ఇక ఆందోళనలు గగనమే.. | drones usage to controle hegitations | Sakshi
Sakshi News home page

ఇక ఆందోళనలు గగనమే..

Published Sun, May 10 2015 4:08 AM | Last Updated on Fri, May 25 2018 1:14 PM

ఇక ఆందోళనలు గగనమే.. - Sakshi

ఇక ఆందోళనలు గగనమే..

అల్లరి మూకలను కంట్రోల్ చేయడానికి లాఠీలు, బాష్పవాయు గోళాలు.. వాడే పోలీసులకు ఆ శ్రమ తప్పనుంది. చేతికి మట్టంటకుండా.. ఆందోళనకారుల కళ్లు మండించి.. కన్నీళ్లు పెట్టించడానికి.. పెప్పర్ స్ప్రే వెదజల్లే డ్రోన్స్ అందుబాటులోకి వచ్చేశాయి.

ఇటీవల లక్నోలో ఈ డ్రోన్స్ పనితనాన్ని విజయవంతంగా పరీక్షించిన పోలీసులు.. ఆందోళనకారులకు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రూ.6 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఐదు డ్రోన్స్‌ను తొందర్లోనే ప్రయోగిస్తామని చెబుతున్నారు. రిమోట్‌తో ఆపరేట్ చేసే ఈ డ్రోన్స్ ఉన్న చోటు నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో కంట్రోల్ చేయొచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement