GVMC elections
-
పోటీ చేయాలంటే 20 లక్షలు కట్టాలి.. కూటమి ఎమ్మెల్యేల కొత్త దందా
-
జీవీఎంసీ కౌన్సిల్.. 18 అజెండా, 27 సప్లిమెంటరీ అంశాలపై చర్చ!
విశాఖపట్నం: మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్న జీవీఎంసీ సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 6వ తేదీన కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా.. మిచాంగ్ తుపాను కారణంగా వాయిదా పడింది. ఆ రోజు వాయిదా పడ్డ 18 అంశాలతో పాటు మరో 27 అంశాలు నేడు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. ► 2023–24 ఏడాదిలో డిసెంబర్ 13 నుంచి మార్చి 31, 2024 వరకు జోన్–4 టౌన్‌కొత్తరోడ్డు వద్ద గల సీసీఎస్ ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా అద్దె ప్రాతిపదికన టిప్పర్లు, బ్యాక్ హోయ లోడర్‌కు పరిపాలన ఆమోదం, ఎన్బీసీ, గ్రీన్ బిల్డింగ్ నిర్మాణపు మార్గదర్శకాలకు అనుగుణంగా అంచనా విలువ రూ.99.47 కోట్లతో ముడసర్లోవలోని 4.37 ఎకరాల్లో జీవీఎంసీ నూతన ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వ పరిపాలన ఆమోదానికి సభ్యులు చర్చించనున్నారు. ► సాగర్‌నగర్‌కు ఎదురుగా బీచ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న బీచ్ స్థలంలో ఎకోఫ్రెండ్లీ తాబేలు బీచ్ అభివృద్ధి, ఉద్యానవన విభాగంలో గ్రీనరీ అభివృద్ధి, పర్యవేక్షణకు కాంట్రాక్ట్ పద్ధతిలో 8 మంది జోనల్ హర్టికల్చర్ అధికారుల నియామకం, పూర్ణామార్కెట్ జంక్షన్ నుంచి టౌన్‌కొత్తరోడ్డు జంక్షన్ వరకు రూ.1,34,02,077 అంచనా విలువతో రోడ్డుకిరువైపులా ఉన్న 55 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ► రూ.1,46,45,690 అంచనా విలువతో రీడింగ్ రూమ్ జంక్షన్ నుంచి పాతపోస్టాఫీస్ జంక్షన్ వరకు 69 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు, రూ.62,01,254 అంచనా విలువతో చౌల్ట్రీ జంక్షన్ నుంచి పూర్ణామార్కెట్ జంక్షన్ వరకు 21 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు అంశాలు చర్చకు రానున్నాయి. ► పెదగదిలి జంక్షన్ వద్ద తూర్పు దిక్కున రూ.1.72కోట్లతో వంతెన నిర్మాణం, పడమర వైపున రూ.1.73 కోట్లతో వంతెన నిర్మాణం, కొత్త గాజువాక జంక్షన్ నుంచి వంటిల్లు జంక్షన్(కణితి రోడ్డు) వరకు 15వ ఆర్థిక సంఘం నిధులతో బీటీ హాట్ మిక్స్ రోడ్డు విస్తరణ, పునరుద్ధరణ పనులు, హైటెన్షన్ విద్యుత్ స్తంభాల మార్పుపై చర్చించనున్నారు. ► గుండాల జంక్షన్ వద్ద రూ.1,98,90,000తో జీ 2 తరహాలో జీవీఎంసీ గెస్ట్‌హౌస్ నిర్మాణం, పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు హాట్మిక్స్తో బీటీ రోడ్డు పునరుద్ధరణ, పీఎఫ్ కాలనీలో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 96వ వార్డు వేంకటేశ్వరస్వామి ఆలయ ఘాట్‌రోడ్డు హాట్మిక్స్తో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 95వ వార్డు పురుషోతపురం వద్ద గల మహతి స్కూల్ నుంచి కంఫర్ట్ హోమ్స్ వరకు బీటీ రోడ్డు తదితర అంశాలను చర్చించి ఆమోదించనున్నారు. ► 90, 91, 92 వార్డుల్లో గిరి ప్రదక్షిణ రోడ్డు విస్తరణ, సెంటర్ డివైడర్లు, ఆర్సీసీ డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణం, సమగ్ర మొబిలిటీ ప్లాన్ తయారీ, సీఎం ఈ–బస్ సేవా పథకం, మధురవాడ, పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు, గృహ అవసరాలకు 66 ఎంఎల్డీ నీటి సరఫరా, పంపిణీ, ముడసర్లోవలో నీటి శుద్ధి కర్మాగారం నిర్మాణంతో పాటు కేబీఆర్ నుంచి ట్రాన్స్మిషన్ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు షరతులతో కూడిన విస్కో ప్రాజెక్ట్స్ తదితర అంశాలపై సభ్యులు చర్చిస్తారు. -
జీవీఎంసీ స్థాయీ సంఘ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): జీవీఎంసీ స్థాయీ సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. పది స్థానాలకు గాను పది స్థానాలూ గెలుచుకుంది. సంఖ్యా బలాన్ని మించి ఇతర పారీ్టల నుంచి కూడా ఓట్లు పోలవ్వడం సీఎం జగన్ పరిపాలన దక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీకి స్వతంత్రులతో కలిపి 62 మంది కార్పొరేటర్లుండగా వీరిలో ఉరికిటి నారాయణరావుకు 66, అక్కరమాని పద్మకు 64, పీలా లక్ష్మీసౌజన్యకు 64, కోడిగుడ్ల పూరి్ణమకు 63, కంటిపాము కామేశ్వరికి 63, బల్ల లక్ష్మణరావుకు 63, భూపతిరాజు సుజాతకు 63 ఓట్లు వచ్చాయి. అంటే తెలుగుదేశం, బీజేపీ నుంచి కూడా కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లకు ఓట్లు వేశారన్నమాట. ఈ సందర్భంగా మంత్రి, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల ఇన్చార్జ్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ టీడీపీకి చెందిన కార్పొరేటర్లు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మద్దతు పలకడం విశేషమన్నారు. సీఎం ఆదేశాలతో, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి సూచనలు, సలహాలతో ఈ విజయం సాధించినట్టు మంత్రి అమర్నాథ్ చెప్పారు. -
ఇక టీడీపీ చాప్టర్ క్లోజ్: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధిస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల తరువాత టీడీపీ చాప్టర్ క్లోజ్ అవుతుందన్నారు. పురపాలక, కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కచోట కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం 85 నుంచి 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. చంద్రబాబు ఎన్ని మాయమాటలు, అబద్ధాలు చెప్పినప్పటికీ ప్రజలు విశ్వసించే అవకాశం లేదన్నారు. చంద్రబాబు సినిమాకు ప్రజలు ముగింపు పలకబోతున్నారని చెప్పారు. వాళ్లిద్దరూ రాబందులు చంద్రబాబు, అతని కొడుకు పప్పునాయుడు రాబందులని ఘాటుగా విమర్శించారు. టీడీపీ హయాంలో పరిశ్రమలు, హౌసింగ్, ఇతరత్రా పేరు మీద భూములను తమ అనుయాయులకు దోచిపెట్టారని ఆరోపించారు. భూ దందాలు, ఆక్రమణలు, దొంగతనంగా భూములు రాయించుకోవడం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అందుకే టీడీపీకి దొంగల పార్టీగా ముద్ర పడిందని పేర్కొన్నారు. పెద్దల రూపంలో ఉన్న భూకబ్జాదారులకు మేలు చేసే ఈ ముఠా విశాఖను ఛిద్రం చేసిందన్నారు. ఈ ముఠా చెరబట్టిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంటే చంద్రబాబు, అతని కొడుకు లోకేశ్ తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాబందులను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని విజయసాయిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ మొహం పెట్టుకుని విశాఖలో తిరుగుతున్నాడు విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటూ విశాఖపై విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని నగరంలో పర్యటిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశి్నంచారు. ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లను ప్రజలు తరిమికొట్టే సమయం వచి్చందన్నారు. వీరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవడం ఖాయమని పునరుద్ఘాటించారు. ప్రశాంత వాతావరణంతో అందమైన నగరంగా విశాఖను తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని స్పష్టం చేశారు. -
జనం బరితెగించాలి: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: ‘ఆటవిక రాజ్యంలో రౌడీలు, గూండాలు దాడి చేస్తే మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు.. అందుకే ఇప్పుడు బరి తెగించాలి.. గట్టిగా కొట్టాలి.. విశాఖకు పట్టిన శని వదిలించుకోవాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా విశాఖ నగరంలో రెండో రోజు శనివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. గాజువాక, విశాఖ దక్షిణం, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ‘మీలో రోషం రాకపోతే.. వచ్చే ఎన్నికల్లో రూ.1000, రూ.2000కు రాజీ పడిపోతే.. జీవితాల్లో శాశ్వతంగా నరకమే ఉంటుంది. కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలి’ అన్నారు. గాజువాక, పూర్ణా మార్కెట్, జగదాంబ జంక్షన్, సీతమ్మధార ప్రాంతాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. మీకు మంచి చేయలేకపోయానని బాధ పడుతున్నానని చెప్పారు. మంచి చేసిన నేను మంచి పేరు తెచ్చుకోలేకపోయాననే బాధ కూడా ఉందన్నారు. తన 14 ఏళ్ల సీఎం రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరన్నారు. మరో హైదరాబాద్‌గా విశాఖను తయారు చేయాలని భావించి.. అందుకోసం ప్రణాళిక తయారు చేస్తే.. ఇప్పుడు దాన్ని గందరగోళంగా తయారు చేశారని విమర్శించారు. అమరావతి రాజధానిగా ఉంచుతూ.. విశాఖని ఫైనాన్షియల్ హబ్‌గా, నంబర్ వన్ సిటీగా తయారు చేయాలని అనుకున్నానని తెలిపారు. జగన్ పాలనలో బూతుల మంత్రి, హవాలా మంత్రి, కొబ్బరికాయల మంత్రితో పాటు అనేక రకాల మంత్రులున్నారని ఎద్దేవా చేశారు. మీ బట్టలు విప్పించే రోజులు తొందర్లోనే వస్తాయని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని జగన్‌కు చెబితే ఇంత వరకూ స్పందించలేదన్నారు. అమ్మ ఒడి, నాన్న బుడ్డీ అని మాట్లాడుతున్నారే తప్ప.. అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. కాగా, చంద్రబాబుకు రెండో రోజు కూడా విశాఖ ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తూర్పు నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహిస్తున్న చంద్రబాబుకు ఏయూ విద్యార్థి జేఏసీ నుంచి నిరసన ఎదురైంది. విశాఖని రాజధానిగా చేసేందుకు అంగీకరించని చంద్రబాబుకు నగరంలో తిరిగే అర్హత లేదంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, చంద్రబాబు రోడ్‌షో ముందుకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రచారానికి జనం కరువవ్వడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. స్వామీజీలు ఇలాంటి పనులు చేస్తారా? ‘రామతీర్థంలో రాముడి తల తీస్తే ఇక్కడి దొంగ స్వామి వెళ్లలేదు. స్వామీజీలు ఎవరైనా ముద్దులు పెడతారా? స్వాములు నిష్టగా, పవిత్రంగా ఉండి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదిస్తారే తప్ప, ఇలాంటి పనులు చేయరు. హిందూ మతానికి చెడ్డపేరు తెచ్చారు’ అని శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామీజీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతంపేటలో జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ.. స్వామీజీలు ఎవరినీ తాకరని, ఈ స్వామి మాత్రం సీఎంకు ముద్దులు పెట్టేస్తారన్నారు. బలవంతపు ఏకగ్రీవాల మాదిరిగా.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఐదేళ్లలో తాము రూ.1.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. జగన్ 22 నెలల్లో రూ.1.60 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. -
విశాఖలో చంద్రబాబు రోడ్ షో
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆటవిక రాజ్యం కొనసాగించడానికి రాష్ట్రం నీయబ్బ సొత్తా. కొన్ని రోజులు పోయాక బట్టలేసుకుని తిరిగే పరిస్థితి ఉండాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకో’ అంటూ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు. బీచ్ రోడ్డును తానే అభివృద్ధి చేశానని, విశాఖ అగ్ర నగరంగా తయారు కావాలని కాంక్షించానని, ఈ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపానని చెప్పారు. కాయకష్టం చేసేవారికి ఒక పెగ్గు వేసి పడుకోవడం అలవాటు అని, వారికి నాసిరకం బ్రాండ్లను మూడు రెట్లు ధరలు పెంచి అమ్ముతుండటం సిగ్గు చేటని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ను ఎలా పరిరక్షించాలా అని టీడీపీ తాపత్రయ పడుతుంటే.. వైఎస్ జగన్ మాత్రం 7 వేల ఎకరాల్ని అమ్మేయాలంటున్నారని విమర్శించారు. విశాఖ నగరంలో అడ్డపంచెలు కట్టుకుని దిగి, భూకబ్జాలు చేస్తూ, సెటిల్మెంట్ ఆఫీస్‌లు ఏర్పాటు చేశారన్నారు. విశాఖ నగరానికి శనిగ్రహం పట్టిందని, నగరంపై విజయసాయిరెడ్డి పెత్తనమేంటని ప్రశ్నించారు. లోకేశ్‌ను మించిపోయిన బాబు అబద్ధపు ప్రచారాలు, పొంతన లేని మాటలు చెప్పే నారా లోకేశ్‌ను మించిపోయేలా చంద్రబాబు విశాఖ పర్యటనలో మాట్లాడారు. నివాసయోగ్య నగరాల్లో విశాఖ నగరం 3వ స్థానం నుంచి 46వ స్థానానికి పడిపోయిందంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2018లో చంద్రబాబు హయాంలో విశాఖ నగరం 17వ స్థానంతో సరిపెట్టుకుంటే.. ఈసారి 2 స్థానాలు మెరుగుపడి 15వ స్థానంలో నిలిచింది. చంద్రబాబు మాత్రం 46వ స్థానం వచ్చిందని చెప్పడంతో జనం ఆశ్చర్యపోయారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, సిమెంట్, గ్యాస్, నిత్యావసరాల ధరలను సీఎం జగన్ పెంచేశారంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా పొంతన లేని మాటలు చెప్పడంతో అక్కడి వారంతా అసహనం వ్యక్తం చేశారు. మేయర్ అభ్యర్థిగా పీలా పెందుర్తి రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా 96వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు పేరును చంద్రబాబు ప్రకటించారు. బీసీ సంఘాల మండిపాటు చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువత తొలుత విశాఖ విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబుపై ఉత్తరాంధ్ర బీసీ సంఘాలు మండిపడ్డాయి. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద బీసీ సంఘాలు ప్రయత్నించాయి. పోలీసులు అడ్డుకోవడంతో విమానాశ్రయ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానికి చంద్రబాబు అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయాన్ని స్పష్టం చేసిన తర్వాతే ప్రచారానికి వెళ్లాలని, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా.. రాత్రి 9 గంటలకు అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా.. వంద మందికి పైగా యువకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రాజధాని రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుకు.. విశాఖలో తిరిగే హక్కు లేదంటూ నినాదాలు చేయగా.. పోలీసులు వారిని నిలువరించారు. -
హత్యా రాజకీయాల్లో వెలగపూడి సిద్ధహస్తుడు..
సాక్షి, విశాఖ: హత్యా రాజకీయాలు చేయడంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సిద్ధహస్తుడని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫైరయ్యారు. వంగవీటి రంగా హత్య కేసుతో సంబంధాలు ఉన్నవెలగపూడి.. అవినీతి తిమింగళమని ఆరోపించారు. ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ అభ్యర్ది అమరేంద్ర ఇద్దరూ పూజకు పనికిరాని పువ్వులని ఎద్దేవా చేశారు. స్వతంత్ర అభ్యర్థి గౌస్ పవిత్రమైన మసీదును రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. గౌస్ తన అల్లుడు సహకారంతో బీహార్ ముఠాలను రంగంలోని దింపి హత్యా రాజకీయాలు నడుపుతున్నాడని ఆరోపించారు. గ్రేటర్ విశాఖకు ఖండాంతర ఖ్యాతి దక్కాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్ది వంశీకృష్ణ శ్రీనివాస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ పరిధిలోని పలు సమస్యలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేస్తానని హామినిచ్చారు. ఏయూలో పని చేస్తున్న టైమ్ స్కేల్ ఉద్యోగుల సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, చిన వాల్తేరులో చేపల మార్కెట్ ఆధునీకరణ, ఒరిస్సా బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, వాల్తేరులో తాగునీటి సమస్యకు పరిష్కారం, గౌడ వీధిలో సామాజిక భవనం నిర్మాణం, ధోభీ ఘాట్ నిర్మాణం, పాండురంగాపురం ప్రజలకు ఇళ్ల స్థలాలు, గోశాల నిర్మాణం వంటి పలు హామీలను గుప్పించారు. -
విశాఖ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందాలని, అది సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. నాడు మహానేత వైఎస్సార్‌తో విశాఖ ప్రగతి సాధిస్తే.. మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం జగన్ చొరవతో నగరం అభివృద్ధిపథంలో నడుస్తోందన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర, తూర్పు నియోజకవర్గాల్లోని పలు వార్డుల్లో మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టితో కలిసి ఆయన ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల్లో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. వంగవీటి రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడని.. అక్కడ నుంచి పారిపోయి వచ్చి విశాఖ ప్రజలపై పెత్తనం చేస్తున్నాడని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక నియో జకవర్గంలో గెలిచి మరో నియోజకవర్గానికి మారిపోవడమేగానీ గెలిచినచోట ప్రజల స మస్యలు ఆయనకు పట్టవని ఎద్దేవా చేశా రు. మీలో ఒకరు, మంచి వ్యక్తయిన కేకే రాజును గెలిపించుకోవాలని పిలుపునిచ్చా రు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి టీడీపీని పూర్తిస్థాయిలో భూస్థాపి తం చేయాలని కోరారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే గొల్ల బాబురా వు, పార్టీ సమన్వయకర్తలు కేకే రాజు, విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. -
జీవీఎంసీ ఎన్నికలు: ప్రచారంలో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వైద్యరంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమూల మార్పులు తెచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గ్రేటర్ విశాఖలో శనివారం మునిసిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందజేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట వేసిన సీఎం జగన్.. నాడు-నేడు ద్వారా విద్యా ప్రమాణాలను పెంచారని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనేది సీఎం లక్ష్యమని అన్నారు. కాలువలు, రోడ్లు, స్వయం సహాయక సంఘాల భవనాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్చించినట్లు పేర్కొన్నారు. చదవండి: పుర పోరు.. వైఎస్సార్ సీపీ ప్రచార జోరు Visited Wards 42 & 55 during our G.V.M.C. 2021 Election Campaigning today & discussed plans for improving basic amenities, canals, roads, buildings for SHGs, Infra. setup for community halls & sanctioning of house pattas, under Hon. CM Shri @YSJagan Garu’s leadership. pic.twitter.com/WGuLwt9k8G — Vijayasai Reddy V (@VSReddy_MP) February 27, 2021 -
పుర పోరు.. వైఎస్సార్ సీపీ ప్రచార జోరు
సాక్షి, విశాఖపట్నం: పుర ప్రచారంలో వైఎస్సార్ సీపీ దూసుకుపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జోరు ముమ్మరంగా సాగుతోంది. శనివారం.. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోని వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కేకే రాజు పాల్గొన్నారు. ఉదయం విశాఖ నార్త్ నియోజకవర్గంలోని 8, 54వ వార్డుల్లో విజయసాయిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవీఎంసీలో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 54వ వార్డులో స్థానిక సమస్యలను ప్రజలు.. విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన చేస్తున్నారని ఆయన తెలిపారు. సాయినగర్‌లో తారురోడ్డు వేయిస్తామన్నారు. జ్యోతినగర్‌లో అంగన్వాడీ కేంద్రంతో పాటు, రెడ్డినగర్‌లో సామాజిక భవనం, గజపతి నగర్లో మీటింగ్ హాల్ నిర్మిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 8 వార్డుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, శివనగర్‌లో కమ్యూనిటీ హాల్, దోబీ ఘాట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మురికివాడల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ హయాంలో అంతా దోపిడీయే: మంత్రి వెల్లంపల్లి కృష్ణా జిల్లా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో అంతా దోపిడీయేనని, జన్మభూమి కమిటీల పేరుతో సొంతవాళ్లకే పథకాలు కట్టాబెట్టారని మండిపడ్డారు. అభివృద్ధిని పూర్తి నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగనన్న పథకం లేని ఇల్లు లేదు. రూ.600 కోట్లతో విజయవాడను అభివృద్ధి చేస్తున్నాం. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి విజయవాడను నిర్లక్ష్యం చేశాయి. ఇప్పడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. జగన్ దెబ్బకు చంద్రబాబు కుప్పం పరుగెత్తాడు. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్‌ను తెమ్మంటున్నారు కానీ లోకేష్‌ను తెమ్మనడం లేదు. పవన్ కల్యాణ్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. గతంలో చంద్రబాబుతో పాపాల్లో పవన్‌కు పాత్ర లేదా?. చంద్రబాబుకు మతి భ్రమించింది, ఆయనో జోకర్. చంద్రబాబు మ్యానిఫెస్టో ద్వారా ప్రజలను మరోసారి మోసం చేస్తున్నాడు. ఆయన మ్యానిఫెస్టో ఒక చిత్తు కాగితం’’ అంటూ మంత్రి వెల్లంపల్లి విమర్శలు గుప్పించారు. విప్లవాత్మక పాలనకు సీఎం జగన్ నాంది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మ్యానిఫెస్టో, నవరత్నాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించారని పేర్కొన్నారు. విప్లవాత్మక పాలనకు ఆయన నాంది పలికారన్నారు. మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టోను లోకేష్ విడుదల చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 600 హామీలతో ఇచ్చిన మ్యానిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించిందన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను టీడీపీ కాపీ కొట్టిందని దుయ్యబట్టారు.‘‘అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ చేసిన వేలకోట్ల అవినీతిని అసెంబ్లీ సాక్షిగా వివరించాం. టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ 12 వేలమంది వద్ద డబ్బు వసూలు చేసి మోసం చేసింది. పన్నులు పెంచింది టీడీపీ హయాంలో కాదా?.ఇప్పుడు ఎన్నికల కోసం టీడీపీ బూటకపు హామీలు ఇస్తోందని’’ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు. చదవండి: టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు బాబు వ్యూహం.. కేశినేనికి చెక్! -
విశాఖ బీజేపీలో అసమ్మతి సెగ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర బీజేపీలో అసమ్మతి సెగ రగిలింది. గ్రేటర్ ఎన్నికల అభ్యర్థుల ఖరారు లో జనసేన-బీజేపీ పొత్తు తో బీజేపీ సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కిల్లి శ్రీరామమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. 26 ఏళ్లుగా పార్టీ కు సేవ చేస్తున్నా 57 వ వార్డుకు తనను కాదని జనసేన కు కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకమై దాడులు) జాబితా ప్రకటించక ముందే 57వ వార్డు అభ్యర్థిగా బీజేపీ తరపున శ్రీరామమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు బీజేపీ- జనసేన సంయుక్తంగా అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని బీజేపీ నేతలు చెప్పటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం లక్ష జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి బీజేపీకి సేవ చేస్తే.. తనను ఏమి చేసావంటూ మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించడం పట్ల శ్రీరామమూర్తి అసహనం వ్యక్తం చేశారు. (బెడిసికొట్టిన జనసేన కిడ్నాప్ డ్రామా) -
వైఎస్సార్సీపీ అభ్యర్ధుల ప్రకటన
-
జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ రెండో జాబితా
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 54 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల పేర్లను పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు శుక్రవారం ప్రకటించారు. (తొలి జాబితా కోసం క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీ జీవీఎంసీ అభ్యర్థుల రెండో జాబితా విశాఖ నార్త్- డివిజన్లు 14వ డివిజన్ - కె.అనిల్‌కుమార్ 24వ డివిజన్ - పద్మారెడ్డి 26వ డివిజన్ - పీలా వెంకటలక్ష్మి 43వ డివిజన్ - పెద్దిశెట్టి ఉషశ్రీ 45వ డివిజన్ - కంపా హొనాక 48వ డివిజన్ - నీలి తిరుమలాదేవి 50వ డివిజన్ - వావిలాలపల్లి ప్రసాద్ 51వ డివిజన్ - రెయ్యి వెంకటరమణ 54వ డివిజన్ - చల్లా రజిని 55వ డివిజన్ - శశికళ విశాఖ ఈస్ట్- డివిజన్లు 10వ డివిజన్ - బొండా మాధవి 12వ డివిజన్ - అక్రమాని పుష్ప 17వ డివిజన్ - గేదెల లావణ్య 19వ డివిజన్ - సురడా వెంకటలక్ష్మి విశాఖ వెస్ట్- డివిజన్లు 56వ డివిజన్ - అదాటి శ్రీనివాసరావు 58వ డివిజన్ - జి.లావణ్య 59వ డివిజన్ - పూర్ణశ్రీ 61వ డివిజన్ - దాడి సూర్యకుమారి 62వ డివిజన్ - పల్లా లక్ష్మణరావు 63వ డివిజన్ - పిలకా రామ్మోహన్‌రెడ్డి 89వ డివిజన్ - దొడ్డి కిరణ్ 90వ డివిజన్ - చుక్కా ప్రసాద్‌రెడ్డి 41వ డివిజన్ - వై.ఫాతిమా రాణి విశాఖ సౌత్- డివిజన్లు 30వ డివిజన్ - పి.జ్యోతి. 34వ డివిజన్ - జి.గౌరి 36వ డివిజన్ - కె.స్వర్ణలత 39వ డివిజన్ - కొల్లి సింహాచలం భీమిలి 1వ డివిజన్ - అక్రమాని పద్మ 2వ డివిజన్ - సిహెచ్.కరుణాకర్‌రెడ్డి 3వ డివిజన్- ఎం.భారతి 4వ డివిజన్- ఏడుకొండలరావు 5వ డివిజన్- పి.వెంకటరమాదేవి 6వ డివిజన్ - డా.ప్రియాంక 7వ డివిజన్ - పోతుల లక్ష్మీ 98వ డివిజన్ - వై.వరాహ నరసింహం 65వ డివిజన్ - బి.నరసింహ పాత్రుడు 66వ డివిజన్- మహమ్మద్ ఇమ్రాన్ 70వ డివిజన్ - వి.రామచంద్రరావు 71వ డివిజన్- ఆర్.రామారావు 73వ డివిజన్ - బి.సుజాత 74వ డివిజన్ - టి.వంశీరెడ్డి 75వ డివిజన్- కె.భారతి 76వ డివిజన్ - బి.రమణ 78వ డివిజన్- జి.గోవిందరాజు 86వ డివిజన్- బి.సుబ్బారావు 87వ డివిజన్- పి.విజయలక్ష్మి పెందుర్తి 93వ డివిజన్- డి.అప్పలరాజు 94వ డివిజన్-ఎ.మురళీకృష్ణ 97వ డివిజన్ - జి.వెంకటలీలావతి 84 డివిజన్- పి.యశోద అనకాపల్లి 80వ డివిజన్ - కె.నీలిమ 81వ డివిజన్- పి.లక్ష్మీసౌజన్య 82వ డివిజన్- ఎం.సునీత 83వ డివిజన్ - జె.ప్రసన్నలక్ష్మి -
టీడీపీ కేరాఫ్ అమరావతి
తెలుగుదేశం పార్టీ కేంద్రీకృత విధానాలను వీడటం లేదు. వైఎస్సార్సీపీ అధికార వికేంద్రకరణ నినాదం ఇవ్వడమే కాకుండా దాన్ని పాలనలోనూ.. పార్టీలోనూ ఆచరణలో పెట్టి దూసుకుపోతుంటే.. టీడీపీ రాజధాని అమరావతినే పట్టుకొని వేలాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రీతిలోనే.. జీవీఎంసీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అమరావతి వైపే చూస్తోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో స్థానిక టీడీపీ నాయకులు ఆపసోపాలు పడి.. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల పేర్లతో ఎంపిక పూర్తి అయ్యిందనిపించి జాబితా సిద్ధం చేశారు. గురువారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. ఆ జాబితాను అమరావతికి పంపమని తాఖీదులు రావడంతో అది కాస్త వాయిదా పడింది. జాబితాను అధినేత మదింపు చేసినాక.. శుక్రవారం సాయంత్రమో.. రాత్రో విడుదల చేస్తారట!.. మరోవైపు 40 మందితో ఇప్పటికే తొలిజాబితా విడుదల చేసిన వైఎస్సార్సీపీ..శుక్రవారం తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే నామినేషన్ల ఘట్టం రెండో రోజైన గురువారం భారీసంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు కేవలం 24 నామినేషన్లే దాఖలు కాగా.. రెండో రోజు అన్ని వార్డుల్లోనూ కలిపి 308 దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. సాక్షి, విశాఖపట్నం: మహా నగర ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నా వైఎస్సార్సీపీ తప్ప మిగతా పార్టీ అభ్యర్థుల జాబితాలు వెల్లడికాలేదు. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే గురువారం 40 మందితో తొలి జాబితా విడుదల చేసింది. తుది జాబితాను సైతం సిద్ధం చేసింది. టీడీపీ అభ్యర్థుల జాబితాను గురువారమే ప్రకటిస్తారని వార్తలు వచ్చినా.. జాబితా మాత్రం విడదల కాలేదు. అభ్యర్థులు దొరకని విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆ పార్టీ నేతలు.. జాబితా సిద్ధం చేసి అధినేత చంద్రబాబుకు పంపించినట్లు ఫీలర్లు ఇస్తున్నారు. శుక్రవారం రాత్రికి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి నిమిషం వరకూ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. కాగా టీడీపీ సహా వివిధ పార్టీల నుంచి వలస వస్తున్న నాయకులతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతోంది. దానికితోడు ఇప్పటికే 40 మంది అభ్యర్థులను ప్రకటించగా వారిలో చాలామంది నామినేషన్లు కూడా దాఖలు చేసేశారు. మిగిలిన 58 వార్డులతో తుది జాబితాను శుక్రవారం ప్రకటించనున్నా.. 40 వార్డులకు అభ్యర్థులు ప్రకటించినా.. ఒకటిì æరెండు చోట్ల మినహా మిగిలిన చోట్ల ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం విశేషం. ఇదెక్కడి లెక్క..? అభ్యర్థుల ఎంపిక టీడీపీలో ఇంకా ఒక కొలిక్కి రాకపోయినా.. ఆ పార్టీ తరఫున 100 మంది నామినేషన్లు దాఖలు చేసేశారు. చాలా మంది పార్టీని వీడిపోవడంతో మిగిలిన వారిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను అన్వేషించి.. ఎలాగోలా 98 వార్డులకు అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు పంపించినట్లు సమాచారం. అమరావతిలో అభ్యర్థుల జాబితా మదింపు చేసి శుక్రవారం రాత్రికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉండగా రాత్రి జాబితా ప్రకటించి ఏం చేస్తారని టీడీపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ అంటే.. ఈ నెల 16 వరకూ బీ–ఫారం ఇచ్చేందుకు గడువు ఉండటంతో పోటీ చేయాలనుకుంటున్న వారంతా నామినేషన్లు వేసుకోవాలని స్థానిక నాయకులు సూచించినట్లు సమాచారం. ఇదే పంథాలో బీజేపీ– జనసేన కూటమి కూడా వ్యవహరిస్తోంది. పొత్తులపై ఎడతెగని మంతనాలు చేస్తున్నప్పటికీ సర్దుబాటు కుదరక జాబితా ఆలస్యమవుతోందని ఆ పార్టీల వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్ని అన్ని రాజకీయ పార్టీలూ చివరి నిమిషం వరకూ సస్పెన్స్‌తో కొనసాగించేలా చేస్తుండటంతో నగర ప్రజలు కూడా రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ తొలి జాబితా
-
జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ తొలి జాబితా
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల పేర్లను పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ... జీవీఎంసీ ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ వైస్సార్సీపీ అభ్యర్థుల తొలి జాబితా విశాఖ నార్త్ 44వ డివిజన్ - శ్రీనివాసరావు 25వ డివిజన్ - లీలావతి విశాఖ నార్త్ 46వ డివిజన్ - కె.సతీష్ 49వ డివిజన్ - అల్లు శంకరరావు విశాఖ ఈస్ట్ 9వ డివిజన్ - కె.స్వాతి 11వ డివిజన్- హరికుమార్ 15వ డివిజన్ - ఎన్.రేవతి 18వ డివిజన్ - ధనలక్ష్మి 20వ డివిజన్ - ఎన్.లక్ష్మి 21వ డివిజన్ - వంశీకృష్ణ 22వ డివిజన్- పి.గోవింద్ 23వ డివిజన్- జి.విజయసాయి 52వ డివిజన్ - జి.శ్రీధర్ 60వ డివిజన్ - డీవీ సురేష్ 91వ డివిజన్ - జ్యోత్స్న 92వ డివిజన్ - స్వర్ణలత శివదేవి విశాఖ వెస్ట్ 40వ డివిజన్ - నాగేశ్వరరావు, విశాఖ సౌత్ 27వ డివిజన్ - సర్వేశ్వర్‌రెడ్డి 29వ డివిజన్ నారాయణరావు 31వ డివిజన్ - బత్తిన నాగరాజు 32వ డివిజన్ రామరెడ్డి 33వ డివిజన్ - బచ్చినపల్లి లక్ష్మి 35వ డివిజన్ కనకనాథ్రెడ్డి 37వ డివిజన్ - వడ్డాది రాజు 38వ డివిజన్ - సత్యరూప వాణి *మిగిలిన అభ్యర్థుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తారు. -
కట్టుదిట్టంగా జీవీఎంసీ ఎన్నికలు: కలెక్టర్
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 13 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. 14న నామినేషన్ల పరిశీలన.. 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 23న పోలింగ్..27న కౌంటింగ్ జరుపుతామని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికలకు మొత్తం 1712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ నిర్వహణకి 2200 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని చెప్పారు. (ఏపీలో మోగిన పుర భేరీ) 10,600 మంది పోలింగ్ సిబ్బంది గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకి 10,600 మందిని పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించామన్నారు. ప్రిసైడింగ్ అధికారులకి సైతం ఎన్నికల నిర్వహణపై మూడు రౌండ్ల శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల తుది జాబితాకు అనుగుణంగా పూర్తి పోలీస్ రక్షణ మధ్య బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేపడుతున్నామన్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,52,927... కాగా, 8,80,481 పురుషు ఓటర్లు, 8,73,320 మహిళా ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. (ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం) కట్టుదిట్టమైన చర్యలు ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు విశాఖ కమిషనర్ ఆర్కే మీనా, డిసీపీ రంగారెడ్డి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోలీస్, రెవెన్యుతో జాయింట్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన చట్టం ప్రకారం డబ్బు,మద్యం పంపిణీ చేస్తే ఎన్నికైనా తర్వాతైనా అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయబోతున్నామని పేర్కొన్నారు. -
ఐదు పంచాయతీలు విలీనం
సాక్షి, విశాఖపట్నం: మూడున్నర దశాబ్దాల కిందట నగర పాలక సంస్థగా ఏర్పడిన విశాఖ తొలి నుంచి రాజకీయపరంగా సంచలనంగానే ఉంటోంది. 1981లో జరిగిన తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత 1987లో టీడీపీ, 1995, 2000లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. 2005లో కార్పొరేషన్‌ను మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా మారుస్తూ అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి నగర రూపు రేఖలు మారిపోయాయి. ఆర్థిక రాజధానిగా అభివృద్ధిలో పరుగులు పెట్టింది. అప్పటి వరకూ ఉన్న 50 వార్డులు 72కి చేరాయి. గాజువాక, మధురవాడ, పెందుర్తి ప్రాంతాలు జీవీఎంసీలో చేరాయి. గాజువాకను విలీనం చేసిన తర్వాత 72 వార్డులతో 2007లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రానికి, నగరానికి మహానేత వైఎస్సార్ చేస్తున్న అభివృద్ధికి ఓటేస్తూ నగరవాసులు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గ గడువు 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేసింది. దీంతో.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారి పాలనలోనే గ్రేటర్ విశాఖ కాలం గడపాల్సి వస్తోంది. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 5 పంచాయతీలు విలీనం చెయ్యండి అటు భీమిలిజోన్కు, ఇటు గ్రేటర్‌కు మధ్యలో ఉన్న ఐదు పంచాయతీలను విలీనం చేయకుండా గతంలో 81 వార్డుల విభజన పూర్తి చేశారు. అయితే.. గ్రేటర్ స్వరూపాన్ని పరిశీలిస్తే.. భీమిలి మున్సిపాలిటీకీ, జీవీఎంసీకి మధ్యలో విలీనం కాని కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, నగరపాలెం,జేవీ అగ్రహారం పంచాయతీలు ఉన్నాయి. దీంతీఓ గ్రేటర్ పరిధిలో ఈ పంచాయతీలో ద్వీపంలా కనిపిస్తాయి. అయితే.. వీటిని కలపాలని ప్రభుత్వ భావించి.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆయా పంచాయితీలన్నీ విలీనానికి అంగీకారం తెలపడంతో దానికి సంబంధించిన నివేదికను కొద్ది నెలల కిందట సీడీఎంఏకి జీవీఎంసీ పంపించింది. తాజాగా వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఆ ఐదు పంచాయతీలను కలుపుతూ వార్డు విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు టౌన్‌ప్లానింగ్ సి బ్బంది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23లోగా ప్రక్రియ పూర్తి చేసి సిద్ధం చేసిన డ్రాఫ్ట్‌ను తెలుగు, ఇంగ్లిష్ పత్రికల్లో నోటిఫికేషన్ ప్రచురించనుంది. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 30 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. రెండు వార్డుల సరిహద్దుల్లో మార్పులు? భీమిలి మండలంలోని ఐదు పంచాయతీలు విలీనం కానున్న నేపథ్యంలో ఆ జనాభా 50 వేలు దాటితేనే కొత్త వార్డు జత చెయ్యాలి. కానీ ఐదు పంచాయతీల మొత్తం జనాభా 19,116 మాత్రమే. దీంతో చుట్టు పక్కల వార్డుల్లో విలీనం చెయ్యనున్నారు. ఈ లెక్కన కేవలం రెండు వార్డుల సరిహద్దులు మాత్రమే మారనున్నాయని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఒకటో వార్డుతో పాటు 81 వార్డు సరిహద్దులు మారే అవకాశాలున్నాయని సమాచారం. 2011 జనాభా లెక్కల ప్రకారం... జీవీఎంసీ కమిషనర్ 2016 నవంబర్ 11న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌కు గ్రేటర్ పరిధిలో ప్రస్తుత జనాభా వివరాలు, వార్డుల పునర్విభజన ప్రక్రియకు అవసరమైన సమాచారాన్ని పంపించారు. అందులో వివరాల ప్రకారం వార్డుల విభజన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆ లెక్క ప్రకారం జీవీఎంసీ అధికారులు వార్డుల స్వరూపాలకు సంబంధించిన మ్యాపులను సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలు సిద్ధం చేయాలని ఆదేశాలు వార్డుల విభజన, పంచాయతీల విలీన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఎన్ని పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తారు.. వాటికోసం ఎన్ని ఈవీఎంలు అవసరం, అదనంగా ఎన్ని ఈవీఎంలు సిద్ధం చెయ్యాలి.. మొదలైన వాటన్నింటిపైనా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు చినగదిలిలోని ఈవీఎం గోదాముల్లో ఉన్న ఈవీఎం మెషీన్లని పరిశీలించే ప్రక్రియకు రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనున్నాం. జనవరి 10 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈవీఎం మెషీన్లను సిద్ధం చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ జి. సృజన తెలిపారు. -
జీవీఎంసీ పీఠంపై జెండా ఎగరాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం: త్వరలో జరగనున్న జీవీ ఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యం గా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల సాధారణ ఎన్నికల్లో నగరంలో నాలుగు అసెంబ్లీ స్థానాలను కొన్ని లోపాలు వల్ల ఓడిపోయామని, వాటిని సవరించుకుని వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త వ్యక్తులు పార్టీలో కలుస్తున్నారని, అందరినీ గమనిస్తున్నామని చెప్పారు. మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడిన వారికి తగిన గుర్తింపునిస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు అభద్రతా భావానికి గురికావొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కులమతాలకు అతీతంగా పాలన సాగుతుందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి మోపిదేవిని సన్మానిస్తున్న మంత్రి అవంతి, ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, తదితరులు ఇన్చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం, గౌరవం వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పిస్తారనడానికి తానే ఒక ఉదాహరణని చెప్పారు. తాను ఓడిపోయి ఆస్పత్రిలో ఉంటే పిలిచి మంత్రి స్థానం కల్పించి ఒక పెద్ద జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించారన్నారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి చరిత్రలో ఎన్నడూలేని విధంగా మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల అమలు చేసిని తీరు చూస్తే తండ్రిని మించిన తనయుడిగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో సదస్సుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. నగరంలో ఓడిపోయిన నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులు నిరుత్సాహం పడకుండా కార్యకర్తల్లో చైతన్యం నింపాలన్నారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో అన్ని కార్పొరేట్ స్థానాలు గెలిపించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 11 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నామంటే దాని వెనక నాయకులు, కార్యకర్తలు కష్టం ఉందన్నారు. ఇదే కసితో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ నగరంలో వార్డులు పెరిగాయని, అందులో కొన్ని వార్డులు రెండుగా విభజించబడ్డాయన్నారు. త్వరలో ఆ వార్డులకు అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు. అందరి లక్ష్యం జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడించడమే కావాలన్నారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, జగనన్న నిర్ణయాలు ప్రజల సంక్షేమానికి నాంది పలుకుతున్నాయన్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని వార్డులను కైవసం చేసుకుంటే నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు మాట్లాడుతూ కార్పొరేట్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలుస్తామన్నారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఇంకా ప్రజల దగ్గరికి వెళ్లి పింఛన్ ఇస్తామని, ఇళ్లు కట్టిస్తామని మభ్యపెడుతున్నారన్నారు. కార్యకర్తలంతా ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి నవరత్నాలను వివరించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో కొన్ని సమన్వయ లోపాలతో ఓడిపోయామని, వాటిని పునరావృతం కాకుండా అందరం సమష్టిగా పనిచేద్దామన్నారు. పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు మాట్లాడుతూ పార్టీలో ఉన్న సీనియర్ల సలహాలు తీసుకుని జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేద్దామని చెప్పారు. కష్టపడి పనిచేస్తే పదవులు అవే వస్తాయని, తనకు పదవులపై ఆశలేదన్నారు. త్వరలో నియామకం కానున్న వార్డు వలంటీర్ల విషయంలో పార్టీ వార్డు అధ్యక్షులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వార్డులో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, పాయకరావుపేట సమన్వయకర్త చిక్కాల రామారావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, సీనియర్ నేతలు బెహరా భాస్కర్, సత్తి రామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, ఫరూఖి, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, కృష్ణంరాజు, శ్యాంకుమార్‌రెడ్డి, మొల్లి అప్పారావు, శ్రీధర్, మంత్రి రాజశేఖర్, నగర అనుబంధ సంఘాల అధ్యక్షులు రాజీవ్‌గాంధీ, గరికిన గౌరి, పీలా వెంకటలక్ష్మి, బోని శివరామకృష్ణ, బద్రినాథ్, కాంతారావు, శ్రీదేవివర్మ పాల్గొన్నారు. -
ఎన్నికల తర్వాతే కొత్త మున్సిపల్ చట్టం
-
చట్ట సవరణతో పురపోరు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత మున్సిపల్ చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పురపాలక చట్టం కొలిక్కి రాకపోవడంతో చట్ట సవరణతో వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా శుక్రవారం అర్డినెన్స్ జారీ చేసింది. జూలై నెలాఖరులోగా ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు/వార్డుల సంఖ్యను ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించినందున వార్డులను హేతుబద్ధీకరిస్తూ పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సగటున 1,500 నుంచి 15 వేల జనాభా వరకు ఒక్కో వార్డు ఉండగా దీన్ని పునర్విభజనతో సవరించింది. 2011 లెక్కల ప్రకారం మున్సిపాలిటీల జనాభా, ఓటర్ల నిష్పత్తికి అనుగుణంగా వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. వాస్తవానికి కొత్త మున్సిపల్ చట్టం మనుగడలోకి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ముసాయిదా చట్టాన్ని కూడా రూపొందించింది. అయితే ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త చట్టం కోసం ఎదురుచూడకుండా ప్రస్తుత చట్టం ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. దీనికి అనుగుణంగా వార్డులను ప్రకటిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. గణనీయంగా పెరిగిన వార్డులు... సగటున జనాభా, ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోవడంతో మున్సిపాలిటీల్లో భారీగా వార్డులు పెరిగాయి. గతంలో 74 మున్సిపాలిటీల పరిధిలో 1,900 వార్డులుండగా ప్రస్తుతం 138 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఈ సంఖ్య 3,385కి చేరింది. ఆర్డినెన్స్‌కు ముందు ఈ వార్డుల సంఖ్య 2,631గా ఉండేది. చిన్న పురపాలికల్లో 1,000–1,500 ఓటర్లకు ఓ వార్డును సర్కారు ఏర్పాటు చేసింది. ఇక 50 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 2,500 నుంచి 3 వేల ఓటర్లకు ఒక వార్డు ఉండనుంది. వరంగల్ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వార్డుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 8 లక్షల జనాభా ఉన్న ఈ కార్పొరేషన్లో డివిజన్‌కు దాదాపు 15 వేల ఓటర్లు ఉంటే ఐదు లక్షలలోపు జనాభా ఉన్న మిగతా కార్పొరేషన్లలో సగటున ఆరు నుంచి ఎనిమిది వేల మంది ఓటర్లకు ఒక డివిజన్‌ను ఖరారు చేసింది. కనిష్టం 10 వార్డులు... గతేడాది ఆగస్టు 2న కొత్తగా 68 మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో అతితక్కువ జనాభా ఉన్న మండల కేంద్రాలు కూడా పురపాలికలుగా మారాయి. పట్టణీకరణను పరిగణనలోకి తీసుకున్న సర్కారు భారీగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చిన్న మున్సిపాలిటీల్లో కనిష్టంగా 10 వార్డులు ఏర్పడ్డాయి. అందులో అలంపూర్, వడ్డేపల్లి, భూత్పూర్, అమరచింత, ఆత్మకూరు, చండూరు మున్సిపాలిటీలున్నాయి. -
గ్రేటర్ ఎన్నికలకు కొత్త చిక్కు
మహా నగరపాలక సంస్థ ఎన్నికలకు మరోచిక్కు వచ్చిపడింది. ఆర్నెల్లో ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే వార్డుల విభజన, ఓటరు జాబితాల ప్రకటన పూర్తి చేసిన జీవీఎంసీ ఎన్నికల దిశగా అడుగులేస్తోంది. కానీ మహా ఎన్నికలకు కొత్త చిక్కు వచ్చిపడింది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రకటిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు మహా ఎన్నికలకు ఆటంకం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : మహావిశాఖనగరపాలక సంస్థ..ఒకప్పుడు 72వార్డులతో ఉండేది. నేడు దాని పరిస్థితి విస్తరించ డంతో వార్డు సంఖ్య 81కు చేరింది. దేశంలోనే అత్యంత పురాతమైన మున్సిపాల్టీల్లో ఒకటైన భీమిలితో పాటు అనకాపల్లి మున్సిపాల్టీలను జీవీఎంసీలో విలీనం చేశారు. అలాగే విశాఖనగరంలో అంతర్భాగంగా ఉన్న పెందుర్తి మండలంతో పాటు సబ్బవరం, పరవాడ మండలాల్లో ఒక్కో పంచాయతీ, అలాగే అనకాపల్లి మండలంలోని మూడు పంచాయతీలు జీవీఎంసీలో విలీనమయ్యాయి. ఇక భీమిలి మండలంలోని ఐదు పంచాయతీల విలీనం కోర్టు వివాదాల్లో కొనసాగుతూనే ఉంది. కాగా ఆ ఐదు గ్రామాలు మినహాయించగా మిగిలిన జీవీఎంసీ పరిధిలోని ప్రాంతాన్ని 81 వార్డులుగా విభజించి గత నెలలోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించారు. వార్డుల్లో కులాల వారీగా ఓటర్ల జాబితా గణన కూడా పూర్తి చేశారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికలకు వెళ్లేందుకు జీవీఎంసీ ఓ వైపు ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. కానీ ఇప్పుడే అసలు చిక్కు వచ్చి పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు అనివార్యంగా కన్పిస్తున్న తరుణంలో జీవీఎంసీ పరిధిలో ఉన్న అనకాపల్లి మున్సిపాల్టీ, పెందుర్తి మండలం, అనకాపల్లి, సబ్బవరం, పరవాడ మండలాల్లోని పంచాయతీల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రాంతాలన్నీ ఆరో జోన్లో ఉన్నాయి. అనకాపల్లి మున్సిపాల్టీతో పాటు అనకాపల్లి మండలంలోని వల్లూరు, రాజుపాలెం, కొప్పాక, పరవాడ మండలం తాడి గ్రామాలను కలిపి 67, 68, 69, 70 వార్డుల పరిధిగా విభజించారు. ఈ వార్డుల్లో 99,895 మంది జనాభా ఉన్నట్టుగా లెక్క తేల్చారు. ఇక పెందుర్తి మండలంలోని వేపగుంట, సుజాతనగర్, చినముషిడివాడ, పెందుర్తి, నరవ, సింహాచలం, అప్పన్నపాలెం, నాయుడుతోట, ఇస్లాంపేట, సబ్బవరం మండలంలోని వెదుళ్ల నరవ గ్రామాలు కలిపి 57, 69, 70, 71,72 వార్డులుగా విభజించారు. ఈ వార్డుల పరిధిలో లక్ష మందికి పైగా జనాభా ఉన్నారు. -
ఎన్నికల బరిలో వైఎస్సార్ టీయూసీ
జీవీఎంసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర సంఘంగా బరిలోకి దిగిన వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌పై ఏఐటీయూసీ అనుబంధ సంస్థ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించి గుర్తింపు యూనియన్‌గా అవతరించింది. దీని కాలపరిమితి ఈ నెల 9వ తేదీతో ముగిసింది. దీంతో ఎన్నికలు నిర్వహించాలంటూ వివిధ సంఘాలు కోరుతున్నాయి. తొలిసారిగా బరిలో వైఎస్సార్ టీయూసీ ఈసారి ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ బరిలోకి దిగుతోంది. జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వైఎస్సార్టీయూసీ అనుబంధ సంస్థగా పోటీలో నిలుస్తోంది. వైఎస్సార్టీయూసీతో పాటు జీవీఎంసీ పరిధిలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ ఉన్నాయి. ఏఐటీయూసీతో విబేధాలు రావడంతో ప్రస్తుత గుర్తింపు యూనియన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఓటు హక్కు కార్పొరేషన్ పరిధిలో సుమారు 11 వేల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పర్మినెంట్, ఇతర శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జీవీఎంసీకి సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. జీవీఎంసీలోని శానిటరీ వర్కర్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ వరకూ వివిధ కేడర్లలో ఉన్న శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 3,238 మంది ఓటర్లుండగా ఈసారి ఎన్నికలు నెలాఖరులోగా జరిగితే 3,400 మంది ఓటర్లుంటారు. ఒక నెల ఆలస్యమైతే ఓటర్ల సంఖ్య తగ్గనుంది. జూన్ నెలలో 120 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఏ కార్పొరేషన్లో లేని విధంగా.. రాష్ట్రంలో ఉన్న ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లోనూ గుర్తింపు యూనియన్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. కేవలం జీవీఎంసీలో మాత్రమే ఈ తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. 2002లో తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. 2004లో టీఎన్టీయూసీ, 2007లో ఏఐటీయూసీ, 2010లో స్వతంత్ర యూనియన్ వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, 2012లో ఏఐటీయూసీ, 2014లో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, 2017లో ఏఐటీయూసీ గెలుపొందాయి. ఈ ఏడాది వైఎస్సార్టీయూసీ విజయం సాధిస్తుందన్న ధీమా యూనియన్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది బూత్‌లు ఏర్పాటు మొత్తంగా ఈ నెలాఖరులోగానీ, జూన్ మొదటి వారంలో గానీ జరగనున్న ఈ ఎన్నికల కోసం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆరు బూత్‌లు, గాజువాక, మధురవాడ, అనకాపల్లిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం తొమ్మిది బూత్‌లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌కు వైఎస్సార్టీయూసీ అనుబంధ సంస్థ ప్రతినిధులు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. కమిషనర్ సైతం కార్మిక శాఖతో మాట్లాడి ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతాయని ప్రకటించడంతో ఈ నెలాఖరులోగానీ, జూన్ మొదటి వారంలో గానీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతాయని ఆయా సంఘాలు భావిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలు తొలిసారిగా కార్పొరేషన్ యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోటీ చేస్తోంది. అనుబంధ సంస్థ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించింది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో గుర్తింపు యూనియన్‌గా అవతరించి కార్పొరేషన్ పై వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌ను కోరగా సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు యూనియన్ బలోపేతానికి ఇప్పటికే పావులు కదుపుతున్నాం. – వీవీ వామనరావు, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
మళ్లీ ఎన్నికల వేఢీ
సార్వత్రిక సమరం ముగిసింది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విశాఖలో మరో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అదే మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు. స్థానిక పాలన లేకుండా ఎనిమిదేళ్లుగా నగరాన్ని అనాథని చేసిన చంద్రబాబు సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఆరు నెలల్లోగా వార్డుల విభజన పూర్తి చేసిన వెంటనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికల గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశాఖ సిటీ: ఇన్నాళ్లూ సార్వత్రిక ఎన్నికల వేడితో హీటెక్కిన విశాఖ నగరం.. ఎన్నికలు పూర్తయి చల్లబడేలోపు మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కేందుకు సిద్ధమవుతోంది. బిగ్ ఫైట్ పూర్తవ్వగానే.. అంతా లోకల్ ఫైట్ కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిదిన్నరేళ్లుగా స్థానిక సమరం కోసం ఎదురు చూసిన ప్రజలకు మరో ఆరు నెలల్లో ఆ ఎన్నికలు రానున్నాయి. అనాథగా ఎనిమిదేళ్లు గ్రేటర్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణితో.. తప్పించుకు తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం ఎనిమిదిన్నరేళ్లు గడిపేసింది. పాలక వర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారి పాలనలోనే ప్రస్తుతం మహా విశాఖ నగర పాలక సంస్థ నడుస్తోంది. గత పాలక వర్గం కాలపరిమితి 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నికలు నిర్వహించలేదు. మూడు నెలల క్రితం ప్రత్యేకాధికారి పాలన కాలపరిమితి మరో ఆరు నెలలు పొడిగిస్తూ టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేసింది. వార్డుల విభజనతో ఆగిన ఎన్నికలు 2005లో కార్పొరేషన్‌ను మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా మారుస్తూ అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకూ ఉన్న 50 వార్డులు 72కి చేరుకున్నాయి. గాజువాక, మధురవాడ, పెందుర్తి ప్రాంతాలు జీవీఎంసీలో విలీనమయ్యాయి. ఆ తర్వాత 72 వార్డులతో 2007లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.. ఈ పాలకవర్గ గడువు 2012 ఫిబ్రవరి 26తో ముగిసిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేసింది. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలను జీవీఎంసీలో విలీనం చెయ్యాలనే ప్రతిపాదన రావడంతో ఎన్నికలకు ఫుల్స్టాప్ పడింది. 2013లో ఈ రెండు మున్సిపాలిటీలను జీవీఎంసీలో విలీనం చేస్తూ.. ప్రభుత్వం జీవో నం.375ని విడుదల చేసింది. దీని ప్రకారం వార్డుల పునర్విభజన చేసి 83 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాల్ని ఆశ్రయించడంతో పునర్విభజన ప్రక్రియకు చుక్కెదురైంది. కాకినాడ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలోనూ హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం.. జీవీఎంసీ ఎన్నికలపైనా అదే తీర్పు వస్తుందనే భయంతో వార్డుల పునర్విభజన ప్రక్రియకు మరోసారి శ్రీకారం చుడుతూ ఎలాంటి ప్రణాళిక లేకుండా జీవో జారీ చేసేసింది. ప్రస్తుతం ఉన్న 72 వార్డుల్ని 81కి పెంచుతూ 2017 ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు.. దానికి సంబంధించిన చిన్న అడుగు కూడా ఇంత వరకూ వెయ్యలేదు. సరికదా.. జీవో ప్రకారం చేస్తే వార్డుల విభజన ప్రక్రియ అస్తవ్యస్తమవుతుందంటూ జీవీఎంసీ రాసిన లేఖకు కూడా సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేసేసింది. ఎన్నికలు నిర్వహించకపోతే చూస్తూ ఊరుకోం: హైకోర్టు చంద్రబాబు సర్కారు ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకున్న వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ పూర్తయింది. కాలపరిమితి ముగిసి ఇన్నేళ్లు గడిచిపోయినా జీవీఎంసీకి ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదంటూ హైకోర్టు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకెంత కాలం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 2017లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణ పూర్తి చేసింది. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారు వంటి అంశాలను 60 రోజుల్లో పూర్తి చేసి ఎన్నికలను నిర్వహించాలని వారం కిందట ఆదేశాలు జారీ చేసింది. ఇదే చివరి అవకాశమని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం వార్డుల ప్రక్రియ పూర్తి చేసేందుకు హడావిడి ప్రారంభించింది. జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. మరో వైపు హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన జీవీఎంసీ.. వార్డుల పునర్విభజన ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది మహా విశాఖ మ్యాప్‌లతో పాటు కొత్తగా విలీనం చేసిన పంచాయతీల భౌగోళిక చిత్రపటాల్ని సేకరించే పనిలో పడ్డారు. వాటిని పూర్తి స్థాయిలో సేకరించాక ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే విభజన మ్యాపింగ్ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు ఎనిమిదేళ్లుగా జీవీఎంసీకి కౌన్సిల్ లేకపోవడంతో ఎమ్మెల్యేలు సైంధవులుగా వ్యవహరించారు. మరో అధికార కేంద్రం ఏర్పడుతుందనే భయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు గ్రహణం పట్టించారు. ఎన్నికలు నిర్వహిస్తే మేయర్, కార్పొరేటర్లకు ప్రాధాన్యం పెరుగుతుందని వారి భయం. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. కాబట్టి గ్రేటర్ విశాఖకు మంచిరోజులు రానున్నాయని ప్రజలందరూ భావిస్తున్నారు. – పల్లా చిన్నతల్లి, జీవీఎంసీ మాజీ కౌన్సిలర్ విశాఖ బాగు కోసమే పిల్ వేశాను.. స్థానిక పాలన లేకపోవడంతో చిన్న చిన్న రోడ్లు వెయ్యాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. కార్పొరేటర్ల వ్యవస్థ లేకపోవడంతో ఎమ్మెల్యేలే నియంతల్లా గ్రేటర్‌ను ఏలారు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాను. హైకోర్టు దీనిపై స్పందించి ఎన్నికలపై స్పష్టమైన తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉంది. గ్రేటర్లో ఎన్నికలు జరగకపోవడంతో ఇప్పటికే రూ. 200 కోట్లు జీవీఎంసీ నష్టపోయింది.– కె. గోపాలరెడ్డి, పిల్ దాఖలు చేసిన వ్యక్తి -
ఎన్నికలంటే చంద్రబాబుకు ఎందుకు అంత భయం !
-
ఎమ్మెల్సీ మీకు.. మేయర్ మాకు
జీవీఎంసీ మేయర్ పీఠంపై సైకిల్-కమలం పట్టు తమకే ఇవ్వాలని ఎవరికివారుగా పోటీ బరిలో దిగేందుకు బడానేతల వారసులు సిద్ధం తాజాగా టీడీపీ చేతిలో ఎమ్మెల్సీ ఆయుధం దాన్ని ప్రయోగించి బీజేపీకి చెక్ పెట్టాలని ఎత్తుగడ ఎమ్మెల్సీ వారికిచ్చి.. మేయర్ పదవి కొట్టేయాలని ఎత్తుగడ జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో గానీ.. మేయర్ పీఠం విషయంలో మాత్రం ఏడాదిన్నర కాలంగా మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య పీటముడి పడింది.. అదిగో.. ఇదిగో.. అంటూ ఇన్నాళ్లూ ఈ ఎన్నికల విషయంలో కాలయాపన చేస్తూ వస్తున్న సర్కారు.. ఎట్టకేలకు ఎన్నికల దిశగా అడుగులు వేస్తుండటంతో మేయర్ గిరీ మాదంటే.. మాదని రెండు పార్టీల నేతలు పట్టుదలకు పోతున్నారు.. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో దీంతో బీజేపీకి చెక్ పెట్టాలని.. టీడీపీ ప్లాన్ వేస్తోంది..మాకిది.. మీకది పద్ధతిలో ఎమ్మెల్సీ పదవిని కమలానికి కట్టబెట్టి.. మేయర్ పదవిని కొట్టేయాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు ఎంత వరకు ఆమోదిస్తారన్నది ప్రశ్నార్థకమే.. సాక్షి, విశాఖపట్నం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో.. జీవీఎంసీ మేయర్ పీఠంపై మిత్రపక్షమైన బీజేపీతో పడిన పీటముడిని విప్పాలని టీడీపీ యత్నిస్తోంది. ఈ రెండు ఎన్నికలు దాదాపు ఒకేసారి జరిగే అవకాశాలుండడంతో అధికార పార్టీ ఈ ఎత్తు వేస్తోంది. జీవీఎంసీ ఎన్నికల విషయంలో ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇటీవల ఆ దిశగా సన్నాహాలు చేస్తుండటంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. నగర ఓటర్లు మావైపే ఉన్నారు.. మేయర్ పీఠం మాకే ఇవ్వాలని బీజేపీ, కాదు అధికారంలో ఉన్న తమకే ఇవ్వాలని టీడీపీ ఏడాదిన్నరగా పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పైకి చెబుతున్నప్పటికీ ‘మేయర్ పీఠం మాదంటే మాదంటూ’ నేతలు చేస్తున్న ప్రకటనలతో రెండు పార్టీల కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. తెరపైకి పెద్దల వారసులు పీఠం ఎవరిదన్నది తేలకపోయినా ఇరు పార్టీల ముఖ్యనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపావెంకట్‌ను బరిలోకి దింపాలని కొందరు బీజేపీ పెద్దలు భావిస్తుంటే, పార్టీ అవకాశం ఇస్తే తన కుమార్తెను బరిలో నిలపాలని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆశిస్తున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే తన కోడలైన మంత్రి నారాయణ కుమార్తెను బరిలోకి దింపాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్టు పార్టీలో బలమైన వాదన విన్పిస్తోంది. మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ పెద్దలు ఆ పీఠం మాకిస్తే మూడోవంతు సీట్లతో సరిపెట్టుకుంటామని.. లేకుంటే చెరిసగం సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. టీడీపీ చేతిలో ఎమ్మెల్సీ ఆస్త్రం ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తనకు అనుకూలంగా మలచుకొని బీజేపీ డిమాండ్‌కు చెక్ పెట్టాలని టీడీపీ యోచిస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంవీఎస్ శర్మ పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుండటంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు సన్నాహాలు మొదలయ్యాయి. ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టడంతో పట్టభద్రుల్లోనే కాదు.. పార్టీల్లో కూడా ఎన్నికల వేడి మొదలైంది. అందివచ్చిన ఈ అవకాశాన్ని అస్త్రంగా ఉపయోగించి మేయర్ పీఠంపై గురిపెట్టాలని అధికార టీడీపీ చూస్తోంది. ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించి మేయర్ పీఠాన్ని తమకే ఉంచుకోవాలన్న ఎత్తుగడను టీడీపీ పెద్దలు తెరపైకి తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావంతో పట్టభద్రుల్లో బీజేపీకి ఆదరణ ఉన్నందున ఈ స్థానాన్ని కమలం పార్టీకి కేటాయించడమే సమంజసమన్న వాదనను ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి తాము మద్దతు ఇచ్చి గెలిపించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందుకు ప్రతిగా జీవీఎంసీ మేయర్ పీఠం విషయంలో పట్టుపట్టవద్దని కమలనాధులను కోరుతున్నారు. అవసరమైతే డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని కూడా ఆశ చూపుతున్నారు. బీజేపీ సీనియర్ నేతలైన రామకోటయ్య, పృద్వీరాజ్లతో పాటు మరికొంతమంది పట్టభద్రుల స్థానం నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్టు కన్పిస్తోంది. అయితే ఎమ్మెల్సీ కంటే మేయర్ పీఠంపైనే బీజేపీ బడా నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా ఈ పీఠం దక్కించుకోవాలని ఉన్నత స్థాయిలో పావులు కదుపుతుండటంతో ఇరుపార్టీల మధ్య వేడి పెరిగింది. బల్క్‌గా ఓటర్ల నమోదు ఎమ్మెల్సీ ఎన్నికకు బల్క్‌గా ఓటర్ల నమోదును నిషేధించినట్లు జిల్లా అధికారులు ప్రకటించినా.. సంబంధిత నిబంధనలో ‘ఎనీ ఇన్స్టిట్యూషన్ (ఏ సంస్థ తరపునైనా బల్క్‌గా ఓటర్ల నమోదుకు అవకాశం)’ అన్న క్లాజ్‌ను ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున పట్టభద్రులను నమోదు చేయించేందుకు మంత్రులిరువురు పావులు కదుపుతున్నారు. మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల ద్వారా పెద్ద ఎత్తున ఓటర్ల నమోదుకు తెరతీస్తున్నారు. దీనికి అధికారులు కూడా వంత పలుకుతూ బల్క్ ఓటర్ల నమోదుకు పచ్చజెండా ఊపుతున్నారు. -
జీవీఎంసీ ఎన్నికలకు ఎమ్మెల్యేలే సైంధవులు!
కౌన్సిల్ ఏర్పడితే తమ ఆటలు సాగవని ఆందోళన ఎన్నికలు వద్దంటూ సీఎంపై ఒత్తిడి {పజాగ్రహానికి గురికావల్సి వస్తుందని సీఎం కూడా వెనుకంజ ఏడాది వరకు నిర్వహించ కూడదని అనధికారికంగా నిర్ణయం ప్రజాగ్రహానికి గురికావల్సి వస్తుందేమోనని వెనుకంజ వేస్తున్న సీఎం... మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని సందేహిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు... ఇదీ జీవీఎంసీ ఎన్నికల నిర్వహణపై సీఎం, ఎమ్మెల్యేల వైఖరి... ఏమైతేనేం... అటు సీఎం ఇటు ఎమ్మెల్యేలు జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు గ్రహణం పట్టిస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికలు మరో ఏడాదిపాటు నిర్వహించకూడదని ప్రభుత్వం అనధికారికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహించకూడదన్న ప్రభుత్వ యోచన వెనుక అసలు మతలబు ఇదీ... విశాఖపట్నం : మూడు వర్గాలు ఆరు కలహాలుగా ఉన్న నగర ఎమ్మెల్యేలు ఒక్క విషయంలో మాత్రం ఏకతాటిపైకి వచ్చారు. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవడంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా సీఎం చంద్రబాబు జీవీఎంసీ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించవద్దని అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు నిర్వహిస్తే మేయర్, కార్పొరేటర్ల ప్రాబల్యం పెరుగుతుంది. ఆ ఊహకే ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. తమ నియోజకవర్గ పరిధికి సంబంధించినంతవరకు జీవీఎంసీ పూర్తిగా తమ ఆధీనంలో ఉండాలని వారు కోరుకుంటున్నారు. స్మార్ట్‌సిటీ నిధులు భారీగా వస్తాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఆ నిధులపై కన్నేసిన ఎమ్మెల్యేలు అన్ని పనులు తామే దక్కించుకోవాలన్నది వారి ఉద్దేశం. మేయర్‌గానీ కార్పొరేటర్లుగాని వస్తే తమ నియోకజకవర్గాల్లోనే మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని ఎమ్మెల్యేలు సందేహిస్తున్నారు. అందుకే అసలు ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఏడాది వరకు ఉండవు: ఎమ్మెల్యేలకు సీఎం అభయం కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే జీవీఎంసీ ఎన్నికలకు వెళితే ఎక్కడ ప్రజాగ్రహానికి గురికావల్సి వస్తుందోనని ఆయన వెనుకంజ వేస్తున్నారు. కాని ఆ విషయాన్ని బయటపడనీయకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా తమ ప్రయోజనాల కోసం జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించవద్దని పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యేల మీద నెపం పెట్టేసి మరో ఏడాది వరకు ఎన్నికలు నిర్వహించకూడదని అనధికారికంగా నిర్ణయించారు. దాంతో ఎమ్మెల్యేలు ఖుషీ అయిపోతున్నారు. ‘మరో ఏడాది వరకు జీవీఎంసీ ఎన్నికలు లేవు.. అంతా మా కనుసన్నల్లోనే సాగుతుంది’అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 18 నెలలు గడిచిపోయాయి. మరో ఏడాది వరకు ఎన్నికలు లేవని తేలిపోయింది. అంటే అప్పటికే దాదాపు మూడేళ్లు గడిచిపోతాయి. ఆ తరువాత మరో వ్యూహంతో మిగిలిన రెండేళ్లు కూడా ఎన్నికలు నిర్వహించకుండా కాలం వెళ్లదీయొచ్చన్నది ఎమ్మెల్యేల యోచన. అటు సీఎం చంద్రబాబు... ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా సైంధవపాత్ర పోషిస్తున్నారు. -
బాబుకు మహా గుణపాఠం
► వైఎస్సార్సీపీ విజయంతో టీడీపీ పతనం మొదలవ్వాలి ► కొత్త నియోజకవర్గం..కొత్త పార్టీ కోసం గంటా అన్వేషణ ► ఏడాదిలో భీమిలికి చేసిందేమీ లేదు.. ► పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అందలమెక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవీఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, జీవీఎంసీ ఎన్నికల పరిశీలకుడు వి.విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం చిట్టివలసలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మినీకల్యాణమండపంలో జరిగిన భీమిలి పట్టణ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికారప్రతినిధి మాజీమంత్రి తమ్మినేని సీతారామ్ ..మాజీ ఎంఎల్ఎ గొల్లబాబూరావు..జల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ తదితరులు ప్రసంగించారు. తగరపువలస : అబద్దాలు ఆడి అందలమెక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవీఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, జీవీఎంసీ ఎన్నికల పరిశీలకుడు వి.విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. జీవీఎంసీలో వైఎస్సార్సీపీ పతాకం ఎగురవేయడం ద్వారా టీడీపీ పతానానికి నాందిపలకాలన్నారు. శుక్రవారం చిట్టివలసలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మినీకల్యాణమండపంలో జరిగిన భీమిలి పట్టణ పార్టీ కార్యకర్తల విస్తత స్థాయి సమావేశం జరిగింది.. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయానికి పార్టీలు మారడం.. నియోజకవర్గాలు మారడం మంత్రి గంటా శ్రీనివాసరావుకే చెల్లిందన్నారు. ఏడాదిగా మంత్రి హోదాలో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు. 2019కి ఏ పార్టీలోచేరాలి? ఏ నియోజకవర్గాన్నిఎంచుకోవాలో వెతుక్కునే పనిలో ఉన్న గంటా కావాలనే చిట్టివలస జ్యూట్‌మిల్లు,ఆర్టీసీ కాంప్లెక్స్సమస్యలు పరిష్కరించడం లేదన్నారు..మండల కన్వీనర్ల నియామకాన్ని ఈ నెల 25లోగా కమిటీలు పూర్తిచేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిరోజైన జూలై 8నుంచి సభ్యత్వ నమోదులు,సెప్టెంబర్ 2న ప్లీనరీ సమావే శాలు ఏర్పాటు చేయడానికి పార్టీ అధ్యక్షులు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ అధికారప్రతినిధి మాజీమంత్రి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ అడ్డగోలుగా అబద్దాలు చెప్ప లేకనే వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారని, నిజం మాట్లాడితే తల వెయ్యిముక్కలవుతుందని శాపంతో ఉన్న చంద్రబాబు అబద్దాలతోనే గద్దెనెక్కి ఆ అబద్దాలతోనే పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మతగ్రంధాల కన్నా ఎన్నికల మేనిఫెస్టో పవిత్రమైందని, దాంట్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని టీడీపీని విజ్ఞతకలిగిన ఓటరు 2019లో ఇంటికి పంపడం ఖాయమన్నారు. జీవీఎంసీ ఎన్నికల పీఠం చేజిక్కించుకోవడానికి టీడీపీ అధికారం, డబ్బు, మద్యం, పోలీసులతో సర్వశక్తులు ఒడ్డుతుందన్నారు.దీనిని తిప్పికొట్టడానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు సన్నద్దం కావాలన్నారు. రాష్ట్రప్రధానకార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తు జీవీఎంసీ ఎన్నికలపై ఆధారపడి ఉందన్నారు. జీవీఎంసీపై వైఎస్సార్సీపీ పతాకం ఎగిరితే టీడీపీ కుంగిపోతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనలోని వైఫల్యాలపై జూన్ మొదటి వారంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలమద్య నిరసనదీక్ష చేపట్టనున్నారని చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై ఇప్పటికే రైతు భరోసాయాత్ర చేస్తున్నారన్నారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్ మాట్లాడుతూ జ్యూట్‌మిల్లు మూతపడితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో వెంటనే తెరిపించామని గుర్తు చేశారు పట్టణ కన్వీనర్ అక్కరమాని వెంకటరావు మాట్లాడుతూ 155 ఏళ్ల భీమిలి మున్సిపాల్టీని జీవీఎంసీలో విలీనం చేయడానికి మంత్రి గంటా,ఎంపీ ముత్తంశెట్టిలు తహతహలాడు తున్నారన్నారు. సమావేశంలో పార్టీ సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, రాష్ట్ర ప్రచారకమిటీ కార్యదర్శి రవిరెడ్డి,పక్కి దివాకర్,సీనియర్ నాయకులు దాట్ల వెంకట అప్పల ప్రసాద రాజు,చందక బంగారునాయుడు,మూడు మండలాల పార్టీ అద్యక్షులు వెంపాడ శ్రీనివాస రెడ్డి, బంక సత్యం,కంటుబోతు రాంబాబు,ఆనందపురం ఎంపీపీ చెన్నా వరలక్ష్మి, ఉపాద్యక్షుడు మీసాల సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్విశాఖఎన్నికలపై వైఎసార్సీపీ సమీక్ష
-
నూతనోత్సాహం
► జీవీఎంసీ ఎన్నికల కార్యాచరణకు వైఎస్సార్సీపీ శ్రీకారం ► విజయమే లక్ష్యంగా విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి దిశానిర్దేశం ► పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ప్రజలతో మమేకం... ప్రజా సమస్యలపై పోరాటం... సమస్యల పరిష్కారానికి పార్టీ విధానంపై ప్రచారం...ప్రజా సమస్యలపై పార్టీ పంథా ఇదీ... క్షేత్రస్థాయి నుంచి బలోపేతం...కష్టించేవారికి గుర్తిం పునిస్తామన్న భరోసా...గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక..ప్రచారంలో దూకుడు.. గెలుపే లక్ష్యం..పార్టీ రాజకీయ కార్యాచరణ ఇదీ.. గ్రేటర్ విశాఖలో పాగా వేయడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాలకు తెరతీసింది. గురువారం నిర్వహించిన నగర కమిటీ సమావేశం పార్టీశ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది. పార్టీ ఎన్నికల కార్యాచరణను పరిశీలకులు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను సవివరంగా వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రణాళిక వరకు అధిష్టానం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపడతమని తేల్చిచెప్పారు. కార్యకర్తలు భరోసా కల్పిస్తూ... విజయంపై విశ్వాసాన్ని పెంపొంది స్తూ ఆద్యంతం స్ఫూర్తిదాయంగా సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి పటిష్టం జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పేర్కొన్నారు. నగరస్థాయి, నియోజకవర్గస్థాయి, డివిజన్‌స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రజ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఉద్యమిస్తామన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తే తాము ఆ సమస్యలను ఎలా పరిష్కరించేదీ కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ విధానాన్ని పరిశీలకులు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. విజయావకాశాలే ఏకైక ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఏ ఒక్క నేతకో అనుకూలంగా ఉంటే చాలు అభ్యర్థి కావచ్చన్న భ్రమలు పెట్టుకోవద్దని కుండబద్దలు కొట్టారు. కార్యకర్తలు నేరుగా సంప్రదించవచ్చన్నారు. శని, ఆదివారాలు ఇక్కడే గ్రేటర్ విశాఖ ఎన్నికల కార్యాచరణ కోసం తాము ప్రతి శని, ఆదివారాలు నగరంలోనే ఉంటామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. తద్వారా ఈ ఎన్నికలకు పార్టీ ఎంతటి ప్రాధాన్యమిస్తుందో స్పష్టం చేశారు. మత్స్యకార, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ మరో ముగ్గురిని ఎన్నికల పరిశీలకులను త్వరలో నియమిస్తుందని తెలిపారు. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు కర్తవ్యబోధ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. కేవలం మాటలు చెప్పడం కాకుండా స్వయంగా సమస్యల పరిష్కారానికి వారిద్దరూ చొరవచూపడం వారిని ఆకట్టుకుంది. నేతల ద్వారా కాకుండా నేరుగా తమను కలిసేందుకు అవకాశం ఇవ్వడంపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. జీవీఎంసీ ఎన్నికలకు ముందుగానే పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగడంతో కార్యకర్తల్లో నమ్మకం పెరిగింది. సమావేశం అనంతరం కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డిలను కలసి పార్టీ పటిష్టపై చర్చించారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కర్రి సీతారాం, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్‌ప్రసాద్, గొల్ల బాబూరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, సమన్వయకర్తలు కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, హనోక్, సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు రవిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు విల్లూరి భాస్కర్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్‌లతోపాటు ఇతర అనుబంధ సంఘాలు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షులకు ప్రశ్నావళి గ్రేటర్ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. అందుకు నిదర్శనంగా డివిజన్ అధ్యక్షులకు ఓ ప్రశ్నావళితో కూడిన ప్రొఫార్మాను అందించింది. డివిజన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారంతోపాటు రాజకీయ, సామాజిక అంశాలను అందులో ప్రశ్నల రూపంలో పొందుపరిచారు. ఆ ప్రశ్నావళిని నింపి వచ్చేవారం నిర్వహించే సమావేశంలో తమకు అందించాలని పరిశీలకులు తెలిపారు. తద్వారా తమ డివిజన్లపై అధ్యక్షులకు ఎంత అవగాహన ఉందన్నది తెలుసుకోవడంతోపాటు క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమచారాన్ని రాబట్టాలన్నది పార్టీ ఉద్దేశం. -
మహా సమరశంఖం
► జీవీఎంసీ ఎన్నికల దిశగా వైఎస్సార్సీపీ కసరత్తు ► పరిశీలకులుగా విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి ► గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహరచన సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ ఎన్నికల దిశగా సన్నాహాలకు వైఎస్సార్ కాంగ్రెస్ తెరతీసింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కసరత్తు చేపట్టింది. అందుకోసం ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర పా లకమండలి సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఎన్నికలకు సంబంధించినంతవరకు ఈ కమిటీకి స్పష్టమైన విధివిధానాలను అధిష్టానం నిర్దేశించింది. పార్టీ సంస్థాగత బలోపేతం, నేతలు-కార్యకర్తలతో సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎన్నికల వ్యూహాన్ని ఈ ద్విసభ్య కమిటీ పర్యవేక్షిస్తుంది. త్వరలో వీరిద్దరూ నగరంలో పర్యటించి కార్యాచరణకు ఉపక్రమిస్తారు. సంస్థాగత బలోపేతం : జీవీఎంసీ పరిధిలో పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ కమిటీ మొదటగా దృష్టిసారిస్తుంది. ఇప్పటికే నియమించిన నగర కమిటీతోపాటు డివిజన్, అనుబంధ సంఘాల కమిటీల నియామకాలపై కసరత్తు చేస్తుంది. పార్టీలోకి అవసరమైన కొత్త నేతల చేరికలు, పార్టీ బలోపేతం కోసం ఇతరత్రా చర్యలపై చర్చించి నిర్ణయిస్తుంది. ప్రాథమిక సమాచారంపై ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించింది. ప్రజాసమస్యలపై పార్టీని పోరుబాటు పట్టించాలని కమిటీ నిర్ణయించింది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, హుద్‌హుద్ బాధితులకు పునరావాసంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఇప్పటికే పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. జిల్లా పార్టీ సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ ఉద్యమిస్తూనే ఉంది. గాజువాక నియోజకవర్గ సమస్యల పరిష్కారించాలన్న డిమాండుతో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిం చారు. దీంతోపాటు మరింత విసృ్తతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు జరపాలని పార్టీ భావిస్తోంది. మరింత సమన్వయం: విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు పార్టీలో సమన్వయాన్ని మరింత పెంపొందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కమిటీల సభ్యులు, కార్యకర్తలు అందరి మధ్య మరింత సమన్వయం సాధించడం ద్వారా పార్టీని బలోపేతం చేస్తారు. అందరికి అందుబాటులో ఉంటూ అందరి అభిప్రాయాలు క్రోడీకరించి ఎన్నికల వ్యూహ రచన చేస్తారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడం ద్వారా పార్టీని ఎన్నికల దిశగా సమరసన్నద్ధం చేయడంపై దృష్టిసారిస్తారు. అభ్యర్థుల ఎంపిక: కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి చేపడతారు. మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేస్తారు.సున్నితమైన వ్యవహారమైనందున అత్యంత జాగురకతతో వ్యవహరిస్తారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం, పార్టీ కోసం కష్టించినవారికి గుర్తింపునకు పెద్దపీట వేస్తూ అంతిమంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తారు. అందుకు సన్నాహకంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో విసృ్తతంగా సంప్రదింపులు జరుపి అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారు. ప్రచారం- ఎన్నికల వ్యూహం : సంస్థాగత బలోపేతం, సమన్వయం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలకు సమాంతరంగా విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి జీవీఎంసీ ఎన్నికల వ్యూహం, ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఓ ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తారు. దాంతోపాటు నియోజకవర్గాలు, డివిజన్లవారీగా స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ కూడా ఎన్నికల కసరత్తు జరుపుతారు. స్థూలంగా చెప్పాలంటే జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి ఆద్యంతం అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిల కమిటీ పర్యవేక్షించి కార్యాచరణ రూపొందిస్తుంది. పార్టీ విజయమే లక్ష్యం టీడీపీ ప్రభుత్వ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబుకు గుణపాఠంచెప్పాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారు. ఈ అంశాలనే ప్రాతిపదికగా చేసుకుని జీవీఎంసీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్‌ను సన్నద్ధం చేస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పార్టీని సమరసన్నద్ధం చేస్తాం. జిల్లా పార్టీ, నియోజకవర్గ సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలు అందర్ని అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటాం. పార్టీ విజయానికి అన్ని చర్యలను తీసుకుంటాం. త్వరలో విశాఖలో పర్యటిస్తాం. -చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎన్నికల పరిశీలకుడు -
జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి
* ఓటర్ల నమోదుకు ఆధార్ తప్పనిసరి * జనవరి 16న కొత్త ఓటర్ల జాబితా ప్రకటన * జిల్లా ఓటర్ల జాబితా సవరణ పరిశీలకుడు డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి సాక్షి, విశాఖపట్నం: త్వరలో జీవీఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా ఓటర్ల జాబితా సవరణ పరిశీలకుడు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలతో ఓటర్ల జాబితా సవరణపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 16న ఓటర్ల జాబితా ప్రకటించనున్నందున నగర పరిధిలో వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి 18ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలన్నారు. నకిలీ ఓటర్లు, డూప్లికేషన్ నివారించేందుకు ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ పలు పార్టీల ప్రతినిధులు సూచించగా, ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి నిర్ణయం మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ నవంబర్ 13 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు క్లైమ్లు, అభ్యంతరాలను తీసుకుంటున్నామన్నారు. నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 13,14 తేదీల్లో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ప్రత్యేక క్యాంపైన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 28లోపు వీటిని పరిశీలించి జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డులో ఆధార్ సంఖ్యను నమోదు చేస్తున్నామన్నారు. ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో తగినన్ని పోలింగ్ స్టేషన్లను ఉన్నాయని, అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ నాయకుడు సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 2.50 లక్షల నకిలీ కార్డులున్నట్టుగా ఆరోపణలున్నాయని, వాటి తొలగింపుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పక్కి దివాకర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎస్.సుధాకర్ సూచించారు. బీజేపీ, సీపీఐ, బీఎస్పీ నాయకులు బి.ఎస్.నాయుడు, డి.మార్కండేయులు, జార్జి బంగారి తదితరులు పలు సూచనలు చేశారు. ఏజేసీ డి.వి.రెడ్డి, డీఆర్వో కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.