జనవరి1ని సెలవుదినంగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆంధ్రలో టీడీపీ సర్కార్కు క్రైస్తవుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జనవరి 1వ తేదీని (నూతన సంవత్సరం రోజు) ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ అధ్యక్షుడు సి.ఎ.డానియేలు ఆడమ్స్ డిమాండ్ చేశారు.
ఇఫ్తార్ విందు మాదిరిగానే క్రైస్తవులకు క్రిస్మస్ విందు ఇవ్వాలని గతంలో సీఎంను కలసి కోరగా సానుకూలంగా స్పం దించి, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. క్రిస్మస్ ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు మంజూరు చేయాలని కోరారు.