harvesting
-
ఇకపై మీ పంట వృథా కాదు, ఇంజనీర్ సృష్టించిన సోలార్ డ్రైయర్
ప్రకృతి చాలా చిత్రమైంది. ధాన్యాన్ని ఎండించి ఇస్తుంది. కాయగూరలను పండించి ఇస్తుంది. ధాన్యం ఏడాదంతా నిల్వ ఉంటుంది. కాయలు పండ్లకు రోజులే జీవిత కాలం. ఆ కాయలు పండ్లను కూడా ఎండబెడితే... అవి కూడా ఏడాదంతా నిల్వ ఉంటాయి. ముందు చూపు ఉంటే ఏదీ వృథా కాదు, దేని ధరా కొండెక్కదు... అని నిరూపించాడు ఇందోర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ వరుణ్ రహేజా. రైతుల ఆత్మహత్యలు, టొమాటోలు కోసిన ధరలు కూడా రావని పంటను వదిలేయడం వంటి వార్తలు తనను కలచి వేశాయి. పంటను నిల్వ చేసుకోగలిగితే రైతుల నష్టాలు, మరణాలను నివారించవచ్చనుకున్నాడు. కరెంట్ లేని ప్రదేశాల్లో కూడా ఉపయోగకరంగా ఉండడానికి సూర్యరశ్మితో పనిచేసే సోలార్ డ్రైయర్‌ను రూపొందించాడు. గత వేసవిలో కిలో రెండున్నర రూపాయల చొప్పున సేకరించిన టొమాటోలను డ్రైయర్‌లో ఎండబెట్టి తన ప్రయోగ ఫలితాన్ని నిరూపించాడు వరుణ్. యువతలో సామాజిక స్పృహ మెండుగా ఉన్నప్పుడు, చదువుతో వచ్చిన జ్ఞానం తన ఉన్నతితో పాటు సామాజికాభివృద్ధికి కూడా దోహదం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవుతాయి. వరుణ్ చేసిన ప్రయోగం వ్యవసాయరంగానికి మేలు చేస్తోంది. ఆలోచన... ఆసక్తి! ‘‘నేలలో నాటిన విత్తనం నుంచి ఒక చెట్టు మొలవడం, అది పెద్దయి... పూత పూసి కాయ కాచి అది పండే వరకు ప్రతిదీ ప్రకృతి చేసే అద్భుతమే. పంటను, పొలాన్ని సంరక్షించడంలో రైతు పడే కష్టాన్ని కొలవడానికి ఏ పరికరమూ ఉండదు. అలాంటిది పండించిన పంటను చేతులారా నేలపాలు చేసేటప్పుడు రైతు అనుభవించే ఆవేదన ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఆ పంట నేలపాలవుతుంటే నా మనసు మౌనంగా రోదించేది. పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటే ఆ రైతు తన చేతులారా పండించిన పంటను అలా నేలపాలు చేయడు కదా అనిపించేది. ఈ ఆలోచనలు నేను మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్న్షిప్ చేస్తున్న సమయంలో ఒక కొలిక్కి వచ్చాయి. పోషకాలు వృథా కాని విధంగా పండ్లు, కాయల్లోని తేమను సహజంగా తొలగించగలిగితే పంటను నిల్వ చేయవచ్చు. అది సౌరశక్తితో సాధ్యమని తెలిసిన తర్వాత నా ప్రయత్నాలను ముమ్మరం చేశాను. సోలార్ డ్రైయర్‌ను రూపొందించడంతోపాటు అన్ని రకాల రైతులకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్‌తోపాటు ఇరవై కిలోల నుంచి వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్లను కూడా రూపొందించాను. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. మేధ సమాజానికి ఉపయోగపడాలి! నేను చేసే పని నాకు నచ్చినదై ఉండాలి. ఒకరు చెప్పిన పని చేయడానికి నా మేధను పరిమితం చేయడం నాకిష్టం లేదు. నేను చేసే పని సమాజానికి ఉపయోగపడేదై ఉంటే అందులో లభించే సంతృప్తి అనంతం. టొమాటోల ధరలు వార్తల్లో ఉండడాన్ని చూస్తూనే పెరిగాను. రైతన్నల శ్రమకు ఫలితం కొనుగోలు చేసే వ్యాపారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటోంది. పండించిన రైతులు ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటున్నారు. సప్లయ్ చైన్ దళారులతో నిండిపోయి, రైతుకు ఉపయుక్తంగా లేకపోవడమే ఇందుకు కారణం. పొలంలో పండిన పంట వంటగదికి చేరేలోపు వివిధ దశల్లో 30 నుంచి 40 శాతం వృథా అవుతోంది. ఆ వృథాని అరికట్టడం, పండించిన రైతుకు తన పంటకు తగిన ధర నిర్ణయించగలిగే స్థితి కల్పించడం నా లక్ష్యం. అందుకే పంటను ఎండబెట్టి నిల్వ చేసే ఇండస్ట్రీని స్థాపించాను’’ అన్నాడు తన ప్రయోగాల కోసం రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించిన వరుణ్ రహేజా. వరుణ్ కొత్త పరికరాల రూపకల్పనలో నిమగ్నమై ఉంటే, అతడు నెలకొల్పిన పరిశ్రమను తల్లి బబిత నిర్వహిస్తున్నారు. -
పండ్ల కోసం ప్రయోగశాల ... రైతుల కోసం ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ
-
రైతుకు అండగా ప్రభుత్వం లాభాలు అందిస్తున్న చాక్లెట్ పంట..
-
ఖర్చులన్నీ పోగా ఎకరాకు లక్షన్నర ఆదాయం
-
అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేట్... ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫుల్ డిమాండ్
-
పంట మార్పిడి చేశాడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు ...
-
పంటల మార్పిడితో అధిక లాభాలు
-
Sagubadi: గాల్లో ఎగురుతూ పండ్లు కోసే రోబోలు! ఆపిల్స్, అవకాడో, పియర్స్..
పండ్ల కోత కూలీలు సమయానికి దొరక్క రైతులు నానా యాతన పడుతూ ఉంటారు. కూలీల కొరత వల్ల కోత ఆలస్యం కావటం, నాణ్యత కోల్పోవటం.. రైతులు ఆశించిన ధర దక్కకపోవటం చూస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా కోత కూలీలు దొరక్క ఏటా 3 వేల కోట్ల డాలర్ల మేరకు రైతులు నష్టపోతున్నారు. రెండు వారాలు ఆలస్యంగా కోసిన పండ్ల వెల 80% తగ్గిపోతున్నదట. 2050 నాటికి 50 లక్షల మంది పంట కోత కార్మికుల కొరత నెలకొంటుందని అంచనా. కోసే వాళ్లు లేక 10% పండ్లు కుళ్లిపోతున్నాయట. ఈ సమస్యకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారాలు చూపుతోంది. ఎత్తయిన చెట్ల నుంచి పక్వానికి వచ్చిన పండ్లను మాత్రమే సుతిమెత్తగా పట్టుకొని కోసి తెచ్చే రోబోలు వచ్చేశాయి. PC: Kubota తోటలో నేల మీద కదులుతూ స్ట్రాబెర్రీలు, కూరగాయలు, పండ్లను కోసే రోబోలు వున్నాయి. అయితే, గాలిలో ఎగురుతూ ఎత్తయిన చెట్ల నుంచి పండ్లు కోసే రోబోలను కూడా తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ విజయవంతంగా రూపొందించింది. ఇజ్రాయిల్‌కు చెందిన టెవెల్ ఏరోబోటిక్స్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి స్వతంత్రంగా ఎగురుతూ చెట్ల నుంచి పండ్లను కోసే రోబోలను తయారు చేసింది. ఈ రోబోలకు మీటరు పొడవుండే ఇనుప చెయ్యిని బిగించారు. కోయాల్సిన పండు రకాన్ని బట్టి ఈ చేతిలో తగిన మార్పులు చేస్తారు. అత్యాధునిక కృత్రిమ మేథను కలిగి ఉన్నందున ఏ రంగు, ఏ సైజు పండు కొయ్యాలి? ఏది అక్కర్లేదు? అనే విషయాన్ని ముందుగానే వీటికి ఫీడ్ చేస్తారు. ఆ సమాచారం మేరకు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ద్వారా సెన్సార్లు, కామెరాల సహాయంతో ఈ రోబోలు పనిచేస్తున్నాయి. పక్వానికి వచ్చిన పండ్లనే కచ్చితంగా గుర్తించి కోయగలుగుతున్నాయని టెవెల్ ఏరోబోటిక్స్ సీఈవో యనివ్ మోర్ తెలిపారు. ఒక వ్యాన్‌పై నాలుగు పండ్లు కోసే రోబోలను వైర్లతో అనుసంధానం చేస్తారు. అవి చెట్లపై ఎగురుతూ పండ్లను కోసి, వాటిని జాగ్రత్తగా వ్యాన్‌పై పెడతాయి. ఈ రోబోలు ఒక ఆప్‌తో అనుసంధానమై ఉండి రైతుకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. ఎంత మొత్తంలో పండ్ల కోత పూర్తయ్యింది? ఏదైనా పురుగుమందు లేదా చీడపీడల ప్రభావం ఉందా? అనే విషయాన్ని కూడా రైతుకు తెలియజేస్తాయి. ఆపిల్స్ నుంచి అవకాడో వరకు అనేక రకాల పండ్లను ఈ రోబోలు అవలీలగా రాత్రీ పగలు నిరంతరాయంగా కోస్తున్నాయని కంపెనీ చెప్తోంది. ఆపిల్స్, అవకాడో, పియర్స్, నారింజ తదితర పండ్ల కోత పరీక్షల్లో చక్కని ఫలితాలు వచ్చాయి. సాధారణంగా రెండున్నర ఎకరాల్లో పండ్ల కోతకు ఒక ఎగిరే రోబో సరిపోతుందట. అయితే, చెట్ల వయసు, పండ్ల రకం, సైజులను బట్టి ఎంత తోటకు ఎన్ని రోబోలు అవసరమవుతాయన్నది ఆధారపడి ఉంటుంది. ‘గాలిలో ఎగురుతూ పండ్లను కోసే రోబోలు మావి మాత్రమే. ఈ ఏడాది మార్కెట్లోకి తెస్తున్నాం’ అంటున్నారు ఆ కంపెనీ సీఈవో. సుమారు 3 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఐదేళ్లు పరిశోధించి కంపెనీ ఈ వినూత్న రోబోలను తయారు చేసింది కదా.. ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుందిగా మరి! మన దేశంలో ఎంత ధరకు అమ్ముతారో వేచి చూద్దాం... చదవండి: Sagubadi: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఇలా తయారు చేసుకోండి.. కోకోపోనిక్స్ సాగులో.. -
అడవి కాకరపై రైతన్న దృష్టి .. ఉపయోగాలెన్నో..
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అడవి కాకర (బోద కాకర) సాగుపై జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని శాస్త్రీయ నామం మైమోర్డికా డయాయిక కుకుర్బుటేసి. ఇవి సాధారణ కాకరకు అతిదగ్గర పోలికలుండగా రుచి వేరుగా ఉంటుంది. కాయ సుమారు 4 నుంచి 6 సెం.మీ. పొడవు, 30–40 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో అధిక పోషక విలువలుంటాయి. రక్తంలోని చక్కెర శాతం తగ్గడం, కంటిచూపు వృద్ధి చెందడం, క్యాన్సర్ నుంచి రక్షణ, మూత్రపిండాల్లోని రాళ్లని కరిగించడం, మొలలను నివారించడం, అధికంగా చెమట రాకుండా చేయడం, దగ్గు నివారణ, జీర్ణశక్తి పెంచడం వంటి ఉపయోగాలు అడవి కాకర వినియోగంతో ఉంటాయి. జిల్లాలో సాగు ఇలా.. సీతంపేట, వీరఘట్టం, భామిని, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో సుమారు 20 హెక్టార్లలో అడవి కాకరను సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ. పదివేల నుంచి 20 వేల రూపాయల వరకూ ఖర్చువుతుండగా.. వెయ్యి నుంచి 1500 కిలోల దిగుబడి వస్తోంది. ఎకరా సాగు చేస్తే సుమారు రూ. 60 వేల నుంచి 80 వేల రూపాయల వరకూ రైతుకు లాభం చేకూరే అవకాశం ఉంది. మామూలు రకంకంటే ఎక్కువ రుచి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మేలైన రకాలు ఇండియా కంకొడ (ఆర్‌ఎమ్‌ఎఫ్–37) రకాన్ని జిల్లాలో సాగు చేస్తున్నారు. ఈ రకం చీడపీడలను తట్టుకుంటుంది. దుంపలను నాటితే సుమారు 35– 40 రోజులకు, అదే విత్తనం ద్వారా 70–80 రోజుల కు పంట కోతకు వస్తోంది. మొదటి సంవత్సరంలో ఎకరాకు 4 క్వింటాళ్లు, రెండో ఏటా 6 క్వింటాళ్లు, మూడో సంవత్సరం 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోంది. నేలల స్వభావం ఇది ఉష్ణమండల పంట. అధిక దిగుబడికి సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ఉష్ణ ప్రాంతాలు అనుకూలం. ఒండ్రు ఇసుక కలిపిన ఉదజని సూచిక 5.5 నుంచి 7.0 ఉండి.. సేంద్రియ పదార్ధం అధికంగా ఉన్న నేలలు సాగుకు మేలు. ఆమ్ల, క్షార స్వభావం ఉండి, మురుగునీటి వసతి లేని చౌడునేలలు సాగుకు పనికి రావు. నాటడం ఇలా.. ఎకరాకు 1.5 నుంచి 3 కిలోల విత్తనం లేదా 3000 నుంచి 5000 దుంపలు కావాలి. వేసవి, వర్షాకాలం పంటగా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా వేసవి పంటను జనవరి–ఫిబ్రవరిలో, వర్షాకాలం పంటను జూలై–ఆగస్టు నెలల్లో నాటుతారు. దుంపలు నాటేందుకు ఫిబ్రవరి–మార్చి నెలలు అనుకూలం. 2–3 విత్తనాలు ఎత్తయిన మడుల మీద 2 సెం.మీ., దుంపలైతే 3 సెం.మీ. లోతులో వరుసల మధ్య 2 మీట ర్లు, వరుసల్లో మొక్కల మధ్య 70–80 సెం.మీ. దూరం ఉండేలా నాటుకోవాలి. నీటి యాజమాన్యం: వర్షాకాలంలో నీటి అవసరం ఉండదు. బెట్ట పరిస్థితుల్లో 3–4 రోజులకోసారి పెట్టాలి. ఎక్కువ నీటిని పారిస్తే తీగలు చనిపోతా యి. మురుగునీరు నిల్వలేకుండా చూసుకోవాలి. ఎరువులు: ఎకరాకు 6 నుంచి 8 టన్నులు బాగా కుళ్లిన సేంద్రియ ఎరువులు ఆఖరి దుక్కిల్లో చేయాలి. విత్తనం లేదా దుంపలు నాటేముందు ఎకరాకు 32 కిలోల భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 24 కిలోలో నత్రజనిని తీగ ఎగబాకే ముందు, మరో 24 కిలోల నత్రజనిని పూతకు ముందు భూమిలో వేసుకోవాలి. కలుపు నివారణ: నాటిన 24 గంటల్లోగా పిండిమిథాలిన్ 5 మి.లీటర్లు.. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే కూలీలతో, యంత్ర పరికరాలతో కలుపుతీసి పోలాన్ని శుభ్రంగా ఉండాలి. సస్యరక్షణ: అడవి కాకరను ఎక్కువగా పండు ఈగ లు, నులిపురుగులు ఆశించి నష్టం కలుగజేస్తాయి. పండు ఈగ నివారణకు ఎకరాకు 20–30 ఫిరమోన్ ఎరలను అమర్చాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే మలాథియాన్ 1.5 మి.లీ. లేదా డైక్లోరావాస్ ఒక మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నులిపురుగుల నిర్ధారణకు 5 కిలోల పాసిలోమైసిస్, ట్రైకోడెర్మా హర్జియానం, పోచానియా వంటివి ఒక టన్ను పశువుల ఎరువు – 100 కిలోల వేపపిండి మిశ్రమా నికి కలిపి 15 రోజులు నీడలో ఉంచి వృద్ధిచేసి ఎకరా పొలానికి చేసుకోవాలి. దిగుబడి మొదటి సంవత్సరం నాటిన 75–80 రోజుల్లో కోతకు వస్తుంది. రెండో సంవత్సరం మొలకెత్తిన 35–40 రోజుల్లో కోతకు వస్తుంది. కాయ లేతగా, ఆకుపచ్చని రంగులో ఉన్న ప్పుడే కోయాలి. ప్రతి రెండు రోజులకోసారి కాయలు తెంపాలి. ఆలస్యం చేస్తే కాయలు ముదిరి మార్కె ట్ విలువ తగ్గుతుంది. కాయలు తెంపేటప్పుడు తీగకు నష్టం కలుగకుండా చూడాలి. విత్తనం కోసమై తే కాయ పూర్తిగా పసుపు రంగుకు మారి, విత్తనం ఎరుపు రంగు వచ్చినప్పుడు కోయాలి. వీటిని మంచినీటిలో కడిగి నీడలో ఆరబెట్టి బూడిదతో కలిపి నిల్వ ఉంచుకోవచ్చు. అవగాహన పెంచుకొని సాగు చేయాలి అడవి కాకర సాగుపై రైతు లు ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆ తరువాత సాగు చేయాలి. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుంది. – వై.రామారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఉద్యానశాఖ, శ్రీకాకుళం -
భారీగా పెరిగిన వరి కోత యంత్రాల అద్దె ధరలు
జగిత్యాల అగ్రికల్చర్: కోతకొచ్చిన పంట చేతికొచ్చే వేళ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.. వరికోత మెషీన్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. ట్రాక్టర్ల బాడుగ భారంగా మారింది. వరికోతలకు వినియోగించే టైర్ హార్వెస్టర్ అద్దె గతేడాది గంటకు రూ.1,800–రూ.2,000 ఉండగా, డీజిల్ ధరలు పెరగడంతో ఈసారి రూ.2,300–రూ.2,500 వరకు యజమానులు పెంచేశారు. పొలాల్లో తడి ఆరక టైర్ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో చైన్ హార్వెస్టర్లను వినియోగించాల్సి వస్తోంది. అయితే ఇవి తెలంగాణలో తక్కువ సంఖ్యలో ఉండటంతో కొందరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి అద్దెకు తీసుకొచ్చి డిమాం డ్‌ను బట్టి గంటకు రూ.3,500– రూ.4,500 వరకు వసూలు చేస్తు న్నారు. ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగైంది. ఈ లెక్కన వరికోతల నిమిత్తం రాష్ట్ర రైతాంగంపై రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముంది. తడిసిమోపెడు..: ఇదివరకు టైర్ హార్వెస్టర్‌తో ఎకరా పొలంలోని వరి పైరును గంటలో కోయిస్తే, ఇప్పుడు పొలాల్లో తేమ కారణంగా గంటన్నర పడుతోంది. హార్వెస్టర్ డ్రైవర్ మామూళ్లతో కలుపుకుని గంటకు రూ.4 వేల వరకు ఖర్చు అవుతోంది. అదే చైన్ హార్వెస్టర్‌తో ఎకరం పైరు కోయిస్తే 2 నుంచి 2.30 గంటల వరకు సమయం పడుతోంది. అంటే.. చైన్ హార్వెస్టర్‌తో కోయిస్తే దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు వస్తోంది. ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లేందుకు ఒక్కో ట్రిప్పుకు గతేడాది రూ.500 ఖర్చు కాగా, ఈసారి దాదాపు రూ.వెయ్యి వరకు పెరిగింది. ధాన్యంలో తేమతోపాటు తప్ప, తాలు ఉందంటూ తిప్పలు పెడుతుండటంతో ఆరబెట్టడం, మెషీన్ల ద్వారా తూర్పార పట్టడం వంటివి చేసేందుకు మరో రూ.2 వేలు –రూ.3 వేలు రైతులు వెచ్చించాల్సి వస్తోంది. హమాలీల కూలీ, లారీ డ్రైవర్ల మామూళ్లు.. ఇలా రైతులపై మోయలేని భారం పడుతోంది. తేమ అధికంగా ఉండే నేలల్లో ఇతర పంటలు పండించే పరిస్థితి లేక వరిసాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఖర్చులు రెట్టింపయ్యాయి వర్షాలకుతోడు సాగునీటి కాలువల ద్వారా నీరు నిరంతరం పారుతోంది. వ్యవసాయ బావుల నుంచి నీరు పైకి ఉబికి వస్తున్నది. దీంతో పొలాలు ఎప్పుడూ తేమగా ఉంటున్నాయి. ఫలితంగా టైర్ హార్వెస్టర్‌తో వరికోసే పరిస్థితి లేదు. నాలుగు ఎకరాల్లోని వరిని చైన్ హార్వెస్టర్‌తో కోయిస్తే, దాదాపు రూ.30 వేలు ఖర్చు వచ్చింది. అంతకుముందు టైర్ హార్వెస్టర్ ఖర్చు రూ.8 వేల –రూ.9 వేలు అయ్యేది. – యాళ్ల గోపాల్‌రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా ఏమీ మిగలడం లేదు రోజూ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం లీటర్ రూ.104–రూ.105 మధ్య ఉంది. రెండునెలలు వరికోతలు ఉంటాయి. మున్ముందు డీజిల్ ధర ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. అందుకే హార్వెస్టర్ అద్దెలు పెంచక తప్పడంలేదు. కరోనా నేపథ్యంలో డ్రైవర్ల జీతాలతోపాటు మరమ్మతు ఖర్చులు రెట్టింపయ్యాయి. మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం కట్టడమే ఇబ్బందిగా మారింది. – శ్రీనివాస్‌రెడ్డి, హార్వెస్టర్ యజమాని, పోరండ్ల -
కరోనా పొమ్మంది ఊరు రమ్మంది.. ఇక వలస వెళ్లం
ఇక్కడ కనిపిస్తున్న మహిళలు ఒకప్పుడు వలస కూలీలు. వాళ్లు ఉన్న నేల ఒకప్పుడు బంజరు భూమి. కరోనా ప్రపంచాన్ని కుదిపేసిన దుర్దినాల్లో ఈ మహిళలు బంజరు నేలలో బంగారం పండించారు. ’ఇది కరోనా కాలంలో మేము సాధించిన విజయం’ అంటూ తాము పండించిన కూరగాయలను ఇలా రాసిపోసి చూపిస్తున్నారు. ఇక వలస వెళ్లం ‘ఊరు పొమ్మంది కాడు రమ్మంది’ అనే నానుడిని మారుస్తూ ‘కరోనా పొమ్మంది... ఊరు రమ్మంది’ అనే కొత్త నానుడిని తెచ్చారీ మహిళలు. కరోనా వ్యాధి వలస కార్మికుల పని మీద ఉరుము ఉరిమింది. పిడుగులా వారి జీవితాల మీద విరుచుకు పడింది. కరోనా పొమ్మన్న కాలంలో ఊరు వాళ్లను కడుపులో దాచుకుంది. ఇప్పుడు ఈ మహిళలు కరోనా నెమ్మదించినా సరే ఇక మీదట పని కోసం పొట్ట పట్టుకుని వలస పోయేది లేదని, ఉన్న ఊర్లోనే ఇదే నేలలో సాగు చేస్తూ జీవితాలను పండించుకుంటామని చెబుతున్నారు. ఈ మహిళా విజయ కథనం మధ్యప్రదేశ్ రాష్ట్రం, చింద్వారా జిల్లా, మెండ్కి తాల్ గ్రామానిది. కలి‘విడి’గా పని చేశారు గత ఏడాది కోవిడ్ కరాళ నృత్యం చేసిన రోజుల్లో నగరంలో పనులు ఆగిపోయాయి. వలస కూలీలుగా వెళ్లిన ఈ మహిళలు నగరాన్ని వదిలి సొంత ఊరికి రావడం అయితే వచ్చేశారు. కానీ ఏం చేసుకుని బతుకు సాగించాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక మహిళకు చెందిన బంజరు నేలను చదును చేసి కూరగాయల మొక్కలు నాటారు. అందులోనూ నెలలోపే చేతికి వచ్చే మెంతి వంటి ఆకు కూరలతో మొదలు పెట్టారు. పాలకూర, ముల్లంగి, టొమాటో, వంగ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, అల్లం, కొత్తిమీర, పచ్చిమిరప, నిమ్మ, కీర వంటి కూరగాయలతోపాటు జామ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలనూ నాటారు. నూట నలభై మంది గిరిజన మహిళలు పది బృందాలుగా విడిపోయి పంటల సాగు మొదలు పెట్టారు. ఆరువేల మొక్కలు నాటారు. ఆరోగ్యకరమైన పోటీతో పంట పండించి మూడు లక్షల ఆదాయాన్ని ఆనందంగా పంచుకున్నారు. ‘ఏడాదికి ఐదు లక్షల ఆదాయం తమ లక్ష్యమని, ఆరు నెలల్లోనే మూడు లక్షలు వచ్చాయి. కాబట్టి తమ లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం కలిగింద’ ని చెప్పింది సావిత్రి కుశ్రమ్. పంటలు పండించి ఊరుకోవడం లేదు. కమ్యూనిటీ పోషణ్ వాటిక పేరుతో ఒక పోషకాహార వేదికను ఏర్పాటు చేశారు. గ్రామంలోని మహిళలకు, గర్భిణులకు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన పోషకాహారం గురించి వివరిస్తున్నారు. నగరాల్లో వలస కూలీలుగా ఉన్న రోజుల్లో సాయంత్రానికి చేతిలో డబ్బు పడేది, కానీ కడుపునిండా తినలేకపోయేవాళ్లమని, ఇప్పుడు మంచి భోజనం చేస్తున్నామని చెప్తున్నారు. కరోనా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాఠం నేర్పించింది. ఈ మహిళలకు జీవితాన్ని బాగుపరుచుకునే మార్గాన్ని చూపించింది. ఈ పాఠం ఈ మహిళలకే కాదు, మరెందరికో మార్గదర్శనం. -
రాళ్ల భూముల్లోనూ ఇక పంట సిరులు!
రాళ్లు, రప్పలతో నిండిన భూములు పంటల సాగుకు పనికిరావు. రాళ్లు రప్పలు ఎక్కువగా ఉన్న భూములను పడావుగా వదిలేస్తూ ఉండటం మెట్ట ప్రాంతాల్లో సర్వసాధారణం. ఒక మోస్తరుగా రాళ్లుండే భూముల్లో కూలీలను పెట్టి రాళ్లను ఏరి వేయించటం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. తవ్వేకొద్దీ రాళ్లు బయటపడుతూ ఉంటుండడంతో.. ఏటేటా కూలీలతో రాళ్లను ఏరించాల్సిన పరిస్థితి. ఈ బాధలు పడలేక ఆ భూములపై ఆశలు వదులుకుంటున్న రైతులు ఎందరో కనిపిస్తారు. ఈ రాళ్ల కష్టాల నుంచి రైతులను గట్టెక్కించి, సాగు భూమి విస్తీర్ణం పెంచుకునేందుకు ఉపకరించే ప్రత్యేక యంత్రాన్ని ఆవిష్కరించారు ఓ యువ ఇంజనీర్. వేలాది ఎకరాలు.. సంగారెడ్డి జిల్లా మనురు మండలం బొరంచకు చెందిన రైతు కుటుంబంలో పుట్టిన కె.దీపక్‌రెడ్డి హైదరాబాద్ మీర్పేట్లోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో 2016లో బీటెక్ పూర్తి చేశారు. ఉద్యోగంలో చేరకుండా సొంత పరిశోధనలను కొనసాగించారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న తమ స్వగ్రామం పరిసరాల్లోనే పది వేల ఎకరాల వరకు ఉన్న రాళ్ల భూములను సాగు యోగ్యంగా మార్చుకోవడానికి ఏమైనా యంత్రాన్ని కనిపెడితే బాగుంటుంది అని ఆలోచన చేశారు. 3.5 ఏళ్లుగా మల్టీపర్పస్ హెర్వెస్టర్ పరిశోధనలపైనే దృష్టిని కేంద్రీకరించి, పట్టుదలతో విజయం సాధించారు. ఇప్పటి వరకు సొంత డబ్బు రూ. 5 లక్షల ఖర్చు పెట్టారు. ఎకరానికి 4 గంటలు చాలు.. దీపక్‌రెడ్డి రూపొందించిన హార్వెస్టర్‌ను 50, అంతకన్నా ఎక్కువ అశ్వ శక్తి కలిగిన ట్రాక్టర్‌కు అనుసంధానించి ఉపయోగించాలి. మట్టిని తవ్వుకుంటూ జల్లెడ పట్టి రాళ్లను లేదా ఉల్లి, బంగాళదుంప వంటి గుండ్రటి పంట ఉత్పత్తులను సేకరించి.. వాటిని ఈ యంత్రంలోనే ఉన్న బక్కెట్లో నిల్వచేస్తుంది. రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. ఎకరం భూమిలో ఉన్న రాళ్లన్నింటినీ కేవలం 3–4 గంటల్లో రూ. మూడు వేల నుంచి నాలుగు వేల ఖర్చుతో ఏరివేయవచ్చన్నది దీపక్‌రెడ్డి మాట. కూలీలతో ఈ పని చేయిస్తే కనీసం రూ. 12 వేలకు పైగా ఖర్చవుతుందన్నారు. ఎకరంలో రాళ్లు ఏరివేయాలంటే కూలీలు రోజుల తరబడి పనిచేయాల్సి వస్తుంది. పైగా భూమి పైపైన ఉన్న రాళ్లను మాత్రమే కూలీలు తీయగలుగుతారు. కానీ ఈ యంత్రం సహాయంతో కనీసం తొమ్మిది అంగుళాల లోతులో ఉన్న రాళ్లను కూడా ఏరెయ్యవచ్చని తెలిపారు. రూ. 10 లక్షల ఐసీఏఆర్ గ్రాంటు స్టార్టప్ కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం ఇటీవలే దరఖాస్తు చేసిన దీపక్‌రెడ్డి.. దీన్ని వాణిజ్యపరంగా విక్రయించేందుకు మరో ఏడాది సమయం పడుతుందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఇన్నోవేషన్ టూ ఎంటర్పెన్యూర్ (ఐ టు ఏ)కు దరఖాస్తు చేశారు. ‘నిధి ప్రయాస్’ పథకం కింద భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) రూ. పది లక్షల గ్రాంటును విడుదల చేసింది. ఇప్పటి వరకు సొంత డబ్బుతోనే తిప్పలు పడుతున్న దీపక్‌రెడ్డికి ఐసీఏఆర్ గ్రాంటుతో కొండంత బలం వచ్చింది. ఇతర వనరుల నుంచి నిధులు సమకూర్చుకోవడానికి కూడా ఐసీఏఆర్ గుర్తింపు ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఉత్సాహంతో యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసి, ఏడాదిలో రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నానని దీపక్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఇటీవల టర్కీ నుంచి ఇలాంటి ఓ యంత్రాన్ని రూ. 12 లక్షలతో దిగుమతి చేసుకున్నారన్నారు. తాను రూపొందించిన హార్వెస్టర్‌ను రూ. 2.5 లక్షలకే రైతులకు అందుబాటులో తేబోతున్నానన్నారు. రాళ్ల భూముల్లోనే తన బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ కలలు పండించుకుంటున్న రైతుబిడ్డ, సృజనశీలి దీపక్‌రెడ్డికి శుభాభినందనలు! – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ఆలుగడ్డ, ఉల్లిగడ్డలనూ తవ్వి తీస్తుంది! పొలంలో రాళ్లను ఏరివేయడంతోపాటు దుంప పంటల కోతలకు కూడా ఈ బహుళ ప్రయోజనకారి అయిన ఈ హార్వెస్టర్ ఉపయోగపడుతుంది. ఆలుగడ్డ, ఉల్లిగడ్డలను తవ్వి తీయడానికి కూడా ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ఎకరానికి 3–4 గంటల సమయం పడుతుంది. మార్కెట్లో యంత్రాలు ఉన్నప్పటికీ.. ధర రూ. 8 లక్షల వరకు ఉండటం వల్ల రైతులకు అందుబాటులో లేవని దీపక్‌రెడ్డి తెలిపారు. రూ. 2.50 లక్షలకే తాను అందుబాటులోకి తేనున్న హార్వెస్టర్ రైతులను కష్టాల నుంచి గట్టెక్కించడానికి తోడ్పడుతుందని దీపక్‌రెడ్డి ఆశిస్తున్నారు. మూడున్నరేళ్లు శ్రమించా..! మంజీరా నది మాకు దగ్గర్లో ఉన్నప్పటికీ రాళ్లు, రప్పల కారణంగా మా ప్రాంతంలో భూమి వేల ఎకరాలు పడావు పడి ఉంటున్నది. మాకు కూడా 2 ఎకరాల రాళ్ల పొలం ఉంది. ఏదైనా పంటలు వేస్తే ఎండల తీవ్రతకు రాళ్లు వేడెక్కి పంటలు, తోటలను దెబ్బతీస్తున్నందున వేలాది ఎకరాల్లో పంటలు పండించలేని పరిస్థితి ఉంటుంది. ఏటా ఎండాకాలంలో కూలీలను పెట్టి రాళ్లను ఏరివేయించడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్య పరిష్కరం కోసం మార్గం ఏమిటా అని అన్వేషించాను. ఇతర దేశాల్లో రైతులకు అందుబాటులో ఉన్న యంత్రాలను ఆన్లైన్లో పరిశీలించాను. మెకానికల్ ఇంజనీర్‌గా నాకున్న పరిజ్ఞానంతో మన పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా యంత్రాన్ని రూపొందించే పరిశోధన ప్రారంభించాను. మూడున్నరేళ్లుగా ఇదే పని మీద ఉన్నాను. ఎట్టకేలకు మల్టీపర్పస్ హార్వెస్టర్ యంత్రం ప్రొటోటైప్‌ను రూపొందించాను. పొలాల్లో ప్రయోగించి సత్ఫలితాలు సాధించాను. – కె. దీపక్‌రెడ్డి, బొరంచ, మనురు మండలం, సంగారెడ్డి జిల్లా ► పాలేకర్ ఆన్లైన్ పాఠాలు భారతీయ ప్రకృతి వ్యవసాయ పితామహులు డా. సుభాష్ పాలేకర్ ‘తిరిగి ప్రకృతిలోకి..’ సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తన యూట్యూబ్ ఛానల్లో 5 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్, ఔషధాలతో పనిలేని మానవ జీవనం, ఆధ్యాత్మిక జీవన విధానం, సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయదారులు, వినియోగదారులంతా ఒకే కుటుంబం.. తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. సెప్టెంబర్ 12, 26 తేదీలు, అక్టోబర్ 3, 10,17 తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు) 6 గంటల పాటు శిక్షణ ఇస్తారు. పాలేకర్ వాట్సప్ నంబరు: 98503 52745. ఇతర వివరాలకు.. అమిత్ పాలేకర్ – 96731 62240 యూట్యూబ్‌లో ్ఖఆఏఅ ఏ ్కఅఔఉఓఅఖఓఖ్ఖ ఏఐ ఛానల్‌ని సబ్‌స్రైబ్ చేసుకొని ఈ శిక్షణ పొందవచ్చు. ► పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ ప్రమాణాలపై శిక్షణ మార్కెట్లకు తరటించే క్రమంలో పండ్లు, కూరగాయలను ప్యాక్ చేయడానికి సంబంధించిన నూతన పద్ధతులు, పదార్థాలు, యంత్రాలు, ప్యాక్ హౌస్ నిర్వహణ, కోల్డ్‌స్టోరేజ్ రవాణా, లేబెలింగ్ ప్రమాణాలపై అవగాహన కలిగించడానికి తంజావూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ’ ఈ నెల 31న ఉ. 10 గం. నుంచి 1.30 గం వరకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. 590 (జిఎస్టీ అదనం). ఈనెల 30 లోగా రిజిస్టర్ చేసుకోవచ్చు. వివరాలకు.. 97509 68415, 88482 55361 -
ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం.. వరి రైతులకు రాయితీపై వరికోత యంత్రాలు
సాక్షి, అమరావతి: కూలీల కొరతతో వరి రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యను అధిగమించేందుకు యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. అలాగే వరి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో వరి కోత యంత్రాల(కంబైన్డ్ హార్వెస్టర్స్)ను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్‌లోగా 500 కేంద్రాలు, మిగిలిన వాటిని వచ్చే ఏడాది మార్చిలోగా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణంలో దాదాపు 60 శాతం తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే సాగవుతుంది. ఈ జిల్లాల్లో పంట మొత్తం ఒకేసారి కోతకొస్తుండటం, ఆ సమయంలో కూలీలు దొరక్క, సరిపడా వరి కోత యంత్రాల్లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి యంత్రాలను ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లించి పంట కోత, నూర్పిడి చేయిస్తున్నారు. దీనివల్ల రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం రైతు సంఘాలను ఏర్పాటు చేసి.. వాటి ఆధ్వర్యంలో కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో కూడిన యంత్ర సేవా కేంద్రాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. తద్వారా గ్రామాల్లోనే తక్కువ అద్దెకు యంత్ర పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. 5 యూనిట్లు మండలానికి.. ► ప్రభుత్వం అనుభవం కలిగిన ముగ్గురు రైతులతో ఒక్కో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసి వారిని కంబైన్డ్ హార్వెస్టర్స్‌తో పాటు బేలర్(గడ్డిమోపు యంత్రం) కొనుగోలు చేసేలా ప్రోత్సహించనుంది. వారి ఆధ్వర్యంలోనే ఈ యంత్ర సేవా కేంద్రాన్ని నిర్వహిస్తుంది. ► ఇందుకోసం 40 శాతం రాయితీ ఇస్తుండగా, 50 శాతం బ్యాంకు ద్వారా రుణం అందిస్తుంది. ► మొత్తం నాలుగు జిల్లాల్లో 1,035 క్లస్టర్లలో యంత్ర సేవా కేంద్రాల కోసం ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద రూ.103.50 కోట్లు కేటాయించింది. ► 3,706 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్న గ్రామాలను ఒక క్లస్టర్‌గా తీసుకుంటుంది. అలాగే మండలానికి ఐదు యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ► రైతులకు రూ.10 లక్షల రాయితీ వస్తుండగా, బ్యాంకు ద్వారా 12.50 లక్షల రుణం మంజూరు చేయనున్నారు. ► మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి నిర్దేశించిన మేరకు యంత్రాల అద్దెలను వసూలు చేయాల్సి ఉంటుంది. యువతకు స్వయం ఉపాధి యంత్ర సేవా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎంపిక చేసిన యువతకు కంబైన్డ్ హార్వెస్టర్ల డ్రైవింగ్, నిర్వహణ, మరమ్మతులపై వివిధ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ శిక్షణ కేంద్రాల(ఎఫ్‌ఎంటీటీఐ) ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా వారు కంబైన్డ్ హార్వెస్టర్లను నడపడంలో ప్రావీణ్యం పొందనున్నారు. తద్వారా యంత్ర సేవా కేంద్రాలకు అనుబంధంగా స్వయం ఉపాధి సాధించనున్నారు. రైతులకు మేలు వరి ఎక్కువగా పండిస్తున్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 640 వరికోత యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పంట కోత సమయంలో డిమాండ్ పెరిగిపోతోంది. పక్క రాష్ట్రాల నుంచి యంత్రాలు తీసుకొస్తున్న రైతులకు ఖర్చు మోయలేని భారం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొస్తున్న యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. – హెచ్.అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ -
హోదా పక్కన పెట్టి.. కొడవలి చేత పట్టి
సాక్షి, జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా శాసనసభలో అడుగిడిన పలువురు ఆదివాసీ ప్రజా ప్రతినిధులు వారు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా తమ అసలైన జీవితాన్ని ఎన్నడూ మరువలేదని పలు సంఘటనలు రుజువుచేస్తున్నాయి. ఇటీవల నవరంగపూర్ జిల్లా డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి నాగలి పట్టి పొలం దున్ని వ్యవసాయం చేసిన ఫొటోలు సోషల్ మీడియా, వార్తా పత్రికలలో ప్రజలను ఆకర్షించాయి. నేడు అటువంటి మరో సంఘటన జిల్లా ప్రజలను ఆకట్టుకుంది. కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ శాసనసభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి అలంకరించిన పద్మిని ధియాన్ కొట్‌పాడ్ సమితిలోని దమనహండి గ్రామంలో గల తమ సొంత పొలంలో పండిన వరి చేనును బుధవారం స్వయంగా కొడవలి పట్టి ఇతరులతో కలిసి కోశారు. గతంలో తమతో పాటే పొలం పనులు చేసినా మంత్రి అయిన తరువాత కూడా ఆమె హోదాను పక్కన పెట్టి కొడవలి పట్టి వరి చేను కోయడం ఆమె నిరాడంబరతకు దర్పణం పడుతోందని ఆ ప్రాంత ప్రజలు ప్రశంసిస్తున్నారు. చదవండి: (వైరల్ వీడియో.. పోలీసుపై ప్రశంసలు) -
నాలుగేళ్లయినా ఆదుకో లేదు
పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్న రైతు మౌలాలి కుటుంబాన్ని ఆదుకోవడానికి టీడీపీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. దీంతో కుటుంబ పెద్దను కోల్పోయి తీరని దుఃఖంలో మౌలాలి కుటుంబీకులకు ఆసరా లభించడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం పరిధిలోని రాతన గ్రామానికి చెందిన మౌలాలి(50) అనే రైతు అప్పుల బాధతో 2014 నవంబర్ 20వ తేదీన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు. వ్యవసాయం తప్ప మరో జీవన మార్గం తెలియని మౌలాలి 5 ఎకారాల్లో వేరుశనగ, పత్తి పంటలను సాగు చేశాడు. ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ ఏడాది వర్షాభావం, వచ్చిన దిగుబడులకు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. పాత అప్పులు రూ. 3.50 లక్షలకు కొత్త అప్పులు తోడై వడ్డీలతో కలుపుకొని రూ.5 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నలుగురికి ముఖం చూపలేక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య లాలూబీ, పెద్ద కుమారుడు చాంద్ బాషా, రెండో కుమారుడు మున్నా ఉన్నారు. పెద్ద కుమారుడు చాంద్‌బాషా జేసీబీ డ్రైవర్‌గా, చిన్న కుమారుడు మున్నా సైకిల్ షాపులో కూలి పనులు చేస్తున్నారు. లాలూబీ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో వాళ్లందరూ కూలీ నాలీ చేస్తున్నా కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. పైగా అప్పులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయతలచి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని మౌలాలి భార్య లాలూబీ విజ్ఞప్తి చేశారు. – పి. గోపాల్, సాక్షి, పత్తికొండ, కర్నూలు జిల్లా -
సాగుకు ముందే పంట రుణం
స్థానిక అవసరాలకు అనుగుణంగా పంటల బీమా సాక్షి, హైదరాబాద్: సీజన్లో సాగుకు ముందే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ‘ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు’ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. అప్పుడే రైతు తనకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలుచేసి ప్రైవేటు అప్పులకు దూరంగా ఉంటారని, రెట్టింపు ఆదాయానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ రాజిరెడ్డి కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో నాబార్డు సహా వ్యవసాయ, ఉద్యాన, పశుసం వర్థక, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రైతు ఆదాయం రెట్టింపునకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక శాఖలు తమ నివేదికలు అందజేశాయి. ప్రస్తుతం సాగు చేశాకే పంట రుణాలు ఇస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని టాస్క్ ఫోర్స్ కమిటీ వివరించింది. పంట వేయడానికి ముందే వివిధ పంటలకు బీమా ప్రీమియం గడువులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ధారించాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ ఆదాయంగా పాడి, చేపలు, గొర్రెల పెంపకం వంటి వాటిని కూడా ఎంచుకోవాలని సూచించారు. ఎరువుల వాడకాన్ని తగ్గించాలి: వచ్చే ఖరీఫ్ నుంచి ఎరువుల వాడకాన్ని కనీసం పావు శాతానికి తగ్గించేలా చూడాలని కమిటీ సూచించింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న అంశంపై వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు రెండు బృందాలు వెళ్లి సర్వే నిర్వహించాయి. -
అతి పెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియమ్!
అతి పెద్ద వస్తు ప్రదర్శన శాలగా పేరొందిన ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మ్యూజియం ఇప్పుడు అతి పెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియంగా కూడ పేరు తెచ్చుకుంది. ప్రాచీన కళలు, పురాతన వస్తువులతోపాటు, చరిత్రకు సంబంధించిన వస్తు ప్రదర్శనతో ఆకట్టుకునే మ్యూజియం పర్యావరణ పరిరక్షణలోనూ తనదైన పాత్ర పోషిస్తోంది. ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ మ్యూజియంగా కూడ పేరు తెచ్చుకుంది. కళలు, పురాతన వస్తువులు, చరిత్రకు సంబంధించిన మూడు విభాగాలతో సుమారు 50 వేల వరకూ వస్తువులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్నాయి. మొత్తం 140 సోలార్ ప్యానెళ్ళు, కలిగిన మ్యూజియంలో సౌర శక్తి ద్వారా ఇక్కడ నెలకు సుమారు 35 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. అలాగే వర్షపునీరు నిల్వ ఉంచడంలోనూ మ్యూజియం ముందు వరుసలో ఉంది. 2008 లో ఈ వస్తు ప్రదర్శనశాలలో ప్రారంభించిన వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ద్వారా సంవత్సరానికి 24 లక్షల లీటర్ల నీటిని కూడ నిల్వ చేయగల్గుతున్నారు. -
దుంప తెంచింది!
ఆశ చావని రైతు బంగాళాదుంప సాగుతో మరో సారి దెబ్బతినాల్సి వచ్చింది. గతంలో పంట సాగుచేసినా వర్షాల కారణంగా తీవ్ర నష్టాల్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పంట దిగుబడి పెరిగినా ధర పతనమవ్వడంతో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చింది. పంటబీమా కూడా చేసుకోకపోవడంతో కుదేలవ్వాల్సిన దుస్థితి ఎదురైంది. చేసిన అప్పులు తీర్చలేక.. కొత్త అప్పులు పుట్టక రైతులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. పలమనేరు: జిల్లాలోని పడమటి మండలాలు చల్లదనానికి పెట్టింది పేరు. ఇక్కడ బంగాళాదుంప సాగుకు అనుకూలం. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో ఈ దఫా సుమారు 1,500 ఎకరాల్లో దుంపను సాగుచేశారు. గతంలో తీరని నష్టం మామూలుగా ఈ ప్రాంతాల్లో బంగాళాదుంపను రెండు అదునులుగా సాగుచేస్తారు. మొదటి అదునుగా గత ఏడాది సెప్టెంబర్‌లో.. రెండో అదునుగా నవంబర్, డిసెంబర్‌ల్లో సాగుచేశారు. అయితే నవంబర్‌లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భూమిలోపల దుంప సైజు పెరగలేదు. సగం పంట నీటిశాతం ఎక్కువై చేలళ్లోనే కళ్లిపోయింది. ఉన్న దుంపలు పచ్చటి రంగులోకి మారి పనికిరాకుండా పోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాక తోటలు ఏపుగా పెరిగాయేగానీ పంట దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. రెండో అదనులో నాటిన తోటలు కూడా వర్షానికి సగం మాత్రమే మొలకెత్తాయి. ఎకరాకు రూ.70 వేల పెట్టుబడి బంగాళాదుంప సాగుచేసేందుకు రైతులు ఎకరాకు రూ.70 వేలదాకా ఖర్చు చేశారు. విత్తనాలు, ఎరువు లు, క్రిమిసంహారకమందు లు, సస్యరక్షణ తదితరాలకు భారీగానే పెట్టుబడులు పెట్టారు. అప్పట్లో విత్తనపు గడ్డ తుండు(42 కిలోలు) రూ.1500 దాకా తెచ్చి నాటారు. ఎకరాపొలానికి 15 తుండ్లు కావాలి. దీంతో రూ.22,500 విత్తనాలకు, ఎరువులకు మరో రూ.25 వేలు, క్రిమిసంహారకమందులకు ఇంకో రూ.15 వేలు, కూలీలు ఇతరత్రా ఖర్చులు రూ.8వేలు మొత్తం రూ.70 వేలు పంటకోసం వెచ్చించారు. తుండుకు 5 బస్తాలు కూడారాని దిగుబడి మామూలుగా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తే తుండు విత్తనాలకు 20 నుంచి 22 బస్తాల దిగుబడి రావాలి. కానీ ఈ దఫా తుండుకు 5 నుంచి 7 బస్తాలు మాత్రమే వచ్చింది. దానికి తోడు దుంపల నాణ్యత తగ్గింది. ఆ లెక్కన ఎకరానికి 75 నుంచి 100 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇప్పుడున్న ధర (తుండు రూ.550 నుంచి రూ.600) రూ.42 వేల నుంచి 60 వేల దాకా రైతులకు రాబడి వచ్చింది. పంట పెట్టుబడే రూ.70 వేలు అయితే వచ్చిన రాబడి రూ.42 నుంచి రూ.60 వేలు మాత్రమే. మొత్తమీద రైతులు ఎకరాకు రూ.30 వేలదాకా నష్టపోవాల్సి వచ్చింది. నష్టం రూ.45 కోట్లు ఎకరాకు రూ.30 వేలు నష్టం కాగా 1,500 ఎకరాలకు రూ.45 కోట్ల దాకా నష్టంమొచ్చింది. గతంలో రైతులు ఈ పంటకు కనీసం పంటల బీమా కూడా చేసుకోలేదు. దీంతో పూర్తిగా నష్టపోయారు. వేరుశెనగకు మాత్రం బీమా కట్టించుకున్న అధికారులు కూరగాయల పంటలను గురించి పట్టించుకోలేదు. అప్పులు చేసి పంటను సాగు చేసిన రైతన్నలు అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ ఎఫెక్ట్‌తో మళ్లీ పంటల సాగుకు బ్యాంకులు కొత్త రుణాలివ్వకుండా ముఖం చాటేస్తున్నాయి. కాల్‌మనీ వ్యవహారంతో ప్రవేటు వడ్డీ వ్యాపారులు సైతం అప్పులు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. -
‘కూరలు’ కష్టమే!
నగర శివారు ప్రాంతాల్లో తగ్గిన కూరగాయల సాగు ఇతర ప్రాంతాల దిగుమతులపైనే ఆధారం రోజు రోజుకూ పడిపోతున్న సరఫరా... ఆకాశాన్నంటుతున్న ధరలు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టని సర్కారు మహానగరంలో ఇక కూరగాయలు దొరకడం కష్టమే. అసలే నిత్యావసరాల ధరలు మండిపోతుండగా..మరోవైపు కూరగాయలు కూడా మార్కెట్లో దొరకని పరిస్థితి. వర్షాభావం, సాగు, తాగునీటి కటకట కారణంగా శివారు ప్రాంతాల్లో కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేక మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాల్సిన సర్కారు మిన్నకుండిపోవడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. మరికొద్దిరోజులు పరిస్థితి ఇలాగే ఉంటే కూరగాయల ధరలు కూడా ఉల్లి దారిలోనే సాగే ప్రమాదం పొంచి ఉంది. - సాక్షి, సిటీబ్యూరో మహా నగరానికి కూరగాయల సంక్షోభం పొంచి ఉంది. ఒకవైపు వర్షాభావం..మరోవైపు సాగు, తాగునీటికి కటకట కారణంగా నగర శివారు జిల్లాల్లో కూరగాయల సాగు దారుణంగా పడిపోయింది. దీంతో మార్కెట్లో కూరగాయలు లభించని పరిస్థితి ఏర్పడుతోంది. డిమాండ్ భారీగా ఉండగా..సరఫరా దయనీయంగా ఉంది. రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూరగాయల సాగు పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు 50 శాతం మేర పడిపోయింది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఉల్లి కొరత తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. స్థానికంగా ఉల్లిసాగు లేకపోవడంతో మహారాష్ట్ర, కర్నాటక, ఏపీలోని కర్నూలు నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అలాగే టమాట, మిర్చి, దొండ, బెండ, కాకర, క్యాప్సికం, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, అరటి, ములగ, నిమ్మకాయలు, అల్లం, వెల్లుల్లి తదితర కూరగాయలు అత్యధికంగా బెంగళూరు, మదనపల్లి, గుంటూరు, విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఆలుగడ్డలు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దిగుమతి అవుతున్నాయి. అవి కూడా నగర డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా కావట్లేదు. సాధారణంగా ఏటా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూరగాయల కొరతతో ధరలు పెరుగుతాయి. తాజాగా వాతావరణ అననుకూలత కూడా దీనికి తోడయింది. ప్రస్తుతం నగర మార్కెట్లో ఏ రకం కూరగాయలను చూసినా కేజీ రూ.20 నుంచి 50 మధ్యలో ధర పలుకుతున్నాయి. క్యారెట్, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాప్సికం వంటివి స్థానికంగా ఉత్పత్తి కాకపోవడంతో సీజన్లో కూడా వాటి ధరలు ఆకాశంలోనే ఉంటున్నాయి. ప్రభుత్వం సత్వరం స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకపోతే భవిష్యత్ భయానకంగా తయారవుతోందని మార్కెటింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘మహా’ డిమాండ్ గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు కోటి జనాభా ఉందని ఓ అంచనా. ప్రపంచ ఆహార సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్-ఎఫ్ఏఓ) నియమావళి ప్రకారం ఒక్కో వ్యక్తికి రోజుకు 300 గ్రాములు కూరగాయలు వినియోగించాలి. ఇందులో 50 గ్రాములు ఆకు కూరలు మినహాయిస్తే ఒక్కో వ్యక్తికి రోజుకు 250 గ్రాముల కూరగాయలు వినియోగం తప్పనిసరి. ఈ ప్రకారం నగరంలోని కోటి జనాభాకు అన్నిరకాల కూరగాయలు సుమారు 2500 టన్నులు అవసరం అవుతాయని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అంచనా వే సింది. అయితే, ప్రసుతం అన్నిరకాల కూరగాయలు రోజుకు 1600 టన్నులు మాత్రమే సరఫరా అవుతున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే నగరానికి దాదాపు 45 శాతం మేర కూరగాయల కొరత ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ సత్వరం చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా ‘పాలీహౌస్ ఫార్మింగ్’ను ప్రోత్సహించడంతో పాటు రైతులకు తక్కువ కాలవ్యవధిలో ఉత్పత్తినిచ్చే విత్తనాలను సబ్సిడీ ధరపై అందించాలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇంటి ఆవరణలో, రూఫ్‌పైన కూరగాయల సాగు విధానాలను ప్రోత్సహించాలంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో రియల్ వెంచర్లకు అనుమతులిచ్చేటప్పుడే వ్యవసాయ భూముల విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. -
సాగు.. ఎలాగు !
ఎండుతున్న నారుమళ్లు వర్షం కోసం రైతన్నల ఎదురుచూపు సగం కూడా పూర్తికాని వరినాట్లు జోరుగా వానలు కురవాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. మెట్ట, సెమీ డెల్టా ప్రాంతాల్లో నారుమడులు ఎండిపోతున్నాయి. వరుణుడి కరుణ కోసం ఎదురుచూసి అన్నదాతల గుండెలవిసిపోతున్నాయి. జూలై నెలాఖరు నాటికే నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించగా.. కనీసం డెల్టాలోనూ 40 శాతం ఆయకట్టులో కూడా నాట్లు పడలేదు. సార్వా సాగును ఎలా గట్టెక్కించాలో తెలియక కర్షకులు కలవరపడుతున్నారు. ఏలూరు (టూ టౌన్) : వర్షాభావ పరిస్థితులు జిల్లా రైతులను కుంగదీస్తున్నాయి. ఓ వైపు నారుమడులు ఎండిపోతుండగా.. మరోవైపు నాట్లు బాగా ఆలస్యమవుతున్నాయి. సార్వాలో 2.60 లక్షల హెక్టార్లలో వరి పండించేందుకు సన్నద్ధమైన అన్నదాతలు నారుమళ్లు పోశారు. సకాలంలో కాలువలకు నీరు విడుదల చేసినా శివారు ప్రాంతాలకు చేరలేదు. మరోవైపు కృష్ణా డెల్టాకు కాలువ నీరు అందలేదు. మెట్టలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ పరిస్థితుల్లో నారుమడులు ఎండిపోతుండగా.. నాట్లు పడటం లేదు. పుష్కలంగా నీరు లభించే డెల్టాలోనూ ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ కింద 1.72 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు సుమారు 60 వేల హెక్టార్లలో మాత్రమే వరినాట్లు పడ్డాయి. జిల్లా మొత్తంగా చూస్తే 2.60 లక్షల హెక్టార్లలో నాట్లు పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1.24 హెక్టార్లలో మాత్రమే వేశారు. పూర్తిస్థాయిలో వర్షాలు కురవకపోతే సుమారు 75 వేల హెక్టార్లల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టాకు విషయానికి వస్తే కృష్ణా కాలువలో నీరు లేకపోవడంతో ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జూలై రెండో వారంలోనే కృష్ణా కాలువకు నీరివ్వాల్సి ఉండగా, ఇప్పటివరకూ చుక్కు నీరు కూడా రాలేదు. దీంతో ఆ ఆయకట్టు పరిధిలో వేసిన నారుమడులు నీరందక ఎండిపోతున్నాయి. ఇక్కడ నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. మెట్ట ప్రాంతంలో వర్షాలు పడక రైతులు తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నారుమళ్లు పోసిన రైతులు దుక్కులు చేసేందుకు నీరు లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. విత్తనాలను వెదజల్లండి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులు చేలల్లో నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. నారుమళ్లు ముదిరిపోతున్న నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయంగా వెదజల్లే పద్ధతి అనుసరించాలని పేర్కొంటున్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచినట్టు చెబుతున్నారు. -
ఈసారి మోతే!
జిల్లాలో భారీగా తగ్గిన కూరగాయల సాగు విస్తీర్ణం వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్న తోటలు తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోతున్న అన్నదాతలు ఈఏడాది నగరానికి సరఫరా అంతంత మాత్రమే జిల్లాలో కూరగాయల సాధారణ సాగు 25,000 హెక్టార్లు ఈ ఏడాది సాగు చేసిన మొత్తం 4,600 హెక్టార్లు ఇప్పటికే మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత తగ్గడంతో అవి మరికాస్త పైకి పోనున్నాయి. సమీప రోజుల్లో ఇప్పటి రేట్లకు ధరలు రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హైదరాబాద్ మహానగరానికి అధికంగా కూరగాయలను సరఫరా చేస్తున్నది జిల్లా రైతులే. జిల్లా హైదరాబాద్‌కు చుట్టుకొని ఉండడంతో స్థానిక రైతులు మొదటి నుంచీ కూరగాయలను అధికంగా పండించి నగర అవసరాలను తీరుస్తున్నారు. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగుకు మొగ్గుచూపలేదు. వేసిన కొద్దిపాటి పంటలు కూడా ఎండుముఖం పట్టాయి. - చేవెళ్ల రూరల్ చేవెళ్ల రూరల్ : పెరిగిన కూరగాయల ధరలతో సతమతం అవుతున్న ప్రజలు రానున్న రోజుల్లో మరింత భారం మోయక తప్పని పరిస్థితి. ఎందుకంటే యేటా జిల్లాకు కావాల్సిన కూరగాయలను సరఫరా చేస్తూ, నగరానికి కూడా అందిస్తున్న రైతులు ఈ సారి చేతులెత్తేశారు. తీవ్ర వర్షాభావమే ఇందుకు ప్రధాన కారణం. జిల్లా నగరానికి ఆనుకుని ఉండడంతో రైతులు కూరగాయల సాగుపైనే అధికంగా ఆధారపడ్డారు. అయితే గత మూడేళ్లుగా వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ కారణంతో కొందరు కూరగాయల సాగుకు దూరమైతే.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటి మరి కొందరు సాగు చేపట్టలేదు. మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పెరిగిన పెట్టుబడులు, రియల్ వ్యాపారంలో భూములను అమ్ముకోవడం.. తదితర కారణాల వల్ల జిల్లాలో కూరగాయల సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జిల్లాను కూరగాయల జోన్‌గా అభివృద్ధి చేస్తామన్న సీఎం మాటలు.. మాటలకే పరిమితం అయ్యాయి. జిల్లాలో కూరగాయల సాధారణ సాగు 25 వేల హెక్టార్లు. ఈ ఏడాది ప్రస్తుతం ఇప్పటివరకు 4,600 హెక్టార్లలో మాత్రమే సాగు చేపట్టినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికి సరైన వర్షాలు కూడా లేకపోవడంతో కూరగాయల సాగు పెరిగే అవకాశం కూడా చాలా తక్కువ. ముఖ్యంగా అధిక కూరగాయలసాగు చేపట్టే పశ్చిమ రంగారెడ్డి జిల్లా రైతులు ఈ సారి అందుకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహమేదీ..? ఈ ఏడాదికి సబ్సిడీ విత్తనాలకు ప్రభుత్వం జిల్లాకు రూ.83లక్షలు మాత్రమే కేటాయించింది. చేవెళ్ల డివిజన్లోని చేవెళ్ల, పూడూరు, షాబాద్ మండలాలకు రూ.18 లక్షలు ఇచ్చారు. అంటే మండలానికి రూ.ఆరు లక్షలు. చేవెళ్ల హెచ్ఓ పరిధిలో ఇచ్చిన రూ.18లక్షల విలువైన సబ్సిడీ విత్తనాలను వచ్చిన రెండు రోజుల్లోనే రైతులందరూ డీడీలు కట్టి తీసుకున్నారు. ఇంకా చాలా మంది రైతులకు ఆ విత్తనాలు అందలేవు. డివిజన్లో బీట్రూట్, క్యాలిఫ్లవర్, టమాటా, క్యాబేజీ, మిర్చి తదితర పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు వచ్చే నాటికి దాదాపు సగం మంది రైతులు విత్తనాలు ప్రైవేటుగానే కొనుగోలు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహలేమి కారణంగా కూరగాయల రైతులు అప్పులఊబిలో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగంటేనే భయపడే స్థితిలో ఉన్నారు. ఒక ఎకరంలో కూరగాయల సాగుకు దాదాపు రూ.35 వేల నుంచి రూ. 45 వేలు ఖర్చు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో దళారులు, ధరలలేమీ కారణంగా ఒక్కోసారి అవి కూడా చేతికి రావడం లేదు. జిల్లాలో సాగు, అందిన సబ్సిడీలు.. 2009లో జిల్లాకు రూ.రెండు కోట్లు సబ్సిడీ రూపంలో ఇచ్చారు. ఆ తర్వాత యేటా తగ్గిస్తూ ఇస్తున్నారు. 2012-13లో కూరగాయల సాగు 24,419 హెక్టార్లు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రూ. కోటి. ఇది కేవలం 3,342 హెక్టార్లకు సరిపోయింది. 2013-14లో సాగు 28,508 ఉంటే ప్రభుత్వ సబ్సిడీ 1.35 కోట్లు. ఇది 4,530 హెక్టార్లకు వస్తుంది. 2014-15లో 28,264 సాగుకు రూ.1.80కోట్లు ఇచ్చారు. ఇది 5,300 హెక్టార్లకు మించి సరిపోదు. ఈఏడాది జిల్లాకు రూ.83లక్షల కేటాయించారు. ఇప్పటివరకు 4,600ల హెక్టార్ల సాగు మాత్రమే జరిగింది. -
అక్కడ మోళ్లు.. ఇక్కడ చిగుళ్లు
కొల్లిపర : రాజధాని సమీప మండలాల రైతులు పంటల మార్పిడికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజధాని నిర్మాణానికి సేకరించిన భూముల్లో ప్రస్తుతం సాగులో ఉన్న పంటే చివరిది. ఇక అక్కడ పంటలు వేసే అవకాశం లేదు. దీంతో ఆ పంట రకాలను సమీప మండలాల్లో సాగు చేస్తే లాభ దాయకంగా ఉంటుందని రైతులు ఆశపడుతున్నారు. దీనిలో భాగంగానే కొల్లిపర మండలంలో రైతులు పంట మార్పిడి, కొత్త రకాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. రాజధాని నిర్మాణానికి సమీకరించిన భూముల్లో రైతులు ఇప్పటివరకు వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, మిరప, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. అలాగే కూరగాయలు, పూలు, పండ్ల తోటలు కూడా సాగులో ఉన్నాయి. సమీకరణ నేపథ్యంలో ప్రస్తుతం ఆ పంటలు అక్కడ పండించే అవకాశం లేదు. ఇది గమనించిన సమీప మండలాల రైతులు ఆ పంటలను తమ పొలాల్లో సాగు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. కొత్త రకం పంటల సాగుకు రైతులు మక్కువ చూపుతుండటంతో ఇక్కడి కూలీలకు ఆదాయం లభించే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి కొల్లిపర మండలంలో రైతులు ఇప్పటి వరకు సాగు చేస్తున్న పంటల స్థానంలో కూరగాయల సాగు, పండ్లతోటల పెంపకం వైపు మరలుతున్నారు. ఆ దిశగా పొలాలను తయారు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు ఉండడం, సాగు నీరు పుష్కలంగా లభించడం రైతులకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇప్పటివరకు ఇక్కడి రైతులు వాణిజ్య పంటలైన కంద, పసుపు, అరటి, చెరకు తదితర పంటలను మెట్ట భూముల్లో సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా పూలు, కూరగాయల సాగు చేస్తున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే పూర్తి స్థాయిలో ఆకు, తీగజాతి కూరగాయలు సాగు చేస్తుంటారు. రెండేళ్ల క్రితం వరకు 50 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు చేసేవారు. ఈ ఏడాది 200 ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టారు. ఈ ప్రాంత రైతులకు కలిసి వచ్చే అంశం... ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలను విజయవాడ, మంగళగిరి మార్కెట్లకు తరలించేవారు. ఇప్పుడిక అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితి లేకపోవటంతో సహజంగా కూరగాయలు, పండ్లు, పూలకు మార్కెట్లలో కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు ప్రాంతాలకు సమాంతర దూరంలో ఉన్న కొల్లిపర మండల రైతులు కొత్త పంటల సాగుకు ఆసక్తి చూపడం కలిసి వచ్చే అంశంగా మారింది. కృష్ణాక రకట్టను అభివృద్ధి చేయాలి... కృష్ణానది కరకట్టను సకాలంలో అభివృద్ధి చేయకపోవటంతో దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు తదితర మండలాల రైతులకు ఇబ్బందిగా మారింది. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించటానికి పలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడకు దగ్గర మార్గం అయిన కరకట్టను అభివృద్ధి చేస్తే మరింత మంది రైతులు కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేసే అవకాశం ఉంది. -
వానాకాలం వచ్చినా కోతలే..
అధికారికంగా గ్రామాల్లో 6 గంటలు మండల కేంద్రాల్లో 2 గంటలు సబ్‌స్టేషన్ పరిధిలోనూ 2 గంటలు అనధికారిక కోతలూ అమలు హన్మకొండ : వానా కాలం మొదట్లోనే కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యూయి. విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. విద్యుత్ ఉత్పత్తి తగ్గిందంటూ ప్రభుత్వం కోతలు విధించేందుకు అనుమతి ఇచ్చింది. వరంగల్ సర్కిల్లో శుక్రవారం నుంచి కోతలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయానికి విద్యుత్ అవసరం కొంత మేరకే ఉంది. అయినప్పటికీ... విద్యుత్ కోతలు అమలు చేయూలని ట్రాన్స్‌కో నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాల వారీగా విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. వరంగల్ నగరంలో మాత్రం విద్యుత్ కోతలు విధించలేదు. వేసవి నుంచి విద్యుత్ సరఫరా కొంత మెరుగ్గానే ఉంది. రబీ తర్వాత వ్యవసాయ మోటార్లు నడవడం లేదని, జిల్లాకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటూ నిరంతర సరఫరా చేశారు. గ్రామాల్లో మాత్రం అనధికారికంగా గంటో, రెండు గంటలో కోత పెట్టినా... కొద్ది రోజులకే పరిమితం చేశారు. తాజాగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని అధికారిక కోతలు అమలు చేస్తూనే... ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) పేరిట అనధికార కోతలూ అమలు చేస్తున్నారు. గ్రామాల్లో అనధికార కోతలు కూడా.. ఈ సారి గ్రామాలకు విద్యుత్ సరఫరా పరిస్థితి అధ్వానంగా మారింది. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. పలు సందర్భాల్లో రాత్రి కూడా సరఫరా నిలిపివేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. పలు కారణాలు, సరఫరాలో సాంకేతిక లోపం అంటూ రోజూ రాత్రి పూట గంటపాటు కోత విధిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ఎల్ఆర్ తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో అధికారిక కోత 6 గంటలే అయినా... 8 గంటలపాటు కరెంట్ ఉండడం లేదు. మండలాల్లో 2 గంటలు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటలపాటు కోత విధిస్తున్నారు. రెండు రోజుల నుంచే కోతలు అమలు చేస్తున్నా... శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. విద్యుత్ కోతలు అమలు చేయూలని అన్ని మండలాలు, డివిజన్లకు ఉన్నతాధికారులు ఫోన్ల ద్వారా సమాచారమిచ్చారు. మండల కేంద్రాల్లో అధికారికంగా 2 గంటలు కోత పెడుతున్నా... మరో గంటపాటు అనధికారికంగా అడపాదడపా తీసేస్తున్నారు. సబ్‌స్టేషన్ పరిధిలో 2 గంటలు జిల్లాలోని 226 సబ్‌స్టేషన్ కేంద్రాల్లో అధికారిక కోత 2 గంటలు కాగా... ఇక్కడ కూడా అదనంగా 30 నుంచి 50 నిమిషాల పాటు అనధికారికంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.