hegitations
-
వర్సిటీలో ఆగ్రహజ్వాలలు
-
మంత్రులను తొలగించాల్సిందే!
♦ రోహిత్ ఆత్మహత్యకు వారే బాధ్యులు ♦ హెచ్‌సీయూ విద్యార్థి ఆత్మహత్యపై భగ్గుమన్న భారతం ♦ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నిరసనలు ♦ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, పంజాబ్‌లలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పంజాబ్‌లోని ఫగ్వారాలో ‘పంజాబ్ అంబేడ్కర్ సేన మూలవాసి’ సంస్థ, బీఎస్పీ విద్యార్థి సంఘం సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించి.. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దత్తాత్రేయను మంత్రి పదవినుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖరాశారు. అటు గుజరాత్ సెంట్రల్ వర్సిటీకి చెందిన 50 మంది దళిత విద్యార్థులు గాంధీనగర్‌లో శాంతిర్యాలీ నిర్వహించారు. వేముల రోహిత్‌ది వ్యవస్థాగతమైన హత్య అని ఆరోపించారు. ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరపాలని ఆందోళన నిర్వహించారు. ఇప్పటివరకు సస్పెండైన 10 మందిలో 9 మంది దళితులే ఎందుకున్నారని ప్రశ్నించారు. కుల, మతోన్మాద రాజకీయాలు నశించాలంటూ నినాదాలు చేశారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.బెంగళూరులోనూ దళిత విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ తీరువల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాయి. అటు తమిళనాడులోనూ నిరసనలు మిన్నంటాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతోపాటు దళిత విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. టీఎన్‌సీసీ దళిత విభాగం నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్న శాస్త్రి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. రోహిత్ మృతి కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కూడా చెన్నైలో నిరసనలు చేపట్టింది. కాగా కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు యూనివర్సిటీ వీసీ అప్పారావులపై చర్యలు తీసుకోవాలని ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో డిమాండ్ చేశారు. దళిత విద్యార్థుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. అటు పుణేలోనూ.. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్ వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. హైదరాబాద్‌లో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముంబై, ఔరంగాబాద్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ముంబై యూనివర్సిటీలో అంబేడ్కర్ యువజన సంఘాలు, అంబేడ్కర్ రాడికల్ సంఘం, రిపబ్లికన్ పాంథర్ తదితర సంఘాలు సంయుక్తంగా మంగళవారం ఆందోళన చేపట్టాయి. రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని వీసీకి వినతిపత్రం అందించారు. మరోవైపు, ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాగ్‌పూర్‌కు చెందిన దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. అవసరమైతే నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. మంత్రులను తొలగించాలి: కాంగ్రెస్ రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇద్దరు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రధాన మంత్రి మోదీ వారిద్దరినీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుమారి సెల్జా డిమాండ్ చేశారు. ఇరానీ విశ్వవిద్యాలయానికి పలు లేఖలు రాశారని, ఏబీవీపీని ప్రోత్సహించడానికి అనువుగా దళిత విద్యార్థులకు వ్యతిరేకంగా దత్తాత్రేయ వ్యవహరించారని సెల్జా చెప్పారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, దళితుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు పని చేయ డం ఇది మొదటిసారి కాదన్నారు. రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: ఆజంఖాన్ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ డిమాండ్ చేశారు. విద్యార్థి సూసైడ్ నోట్ కొత్త అనుమానాలకు తావిస్తోందని.. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దాని అనుబంధ సంస్థలే బాధ్యతవహించాలన్నారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీ వంటి సంస్థలను మూసేయించాలని సంఘ్ పరివార్ సంస్థలు యత్నిస్తున్నాయన్నారు.ఈకేసులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని ఆజంఖాన్ కోరారు. టీఎంసీ సంఘీభావం రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు తృణమూల్ కాంగ్రె స్ ఇద్దరు సభ్యుల బృందాన్ని హైదరాబాద్‌కు పంపనుంది. ఫోన్లో సంఘీభావం తెలిపినా.. ప్రత్యక్షంగా పాల్గొంటే బాగుంటుందని విద్యార్థి బృందం కోరటంతో టీఎంసీ బృందం రానుంది. వేడెక్కిన జంతర్ మంతర్ రోహిత్ ఆత్మహత్య వెనక బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ వివిధ విద్యార్థి సంఘాలు రెండోరోజూ ఢిల్లీలో తమ ఆందోళన కొనసాగించాయి. దోషులపై తగిన చర్యలు తీసుకోని పక్షంలో తమ ఆందోళన ఉధృతమవుతుందని హెచ్చరించాయి. మంగళవారం ఉదయం ఇక్కడి జంతర్ మంతర్‌లో ఆప్ నేతలు, ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. సాయంత్రం మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్ వద్ద కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ ఆందోళన చేపట్టింది. ఏబీవీపీ, బీజేపీ నేతల ఒత్తిడి వల్లే కేంద్రం విద్యార్థులపై చర్యలు తీసుకుందని, సస్పెండ్ చేసేంతవరకూ కేంద్రం నుంచి ఒత్తిడి కొనసాగిందని ఆందోళనకారులు ఆరోపించారు. కాగా, ప్రధాని మోదీ జోక్యం చేసుకొని స్మృతి ఇరానీ, దత్తాత్రేయలను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఓ వ్యవస్థ అంతర్గత విషయాల్లో మంత్రి ఎలా జోక్యం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఆందోళనలే ఇందుకు నిదర్శనమన్నారు. మోదీ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో స్మృతి ఇరానీ పాత్రపై కూడా విచారణ జరిపించాలని ఆప్ నేత అశుతోష్ డిమాండ్ చేశారు. రాహుల్.. రాజకీయం చేయొద్దు: బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ హత్యను రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. రోహిత్ వెనకబడిన తరగతులకు చెందిన వాడని.. అనవసరంగా దళితుడని ప్రచారం చేస్తూ వివాదాన్ని పెంచుతున్నారని మండిపడింది. దళితుడైనందుకే బీఆర్ అంబేడ్కర్‌ను జీవితాంతం మనోవేదనకు గురిచేసిన విషయాన్ని రాహుల్ మరిచిపోయారా అని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రశ్నించారు. కొన్ని వర్గాలు, కాంగ్రెస్, మీడియాలోని ఓ వర్గం రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కోర్టు ఆలోచనల మేరకే రోహిత్‌తో పాటు ఐదుగురు విద్యార్థులపై వర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నారని.. ఆ తర్వాత మానవతాధృక్పథంతో ఆలోచించి హాస్టల్లోకి అనుమతించకుండా.. క్లాసులకు అనుమతిచ్చారని మురళీధర్ రావు గుర్తుచేశారు. ఏదో జరిగిపోయినట్లు హడావుడిగా పర్యటించటం ద్వారా ఓ జాతీయ పార్టీ పరువును మరింత దిగజార్చారని విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేయటం ద్వారా బురదలో చేపలు పట్టాలనుకుంటున్నారని మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. రోహిత్ ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం వల్లే గొడవ మొదలైందని.. ఈ ఆత్మహత్యను కొన్ని వర్గాలు దళితహత్యగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. -
భగ్గుమన్న విద్యార్థిలోకం
-
భగ్గుమన్న విద్యార్థిలోకం
- హెచ్‌సీయూ దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై దద్దరిల్లిన ఢిల్లీ, హైదరాబాద్ - ఢిల్లీలోని మానవ వనరుల శాఖ కార్యాలయం వద్ద - ఐదు గంటలపాటు విద్యార్థి సంఘాల ఆందోళన - ఇది ప్రభుత్వ హత్యేనంటూ నినాదాలు - కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇంటి ముట్టడికి యత్నం - పోలీసులతో ఘర్షణ.. ఉద్రిక్తత - వాటర్ క్యానన్లతో చెదరగొట్టిన పోలీసులు - హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలోనూ మిన్నంటిన ఆందోళనలు.. 144 సెక్షన్ విధింపు - రోహిత్ మృతిపై ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం - దత్తాత్రేయ, వీసీ, తదితరులపై కేసు నమోదు - అంబర్పేట్ శ్మశాన వాటికలో ముగిసిన రోహిత్ అంత్యక్రియలు సాక్షి , న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో దళిత విద్యార్థి వేముల రోహిత్ చక్రవర్తి ఆత్మహత్యపై విద్యార్థి లోకం భగ్గుమంది. ఢిల్లీ దద్దరిల్లింది. విద్యార్థి, దళిత, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. రోహిత్‌ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని నినదించాయి. పార్లమెంటు సమీపంలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్చార్డీ) కార్యాలయం ఎదుట విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. అనంతరం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, వాటర్ క్యానన్లు ప్రయోగించడంతో సోమవారమంతా దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) కూడా ఆందోళనలతో అట్టుడికింది. వర్సిటీ నుంచి రోహిత్‌తోపాటు సస్పెన్షన్‌కు గురైన విద్యార్థి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ ైవె స్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఏబీవీపీ విద్యార్థులు సుశీల్‌కుమార్, కృష్ణచైతన్యపై ఐపీసీ 306, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో ఉలిక్కిపడ్డ హెచ్చార్డీ శాఖ.. రోహిత్ మృతిపై నిజానిజాలను వెలికి తీసేందుకు ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. శాస్త్రి భవన్ వద్ద ఉద్రిక్తత విద్యార్థి సంఘాల ఆందోళనతో హెచ్చార్డీ కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, ఎస్డీపీఐ, జేఎన్‌యూఎస్‌యూ, కేవైఎస్, దళిత్ స్టూడెంట్ ఫెడరేషన్, ఎస్ఐఓ, యూడీఎస్ఎఫ్, వైఎఫ్డీఏ, బీఏపీఎస్ఏ తదితర విద్యార్థి సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బారికేడ్లను తొలగించి కొందరు కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు నిలువరించారు. విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. నీళ్లు మొత్తం పూర్తవడంతో పోలీసులు తమ యత్నాన్ని విరమించుకున్నారు. చివరకు మరికొందరు పోలీసులను రప్పించి ఐదు ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక్కడ ఆందోళన సద్దుమణుగుతున్న సమయంలో కొందరు విద్యార్థులు పక్కనే ఉన్న మెట్రో స్టేషన్లోకి పరుగులు తీశారు. వారంతా తుగ్లక్ రోడ్‌లోని హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఇక్కడ కూడా పోలీసులు విద్యార్థులపై వాటర్ క్యానన్లు ప్రయోగించి, చివరకు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఏబీవీపీ, బీజేపీ నేతల ఒత్తిడి వల్లే కేంద్రం విద్యార్థులపై చర్యలు తీసుకుందని, కేంద్ర చర్యల వల్లే రోహిత్ మృతి చెందాడని ఆరోపించారు. దత్తాత్రేయ లేఖ కారణంగానే కేంద్రం రంగంలోకి దిగిందని ఆరోపించారు. స్మృతి, దత్తాత్రేయ తక్షణం పదవులకు రాజీనామా చేయాలని, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. అట్టుడికిన హెచ్‌సీయూ ఇటు హెచ్‌సీయూ కూడా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో అట్టుడికింది. ఉదయం 6 గంటలకే 300 మందికి పైగా పోలీసులు.. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన ఎన్ఆర్ఎస్ఐ వింగ్ హస్టల్‌కు చేరుకొని విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. ఉదయం 7.15 గంటలకు మృతదేహన్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రోహిత్ మృతదేహన్ని బలవంతంగా తరలించడంతో విద్యార్థులు వర్సిటీలోని పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. అక్కడ వీసీ లేకపోవడం, కార్యాలయానికి తాళం వేసి ఉండటటంతో ‘వెలివాడ’ పేరిట బహిష్కరణకు గురైన విద్యార్థులు కొనసాగిస్తున్న ధర్నా శిబిరం వద్దకు చేరుకున్నారు. వీసీ, క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అలోక్ పాండే, ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్‌ను సస్పెండ్‌చేయాలని, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేత, స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజు, సోదరి నీలిమ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధిక విలేకరులతో మాట్లాడుతూ... తన కొడుకు చాలా ధైర్యవంతుడని, ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని అన్నారు. క్యాంపస్‌లోకి వచ్చే వరకు సస్పెన్షన్ విషయం తనకు తెలియదని కన్నీళ్ల పర్వంతమయ్యారు. ‘‘నా కొడుక్కి ఎమ్మెస్సీలో ఆరో ర్యాంక్ వచ్చింది. పీహెచ్డీ ఫ్రీ సీటు వచ్చింది. రెండు సార్లు సీఎస్ఆర్ఐకి క్వాలిఫై అయ్యాడు. అలాంటి మెరిట్ స్టుడెంట్‌ను వేధించి చంపారు’’ అని ఆమె ఆరోపించారు. ఏ తప్పు చేయకపోతే వీసీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. రోహిత్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దత్తాత్రేయ, వీసీ తదితరులపై కేసు వర్సిటీ నుంచి సస్సెన్షన్‌కు గురైన విద్యార్థుల్లో ఒకరైన ప్రశాంత్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ ైవె స్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఏబీవీపీ విద్యార్థులు సుశీల్‌కుమార్, బీజేవైఎం నేత విష్ణుపై ఐపీసీ 306, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రముఖుల దిగ్భ్రాంతి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ప్రజా గాయకులు గద్దర్, విద్యావేత్త చుక్కారామయ్య, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, పౌర హక్కుల నేత జయ వింధ్యాల, ఎం.బి. రఘునాథ్, ఆవుల బాలనాథం, ప్రజాకవి జయశంకర్, బత్తుల రాంప్రసాద్ తదితరులు ఉస్మానియా ఆసుపత్రికి తరలి వచ్చి రోహిత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి ఆత్మహత్య, విద్యార్థుల సస్పెన్షన్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. విషవాయువు, ఉరితాళ్లు ఇవ్వండి.. దళిత విద్యార్థులు వర్సిటీలో అడ్మిషన్ తీసుకొనే సమయంలోనే ‘10 మిల్లీ గ్రాముల సోడియం యాసిడ్(విష వాయువు), ఉరితాళ్లు ఇవ్వాలంటూ’ తమ సస్పెన్షన్‌కు నిరసనగా గత డిసెంబర్ 18న వీసీ అప్పారావుకు అందజేసినవినతి పత్రంలో రోహిత్ పేర్కొన్నాడు. బాధ కల్గినప్పుడు అంబేద్కర్ భావజాలం గల దళిత విద్యార్థులు ఆ విషవాయువు లేదా ఉరి వేసుకొని ప్రాణం తీసుకునే వెసులుబాటు కల్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతటి మనో వేదనతో వినతి పత్రం ఇచ్చినా ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. విషయం కోర్టు పరిధిలో ఉందని నిర్లక్ష్యం చేయడంతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ కుటంబ నేపథ్యమిదీ.. గుంటూరు జిల్లా గురజాడకు చెందిన రాధిక, మణికుమార్ దంపతుల పెద్ద కొడుకు రోహిత్. సోదరి నీలిమ బీకాం చేశారు. సోదరుడు రాజు ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉప్పల్‌లోని ఎన్జీఆర్ఐలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిత్ తండ్రి మణికుమార్ మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గుంటూరులో టైలర్‌గా పనిచేసే రాధిక కొంత కాలంగా ఉప్పల్‌లోని బ్యాంక్ కాలనీలో చిన్న కొడుకు రాజు వద్ద ఉంటోంది. ఈ నెల 13న తల్లితో ఫోన్లో మాట్లాడిన రోహిత్.. పండుగకు వస్తానని చెప్పాడు. పండుగకు రాకపోవడంతో ఆమె ఆదివారం మధ్యాహ్నం రోహిత్ స్నేహితుడు విజయ్‌కి ఫోన్ చేసింది. అదే రోజు సాయంత్రం కొడుకు మృతి వార్త తెలిసింది. సులభంగా విడిచిపెట్టం: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా రోహిత్ ఆత్మహత్య ఘటనను సులభంగా విడిచిపెట్టబోమని, దీనిపై ప్రభుత్వానికి గట్టి సిఫారసు చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా అన్నారు. రాజకీయ జోక్యం వల్లే మొత్తం విషయం యూ టర్న్ తీసుకుందని అన్నారు. హెచ్సీయూకు వెళ్లి రోహిత్ ఆత్మహత్యపై వివరాలు తెలుసుకొని వచ్చిన ఆయన సోమవారం రాత్రి దిల్‌కుశ గెస్ట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, తమ వైపు నుంచి కూడా విచారణ జరిపే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. -
భగ్గుమన్న రాష్ట్రం
- ప్రత్యేక హోదా కోరని చంద్రబాబు వైఖరికి నిరసన - ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలను మట్టిలో కలిపేశారంటూ విమర్శలు - వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమించిన ప్రజలు - రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, మానవహారాలు, ర్యాలీలు.. చంద్రబాబు, మోదీ దిష్టి బొమ్మల దహనం - ఏపీ నోట్లో మట్టి కొట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీని పట్టించుకోని వైనం - ప్రత్యేక హోదాపై తొలినుంచీ అనాసక్త ధోరణిలో సీఎం - ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి నష్టనివారణ చర్యలు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి సంజీవనిగా నిలుస్తుందన్న ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట మాట మాత్రమైనా ప్రస్తావించని సీఎం చంద్రబాబు వైఖరికి నిరసనగా రాష్ట్రం భగ్గుమంది. 16 నెలలుగా ఎంతో ఆశగా ఎదురుచూసినా, తమ ఆశలను అడియాశలు చేసి, తమ ఆకాంక్షలను మట్టిలో కలిపేశారంటూ రాష్ట్ర ప్రజలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. రాష్ర్టవ్యాప్తంగా మానవహారాలు, ర్యాలీలు నిర్వహించి సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంటూ రాష్ర్ట ప్రజల భవిష్యత్తుతో బంతాట ఆడుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చివరకు ప్రజల ఆకాంక్షలపై గుప్పెడు మట్టి కొట్టారని, యువతరం ఆశలపై చెంబెడు నీళ్లు చల్లారని మండిపడ్డారు. తమ బిడ్డల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ ఎదుట ముఖ్యమంత్రి మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అట్టహాసంగా రూ.400 కోట్లు ఖర్చుపెట్టి గురువారం నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రత్యేకహోదాపై పెదవి విప్పని ముఖ్యమంత్రి తీరుపై వైఎస్సార్సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం సొంత కేసుల నుంచి బయటపడటానికి ప్రత్యేక హోదా అంశాన్ని అమ్మేశారని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా వస్తుందని ఎదురుచూసిన అయిదు కోట్ల రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా రావాల్సిన విభజన చట్టంలోని హామీలకే ప్రత్యేక ప్యాకేజీ అనే కొత్త పేరు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర విపక్ష నేతలు నేతలు కూడా చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఏపీ నోట్లో మట్టి విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు విభజన చట్టంలో అనేక హామీలివ్వడంతోపాటు, ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రజలు 16 నెలలుగా ఎదురు చూశారు. కానీ ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ప్రణాళికా సంఘం ఒప్పుకోవడంలేదంటూ, ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు చెబుతున్నాయంటూ కేంద్రం ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చింది. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్యనాయుడు, 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎన్నికల సభల్లో మాట్లాడిన చంద్రబాబు... ప్రత్యేకహోదా సంజీవని కాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు హోదాకోసం ఉద్యమించారు, కొందరు బలిదానం చేశారు. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ... ఆ వేదికగా ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేస్తారని వేయికళ్లతో ఎదురు చూశారు. వారి ఆశలు అడియాశలయ్యాయి. హోదా సాధించాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి అసలు ఆ ప్రస్తావనే తీసుకురాకపోగా... ప్రధాని సైతం హోదాపై పెదవి విప్పలేదు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కలిసి ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టి కొట్టారని తీవ్రంగా మండిపడుతున్నారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాటవేత ధోరణి ఆందోళన కలిగిస్తోందని సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలకు ముందు 15 ఏళ్లు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు గొంతు ప్రధాని ముందు ఎందుకు మూగబోయిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ప్రధాని, ముఖ్యమంత్రి కలిసికట్టుగా ప్రజల ముఖాన మట్టి, నీళ్లు చల్లారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటుచేసి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, వంద శాతం పారిశ్రామిక రాయితీలు ఇవ్వండని ఒక ముక్క కూడా చంద్రబాబు మాట్లాడకపోవడాన్ని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తప్పుపట్టారు. ఆదినుంచీ అదే ధోరణి... ప్రత్యేకహోదా సాధనపై చంద్రబాబుకు మొదటినుంచీ చిత్తశుద్ధి లేదని, అందుకే రాష్ట్రానికి దక్కిన హక్కు, ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకురాకుండా దాటవేశారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ అనబోయి స్పెషల్ ప్యాకేజీ అన్నానని సీఎం చెప్పడం హాస్యాస్పదమని విమర్శిస్తున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం రూ.400 కోట్ల ఖర్చుతో అట్టహాసంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో నిర్వహించింది. ఒకే రోజు రెండు పండుగలు.. విజయదశమి, అమరావతి శంకుస్థాపనలను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించారు. కానీ ఏడాదిన్నర కాలంగా ఐదుకోట్ల ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్న, అత్యంత కీలకమైన ప్రత్యేక హోదాపై పట్టుబట్టకపోగా, అసలు ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపై మట్టిగొట్టారు. ప్రత్యేకహోదా సాధనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదినుంచీ అనాసక్త ధోరణినే ప్రదర్శిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని ప్రకటించిన ప్రత్యేకహోదాను సాధించడం మరచి, ప్రత్యేకహోదా సంజీవని కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐదు నిమిషాల పాటు అనర్గళంగా చేసిన ఉపన్యాసంలోనూ ప్రత్యేక ప్యాకేజీ అన్నారే తప్ప ప్రత్యేకహోదా గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. గతంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ లోక్ సభ, రాజ్యసభల్లో ఏపీకి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన విషయాన్ని సైతం ప్రధానికి గుర్తు చేయలేదు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కలిగే లాభాలను వివరించటం ద్వారా ప్రధానికి ఆకర్షించేందుకు ప్రయత్నించాల్సిన చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా గత ఎనిమిది నెలల్లో ఎన్నో నిధులు మంజూరు చేసి ఏపీని ఆదుకున్నారన్న రీతిలో ప్రధానిని పొగ డ్తలతో ముంచెత్తారు. బహిరంగ సభ వేదిక ద్వారా ప్రధానిని ఆకర్షించాలని సీఎం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రతిపక్షంపై విమర్శలు చేసేందుకు ఉపయోగించుకున్నారు. విభజన వల్ల జరిగిన నష్టాలనే పదే పదే ప్రస్తావించటం ద్వారా మానిపోతున్న గాయాలను తిరగదోడేందుకు ప్రయత్నించారు. హోదాపై ముఖ్యమంత్రి ఏమీ అడగ్గపోవడంతో చివరగా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ప్రసంగంలో ఆ మాటెత్తలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ , అమృత్‌ల గురించి ప్రస్తావించి సరిపెట్టేశారు. కంటితుడుపు చర్యలు... ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి ధోరణి, ప్రధాని వైఖరికి నిరసనగా రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమనడంతో తెలుగుదేశం నేతలు నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా విలేకరుల సమావేశం పెట్టి... తాను ప్రత్యేక హోదా అడగాలనే అనుకున్నాననీ, కానీ పొరపాటున ప్రత్యేక ప్యాకేజీ అన్నానని మభ్యపెట్టే ప్రయత్నంచేశారు. ప్రధాని మోదీ ప్రత్యేకహోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకపోవడంపై తాము కూడా అసంతృప్తిగానే ఉన్నామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ప్రధాని ప్రకటించారని, అలాగే ప్రత్యేక హోదా కూడా ఇస్తారని టీడీపీ నేతలు సర్దిచెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతకాలం ప్యాకేజీ పాట పాడిన నేతలు సైతం... ప్రత్యేకహోదాకోసం తాము ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తీరు తమను ఉత్సాహపరిచినప్పటికీ... హోదా, ప్యాకేజీ విషయంలో ప్రకటన రాకపోవడం తమలో నిరాశ నింపిందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రత్యేకహోదా ఇవ్వాలని చంద్రబాబు అడిగి ఉంటే ప్రధాని ఏ విధంగా స్పందించేవారోనని, అడగకపోవడంవల్ల రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
చల్లారిన జమ్ము
జమ్ము: గడిచిన నాలుగు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతోన్న జమ్ము శనివారంనాటికి కాస్త చల్లబడింది. నేటి ఉదయం సిక్కు మతపెద్దలు, ప్రభుత్వ అధికారులకు మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో జమ్ము, సాంబా, కథువా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో సాధారణ పరిస్థితులకు మార్గం సుగమమైంది. అయితే శనివారం కూడా పాఠశాలలు, కళాశాలలు మూసే ఉంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆందోళనలకు అసలు కారణమైన ఖలిస్తాన్ మిలిటెంట్ నేత బింద్రన్ వాలే పోస్టర్లను తొలిగించిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని, సిక్కు యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసులపై కేసు నమోదు చేస్తామని హోంశాఖ కార్యదర్శి ఆర్ కే గోయల్, కశ్మీర్ డీజీపీ కే. రాజేంద్ర కుమార్ తదితరులతో కూడిన ఉన్నతస్థాయి బృందం సిక్కులకు హామీ ఇచ్చింది. ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని, తమ డిమాండ్లు అంగీకరించినందున ఆందోళనలకు స్వస్తిచెబుతున్నామని సిక్కుల నాయకుడు తర్లోచన్ సింగ్ మీడియాకు చెప్పారు. పోలీసు వద్దనుంచి లాక్కున్న ఏకే 47 తుపాకిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. -
ఇక ఆందోళనలు గగనమే..
అల్లరి మూకలను కంట్రోల్ చేయడానికి లాఠీలు, బాష్పవాయు గోళాలు.. వాడే పోలీసులకు ఆ శ్రమ తప్పనుంది. చేతికి మట్టంటకుండా.. ఆందోళనకారుల కళ్లు మండించి.. కన్నీళ్లు పెట్టించడానికి.. పెప్పర్ స్ప్రే వెదజల్లే డ్రోన్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇటీవల లక్నోలో ఈ డ్రోన్స్ పనితనాన్ని విజయవంతంగా పరీక్షించిన పోలీసులు.. ఆందోళనకారులకు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రూ.6 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఐదు డ్రోన్స్‌ను తొందర్లోనే ప్రయోగిస్తామని చెబుతున్నారు. రిమోట్‌తో ఆపరేట్ చేసే ఈ డ్రోన్స్ ఉన్న చోటు నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో కంట్రోల్ చేయొచ్చని తెలిపారు.