‘హలో’ అని మాటలు చెబుతున్న వేల్..!
పారిస్, ఫ్రాన్స్ : నీటిలో నుంచి ‘హలో’ అనే పెద్ద శబ్దం వినిపిస్తోంది. ఆ పిలుపు మనిషిది కాదు. ఓ వేల్ది. అవును. మీరు చదివింది నిజమే. ఓ కిల్లర్ వేల్ మనిషి చెప్పిన పదాలను తిరిగి రిపీట్ చేస్తోంది. అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఆర్కా వేల్కు మనిషి చెప్పిన దాన్ని రిపీట్ చేయడం నేర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది.
దక్షిణ ఫ్రాన్స్‌లోని మెరైన్లాండ్ అక్వేరియమ్‌లో వేల్స్‌పై పరిశోధనలు చేసిన బృందం అవి ట్రైనర్‌ను ఇమిటేట్ చేయగలవని గ్రహించింది. అక్వేరియమ్‌లో ఉంటున్న వికీ(ఆడ ఆర్కా వేల్ పేరు)తో మాట్లాడించాలని నిర్ణయించుకుంది. వికీకి ట్రైనింగ్ ఇవ్వడంతో ఇప్పటివరకూ ’హలో’, ‘బైబై’, ‘వన్, టూ’, ‘అమీ’ అనే పదాలను మాట్లాడింది. ఓ వేల్ మనుషుల భాష మాట్లాడటం ప్రపంచంలో ఇదే తొలిసారని పరిశోధకులు పేర్కొన్నారు.