్ఎస్-25లో ప్రయాణించనున్నారు. ఇస్రో సైతం.. మరోవైపు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైతం అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఈ జాబితాలో ఉన్నారు. మన దేశం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. -
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
వాళ్లకు చేస్తున్న సాయం గురించి ఎక్కడా చెప్పుకోలేదు.. కారణం ఇదే: గోపీచంద్
విలన్ పాత్రలతో ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు గోపీచంద్. పరాజయాలు ఎదరురైనా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన నటనతో చెరగని ముద్ర వేశారు. ఆయన నుంచి సినిమా విడుదల అవుతుంది అంటూ మినిమమ్ గ్యారెంటీగా ఉంటుందని ఇండిస్ట్రీలో టాక్ ఉంది. తాజాగా ఆయన ఎ. హర్ష దర్శకత్వంలో 'భీమా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మాతగా ఉన్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గోపీ చంద్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా గోపీ ముందుంటారు. కానీ ఆయన చేస్తున్న సాయం గురించి ఎక్కడా చెప్పుకోరు. అందుకు కారణాన్ని ఆయన ఇలా చెప్పారు. 'ఇష్టంతో చేసే పనిని బయటకు చెప్పాల్సిన అవసరం ఏముంది..? నాకు ఉన్న శక్తి మేరకు కొంతమందిని చదివించాను.. వారిలో కొందరు ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. నా నుంచి సాయం పొందిన వారిలో కొంతమందికి నా పేరు కూడా తెలియదు. (ఇదీ చదవండి: వేడుకలకు పిలుపు లేదనే అక్కసుతో అనంత్ అంబానీ బరువుపై హీరోయిన్ కామెంట్లు) బాగా చదువుకోవాలనే తపన ఉండి.. అలాంటి వారికి డబ్బే అడ్డు అయితే.. తప్పకుండా సాయం చేస్తాను. ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడటానికి చదువు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే నేను చదువుకునే పిల్లలకు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నా చిన్నతనంలో ఒంగోలులో మాకు స్కూల్ ఉండేది. దానిని నాన్నగారే చూసుకునే వారు ఆయన మరణం తర్వాత మేము దాన్ని కొనసాగించలేకపోయాం. ఆ బాధ ఇప్పటికీ ఉంది. ఒక మంచి స్కూల్ పెట్టి విద్యను అందించాలని నాన్న అనుకునే వారు.' అని ఆయన అన్నారు. ఇక సినిమా విషయానికొస్తే భీమాలో అందరూ అఘోరాలు ఉన్నారని 'అఖండ'తో పోల్చుతున్నారు. కానీ ఈ చిత్రం అలా ఉండదని ఆయన గోపీ చంద్ చెప్పారు. పరశురామ క్షేత్రాన్ని బ్యాక్‌డ్రాప్‌లో తీసుకుని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. ఇది కమర్షియల్ సినిమా అయినా ఎమోషనల్‌గా ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అవుతారని అభిప్రాయపడ్డారు. -
జయం సినిమాకి నన్ను విలన్ గా ఎందుకు తీసుకున్నారు..
-
మీమర్స్ తో రచ్చ చేసిన గోపిచంద్,దింపులే హయాతి...
-
హీరో గోపీచంద్ తో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
ప్రభాస్,బాల కృష్ణ వల్ల రామబాణం దూసుకుపోతుంది
-
నాకు ప్రభాస్ కి ఇలాగే ఉంటుంది బాలయ్యకు స్పెషల్ థాంక్స్
-
మన దాకా వస్తే కానీ ఎన్టీర్,సాయి ధరమ్ తేజ్,చెపింది అర్ధం కాదు
-
రామబాణంలో సీన్ లీక్ చేసి నవ్వులు పూయించిన అలీ
-
రామబాణం బడ్జెట్ రుమౌర్స్ ఫై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్
-
రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిది: గోపీచంద్
కర్నూలు(టౌన్): రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిదని సినీ హీరో గోపీచంద్ అన్నారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో శుక్రవారం రాత్రి రామబాణం సినిమాలోని ‘దరువెయ్యరా’ పాట లాంచింగ్ ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ తన 30వ సినిమాగా రామబాణం విడుదల కానుందన్నారు. హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. -
గోపీచంద్ “రామబాణం” నుంచి ధరువెయ్ రా సాంగ్ విడుదల
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుంది. గోపీచంద్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పటకే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడదే జోష్‌తో ధరువెయ్ రా సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. జగపతిబాబు, ఖుష్బు ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్నారు. -
డిరైక్టర్ శ్రీవాస్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
సమ్మర్లో వస్తానంటున్న గోపీచంద్.. పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఖాతాలో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. 'లక్ష్యం', 'లౌక్యం' లాంటి హిట్ చిత్రాల డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా రామబాణం. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుండగా,జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. #Ramabanam hitting Theatres on May 5th!!@DirectorSriwass @vishwaprasadtg @DimpleHayathi @MickeyJMeyer @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/0sX11TXvc1 — Gopichand (@YoursGopichand) March 4, 2023 -
బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
బాలయ్య హోస్ట్‌గా ఎన్బీకే విత్ అన్‌స్టాపబుల్ షో సీజన్-2 సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్టుగా హాజరవడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఈవెంట్లకు తప్పా బయట ఎక్కడా అంతగా కనిపించరు. అలాంటిది బాలయ్య షోకు ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ షోకు ప్రభాస్ తన స్నేహితుడు, హీరో గోపీచంద్‌తో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ మరో హైలైట్‌గా నిలిచింది. ఎక్కువగా బ్లాక్ షర్ట్‌లో కనిపించే ప్రభాస్ ఎన్బీకే షోలో మాత్రం కలర్ఫుల్గా కనిపించారు. దీంతో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ఏ బ్రాండ్? దాని ధరెంత అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ప్రభాస్ వేసుకున్న షర్ట్ `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్' కంపెనీకి చెందినదట. దీని ధర సుమారు 115 పౌండ్స్ ఉంటుందట. అంటే అక్షరాలా ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.11,618/. ఏది ఏమైనా ప్రభాస్ ఈ షర్ట్‌లో మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారని, ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
హీరో గోపీచంద్ చిన్నకొడుకును చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో..
మ్యాచో హీరో గోపీచంద్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరన్న సంగతి తెలిసిందే. సినిమాలు తప్ప ఆయన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాల్లో చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా గోపీచంద్ తన చిన్న కొడుకు వియాన్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సులో కనిపించారు. ఫోటోలకు ఫోజులిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న వియన్ క్యూట్ లుక్స్ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో లౌక్యం, లక్ష్యం చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ఆయన నాకెప్పటికీ హీరోలా కనిపిస్తారు
‘‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, అందర్నీ అలరిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఫుల్ మీల్స్‌లాంటి సినిమా.. ఎంజాయ్ చేయండి. మళ్లీ థియేటర్లు కళకళలాడాలి’’ అన్నారు చిరంజీవి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ అద్భుతమైన దర్శకుడు. కళాశాలలో నా సీనియర్ అయిన ఆయన నాలోని భయాన్ని పోగొట్టి ప్రోత్సహించారు.. అందుకే నాకెప్పుడూ ఒక హీరోలాగా కనిపిస్తుంటారాయన. ఆయన లేకున్నా ఇండస్ట్రీపై తన ప్రేమను గోపీచంద్ ద్వారా కురుపిస్తున్నారాయన. గోపీచంద్ సినిమాల్లో నాకు ‘సాహసం’ బాగా నచ్చింది. ‘ఒక్కడున్నాడు, చాణక్య’ వంటి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా ఎదిగాడు. మారుతి సినిమాల్లో ‘ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ సినిమాలు నాకు బాగా నచ్చాయి. అన్ని హంగులున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా తన గత సినిమాలను మించి ఆడాలని కోరుకుంటున్నాను. మారుతి దర్శకత్వంలో నేను హీరోగా యూవీ క్రియేషన్స్‌లో వంశీ, విక్కీలతో సినిమా ఉంటుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ తీసిన ‘ప్రతిఘటన’ చూసి చిరంజీవిగారితో మా బ్యానర్లో ఓ సినిమా చేయమని అడిగాను.. దురదృష్టవశాత్తు ఆయన మనతో లేరు. ఆ తర్వాత ఇన్నేళ్లకు గోపీచంద్‌తో మా బ్యానర్లో ఓ మంచి సినిమా చేయడం హ్యాపీ. ప్రేక్షకులను నవ్వించే శక్తి ఈవీవీ సత్యనారాయణగారికి ఉండేది.. ఇప్పుడు మారుతికి ఉంది’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చి మహావృక్షంలా నిలబడ్డారంటే ఆయన పట్టుదల వల్లే. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఇప్పటికీ ఇండస్ట్రీకి వస్తుండటం గ్రేట్. మారుతికి మంచి ప్రతిభ ఉంది. ‘పక్కా కమర్షియల్’ సినిమా తర్వాత తను మరింత మంచి స్థాయికి ఎదుగుతాడు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహనిర్మాత ఎస్కేఎన్, యూవీ క్రియేషన్స్ వంశీ, విక్కీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. ఫిబ్రవరి 2 సిరివెన్నెల చివరి పాట
‘పక్కా కమర్షియల్’ సినిమా కోసం జననం... మరణం గురించి దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన పాట ఫిబ్రవరి 2న విడుదల కానుంది. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘‘సిరివెన్నెలగారు రాసిన చివరి పాట ఇది. ఈ స్ఫూర్తిదాయకమైన పాట భావోద్వేగంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘మరణం గురించి ముందే తెలిసినట్లు సిరివెన్నెలగారు కొన్ని పదాలను ఈ పాటలో సమకూర్చారు’’ అన్నారు మారుతి. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్లా, సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు. -
‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది..
Aaradugula Bullet Movie Trailer Is Out: గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కామెడితో పాటు యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు.'పరిచయం అయితే నేను మర్చిపోను. పంగా అయితే నువ్వు మర్చిపోలేవు, ‘డబ్బులిచ్చే నాన్నను చూసి ఉంటావు… అప్పులిచ్చే నాన్నను ఎక్కడైనా చూశావా?' వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్8న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
Aaradugula Bullet Movie: బుల్లెట్ వస్తోంది
‘బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర’.. వంటి పలు హిట్ చిత్రాలు తీసిన బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. గోపీచంద్–నయనతార జంటగా నటించారు. తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్లలోకి దూసుకురానుంది. ఈ సందర్భంగా తాండ్ర రమేష్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్, నయనతార నటన, బి. గోపాల్ డైరెక్షన్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నేనే సొంతంగా విడుదల చేస్తున్నాను’’ అన్నారు. -
Book Review: తేనెటీగ కాదది విషపు తేలు
‘తేనెటీగ కాదది విషపుతేలు’ పుస్తక సంపాదకులు ఈదర గోపీచంద్ అంకిత భావం గల గాంధేయవాది. 1988 అక్టోబర్‌లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో మల్లాది వెంకటకష్ణమూర్తి మందారమకరందాన్ని మించిన సెక్సైటింగ్ నవల ప్రచారంతో ‘తేనెటీగ’ను సీరియల్‌గా ప్రచురించడం ప్రారంభించాడు. అందులో బూతుజోకులు, అసభ్యరేఖాచిత్రాలు పాఠకులపై విషం చిలకరిస్తున్న డర్టీ సీరియల్‌ను గోపీచంద్ చదివి అశ్లీల ప్రతిఘటనా వేదిక ద్వారా సీరియల్ ప్రచురణ ఆపించేందుకు మూడేళ్లపాటు (1989–91) అవిరళపోరాటం చేశాడు. ఒక సామాన్యకార్యకర్తగా ఆయన మొదలుపెట్టిన ఉద్యమం ప్రముఖ రచయితలు, 16 అభ్యుదయసంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు, స్వాతంత్య్రసమరయోధులు, మహిళలు, విద్యార్థినులను భాగస్వాములుగా చేసి మహోన్నత సాంఘికపోరాటంగా మలచి విజయం సాధించాడు. ఈ నవలను తర్వాత సినిమా తీసేటప్పుడు అశ్లీల ప్రతిఘటనా వేదిక తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. రచయిత మల్లాది ఆంధ్ర భూమి దినపత్రికలో తన వాదాన్ని, సమర్ధించుకుంటూ ‘రచయితలకు స్వేచ్ఛ లేదా? అనే వ్యాసాన్ని రాశాడు. ప్రముఖ పాత్రికేయులు, అప్పటి ఆంధ్రభూమి సంపాదకులు డా. ఎ.బి.కె. ప్రసాదు ‘అక్షరం’ శీర్షికలో చర్చావేదిక ప్రారంభించారు. ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ మల్లాది వాదాన్ని ఖండిస్తూ సుదీర్ఘమైన వ్యాసం రాశారు. నిఖిలేశ్వర్, పాపినేని శివశంకర్, విరసం కృష్ణాబాయి, కొత్తపల్లి రవిబాబు, బీరం సుందరరావు, రావి రంగారావు వంటి రచయితలు మల్లాదిపై ఎదురు దాడి చేసి రచయిత స్వేచ్ఛకు హద్దులుండాలనీ, బాధ్యతలుండాలనీ సూచించారు. ప్రజాసాహితి, అరుణతార వంటి పత్రికలు ఈ చర్చను కొనసాగించాయి. ఎందరో రచయితలు తమ అభిప్రాయాలను వ్యాసాలుగా రాశారు. ఈ పోరాట ఫలితంగా గోపీచంద్ విజయం సాధించినట్టే సంపాదకుడు ఈ పుస్తకాన్ని 11 అధ్యాయాలుగా వర్గీకరించి విశ్లేషణాత్మకంగా సమగ్ర సమాచారంతో రూపొందించాడు. ప్రతి అధ్యాయం ఆరంభంలో ప్రధానమతాల నుంచీ లేదా మహా పురుషుల రచనల నుంచి నైతిక విలువలను బోధించే సూత్రాలతో ప్రచురించడం ఔచిత్యంగావుంది. మొదట అధ్యాయం నాందిలో ఈ ఉద్యమానికి ప్రేరకులు న్యాయవాది కాంతారావు గారి సహకారాన్ని వివరించారు. తక్కిన అధ్యాయాల్లో ఆంధ్రభూమి ‘అక్షరం’ శీర్షికలో వచ్చిన ప్రముఖ రచయితల వ్యాసాలు, పాఠకుల, ప్రేక్షకుల స్పందనలను చేర్చారు. అనుబంధంతో కేంద్రమంత్రి ఉపేంద్రగారితో ఉత్తర ప్రత్యుత్తరాలను తేనెటీగ కన్నడ అనువాదం ‘భ్రమరం’ ఆపాలన్న డిమాండ్ వంటివి చేర్చారు. గోపీచంద్ పోరాట ఫలితంగా మూడు దశాబ్దాలకు (2020) రచయిత మల్లాది పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ గోపీచంద్ నిజాయితీని ప్రశంసించారు. చెత్త నవలలను పునర్ ముద్రించనని ప్రతిజ్ఞ చేశాడు. అశ్లీల ప్రతిఘటనా ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరాడు. సామాజిక పోరాటస్పూర్తితో, పాత్రికేయ అనుభవంతో సంపాదకులు ఈ గ్రంధాన్ని సముచితంగా కూర్పు చేశారు. పాత్రికేయ, సాహితీ, నైతిక, సామాజిక, అభ్యుదయ ప్రగతి భావుకులు విధిగా చదవదగిన గ్రంధం ‘తేనె టీగ కాదది విషపు తేలు’. – డా. పి.వి. సుబ్బారావు తేనె టీగ కాదది విషపు తేలు వెల 120/రూ.; పేజీలు 196. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం. వివరాలకు: ఈదర గోపీచంద్ 9440345494 -
'వేశ్య'గా యాంకర్ అనసూయ!
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న ఓ సినిమాలో అనసూయ నటించనుంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని మూవీ టీం వెల్లడించింది. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాశి ఖన్నా, ఈషా రెబ్బా కథానాయుకలుగా నటించున్నట్లు సమాచారం. చదవండి : (అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!) (వైరల్ అవుతున్న దీపికా పదుకొనె డ్యాన్స్ వీడియో) -
గోపీచంద్- మారుతి సినిమా టైటిల్ ఇదే
మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫిబ్రవరి 14) ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. Bless us my next with Macho star @YoursGopichand garu#PakkaCommercial It is..👌#AlluAravind #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/SsAM9brNJ3 — Director Maruthi (@DirectorMaruthi) February 14, 2021