hip surgery
-
కోవిడ్ రోగులకు కొత్త వ్యాధి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోవిడ్ నుంచి కోలుకున్నామని నిశ్చింతగా ఉండొద్దు, తుంటినొప్పులు తలెత్తుతుంటే అప్రమత్తం కావాలని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు, బర్డ్ (తిరుపతి) డైరెక్టర్ ఎం మదన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ పమ్మి కార్తిక్‌రెడ్డి సూచించారు. నేడు ‘జాతీయ బోన్, జాయింట్ డే’ సందర్భంగా చెన్నై అన్నానగర్‌లోని సన్వే మెడికల్ సెంటర్లో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ వాడిన వారికి బ్లాక్‌ఫంగస్ వచ్చినట్లు తుంటినొప్పులు కూడా సంక్రమిస్తున్నాయి. వైద్య పరిభాషలో ‘ఏవాస్కులర్ నెక్రోసిస్’ వ్యాధిబారిన పడుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో వచ్చే బ్లాక్ ఫంగస్‌ను సులభంగా గుర్తించవచ్చు. అయితే ఈ ‘ఏవాస్కులర్ నెక్రోసిస్’ మూడు లేదా నాలుగు నెలల తరువాత గానీ బయటపడదు. అందుకే సెకెండ్‌వేవ్‌లో పాజిటివ్ నుంచి కోలుకున్న వారు ఇప్పుడిప్పుడే ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. తుంటి (నడుముకు ఇరువైపులా) భాగంలో సన్నని నరాలకు రక్తం సరఫరా తగ్గి కుళ్లిపోయినట్లుగా మారుతుంది. ఇందులో నాలుగు దశలు ఉంటాయి. ఒకటి, రెండు స్టేజీల్లో వైద్యుని సంప్రదిస్తే లాప్రోస్కోపిక్ సర్జరీ విధానంలో చిన్నరంధ్రం వేసి పాడైపోయిన ప్రాంతాన్ని తొలగించవచ్చు. స్టెమ్‌సెల్ థెరపీతో పూర్తిగా నయం చేయవచ్చు. 3,4 దశలకు చేరుకుంటే తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయకతప్పదు. తుంటి నొప్పిని ఏదోలే అని నిర్లక్ష్యం చేస్తే కేవలం కొద్ది వ్యవధిలోనే నాల్గోదశకు చేరుకుంటుంది. చిన్న నొప్పిగా ప్రారంభమై నడవలేని స్థితికి చేరుకుంటారు. స్టెరాయిడ్స్ వాడకం వల్లనే తుంటి నొప్పి సమస్యలు సంక్రమిస్తాయి. స్టెరాయిడ్స్ వాడిన ప్రతి ఒక్కరోగికి తుంటి సమస్య వస్తుందనే నిర్థారణ లేదు. అయితే అధికశాతం బాధితులుగా మారుతున్నారు. శరీరంలో విటమిన్ డి శాతం లోపిస్తే బోన్, జాయింట్ సమస్యలు క్యూ కడతాయి. ప్రతినిథ్యం ఉదయం కొద్దిసేపు శరీరంపై వేసవి కిరణాలు పడేలా జాగ్రత్తలు తీసుకుంటే విటమిన్ డి పెరుగుతుందని వారు విశ్లేషించారు. -
హిప్ రీప్లేస్మెంట్ కోసమని వెళ్తే..
దుబాయ్ : హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ వికటించడంతో భారత మహిళ దుబాయ్ ఆస్పత్రిలో మృతిచెందింది. ముంబైకి చెందిన బెట్టి రీటా ఫెర్నాండెజ్(42) అనే మహిళ వృత్తిరీత్యా చెఫ్. ఆమె బెట్టీస్ కేన్ టేల్స్ అనే గ్రోసరీ స్టోర్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. రీటాకు పుట్టుకతోనే ఎడమ తుంటిలో లోపం ఉంది. దీంతో సర్జరీ కోసమని మే 9న దుబాయ్‌లోని ఆల్ జహ్రా ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో సర్జరీ వికటించడంతో బెట్టి రీటా మృతి చెందినట్లు గల్ఫ్‌న్యూస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దుబాయ్ హెల్త్ అథారిటీ విచారణ చేపట్టింది. కమిటీ వేసి రీటా మృతి వెనుక గల కారణాలు తెలుసుకుంటామని, ఆస్పత్రిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. -
హిప్ ప్రజర్వేషన్పై సర్జన్లకు అవగాహన సదస్సు
-
112 ఏళ్ల బామ్మ ప్రపంచ రికార్డు
లండన్: ఇంగ్లండ్‌కు చెందిన 112 ఏళ్ల బామ్మ గ్లాడ్సీ హూపర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమెకు ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రపంచంలో ఈ ఆపరేషన్ విజయవంతమైన అత్యధిక వయస్కురాలిగా గ్లాడ్సీ హూపర్ రికార్డులకెక్కారు. గ్లాడ్సీ హూపర్ జారిపడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. ఆమెకు చేసిన ఆపరేషన్ విజయవంతమైందని కొడుకు డెరెక్ హర్మిస్టన్ (84) చెప్పారు. ఆపరేషన్ చేశాక తన తల్లి బాగా కోలుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలో ఈ ఆపరేషన్ ను విజయవంతంగా చేయించుకున్న వృద్ధ మహిళ గ్లాడ్సీ హూపరేనని సర్జన్ జేసన్ మిల్లింగ్టన్ తెలిపారు. వందేళ్లు దాటిన మహిళకు ఆపరేషన్ చేయడమన్నది సాహసోపేత నిర్ణయమని, అయితే విజయవంతంగా ఆపరేషన్ చేశామని చెప్పారు. గతంలో జాన్ రాండల్ 102 ఏళ్ల వయసులో ఈ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇది విజయవంతం కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. తాజాగా గ్లాడ్సీ హూపర్ సరికొత్త రికార్డును సృష్టించారు.