Government employment
-
కారుణ్య నియామకాలు హక్కు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వోద్యోగం పొందేందుకు వాటిని హక్కుగా భావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు ఈ మేరకు వెలువరించింది. ‘‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగి మరణంతో ఆయన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దన్నది మాత్రమే కారుణ్య నియామకాల వెనక ఉన్న సదుద్దేశం. అందుకోసం సదరు నియామకానికి అవసరమైన నియమ నిబంధనలను విధిగా సంతృప్తి పరచాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది. -
ప్రభుత్వోద్యోగ గణాంకాలతో వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్సైట్ www.telanganajobstats.in ను మంత్రి కె. తారక రామారావు మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్... దీనిపై వాస్తవ సమాచారాన్ని వెల్లడించేందుకే ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీ వివరాలను అందులో పొందుపరిచినట్లు వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతీ యువకులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కోరారు. గత తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించామని, వాటిలో 1.60 లక్షలకుపైగా ప్రభుత్వోద్యోగాల భర్తీని పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. -
మోదీ సర్కారుకు మరోసారి ప్రశ్నాస్త్రాలు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి మోదీ సర్కారుపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, వారు ఎంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలే లేవు. ఒకవేళ అవకాశం వస్తే పేపర్ లీక్ అవడం, ఎగ్జామ్ పెట్టినా ఫలితాలు ప్రకటించకపోవడం, లేదంటే ఏదో స్కామ్ కారణంగా క్యాన్సిల్ కావడం జరుగుతోంది. 1.25 కోట్ల మంది యువకులు రైల్వే గ్రూప్ డి ఉద్యోగ ఫలితాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలోనూ అదే పరిస్థితి. భారతదేశంలోని యువత ఎప్పటి వరకు ఓపిక పట్టాలి?’ అని వరుణ్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (UPTET)ని రద్దు చేస్తూ గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వరుణ్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ లీక్ అయినట్టు వార్తలు రావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (చదవండి: మేము లేకుండా బీజేపీని ఓడించలేరు) ‘యూపీ టెట్ పరీక్ష పేపర్ లీక్ అనేది లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకోవడం లాంటిది. కిందిస్థాయి అధికారులపై చర్య తీసుకోవడం ద్వారా దీనిని అడ్డుకోలేము. విద్యా మాఫియా, వారిని పోషిస్తున్న రాజకీయ నాయకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా విద్యాసంస్థలు రాజకీయ పలుకుబడి కలిగిన వారి ఆజమాయిషిలో ఉన్నాయి. వాటిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?’ అని వరుణ్ గాంధీ ప్రశ్నించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా కూడా ఆయన గళం వినిపించిన సంగతి తెలిసిందే. (చదవండి: గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పరిస్థితి కనించటం లేదు) -
ఆ పరీక్షలకు నెగిటివ్ మార్కులు లేవు: ఏపీపీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలలో నెగిటివ్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టే అంశంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. నెగిటివ్ మార్కుల విధానంపై న్యాయపరమైన సలహా కోసం నిపుణులను సంప్రదిస్తున్నామని, వారినుంచి సలహా సూచనలు వచ్చాక, ప్రభుత్వ అనుమతి తీసుకొన్నాకనే ముందుకు వెళ్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ మంగళవారం వివరించారు. ఇప్పటికే ఏపీపీఎస్సీ జారీచేసిన వివిధ నోటిఫికేషన్లలోని పరీక్షలకు ఈ నెగిటివ్ మార్కులు ఉండబోవని స్పష్టంచేశారు. ఏపీపీఎస్సీ ఇంతకు ముందు వివిధ విభాగాల్లోని 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఆగస్టు 17న నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 30న వివిధ శాఖల్లో పలు పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. గతంలోని నోటిఫికేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా కొత్త నోటిఫికేషన్ల పోస్టుల భర్తీకి బుధవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి నిర్వహించే పరీక్షలకు నెగిటివ్ మార్కుల విధానం ఉండబోదని ఉదయభాస్కర్ చెప్పారు. ఈ నోటిఫికేషన్ల పరీక్షలకు నిర్వహించే ప్రిలిమనరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఓఎమ్మార్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చైర్మన్ చెప్పారు. ఏఈఈ పోస్టులకు ఇప్పటికే 71వేల దరఖాస్తులు అందగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మలివిడత నోటిఫికేషన్లకు కూడా భారీగానే దరఖాస్తులు వస్తాయని ఏపీపీఎస్సీ అంచనా వేస్తోంది. -
మీన‘వేషాలు’
- పింఛన్ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు - నిధుల రికవరీలో నిర్లక్ష్యం వివరాలు ఇవ్వని రెండు - మున్సిపాలిటీలు, నాలుగు మండలాలు.. ఇందూరు : ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందినా.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాల లబ్ధికి అర్హులు కాదు. కానీ.. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 2,844 మంది ప్రభుత్వం నుంచి నెలనెలా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, బీడీ, ఇతర పింఛన్ల రూపంలో డబ్బులు పొందుతున్నారు. పింఛన్లపై తనిఖీలు చేపట్టిన సమయంలో అధికారులు గుర్తించి పింఛన్లను తొలగించారు. రూ.2 కోట్ల 24 లక్షల 94 వేలు సర్కారు ఖజానాకు గండి పడినట్లు లెక్క తేల్చారు. ఇది కేవలం జిల్లాలోని 32 మండలాలు, రెండు మున్సిపాలిటీలకు సంబంధించినవే. ఇంకా రెండు మున్సిపాలిటీలు, నాలుగు మండలాల నుంచి వివరాలు పంపడంలో అక్కడి అధికారులు, ఎంపీడీఓలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సదరు మున్సిపాలిటీలు, మండలాల నుంచి కూడా వివరాలు అందితే అదనంగా రూ.3 కోట్లు పెరిగే అవకాశం ఉంది. ఇదిలాఉండగా అధికారులు ఇప్పటివరకు కేవలం రూ. 63,36,500 రికవరీ చేశారు. నిధులు రికవరీ చేయాలని ఎన్నిసార్లు ఉన్నతాధికారులు చెప్పినా అధికారులు, ఎంపీడీఓలు బాధ్యతగా తీసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వారి జాడ తెలీదు.. ప్రభుత్వం నుంచి నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందిన వారి వివరాలు ఎంపీడీఓలకు తెలియడం లేదని చెప్తున్నారు. ఆధార్ కార్డులు లేకుండానే పింఛన్లు ఇవ్వడంతో ఈ సమస్య ఏర్పడింది. వారి చిరునామాలు తెలియరాకపోవడంతో నోటీసులు జారీ చేయడానికి వీలు కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న, ఉద్యోగం చేసిన పదవీ విరమణ పొందిన వ్యక్తులు ఎక్కడున్నారో, పెన్షన్లు పొందిన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో అంతుచిక్కడం లేదు. వారిని గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే కొంత మందిని గుర్తించిన అధికారులు వారికి నిధులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి నిధులు జమ చేయడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వేతన బిల్లులు చేసే అధికారి నోటీసు ఇచ్చి అతని వేతనాల నుంచి నిధులు కోత విధించాలని సూచించారు. ఇటు పదవీ విరమణ పొందిన వ్యక్తి పెన్షన్ డబ్బుల్లోంచి కోత విధించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఇలా కొంత మంది నుంచి రూ.63.36 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి. వివరాలు ఇవ్వని మున్సిపాలిటీలు, మండలాలు ఆర్మూర్, కామారెడ్డి మున్సిపాలిటీలతోపాటు బిచ్కుంద, కామారెడ్డి, సిరికొండ, ఎడపల్లి మండలాలు ఉన్నారుు. -
కొడుకు ఉద్యోగం కోసం భర్త హత్య
గుంతకల్లు : కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఓ మహిళ కట్టుకున్న భర్తను కొడుకు సహాయంతో అంతమొందించిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది. గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు, బంధువుల కథనం మేరకు.. విద్యుత్ శాఖలో లైన్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సాల్మన్‌రాజు (48) కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు రోడ్డులో నివాసముంటూ మండల కేంద్రమైన యాడికిలో విధులు నిర్వర్తించేవాడు. ఇతనికి భార్య ప్రేమలత, కుమారుడు శశాంక్ (24), కుమార్తె స్వరూప(20) ఉన్నారు. తాగుడుకు బానిసైన సాల్మన్‌రాజు విధుల్లో తనకు సహాయంగా కుమారుడిని వెంట తీసుకువెళ్లేవాడు. ఈ నేపథ్యంలో భర్తను చంపితే కుమారుడికి ఉద్యోగం వస్తుందని భావించిన ప్రేమలత.. గురువారం మద్యం మత్తులో ఉన్న భర్తను కుమారుడితో కలిసి చితకబాది కిందికి తోసింది. ఈ క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. మెట్లపై నుంచి కిందపడ్డాడని నాటకమాడారు. స్థానికంగా ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి సాల్మన్‌రాజు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. శనివారం ఉదయం మృతదేహాన్ని సంప్రదాయం ప్రకారం ప్రభాత్నగర్లోని సీఎస్ఐ చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేయించారు. అంతలో సాల్మన్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన బంధువులు వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాల్మన్‌రాజు భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో వాస్తవం వెలుగు చూసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
రూ.31 లక్షలకు ఏఎంవీఐ ఉద్యోగం!
- నిరుద్యోగులను మోసం చేసేందుకు రంగంలోకి ముఠా - నలుగురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సాక్షి, హైదరాబాద్: ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలుగన్న ఓ యువకుడిని ఓ ముఠా బుట్టలో వేసుకుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష ద్వారా ఎంపిక చేసే అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి.. ఏకంగా రూ.17.88 లక్షలు కాజేసింది. తమ ముఠాలో ఒకరిని టీఎస్పీఎస్సీ ఉద్యోగిగా చూపిస్తూ సొమ్ము వసూలు చేసింది. చివరికి సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకుని మాయమైపోయింది. ఏఎంవీఐ పోస్టుల ఫలితాల్లో తన పేరు లేకపోవడంతో బాధితుడు లబోదిబోమంటూ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి పరుగెత్తాడు. అక్కడ తనకు ‘హామీ ఇచ్చిన ఉద్యోగి’ ఎవరూ లేకపోవడంతో హతాశుడయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. వెంటనే టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి ఆ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి, రూ.15.88 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెండుసార్లు విఫలం కావడంతో... కృష్ణా జిల్లాకు చెందిన పామర్తి శ్రీనివాసరావు గతంలో రెండు సార్లు పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షలు రాసినా ఉద్యోగం సాధించలేకపోయాడు. ఈసారి టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఎంవీఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశాడు. ఎలాగైనా ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో అన్ని రకాల ప్రయత్నాలూ మొదలుపెట్టాడు. మాజీ ఎమ్మెల్యే రామారావును కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన శ్రీనివాసరావుకు జూబ్లీహిల్స్‌లో నివసించే ఎం.తిరుపతయ్య అలియాస్ తిరుమలరాజుతో పరిచయమైంది. కృష్ణా జిల్లాకే చెందిన తిరుపతయ్య బేగంపేటలోని రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ చీఫ్ ట్రైనర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న శ్రీనివాస్... తనకు ఏఎంవీఐ ఉద్యోగం వచ్చేలా పైరవీ చేయాలని తిరుపతయ్యను కోరాడు. తిరుపతయ్య ఈ విషయాన్ని తమ కార్యాలయంలో పనిచేస్తున్న సయ్యద్ ఖమర్ హుస్సేన్‌కు చెప్పాడు. ఖమర్ సూచనల మేరకు తిరుపతయ్య, మీర్ కర్రార్ అలీ, మహ్మద్ అలీలను సంప్రదించాడు. అందరూ కలసి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి సొమ్ము దండుకునేందుకు ప్లాన్ వేశారు. లిస్టుల్లో పేరు రాకపోవడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఏఎంవీఐ పోస్టులకు ఎంపికైన వారి తొలి జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అందులో తన పేరు లేకపోవడం గుర్తించిన శ్రీనివాస్ దీనిపై తిరుపతయ్యను సంప్రదించగా రెండో జాబితాలో ఉంటుందని చెప్పాడు. అదే రోజు శ్రీనివాస్‌ను సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌కు పిలిపించిన తిరుపతయ్య, యాకూబ్ అలీ తదితరులు ఉద్యోగం కచ్చితంగా వస్తుందని నమ్మబలికి మరో రూ.5.88 లక్షలు తీసుకున్నారు. అయితే ఈ నెల 13న టీఎస్పీఎస్సీ విడుదల చేసిన రెండో జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో శ్రీనివాస్‌కు అనుమానం వచ్చింది. దీంతో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి ఆరా తీసి... కోటేశ్వరరావు ఎవరూ లేరని గుర్తించాడు, దీనికితోడు తిరుపతయ్య తదితరుల సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండడంతో మోసపోయినట్లు గుర్తించాడు. రూ.31లక్షలకు ఒప్పందం శ్రీనివాస్‌ను ఓ పథకం ప్రకారం తిరుపతయ్య, మీర్ అలీ, మహ్మద్ అలీలు హైదరాబాద్‌లో అబిడ్స్‌లోని ఓ హోటల్‌కు రప్పించారు. తమకున్న పరిచయాలతో ఏఎంవీఐ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.31లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా రూ.2లక్షలు తీసుకున్నారు. డిసెంబర్లో శ్రీనివాస్ నుంచి తిరుపతయ్య మరో రూ.10లక్షలు తీసుకున్నాడు. అయితే మీర్ కర్రార్ అలీ, మహ్మద్ అలీ నుంచి సరైన స్పందన లేకపోవడం, శ్రీనివాస్ నుంచి ఒత్తిడి పెరగడంతో తిరుపతయ్య మరో పథకం వేశాడు. జీడిమెట్లలోని ఓ ఫైబర్ కంపెనీలో అకౌంటెం ట్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడు షేక్ యాకూబ్ అలీని కోటేశ్వరరావు పేరుతో శ్రీనివాస్‌కు పరిచయం చేశాడు. కోటేశ్వరరావు టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ సెక్షన్లో పనిచేస్తున్నట్లు శ్రీనివాస్‌ను నమ్మించి, అతని ద్వారా ‘పని’ అవుతోందని చెప్పాడు. వెంటనే స్పందించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన శ్రీనివాస్ ద్వారా చైర్మన్ ఘంటా చక్రపాణికి ఈ వ్యవహారం తెలిసింది. ఆయన వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి... శుక్రవారం తిరుపతయ్య, యాకూబ్, మహ్మద్ అలీ, మీర్ కర్రార్ అలీలను అరెస్టు చేసింది. వారి నుంచి రూ.15.88 లక్షల నగదు, నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకుంది. టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే నియామకాలన్నీ పారదర్శకంగా ఉంటాయని, ఎవరూ దళారుల్ని నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సూచించారు. -
అమరుల కుటుంబానికో ఉద్యోగం
♦ జూన్ 2న నియామక పత్రాల పంపిణీ ♦ 23న జిల్లా కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ ♦ కొత్త జిల్లాలు, అవతరణ వేడుకల ఎజెండా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే నెల 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉద్యోగ నియామక పత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కొందరికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు. ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబ సభ్యులు సూచించిన వ్యక్తికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని, కనీస విద్యార్హతలు లేకున్నా ఉద్యోగమిచ్చి, అర్హతలు సాధించడానికి అయిదేళ్ల సమయం ఇవ్వాలని సీఎం సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణ, ఈ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు రేమండ్ పీటర్, బీఆర్ మీనా, శివశంకర్, వెంకటేశ్వర్లు, శాంతకుమారి, వరంగల్ కలెక్టర్ కరుణ, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాకో మంత్రికి బాధ్యతలు... జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పతాకావిష్కరణ, అవార్డుల ప్రదానం, తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. వరంగల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మెదక్‌లో హరీశ్‌రావు, ఆదిలాబాద్‌లో జోగు రామన్న, నిజామాబాద్‌లో పోచారం శ్రీనివాసరెడ్డి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డిలో మహేందర్‌రెడ్డి, నల్గొండలో జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు, కరీంనగర్లో ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్... రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు, అమర వీరుల కుటుంబాలకు ఉద్యోగాలు, భూ వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 23న ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపైనా ఈ సందర్భంగా చర్చించే అవకాశముంది. -
వీఆర్ఏల ‘వేతన’ వ్యథ..!
♦ పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ♦ కనీస వేతనం మాత్రం లేదు ♦ రూ.6 వేల నెల వేతనంతో సేవలందిస్తున్న 24 వేల మంది ♦ కనీస పేస్కేలు వర్తింప చేయాలని,పదోన్నతుల కోటా పెంచాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. కనీస వేతనం మాత్రం లేదు.. ఇస్తామన్న వేతనమైనా నెలనెలా రాదు. ఆ వచ్చేది కూడా వరద బాధితుల పద్దులోంచే. నాడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటపుడు పార్ట్‌టైమ్ ఉద్యోగమే అన్నారు. కానీ, ఇప్పుడు ఫుల్‌టైమ్ పని చేయిస్తున్నారు. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తోన్న 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) వేతన వ్యథ. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు చేర్చడంలో, గ్రామాల్లోని భూముల పరిరక్షణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, తమ బాధలను ప్రభుత్వ పెద్దలుగానీ, ఉన్నతాధికారులుగానీ పట్టించుకోవడం లేదని వీఆర్ఏలు వాపోతున్నారు. తెలంగాణ ఏర్పడితే తమ కష్టాలు తొలిగిపోతాయని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని, అయితే రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా వీఆర్ఏల దుస్థితి గురించి పాలకులు పట్టించుకోవడం లేదని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆరోపిస్తోంది. చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాలను పోషించలేని పరిస్థితి నెలకొందని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల సంఘం(డెరైక్ట్ రిక్రూట్మెంట్) ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యావంతులే వీఆర్ఏలుగా.. 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ కనీస విద్యార్హతతో వీఆర్వో, టెన్త్ విద్యార్హతతో వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీలు, పీజీలు(ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సులు) చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు వీటికి దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షలో ప్రతిభ కనబరిచిన కొంతమంది వీఆర్వోలుగానూ, మరికొంత మంది వీఆర్ఏలుగానూ నియమితులయ్యారు. వీఆర్ఏల నియామకాల సమయంలో పార్ట్‌టైమ్ ఉద్యోగమే కనుక నెలకు రూ.3 వేలు చొప్పున వేతనం ఇచ్చిన ప్రభుత్వం, వారు ఆందోళన చేయడంతో దానిని రూ.6 వేలకు పెంచింది. అయితే.. రెవెన్యూ వ్యవస్థలో పెరిగిన పనిభారం, మండల స్థాయిలో సిబ్బంది కొరత కారణంగా వీఆర్ఏలకు అదనపు పనులను అప్పగిస్తున్నారు. గ్రామంలో పనితో పాటు మండల, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ పూర్తిస్థాయిలో అదనపు విధులు నిర్వహిస్తున్నా వేతనం మాత్రం పెరగలేదు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వీఆర్ఏలు.. పేరుకే ప్రభుత్వ ఉద్యోగులు. వారికి కనీస వేతన స్కేలును అప్పటి ప్రభుత్వం వర్తింపజేయలేదు. ఇదే రెవెన్యూ శాఖలో ఏడో తరగతి కనీస విద్యార్హతతో పనిచేస్తున్న అటెండర్ వేతనం వీఆర్ఏల కంటే మూడు రె ట్లు అధికంగా ఉండడం గమనార్హం. తెలంగాణ ఏర్పడినాక ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతం చేయడంలో వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల పంపిణీ, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి తదితర పథకాలకు అర్హులను గుర్తించడంలోనూ వీఆర్ఏల కృషి ఎంతో ఉంది. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత ్వంగా చెబుతున్న పెద్దలు తమ బాధలను అర్థం చేసుకుని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే వేతనాలు, సదుపాయాలు కల్పించాలని వీఆర్ఏలు కోరుతున్నారు. అటెండర్‌కు ఇచ్చే వేతనమైనా ఇవ్వమంటున్నాం మాకంటే తక్కువ విద్యార్హతతో పనిచేస్తున్న అటెండర్‌కు ఇచ్చే వేతన స్కేలును మాకూ వర్తింపజేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులై మూడేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేసుకున్న వీఆర్ఏలకు వీఆర్వో లేదా జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలి. వీఆర్ఏలకు పదోన్నతుల కోటాను 30 నుంచి 70 శాతానికి పెంచాలి. 010 పద్దు ద్వారా నెలనెలా వేతనం చెల్లించాలి. - ఈశ్వర్, తెలంగాణ వీఆర్ఏ(డెరైక్ట్ రిక్రూట్ మెంట్)ల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు -
మొహిసీన్‌కు డాడీ
► దేశానికి సిపాయి. ► అల్లాకి ముద్దుబిడ్డ. ► మొహిసీన్కి డాడీ. ► నేడు అమరుడు. ► మంచుకు కన్నీళ్లుండవు. ► అది కరిగి ఉంటే ముస్తాక్ బతికేవాడు. ► ముస్తాక్ కుటుంబానికి కన్నీళ్లున్నాయి. ► వాటికి మనం కరగాలి. మూడు కారణాలు ముస్తాక్ అహ్మద్‌ను ఆర్మీ వైపు కవాతు చేయించాయి. దేశంపై ఉన్న ప్రేమ. తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ. కుటుంబంపై ఉన్న ప్రేమ. దేశంపై ప్రేమతో సిపాయి అయ్యాడు. అమ్మానాన్నలపై ప్రేమతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వారి కల నెరవేర్చాడు. కుటుంబంపై ప్రేమతో బాధ్యతల మంచు పర్వతాన్ని భుజాలపైకి ఎత్తుకున్నాడు. ఆ రోజు నసీమూన్‌కు బాగా గుర్తు. ‘ఎంత! ఆరు నెలల్లో మళ్లీ వస్తాను, రంజాన్‌కి’ అన్నాడు. వెళుతూ వెళుతూ కొడుకును ముద్దాడాడు. వదల్లేక వదల్లేక వెనక్కొచ్చి మళ్లీ ముద్దాడాడు. అప్పటికి సయ్యద్ మొహిసీన్ వయసు పదిహేను రోజులు. 2015 ఆగస్టు 3న పుట్టాడు. వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు.. ‘ఉండిపోకూడదా..’ అన్నట్లు చూసింది భార్య. ‘మిమ్మల్ని చూడకుండా ఉండగలనా?’ అన్నట్లు భార్యాబిడ్డల్ని చూసుకున్నాడు ముస్తాక్. కానీ తాను ఇక్కడుంటే కుటుంబం మాత్రమే బాగుంటుంది. అదే సరిహద్దుకు వెళ్తే దేశమంతా భద్రంగా ఉంటుంది. అదే మాట భార్యతో అన్నాడు. బయల్దేరాడు. ఏడు రోజుల నిరీక్షణ! మంచుకొండల్లో చిక్కుకున్న ముస్తాక్ ఆచూకీ కోసం తల్లిదండ్రులతో పాటు భార్య ఎదురుచూపులు! అతడు క్షేమంగా తిరిగి రావాలన్న దేశ ప్రజల ఆకాంక్ష! అన్నీ నిష్ఫలమయ్యాయి. ఆత్మీయుల హృదయాలు మూగబోయాయి. అంతలోనే కూలిపడ్డ మంచు కొండ చరియల్లోంచి పది మంది సైనికుల్లో ఒకరు బయటపడ్డారనే సమాచారం! ఎక్కడో మినుకు మినుకు మంటూ చిన్న ఆశ. ఆ వెంటనే దిగ్భ్రాంతి. మిగిలిన వారెవరూ బతికిలేరనే ప్రకటన ! ముస్తాక్ కుటుంబంలో విషాదం. కన్నీరు మున్నీరు ‘...నీ ఆరోగ్యం జాగ్రత్త... బాబును బాగా చూసుకో.. ఆరునెలల్లో వస్తా.. అందరం కలసి మూడు రోజులు.. నీ పుట్టిన రోజు, నా పుట్టిన రోజు, మన అబ్బాయి పుట్టిన రోజు, మన పెళ్లి రోజు అన్నీ జరుపుకుందాం’ అని చెప్పి వెళ్లాడు. వెళ్లిన ఈ మూడు నెలల్లో ఆరంటే ఆరుసార్లు మాట్లాడాడు. అది కూడా ఒక్కొక్క నిమిషమే. డ్యూటీ ఎత్తై మంచు పర్వతాల్లో.. ప్రమాదకరమైన ప్రదేశంలో.. సియాచిన్‌లో.. అంటూ వెళ్లాడు. మొన్న ఫిబ్రవరి 3న కూడా ఫోన్ చేసి ‘బాగున్నా’ అని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే వినలేని వార్త..’ అంటూ ముస్తాక్ భార్య నసీమూన్ కన్నీటి పర్యంతమైంది. నసీమూన్ది నంద్యాల పట్టణంలోని సాదిక్ నగర్ . ముస్తాక్‌ది బండిఆత్మకూరు మండలం పార్నపల్లె. ఇద్దరికీ 2014 ఆగస్టు 7న వివాహమైంది. అప్పట్లో ముస్తాక్ పంజాబ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. వివాహం తర్వాత భార్య నసీమూన్ను నవంబర్‌లో తనతో పాటు పంజాబ్ తీసుకొని వెళ్లాడు. భార్య గర్భవతి కావడంతో 2015 ఏప్రిల్‌లో నంద్యాలకు తీసుకొచ్చి ఆమె పుట్టింట్లో వదిలి వెళ్లాడు. మధ్యలో ఆరు నెలల ఎడబాటు. కాన్పు సమయంలో తన దగ్గరే ఉండాలని నసీమూన్ పట్టుపట్టడంతో నెల రోజులు సెలవు పెట్టి వచ్చాడు. ఆగస్టులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది నసీమూన్. బిడ్డను చూసుకున్న ముస్తాక్ అహ్మద్ జీవితంలో ఆనందం వెల్లి విరిసింది. దంపతులిద్దరూ కొడుకు పేరు కోసం ఆలోచించారు. అందంగా ఉన్న కుమారుడిని సయ్యద్ మొహిసీన్ అంటూ పిలుచుకున్నారు. ముస్తాక్ తిరిగి పంజాబ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్లో రెండు నెలలు విధులు నిర్వహించాక 2015 డిసెంబర్లో తనను సియాచిన్‌కు బదిలీ చేశారని.. అక్కడ పరిస్థితి కష్టంగా ఉంటుందని, వాతావరణం అనుకూలంగా ఉండదని, ఆరునెలల తర్వాత తిరిగి వస్తానని భార్యకు ఫోన్లో చెప్పి ఎత్తై మంచుపర్వతాల్లోకి వెళ్లాడు ముస్తాక్. సాధారణ రైతు కుటుంబం కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలంలోని పార్నపల్లె గ్రామానికి చెందిన ఇబ్రహీం, నజీమున్నిసా దంపతుల కుమారుడు ముస్తాక్. వ్యవసాయమే ఆ కుటుంబానికి ఆధారం. నాలుగు ఎకరాల పొలం సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చివరి సంతానమైన ముస్తాక్ బండిఆత్మకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత నంద్యాలలోని నేషనల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2004లో ఉద్యోగంలో చేరి 11 ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేశాడు. ఎముకలు కొరికే చలిలో... మిలటరీలో ఉద్యోగం చేస్తున్న ముస్తాక్ అహ్మద్ మద్రాస్ బెటాలియన్‌లో పని చేశాడు. మంచుకొండల్లో విధులు నిర్వహించే సమయంలో ఎదురయ్యే విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలో జమ్మూకశ్మీర్, నార్థ్పూ ప్రాంతాల్లో కఠోర శిక్షణ పూర్తి చేసుకున్నాడు. ముస్తాక్ చురుకుదనం చూసి ఉన్నతాధికారులు అతడిని సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వహించేందుకు ఎంపిక చేశారు. పది మంది బృందంలో 9వ సిపాయిగా ఉన్న ముస్తాక్.. మంచుకొండల్లో ఫైబర్ టెంట్లను ఏర్పాటు చేసుకొని ఎముకలు కొరికే చలిలో దేశ భద్రతకే అంకితమయ్యారు. విధి నిర్వహణలో మంచు చరియలు కూలి మరణించాడు. రంజాన్‌కి వస్తానన్నాడు గత ఏడాది ఆగస్టు నెలలో విధులు నిర్వహించేందుకు వెళ్లిన ముస్తాక్ ఈ ఏడాది రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జూన్ నెలలో వస్తానని చెప్పినట్లు అతని సోదరులు మునీర్‌సాహెబ్, ముజఫర్ అహ్మద్, మగ్బుల్ తెలిపారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన నాలుగు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కనేవాడన్నారు. తమతో మాట్లాడినప్పుడంతా ఇల్లు ఏవిధంగా ఉండాలనే విషయమై ఎన్నో ప్లాన్లు చెప్పేవాడనీ, ఇలా... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త వినవలసి వస్తుందనుకోలేదని విలపించారు. అన్ని వేడుకలూ ఆగస్టులోనే! ముస్తాక్ అహ్మద్, నసీమూన్లకు మరిచిపోలేని అనుభూతి ఆగస్టు నెల. ఆ నెల వారి జీవితాల్లో వెలుగులు, ఆనందాలను నింపింది. 2014 ఆగస్టు 7న వివాహం జరిగింది. ఆగస్టు 2వ తేది ముస్తాక్ అహ్మద్ జన్మదినం. ఆగస్టు 3వ తేదిన కుమారుడు సయ్యద్ మొహిసీన్ జన్మదినం, ఆగస్టు 4వ తేదిన భార్య నసీమూన్ జన్మదినం కావడం విశేషం. - ఎన్.ప్రతాప్‌రెడ్డి, బండి ఆత్మకూరు, - పి. కిరణ్‌కుమార్, నూనెపల్లి సాక్షి, కర్నూలు -
ఏపీలో నో వేకెన్సీ!
-
ఏపీలో నో వేకెన్సీ!
* ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేదు.. ఇది ఏపీపీఎస్సీ లెక్క * ఖాళీ పోస్టుల సమాచారం పంపని చంద్రబాబు ప్రభుత్వం * ఒక్క నోటిఫికేషన్ కూడా వద్దని పరోక్షంగా ఆదేశాలు * 1.42లక్షల ఖాళీపోస్టులున్నాయన్న కమల్‌నాథన్ కమిటీ * ప్రభుత్వ తీరుతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశా నిస్పృహలు సాక్షి, హైదరాబాద్: ‘రాష్ర్టంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ ఖాళీగా లేదు..’ వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చెబుతున్నమాట. సర్వీస్ కమిషన్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అదేంటి.. ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకపోవడమేమిటి.. అని ఆశ్చర్యపోతున్నారా? రాష్ర్ట ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు ఇస్తే ఆ వివరాల ప్రకారం ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఆయా పోస్టులను భర్తీ చేస్తుంది. ఆ పరీక్షల కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేయాలని కూడా ఏపీపీఎస్సీని కోరకపోతే ఆ సంస్థ మాత్రం ఏం చేస్తుంది? అందుకే ఎప్పుడు సమావేశం జరిగినా... అప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలూ రానందున ఉద్యోగ ఖాళీలేవీ లేవని ఏపీపీఎస్సీ తన నివేదికలలో రాసుకుంటోంది. తాము చెప్పేవరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయవద్దని అధికారంలోకి వచ్చిన తొలిరోజే తెలుగుదేశం ప్రభుత్వం ఏపీపీఎస్సీకి స్పష్టం చేసిందని అధికారవర్గాల సమాచారం. నిజానికి చంద్రబాబు విధానమే అది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయన బద్ధ వ్యతిరేకి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ శుద్ధ దండగమారి వ్యవహారమని ఆయన తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు... ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎపుడు విడుదలవుతాయా అని లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీకి రాష్ర్ట ప్రభుత్వం కొత్త చైర్మన్‌గా పి.ఉదయభాస్కర్‌ను నియమించడంతో నోటిఫికేషన్లు వెలువడడమే తరువాయి అని నిరుద్యోగులు భావించారు. అయితే వారి ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులను టీడీపీ ప్రభుత్వం తొలగించిం ది. మరింత మందిని తొలగించే ఆలోచనలో ఉంది. అలాంటిది ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి జాబితాలను పంపిస్తుందని భావించడం అత్యాశేనని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పగ్గాలు చేపట్టి 18 నెలలవుతున్నా ఉద్యోగాల ఖాళీల వివరాలను చంద్రబాబు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి ఇంతవరకు పంపించలేదు. అందువల్ల ఏపీపీఎస్సీ లెక్కల్లో మాత్రం రాష్ర్టంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ ఖాళీ లేనట్లే. ఈ ఏడాది మే 28న ఇన్‌ఛార్జి ఛైర్మన్ నేతృత్వంలో జరిగిన సర్వీస్ కమిషన్ సమావేశపు నివేదికలో అదే విషయాన్ని స్పష్టంగా రాసుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ‘ప్రైవేటు’ సలహా! రాష్ట్ర విభజనకు ముందు వివిధ ఖాళీల భర్తీకోసం వివిధ శాఖలనుంచి ఏపీపీఎస్సీకి నివేదికలు వచ్చాయి. వాటి ప్రకారం 16వేల పోస్టులకు నోటిఫికేషన్లు సిద్ధమయ్యాయి. అయితే ఆ తరుణంలో ఎన్నికలు రావడంతో అవి నిలిచి పోయాయి. తరువాత ఖాళీల భర్తీకి సంస్థ ముందుకు వెళ్లకుండా ప్రభుత్వం కళ్లెం వేసింది. ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉదయభాస్కర్.. ప్రభుత్వంతో మాట్లాడి నోటిఫికేషన్లు జారీచేస్తామంటూనే ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటు రంగంలోనే మంచి అవకాశాలున్నాయని సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఏపీపీఎస్సీ పరీక్షలకోసం అయ్యే ప్రిపరేషన్ ప్రైవేటు ఉద్యోగాలకు పనికివస్తుందని పేర్కొన్నారు. ఈ మాత్రానికి ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్‌ను నియమించడమెందుకని, ఆయన్ను నియమించడం గుర్రానికి కాళ్లు కట్టేసి రౌతును ఎక్కించినట్లుగా ఉందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. నోటిఫికేషన్లకు బదులు ఊస్టింగ్‌లు జాబు కావాలంటే బాబు రావాలన్నారు. కానీ బాబు వచ్చాక జాబులకు కోత పెడుతున్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలే లేవు. కొత్తగా నోటిఫికేషన్లు వస్తాయని ఎదురుచూస్తున్న నిరుద్యోగులు చంద్రబాబు సర్కారు తీరు చూసి ఉసూరుమంటున్నారు. ఇప్పటికే 15వేల మంది ఆదర్శ రైతులను తొలగించారు. 7వేల మంది గృహనిర్మాణ వర్క్ ఇన్స్పెక్టర్లను ఇంటికి పంపించారు. 2వేల మంది ఉపాధి హామీ కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. వైద్య ఆరోగ్యశాఖలో 1,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. బాబు అధికారంలోకి వచ్చాక మొత్తంగా 25వేల మందికి ఉద్యోగాలు కోల్పోయారు. ఏతావాతా ఉద్యోగాల భర్తీపై పెట్టుకున్న ఆశలు మొత్తం నీరుగారిపోతుండడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. త్రిశంకు స్వర్గంలో డీఎస్సీ! డీఎస్సీ ఫలితాలు వెల్లడై ఐదు నెలలు దాటుతున్నా ప్రభుత్వం మెరిట్ జాబితాను ప్రకటించకపోవడంతో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు నిరాశా నిస్పృ హల్లో ఉన్నారు. 2014 నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదలైంది. 10,313 పోస్టుల భర్తీకి 2015 మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 3,97,294 మంది పరీక్షకు హాజరయ్యారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచేలోగానే ఫలితాలు ప్రకటించి నియామకాలు పూర్తిచేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. చివరకు ఫలితాలను జూన్ 3న ప్రకటించారు. ప్రశ్నల్లోని తప్పులపై చాలా మంది ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. కొం దరు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. అసలు టెట్‌ను టీచర్ రిక్రూట్‌మెంటును కలిపి నిర్వహించడం(జీవో38)పైనా కొందరు పిటిషన్లు వేశారు. ట్రిబ్యునల్‌లో ఉన్న కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే అవకాశమున్నా ఆ కేసులనే సాకుగా చూపి వాయిదాలు వేసుకుంటూ వెళ్తోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డీఎస్సీలోని కొన్ని కేటగిరీ పోస్టుల భర్తీపై ఇలాగే కోర్టు కేసులు పడ్డాయి. అయితే ఆ కేసులున్న కేటగిరీలను మినహాయించి తక్కిన పోస్టులన్నిటినీ అప్పటి ప్రభుత్వం భర్తీచేసింది. ప్రస్తుతం 10,313 పోస్టుల్లో 7వేలకు పైగా పోస్టులు ఎస్జీటీ కేటగిరీకి చెందినవే. వీటిపై ఎలాంటి వివాదమూ లేదు. స్కూల్ అసిస్టెంటు తదితర పోస్టులకు కొన్ని న్యాయపరమైన అభ్యంతరాలు ట్రిబ్యునల్‌లో ఉన్నాయి. ట్రిబ్యునల్‌లో అభ్యంతరాలున్నప్పటికీ స్టే ఉత్తర్వులు లేనంతవరకు ప్రభుత్వం నియామకాలకు నిరభ్యంతరంగా ముందుకెళ్లవచ్చు. కానీ ప్రభుత్వం చిన్న కారణాలను సాకుగా చూపి నియామకాలను జాప్యం చేస్తోంది. రాష్ర్టంలో ఖాళీ పోస్టులు 1.42 లక్షలు రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగ ఖాళీలు 1.42 లక్షలు ఉన్నాయని కమలనాథన్ కమిటీ గుర్తించింది. విభజన సమయంలో నాటి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వమే తెలంగాణ, ఏపీల్లో ఉన్న వివిధ పోస్టులు, వాటి వివరాలను కమలనాథన్ కమిటీకి అందించింది. ఆ వివరాలు కావాలని ఇప్పటివరకు ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఉలు కూ పలుకూ లేకుండా పోయిందని ఏపీపీఎస్సీ వర్గాలంటున్నాయి. -
పడుపు రొంపి
► మేమేమి చేశాం పాపం! ఆచారం వారి పాలిట శాపంగా మారింది. చాలా ఏళ్ల నుంచి వస్తున్న వృత్తి వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మానప్రాణాలు ఫణంగా పెట్టి ఊబిలో కొనసాగుతున్నారు. రోజుకు నాలుగైదుసార్లు బలత్కారానికి గురవడంతో ఒళ్లు హూనం చేసుకుంటున్నారు.. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా.. సర్కారు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వృత్తిని మానుకుంటామని సెక్క్ వర్కర్లు పేర్కొంటున్నారు. జిల్లాలోని నాలుగు పల్లెల్లోని వీధులు.. దాదాపు 600 కుటుంబాలు.. వేలాది మంది సెక్స్ వర్కర్ల వ్యథపై సండే స్పెషల్.. - సెక్స్‌వర్క్ ఊబిలోకి యువతులు - ఏళ్లుగా అదే వృత్తి.. జీవనాధారం.. - ఆచారం వారి పాలిట శాపం - ఫలించని పోలీసుల కౌన్సెలింగ్ - జిల్లాలో 600 కుటుంబాలు.. - వేలాది మంది జీవితాలు నాశనం - సర్కారు ఉపాధి కల్పిస్తే మేలు హసన్‌పర్తి : జిల్లాలో వంగపహాడ్, హసన్‌పర్తి, సిద్ధాపురం, ల్యాదేళ్ల గ్రామాల్లోని కొన్ని వీధుల్లో సెక్స్ వర్కర్ల స్థావరాలు ఉన్నాయి. దాదాపు 600 పడుపు వృత్తి నిర్వహించే కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల సభ్యులు కుటుంబపోషణ భారమై వేశ్య వృత్తిని నిర్వహిస్తున్నారు. అయితే కొందరు యువతులు సెక్క్ వర్కర్లుగా కొనసాగడానికి నిరాకరిస్తున్నారు. అయినప్పటికి కుల పెద్దలు వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది మన ఆచారమని నచ్చజెపుతున్నారని వారు పేర్కొంటున్నారు. యువతులు బలవంతంగా పడుపు వృత్తిలో దించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం రావడం లేదు. ఆరేళ్ల క్రితం వంగపహాడ్లో పడుపు వృత్తి నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ గ్రామంలో ప్రత్యేకంగా పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. కొంత వరకు పడుపు వృత్తి తగ్గుముఖం పట్టింది. అయితే ఔట్‌పోస్ట్ ఏర్పాటుకు ముందు వివిధ ప్రాంతాల నుంచి యువతులను కొనుగోలు చేసేవారు. వారితో వ్యాపారం నిర్వహించే వారు. ‘ఉపాధి’కి ముందుకు రాని సర్కార్ పడుపు వృత్తి నివారించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వేశ్య గృహాల నిర్వాహకులతోపాటు వృత్తి నిర్వహిస్తున్న వారిని పిలిపించి కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు. వృత్తి మానితే ప్రభుత్వం నుంచి ఉపాధి పథకాలు అందిస్తామని భరోసా ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం, పోషణ నిమిత్తం మళ్లీ అదే రొంపిలోకి దిగాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు లేనివారికి రేషన్‌కార్డులు, ఉండటానికి ఇల్లు కట్టించాలని, తమ పిల్లలను మంచి పాఠశాలల్లో చది వించాలని కోరుతున్నారు. సమాజంలో దర్జాగా బతకండి సెక్స్‌వర్కర్లు తమ వృత్తిని వదిలిపెట్టి సమాజంలో దర్జాగా బతకాలి. వేశ్య వృత్తి నిర్వహించే వారిపై సమాజం చిన్నచూపుచూపుతోంది. ఈ రొంపిలో నుంచి బయటికీ రావాలి. - సీఐ, రవికుమార్