Host Countries
-
2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా!
మనలో సైన్స్ తెలిసినోళ్లు జోతిష్యం గుడ్డిగా నమ్మరు. అది అలా చేస్తేనే జరుగుతుంది... ఇది ఇలా చేస్తేనే జరుగుతుంది అని కొంతమంది చేసే వితండవాదాన్ని సైన్స్‌ను నమ్మేటోళ్లు కొట్టిపారేయడం చూస్తుంటాం. కానీ కొన్ని విషయాలు మాత్రం మనల్ని నమ్మించేలా ఉంటాయి. క్రీడలు కూడా అందుకు అతీతం కాదని చెప్పొచ్చు. ఇలాంటివి ఫుట్‌బాల్‌లో చూశాం. గతంలో 2010 ఫిఫా వరల్డ్‌కప్ సమయంలో ఒక ఆక్టోపస్‌ను తీసుకొచ్చి ఏ జట్టు గెలుస్తుందో చెప్పమంటే అది స్పెయిన్ జెండాను ముట్టుకుంది. నిజంగానే ఆ ఏడాది స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది. అంతకముందు ఇటలీ 2006లో విశ్వవిజేతగా నిలిచింది. ఈ రెండు సందర్భాల్లో ఆక్టోపస్ జోస్యం నిజం కావడంతో దానిని అదృష్ట దేవతగా పిలవడం మొదలెట్టారు. తాజాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విషయంలోనూ ఒక విషయం టీమిండియాదే ఈసారి వరల్డ్‌కప్ అని జోస్యం చెబుతుంది. అదేంటంటే 2011 నుంచి చూసుకుంటే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశాలే విజేతగా నిలుస్తూ వస్తున్నాయి. 2011లో టీమిండియా రెండోసారి విజేతగా అవతరిస్తే.. 2015లో మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఆస్ట్రేలియా ఐదోసారి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. ఇక 2019లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను బౌండరీ కౌంట్ తేడాతో ఓడించి ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ లెక్కన 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న భారత్ ఈసారి వరల్డ్‌కప్‌ను కొల్లగొట్టబోతుందని కొంతమంది అభిమానులు జోస్యం చెబుతున్నారు. ఒకవేళ ఇది నిజమయితే మాత్రం టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్‌కప్ కొట్టడం ఖాయం. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. టీమిండియా ఫెవరెట్‌గా ఉన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఏ దేశమైనా చెలరేగి ఆడడం వారి నైజం. అందునా ఆస్ట్రేలియా జట్లు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇటీవలే డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ గెలిచి ఉత్సాహంతో ఉన్న ఆసీస్ భారత్ గడ్డపై వన్డే వరల్డ్‌కప్ గెలవాలన్న కసితో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా డిపెండింగ్ చాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలనే దృడ సంకల్పంతో ఉంది. అటు వరుసగా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ మాత్రం ఈసారి కప్ కొట్టాలనే సంకల్పంతో బరిలోకి దిగుతుంది. ఇక రోహిత్ సారధ్యంలోని టీమిండియా పేపర్‌పై బలంగా కనిపిస్తోంది. కోహ్లి సహా మిగతా ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తే టీమిండియాకు విజేతగా నిలవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఎంతవరకు నిలకడ ఉందనేది క్లారిటీ లేదు. అయినా సరే మెగా టోర్నీకి మనం ఆతిథ్యం ఇస్తున్నాం కాబట్టి టీమిండియా మూడో వరల్డ్‌కప్ గెలవాలని కోరుకుందాం. చదవండి: టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ -
ఆతిథ్య జట్టు అజేయంగా.. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కలిసొస్తున్న తొలి మ్యాచ్
తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో 2006 నుంచి తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం ఉండేలా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య షెడ్యూల్ రూపొందిస్తోంది. గత నాలుగు ప్రపంచకప్‌లలోనే కాకుండా అంతకుముందు జరిగిన ప్రపంచ కప్‌లలోనూ ఆతిథ్య దేశం తాము ఆడిన తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ప్రత్యర్థి ఎంతటి జట్టయినా ఆతిథ్య జట్టు గెలవడం లేదంటే ‘డ్రా’ చేయడం జరిగింది. గతంలో వరుసగా 11 సార్లు ఆసియా క్వాలిఫయింగ్ దశలోనే నిష్క్రమించిన ఖతర్ జట్టు ఆతిథ్య దేశం హోదాలో తొలిసారి ప్రపంచకప్ టోర్నమెంట్లో బరిలోకి దిగుతోంది. 12 ఏళ్ల క్రితం ఆతిథ్య హక్కులు పొందిన వెంటనే ఖతర్ జట్టు సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి ప్రధాన టోర్నీలో నేరుగా ఆడే అవకాశం రావడంతో మంచి ప్రదర్శనతో ఆకట్టుకోవాలని పట్టుదలతో ఉంది. ఈనెల 20న జరిగే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఈక్వెడార్‌తో ఖతర్ ఆడుతుంది. ఇప్పటివరకు ఆతిథ్య జట్లకు తాము ఆడిన తొలి మ్యాచ్‌లలో అనుకూల ఫలితాలే వచ్చాయి. ఈ సంప్రదాయాన్ని ఖతర్ కూడా కొనసాగిస్తూ విజయంతో బోణీ కొడుతుందో, లేదంటే ‘డ్రా’తో పాయింట్ల ఖాతా తెరుస్తుందో వేచి చూడాలి. 2018 ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశం రష్యా తొలి మ్యాచ్‌లో 5–0తో సౌదీ అరేబియాను ఓడించగా... 2014 మెగా ఈవెంట్లో బ్రెజిల్ 3–1తో క్రొయేషియాపై గెలిచింది. 2010 టోర్నీలో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌ను మెక్సికోతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2006లో జర్మనీ 4–2తో కోస్టారికాను ఓడించి శుభారంభం చేసింది. 2002లో దక్షిణ కొరియా–జపాన్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా... తమ తొలి మ్యాచ్‌ల్లో కొరియా 2–0తో పోలాండ్‌పై గెలుపొందగా... బెల్జియంతో జరిగిన మ్యాచ్‌ను జపాన్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. 1998లో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో 3–0తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 1994లో ఆతిథ్య అమెరికా దేశం తొలి మ్యాచ్‌ను స్విట్జర్లాండ్‌తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 1990లో ఇటలీ జట్టు తొలి మ్యాచ్‌లో 1–0తో ఆస్ట్రియాను ఓడించింది. 1986లో మెక్సికో జట్టు 2–1తో బెల్జియంపై గెలిచింది. 1982లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను హోండూరస్తో 1–1తో ‘డ్రా’గా ముగించింది. 1978లో ఆతిథ్య అర్జెంటీనా జట్టు 2–1తో హంగేరిపై గెలిచింది. 1974లో పశ్చిమ జర్మనీ 1–0తో చిలీపై నెగ్గగా, 1970లో మెక్సికో 0–0తో సోవియట్ యూనియన్‌తో... 1966లో ఇంగ్లండ్ 0–0తో ఉరుగ్వేతో ‘డ్రా’ చేసుకుంది. 1962లో చిలీ 3–1తో స్విట్జర్లాండ్‌పై... 1958లో స్వీడన్ 3–0తో మెక్సికోపై.. 1954లో స్విట్జర్లాండ్ 2–1తో ఇటలీపై... 1950లో బ్రెజిల్ 4–0తో మెక్సికోపై.. 1938లో ఫ్రాన్స్ 3–1తో బెల్జియంపై... 1934లో ఇటలీ 7–1తో అమెరికాపై... 1930లో ఉరుగ్వే 3–1తో పెరూపై విజయం సాధించాయి. –సాక్షి క్రీడావిభాగం -
మోదీకి రూ.3 లక్షల బహుమతులు
ఆర్టీఐ దరఖాస్తుకు విదేశాంగ శాఖ సమాధానం న్యూఢిల్లీ: అధికారం చేపట్టాక త పది నెలల్లో జరిపిన విదేశీ పర్యటనల్లో ప్రధాని నరేంద్రమోదీ ఆతిథ్య దేశాలనుంచి రూ. 3.11 లక్షల విలువైన 65 బహుమతులను స్వీకరించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 19న జరిపిన పర్యటనలో ఆతిథ్య దేశంనుంచి రూ.75 వేల విలువగల బంగారం, వజ్రాలు పొదిగిన కఫ్లింక్స్ను బహుమతిగా స్వీకరించారు. ఇవికాక ప్రధాని స్వీకరించిన బహుమతుల్లో పింగాణీ పాత్రలు, పెయింటింగ్స్ తదితరాలు ఉన్నాయి. ప్రధాని కూడా తన పర్యటనల్లో బుద్ధ విగ్రహంతోపాటు టీ కప్ సెట్, పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2010 -2013 మధ్య జరిపిన విదేశీ పర్యటనల్లో రూ. 83.72 లక్షల విలువైన కానుకలు స్వీకరించారు. 2010 నుంచి జూన్ 2013 వరకూ రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు స్వీకరించిన బహుమతుల వివరాలనూ విదేశాంగశాఖ తెలియపరిచింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 2010 నుంచి జూన్ 2013 మధ్య జరిపిన విదేశీ పర్యటనల్లో రూ. 2 లక్షల విలువైన బ్రేస్‌లెట్‌తో సహా రూ. 3.84 లక్షల విలువైన బహుమతులను స్వీకరించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రూ.4.83 లక్షల విలువైన బహుమతులు అందుకున్నారు.