hanumanthu
-
ప్రణీత్ హనుమంత్ కి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు..
-
ప్రణీత్ హనుమంతు అరెస్ట్ ఈడ్చుకొస్తున్న పోలీసులు
-
పవన్ వ్యాఖ్యలు అభ్యంతరకరం
మహారాణిపేట(విశాఖ దక్షిణ): రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంతోపాటు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను కించపరుస్తూ జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మాట్లాడటాన్ని రాష్ట్ర వికేంద్రీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ తీవ్రంగా ఖండించారు. త్వరలోనే కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్న విషయం పవన్‌కళ్యాణ్‌కు తెలియదా... అని ప్రశ్నించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సౌకర్యాన్ని సమకూర్చి, ఆ ప్రాంతంలో రీసెర్చ్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న వాస్తవాన్ని గ్రహించకుండా విమర్శించడం సరికాదన్నారు. ఇప్పటికే 63 డయాలసిస్ మెషిన్లు హరిపురం, కవిటి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలైనా ఈ పని చేశాయా అని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో సమస్యలు పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులను ప్రతిపాదించిందన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా కాకుండా ఆపడం ఎవరితరం కాదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సానుకూల ప్రకటన చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావును విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. మూడు రాజధానులకు, ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు. -
పాటల తూటాల యోధుడు
పాట పోరాట రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. అలాంటి పాటల ప్రవాహానికి బలాన్నీ, బలగాన్నీ సమకూర్చిన వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు. ‘బాంచెన్ దొర కాలు మొక్కుతా’ అన్న వారితో బందూకులను పట్టించిన పాటలు ఆయనవి. హరికథ, బుర్రకథ, యక్షగానాలతో బూజు పట్టిన నిజాం నిరంకుశ పాలకుల కోట గోడలను కూల్చివేసిన జనగీతం ఆయన. 1910లో నేటి యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో లక్ష్మీ నరసమ్మ, బుచ్చి రాములు దంపతులకు జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆయన పాటలు తెలంగాణలోని ప్రతి గడపగడపను తట్టి లేపాయి. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖలో చిన్న ఉద్యోగం చేస్తూ ప్రజోద్యమాలకు ఊతం ఇచ్చేవారు. ఇది గమనించిన ప్రభుత్వాధికారులు ఆయన్ని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు హెచ్చరించారు. దీంతో హనుమంతు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పాటలతో నిజాం రాక్షస పాలనపై రణభేరి మోగించాడు. 1944లో 11వ ఆంధ్ర మహాసభ సమావేశాలు భువనగిరిలో జరిగాయి. హనుమంతు వాలంటీర్‌గా పని చేశారు. ఆ సమావేశాల్లో నాయకుల ప్రసంగాలను విని హనుమంతు పోరాట మార్గాన్ని ఎంచుకుని తన కలానికి గలానికి మరింత పదును పెట్టాడు. ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపునందుకుని ప్రతి గ్రామంలో సంఘం పెట్టడానికి ప్రజలను చైతన్యవంతం చేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1946–51 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో హనుమంతు కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించారు. ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న /ఎంత జెప్పిన తీరదో కూలన్న’ అంటూ దుర్మార్గమైన వ్యవస్థను సుద్దాల హనుమంతు తన పాటల్లో వర్ణించాడు. ‘పల్లెటూరి పిల్లగాడ!/ పసులగాసే మొనగాడా!/పాలు మరిసి ఎన్నాళ్ళయిందో’ అంటూ వెట్టి చాకిరీతో నలిగిపోతున్న తెలంగాణ బాల్యాన్ని హనుమంతు ప్రపంచానికి పరిచయం చేశాడు. ‘సంఘం వచ్చిందరో రైతన్న మనకు బలం తెచ్చిందిరో కూలన్న‘ అంటూ ఆయన పాడుతూ ఉంటే ప్రజలకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. ఏయే దొర కబంధ హస్తాల్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో వివరాలను సేకరించి... దొరల భూ అక్రమాలను పల్లె సుద్దుల రూపంలో చెబుతూ ప్రజలను చైతన్యపరిచారు. ఆయన పాటలు తెలంగాణ జనం నాలికల మీద నాట్యం చేసేవి. నాటి తెలంగాణ పోరాటంలో హనుమంతు రాసిన పాటలు పాడని గ్రామం లేదు. ఆయన ప్రజల భాషలో యాసలో, శైలిలో ప్రజాపయోగమైన ఎన్నో పాటలు రాసి, పాడి పలు ప్రదర్శనలు ఇచ్చారు. హనుమంతు బుర్రకథ చెబితే గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమవుతుందనీ, ఫిరంగిలా పేలుతుందనేంతగా ఆనాటి ప్రజల అభిప్రాయం. రాజంపేట మండలం రేణిగుంటలో కమ్యూనిస్టు గ్రామసభలో ‘మాభూమి’ నాటకం గొల్ల సుద్దుల ప్రదర్శనలు చేస్తున్న సమయంలో నిజాం మూకలు వస్తున్నాయని తెలిసి చెట్టుకొక్కరు పుట్టకొకరుగా జనం పారిపోతున్న క్రమంలో... ఓ ముసలావిడ కర్రను హనుమంతు తీసుకొని భూమిపై కర్రతో కొడుతూ ‘వేయ్ వేయ్ దెబ్బకు దెబ్బ’ అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకు తరిమికొట్టారు. ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక ఘట్టం. 1982 అక్టోబర్ 10న క్యాన్సర్ వ్యాధి కారణంగా తన జీవన ప్రస్థానాన్ని ముగించిన హనుమంతు చరిత్రను జాగ్రత్తగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. – అంకం నరేష్ యూఎఫ్ఆర్టీఐ తెలంగాణ కో–కన్వీనర్ -
ఆర్టీసీ సమ్మె విరమణ పేరిట మోసం..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ బుధవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా.. జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. సమ్మెలో ఇప్పటివరకు 29మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని ఆయన తెలిపారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని తెలిపారు. దీనికితోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం.. కార్మికులను మోసం చేయడమేనని హనుమంతు మండిపడ్డారు. ఇలా విరమించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే సమ్మె విరమిస్తే సరిపోయేదని, కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ కేవలం మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయని పేర్కన్నారు. ఆర్టీసీ కార్మికులు చాలావరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు. -
పోలీసుల వలలో మోసగాడు
కాకినాడ క్రైం: రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 కోట్లు ఇస్తానని చెప్పి ప్రజలకు రూ.30 లక్షల వరకు టోకరా వేసిన ఘరానా మోసగాడిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కారు, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మోసాలను కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు మంగళవారం వివరించారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడకు చెందిన షేక్ సర్దార్ హుస్సేన్ అలియాస్ శివాజీ ఇరిడియం కాపర్ బిందెలతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి 15 మందిని మోసం చేసి రూ.30 లక్షలు వసూలు చేశాడు. ఇరిడియం కాపర్ బిందెలను అమ్మకానికి పెట్టి విదేశాల్లో కోట్ల రూపాయలను సంపాదించవచ్చని ప్రజలను నమ్మించాడు. అంతర్జాతీయ అణు సంస్థ, ఆర్కియాలజీ శాఖలో పనిచేస్తోన్న హనుమంతు అనే వ్యక్తి పేరుపై లెటర్‌హెడ్, ఆర్బీఐ గవర్నర్ లెటర్ ప్యాడ్, ప్రధాని మోదీ సంతకంతో ఓ నకిలీ లెటర్ హెడ్లను సృష్టించాడు. ఆర్బీఐ నుంచి రూ.500 కోట్లు కంటైనర్‌లో వస్తుందని, ఇరిడియం అనే కాపర్ వస్తువు 230 ఏళ్ల క్రితందని, గవర్నమెంట్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్టుమెంట్ వారు సర్టిఫై చేసిన నకిలీ పేపర్‌ను చూపించి నమ్మించాడు. తనకు రూ.5 లక్షలు ఇస్తే రూ.10 కోట్లు ఇస్తానని నమ్మించడంతో 2018 డిసెంబర్లో ఏలూరుకు చెందిన ఆదూరి హరిమోహన్ అనే వ్యక్తి రూ.5 లక్షలు హుస్సేన్‌కు ఇచ్చాడు. ఆ తరువాత హరిమోహన్ తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని హుస్సేన్‌ను ఒత్తిడి చేశాడు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ రాయుడుపాలెంలో ఓ లాడ్జి వద్దకు వస్తే రెండు రోజుల్లో రూ.500 కోట్లు వస్తున్నాయని అందులో నుంచి రూ.10 కోట్లు ఇస్తానని హరిమోహన్‌కు హుస్సేన్ చెప్పాడు. ఈయన మాటలు నమ్మి అక్కడికి వెళ్లగా అప్పటికే తనలా డబ్బులు ఇచ్చి మోసపోయిన 15 మంది ఉన్నారని, తనను రూమ్‌లోకి తీసుకువెళ్లి డబ్బులు కోసం అడిగితే చంపుతానని బెదిరించి హుస్సేన్ పారిపోయాడని హరిమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులు హుస్సేన్‌తో పాటు అతడికి సహకరించిన విశాఖకి చెందిన పైలా సత్యవతి, సురేష్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. -
బ్యాడ్మింటన్ ఆడతా..
ఆయన జిల్లాకు బాస్. ప్రతిరోజు అధికారిక విధుల్లో బిజిబిజీగా గడుపుతుంటారు. అయినా ఇంటికొచ్చాక మాత్రం ముద్దుల కూతురుతో కాసేపు గడపనిదే నిద్రపోరు. రోజువారీ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే జీవితం నుంచి కాసేపు అలా కుటుంబంతో సేద తీరుతారు. ఎప్పుడూ సాదాసీదా వ్యక్తిలా కనిపించే ఆయన.. నిత్యం వివిధ శాఖల అధికారులకు పాలనపరంగా ఆదేశిలిస్తుంటారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్న ఆయనే కుమురం భీం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు. రోజంతా జిల్లా అధి కారులతో సమీక్షలు, సమావేశాలు, పర్యటనలతో బిజిబిజీగా ఉం డే ఆయనను ‘సాక్షి పర్సనల్ టైం’ లో కాసేపు గడిపి ఆయ న వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, ఆసిఫాబాద్ : మాది శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ. అమ్మ వనజాక్షి స్కూల్ టీచర్. నాన్న క్రిష్ణారావు రిటైర్డ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి. మా సోదరి రజని. ప్రస్తుతం యూఎస్‌లో న్యూరాలజీ చేస్తున్నారు. నా విద్యాభాస్యం విషయానికి వస్తే పొలాకిలో ఎనిమిదో తరగతి వరకు, పలాసలో ఇంటర్మీడియెట్, వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తిచేశా. క్యాంపస్ ఇంటరŠూయ్వలో ఉద్యోగం వచ్చినా చేరకుండా.. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. అలా మొదటిసారి 2010లో ఐఆర్‌టీఎస్‌కు ఎంపికయ్యా. 2012లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఇంట్లో అమ్మనాన్నలిద్దరూ కూడా విద్యావంతులే. ఉద్యోగస్తులు కావడంతో చిన్నప్పటి నుంచి నాకు అన్నింటా ప్రోత్సాహాం ఉండేది. నాకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఇక నాపేరు విషయానికి వస్తే మా తాతకు గాంధీ కుంటుంబంపై అభిమానం ఎక్కువ. అందుకే నాకు రాజీవ్‌గాంధీ అని పేరు పెట్టారు. హన్మంతు మా ఇంటి పేరు. విజయలక్ష్మీతో వివాహం.. నేను ఐఆర్‌టీఎస్‌కు ఎంపికైన మరుసటి ఏడాది 2011లో విజయలక్ష్మీతో నా వివాహం జరిగింది. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తను ఎల్ఎల్బీ పూర్తిచేశారు. ఆమెకు దైవభక్తి ఎక్కువ. మా కూతురు ప్రేరణదేవి. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ చదువుతోంది. అధికారిక విధుల్లో రోజులో ఎక్కువ టైం గడిచిపోతోంది. మా పాపతో ఎక్కువగా గడపలేకపోతుంటాను. ఈ లోటును మా ఆవిడ భర్తీ చేస్తారు. మా కూతురు పెంపకం బాధ్యత మొత్తం ఆమె చూసుకుంటారు. కాసేపు మా పాపతో.. నిత్యం విధి నిర్వహణలో బిజిబిజీగా రోజంతా గడిచిపోతోంది. ఇంటికి వెళ్లాక మాత్రం కాసేపు తప్పకుండా మాపాప ప్రేరణతో గడుపుతుంటాను. దీంతో పనిఒత్తిడి నుంచి కాస్తా రిలాక్స్‌గా అనిపిస్తుంది. బుక్స్ చదువుతా.. ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ బాగే ఆడేవాడిని. కొత్తగూడెం కలెక్టర్‌గా ఉన్నప్పు డు కూడా తీరిక సమయంలో ఆడేవాడిని. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు లేకపోవడంతో కుదరడం లేదు. తీరిక సమయాల్లో పుస్తకాలు చదువుతా. చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటా. చిన్నప్పటి నుంచి కోస్తా తీరంలోని సముద్ర తీరం ప్రాంతంలో పెరగడంతో సీ ఫుడ్ బాగా అలవాటు అయింది. నాన్‌వెజ్‌లో చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటా. అక్క నా మార్గదర్శి.. చిన్నప్పటి నుంచి మా అక్క రజని అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు అన్ని విషయాల్లో మార్గదర్శంగా ఉండేది. వైజాగ్‌లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్న సమయంలో తను అదే యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసేది. నా సివిల్స్ ప్రిపరేషన్ సమయంలోనూ ఎంతగానో తోడ్పాటునందించింది. అయితే ప్రస్తుతం ఆమె యూఎస్‌లో ఉంటుంది. అక్క మాకు దూరంగా ఉంటుందనే బెంగ ఉంటుంది. పీహెచ్డీ చేయాలి... నేను బీటెక్ వరకే చదివి సివిల్స్‌కు ఎంపికవడంతో అక్కడికే నా చదువు ఆగిపోయింది. ఐఏఎస్‌లకు విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం వస్తే విదేశాల్లో ఉన్నత చదువులు చదివి పీహెచ్డీ పూర్తి చేయాలని ఉంది. ఆ రెండు సంతృప్తినిచ్చాయి.. నేను భద్రాద్రి కొత్తగూడెంలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్టు (దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం) భూ సేకరణ విజయవంతంగా పూర్తి చేశాను. అది నాకు ఎంతోగానో సంతృప్తినిచ్చింది. అంతకు ముందు అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు వరంగల్‌లో ఆడపిల్లల అమ్మకంపై మీడియాలో వచ్చిన ఆ కేసును నేనే డీల్ చేశా. ఆ ఆసుపత్రిని సీజ్ చేశా. కారకులను పట్టుకుని శిక్షించాం. ఇక్కడి వాతావరణం నచ్చింది.. ఇక్కడి వాతావరణం నాకు బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినందున నాకు పెద్దపెద్ద మెట్రో నగరాల కంటే భద్రాచలం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలంటేనే ఇష్టం. ఇక్కడ విధులు నిర్వహించడం నాకో ఎంతో సంతృప్తినిస్తోంది. -
అవినీతి శంకరం
బుధవారం ఉదయం 6.30 గంటలు.. నర్సీపట్నంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్రావు బస చేసిన ప్రైవేట్ లాడ్జి.. ఏసీబీ అధికారులు తలుపు కొట్టారు.. నిద్ర కళ్లతో తలుపు తీసిన కమిషనర్ అవాక్కయ్యారు.. ఆయనను మున్సిపల్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఇలా.. విశాఖ ఎంవీపీ కాలనీలోని శంకరరావు ఇల్లు, మధురవాడలోని ఆస్తులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అతని బంధువుల ఇళ్లు, ఆస్తులను.. మొత్తం 14 చోట్ల తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన అక్రమాస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.20కోట్లపైనే ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు. సీతమ్మధార (విశాఖ ఉత్తరం)/నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకరరావు ఐదు రోజుల క్రితమే బదిలీపై వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు బొబ్బిలి నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఈ నెల 15న విధుల్లో చేరారు. అంతలోనే ఏసీబీ దాడులు జరగడం నర్సీపట్నంలో కలకలం సృష్టించింది. విశాఖలోని ఆయన ఇల్లు, ఆస్తులు.. అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అతని తండ్రి, పలాస మండలం బ్రాహ్మణతర్లాలో అతని మామగారిళ్లలోనూ సోదాలు జరిగాయి. బొబ్బిలిలో ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఉదయాన్నే నర్సీపట్నం చేరుకున్నారు. శంకరరావును మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి... అక్కడ కమిషనర్‌కు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. 1988లో పురపాలికశాఖలో హెల్త్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన శంకరరావు తదనంతరం పదోన్నతిపై శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. 2008లో గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్‌గా నెల్లిమర్ల, బొబ్బిలిలో విధులు నిర్వహించారు. నర్సీపట్నంలో ఐదు రోజుల క్రితమే విధుల్లో చేరారు. ఆయన నివసిస్తున్న లాడ్జిలో ఎప్పటి నుంచి ఉంటున్నది, అడ్వాన్స్‌గా ఎంత చెల్లించారని లాడ్జి మేనేజర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు మేనేజర్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అదే సమయంలో కమిషనర్‌కు టిఫిన్ తీçసుకొచ్చిన మధును కూడా ప్రశ్నించారు. అనంతరం ఏసీబీ సీఐ గణేష్ విలేకరులతో మాట్లాడుతూ కమిషనర్ శంకరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినల్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. నర్సీపట్నంలో జరిపిన తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు ఇతర రికార్డులు లభించాయన్నారు. కమిషనర్ శంకరరావును కస్టడీలోకి తీసుకుని విశాఖపట్నం తరలించారు. అతడిని అరెస్ట్ చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఎంవీపీ కాలనీలోని హనుమంతు శంకరరావు సొంత ఇల్లు వుడా కాలనీలో సోదాలు పీఎం పాలెం(భీమిలి): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావు ఆస్తులపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా మిథిలాపురి ఉడా కాలనీలో గల మూడంతుస్తుల భవనం మొదటి ఫ్లోర్లో శంకరరావు బంధువు కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆ ఇంటిలో సుమారు 5గంటలపాటు సోదాలు జరిపారు. పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐ పుల్లారావు, సిబ్బంది పాల్గొన్నారు. బొబ్బిలిలో.. బొబ్బిలి: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకరరావు ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈనెల 14న బొబ్బిలి నుంచి బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ హెచ్.శంకరరావు జిల్లా కేంద్రంలోని పూల్‌బాగ్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో నివశిస్తున్నారు. ఆయన కుటుంబం జిల్లా కేంద్రంలోనే ఉండడంతో ఏసీబీ డీఎస్పీ డీవీఎస్ నాగేశ్వరరావు నేృతృత్వంలోని సిబ్బంది బుధవారం ఉదయం 8 గంటల నుంచి తనిఖీలు ప్రారంభించారు. అయితే తనిఖీలకు కమిషనర్ భార్య ముందు ఒప్పుకోకపోగా.. డీఎస్పీ నాగేశ్వరరావు నచ్చజెప్పారు. తనిఖీల్లో కీలకమైన పత్రాలు సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐలు సతీష్, జి. అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. గుర్తించిన అక్రమాస్తులివీ... ♦ విశాఖపట్నం ఎంవీపీ కాలనీ, సెక్టార్ – 4లో 207 గజాల విస్తీర్ణంలోని ఇల్లు భార్య హనుమంతు ఈశ్వరీబాయి పేరున 2017లో కొనుగోలు చేశారు. ♦ మధురువాడ వాంబేకాలనీలో 236 గజాల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవనం తండ్రి పేరున కొనుగోలు. ♦ భీమిలి, సంగివలస, నేరెళ్లవలసలో 60 సెంట్ల భూమి కొనుగోలు చేశారు. ♦ భీమిలి సమీప కుమ్మరిపాలెంలో భార్య హనుమంతు ఈశ్వరీబాయి పేరు మీద 266.6 గజాల స్థలం 2002లో కొనుగోలు చేశారు. ♦ 100 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు గుర్తించారు. ♦ స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా చిట్టివలస, భీమిలి బ్రాంచిల్లోని లాకర్లలో రూ.5.20 లక్షల నగదు గుర్తించారు. ♦ బొబ్బిలిలోని కరూర్ వైశ్య బ్యాంకులో రూ.2.50లక్షల విలువ గల బంగారం తనఖాలో ఉన్నట్లు గుర్తించారు. ♦ ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కలకలం టెక్కలి/కాశీబుగ్గ: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావుపై ఏసీబీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. టెక్కలి గోపినాథపురంలో శంకరరావు తండ్రి నర్సింగరావు పేరుతో ఉన్న ఇంటికి ఉదయం 8 గంటలకే ఏసీబీ అధికారులు చేరుకున్నా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం వరకు వేచి చూసి పక్కనే అద్దెకు ఉంటున్న వారి నుంచి వివరాలు తీసుకున్నారు. కమిషనర్ శంకరరావు అత్తామామలు కణితి సావిత్రి, సూర్యనారాయణలు పలాస మండలం బ్రాహ్మణతర్లాలో నివాసముంటున్నారు. సూర్యనారాయణ డ్రిల్‌మాస్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో విశాఖ ఏసీబీ సీఐ మహేశ్వరరావు ఆధ్వర్యంలో సూర్యనారాయణ ఇంట్లో అణువణువూ శోధించారు. ఉదయం ఏడు గంటల నుంచి బీరువాలు, పెట్టెలు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్‌పుస్తకాలు, పలు వస్తువులు క్షుణ్నంగా పరిశీలించారు. శంకరరావు పెద్ద బావమరిది చక్రధర్ విశాఖపట్నంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, చిన్న బావమరిది భువనేశ్వర్ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ దాడుల నేపథ్యంలో చక్రధర్ విశాఖ నుంచి బ్రాహ్మణతర్లా చేరుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఏసీబీ సిబ్బంది రాము, మాధవరావు, కాశీబుగ్గ షీటీం పోలీసులు మాధవి తదితరులు పాల్గొన్నారు. -
ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
మేడ్చల్: జిల్లాలోని కీసర మండలం తిమ్మాయిపల్లె క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. కీసర వైపు స్కూటర్‌పై వెళ్తున్న ముగ్గురిని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతులు బాలాజీనగర్‌కు చెందిన డీ హనుమంతు(26), బీ హనుమంతు(25), బూరుగుపల్లికి చెందిన శ్రీనివాస్(25)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ట్యాంకర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
గురజాల వద్ద రోడ్డు ప్రమాదం; రైతు మృతి
కర్నూలు(నందవరం): నందవరం మండలం గురజాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హనుమంతు(40) అనే రైతు మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో చోటుచేసుకుంది. హనుమంతుతో పాటు మరో రైతు పుల్లయ్య పొలానికి నీళ్లు పెట్టడానికి రాత్రి వెళ్లారు. నీళ్లు పెడుతూ కాపలాగా రోడ్డు పక్కనే నిద్రించారు. రోడ్డుపై పడుకున్న హనుమంతుపై నుంచి గుర్తుతెలియని వాహనం వెళ్లటంతో హనుమంతు శరీరం నుజ్జునుజ్జయింది. పుల్లయ్యకు ఎటువంటి గాయాలు కాలేదు. -
నాన్న వద్దకే వెళ్తున్నా..
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య బనవాసిలో యువకుడి అఘాయిత్యం ఎమ్మిగనూరు రూరల్ : ‘నాన్న, అన్న నిత్యం కలలోకి వస్తున్నారు.. నన్ను రమ్మంటున్నారు.. వారంటే నాకు చాలా ఇష్టం.. వారి వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నా.. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి’ అని సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు బనవాసి గ్రామానికి చెందిన హనుమంతు. ఉద్యోగ సాధనలో భాగంగా కోచింగ్ తీసుకుంటున్న అతడు ఉన్న ఫలంగా ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలు.. మాధవరం మండలం సింరాజన్‌పల్లెకు చెందిన లక్ష్మణ్ణ, నాగమ్మకు దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె. భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందడంతో నాగమ్మ పుట్టినిల్లు బనవాసికి వచ్చి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో మతిస్థిమితం కోల్పోయిన పెద్దకుమారుడు ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసుకున్న మరో కుమారుడు హనుమంతు ఎప్పుడూ తండ్రి, సోదరున్ని గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుండేవాడు. డిగ్రీ పూర్తి చేసుకున్న హనుమంతు కర్నూలులో గ్రూప్స్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం అన్న కుమారులు బాబాయ్‌ను చూడాలంటే ఇంటికి వ చ్చాడు. పిల్లలు, కుటుంబీకులతో సోమవారం రాత్రి వరకు నవ్వుతూ, నవ్విస్తూ గడిపిన హనుమంతు రాత్రి స్నేహితుల గదికి వెళ్లి పడుకున్నాడు. అప్పటికే థిమెట్ గుళికలు మింగి ఉండడంతో తెల్లారేసరికి మరణించాడు. రాత్రి 12 గంటల సమయంలో క ళ్లు తిరుగుతున్నట్లు చెప్పడంతో మంచినీళ్లు తాపించామని స్నేహితులు తెలిపారు. రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదు, నాన్నా, అన్నలు రమ్మంటుంటే వెళ్తున్నాని సూసైడ్ నోట్ రాసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నామన్నారు. -
సీమాంధ్ర ఎంపీలు గిట్లజేత్తరా..?
గీ సీమాంధ్ర ఎంపీలకు సిగ్గెప్పుడత్తదో. వాళ్లు ఏమన్న మనుసులేనా.. గట్లజేత్తరా ఏంది అనుకుంటనే రాయలింగు తిట్లపురాణం అందుకున్నడు. అగ్గో, పొద్దు, పొద్దుగాల్నేవన్లో గట్లతిడ్తాన్నవేందోయ్, ఏం జరిగిందేం ది, ఎవల్నో మస్తు తిట్టవడ్తివనుకుంట ఇంటి దగ్గర గల్మల గూసొనున్న రాయలింగు దగ్గరికచ్చిండు హన్మంతు. నీకు దెల్వదా ఏంది, తెలంగాణ కోసం ఎన్నేండ్ల సంది కొట్లాడ్తన్నం జెప్పు. నోటికాడికచ్చిన ముద్దను లాక్కుంటే ఎవలికైనా ఎట్లనిపిత్తది. గుండె మండదా ఏంది. పార్లమెంట్ల బేస్తా రం తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు అడ్డుకున్నలు. అగో గాళ్ల తీరుజూసే నాకు కోపమత్తందోయన్నడు రాయలింగు. ఔ మల్ల.. గా ది నాం నాడే కదా సారక్క గద్దెకచ్చింది. గంత మం చి రోజు పార్లమెంట్ల బిల్లు పెట్టి పాస్జేత్తమని హోంమంత్రి షిండే జెప్పిండు గద. తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మలకు సుత మొక్కుకున్నం. ఇంట్లోల్లమంతా జాతరకు పోయినం. ఏమైందోయ్ తెలంగాణ రాలేదా అనడిగిండు హన్మంతు. గంతట్లనే లచ్చయ్య పలకాయ నములుకుంట రాయలింగు, హన్మంతు దగ్గరకచ్చిండు. పొద్దుగాల్నే ఇద్దరు దెవ్సం మీద పడ్డరేందనన్నడు లచ్చయ్య. ఇగో లచ్చయ్య దెవ్సం కాడి ముచ్చట్లు నీకెర్కలేదు గని గీడ గూసో రాయలింగు జెప్తడు మనమిందామని హన్మంతు అనంగనే సరేనన్నడు. గల్మదగ్గర గా ముగ్గురు గిట్ల శెనారం ముచ్చట్లు పెట్టిండ్లు. హన్మంతు : ఔను గని రాయలింగు, సమ్మక్క-సారక్క జాతరకుపోయి తెలంగాణ ఊసే మర్సిపోయినం. పార్లమెంట్ల బిల్లు పెట్టిండ్లేమో నెగ్గిందా, లేదా? ఏం జరిగిందోయ్ జెప్పు. రాయలింగు : పార్లమెంట్ల బిల్లు పెట్టిండ్లు కని ఎటుగాకుండ పొయిందోయ్. హన్మంతు : గట్లేట్లైంది. తెలంగాణ ఎంపీలు ఏం పట్టించుకోలేదా ఏంది. జెర కళ్లకు గట్టినట్లు జెప్పరాదోయ్. లచ్చయ్య : ఐతే... రాయలింగు తెలంగాణ రాదన్నట్టా ఏంది? రాయలింగు : ఇగో ఇద్దరినుండ్లి. బేస్తారం పార్లమెంట్ల బిల్లు పెడ్తన్నమని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన జేత్తండు. తెలంగాణ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్, హోంమంత్రి చుట్టూరా ఏం జరగకుండా అడ్డంగా బందోబస్తుగా నిలుసున్నరు. గంతట్లనే జరగకూడంది జరిగిందోయ్. హన్మంతు : అయ్యో.... ఏం జరిగిందో నస్కకుండ జెప్పరాదోయ్. రాయలింగు : ఏం జరిగిందంటరా, పార్లమెంట్ల ఎన్నడన్న ఎంపీల కండ్లల్ల కారంపొడి జల్లిండ్ల, కత్తులు పట్టుకచ్చినట్లిన్నరా, లేదుగదా. గా దినాం మాత్రం గట్లనే జరిగింది. లచ్చయ్య : ఏందీ..! గంతపని జరిగిందా ఎవలు జేసిండ్లేంది. రాయలింగు : ఏవలేంది గా సీమాంధ్రల ఉన్నలుజూడు లగడపాటి రాజగోపాల్, మోద్గుల వేణుగోపాల్‌రెడ్డి, సీఎం రమేష్ ఇంకా పది, పన్నెండు మంది ఎంపీలు గంత నీచానికి ఒడిగట్టిండ్లు. హన్మంతు : ఎవలకేం గాలేద్గదా? రాయలింగు : ఎందుకు గాలేదు. కారంపొడి కళ్లల్ల జల్లంగనే స్పీకర్ మీరాకుమార్, తెలంగాణ ఎంపీల కండ్లల్ల నీళ్లచ్చినయ్. మంటలు లేచి దగ్గుకుంట పార్లమెంట్లకెళ్లి బయటికచ్చి గాయ్‌గాయ్ అయిపోయిండ్లు. మస్తులొల్లి జరిగిందనుకో. లచ్చయ్య : మరి గట్ల జరగకుండా మార్షల్స్ ఉంటలు గద, గాళ్లేం అడ్డుకోలేదా ఏంది? రాయలింగు : ఎంపీలు గట్లజెత్తరని ఎవరననుకుంటరా, మామూలుగానే సభ జరుగుతుదనుకొని మార్షల్స్ జాగ్రత్తల లేకుండే. గదే మోఖ అనుకొని తెలంగాణ బిల్లు చర్చకు రాకుండాజేసిండ్లు. హన్మంతు : గట్లజేసిన ఎంపీలను స్పీకరమ్మ ఏమనలేదా? రాయలింగు : ఎందుకనలేదు, ఎవలెవలు లొల్లిజేసిండ్లో, కండ్లల్ల కారంపొడి జల్లిండ్లో, కత్తుల పట్టుకొనచ్చిండ్లెవలో గాళ్లను సభ జరిగేదాక సస్పెన్షన్ చేయిండ్లు. హన్మంతు/లచ్చయ్య : మంచిపని జేసింది. ఆ తల్లి సల్లంగుండా. మరి కమలం పువ్వు గుర్తోలేందో అంటండ్లట. రాయలింగు : ఔనవును. మొన్నటి దాక కాంగ్రెస్ పార్లమెంట్ల బిల్లు పెడితే మేం మద్దతిత్తమన్నలు. ఇప్పుడేమో పువ్వు గుర్తోళ్లు ముగ్గురు మూడు రకాలు మాట్లాడుతండ్లు. లచ్చయ్య : ఏమంటండ్లేంది. రాయలింగు : లొల్లి జర్గంగ బిల్లెందుకు పెట్టిండ్లని అద్వానంటండు. స్పీకర్ పార్లమెంట్ల బిల్లెప్పుడు పెట్టిండో తెల్వదని సుష్మాస్వరాజ్ అన్నది. ఇగ రాజ్నాథ్సింగేమో తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడున్నం. ఇప్పుడు జరిగే సమావేశాల్లోనే బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్తండు. గిట్ల ముగ్గురు మూడు రకాలుగా ఒకలకొకలకు పొంతన లేకుండా మాట్లాడుతండ్లు. హన్మంతు : మరింతకుముందుగాల కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతిత్తమని చెప్పినోళ్లు గిట్లేందుకంటండ్లు. రాయలింగు : కాంగ్రెస్ బిల్లు పెట్టకుంటనేమో పెడ్తలేరని పువ్వుగుర్తోలు దెప్పిపొడిసిండ్లు. బిల్లు పెట్టినంక ఏమో డొంకతిరుగుడు మాటలంటండ్లు. లచ్చయ్య : పువ్వుగుర్తోళ్లు గట్లేందుకంటండ్లు. రాయలింగు : ఇప్పుడు తెలంగాణ అచ్చిందనుకో ఆ మంచితనమంతా కాంగ్రెసోళ్లకు పోతది. గట్ల ఇసారం జేసుకొని బిల్లు పెట్టినంక మనిషికో మాట మాట్లాడుతండ్లు. హన్మంతు : మరైతే తెలంగాణ రాదా? రాయలింగు : ఎందుకు రాదనుకుంటండ్లు. ఎవలెన్ని జేసిన తెలంగాణ అచ్చుడు ఖాయం. సోమారం సంది మళ్ల పార్లమెంట్ సమావేశాలు జర్గుతయ్. లొల్లిజేసిన ఎంపీలను ఇప్పటికే సస్పెండ్ జేసిండ్లు. ఇంకెవలు లొల్లిజేయకుండా కట్టుదిట్టం జేత్తరట. గట్ల అందరిని కట్టడిజేసి చర్చకు పెట్టి తెలంగాణ ఇత్తరట. హన్మంతు/లచ్చయ్య : ఏమో మళ్ల ఏం జర్గుతదో ఏమో.. గప్పటిదాకైతే దెవ్సం మీద జరిగిన ముచ్చట్లు జెర మా సెవుల పెట్టు రాయలింగనుకుంట ఇండ్లకుపోయిండ్లు. -
వాలెంటైన్స్ డే స్పెషల్ ఆ...చెప్పావులే వార్తలు
-
మాట మంచిదైతే...
మనిషి వికాసానికి ‘మాట’ ఒక అమూల్యమైన వరం. ఇతర ప్రాణులకు లేని గొప్ప వాక్ సంపద మనిషికి స్వంతమైంది. ధనధాన్యాది సంపదలైనా వాడుతూ ఉంటే అవి క్రమంగా తరిగిపోతూ ఉంటాయి. కాని ఈ మాట అనే సంపద తరిగేది కాదు. పైగా మనం తీయగా, ఆకర్షణీయంగా, మనోహరంగా ఉం డే మాటలనే మాట్లాడగలిగితే బండరాయి వంటి కఠిన హృదయాలను కూడా కదిలించవచ్చు, కరిగించవచ్చు. ‘మంచి నోరు’ అంటే మంచి మాటను పలికే నోటినే మంచి నోరంటారని దీని అంతరార్థం. అప్పుడు మనం నివసించే ఊరు వారంతా మన విషయంలో మంచివారవుతారు. మనకు మంచే చేస్తారు. మనలోని మంచినే చూస్తారు. మంచి మాట అంటే కేవలం అందరికీ నచ్చినట్లు మాట్లాడటం అర్థం కాదు. అందులో ఇతరులందరికీ మం చిని కలిగించే మాటలు కూడా ఉండాలి. మంచి మాటలను మాట్లాడే వారితో సహవాసం చేయాలి. ఆ మంచి మాటలను వినాలి, వారికి మంచి మాటలను వినిపించాలి. మంచి మాటలకు లొంగని వారు అంటూ ఉండరు. మొరటుగా, కఠినంగా చెప్పవలసిన విషయాన్ని కూడా సున్నితంగా చెప్పేవారు అధికారుల, రాజుల మన్ననలను అందుకుంటారు. హనుమంతుని మాట మంచిదైనందునే రామసుగ్రీవులకు మైత్రి ఏర్పడింది. రాక్షస పరాజయం, రావణవధ, సీతాపరిగ్రహణం వంటి మహాఘనకార్యాలు నెరవేరాయి. హనుమంతుని మంచి మాటకారితనాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రశంసిస్తూ - ‘‘బహు వ్యాహరతానేన న కించిదపశబ్దితమ్’’ ‘‘ఉచ్చారయతి కల్యాణీం వాచం హృదయహారిణీమ్’’ ‘‘కస్య నారాధ్యతే చిత్త ముద్యతాసేరరేరపి’’ ఒక్క తప్పు లేకుండా, చెవులకింపుగా, మనోహరంగా, శుభప్రదంగా మాట్లాడుతున్నాడు. చంపుదామని కత్తి పట్టుకొని వచ్చినవ్యక్తి మనసును కూడా హనుమంతుని మాటలు వశపరచుకుంటాయని పేర్కొన్నాడు. అందుకే మన ‘మాట మంచిదైతే’ మనకంతటా మంచే జరుగుతుంది అనే విశ్వాసాన్ని ఏర్పరచుకోవాలి. పూర్వం ప్రతిభావంతులైన దేవదత్తుడు, సిద్ధార్థుడు ఇద్దరు రాజకుమారులలో సిద్ధార్థుని మాట మృదువుగా, దేవదత్తుని మాట కఠినంగా ఉండేదట. ఒకనాడు దేవదత్తుడు, సిద్ధార్థుడు అడవికి వెళ్లారు. దేవదత్తునికి వేట అం టే ఇష్టం. దేవదత్తుడు వేసిన బాణానికి హంస గాయపడి నేలకొరిగింది. సిద్ధార్థుడు ఆ హంసకు గుచ్చుకున్న బాణా న్ని తీసి గాయానికి కట్టుగట్టి సపర్యలు చేయసాగాడు. దేవదత్తుడు సిద్ధార్థుడితో - ‘హంసను వేటాడింది నేను కదా, దానిని నాకిచ్చెయ్’ అని గద్దించాడు. ‘కాదు గాయం మాన్పి, హంసను రక్షించింది నేను కదా, నా దగ్గరే ఈ హంస ఉంటుందని’ సిద్ధార్థుడు బదులిచ్చాడు. ఇద్దరి మధ్య వివా దం పెరిగి న్యాయం కోసం ధర్మాధికారులను ఆశ్రయిం చారు. ధర్మాధికారి ఆ హంసను బల్లపై ఉంచండి, ఎవరి పిలుపునకు ఆ హంస దగ్గరైతే వారికిస్తాను అని చెప్పారు. కఠిన స్వభావి, పరుష భాషియైన దేవదత్తుడు ‘ఓ హంసా! రా, రా, వస్తావా లేదా, రాకపోతే నీ పని చెప్తా, నా బాణం దెబ్బ మరిచావా’ అంటూ పిలిచాడు. మృదుస్వభావియైన సిద్ధార్థుడు - ‘తల్లీ, కల్పవల్లీ, పాలవెల్లీ, రావే’ అంటూ ప్రేమగా ముద్దుగా పిలిచాడు. హంస సిద్ధార్థుని ఒడిలోకి చెంగున వచ్చి చేరింది. వెంటనే సిద్ధార్థునికే ఈ హంస చెందాలి అని ధర్మాధికారి నిర్ధారించారు. మంచి మాటతో ఒక పక్షియే ఆకర్షింపబడింది కదా. అలాగే మాట మంచిదైతే తోటి మానవులందరూ మనకు హితులవుతారు, సన్నిహితులవుతారు అనే వాస్తవాన్ని గుర్తిం చాల్సిన అవసరం ఎంతో ఉంది. సముద్రాల శఠగోపాచార్యులు -
శ్రీవారి కల్యాణోత్సవాల్లో.. అవినీతి నిజమే!
తిరుపతి, న్యూస్‌లైన్: శ్రీవారి కల్యాణోత్సవాల్లో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స నివేదికలో తేటతెల్లమైంది. మూడు రోజులుగా వీజీవో హనుమంతు తన సిబ్బందితో కలసి కల్యాణోత్సవ రికార్డులను పరిశీలించారు. మంగళవారం ఈవో బంగ్లాలో జరిగిన సమీక్షలో ఈ నివేదికను వీజీవో అందజేశారు. కల్యాణోత్సవాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విచారణలో తేలినట్లు సమాచారం. శ్రీవారి కల్యాణోత్సవాల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈవో ఎంజీ.గోపాల్ విజిలెన్స ఇటీవల విచారణకు ఆదేశించిన విషయం విదితమే. గత ఏడాది జనవరిలో ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశవిదేశాల్లో 170 కల్యాణోత్సవాలను నిర్వహించినట్లు చూపించారు. రూ.3 కోట్లకు పైగా నిధులు టీటీడీ నుంచి విడుదలైనట్లు రికార్డులు చెబుతున్నాయి. కల్యాణోత్సవానికి ముందు అడ్వాన్సగా తీసుకునే లక్షలాది రూపాయల్లో ఖర్చు పోను మిగిలిన మొత్తాన్ని టీటీడీ ఖాతాలోకి జమచేయడం లేదని గుర్తించారు. ముంబైలో కల్యాణోత్సవం జరిగితే తిరుపతి నుంచి వంటవారు వెళ్లినట్లు, బెంగళూరు నుంచి పూల డెకరేషన్లు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కో రకమైనƒ ఏర్పాట్లు చేసినట్టు బిల్లులు చూపించారు. కల్యాణోత్సవానికి వచ్చే భక్తులు శ్రీవారికి పట్టుచీరలు, ఇతర కానుకలు సమర్పిస్తుంటారు. ఇవేవీ ఖజనాకు జమచేయకుండా స్పెషలాఫీసర్ స్వాహా చేసినట్లు గుర్తించారు. టీటీడీకి సమర్పించిన బిల్లుల్లో అడ్రస్‌లు సక్రమంగా లేకపోవడంతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సమీక్షలో జేఈవో, సీవీఎస్వో, ఎఫ్అండ్సీవో, విజిలెన్స వీజీవో, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇకపై జేఈవో సమక్షంలోనే కల్యాణాలు అక్రమాలు జరిగాయని నిర్ధారించిన టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తీవ్రస్థాయిలో స్పందించినట్లు తెలుస్తోంది. సమీక్షలో శ్రీకల్యాణోత్సవం ప్రాజెక్టు స్పెషలాఫీసర్ కోరాడ రామకృష్ణను మందలించారు. ఇకపై ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌గా కొనసాగే అర్హత లేదన్నారు. అతని స్పెషలాఫీసర్ కాలపరిమితి మరికొంత సమయం ఉండడంతో అంతవరకు తాత్కాలికంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై కల్యాణోత్సవాలు జేఈవో సమక్షంలోనే జరగాలని ఈవో ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు.