HUL up
-
సెన్సెక్స్ 199 పాయింట్లు అప్
ఆరంభ లాభాలు ఆవిరైనా, శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో విదేశీ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టటంతో ఆ షేర్ 3 శాతం మేర లాభపడటం, మరో దిగ్గజ కంపెనీ హెచ్‌యూఎల్ 5 శాతం పెరగడం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి దశ చర్చలు చోటు చేసుకోవడంతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, వివిధ దేశాలు దశలవారీగా లాక్‌డౌన్‌ను తొలగిస్తుండటం....సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 646 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరకు 199 పాయింట్ల లాభంతో 31,643 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 9,252 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2,075 పాయింట్లు, నిఫ్టీ 608 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ సూచీలు చెరో 6 శాతం మేర పతనమయ్యాయి. రోజంతా లాభాలు..... ఆసియా మార్కెట్ల దన్నుతో మన మార్కెట్ భారీ లాభాల్లో ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. అయితే చివర్లో లోహ, ఆర్థిక రంగ, వాహన షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. దీంతో ఆరంభ లాభాలు తగ్గాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% లాభాల్లో ముగిశాయి. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 4 శాతం లాభంతో రూ.1,562 వద్ద ముగిసింది. ఈ కంపెనీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ 2.3 శాతం వాటాను రూ.11,367 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ,.9,90,088 కోట్లకు పెరిగింది. ఈ షేర్ మరో రూ.15 మేర పెరిగితే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు ఎగబాకుతుంది. ► హిందుస్తాన్ యూనిలివర్(హెచ్‌యూఎల్) షేర్ 5 శాతం లాభంతో రూ.2,088 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సొసైటీ జనరల్ సంస్థ 1.3 కోట్ల షేర్లను రూ.1,902 ధరకు కొనుగోలు చేయడంతో ఈ షేర్ ఈ స్థాయిలో పెరిగింది. ► దాదాపు 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్సూమర్, సుజ్లాన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 90 కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, డీబీ కార్ప్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా పవర్ తదితర షేర్లు ఈ పడిపోయిన జాబితాలో ఉన్నాయి. -
నష్టాల్లో బెంచ్ మార్కు సూచీలు
స్వల్పలాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ముగింపులో కిందకి పడిపోయాయి. నిఫ్టీ 8400 కిందకి పడిపోయి, 8398 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ సైతం 52.51 పాయింట్లు దిగజారి 27235.66 వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, ఏషియన్, హీరో మోటార్ కార్పొ, హెచ్‌యూఎల్ నేటి మార్కెట్లో లాభాలు పండించగా.. రిలయన్స్ కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ నష్టాలు గడించాయి. ఆయిల్, మెటల్స్, ఎంపికచేసిన బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్‌లో నష్టాలు కొనసాగడంతో మధ్యాహ్నం ట్రేడింగ్‌లో బెంచ్‌మార్కు సూచీలు పడిపోయాయి. ఆయిల్, టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో దాదాపు 3 శాతం పడిపోయాయి. కార్పొరేట్ కంపెనీల ఫలితాలు, ప్రభుత్వ బడ్జెట్‌పై ఎక్కువగా దృష్టిసారిస్తున్న పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్ బ్యాంకు ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు కొరత ఏర్పడటంతో ఆర్థికవ్యవస్థకు సపోర్టుగా బడ్జెట్ వస్తుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. 2017-18 బడ్జెట్ ఫిబ్రవరి 1న విడుదల కానుంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.08 పైసలు బలపడి 68.01 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు 219 రూపాయలు లాభపడి 28,748గా నమోదయ్యాయి. -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : విదేశీ ఫండ్ల కొనుగోలు జోరుతో సోమవారం ట్రేడింగ్ లో భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు, నేటి(మంగళవారం) ట్రేడింగ్ లో వెనక్కి జంకాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ నష్టాలను నమోదుచేస్తున్నాయి. సెన్సెక్స్ 22.85 పాయింట్ల నష్టంతో, 25,666.01 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 13.40 పాయింట్లు పడిపోతూ 7,852.65 వద్ద ట్రేడ్ అవుతోంది. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, పవర్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, దేశీయ సూచీలు నష్టాలను నమోదు చేస్తున్నాయి. హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో నికరలాభాలు పెరగడంతో, దాన్ని షేర్లు 1శాతం మేర పెరిగాయి. అదేవిధంగా అదానీ పోర్ట్స్, డాక్టర్. రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, మారుతీ, యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ లు లాభాల్లో నడుస్తుండగా.. వేదాంత, హిందాల్కో, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీలు నష్టాలను నమోదుచేస్తున్నాయి. మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా నష్టాలోనే నడుస్తున్నాయి. బంగారం రూ.24 నష్టంతో రూ.29,781గా నమోదవుతుండగా... వెండి రూ.94 నష్టంతో రూ.40,655 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.7 గా ఉంది.