Graduate voter registration program
-
రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చండి ప్లీజ్!
ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన సందడి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ప్రకటించింది. ఆ యా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల నుండి పట్టభద్రులుగా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ద్వారా ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు. అయితే పట్టభద్రులు తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి కావడంతో... చాలామంది రిజిస్ట్రేషన్‌కు వెళ్లడానికి బద్ధకిస్తున్నారు.వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి ఓటు నమోదు చేసుకోడానికి సమయం వెచ్చించడం లేదు. పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్ సైట్లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు నంబర్లను నమోదు చేసినా... మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలనే షరతు చికాకు కలిగిస్తోంది. అందుకే చాలామంది తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు.చదవండి: స్టూడెంట్ లీడర్ టు సీఎం.. రేవంత్ రెడ్డి రాజకీయ పొలిటికల్ జర్నీఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ యా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి, అక్కడే ఓటు హక్కును ప్రభుత్వమే నమోదు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని షరతులు ఉన్నా... వాటిని అధిగమించి తమ ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. మంచి ప్రతినిధిని ఎన్నుకుని గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయాలి.– సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
ఉత్తరాంధ్రలో ‘పట్టభద్రులు’ పెరిగారు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్.. అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్ 9 వరకు గడువు విధించింది. ఈనెల 23న విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 2,43,903 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. గతంలో ఎన్నికలు జరిగిన 2017తో పోలిస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అదనంగా 87,946 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదయ్యారు. అభ్యంతరాల స్వీకరణ సమయంలోనూ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అనుమతులివ్వడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 50 వేల ఓటర్లు నమోదయ్యే అవకాశం 2017 సమయంలోనూ ఓటర్ల ముసాయిదాను 2016 నవంబర్ 1న ప్రకటించారు. ఆ సమయంలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో మొత్తం 1,26,452 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించే సమయంలో దరఖాస్తులు తీసుకోవడంతో అదనంగా 29,505 మంది కొత్త ఓటర్లు చేరారు. తుది జాబితా విడుదల చేసే సమయానికి ఈ ఓటర్లు సంఖ్య 1,55,957కి చేరుకుంది. ఈసారి కూడా అభ్యంతరాల స్వీకరణ సమయంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ముసాయిదాలో 2,43, 903 మంది ఓటర్లుండగా.. తుది జాబితా సమయానికి 2.90 లక్షలకు చేరుకుంటుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నమోదైన ఓటర్ల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 297 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా (ఉమ్మడి) 2017 తుది జాబితా ఓటర్లు 2022 ముసాయిదా ఓటర్లు శ్రీకాకుళం 31,313 46,119 విజయనగరం 34,570 71,518 విశాఖపట్నం 90,074 1,26,266 మొత్తం 1,55,957 2,43,903 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ల నమోదుకు సంబంధించిన ముసాయిదాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 9లోగా ఫారం–18 ద్వారా తెలపాలి. సంబంధిత ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, డిసిగ్నేటెడ్ అధికారుల ద్వారా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందించవచ్చు. కేవలం అభ్యంతరాలు మాత్రమే కాకుండా.. ఇంకా ఎవరైనా పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోలేకపోతే వారికి మరో అవకాశం కలి్పస్తున్నాం. 2017లో నమోదైన అన్ని ఓట్లు రద్దు చేశాం. ఇంకా దీనిపై కొందరికి అవగాహన కలగలేదన్నది మా దృష్టికి వచ్చింది. అందుకే దీనిపై మరింత అవగాహన కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – డా.మల్లికార్జున, కలెక్టర్ -
ప్రతిష్టాత్మకంగా ‘పట్టభద్రుల’ నమోదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ‘వరంగల్ – ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీలతో గురువారం కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పట్టభద్రుల ఓటరు నమోదులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అర్హతను బట్టి తమ ఇంటి నుంచే నమోదు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, ఇందులో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. తాజా ఓటరు లిస్టు ఆధారంగానే గ్రాడ్యుయేట్స్ కోటా ఎన్నికలు జరుగుతాయని, ఇప్పటికే గ్రామస్థాయి నుంచి ఇన్చార్జీలు ఓటర్ల నమోదుకు సన్నాహాలు ప్రారంభించారని కేటీఆర్ వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు దివాలా.. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలు దివాలా తీశాయని కేటీఆర్ అన్నారు. దీంతో విపక్షాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందన్నారు. త్వరలోనే టీహబ్, టాస్క్ కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు, అక్టోబర్‌లో ఖమ్మం జిల్లాలో ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామన్నారు. -
పెద్దల సభపై.. నజర్
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీ చేసేందుకు ఔత్సాహికులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ పదవీ కాల పరిమితి వచ్చే యేడాది మార్చితో ముగియనుండడంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుండడంతో ఔత్సాహికులు ఇప్పటి నుంచే మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంపై ఔత్సాహికులు కన్నేశారు. వీరిలో జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ఉండడంతో శాసనమండలి ఎన్నికల వేడి రాజుకుంటోంది. 2007, 2009 లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొ ఫెసర్ కె.నాగేశ్వర్ విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం జరగనున్న ఎన్నికలో నాగేశ్వర్ మరోమారు పోటీ చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత కొరవడింది. వరంగల్,నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నాగేశ్వర్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఓటరు నమోదు కార్యక్రమానికి ముందే బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో డాక్టర్ నాగేశ్వర్‌పై పోటీ చేసి ఓటమి పాలైన ఎన్.రామచందర్‌రావు పేరును బీజేపీ ప్రకటించింది. నల్లగొండ జి ల్లా కోదాడకు చెందిన రాంచందర్‌రావు 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా పట్టభద్రల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా నాయకత్వం మా త్రం రాంచందర్‌రావు వైపు మొగ్గు చూపింది. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకుని పోటీచేసిన బీజేపీ ప్రస్తుతం ఒంటరిగానే బరిలోకి దిగుతుండడంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ సంఘం నేతల ఆసక్తి పీఆర్టీయూ, టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులిద్దరూ ఇదే స్థానం నుంచి పోటీకి సన్నద్ధం అవుతుండటంతో టీఆర్ఎస్లో టికెట్ కోసం పోటీ నెలకొంది. పీఆర్టీయూకు చెందిన ఎమ్మెల్సీలు ఇటీవల టీఆర్ఎస్లో చేరడంతో పాటు పట్టభద్రుల నియోజకవర్గంలో తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు వెంకట్‌రెడ్డికి అనుకూలంగా యూనియన్ ఇప్పటికే తీర్మాణనం చేసింది. వచ్చేయేడాది ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అవుతున్న వెంకట్‌రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలను కలిసి తన మనోగతం వెల్లడించినట్లు సమాచారం. టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి కూడా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి సహకారం, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వంటి అంశాలు తనకు ఉపకరిస్తాయని హర్షవర్దన్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా, విద్యా సంస్థలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉపకరిస్తాయనే కోణంలో తన అభ్యర్థిత్వంపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇద్దరు నేతలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారే కావడం, ఉపాధ్యాయ సంఘాల్లో రాష్ట్ర పదవుల్లో ఉండటం కలిసి వస్తుందనే భావనలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతగా,తెలంగాణ ఉద్యమంలో వివిధ సంఘా లతో కలిసి పనిచేసిన సుభాష్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలంగాణ విద్యార్థి యువజన సంఘం, తెలంగాణ ప్రైవేటు లెక్చరర్ల ఫోరం ఏర్పాటులో సుభాష్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్లకు చెందిన సుభాష్‌రెడ్డి విద్యార్థి సంఘం నేతగా తనకున్న విస్తృత పరిచయాలు కలిసి వస్తాయనే అంచనాలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, టీడీపీ తరఫున పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తామంటూ ఇప్పటివరకు ఎవరూ ప్రకటించిన దాఖలా లేవు. మండలి ఎన్నిక విషయంలో ఆయా పార్టీల వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ కేడర్‌కు కూడా స్పష్టత లేకుండా పోయింది. ఓటరు నమోదుకు సన్నాహాలు 2009 ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో 2.14 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. గతంలో నమోదైన ఓటర్లు ఈ నెల 25వ తేదీలోగా ఫొటోలు అందజేయాల్సిందిగా ఎన్నికల సంఘం సూచించింది. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 16 వరకు నూతన ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. 2015 జనవరిలో తుది జాబితా ప్రకటిస్తామని అధికారులు ప్రకటించారు.