ఫెరారీ లగ్జరీ కార్లు లాంచ్.. ధర
న్యూడిల్లీ: ఇటాలియన్ ఆటోమేకర్ ఫెరారీ రెండు కొత్త కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లగ్జరీ కార్ సెగ్మెంట్ లో ఫెరారీ జీటీసీ4లుస్సో జీటీసీ4 లుస్సో టీ పేరుతో రెండు మోడళ్లను బుధవారం విడుదల చేసింది. లుస్సో ఇటాలియన్ పదానికి అర్థం లగ్జరీ. అందుకే లూసో పేరుతో ఈ సరికొత్త కార్లను విడుదల చేసినట్లు ఫెరారీ ప్రకటించింది. ఈజీటీసీ 4లుస్సో ధర రూ. 5.20కోట్లు(ఎక్స్ షోరూం), కొంచెం తక్కువ ధరలో జీటీసీ4 లుస్సో టీ ధర రూ. 4.20కోట్లు(ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. రెండు కార్లను 4-వీల్ డ్రైవ్, 4 సీట్ల కానఫిగరేషన్తో లాంచ్ చేసింది. లగ్జరీకి మారు పేరుగా లెదర్ క్యాబిన్ తదితర ఫీచర్లతో గ్రాండ్ టూరిస్మో కూప్ (జీటీసీ) కార్లను కార్ లవర్స్‌కు అందుబాటులో తెచ్చింది.
ఫెరారీ జీటీసీ4 లుస్సో వీ 12 ఇంజిన్ తో వచ్చింది. 681బీహెచ్పీ, 697 ఎన్ఎం గరిష్ట టార్క్. మోటార్ 7-స్పీడ్ డబుల్ క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ . కేవలం సెకనులో 100 కి.మీ దూసుకుపోతోంది. ఇది కేవలం 3.4 సెకన్లలో 345కెఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
మరోవైపు ఫెరారీ జీటీసీ4 లుస్సో టీ అనేది 3.9-లీటర్ ఇంజిన్ వీ 8 ఇంజిన్ పవర్తోలాంచ్ అయింది. 610బీహెచ్పీ పవర్, 760గరిష్ట టార్క్. ఈ ఒక 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్‌బాక్స్ అమర్చారు. అంతేకాదు 10.25 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తదితర ఫీచర్లతోపాటు ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా లెగ్ రూంను 16మి.మీ పెంచింది.