inter crops
-
దొండతో దండిగా ఆదాయం!
ప్రణాళికాబద్ధంగా కష్టపడితే వ్యవసాయం సహా ఏ రంగంలోనైనా రాణించొచ్చు అంటున్నారు ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన యంజి బీఈడి కళాశాల కరస్పాండెంట్ గఫార్ అలిఖాన్ బీఈడీ కళాశాల పనులపై ఇతర ప్రాంతాలు వెళ్లి వచ్చే క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్న పొలాలు కంటపడ్డాయి. ఆ పంటలను చూసిన తర్వాత వ్యవసాయంపై మక్కువ కలిగింది. అక్కడి రైతులతో మాట్లాడి వ్యవసాయం లాభదాయకంగా ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. కందులాపురం వద్ద తనకున్న 2.2 ఎకరాల భూమిలో రెండేళ్ళ క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో 12 రకాల అంతర పంటలు సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు గఫార్.బత్తాయి తోట కాపునకు వచ్చే సరికి నాలుగేళ్ళ కాలం పడుతుంది. ఈలోగా అంతర పంటలు వేసుకొని సాగు లాభదాయకమని ప్రధాన అంతర పంటగా టొమాటోను ఫెన్సింగ్ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు. బత్తాయి తోట చుట్టూ సుమారు 20 సెంట్లలో పందిళ్లు వేసి దొండ మొక్కలు నాటారు. 4 నెలలకే పంట చేతికి వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ దొండ రూ. 50 వరకు పలుకుతున్నది. ఇప్పటికే రూ. లక్షన్నరకు పైగా లాభం వచ్చిందని గఫార్ వివరించారు. దొండ పందిళ్ల కింద క్యాబేజీ, బీట్రూట్ సాగు చేస్తున్నారు. పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్‌కు సైతం సొరకాయ చెట్లను పాకించారు. సొర తీగలు కాయలనివ్వటంతో పాటు చీడపీడలను అడ్డుకునే జీవకంచెగా ఉపయోగ పడుతున్నాయన్నారు. కొత్తిమీర, కాకర, మెంతి, కాకర, మిరప, మునగ, కాళీఫ్లవర్, బీర ఇంకా తదితర అంతర పంటలు సాగు చేస్తున్నారు. రెండు ఎకరాల్లో 15 ట్రాక్టర్ల మాగిన పశువుల ఎరువుతో పాటు వర్మీ కం΄ోస్టు, జీవామృతం, వేప పిండి, కానుగ పిండి, ఆముదం పిండి, జీవన ఎరువులను వినియోగిస్తున్నారు. బత్తాయిలో సాగు చేసే అంతర పంటలకు పెట్టుబడి తక్కువగానే ఉంటుంది. పందిళ్లు వేసి విత్తనాలు నాటితే చాలు దిగుబడినిస్తాయి. దొండలో వచ్చిన ఆదాయం బత్తాయితో పాటు ఇతర అన్ని పంటల పెట్టుబడికి సరి΄ోతుందని గఫార్ స్వీయానుభవంగా చెబుతున్నారు. బీర, సొరకాయ, క్యాబేజీ, ఇతర కూరగాయల సాగు కూడా మంచి లాభదాయకమేనన్నారు. తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలతో మేలు: రెండెకరాల లేత బత్తాయి తోటలో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నాను. భూమిని ఖాళీగా వదలకుండా అంతర పంటలు వేశాం. తోటల్లో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయని నా అనుభవంలో తెలుసుకున్నాను. అంతర పంటలకు పెట్టుబడి తక్కువే. శ్రమ అధికంగా ఉంటుంది. అందుకని రైతులు తక్కువ విస్తీర్ణంలో అంతర పంటలు వేసుకోవటం లాభదాయకం. – గఫార్ అలీఖాన్, కంభం – ఖాదర్ బాష, సాక్షి, కంభం -
‘కొబ్బరి’లో ‘సుగంధా’ల గుబాళింపు!.. అంతర పంటలతో లాభాలు
ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా.. అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటవుతుంది. కొబ్బరి రైతుల ΄ాలిట అంతరపంటల సేద్యం కల్పతరువుగా మారింది. దక్షిణ కోస్తా ఆంధ్రా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా పాత ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం సుగంధ ద్రవ్య పంటల (స్పైసెస్)కు ఎంతో అనువైనది. ముదురు కొబ్బరి తోటల్లో అనేక సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ, నేరుగా మార్కెటింగ్ చేసుకుంటున్న రైతుల విజయగాథలెన్నో. విశేష ప్రగతి సాధిస్తున్న అటువంటి ఇద్దరు ప్రకృతి వ్యవసాయదారులు ఉప్పలపాటి చక్రపాణి, సుసంపన్న అనుభవాలను తెలుసుకుందాం.. గత ఐదారేళ్లుగా కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తూ.. వీటి ద్వారా ప్రధాన పంటకు తగ్గకుండా అదనపు ఆదాయం పొందవచ్చని రైతు శాస్త్రవేత్త ఉప్పలపాటి చక్రపాణి రుజువు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్క్ష్మీపురం గ్రామానికి చెందిన చక్రపాణి గత 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కొబ్బరి తోటలో వక్క, మిరియాలు, పసుపు అల్లం పండిస్తూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. కొబ్బరి తోటలో ఆరేళ్ల క్రితం నాటిన 2,500 వక్క చెట్లు చక్కని ఫలసాయాన్నిస్తున్నాయి. ఈ ఏడాది 700 వక్క చెట్లకు కాపు వచ్చింది. 2 టన్నుల ఎండు వక్కకాయల దిగుబడి ద్వారా రూ. 3 లక్షల 80 వేలు ఆదాయం వచ్చిందని చక్రపాణి వివరించారు. 300 కొబ్బరి చెట్లకు ఐదారేళ్ల క్రితం మిరియాల తీగలను పాకించారు. వీటిద్వారా 500 కిలోల ఎండు మిరియాల దిగుబడి వచ్చింది. కేజీ రూ.600 చొప్పున రిటైల్‌గా అమ్ముతున్నారు. గానుగ నూనెతో ఆరోగ్యం కొబ్బరి చెట్ల మధ్య వక్క చెట్లు పెంచి.. కొబ్బరి చెట్లకు అనేక ఏళ్ల క్రితమే మిరియం మొక్కల్ని పాకించడంతో చక్రపాణి కొబ్బరి తోట వర్టికల్ గ్రీన్ హెవెన్‌గా మారిపోయింది. కొబ్బరి చెట్లకు మిరియం మొక్కలు చుట్టుకొని ఉంటాయి కాబట్టి, మనుషులను ఎక్కించి కొబ్బరి కాయలు దింపే పద్ధతికి స్వస్తి చెప్పారు. కాయల్లో నీరు ఇంకిన తర్వాత వాటికవే రాలుతున్నాయి. రాలిన కాయలను అమ్మకుండా.. సోలార్ డ్రయ్యర్లో పూర్తిగా ఎండబెట్టి కురిడీలు తీస్తున్నారు. కురిడీలతో గానుగల ద్వారా సేంద్రియ కొబ్బరి నూనె తీసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా తాము ఇంట్లో వంటలకు తమ సేంద్రియ కొబ్బరి నూనెనే వాడుతున్నామని, చాలా ఆరోగ్య సమస్యలు తీరటం గమనించామని చక్రపాణి సంతోషంగా చెప్పారు. పసుపు ఫ్లేక్స్ కొబ్బరి తోటలో వక్క, మిరియాలతో పాటు రెండేళ్లుగా అటవీ రకం పసుపును కూడా సాగు చేస్తున్నారు చక్రపాణి. ఈ రకం పసుపు వాసన, రంగు చాలా బాగుంది. పచ్చి పసుపు కొమ్ములను పల్చటి ముక్కలు చేసి, సోలార్ డ్రయ్యర్ లో ఎండబెట్టి, ఆ ఫ్లేక్స్‌ను అమ్ముతున్నారు. వాటి వాసన, రంగు, రుచి అద్భుతంగా ఉన్నాయని వాడిన వారు చెబుతున్నారన్నారు. సిలోన్ దాల్చిన చెక్క బెటర్ కొబ్బరిలో వక్క వేయడంతో పైకి తోట వత్తుగా కనిపించినా నేలపైన అక్కడక్కడా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీల్లో గత ఏడాది నుంచి అటవీ పసుపుతో పాటు అల్లం, సిలోన్ దాల్చిన చెక్క, నట్మగ్లను సాగు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. సాధారణంగా మనం ఇళ్లలో వాడే దాల్చిన చెక్క విదేశాల నుంచి దిగుమతయ్యే సాధారణ రకం. సిలోన్ దాల్చిన చక్క రకం దీనికన్నా మెరుగైనది. ఇది పల్చగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కోస్తా ఆంధ్రలో బాగా పండుతోందని చక్రపాణి వివ రించారు. కొబ్బరి, ΄ామాయిల్ తోటల్లో అంతర పంటల సాగు ద్వారా అధికాదాయం పొందేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పెదవేగి మండల ఉద్యాన అధికారి ఎం. రత్నమాల తెలి΄ారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. – కొత్తపల్లి వినోద్‌కుమార్, సాక్షి, పెదవేగి, ఏలూరు జిల్లా కేరళ మాదిరిగా ఇక్కడా పండిస్తున్నా! రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోనే పంటలు పండించటం నేర్చుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో అప్లాండ్ ఏరియాలో ఉద్యాన తోటలకు అనువైన వాతావరణం ఉంది. ఇవి సారవంతమైన భూములు. ఇక్కడి నీరు కూడా మంచిది. నాలుగైదేళ్లుగా భూగర్భజలాలు పెరగడంతో నీటి సమస్య లేదు. కొబ్బరిలో అంతర పంటలకు అనుకూలంగా ఉండేలా ముందే తగినంత దూరంలో మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు. అంతర పంటలద్వారా సూక్ష్మ వాతావరణం సృష్టించుకొని కేరళలో మాదిరిగా సుగంధ ద్రవ్య పంటలు సాగు చేసుకోవచ్చు. కేరళలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మన దగ్గర 45 డిగ్రీల వరకు వస్తుంది. కొబ్బరిలో అంతర పంటల వల్ల బయటతో పోల్చితే పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎండ, గాలిలో తేమ సమపాళ్లలో చెట్లకు అందుతున్నందున కేరళలో మాదిరిగా మిరియాలు, దాల్చిన చెక్క ఇక్కడ మా తోటలోనూ పండుతున్నాయి. – ఉప్పలపాటి చక్రపాణి (94401 88336), లక్ష్మీపురం, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా -
పంటల్లో పంట పండుతోంది
పెరవలి(తూ.గో.జిల్లా): కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఈ అభ్యుదయ రైతులకు అక్షరాలా సరిపోతుంది. పుడమి తల్లిని నమ్ముకుని సాగు చేయటమే ఈ రైతులకు నిన్నటి వరకూ తెలుసు. కానీ నేడు రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫిదా అయిన వీరు అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు సాధిస్తూ నాలుగు కాసులు వెనకేసుకుంటున్నారు. అంతర పంటలు సాగు చేయాలంటే పెరవలి రైతులే చేయాలనే రీతిలో ముందుకు “సాగు’తున్నారు. ఏ పంట వేస్తే లాభాలు ఆర్జించవచ్చో, ఎప్పుడు వేస్తే మంచి దిగుబడి పొందవచ్చో ఇక్కడి రైతులు బాగా ఒంట పట్టించుకున్నారు. వాణిజ్య పంటల దిగుబడి అందే సమయంలో మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వంటి వాటితో తీవ్రంగా నష్టపోతున్న రైతులను అంతర పంటలు ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. జిల్లాలో 5 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగు చేస్తుండగా.. ఒక్క పెరవలి మండలంలోనే సుమారు 1,500 ఎకరాల్లో ఈ సాగు జరుగుతోంది. అంతర పంటలు వేసే వారిలో ఎక్కువగా కౌలు రైతులే ఉండటం విశేషం. రైతులతో పాటు కూలీలు, వాహనదారులు, సంచుల వ్యాపారులు కలిపి సుమారు 60 వేల మంది అంతర పంటల ద్వారా జీవనం సాగిస్తున్నారు. పండించుకుంటున్నారిలా.. ► మెట్ట ప్రాంతంలోని కొబ్బరిలో అరటి, కూరగాయలు, పూలు సాగు చేస్తుంటే, డెల్టాలో పూలు, అరటి, కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ► గతంలో వాణిజ్య పంటలైన కొబ్బరిలో అరటి, కోకో వేస్తే ఇప్పుడు కోకోతో పాటు పూలు, వరి, కొత్తిమీర, బీర, అరటి వంటివి సాగు చేస్తున్నారు. ► అరటిలో గతంలో ఆకుకూరలు సాగుచేస్తే ఇప్పుడు పిలక నాటిన నుంచి ఏదో ఒక పంట వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బంతి, ఆకుకూరలు, పచ్చిమిర్చి, కూరగాయలు సాగు చేస్తున్నారు. ► బొప్పాయిలో పూలసాగు, కొబ్బరిలో కంది, జామలో బొప్పాయి వంటి పంటలు వేస్తూ మంచి ఫలసాయం పొందుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. ► అరటి పంట 9 నెలలకు కానీ చేతికి రాదు. ఇతర వాణిజ్య పంటల ద్వారా 11 నెలలకు కానీ ఆదాయం రాదు. అప్పటి వరకూ పెట్టుబడి పెట్టాల్సిందే. ఇదే సమయంలో స్వల్పకాలిక అంతర పంటల ద్వారా రైతులు 40 నుంచి 90 రోజుల్లోనే ఫలసాయం పొందుతున్నారు. ► వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా, ఈ పంటలకు స్వల్పంగా అంటే రూ.వందల్లో పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తోంది. దీనిని వాణిజ్య పంటలకు వినియోగించడంతో ఆర్థిక భారాన్ని రైతులు తగ్గించుకుంటున్నారు. ► అంతర పంటల్లో కలుపు అంతంత మాత్రంగానే ఉండటం రైతులకు కలిసివస్తోంది. -
ఎత్తు మడులపై పత్తి అంతరపంటగా కంది!
పత్తి సాగులో సమస్యలను అధిగమించడానికి బెడ్స్ (ఎత్తు మడులు) పద్ధతిని అనుసరించడం మేలని నిపుణులు చెబుతున్నారు. ట్రాక్టర్‌తో బెడ్స్ ఏర్పాటు చేసుకొని ఒక సాలు పత్తి, పక్కనే మరో సాలు కందిని మనుషులతో విత్తుకోవటం మేలని సూచిస్తున్నారు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా.. కండగల నల్లరేగడి నేలలైనా, తేలికపాటి ఎర్రనేలలైనా.. బెడ్స్‌పై పత్తిలో కందిని అంతర పంటగా విత్తుకోవటం రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగకరమని చెబుతున్నారు. పత్తి పంటను ఎత్తుమడుల (బెడ్స్)పై విత్తుకోవటమే మేలని, అందులో కందిని అంతర పంటగా 1:1 నిష్పత్తిలో వేకోవటం వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాత్మక సాగులో తొలి అనుభవాలు తెలియజేస్తున్నాయి. బెడ్స్‌పై పత్తి, కంది మిశ్రమ సాగుపై రెండేళ్లుగా అనేక విధాలుగా ప్రయోగాలు చేస్తున్న డా. ప్రవీణ్ మూడేళ్ల తర్వాత పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని అన్నారు. అయితే, ఇప్పటికి గ్రహించిన దాన్ని బట్టి పత్తిలో కంది పంటను బెడ్స్‌పై 1:1 నిష్పత్తిలో విత్తుకోవటం మేలని భావిస్తున్నారు. కందిని 1:1 నిష్పత్తిలోనే విత్తుకోవాలనేం లేదని, 4:1 నిష్పత్తిలో (4 సాళ్లు పత్తి, 1 సాలు కంది) కూడా విత్తుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. కండగల నల్లరేగడి నేలల్లో అయినా, తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా బెడ్స్ పద్ధతిలో పత్తిలో కందిని అంతరపంటగా విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. గత ఏడాది నల్ల రేగడి నేలలో బెడ్స్‌పై పత్తిలో కంది పంటను 1:1 నిష్పత్తిలో విత్తి మంచి ఫలితాలు సాధించారు. బెడ్ వెడల్పు అడుగు. రెండు బెడ్స్ మధ్య దూరం 5 అడుగులు. ట్రాక్టర్ సహాయంతో బెడ్స్ ఏర్పాటు చేయించారు. మొక్కల మధ్య అడుగు దూరం పాటించారు. మనుషులతో బెడ్స్‌పై విత్తనం నాటించారు. గత ఏడాది సాధారణం కన్నా అధిక వర్షాలు కురిసినప్పటికీ.. బెడ్స్ పద్ధతి వల్ల పొలంలో నీరు నిలబడలేదు. దీని వల్ల పంట పెరుగుదలకు ఎటువంటి ఆటంకం కలగలేదు. బెడ్స్‌పై సాగు వల్ల ఉపయోగాలేమిటి? బెడ్స్ మీద విత్తిన విత్తనం సాధారణ పొలంలో కన్నా ఒకటి, రెండు రోజులు ముందే మొలిచింది. అంతేకాదు, 90% వరకు మొలక వచ్చింది. వర్షపు నీరు ఒక్క రోజు కూడా పొలంలో నిలవకుండా కాలువల ద్వారా బయటకు వెళ్లిపోయింది. దీని వల్ల తొలి దశలో మొక్క పెరుగుదల ఒక్క రోజు కూడా కుంటుపడలేదు. బెడ్స్ లేకపోతే ఎక్కువ వర్షం పడినప్పుడు ఉరకెత్తే సమస్య ముఖ్యంగా నల్లరేగడి పొలాల్లో సాధారణం. బెడ్స్ వల్ల ఈ సమస్య లేకుండా పోయింది. అంతేకాదు, కాయకుళ్లు సమస్య కూడా తీరిపోయిందని డా. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బెడ్స్ లేకుండా సాగు చేసే పొలాల్లో పత్తి మొక్కలకు కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5–10 కాయలు కుళ్లిపోతూ ఉంటాయి. బెడ్స్ మీద వేయటం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి, తేమ తగుమాత్రంగా ఉండటం వల్ల కాయ కుళ్లు లేదన్నారు. పత్తి, కంది.. 11 క్వింటాళ్ల దిగుబడి బెడ్స్ పద్ధతిలో విత్తిన పొలాల్లో కూడా గులాబీ రంగు పురుగు ఉధృతి మామూలుగానే ఉంది. గులాబీ పురుగు ఉధృతి ఎక్కువయ్యే కాలానికి, అంటే నవంబర్ ఆఖరు నాటికే పత్తి మొక్కలను తీసేశాం. అయినా ఎకరానికి 5.5 క్వింటాళ్ల మేరకు పత్తి దిగుబడి వచ్చిందని డా. ప్రవీణ్‌కుమార్ అన్నారు. గులాబీ పురుగును సమర్థవంతంగా అదుపు చేయగలిగితే మరో 3–4 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదన్నారు. నవంబర్ ఆఖరులో పత్తి తీసేసినా.. కంది పంట జనవరి వరకు ఉంచారు. ఎకరానికి 5.5 క్వింటాళ్ల కందుల దిగుబడి కూడా వచ్చింది. అంటే, ఒక ఎకరంలో రెండు పంటలూ కలిపి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒకవేళ పత్తి పంట ఏ కారణంగానైనా దెబ్బతింటే.. కంది పంటయినా రైతును ఆదుకుంటుందని.. అందుకని పత్తితో పాటు కందిని కూడా వేసుకోవటం మేలని డా. ప్రవీణ్ కుమార్ రైతులకు సూచిస్తున్నారు. బెడ్స్‌పై కాకుండా మామూలుగా నల్లరేడగడి పొలంలో పత్తి మాత్రమే విత్తుకున్న రైతులు కూడా చాలా మంది ఐదారు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి తీయగలిగారన్నారు. అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించటం, గులాబీ పురుగు ఉధృతిని అదుపు చేయలేకపోవటం వల్ల దిగుబడి తగ్గిందన్నారు. తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా పత్తితోపాటు కందిని బెడ్స్‌పై విత్తుకుంటే వర్షం ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది ఉండదన్నారు. తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటానికి బెడ్స్ ఉపయోగపడతాయన్నారు. ఈ ఏడాది కూడా సాధారణం కన్నా అధికంగానే వర్షాలు పడతాయని భావిస్తున్న నేపథ్యంలో బెడ్స్ పద్ధతిని రైతులు అనుసరించడం మేలు. బెడ్స్ పద్ధతిలో సాగుపై ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం యూట్యూబ్ చానల్ ఓఠిజు అఛీజీ ్చb్చఛీ లో వీడియోలు ఉన్నాయి. ఆసక్తి గల రైతులు చూడవచ్చు. ఆ తర్వాత కూడా సందేహాలుంటే డా. ప్రవీణ్ కుమార్ (99896 23829)ను సంప్రదించవచ్చు. -
అంతర పంటలతో తామరపురుగు విజృంభనకు చెక్ పెట్టండిలా..!
అధిక వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణ పరిస్థితులు తామర పురుగు విజృంభించడానికి దోహదపడ్డాయి. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మిర్చి పంట కాలంలో ఎకరానికి 25–30 నుంచి బస్తాల రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఇప్పటికే 12–13 బస్తాల చొప్పున వాడి ఉంటారు. మార్చి వరకు దఫదఫాలుగా ఈ ఎరువులు వేస్తూ.. తరచూ పురుగుమందులు పిచికారీ చేస్తూ ఉంటారు. అధిక రసాయనాలతో మిర్చిని ఏకపంటగా సాగు చేయటం వల్లనే తామరపురుగు విజృంభించింది. విపరీతంగా రసాయనాలు గుప్పించి ఏటా మిరప సాగు చేసే భూముల్లో సేంద్రియ కర్బనం 0.3 – 0.4 మేరకు మాత్రమే మిగిలి ఉంటుంది. మొక్కలు రసాయనిక ఎరువుల వల్ల ఏపుగా పెరిగినా రోగనిరోధకశక్తి సన్నగిల్లిపోతున్నది. అందువల్లనే మిరప పంటకు ఇప్పుడు తామర పురుగులు ఆశిస్తున్నాయి. తామర పురుగులు ఆశించిన తోటల్లో పూత రాలుతున్నది. ఆకుల పైముడత వల్ల కొత్త పూత రావటం లేదు. అనేక రకాల రసాయనిక పురుగుమందులు కలిపి పిచికారీ చేయటం వల్ల సమస్య మరింత జటిలం అవుతున్నది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిరపను సాగు చేసే రైతులు చీడపీడల నుంచి చాలా వరకు రక్షణ పొందుతున్నారు. అంతర పంటలు వేయటం.. జిగురు పూసిన పసుపు, నీలిరంగు అట్టలు పెద్ద ఎత్తున పెట్టుకోవటం.. ఘనజీవామృతం, జీవామృతంతోపాటు కషాయాలు, ద్రావణాలు వాడటం ద్వారా చీడపీడలను ఎదుర్కొనే శక్తి పంటలకు చేకూరుతున్నది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్న రైతులు కూడా ఇప్పటికైనా వెంటనే మిరప తోటల్లో జిగురు అట్టలు పెట్టుకోవాలి. నీలిరంగు అట్టలు ఎకరానికి 5–10 పెట్టుకుంటే పురుగు తీవ్రత తెలుస్తుంది. ఇప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఎకరానికి 50 నుంచి 100 వరకు పెట్టుకుంటే పురుగును నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. మిరప మొక్కల మధ్య ఏదో ఒక అంతర పంట ఉండేలా చూడాలి. అక్కడక్కడా బంతి మొక్కలు నాటుకోవాలి. మిరప మొక్కల మధ్య కొత్తిమీర, ఉల్లి, ముల్లంగి వంటి అంతర పంటల విత్తనాలు విత్తుకుంటే కొద్ది రోజుల్లోనే మొలకెత్తి చీడపీడల నియంత్రణలో ప్రభావాన్ని చూపుతాయి. వీటితోపాటు.. మిరప పొలం చుట్టూతా 3 వరుసలు సజ్జ, మొక్కజొన్న, జొన్న విత్తుకుంటే చీడపీడల నుంచి రక్షణ కల్పిస్తాయి. 4 రోజుల వ్యవధిలో 4 పిచికారీలు ►మిరప పంటపై తామరపురుగులను అరికట్టడానికి వేప నూనె లేదా వేప గింజల కషాయం, అగ్ని అస్త్రం, నల్లేరు కషాయంలను ఒకదాని తర్వాత మరొకటి 4 రోజుల వ్యవధిలో 4 పిచికారీలు చేస్తే పంటను రక్షించుకోవచ్చు. ►1,000–1,500 పిపిఎం వేపనూనె పనిచేయదు. 10,000 పిపిఎం వేప నూనె మార్కెట్లో దొరికితే వాడుకోవచ్చు. అర లీటరు వేపనూనెను ఎమల్సిఫయర్ లేదా 100 గ్రాముల సబ్బు పొడిని 200 లీ. నీటితో కలిపి పిచికారీ చేయాలి. ►10,000 పిపిఎం వేప నూనె దొరక్కపోతే.. 5% వేపగింజల కషాయాన్ని వెంటనే పిచికారీ చేస్తే పంటను రక్షించుకోవచ్చు. వేప నూనెను లేదా 5% వేప గింజల కషాయాన్ని 4 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ►ఆ తర్వాత 4 రోజులకు అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి. 100 లీ. నీటికి 4 లీ. అగ్ని అస్త్రం పిచికారీ చేయాలి. ఆ తర్వాత 4 రోజులకు నల్లేరు కషాయం పిచికారీ చేయాలి. మళ్లీ ఇదే వరుసలో వీటిని పిచికారీ చేయటం ద్వారా మిరప పంటను తామరపురుగుల నుంచే కాదు ఇతర చీడ పీడల నుంచి కూడా రక్షించుకోవచ్చని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలు తెలియజెబుతున్నాయి. తామర పురుగు రానీయను గత సంవత్సరం ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప సాగు చేశాను. మంచి ధర వచ్చింది. ఈ ఏడాది 1.6 ఎకరాలలో మిర్చి విత్తనాలను వెద పద్ధతిలో ట్రాక్టర్ సీడ్ డ్రిల్‌తో వేసుకొని ఖర్చులు తగ్గించుకున్నా. 70 రోజుల పంట. పూత వస్తోంది. వేపగింజల కషాయం, నీమాస్త్రం రెండేసి సార్లు పిచికారీ చేశా. బొబ్బర రాకుండా గానుగ నుంచి తెచ్చిన వేప నూనె పిచికారీ చేశా. ఇప్పటికైతే తామరపురుగులు కనిపించలేదు. రోజూ పొలాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నా. తామరపురుగులను 90% రానీయను. – చింతా వరప్రసాద్ (91211 47705), కొప్పర్రు, పెదనందిపాడు మం., గుంటూరు జిల్లా జిగురు అట్టలు, కషాయాలతో ఉపయోగం 9 ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తున్నా. ఇందులో 2.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మిగతా పొలానికి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నా. పచ్చిమిర్చి – ఉల్లిపాయ కషాయం, వేపగింజల కషాయం పిచికారీ చేశాను. పసుపు జిగురు అట్టలు పెట్టాను. మిరప పువ్వుపై 10–15 తామరపురుగులు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 4–5కు తగ్గింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు మాత్రమే వాడిన పొలం కన్నా.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలం పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. జిగురు అట్టలు, వేపగింజల కషాయం బాగా ఉపయోగపడ్డాయి. – బైకా వెంకటేశ్వరరెడ్డి (96667 13343), మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట మం., గుంటూరు జిల్లా చదవండి: Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? -
అంతర పంటలతో ఆదాయం పొందండి
సాక్షి, అమరావతి: ఒకే పంటను పండించి నష్టపోతున్న రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారించేలా ఉద్యాన శాఖ వారికి అవగాహన కల్పిస్తోంది. నాలుగైదు ఏళ్ల తర్వాత దిగుబడి వచ్చే ప్రధాన పంటల మధ్యలో అంతర పంటల్ని సాగు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రధాన పంట కాపునకు వచ్చేంత వరకు అంతర పంటలు సాగు చేయవచ్చు. ఏక పంటగా ఏదో ఒక ఉద్యాన పంటను పండించడం కన్నా అంతర/బహుళ పంటల వంటి సమగ్ర పద్ధతుల్ని అవలంభించడం వల్ల ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందవచ్చు. వెలుతురు, నీరు, పోషకాల కోసం ప్రధాన పంటతో పోటీ పడని పంటను ఎంచుకోవాలి. పామాయిల్ తోటల్లో అంతర పంటలుగా కోకో, కూరగాయలు, పూల మొక్కలు, జొన్న, మొక్కజొన్న, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటి వాటిని సాగు చేసుకోవచ్చు. కొబ్బరి, పామాయిల్, మామిడి వంటి తోటల్లో మొక్కకు సరిపడే స్థలం వదలాలి. ప్రధానంగా పామాయిల్లో మొక్కల్ని త్రిభుజాకృతి పద్ధతిలో కన్నా చతురస్రాకృతి పద్ధతిన సాగు చేస్తే మంచిది. పామాయిల్లో అంతర పంటల వల్ల సగటున హెక్టార్‌కు ఏడాదికి రూ.30 నుంచి రూ.50 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చునని ఉద్యాన శాఖ ఉన్నతాధికారి పి.హనుమంతరావు వివరించారు. -
పత్తి.. సూటి రకాలే మేటి!
ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే ప్రధాన వాణిజ్య పంట పత్తి. గత ఐదారేళ్లుగా పత్తి పంటలో దిగుబడి తగ్గిపోతున్నది. తెగుళ్లు, గులాబీ రంగు పురుగు దాడి కారణంగా ఏటికేడు దిగుబడి పడిపోతోంది. బీటీ రకాలు తెల్లబోతున్నాయి. ఇక బీటీ మాయలో పడిన రైతులు పాత రకాలను సాగు చేయడమే మరచిపోయారు. సరైన విత్తనం ఎంపిక చేసుకొని మెలకువలు పాటిస్తే నాన్ బీటీ హైబ్రిడ్ రకాలు తీసిపోవని చాటుతోంది ‘రైతు రక్షణ వేదిక’. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ వేణుగోపాల్, రైతు శాస్త్రవేత్త జొన్నలగడ్డ రామారావు, రైతు నేత డాక్టర్ కొల్లా రాజమోహనరావు, రైతు సంఘాల నేతలు, కొందరు అభ్యుదయ రైతులు కలిసి గుంటూరు కేంద్రంగా రైతు రక్షణ వేదికను ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా సూటి రకాల ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహిస్తూ పాత రకాల ఆవశ్యకతను తెలియ జేస్తున్నారు. బిటీ పత్తికి ప్రత్యామ్నాయంగా సూటి రకాలను ప్రోత్సహిస్తున్నారు. ‘రైతు రక్షణ వేదిక నిర్వహిస్తున్న ప్రదర్శన క్షేత్రాలను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎన్. దామోదర నాయుడు ఇటీవల సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సూటి రకం విత్తనాలతో ఖర్చు తగ్గుతోందని, ఇతర పంటల రైతులతో పాటు పత్తి రైతులు కూడా తమ విత్తనాలను తామే తయారు చేసుకొనే విధంగా ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొనడం ఆహ్వానించదగిన పరిణామం. పత్తిలో సమగ్ర సస్య పోషణ, రక్షణల ద్వారా కాయతొలిచే పురుగులతో పాటు అత్యంత బెడదగా మారిన పచ్చదోమ, తెల్లదోమల బెడద కూడా లేకుండా పోయింది. రైతులు పండించిన పత్తిలో నుంచే సేకరించిన విత్తనాలతోనే ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తిని కూడా ఇతర పంటల మాదిరిగానే సాగు చేయటంలో గుంటూరుకు చెందిన రైతు రక్షణ వేదిక విజయం సాధించింది. అనేక ఏళ్ల నుంచి ఈ దిశగా కృషి చేస్తున్న వేదిక సభ్యులైన రైతులు, విశ్రాంత శాస్త్రవేత్తలు, రైతు సంఘాల కార్యకర్తలు ఈ ఖరీఫ్‌లో మరింత విస్తృతంగా నాన్ బీటీ సూటి రకం పత్తి సాగును చేపట్టడం విశేషం. సూటి రకం పత్తి విత్తనాలతో రైతుకు ఖర్చు తక్కువ, నాణ్యమైన దిగుబడి, వివిధ పురుగులను నిరోధించే అవకాశం ఉంది. 15 చోట్ల రైతుల ప్రదర్శనా క్షేత్రాలు 2018–19 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో 15 ప్రదేశాల్లో సూటి రకం నాన్ బీటీ పత్తి పంటను సాగు చేస్తూ నమూనా (ప్రదర్శనా) క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన విత్తనాలనే వినియోగించి సఫలీకృతులయ్యారు. రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దీంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ డా. దామోదర నాయుడు, లాం ఫాం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. ఎన్వీ నాయుడు, లాంఫాం శాస్త్రవేత్త డా. దుర్గాప్రసాద్ చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెంలోని తియ్యగూర శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిల ప్రదర్శనా క్షేత్రాలను స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులను అభినందించారు. సూటి రకం పత్తితో 30% తగ్గిన ఖర్చు రైతులు బీటీ విత్తనాలకు బదులుగా సూటి విత్తనాలు (నాన్ బీటీ) సాగు చేస్తే 30 శాతం ఖర్చు తగ్గుతుంది. ఆశించిన దిగుబడి లభిస్తుంది. రైతులు సూటీ పత్తిని సాగు చేయటంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతు రక్షణ వేదిక నేతలు తెలిపారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు, కొర్నెపాడు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, చిలకలూరిపేట, ఫిరంగిపురం, మంగళగిరి తదితర ప్రాంతాల్లోని 650 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రైతులు నంద్యాల నుంచి ఎన్‌డీఎల్‌హెచ్–1938, రైతు రక్షణ–02 నాన్‌బీటీ సూటి రకాల పత్తిని సాగు చేస్తున్నారు. లాంఫాం, కృషి విజ్ఞాన కేంద్రం, డాట్ సెంటర్లకు చెందిన శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండి సూచనలు సలహాలు అందిస్తారన్నారు. సూటి రకాల సేంద్రియ సాగు ఇలా.. దుక్కిలో పశువుల ఎరువుతో కలిపిన వామ్(జీవన ఎరువు) ఎకరానికి ఐదు కేజీలు వేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి వేప పిండి రెండు క్వింటాళ్ళు వేయాలి. నాన్ బీటీ సూటి రకం పత్తి విత్తనాలు విత్తుకోవాలి. నాన్‌బీటీ విత్తనాలు సాగులో ఉన్న పొలం చుట్టూ జొన్న, కొర్ర, ఆముదం మొక్కలు రెండు – మూడు సాళ్ళు(వరుసలు) రక్షక పంటగా వేయాలి. పత్తి మొక్క దశలో రెండు విడతలు వేపనూనె, మోనోక్రోటోఫాస్, మిథైల్ ఆల్కాహాల్ కలిపిన ద్రావణాన్ని కాండానికి కుంచెతో పూయాలి. వేప కషాయాన్ని మరగబెట్టగా వచ్చిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే జల్లెడ పురుగు, తెల్లదోమ గూడ పురుగులను అదుపులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు నివారణకు ఒక ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. సూటి పత్తిలో కొర్ర, అలసంద, మినుము తదితర అంతర పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. నీటి వసతి అందుబాటులో ఉన్న రైతులు నెలకు ఒక విడత చొప్పున ఆరుతడులు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా చేస్తే పత్తి దిగుబడులు హైబ్రిడ్ పత్తికి దీటుగానే వస్తాయని రైతు రక్షణ వేదిక రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఈ సూటి రకాల పత్తి పింజ పొడవు, నాణ్యత బాగానే ఉంటుంది. అధిక శాతం రైతులు ఈ పత్తిని సాగు చేస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వారు అంటున్నారు. దిగుబడుల్లో రాజీ పడకుండానే కంపెనీల విత్తనాలను పక్కన పెట్టి సొంత సూటి రకం పత్తి విత్తనం వాడుకునే సత్సాంప్రదాయానికి బాటలు వేస్తున్న రైతు రక్షణ వేదిక సభ్యులైన రైతులు అభినందనీయులు. వర్షం తక్కువైనా ఏపుగా పెరిగింది! నంద్యాల నుంచి తీసుకు వచ్చిన సాధారణ విత్తనాలతో 2.50 ఎకరాల్లో పత్తిని సాగు చేశాం. పత్తి పొలం చుట్టూ ఇతర పురుగులు రాకుండా జొన్న విత్తనాలు నాటాం. గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ తదితర క్రిమి కీటకాలు రాలేదు. వర్షం తక్కువగా పడినా పంట ఏపుగా పెరిగింది. ఆశించిన స్థాయిలో పూత ఉంది. బీటీ తరహాలోనే దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. శాస్త్రవేత్తలు పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. --తియ్యగూర వెంకటేశ్వరరెడ్డి (97044 97442), రైతు, మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట రూరల్ రసాయనాల్లేని సాగులో బీటీకి మించిన దిగుబడి రైతులు పండించిన పత్తి పంట ద్వారా వచ్చిన విత్తనాలనే వినియోగించి ప్రయోగాత్మకంగా పరిశీలించాం. పంట ఆశాజనకంగా ఉంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించలేదు. అయినా, పంట ఎదుగుదల ఆశాజనకంగానే ఉంది. బీటీకి మించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా క్షేత్రోత్సవాలను నిర్వహించి ప్రచారం కల్పిస్తాం. ఈ పద్ధతిలో సాగు చేసే రైతులకు చేయూతనందిస్తాం. – డాక్టర్ కొల్లా రాజమోహనరావు (90006 57799), సమన్వయకర్త, రైతు రక్షణ వేదిక, గుంటూరు సూటి రకాలు గులాబీ పురుగునూ తట్టుకున్నాయి! పక్కపక్కన పొలాల్లో సాగు చేసిన సూటి రకం, బీటీ రకం పత్తి పంటల్లో స్పష్టమైన తేడాను గమనించవచ్చు. రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో కంపెనీ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలకు ప్రత్యామ్నాయంగా సూటి రకం నాన్ బీటీ విత్తనాలను రైతులకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నంద్యాల–1938 రకం, రైతు రక్షణ–02 అనే నాన్ బీటీ సూటి రకాల విత్తనాలు రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగుల బెడదను తట్టుకున్నాయి. దీంతో పాటు రైతు రక్షణ వేదిక ద్వారా తయారైన హైబ్రిడ్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. రైతు రక్షణ వేదిక ద్వారా తయారుచేసే హైబ్రిడ్ ప్రత్యామ్నాయ రకం వెరైటీని ప్రోత్సహిస్తే రైతుకు స్వావలంబన కలుగుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల వ్యవసాయ ఖర్చులు ఎక్కువై నష్టం జరుగతోంది. జీవన ఎరువులు, పశువుల ఎరువును వాడుకుంటే రసాయన ఎరువులను ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. – ప్రొఫెసర్ వేణుగోపాల రావు (94900 98905), విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు రక్షణ వేదిక మానుకొండవారిపాలెంలో పూత దశకు చేరుకున్న సూటిరకం పత్తి పొలం – ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు ఫొటోలు : లీలానంద్, చిలకలూరిపేట రూరల్ -
అంతర పంటలతో అదనపు ఆదాయం
అనంతపురం అగ్రికల్చర్ : ఏకపంట విధానానికి స్వస్తి పలికి ప్రధాన పంటలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. ఖరీఫ్ ఆరంభం కావడంతో వర్షాలు కూడా కురుస్తుండటంతో రైతులు పంటల సాగుకు సమాయత్తం కావాలని సూచించారు. అంతర పంటల ప్రాధాన్యత జిల్లాలో ప్రధానంగా వేరుశనగ అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే చాలా మంది రైతులు కేవలం వేరుశనగ మాత్రమే వేస్తున్నందున నష్టపోతున్నారు. అందులో అంతర పంటలు వేసుకోవడం వల్ల తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. వీటి వల్ల పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లు కూడా తగ్గుతాయి. 7:1 లేదా 11:1 లేదా 15:1 నిష్పత్తిలో వేరుశనగలో అంతర పంటగా కంది వేసుకోవడం బాగుంటుంది. బెట్ట ఏర్పడినా వేరుశనగ దెబ్బతిన్నా కంది పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏకపంటగా కంది పంట వేసుకోవడం జరుగుతోంది. కంది సాళ్ల మధ్య 1:4 లేదా 1:7 నిష్పత్తిలో పెసర, కొర్ర పంటలు వేసుకోవచ్చు. పెసర పంట 70 రోజుల్లో చేతికి వస్తుంది. తర్వాత కంది సాళ్ల మధ్య ఉలవ కూడా వేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు. ఎర్రనేలలు 1:4 నిష్పత్తిలో కంది+కొర్ర సాగుకు అనుకూలం. నల్లరేగడి భూముల్లో చాలా మంది కేవలం పప్పుశనగ మాత్రమే వేస్తున్నారు. పప్పుశనగ పంట వేసే ముందు కొర్ర వేసుకోవచ్చు. ఆముదం+ప్రత్తి వేసే రైతులు అంతర పంటగా కంది 4:1 లేదా 7:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. నవధాన్యపు పంటలు వేసుకోవడం మరచిపోకూడదు. వేరుశనగ ప్రధాన పొలం చుట్టూ జొన్న, సజ్జ లాంటి పంటలు నాలుగైదు వరుసలు వేసుకోవడం వల్ల అదనపు ఆదాయంతో పాటు చీడపీడలు, పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. బీటీ ప్రత్తి పంట వేసే రైతులు పొలం చుట్టూ నాన్‌బీటీ విత్తనాలు వేసుకోవాలి. దీని వల్ల ప్రమాదకరమైన గులాబీరంగు కాయతొలచు పురుగు ఉనికి, ఉధృతిని నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఆముదం, కందికి అనుకూలం దుక్కులు చేసుకుని సిద్ధంగా ఉన్న రైతులు ఈ వర్షాలకు కంది, ఆముదం పంటలు విత్తుకోవచ్చు. నీటి వసతి కింద అయితే వేరుశనగ పంట సాగు చేయవచ్చు. వర్షాధారంగా అయితే వేరుశనగ పంట సాగుకు జూలై మంచి సమయం. విత్తే ముందు సిఫారసు చేసిన విధంగా విత్తనశుద్ధి పాటించాలి. విత్తుకున్న 24 లేదా 48 గంటల్లోగా సిఫారసు చేసిన విధంగా కలుపు నివారణ మందులు పిచికారీ చేసుకుంటే 30 రోజుల పాటు పంటకు కలుపు సమస్య ఉండదు.