indianapalis
-
ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో
న్యూయార్క్: రోడ్డుపై పలు యాక్సిడెంట్ ఘటనలు చూసినప్పటికీ ఇంకా అలాంటి భయంకరమైన ఘటనలు పునరావృతమౌతునే ఉన్నాయి. అంతేకాదు వేగం తగ్గించమని ఎంతలా ట్రాఫిక్ యంత్రాంగం మొత్తుకున్న ప్రజల్లో సరైన మార్పు రాకపోవడం బాధకరం. కానీ యూఎస్‌లోని ఇండియానాలో జరిగిన అతి పెద్ద యాక్సిడెంట్ చూస్తే ఎవరికైనా భయం వేయాల్సిందే. (చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. వైద్య చరిత్రలో గుర్తిండిపోయే పనిచేశాడు.. హైస్కూల్ చదువుతోనే..!!) అసలు విషయంలోకెళ్లితే...ఇండియానాలోని ఇండియానాపోలిస్‌లో కనీసం మూడు స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ ఢీ కొన్నాయి. అయితే మొదట రోడ్డు ఖాళీగా ఉందని రెడ్ సిగ్నల్ పడినప్పటికీ ఒక ఎస్యూవీ కారు వేగంగా వచ్చేస్తుంది. అంతే మరో ఎస్యూవీ కారు దాన్ని గట్టిగా ఢీ కొడుతుంది. దీంతో అది గాల్లోకి లేచి రహదారికి మరోవైపు పడుతుంది. వెంటనే అటువైపేగా వస్తున్న ఎస్యూవీ కారు పై పడి అక్కడ ఉన్న ఆరు కారులను ఢీ కొడుతుంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదుగానీ, మొత్తం ఆరు కారులు దెబ్బతిన్నాయి. అంతేకాదు ఈ ఘటన జరిగినప్పుడు ఒక పాదచారి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అయితే అదృష్టమేమిటంటే అతనికి ఏం కాలేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?) -
రైలు ప్రమాదం ఇలా జరిగింది...
ఇండియానాపాలిస్: మిత్రుడి పుట్టినరోజునాడు మిత్రులంతా కలసి పార్టీ చేసుకునేందుకు అతి విలాసవంతమైన ‘లిమౌజిన్’ కారులో బయల్దేరారు. సరిగ్గా కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలపైకి కారు ఎక్కగానే ముందు చక్రాలు, వెనక చక్రాలు ఒక్కసారిగా గాలిలోకి లేచాయి. అంతే పట్టాలపైన కారు ఆగిపోయింది. అదే సమయంలో అటువైపుగా వేగంగా గూడ్సు రైలు దూసుకరావడాన్ని వ్యాన్లోవున్న మిత్రులు గమనించారు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి వారంతా దిగిపోయారు. రైలు ఆపాలంటూ గోల చేశారు. కారును ఎలాగైనా రక్షించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమైన డ్రైవర్ కూడా చివరి నిమిషంలో కారు నుంచి దూకేశారు. క్రమంగా వేగం తగ్గుతూ వచ్చిన రైలు కారును ఢీకొని, దాన్ని వంద అడుగుల దూరం వరకు లాక్కెళ్లింది. అదే కారులో అనుకోకుండా ప్రయాణిస్తున్న స్థానిక ఫొటోగ్రాఫర్ నార్మన్ నోయి రైలుకు ఎదురుగా వెళ్లి రైలుతోపాటు పరుగెత్తుకొస్తూ యాక్సిడెంట్ సీన్‌ను తన వీడియోలో బంధించారు. ఏమయ్యా! అంతగోల చేస్తుంటే రైలును ఎందుకాపలేదని రైలు డ్రైవర్‌ను ప్రశ్నిస్తే....‘బ్రేక్ వేయగానే ఆగడానికి ఇదేమన్నా కారా? పదివేల టన్నుల బరువును మోసుకొస్తున్నా, అంత బరువును ఆపడం ఎలా సాధ్యం’ ఆ డ్రైవర్ సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో పోస్టు చేసిన ఫొటోగ్రాఫర్ నార్మన్ నోయి ప్రమాదానికి సంబంధించి ఇంతకన్నా వివరాలు వెల్లడించలేదు. ఇండియానా పాలిస్ లో ఇటీవల ఈ ప్రమాదం జరిగింది.